30 June 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Ambati Rambabu Press Meet 6th July 2013

Written By news on Saturday, July 6, 2013 | 7/06/2013

జగన్ కోసం ఎవరినైనా బలిచేస్తారు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పలు కేసులలో ఇరికించడం కోసం కోసం కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా బలిచేయడానికి సిద్ధంగా ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. జగన్ కేసులో మోపిదేవి వెంకటరమణ సోదరుడు చేసిన వ్యాఖ్యలను ముందే ఊహించామని చెప్పారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ వ్యాఖ్యలను బట్టి కుట్ర స్థాయి అర్ధమవుతోందన్నారు. మోపిదేవి అరెస్టుకు ముందే పెద్ద డ్రామా నడిచిందని పేర్కొన్నారు. మోపిదేవి చేసిన పాపమేంటి, మాజీ మంత్రిఉలు ధర్మాన ప్రసాదరావు, సబిత చేసిన పుణ్యమేంటి? అని ఆయన ప్రశ్నించారు. మంత్రులుగా ఉన్నప్పుడు సాక్ష్యాలు తారుమారు చేయని వ్యక్తులు ఇప్పుడెలా చేస్తారు? అని అడిగారు. 

సీబీఐ వ్యవహరిస్తున్న తీరును జాతీయ ఛానల్ బట్ట బయలు చేసిందన్నారు. వైఎస్ మరణానంతరం రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ సీపీదే విజయం అన్నారు. 

Sharmilas speech in RK beach, Visakha dist

Y S Vijayamma says in NTV interview YSRCP will be in the reckoning in the two states if AP is divide

దర్యాప్తు మొదలుపెట్టక ముందే సీబీఐ చెప్పింది

 తమ చార్జిషీట్లలో ఏ-1గా జగన్, ఏ-2గా సాయిరెడ్డి ఉంటారని దర్యాప్తు మొదలుపెట్టక ముందే సీబీఐ చెప్పింది: షర్మిల
- కేంద్రం చూపించిన వారిపై మొరగడమే సీబీఐ పని
- ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదని న్యాయశాస్త్రం చెప్తోంది
- ఒక పౌరుడిగా జగన్‌మోహన్‌రెడ్డికి హక్కులు లేవా?
- 90 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాలని చట్టం చెప్తుంటే.. ఆయనకు అది ఎందుకు వర్తించడం లేదు?
- కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, టీడీపీల పాపం పండే రోజు దగ్గర్లోనే ఉంది

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘న్యాయస్థానాలు న్యాయం చేయాలి. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికీ శిక్ష పడటానికి వీలు లేదని న్యాయశాస్త్రం చెప్తోంది. మరి ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది న్యాయమా? ఇది ప్రజాస్వామ్యమా? ఒక పౌరుడిగా జగన్‌మోహన్‌రెడ్డికి హక్కులు లేవా? 90 రోజుల రిమాండ్ తరువాత బెయిల్ ఇవ్వాలని చట్టం చెప్తుంటే.. జగన్‌మోహన్‌రెడ్డికి మటుకు అది ఎందుకు వర్తించడం లేదు? ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న ఈ భారతదేశంలో న్యాయానికి, ధర్మానికి, ప్రజాభిప్రాయానికి విలువ లేదా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. తాము వేయబోయే చార్జిషీట్లలో ఏ-1, ఏ-2లుగా ఎవరుంటారో దర్యాప్తు మొదలుపెట్టక ముందే సీబీఐ ప్రకటించిందని, కేసును ఎలా నడపదలచుకుందో ఆ రోజే స్పష్టమైందని విమర్శించారు.

‘‘కారు చీకట్లో ఉన్నా జగనన్న కాంతి కిరణమే. జైల్లో ఉన్నా ఆయన తిరుగులేని జన నేతే. కుమ్మక్కు రాజకీయాలతో కుట్రలు పన్నుతున్న వీళ్ల పాపం పండి, పాపాల పుట్ట పగిలి అందులోంచి వచ్చిన విష సర్పాలను ప్రజలు ఓటు అనే ఆయుధంతో వేటాడే రోజు కూడా దగ్గరలోనే ఉంది’’ అని ఉద్ఘాటించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, ప్రజాస్వామ్య విరుద్ధంగా దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం 200 రోజులు పూర్తిచేసుకుంది. ఇప్పటివరకు యాత్రలో 100 నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ సముద్ర తీరాన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు జన సంద్రం పోటెత్తింది. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగిందా: జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితం. జగనన్నపై కేసు పెట్టింది కూడా శంకర్రావు అనే కాంగ్రెస్ నాయకుడు. ఆయనతో చంద్రబాబు నాయుడి మనిషి కూడా కలిసి వెళ్లి ఈ కేసు పెట్టారు. వైఎస్సార్ హయాంలో పరిశ్రమలకు కొన్ని భూములు పొందినవారు.. అందుకు ప్రతిఫలంగా జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడి పెట్టారని కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు. కానీ దుర్మార్గం ఏమిటంటే ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగిందా? లేదా? అనే విషయాన్ని సీబీఐ పూర్తిగా పక్కనబెట్టి జగన్‌మోహన్‌రెడ్డి మీద, ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారి ఇళ్ల మీద దాడులు చేసింది. అరెస్టుల మీద అరెస్టులు చేసింది. 

చార్జిషీట్ల మీద చార్జిషీట్లు వేసింది. సీబీఐ విచారణ అనే దిక్కుమాలిన కథలో ఇంకో విచిత్రం ఏమిటంటే.. దర్యాప్తు ఇంకా మొదలు కాకముందే సీబీఐ అధికారి ఒక ప్రకటన చే శారు. సీబీఐ దాఖలు చేయబోయే అన్ని చార్జిషీట్లలో జగన్‌మోహన్‌రెడ్డి ఏ-1గా ఉంటారని, విజయసాయిరెడ్డి ఏ-2గా ఉంటారని ముందే ప్రకటించారు. అంటే దర్యాప్తు ఇంకా ప్రారంభం కాకముందే, దర్యాప్తుతో సంబంధం లేకుండానే ఏ-1గా ఎవరుండాలి? ఏ-2గా ఎవరుండాలి అని సీబీఐ ముందే నిర్ణయించిందీ అంటే.. ఇక సీబీఐ ఈ కేసును ఎలా నడపదలుచుకుందో ఆ రోజే తేలిపోయింది.

కేంద్రం చెప్పినట్లే సీబీఐ ఆడుతుంది: సీబీఐ అనే వ్యవస్థ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని, అది కేంద్రం కోసమే పని చేస్తోందని, వాళ్లు ఎలా ఆడమంటే అలా ఆడుతుందనే విషయం ఇప్పటికే బొగ్గు కుంభకోణంతో సహా పలు సార్లు రుజువైంది. సీబీఐ అనే సంస్థ కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుక అని, కేం ద్రం పెరట్లో కుక్క అని, ఆ నాయకులు ఎవరి మీద మొరగమంటే వారి మీద మొరుగుతుందని, మొరగటం ఆపేసి కూర్చోమంటే వెనక్కి వస్తుందని కరుణానిధి కుమారుడు స్టాలిన్ కేసుతోపాటు ఇప్పటికే పలుమార్లు మన దేశంలో రుజువైన నిజం. సీబీఐ అనేది ఈ రోజు దర్యాప్తు సంస్థ ఏమాత్రం కాదు. అది ఒక బ్లాక్ మెయిల్ సంస్థ.

చంద్రబాబుకి చెప్పుకునేంత చరిత్ర లేదు..
రాజకీయ నాయకుడు అన్న వాడు ప్రజల గురించి ఆలోచన చేయాలి. చేతనైనంత మేరకు ప్రజలకు సహాయపడాలి. ప్రజలకు ఏదైనా కీడు జరుగుతుంటే వాళ్లకు అండగా నిలబడి పోరాటం చేయాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ కాలర్ పట్టుకొని నిలదీయాల్సింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా.. ‘నేను ఇంత మందికి మంచి చేశాను. ఫలానా గొప్ప పథకం పెట్టడం వల్లఇంత మంది ప్రజలకు మేలు చేశాను’ అని చెప్పుకునే పరిస్థితిలో ఆయన లేరు. ‘తొమ్మిదేళ్ల ప్రతిపక్ష నాయకునిగా ఫలాన ఉద్యమం చేశాను, ఫలానా సందర్భంలో ప్రజల పక్షాన పోరాటం చేశాను.. ఇది సాధించాను. రైతుల కోసం ఫలానా విధంగా ప్రభుత్వం మెడ వంచాను’ అని కూడా చెప్పుకునే పరిస్థితిలో ఆయన లేరు. ఎందుకంటే చంద్రబాబుకి చెప్పుకునేంత చరిత్రే లేదు.’’

ఆర్కే బీచ్‌కు పోటెత్తిన జన సంద్రం: ‘మరో ప్రజాప్రస్థానం’ 200వ రోజు శుక్రవారం షర్మిల విశాఖపట్నం జిల్లా దక్షిణ నియోజకవర్గంలోని తాటిచెట్లపాలెం నుంచి యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి అక్కయ్యపాలెం, గురుద్వార జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, డాబాగార్డెన్స్, జగదాంబ జంక్షన్ మీదుగా ఆర్కే బీచ్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం.. సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.00 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం ఆమె మొత్తం 12 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,664.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది.

షర్మిల వెంట నడిచిన వారిలో జిల్లా పార్టీ కన్వీనర్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, విశాఖ నగర కన్వీనర్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ యాదవ్, ఎమ్మెల్యే కృష్ణదాసు, తాజా మాజీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, పెన్మత్స సాంబశివరాజు, బలిరెడ్డి సత్యారావు, నేతలు అంబటి రాంబాబు, గోనె ప్రకాశ్‌రావు, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జి, చెంగల వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, పూడి మంగపతిరావు, కుంభా రవిబాబు, పిన్నింటి వరలక్ష్మి, వివిధ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు పెట్ల ఉమాశంకర్ గణేష్, తిప్పల నాగిరెడ్డి, కిడారి సర్వేశ్వర్‌రావు, కోల గురువులు, ప్రగడ నాగేశ్వరరావు, కోరాడ రాజబాబు, బూడి ముత్యాల నాయుడు, బొడ్డేటి ప్రసాద్, వంజంగి కాంతమ్మ, పాడేరు సత్యవాణి, జీవీ రవిరాజు, స్థానిక నాయకులు దాడి రత్నాకర్, కొత్తపల్లి గీత, కొయ్య ప్రసాదరెడ్డి, పీలా ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రలో షర్మిల వెన్నంటే ఉన్న వారిలో తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, ఆర్కే, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, వైఎస్ రాయల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

8 నుంచి విజయనగరం జిల్లాలో యాత్ర: పెనుమత్స
విజయనగరం, న్యూస్‌లైన్: షర్మిల పాదయాత్ర ఈ నెల 8 నుంచి విజయనగరం జిల్లాలో నిర్వహించనున్నట్టు వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు తెలిపారు. శుక్రవారం విజయనగరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 8 నుంచి దాదాపు 12 రోజుల పాటూ జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో పాదయాత్ర జరుగు తుందన్నారు. 

