14 July 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రైతులను ఆదుకోవాలి : విజయమ్మ

Written By news on Saturday, July 20, 2013 | 7/20/2013

ఆదిలాబాద్: అతలాకుతలమైన ఆదిలాబాద్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటించారు. వరద ముంపునకు గురైన పొలాలను ఆమె పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. రైతులను అడిగి జరిగిన నష్టం వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం ఆమె ఆదిలాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో వరద పరిస్థితులను చూసి బాధ కలిగిందన్నారు. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వరద బాధితులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి త్వరలోనే లేఖ రాస్తానని విజయమ్మ చెప్పారు.


వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పెన్‌గంగ ప్రాజెక్టును పూర్తిచేస్తామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ హామీ   ఇచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లాలో వరద ముంపునకు పంటలు పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వరద బాధితులకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా వచ్చిన వరదతో ముంపునకు గురైన ప్రాంతాలలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ శనివారం పర్యటించారు. 

ఆదిలాబాద్‌ జిల్లాలోనే కాకుండా ఎగువన మహారాష్ట్రలో కూడా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రాణహిత, పెన్‌గంగ నదులు పొంగి ప్రవహించడంతో సుమారు 40 వేల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. పంటలు నీటమునిగి కుళ్ళిపోయాయి. జిల్లాలోని జైనథ్‌ మండలం పెండల్‌వాడలో పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. దీనితో శ్రీమతి విజయమ్మ వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా రైతులు శ్రీమతి విజయమ్మకు తమ కష్టాలు చెప్పుకుని ఆవేద వ్యక్తంచేశారు. వర్షాల కారణంగా కుళ్ళిపోయిన పత్తి పంటను ఆమెకు చూపించి విలపించారు. తమను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని వారు వాపోయారు.


https://www.facebook.com/photo.php?fbid=584583828247584&set=a.375213312517971.82316.309587409080562&type=1&theater

Vijayamma visits flood hit areas in Adilabad

Gattu Ramachandra Rao Speaks To Media 20th July

YS Vijayamma addressing Media at Flood hit areas

వరద బాధితులకు విజయమ్మ పరామర్శ

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా వైఎస్ విజయమ్మ జిల్లాకు చేరుకుంటారు. నియోజకవర్గంలోని జైనథ్ మండలంలో పెండల్‌వాడలో వరద బాధితులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు.

తమను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. విజయమ్మతో పాటు పార్టీ నేతలు కొండా సురేఖ, జనక్ ప్రసాద్, కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొండా ఉన్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. పంటలు నీటమునిగి కుళ్ళిపోయాయి. జిల్లాలోని జైనత్‌ మండలం పెండల్‌ వాడలో పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది - 

ఆదిలాబాద్ జిల్లా చేరుకున్న విజయమ్మ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆదిలాబాద్ జిల్లా చేరుకున్నారు. సోన్ వద్ద కార్యకర్తలు, అభిమానులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. 

జిల్లాలోని వరద ప్రాంతాలను సందర్శించి, వరద బాధితులను ఆమె పరామర్శిస్తారు

జగన్ మాత్రమే తమ నాయకుడని...ప్రజలు తేల్చి చెప్పబోతున్నారు

జనహృదయనేత, పేదల పాలిట ఆశాదీపం, బడుగువర్గాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని జైలుపాలు చేయడం ఒక సామాజికనేరం. ప్రజలకు మంచి చేస్తున్న వ్యక్తిని నిర్బంధించడమంటే ప్రజావ్యతిరేక విధానానికి పాల్పడడమే. ఈ విషయాన్ని కాంగ్రెస్ గ్రహించడం లేదు. 

లెక్కకు మిక్కిలి ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సకాలంలో పేద, మధ్యతరగతి ప్రజలకు అందించిన ఘనత మహానేత వై.ఎస్.గారిదైతే... ఈ పథకాలన్నిటికీ తూట్లు పొడిచి ప్రజల కష్టాల్ని మరింత పెంచి, వారిని అయోమయంలో పడే సిన నిర్లక్ష్యం ప్రస్తుత ప్రభుత్వానిది. జగన్ కనుక బయట ఉండి ఉంటే ఇలా జరిగేదే కాదు. ఎప్పటికప్పుడు సభల ద్వారా, దీక్షల ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారు. అసలు అలా చేస్తారన్న భయంతోనే కాంగ్రెస్ ఇంత కుటిల రాజకీయానికి ఒడిగట్టిందని అర్థమౌతూనే ఉంది. నాడు పెద్దాయన సాయంతో పదవులు పొందిన వారు నేడు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన్ని విమర్శించడాన్ని కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 