ఒక్కడిపై వెయ్యి కుట్రలు!
‘‘జగన్‌మోహన్‌రెడ్డిని ఒక్కడిని చేసి 100 మంది కలిసి వెయ్యి కుట్రలు పన్ని వ్యవస్థలను వాడుకొని ఆయనను తొక్కేయాలనుకుంటున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేస్తున్నా జగన్‌మోహన్‌రెడ్డి గుండె నిబ్బరం ఏమాత్రం చెక్కు చెదరలేదు. జైల్లో పెట్టినా ప్రజల గురించే ఆలోచన చేస్తున్నారు. ప్రజా సమస్యల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందించాలి, ప్రజల పక్షాన నిలబడి ఎలా పోరాడాలి అని పార్టీ నేతలకు నిర్దేశిస్తూనే ఉన్నారు. అది జగన్‌మోహన్‌రెడ్డి గుండె ధైర్యం. బోనులో ఉన్నా సింహం సింహమే.’’

ప్రజా సమస్యలపై ఎంత మంది మాట్లాడారు?
‘‘మూడున్నరేళ్లుగా ఎంత మంది కాంగ్రెస్ నాయకులు, ఎంత మంది టీడీపీ నాయకులు ప్రజల సమస్యల గురించి మాట్లాడారు? ఎంత మంది టీడీపీ, కాంగ్రెస్ నేతలు మా కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడారు? మూడున్నర ఏళ్లుగా వీళ్ల ఏకైక లక్ష్యం వైఎస్సే. వీళ్ల అజెండా జగనే. కనుకనే ఈ ఆరోపణలు.. కనుకనే ఈ కుట్రలు... కనుకనే ఈ అరెస్టులు. ఈ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ నాయకుల్లో ఏ మాత్రం నిజాయితీ ఉన్నా, ఆరోపణల్లో ఏ మాత్రం నిజం ఉన్నా, వాటిని వైఎస్సార్ బతికున్నప్పుడే చేసి ఉండేవారు.’’

‘మిత్రద్వయం’ కలలు కల్లలే!

ప్పటిదాకా టీడీపీ రాష్ట్రంలో బహిరంగంగా పొత్తు పెట్టుకోనిది ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే! ఈసారి చంద్రబాబు ఏం చేసినా చేయవచ్చు. పొత్తులు పెట్టుకుని కూడా ఓడిపోయిన టీడీపీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి రంగంలో నిలువగలదా? అయినా టీడీపీతో పొత్తు పెట్టుకుని రాజకీయ ఆత్మహత్య చేసుకునేందుకు ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు, ఉండదు!

మన రాష్ట్రంలో అటు కాంగ్రెస్, ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కొంత కాలంగా తమ రాజకీయ భవితవ్యంపై ఆందోళన చెందు తున్నాయి. 2014 ఎన్నికలలో కూడా తమదే గెలుపని కాంగ్రెస్ పైకి చెబుతున్నప్పటికీ అందుకు ఆనవాళ్లు కనిపించడం లేదు. ఇక కేంద్రంలో 2014లో చక్రం తిప్పేది తామేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెబుతు న్నప్పటికీ, వాస్తవానికి ఆ చక్రంలో ఆకులు ఎన్నడో రాలి పోయాయి. 2014 ఎన్నికలు ముందే వస్తాయేమోననే భయంతో ఆ పార్టీలకు కంటి మీద కునుకు ఉండటం లేదు.

వైఎస్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ వెల్లువెత్తడమే ఇందుకు గల ప్రధాన కారణం. ఎన్నికలు ఎంత ఆలస్యమైతే అంత మం చిదని, అప్పుడు వైఎస్‌పై ప్రజలకు ఉన్న ఆరాధనా భావం పూర్తిగా ఆవిరికాకున్నా కొంతైనా తగ్గుతుందని ఆ రెండు పార్టీల దింపుడు కల్లం ఆశ! తెలంగాణలో తమ ప్రాబల్యం క్రమంగా దిగజారిపోయిన ఫలితంగా టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీలదే అక్కడ పైచేయి అవుతుందని ఆ రెండు పార్టీలు భయపడుతున్నాయి.

సామాన్య ప్రజానీకం ‘మేధోమథనాలు’ చేయలేరు. వారు హృదయంతో స్పందిస్తారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు మేలు చేశాయన్నది వారి భావనే కాదు స్వీయానుభవం కూడా! అంతకుముందు అధికారంలో ఉన్న టీడీపీ గ్రామీణ ప్రజలను మరచిపో యింది. ఆ పార్టీ ఘనంగా ప్రచారం చేసుకున్న ‘హైటెక్’ హంగులు ప్రజల చెంతకు చేరుకోలేదు. 

టీడీపీ అంటే కలవారి, పారిశ్రామికవేత్తల పార్టీ అని, తమ పార్టీ కాదని, అర్థమై ప్రజలు ఆ పార్టీకి దూరమయ్యారు. చంద్రబాబు ను ఎన్నికల బరిలో మట్టికరిపించి అధికారం చేపట్టిన వైఎస్ పాలన వారికి ఎంతో ఊరటనిచ్చింది. వైఎస్ హఠా న్మరణం చెందినప్పుడు వారు తమ ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయినట్లు కృంగిపోయారంటే అందుకు అదే కార ణం. వైఎస్ లేని లోటును పూడ్చడంలో అటు పిదప వచ్చిన ముఖ్యమంత్రులు విఫలమయ్యారు. దీనికి తోడు ‘హిరణ్యకశ్యప’ భక్తితో టీడీపీ నిరంతరం వైఎస్ వ్యతిరేక ప్రచారం చేయడం ప్రజలు వైఎస్‌ను సదా గుర్తుంచు కునే లా చేస్తున్నది. అటు కాంగ్రెస్ నేతలు, వైఎస్ మా వాడేనం టూ కొందరు, వైఎస్ దోషి అంటూ మరికొందరు, ఏదో విధంగా వైఎస్ నామం అనునిత్యం జపిస్తూనే ఉన్నారు. మరోవంక జగన్‌మోహన్‌రెడ్డిని జైలుపాలు చేశామని ‘మిత్రద్వయం’ సంతోషిద్దామనుకుంటే, జగన్ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలి హోదాలో వైఎస్ సతీమణి శ్రీమతి విజయలక్ష్మి భర్తీ చేశారు. 

ఆమెతో పాటు ఇతర సీనియర్ నేతలు, యువనాయకులు పార్టీ కార్యకలాపా లను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల కిరణ్ సర్కార్ ప్రవేశపెట్టిన ‘అమ్మ హస్తం’ వంటి బూటకపు పథకాలను ఎండగడుతూ అనితరసాధ్యంగా పాదయాత్ర చేస్తున్నారు. పాదయా త్రకు వస్తున్న అపూర్వ స్పందన ప్రజల హృదయాలలో వైఎస్‌కు ఉన్న సుస్థిర స్థానానికి అద్దం పడుతున్నది. జగన్‌మోహన్‌రెడ్డి జీవనసహచరి శ్రీమతి భారతి ‘సాక్షి’ మీడియా వ్యవహారాలు పర్యవేక్షిస్తూ కీలక భూమిక పోషిస్తున్నారు.

‘జగన్’ను అక్రమంగా నిర్బంధించడమేగాక వీలైనం త ఎక్కువ కాలం ఆయనను జైలులోనే ఉంచాలనే ప్రయ త్నాన్ని రాజకీయకక్షతో ‘మిత్రపక్షాలు’ చేస్తున్నాయని ప్రజలు నమ్ముతున్నారు. వైఎస్ సంక్షేమ పథకాలతో పేదరికం మాసిపోదుకదా! కుడుము ఇవ్వగానే పండగ కాదు కదా! అని మేధావులు వ్యాఖ్యానించవచ్చు. కానీ కడు పేదరికంలో మగ్గుతున్న వారికి ఆ కుడుము కూడా పండగే అవుతుంది! అందుకే వైఎస్‌పై ప్రజలలో నెలకొని ఉన్న కృతజ్ఞతాభావనను చెరిపివేయడం కాంగ్రెస్, టీడీపీలకు అంత సులువు కాదు.

కాంగ్రెస్, టీడీపీలు బహిరంగంగా పరస్పరం ఎంత ఘాటుగా విమర్శించుకున్నప్పటికీ, అది లాలూచీ కుస్తీ అని తెలుసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు! కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై వెస్సార్‌సీసీ, టీఆర్‌ఎస్ పార్టీలు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్పుడు, ప్రభుత్వాన్ని కాపాడేందుకు టీడీపీ ఓటింగ్‌లో పాల్గొనకపోవడాన్ని ప్రజలు గమనించారు. టీడీపీ ఓటిం గ్‌లో పాల్గొనకపోవడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం బతికి బట్ట కట్టిందని ప్రజలే కాదు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు సైతం అభిప్రాయపడ్డారు. 

అలాగే చంద్ర బాబుపై ఉన్న అవినీతి ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉదాసీనంగా వ్యవహరించడమూ జనం గమనిస్తూనే ఉన్నారు. అందుకే వారిని ‘తోడుదొంగలు’గా భావించి రాబోయే ఎన్నికలలో ఆ రెండు పార్టీలను ప్రతిపక్షస్థానానికి పరిమితం చేయబోతున్నారు. ఒకవేళ రాష్ట్రం విడివడి సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రా లు ఏర్పడితే అప్పుడు కూడా రెండు రాష్ట్రాలలోనూ నేటి ప్రధానప్రతిపక్షం బలహీనంగానే ఉంటుంది. తెలంగాణ లో టీఆర్‌ఎస్ బలహీనపడినా టీడీపీ బలపడేందుకు అది దోహదపడదు. పరకాల ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇచ్చింది వైఎస్సార్‌సీపీయే తప్ప టీడీపీ కాదన్నది తెలిసిందే. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి, కాంగ్రెస్‌పార్టీ, టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకుంటేనో, లేదా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటేనో బలం పుంజుకునే అవకాశం ఉం టుంది. 

అలా కాకుండా రాష్ట్రం విడిపోకుండా ఉంటే సీమాంధ్రలో అదనంగా ఆ రెండు పార్టీలకు ఒరిగేదేమీ ఉండదు. ఇక సీమాంధ్రలో కాంగ్రెస్, టీడీపీల కంటే వైఎస్సార్‌సీపీ ముందుంటుందని సర్వేలు తెలుపుతు న్నాయి. వైఎస్సార్‌సీపీని ఓడించాలంటే గత ఉపఎన్నిక లలో మాదిరి, లేదా సహకార సంఘ ఎన్నికలలో మాదిరి బాహాటంగానో, లోపాయికారీగానో, మిత్రద్వయ పార్టీలు కుమ్మక్కు కావాలి! కానీ సాధారణ ఎన్నికలలో గుట్టుగా చేతులు కలపడం సాధ్యపడదు. బాహాటంగా కుమ్మ క్కయితే మొదటికే మోసం వస్తుంది!

అయితే చంద్రబాబు రాజకీయ చాణక్యాన్ని తక్కువ అంచనా వేయజాలం. రాబోయే ఎన్నికలలో నూతన రాజ కీయ సమీకరణలకు ఆస్కారం ఉంది. చంద్రబాబు అవకాశ వాద రాజకీయ ఎత్తుగడలతో ఎన్ని పార్టీలతో కలిశారో, విడిపోయారో అందరికీ తెలిసిందే! బీజేపీ, వామపక్షాలు, టీఆర్‌ఎస్‌లతో అవసరాన్ని బట్టి టీడీపీ పొత్తులు పెట్టు కుంది. అందువల్ల ఆ పార్టీలకు టీడీపీపై విశ్వాసం నశించింది. 

వచ్చే ఎన్నికలలో టీడీపీ తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తు న్నారు. ఇప్పటిదాకా టీడీపీ రాష్ట్రంలో బహిరంగంగా పొత్తు పెట్టుకోనిది ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే! ఈసారి చంద్రబాబు ఏం చేసినా చేయవచ్చు. పొత్తులు పెట్టుకుని కూడా ఓడిపోయిన టీడీపీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి రంగంలో నిలువగలదా? అయినా టీడీపీతో పొత్తు పెట్టుకుని రాజకీయ ఆత్మహత్య చేసుకునేందుకు ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు, ఉండదు!

పైగా ఇటీవల ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికుల ముందే ప్రైవేట్ బస్ ఆపరేటర్ల లాగా మా విమానం ఎక్కమంటే మా విమానం ఎక్కమంటూ చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ తమ్ముళ్లు, కాంగ్రెస్ నేతలు కాట్లాడుకోవడం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బజారునపడేశాయి! చంద్రబాబు ఆ ఘటన జరిగి ఉండా ల్సింది కాదనీ, దానికి తాను బేషరతుగా ప్రజలకు క్షమా పణ చెబుతున్నాననీ బహిరంగ ప్రకటన చేశారు కూడా! దురదృష్టం ఏమిటంటే ఆ ప్రకటన ప్రజలలో చంద్రబాబు ప్రతిష్టను పెంచకపోగా మరింతగా దిగజార్చింది. నరేంద్ర మోడీ గుజరాత్ యాత్రికుల కోసం చేసిన కృషిని చంద్ర బాబు ప్రశంసించారు. నిజానికి మోడీ చేసింది తక్కువ, ప్రచారం ఎక్కువ అని తేలింది. అయినా ఆపదలో ఉన్న ప్రజలంతా భారతీయులే అనే స్పృహ లేకుండా ఆంధ్రా, గుజరాతీ అంటూ మోడీ సంకుచితంగా వ్యవహరించడం హర్షణీయమేనా? ఏమైనా ‘మిత్రద్వయం’ నిజరూపాన్ని డెహ్రాడూన్ ఘటన, వ్యాఖ్యానాలు అక్కరలేకుండా నిరూపించింది.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=65160&Categoryid=1&subcatid=18

ప్రజాదరణ పెరుగుతుందే తప్ప తరగదు...

పెద్దాయన... పెద్దాయన... ఇది స్వార్థపు లోకం పెద్దాయన! ఇది నిజం.. ప్రజలందరికి తెలిసిన సత్యం. వైయస్ బతికి ఉండగా జేజేలు కొట్టారు. వైయస్ అడుగులో అడుగు వేశారు, స్వరంలో స్వరం కలిపారు.. వైయస్ జిందాబాద్, వైఎస్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ సభలు, సమావేశాల్లో నినాదాలు చేసిన వారు మహానేత లేడు, ఇక తిరిగి రాలేడు అని తెలిసి తమ స్వార్థ ప్రయోజనాల కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమ పదవులు కాపాడుకోవడానికి స్వరం మార్చారు. రోజుకో మాట, పూటకో అబద్ధం మాట్లాడుతున్నారు.

ఇలాంటి రాజకీయ నాయకులకు రానున్న రోజుల్లో పుట్టగతులు ఉండవు. వారికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరపడ్డాయి. వారికి నీతి, నిజాయితీ ఉంటే గుండెల మీద చేయి పెట్టుకుని చెప్పమనండి. డా.వైయస్. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మా పథకాలు అని చెప్పుకోవడానికి యుపిఏ ప్రభుత్వానికి, ఢిల్లీ పెద్దలకు సిగ్గులేదా? పథకాలు యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెడితే భారతదేశంలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఎందుకు లేవు? వైయస్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం పేద, మధ్య తరగతి వారికోసమే. ఈ పథకాల వల్ల ఎందరో లబ్ధిపొందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు 108 అంబులెన్స్ వలన ఎంతోమంది ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ఇప్పుడు కొన్ని పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. మరికొన్ని జనాకర్షణ పథకాలకు తూట్లు పొడుస్తున్నారు. సీబీఐ సంస్థకు దమ్మూ ధైర్యం ఉంటే ముందు సోనియాగాంధీపై విచారణ చేయండి. యూపీఏ పెద్దలపై విచారణ చేయాలి.

యూపీఏ ప్రభుత్వం అవినీతి మయంలో కూరుకుపోయింది అని ఢిల్లీలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. సోనియాగాంధీ అల్లుడి అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయట పెట్టినా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇది చూస్తేనే చెప్పవచ్చు - ఇది స్వార్థపు లోకమని! ఆరోపిస్తే విచారణ చేస్తారు. ఆధారాలు లేకపోయినా జైలులో పెడతారు. అన్ని ఆధారాలతో బట్టబయలైనా సోనియాగాంధీ అల్లుడిని ఎందుకు జైల్లో పెట్టలేదు? సోనియాకో న్యాయం, వైయస్ కుటుంబానికి మరో న్యాయం. ఇదెక్కడి నీతిమాలిన రాజకీయం? వైయస్ కుటుంబ సభ్యులపై కక్ష కట్టారు. అందుకోసమే జగన్‌ను విచారణ పేరుతో జైల్లో పెట్టారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోవడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్‌ను ఎంతకాలం జైలులో పెట్టినా ప్రజాదరణ పెరుగుతుందే తప్ప తరగదు. రాబోయే కాలానికి కాబోయే సీఎం జగన్మోహన్‌రెడ్డి మాత్రమే!

- నందు, గోదావరిఖని, కరీంనగర్ జిల్లా.

ప్రజాకోర్టులో జగన్‌కు తప్పకుండా న్యాయం జరుగుతుంది

ధర్మయుద్ధం అంటే యుద్ధం చేసే వ్యక్తులు ఆయుధాలు కలిగి ఉండి యుద్ధం చేయాలి కానీ జగన్ విషయంలో కుట్రలతో కూడిన యుద్ధం జరుగుతోంది. జగన్ మీద ఇప్పుడు ఏ ఆరోపణల మీద అయితే సీబీఐ విచారణ జరుపుతోందో అవే ఆరోపణలు 2009కి ముందు కూడా టీడీపీ చేసింది. కానీ అప్పుడు జగన్ మీద ఎలాంటి విచారణ జరగలేదు. నిజంగా జగన్ మీద కోర్టులో కేసు ఆరోజే (2009కి ముందు వైయస్సార్ బతికున్నప్పుడు) వేసి ఉంటే ఇప్పడు ఈ కేసు వేసిన వ్యక్తుల మీద కొంచెమైనా గౌరవం ఉండేది కానీ అలా జరగలేదు. వైయస్సార్ చనిపోయిన తర్వాత, జగన్ కాంగ్రెస్‌ని వీడిన తర్వాత జగన్‌కి ప్రజల ఆదరణ పెరుగుతోంది అని తెలిసి, కుట్రలతో ప్రత్యర్థులు (కాంగ్రెస్+టీడీపీ) అయినా కూడా జగన్ మీద కలిసి కేసులు వేశారు.

నిజంగా వైయస్సార్ బతికున్నప్పుడు ఈ కేసులు వేసి ఉంటే అప్పుడు యుద్ధం ధర్మంగా జరిగేది. ఈ కేసులు పెట్టిన వ్యక్తుల మీద ప్రజలలో కూడా ఒక నమ్మకం ఉండేది. జగన్‌ని ఒంటరిని చేశామని టీడీపీ, కాంగ్రెస్ వాళ్ళు ఆనందపడుతూ ఉండవచ్చు కానీ ప్రజలు తమకు అవకాశం ఎప్పుడు వస్తుందా, ఈ కుట్రలకు సమాధానం ఎప్పుడు చెబుదామా అని ఎదురుచూస్తున్నారు. ఈ కుట్రలతో జగన్‌ని బంధించవచ్చు కానీ ప్రజాకోర్టులో జగన్‌ను తప్పకుండా న్యాయం జరుగుతుంది.

- జె.ఎన్. జవహర్, విజయవాడ

ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నందునే

కాంగ్రెస్, టీడీపీలపై వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధ్వజం
- ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నందునే జగన్‌పై అక్రమ కేసులు
- జగన్‌ను ఇబ్బందులపాలు చేయడంలో భాగంగానే మోపిదేవిని బలిచేశారు
- మోపిదేవిని వారం రోజుల్లో విడిపిస్తామన్నారు.. 
- జైలుకు పంపాక పట్టించుకోవడం మానేశారు
- వైఎస్సార్ సీపీలో చేరిన మోపిదేవి సోదరుడు, కుమారుడు 

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కుట్రపూరితంగా అరెస్టు చేసి కాంగ్రెస్, టీడీపీలు రాజకీయం చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. ‘‘నల్లకాలువ వద్ద ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలతో మమేకమవుతూ వారి ఆదరాభిమానాలు చూరగొనడంవల్లే కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి జగన్‌బాబుపై అక్రమ కేసులు బనాయించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా 15 నెలలపాటు ఉన్న కాలంలో ఎలాంటి కేసులూ లేవు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాతే జగన్‌పై కేసులు బనాయించారు. రాజకీయ ప్రేరేపితమైన కేసులో జగన్‌ను ఇబ్బందుల పాలు చేసేందుకు వెనుకబడిన వర్గాలకు చెందిన మంత్రి అయిన మోపిదేవి వెంకటరమణను బలిచేశారు. మోపిదేవిని వారం రోజుల్లో బయటకు తెస్తామని చెప్పి జైలుకు పంపిన తర్వాత పట్టించుకోవడమే మానేశారు’’ అని విజయమ్మ దుయ్యబట్టారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరినాథ్‌బాబు, కుమారుడు రాజీవ్‌లతో పాటు రేపల్లె నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులతో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వారందరికీ విజయమ్మ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి విజయమ్మ ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ ఎలాంటి నేరం చేయలేదని ఆమె స్పష్టంచేశారు. రాజకీయ ప్రేరేపితమైన కేసులో జగన్‌ను ఇబ్బందులపాలు చేయడంతో పాటు ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్న రాజశేఖరరెడ్డిని అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 26 జీవోలు సక్రమమా కాదా చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించి, ఎనిమిది నెలల గడువు ఇచ్చినా స్పందించలేదని తప్పుబట్టారు. ఆరోజే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి ఉంటే అసలు కేసే ఉండేది కాదన్నారు.

బిజినెస్ రూల్స్ ప్రకారమే జీవోలు జారీ అయ్యాయని మంత్రులు సుప్రీం కోర్టుకు నివేదించారని, అలాం టప్పుడు కేసు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డి 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే వారిచ్చిన ప్రతిఫలం ఎఫ్‌ఐఆర్‌లో దోషిగా పేర్కొనడం, ఆయన కుటుంబానికి సీబీఐ వేధింపులు, జగన్‌కు బెయిల్ కూడా రాకుండా వందల కుట్రలు చేయడమని విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. కుట్రలు, కుతంత్రాలు చేసే వారి పాపం పండినరోజు దేవుడే దిగొచ్చి అంతమొందిస్తారని హెచ్చరించారు. జగన్ త్వరలోనే బయటకొస్తారని, ఆలోపు ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి మెజార్టీ పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పారు. సాధారణ ఎన్నికలు కూడా నవంబర్ లేదా డిసెంబర్‌లో వచ్చే అవకాశముందని, ఇప్పటినుంచే అందరూ గట్టిగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.

పార్టీలో చేరిన నాయకులు...
హరినాథ్‌బాబు, రాజీవ్‌లతో పాటు రేపల్లె నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీలు ప్రసాదం వాసుదేవ, చింతల శ్రీకృష్ణయ్య, గరికపాటి బానుకోటి, మాజీ జెడ్పీటీసీలు యార్లగడ్డ భాగ్యలక్ష్మి, ఎం.సుధాచంద్రహాస్‌రావు, పి.గంగాపార్వతి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సభ్యులు మరకా శ్రీనివాసరావు, నల్లపాటి రామయ్య, 50 మంది మాజీ ఎంపీటీసీలు, 50 మంది మాజీ సర్పంచులు, దాదాపు 500 మంది ముఖ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు

వైఎస్ బతికున్నంత కాలం మా అన్నకు జగన్‌తో పరిచయమే లేదు

జగన్ చెబితేనే జీవోలిచ్చామని చెబితే బెయిలిప్పిస్తామని పనబాక లక్ష్మి చెప్పారు
- అసలు వైఎస్ బతికున్నంత కాలం మా అన్నకు జగన్‌తో పరిచయమే లేదు
- జగన్‌ను రాజకీయంగా అణగదొక్కడంలో భాగంగా మా అన్నను పావుగా వాడుకున్నారు.. 
- బడుగు వర్గాలకు చెందినవాడు, రాజకీయంగా అండలేనందునే బలి చేశారు
- మా అన్నకు న్యాయ సహాయం చేయకపోగా, ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా పట్టించుకోవడంలేదు 

సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అప్రూవర్‌గా మారి జగన్‌కు వ్యతిరేకంగా చెబితే బెయిలిప్పిస్తామన్నారని ఆయన సోదరుడు మోపిదేవి హరినాథ్‌బాబు చెప్పారు. జగన్ చెబితేనే జీవోలు విడుదల చేశామని మోపిదేవి చెప్పాలని, అప్పుడే బెయిల్‌పై బయటకు తీసుకొస్తామని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తమతో చెప్పారన్నారు. అసలు వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం తమ అన్నతో జగన్‌కు పరిచయమే లేదని, వారిద్దరూ మాట్లాడుకున్న సందర్భమే లేదని తెలిపారు. ఏ తప్పూ చేయని జగన్, మోపిదేవిలపై కేంద్ర మంత్రి లక్ష్మి ఆ విధంగా మాట్లాడేసరికి జీర్ణించుకోలేకపోయామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాల కారణంగానే ఆ పార్టీని వదిలేశామన్నారు. మాటకు కట్టుబడి ఉండే వైఎస్ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలవడానికి, రాజశేఖరరెడ్డి ఆశయసాధనకు తమ వంతు ప్రయత్నం చేసేందుకు వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు చెప్పారు. 

తమ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎన్ని వేధింపులకు గురిచేసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మోపిదేవి కుటుంబం శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం హరినాథ్‌బాబు విలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాత తాము కాంగ్రెస్‌ను వీడటానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణాలను వివరిస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు. 26 జీవోలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా అణగదొక్కడంలో భాగంగానే మోపిదేవి వెంకటరమణను బలిపశువును చేశారని దుయ్యబట్టారు.

తన అన్న ఎంతో వెనుకబడిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఏకైక మంత్రి అని చెప్పారు. బడుగువర్గాలకు చెందిన వాడు, బలమైన రాజకీయ నేపథ్యం, వెనుక నుంచి మద్దతు లేనందునే తన అన్నను కాంగ్రెస్ చెప్పుచేతల్లో పనిచేసే సీబీఐకి బలిచేశారని చెప్పారు. కేబినెట్ నియమ నిబంధనలకు అనుగుణంగానే వాన్‌పిక్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటే సీబీఐ తప్పుపట్టడమేమిటని ప్రశ్నించారు. తన సోదరుడికి ఇప్పటివరకు ఎలాంటి న్యాయ సహాయం చేయకపోగా, ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా పట్టించుకోవడంలేదన్నారు. ఇటీవల ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులలో సరైన వైద్యం అందించకుండానే జైలుకు తరలించారని చెప్పారు. సరైన వైద్యం అందించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాళ్లు మెక్కినా కనికరించలేదని, వైద్య శాఖ మంత్రి కొండ్రు మురళీమోహన్‌కు ఫోన్ చేసినా కూడా మాట్లాడలేదంటూ క న్నీళ్ల పర్యంతమయ్యారు. సీఎం కిరణ్‌కు మానవత్వంలేదని మండిపడ్డారు.

హరినాథ్‌బాబు లేఖ సారాంశమిదీ.. 
25 ఏళ్ల రాజకీయ జీవితం, అయిదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం మా అన్నకు ఉంది. ఆయనతోపాటు మా కుటుంబ మంతా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎంతో కష్టపడింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదరాభిమానాలతో మా అన్న మంత్రిగా ఎదిగారు. ఎంతో వెనుకబడిన మత్స్యకారుల సామాజిక వర్గం నుంచి రాజకీయంగా ఎదుగుతున్న వ్యక్తిపై కాంగ్రెస్ సారథ్యంలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ద్వారా తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేసింది. 

మా అన్న పట్ల సీబీఐ వ్యవహరించిన తీరు చాలా బాధాకరం. వాన్‌పిక్ ప్రాజెక్టుకంటే ముందే కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు, కాకినాడ పోర్టులతో సహా అనేక ప్రాజెక్టులపై చంద్రబాబు ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నారు. వాన్‌పిక్‌పై కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో ఏ తప్పూ జరగలేదు. అయినప్పటికీ, జగన్‌ను రాజకీయం గా అణగదొక్కాలనే ఏకైక లక్ష్యంతో మా అన్నను పావుగా వాడుకోవడం ఈ రోజుకీ జీర్ణించుకోలేని బాధాకరమైన విషయం. వాన్‌పిక్‌పై మా అన్న స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం ఏ ఒక్కటీ లేదు. సీబీఐ తప్పుపట్టిన ప్రతి జీవో రాష్ట్ర కేబినెట్‌లో చర్చించిన తర్వాతే వెలువడ్డాయి. అలాంటప్పుడు ఒక్కరినే దోషిగా ఎలా చిత్రీకరిస్తారు? ఇప్పటివరకు జరిగిన పరిణామాలలో మా అన్న ఒక్కరినే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా బలిచేశాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 

ఎమ్మార్, ఐఎంజీ భారత కేసులలో విచారణ ఎదుర్కొనకుండా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వస్తున్న చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి జగన్‌ను అణగదొక్కడానికి, రాజకీయంగా మూడో వ్యక్తి, మూడో పార్టీ లేకుండా చేయడం కోసం మా అన్నను బలిచేయడం ఎంతవరకు సమంజసం? ఈ కేసులో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తున్నారు. మా అన్న విషయంలో ఒకలా, మిగిలిన మంత్రుల విషయంలో మరోలా, జగన్ విషయంలో వేరే విధంగా వ్యవహరిస్తూ వ్యవస్థలను దిగజారుస్తూ రాజకీయాలు చేయడం చాలా బాధగా ఉంది. మా అన్నను అరెస్టు చేసి 14 నెలలు గడుస్తున్నాయి. ఏ సందర్భంలోనైనా న్యాయం జరుగుతుందని, పార్టీ, ప్రభుత్వం ఆదుకుంటాయని ఇప్పటి దాకా మా కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజలు ఎదురు చూశారు. కానీ ప్రభుత్వ చర్యలు చూస్తే చంద్రబాబును రక్షించడానికి చూపే శ్రద్ధ సంవత్సర కాలంగా జైలులో ఉన్న మా అన్న విషయంలో చూపకపోవడం చాలా బాధగా ఉంది. మాకు దేవునిపైన, న్యాయస్థానాలపైన బలమైన నమ్మకముంది. 

ఏరోజైనా న్యాయం జరుగుతుందని బలమైన నమ్మకంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాము. విశ్వసనీయత లేని, మనుషులను వాడుకొని వదిలేసే మనస్తత్వం, గిట్టని వారిని దెబ్బకొట్టడం కోసం దగ్గరి వారిని సైతం బలిపెట్టడానికి సిద్ధపడే ఇలాంటి నేతలు, పార్టీ పట్ల నమ్మకం కోల్పోయాం. ప్రజలకు ఇచ్చిన మాట కోసం, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడిన జగన్‌ను, ఆయన నాయకత్వాన్ని చూసి, కష్టాలలో ఉన్న ఆయనకు తోడుగా నిలబడితే దేవుడు, నియోజకవర్గ ప్రజలు హర్షిస్తారని ఈ నిర్ణయం తీసుకున్నాం.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 201వ రోజు సాగే వివరాలను పాదయాత్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణశ్రీనివాస్ శుక్రవారం ప్రకటించారు. షర్మిల శనివారం తూర్పు నియోజక వర్గంలోని వాల్తేరు వైఎస్సార్ సెంటర్‌లో పాదయాత్ర మొదలు పెడతారు. ఏఎస్‌రాజా మైదానం, ఎంవీపీ డబుల్ రోడ్డు మీదుగా సాగి హనుమంతువాక సమీపంలో లంచ్ చేస్తారు. తర్వాత పెదగదిలి, తోట గరువు మీదుగా ఆరిలోవ చేరుకుంటారు. రాత్రికి అక్కడికి సమీపంలో బస చేస్తారు. 

పర్యటించే ప్రాంతాలు
వాల్తేరు వైఎస్సార్ సెంటర్, ఏఎస్ రాజా మైదానం, ఎంవీపీ డబుల్ రోడ్డు, ఎంవీపీ కాలనీ, హనుమంతువాక, పెదగదిలి, తోట గరువు, ఆరిలోవ

ప్రజాభిమానమే నడిపించింది

Written By news on Friday, July 5, 2013 | 7/05/2013

ప్రజల నుంచి వెల్లువెత్తిన అభిమానమే తనను నడిపిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. తాను సాగిస్తున్న‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 200 రోజులు పూర్తయిన సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో గురువారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో అశేష జనాన్ని ఉద్దేశించి ఆమె ప్రసగించారు. కాంగ్రెస్ అసమర్థ పాలన, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలపై షర్మిల నిప్పులు చెరిగారు. 

ప్రజా సమస్యలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కిరణ్ సర్కారు ఎప్పుడు సరిగ్గా కరెంట్ ఇవ్వలేదన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. పక్కా ఇళ్లకు పాడి కట్టిందన్నారు. వైఎస్ఆర్ మంజూరు చేసిన పక్కా ఇళ్లకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని తెలిపారు. రైతులకు మద్దతు ధర లేదు, పేదలకు సబ్సిడీలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా చార్జీలు పెంచుతూ ఆమ్ ఆద్మీకి వెన్నుపోటు పొడుస్తూనే ఉందన్నారు. పెట్రోల్, డీజిల్, ఎరువులు, గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. ఎక్కడుంది సంక్షేమని ప్రశ్నించారు. 

ప్రజారాజ్యం పార్టీకి ఓటేసిన 70 లక్షల మందిని పిచ్చోళ్లను చేసి ఒక్క మంత్రి కోసం చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారని ఎద్దేవా చేశారు. విపక్ష నేతగా అధికార కాంగ్రెస్ కాలర్ పట్టుకుని ప్రజా సమస్యలపై నిలదీయాల్సిన చంద్రబాబు చాటుగా కిరణ్ సర్కారుకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు తన హయాంలో ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకుని 8 ఏళ్లలో 8 సార్లు కరెంట్ చార్జీలు పెంచారని గుర్తుచేశారు. రూ.50 ఉన్న హార్స్ పవర్ చార్జీని రూ.650 చేసిన ఘనత బాబుదే అన్నారు. చంద్రబాబుకు మళ్లీ అధికారమిస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టని హెచ్చరించారు. 
రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్, టీడీపీ కుట్రలు చేసి జగనన్నను జైలుకు పంపాయని షర్మిల ఆరోపించారు. వంద మంది కలిసి వెయ్యి కుట్రలు పన్ని వ్యవస్థలను వాడుకుని జగన్ ను తొక్కేయాలనుకుంటున్నారని చెప్పారు. జైల్లో ఉన్న కూడా జగనన్న గుండె నిబ్బరం తగ్గలేదని, ప్రజల గురించే ఆయన ఆలోచిస్తున్నారని తెలిపారు. కారుచీకట్లో ఉన్నా జగన్ కాంతి కిరణమే అన్నారు. జైల్లో ఉన్నా జగనన్న తిరుగులేని జననేత అని నినదించారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న సీఎం అయిన తర్వాత రాజన్న ప్రతి మాటను నెరవేరుస్తాడని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహానేత ప్రతి పథకానికి జీవం పోస్తుందని హామీయిచ్చారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.

Special edition on "privatikarana Atalu saganivvam"

Mopidevi Brother and Followers Join in YSRCP part 2

Mopidevi Brother and Followers Join in YSRCP part 1

Mopidevi venkata ramana was scapegoat : YS Vijayamma

జగన్ బెయిల్ కోర్ట్ పరిధి లో లేదు కాంగ్రెస్ చేతిలో ఉంది అనడానికి ఉదాహరణలు ..

జగన్ బెయిల్ కోర్ట్ పరిధి లో లేదు కాంగ్రెస్ చేతిలో ఉంది అనడానికి ఉదాహరణలు కోకల్లాలు.

1.టీడీపీ అవిశ్వాసం పెడితే కాంగ్రెస్ తో బేరం కుదుర్చుకొని జగన్ బెయిల్ పై బైటకి వస్తాడు అని   బాబు అనేక సార్లు అన్నాడు అంటే బెయిల్ కోర్ట్ చేతిలో లేదు కాంగ్రెస్ చేతిలో ఉంది అని బాబు చెప్పకనే చెప్పాడుగా.

2.జగన్ పార్టీ కాంగ్రెస్ లో కలిస్తే తప్పితే జగన్ కు బెయిల్ రాదు అని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నాడు అంటే దానర్ధం బెయిల్ కోర్ట్ చేతిలో లేదు అనే కదా?

3.జగన్ కాంగ్రెస్ లో ఉండిఉంటే కేంద్ర మంత్రి , తరవాత రాష్ట్ర ముక్యమంత్రి అయ్యేవాడు అని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ అన్నాడు.

4.జగన్ కు వ్యతిరేకంగా సాక్షామిస్తే మోపిదేవిని బైటకి తెస్తాము అని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి చెప్పినట్టుగా మోపిదేవి తమ్ముడు చెప్పాడు అంటే దానర్ధం ఏమిటి?

5.ఐ‌ఎం‌జి భారత్ కు హైదరాబాద్ లో గచ్చిబౌలి, శంషాబాద్ దగ్గర దాదాపు 8500 కోట్ల విలువ చేసే 850 ఎకరాలను బాబు తన బంధువైన అహోబిల నాయుడు అలియాస్ బిల్లీ రావు కు కేవలం 45 కోట్లకు ఆపద్ధర్మ ముక్యమంత్రి గా కట్టబెట్టిన బాబు పై విచారణ ఎందుకు జరగదు?

పైగా బిల్లీ రావే తగిన మత్తులో తాను బాబు కలసి ఎలా దోచుకొంది, దాచుకొంది, న్యాయమూర్తులను ఎలా మేనేజ్ చేసింది చెప్పిన వీడియొ లు కూడా ఉన్నాయి అయినా విచారణ జరగదు. కాంగ్రెస్ కు రహస్య మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ మామ జోలికి సి‌బి‌ఐ వెల్లదు.

6. సి‌బి‌ఐ ని సుప్రీం కోర్ట్ కేంద్రం చేతిలోని చిలుక అని చెప్పింది అంటే సి‌బి‌ఐ కాంగ్రెస్ అడుగులకు ఎలా మడుగు లోత్తుతుందో అర్ధం కావడం లేదా?

7.బొగ్గు కుంభకోణం లో సి‌బి‌ఐ రిపోర్ట్ ను తారుమారుచేసిన న్యాయశాఖ మంత్రి ని కానీ పి‌ఎం‌ఓ అధికారిలను కానీ కోర్ట్ కానీ సి‌బి‌ఐ కానీ తప్పు పట్టవు , విచారణ జరపవు.
రైల్ గెట్ కుంభకోణం లో రైల్వే మంత్రి నిర్ధోషి, ఆయన మేనల్లుడు మాత్రం దోషి అని సి‌బి‌ఐ అనడం కూడా చూశాం.

ఇవన్నీ చూశాక ఎవరైనా సి‌బి‌ఐ, కోర్ట్ లు న్యాయంగా పనిచేస్తున్నాయి అంటే నమ్ముతారా?

జగన్ బెయిల్ అనేది కోర్ట్ చేతిలో కాదు కాంగ్రెస్ చేతిలో ఉంది అంటే ఎవరైనా కాదనగలరా?


courtesy:CV Reddy

జగన్ కేసులో ఒక రకంగా, బన్సల్ కేసులో మరో రకంగా వ్యవహరిస్తారా ?

కేంద్ర రైల్వేశాఖ మంత్రి బన్సల్ కు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన సిబిఐ తీరును వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తీవ్రంగా ప్రశ్నించింది. జగన్ కేసులో ఒక రకంగా, బన్సల్ కేసులో మరో రకంగా వ్యవహరిస్తారా అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అదికార ప్రతినిది అంబటి రాంబాబు ప్రశ్నించారు. బన్సల్ మేనల్లుడు సింగ్ల రైల్వే ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేశారన్నది అబియోగం.అయితే ఇందులో బన్సల్, సింగ్లల మధ్య ఫోన్ సంభాషణలు ఏమీ జరగలేదని సిబిఐ మాజీ మంత్రి బన్సల్ ను సాక్షిగా తీర్పిచ్చిందని ఆయన విమర్శించారు. జగన్ కేసులో ఆయన ఎన్నడూ సచివాలయానికి వెళ్లలేదు, ఎవరికి ఫోన్ లు చేయలేదు.ఆయన ప్రభావం చూపారనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా, పదమూడు నెలలుగా జగన్ ను నిర్భందించిందని అంబటి రాంబాబు విమర్శించారు. ఈ కేసును కొద్ది వారాలలోనే సిబిఐ పూర్తి చేసి బన్సల్ కు సర్టిఫికెట్ ఇచ్చేసిందని, మరి జగన్ కేసును నెలల తరబడి, ఏళ్ల తరబడి ఎందుకు విచారణ చేస్తున్నదని ఆయన ప్రశ్నించారు.దీనిని బట్టే సిబిఐ పంజరంలో చిలుక అని మరోసారి తేలిందని, ఎవరి ఒత్తిడితో పనిచేస్తున్నది అర్ధం అవుతూనే ఉందని రాంబాబు వ్యాఖ్యానించారు.

courtesy:kommineni

షర్మిలకు సమస్యలు విన్నవించిన 108 ఉద్యోగులు

: తమ సమస్యలను పరిష్కరించాలని మహానేత రాజశేఖరరెడ్డి తనయ షర్మిలను 108 ఉద్యోగులు శుక్రవారం కోరారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో షర్మిలను కలసి 108 ఉద్యోగులు తమ గోడును విన్నవించారు. అయితే తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ 108 ఉద్యోగులు శుక్రవారం విశాఖపట్నం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.

మోపిదేవిని బలిపశువును చేశారు

వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించేందుకు మోపిదేవి వెంకట రమణను బలిపశువును చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. 26 జీవోల కేసు రాజకీయ ప్రేరేపితమైనదని ఆమె శుక్రవారమిక్కడ అన్నారు. 

మోపిదేవి కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో, జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్నామన్నారు. 

మోపిదేవిని అరెస్ట్ చేసే ముందు ....వారం రోజుల్లో విడుదల చేస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారని విజయమ్మ అన్నారు. 26 జీవోల కేసులో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. 

అందుకు ప్రతిఫలంగా వైఎస్ను అప్రతిష్ట చేసేందుకు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ కలిపి చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. ప్రతి పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా అందరూ కలిసి పని చేయాలని విజయమ్మ సూచించారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కుటుంబ సభ్యులు తమ అనుచరులతో కలిసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం మోపిదేవి కుమారుడు రాజీవ్, సోదరుడు హరినాథ్‌బాబు, రేపల్లె నియోజకవర్గంలోని పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో కలిసి హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి తరలి వచ్చారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వారు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. విజయమ్మ వారికి కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

అంతకు ముందు మోపిదేవి సోదరుడు హరినాధ్ బాబు మీడియాతో మాట్లాడుతూ బీసీలమైనందునే ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కక్షకట్టి తమ సోదరున్ని జైలుకు పంపారని ఆరోపించారు. 25ఏళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం తాము సేవ చేసామని, అయితే తాము కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ ఆదరించలేదన్నారు.

న్యాయ సహాయం అందించే విషయంలో కూడా ముఖ్యమంత్రి వివక్ష చూపించారని హరినాధ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా కుంటుపడ్డాయన్నారు. తన సోదరుడికి అనారోగ్యంగా ఉన్నా మెరుగైన వైద్య సహాయం కూడా ఉందటం లేదన్నారు.

'కోవర్టుగా మారితే సాయం చేస్తామన్నారు'

కాంగ్రెస్‌లో న్యాయం జరగదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరినాధ్ బాబు తెలిపారు. ఆయన శుక్రవారం పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏళ్లగా పార్టీకి సేవ చేస్తే.... కాంగ్రెస్ మాత్రం తన అన్నను మోసం చేసిందని ఆరోపించారు. బీసీలమయినందునే తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ తీరుపై విసిగిపోయే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. 

ఆరోగ్యం బాగోలేదన్నా తన సోదరుడిని కనికరించలేదని హరినాధ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సాయం కోసం మంత్రి కొండ్రు మురళిని బతిమాలినా పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. మోపిదేవిని కోవర్టుగా మారమని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి సూచించారని ఆయన తెలిపారు. 

తన సోదరుడు కోవర్టుగా మారితే సాయం చేస్తామని పనబాక చెప్పారన్నారు. వైద్యం కోసం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కాళ్లు కూడా పట్టుకున్నామని హరినాధ్ బాబు తెలిపారు. తాను నమ్ముకున్న నాయకుడు వైఎస్ జగన్ అని ....వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం సంతోషంగా ఉందని హరినాధ్ బాబు అన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి మోపిదేవి సోదరడు

మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరనాథ్ బాబు శుక్రవారం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్ లోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నారు. అలాగే రేపల్లె నియోజకవర్గంలోని మోపిదేవి ముఖ్య అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారు. 

మీ ఓటే.. జగనన్న విడుదలకు బాట

- ‘మరో ప్రజాప్రస్థానం’లో షర్మిల పిలుపు

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మీరు వేసే ప్రతి ఓటూ.. అక్రమ నిర్బంధంలో ఉన్న జగనన్న బయటికి రావడానికి బాటలు వేస్తుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘మీరు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన రోజున రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి మీరంతా కృషి చేయాలని కోరుతున్నాం’’ అని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం విశాఖ జిల్లా గాజువాక, విశాఖ ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాల్లో సాగింది. ఈ సందర్భంగా పాత గాజువాక సర్కిల్‌లో వైఎస్సార్ విగ్రహానికి షర్మిల పూలమాలలు వేసి నివాళి అర్పించారు. భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల కొద్దిసేపు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

15 కిలోమీటర్ల మేర యాత్ర: ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 199వ రోజు గురువారం విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలోని గాజువాక సెంటర్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి నాతయ్యపాలెం, శీలానగర్, ఎయిర్‌పోర్టు, ఎన్‌ఏడీ జంక్షన్, బుచ్చిరాజుపాలెం, మర్రిపాలెం, ఏటీ జంక్షన్ మీదుగా షర్మిల నడిచారు. కంచరపాలెం మెట్ట వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.00 గంటలకు చేరుకున్నారు.

గురువారం మొత్తం ఆమె 15 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,652.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో జిల్లా పార్టీ కన్వీనర్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, సిటీ కన్వీనర్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ యాదవ్, గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు చెంగల వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, కుంభా రవిబాబు, నేతలు వైఎస్ కొండారెడ్డి, జీవీ రవిరాజు, దాడి రత్నాకర్, కొత్తపల్లి గీత, స్థానిక నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి, పీలా ఉమారాణి తదితరులు ఉన్నారు.

‘మరో ప్రజాప్రస్థానం’తో షర్మిల రికార్డు

* నేడు విశాఖ ఆర్‌కే బీచ్ వద్ద భారీ బహిరంగ సభ

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సడలని సంకల్ప బలానికి నిదర్శనంగా సాగుతున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర రికార్డు మైలురాయిని చేరుకోనుంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేపట్టిన ఈ యాత్ర శుక్రవారానికి 200 రోజులను పూర్తి చేసుకోనుంది. అంతే కాదు.. శుక్రవారం విశాఖపట్టణం తూర్పు నియోజకవర్గంలో షర్మిల అడుగు పెట్టడంతో వంద నియోజకవర్గాల్లో యాత్ర పూర్తికాబోతోంది. ఈ రెండు ప్రధాన ఘట్టాలకూ విశాఖ నగరం వేదిక కాబోతోంది.

ఇడుపులపాయలో మొదలు: ప్రజా సమస్యలను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి, ప్రజాస్వామ్య విరుద్ధంగా దానితో కుమ్మక్కైన ప్రతిపక్ష టీడీపీ వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున 2012 అక్టోబర్ 18న షర్మిల ఇడుపులపాయలో ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ప్రారంభించారు. తండ్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పదేళ్ల కిందట చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర స్ఫూర్తితో, అన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహంతో ఆమె చేపట్టిన ఈ యాత్రకు అడుగడుగునా అసాధారణ స్పందన లభిస్తోంది.

పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పడుతోంది. మధ్యమధ్యలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలకు ప్రజాప్రవాహం పోటెత్తుతోంది. వైఎస్సార్ జిల్లా, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, గుంటూరు, కృష్ణా, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి.. మొత్తం 11 జిల్లాల్లో యాత్ర పూర్తిచేసుకొని గత నెల 24న నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద షర్మిల విశాఖ జిల్లాలోకి అడుగు పెట్టారు. జిల్లాలో 11 రోజులుగా సాగుతున్న షర్మిల యాత్రకు ప్రతి గ్రామంలో అమిత ప్రజాదరణ లభిస్తోంది. జిల్లాలో నర్సీపట్నం మొదలు సబ్బవరం వరకు నిర్వహించిన ప్రతి బహిరంగ సభకూ అశేష ప్రజానీకం హాజరవుతూ, ‘మీ వెంటే మేమున్నాం’ అని మద్దతు ప్రకటిస్తోంది. రాష్ట్ర సమస్యలపై, కుమ్మక్కు రాజకీయాలపై, స్థానిక సమస్యలపై షర్మిల చేస్తున్న సునిశిత విమర్శలకు అద్వితీయ స్పందన లభిస్తోంది. ఏ గ్రామానికి వెళ్లినా వేలాది మంది ప్రజలు ఆమె అడుగులో అడుగు వేసి వెంట సాగుతుండడంతో యాత్ర ప్రజల పండుగలా కనిపిస్తోంది.

అన్ని వర్గాల అండ:
నిర్విరామంగా పాదయాత్ర కొనసాగిస్తున్న షర్మిలపై అన్ని వర్గాల అభిమానం వెన్నెల జల్లులా కురుస్తోంది. ఆమెను చూడడానికి, ఆమెతో మాట్లాడడానికి, చేతులు కలపడానికి వృద్ధులు, మహిళలు, యువజనులు తరలివస్తూ ఉండడంతో యాత్రలో ఉత్తేజ, ఉద్వేగభరిత వాతావరణం నెలకొంటోంది. 

ఎందరో తమ బాధలను షర్మిల దృష్టికి తెచ్చి ‘మన ప్రభుత్వం వచ్చాకైనా వీటిని పరిష్కరించండమ్మా’ అంటున్నారంటే పార్టీపై ప్రజలు ఎంత ఆశలు పెట్టుకున్నారో అవగతమవుతోంది. షర్మిల జనం సమస్యలను సావధానంగా వింటూ.. రాబోయేది మంచి రోజులని వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. శుక్రవారం నాటికి పాదయాత్ర 200 రోజులకు చేరుకుంటూ ఉండడంతో విశాఖలో ఘన స్వాగతం పలకడానికి పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్‌కే బీచ్ వద్ద శుక్రవారం సాయంత్రం 5 గంటలకు భారీ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రాజకీయ కక్ష సాధింపులు ప్రజానాయకుడిని ఏమీ చేయలేవు

జగన్ కోసం జనం, జనం కోసం జగన్. ఈ మాట ముమ్మాటికీ నిజం. నా వయసు 73. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటివరకు వై.ఎస్. లాంటి ప్రజాహిత ముఖ్యమంత్రిని చూడలేదు. జగన్ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజాసంక్షేమం కోసం పాటు పడగలరని ఇప్పటికే రూఢీ అయింది. తన తండ్రి మరణించిన తరువాత ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి జగన్ ప్రజల మధ్యకు వెళ్లారు. అందుకు ఆగ్రహించిన కాంగ్రెస్‌పార్టీ ఆ యువనాయకుడు పార్టీ వీడేలా ప్రతీకార చర్యలకు పాల్పడింది. ఆ తర్వాత పాలక, ప్రతిపక్షాలు కలిసి, సీబీఐ సహకారంతో జగన్‌ను జైలుకు పంపి, ఏడాది దాటినా బెయిల్ రాకుండా అడ్డుకుంటూనే ఉన్నాయి.

చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడిగా కంటే, అధికారపార్టీ భాగస్వామిగానే ఎక్కువగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం చేసుకొని తన మీది నేరారోపణలపై దర్యాప్తు జరగకుండా హామీలు పొందారు. అందుకే ఆయన తనెంతో నిజాయితీపరుడినని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినా ఎవరూ నమ్మట్లేదు. చిదంబరంతో చీకటి ఒప్పందం చేసుకుని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చెయ్యి కలిపి ఆయన ఆడుతున్న రాజకీయ ఫిక్సింగ్ నాటకాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు అధికార, ప్రతిపక్షపార్టీలకు ఒకేసారి తగిన గుణపాఠం చెబుతారు. ఇది తథ్యం.

చంద్రబాబు ఇంతకుముందెప్పుడో ఒకసారి తన రక్తంలో ప్రవహిస్తున్నది 75 శాతం టీడీపీ, 25 శాతం కాంగ్రెస్ రక్తం అని అన్నట్లు గుర్తు. కాబట్టి చిరంజీవి తన పీఆర్పీని కాంగ్రెస్‌కు అమ్ముకుని కేంద్రమంత్రి అయినట్లే, చంద్రబాబు కూడా పై పాట్లన్నీ పడకుండా తన టీడీపీని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేసుకుంటే బాగుంటుంది కదా. అప్పుడు తన మీద ఉన్న నేరారోపణలను ఇంకా సులువుగా మాఫీ చేసుకోవచ్చు. ప్రజానాయకుడు జగన్ జైలుపాలు అయినంత మాత్రాన దోషి కారు. ఈ రాజకీయ కక్ష సాధింపులు ఆయన్ని ఏమీ చేయలేవు. ఎన్నికలెప్పుడొచ్చినా ఆయన స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రజల ఆదరాభిమానాలతో బంపర్ మెజార్టీతో గెలవడం ఖాయం. ఈ విషయాన్ని ఇంతకుముందు జరిగిన ఉపఎన్నికలే నిరూపించాయి. అందువల్లనే అధికార పార్టీ ఏ ఎన్నికనైనా నిర్వహించడానికి భయపడుతోంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవు. 

- మిత్తిరెడ్డి సింహాచలం, ప్రత్తిపాడు, ప.గో.జిల్లా

రాజన్న తరువాత లభించిన నాయకుడు జగనన్న...

తెలుగు పౌరుషాత్మకు కొత్త విశ్వాసాన్ని నింపడానికి, తెలుగుజాతి ఖ్యాతి భారతజాతికి చూపి ముందుకు నడపడానికి రాజన్న తరువాత రాష్ట్ర ప్రజలకు లభించిన నాయకుడు జగనన్న...

ఇప్పుడు జరుగుతున్నది జగన్నాటకం... జగనన్న చుట్టూ నడుస్తున్న నాటకం. ఢిల్లీ డెరైక్షన్‌లో సీబీఐ విలన్‌గా నటిస్తూ నడుపుతున్న, నడుస్తున్న నాటకం... జనులకు అనర్థాలు తెస్తున్న పాలకపక్షానికి ప్రతిపక్షం భుజం తట్టి న్యాయానికి కళ్ళు లేవని న్యాయదేవత ముందు వెర్రితలలు వేసిన వాదనలతో గంతులేస్తున్న నాటకం... 

నేనడుగుతున్నాను...జనంలో ఒకడిగా జనంతో ఒకడిగా జనమంతా ఒకటిగా... భారతీయ సంప్రదాయం పాటిస్తాను అన్నందుకా ఇంత కక్ష! ఏడాదిన్నరగా కేవలం ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌రావు మరో పార్టీ అధినేతగా ఉన్న జగన్‌పై వేసిన పిల్‌ని దృష్టిలో ఉంచుకుని వ్యక్తిని నిర్బంధించారు. మరి పూర్తి సాక్ష్యాధారాలతో మాజీముఖ్యమంత్రిపై మరో ఎమ్మెల్యే విజయమ్మ వేసిన పిల్‌ని రాజకీయకక్షతో వేసిందని ఎలా అనుకుంటాం? ఎందుకు ఆ పిల్‌ని తిరస్కరించారు?

చట్టం ముందు అందరూ సమానం కాదనే భావనని జనులలో కల్గించారు. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా మన ప్రాధాన్యత మనకే అని, ఢిల్లీ తల్లి ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమే మరి! ప్రజలు ఆలోచిస్తున్నారు రేపటి కోసం పొలాలు పచ్చగా కళకళలాడవు. రైతులు ఆకాంక్షిస్తున్నారు ఉచిత వెలుగులు నిండాలని విద్యార్థులు ఊహించుకుంటున్నారు భవిష్యత్తు బంగారమై నిలుస్తుందని... మాకు మేముగా బ్రతకాలంటే మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి, జగనన్న సీఎం కావాలి.

- ఈమని ఫణీంద్రరెడ్డి, మున్నంగి, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా.

వైఎస్సార్ సీపీలోకి టీడీపీ, టీఆర్‌ఎస్ నేతలు

సాక్షి, హైదరాబాద్: గుంటూరు, మెదక్ జిల్లాల నుంచి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు చెందిన మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులతో పాటు ఇతర నేతలు పెద్దసంఖ్యలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

గుంటూరు జిల్లా నుంచి పార్టీలో చేరిన వారిలో జిల్లా జెడ్పీటీసీల సంఘం మాజీ అధ్యక్షుడు శాఖమూరి నారాయణ ప్రసాద్, దాచేపల్లి మాజీ జెడ్పీటీసీ చెన్నయ్య, ఆదర్శ సర్పంచ్‌గా జాతీయస్థాయిలో ఎంపికైన మాణిక్యమ్మ ఉన్నారు. తాడికొండ, తెనాలి, మాచర్ల, మంగళగిరి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాగ మల్లేశ్వరరావు, బొల్లిముంత వీరయ్య, వాసిరెడ్డి వెంకట్రావు,వంగా నాగిరెడ్డి, దాసరి శ్రీనివాసరావు, మేకపోతుల సాంబశివరావు, పి.సుమన్, బి.వసంత్‌రెడ్డిలతో పాటు దాదాపు రెండు వందల మంది పార్టీలో చేరారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మెదక్ నుంచి..: బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రామాగౌడ్, టీడీపీ నేత, కొండాపూర్ మాజీ ఎంపీటీసీ మహమూద్, కాంగ్రెస్‌నేత, సంగారెడ్డి మండలం కాశీపూర్ మాజీ ఎంపీటీసీ సర్దార్, టీఆర్‌ఎస్ నేతలు, మాజీ సర్పంచ్‌లు మోన్యా నాయక్, వి.జయరాం, సీనియర్ సిటిజన్స్ మెదక్ జిల్లా అధ్యక్షుడు వి.కనకరాజు తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరి వెంట పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు, మెదక్ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి తదితరులున్నారు.

ఇది కాంగ్రెస్, టీడీపీల విష క్రీడే!

- రాజకీయ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది.
- ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు
- ‘సాక్షి చైతన్యపథం’లో గుంటూరువాసుల ఆవేదన

సాక్షి, గుంటూరు: జనంతో మమేకమైన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజాస్వామ్యంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కాంగ్రెస్, టీడీపీలు రాజకీయ దురుద్దేశంతోనే సీబీఐని పావుగా వాడుకుని విష క్రీడలాడుతున్నాయని నగరానికి చెందిన పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. జగన్ జైల్లో ఉంటేనే తాము గెలుస్తామన్న దౌర్భాగ్యస్థితికి కాంగ్రెస్, టీడీపీలు దిగజారడం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలివ్వడమేనని వారు అభిప్రాయపడ్డారు. గుంటూరులోని కావటి శంకరరావు కల్యాణమంటపంలో స్వప్న వ్యాఖ్యానంతో గురువారం జరిగిన ‘సాక్షి చైతన్య సదస్సు’లో వారు తమ మనోభావాలను వ్యక్తీకరించారు. ప్రముఖ న్యాయవాది మహ్మద్ సుల్తాన్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జగన్‌పై సీబీఐ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కేసుల్లో చార్జిషీట్లు వేసే విషయంలోనూ కోర్టులను మభ్య పెడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. 

భారత శిక్షా స్మృతి ప్రకారం నేరారోపణ ఎదుర్కొంటున్నవారిని నిర్దోషిగానే భావించాలని, చట్టప్రకారం వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ, ఒక్క నిర్ధోషికి కూడా శిక్ష పడకూడదని ఉందన్నారు. జగన్ కేసు విషయంలో రాజకీయ ప్రోద్బలంతోనే క్విడ్ ప్రో అనే పదాన్ని వాడారని, బొగ్గు కుంభకోణంలో, దాల్మియా కంపెనీ వాటాల్లో ఇలాంటి పదాన్ని ఎక్కడా వాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. జగన్ ఆస్తులపై విచారణ జరపాలని హైకోర్టుకు లేఖ రాసిన శంకర్రావుకే క్విడ్ ప్రో కో వర్తిస్తుందన్నారు. సమాచార హక్కు చట్టం కార్యకర్త ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ, పార్టీని వీడి బయటకు వచ్చిన నాయకులను కాంగ్రెస్ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు సీబీఐని పావుగా వాడుకుంటోందన్నారు. అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ, జగన్ కేసులో సీబీఐ తన పనితీరు వల్ల ఎంతో అప్రతిష్ట, అపప్రధ మూటకట్టుకున్నట్లు తెలిపారు. జగన్ కేసు విషయంలో సీబీఐ వారు గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కే ఆలోచనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రాజేశ్వరి మాట్లాడుతూ, ప్రజాదరణలో మునిగిపోయిన జగన్‌పై సీబీఐ బురదజల్లే ప్రయత్నం చేస్తోందన్నారు.

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు కావాలని పనిగట్టుకుని కోర్టులను ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు పోకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జగన్ బయటకు వస్తే విచారణ చేయలేమని సీబీఐ చెప్పడం దౌర్భాగ్యమని, జగన్ జైల్లో ఉంటేనే గెలుస్తామనుకోవడం కాంగ్రెస్, టీడీపీల దుర్నీతిని తెలియజేస్తోందన్నారు. లంబాడీ హక్కుల సంఘం నాయకులు ఎన్.కృష్ణనాయక్ మాట్లాడుతూ, బోఫోర్స్ కేసులో రాజీవ్ మరణాంతరం ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో తొల గించి వై.ఎస్. మరణాంతరం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. జగన్‌పై జరుగుతున్న కుట్రలు ఆంధ్రుల ఆత్మాభిమానంపై జరుగుతున్న కుట్రలుగా సమావేశంలో పాల్గొన్న పలువురు అభివర్ణించారు.

ఉచిత విద్యుత్ పథకంలో కోత!


ప్రైవేటు కన్సల్టెన్సీ ‘కాకి లెక్కలకు’ సర్కారు ఓకే
రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఉచిత కనెక్షన్లకు ఎసరు
ఒక్కో హెచ్‌పీకి 1,255 యూనిట్ల ఉచిత విద్యుత్తే!
3 హెచ్‌పీ ఉంటే 3,765 యూనిట్లకే పరిమితి
ఏడాదిలో 240 రోజులే సరఫరా...
5 హెచ్‌పీ దాటితే ‘ఉచితం’ హుళక్కే
ఉచిత విద్యుత్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే...
మండిపడుతున్న విద్యుత్‌రంగ నిపుణులు

సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని మోయలేని భారంగా భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం రోజుకో నిబంధనను తెరపైకి తెస్తోంది. వీలైనంత ఎక్కువమంది రైతులు ఈ పథకానికి అనర్హులయ్యేలా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తోంది. తద్వారా ఖర్చును తగ్గించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే 2.5 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి (తరిపంట) ఉన్న రైతులకు ఉచిత కరెంటును ఎత్తివేసిన ప్రభుత్వం.. ప్రైవేటు సంస్థ ‘కాకి లెక్కల’ నేపథ్యంలో ఉచిత విద్యుత్‌కు మరిన్ని పరిమితులు విధిస్తోంది. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి, వర్షాభావంతో అల్లాడుతున్న రైతుల్ని మరింత దెబ్బతీసేలా.. ఒక హార్స్ పవర్ (హెచ్‌పీ)కు ‘ఏడాది’కి కేవలం 1,255 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే సరఫరా చేయాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలను జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

మరోవైపు వ్యవసాయ పంపుసెట్ల సామర్థ్యానికీ పరిమితులు విధించనుంది. ప్రస్తుతం వ్యవసాయ పంపుసెట్ల సామర్థ్యం ఎంత ఉన్నప్పటికీ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇక మీదట కేవలం 5 హెచ్‌పీలోపు సామర్థ్యం కలిగిన వ్యవసాయ పంపుసెట్లకు మాత్రమే ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా 5 హెచ్‌పీ దాటిన 8 లక్షలకుపైగా వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ హుళక్కి కానుంది. ఇంకోవైపు ఖరీఫ్, రబీ సీజన్‌లను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మిగతా కాలంలో వేసే కత్తెర పంటలకు కరెంటు సరఫరా చేయకుండా ‘కత్తెర’ వేయనుంది. ఏడాదిలో కేవలం 240 రోజులు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయనుంది. ఏడాది పొడవునా కాయగూరలు, పండ్ల తోటలు సాగుచేసే రైతాంగాన్ని ఆర్థికంగా దెబ్బతీయనుంది. తనకు అనుకూలంగా లెక్కలు తయారు చేసేందుకే ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం అధ్యయన బాధ్యతలు అప్పగించిందని విద్యుత్ రంగ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం క్రమేణా ఉచిత విద్యుత్‌కు మంగళం పాడటం ఖాయమనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

ప్రైవేటు సంస్థ కొత్త లెక్కలు!
ఆదాయపన్ను చెల్లించే వారు, కార్పొరేట్ రైతులకు మినహా మిగిలిన వారందరికీ ఉచిత విద్యుత్ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రవేశపెట్టారు. అది కూడా ఏడాది మొత్తం విద్యుత్‌ను సరఫరా చేశారు. ఆయన మరణానంతరం ‘ఉచితానికి’ ఉరి వేసే ప్రక్రియకు తెరలేచింది. ఈ క్రమంలోనే విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల పనితీరుపై నివేదికను అందించాలని ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థకు ఇంధనశాఖ బాధ్యత అప్పగించింది. ఈ మేరకు అధ్యయనం నిర్వహించిన ఆ కన్సల్టెన్సీ వ్యవసాయానికి ఎంత విద్యుత్‌ను అందించాలనే విషయాన్ని కూడా అధ్యయనం చేసింది. గత నెలలో తన నివేదికను ఇంధనశాఖకు అందించింది.

అందులో కొత్త, మరికొంత వింత లెక్కలను వేసింది. ఏడాదిలో 120 రోజులు ఖరీఫ్, మరో 120 రోజులు రబీ సీజను ఉంటుందని పేర్కొంది. ఆ విధంగా 365 రోజుల్లో కేవలం 240 రోజులు మాత్రమే వ్యవసాయానికి ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని సూచించింది. అదేవిధంగా ఒక హెచ్‌పీ సామర్థ్యం కలిగిన పంపుసెట్టు గంటకు కేవలం 0.747 యూనిట్లను మాత్రమే వినియోగిస్తుందని అంచనా వేసింది. అంటే రోజుకు 7 గంటల చొప్పున కేవలం 5.229 యూనిట్లు మాత్రమే వినియోగమవుతుందని... ఈ విధంగా ఏడాదిలో 240 రోజులకు 1255 యూనిట్లను మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇంతకంటే మించి సరఫరా జరిగితే... ఉచిత విద్యుత్ పథకం దారి మళ్లినట్టేనని (5హెచ్‌పీకి మించిన సామర్థ్యం, 7 గంటలకు మించి సరఫరా) తెలిపింది.

ఉచిత కరెంటుకు కోత వేయడం ద్వారా ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ సిఫారసులు, సూచనల అమలుకు రంగంలోకి దిగింది. ఒక హెచ్‌పీకి ‘ఏడాది’లో కేవలం 1255 యూనిట్ల కరెంటే సరఫరా చేయాలని ఇంధనశాఖ నిర్ణయించింది. అంటే 3 హెచ్‌పీ (3ఁ1255) సామర్థ్యం కలిగిన పంపుసెట్టు ద్వారా ‘ఏడాది’లో 3,765 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంతకు మించి సరఫరా జరగకుండా కట్టడి చేయాలని కిందిస్థాయి సిబ్బందికి సర్కారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ప్రైవేటు లెక్కలపై విద్యుత్‌రంగ నిపుణులు మండిపడుతున్నారు. భూగర్భజలాలు రోజురోజుకూ అంతరించిపోతున్న నేపథ్యంలో నీటిని తోడేందుకు మోటార్లు అధిక విద్యుత్‌ను వినియోగించే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యవసాయానికి సరఫరా అవుతున్న విద్యుత్ లో-ఓల్టేజీలో సరఫరా అవుతుంటుంది. దీనివల్ల కూడా అధిక విద్యుత్ ఖర్చు అవుతుంది. అంటే వాస్తవంగా 7 గంటల ఉచిత సరఫరా జరగదు. ఆ మేరకు రైతులు నష్టపోతారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను పరిమితం చేయడమంటే పథకాన్ని నిర్వీర్యం చేయడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్ల వివరాలు
హెచ్‌పీ సామర్థ్యం కనెక్షన్ల సంఖ్య (లక్షల్లో)
5 హెచ్‌పీలోపు 23.52
7.5 హెచ్‌పీ 2.61
10 హెచ్‌పీ 2.98
15 హెచ్‌పీ 2.62
మొత్తం 31.73

Popular Posts

Topics :