పేదవారు ఏమి ఆశిస్తున్నారో వై.ఎస్.ఆర్.కి, జగన్మోహన్‌రెడ్డికి తెలిసినంతగా మరే నాయకుడికీ తెలియదని ఇప్పటికే రూఢీ అయింది. వచ్చే ఎన్నికల్లో ఇదే విషయం ఈ కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులకు మరింత స్పష్టంగా తెలియజెప్పేలా ప్రజలు తీర్పు ఇస్తారు. జగన్ మాత్రమే తమ నాయకుడని తేల్చి చెబుతారు. కనీసం అప్పుడైనా ప్రస్తుత పాలక, ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకుంటాయని ఆశిద్దాం. ఆ రోజుకోసం అందరమూ ఎదురు చూద్దాం. 

- ఆర్.వెంకటేశ్, బెంగళూరు

జగనన్న విడుదలైతేనే... ప్రజలకొక భరోసా లభిస్తుంది

వైయస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిగారికి (మా జగనన్న) ప్రజల అండదండలు ఎప్పటికీ ఉంటాయి. జగనన్నకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కక్షపూరిత విమర్శలకు దిగజారుతున్నాయి. అసత్య ఆరోపణలతో ఆయనకు బెయిల్ రాకుండా చేస్తున్నాయి. ఈ అవినీతి ప్రభుత్వానికి, దీనికి చేయూతగా నిలబడ్డ తెలుగుదేశంపార్టీకి ప్రజలు త్వరలోనే తగినరీతిలో బుద్ధి చెబుతారు. వై.ఎస్.ఆర్. ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు ప్రస్తుత ప్రభుత్వపాలనలో మూలన పడ్డాయి. వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు అందాల్సిన పింఛను ఇవ్వకుండా అధికారులు పలుమార్లు ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు. 

పింఛనుకోసం పడిగాపులు పడలేక కొన్ని పండుటాకులు రాలిపోయాయి కూడా! ఆ ఉదంతాలు పత్రికలలో వచ్చినా కూడా ఆ అధికారులను కట్టడి చెయ్యలేని ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి.

ప్రజలు ధీమాగా బతకాలంటే జగనన్న విడుదల కావడమొక్కటే మార్గం. ఆయన మాత్రమే రాజన్న పాలనను తిరిగి తేగలరు. మిగతావారంతా అధికారం కోసం ప్రజాసంక్షేమాన్ని జపిస్తున్నవారే కానీ నిజంగా ప్రజల జీవితాలను మెరుగుపరచాలన్న తపన ఉన్నవారు కాదు. 

- శ్రీకాంత్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా

వైఎస్ పథకాల పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలో గడపగడపా చెబుతుంది

- ‘ఫీజు దీక్ష’ ముగింపు సభలో సర్కారుపై విజయమ్మ నిప్పులు
- వైఎస్ పథకాల పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలో గడపగడపా చెబుతుంది
- ఒక తండ్రిలా ఆలోచించి వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారు
- ఈ ప్రభుత్వం పథకానికి తూట్లు పొడుస్తూ విద్యార్థులను క్షోభ పెడుతోంది

సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల పరిస్థితి ఏమిటని అడిగితే రాష్ట్రంలోని గడపగడపా సమాధానం చెబుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. అవి ఎప్పుడో ఆగిపోయాయన్న విషయాన్ని ప్రతి గొంతూ వినిపిస్తుందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అమలు చేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన ‘ఫీజు దీక్ష’ ముగింపు సందర్భంగా శుక్రవారం ధర్నాచౌక్ వద్ద విజయమ్మ మాట్లాడారు. అంతకుముందు విద్యార్థులు సాలెహ బేగం, ప్రీతి, స్వాతి, బిందు, అనంతరామన్, ఉదయ్‌కిరణ్‌లు విజయమ్మకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. తర్వాత విజయమ్మ ప్రసంగించారు. ఒక తండ్రిలా ఆలోచన చేసి ప్రతీ పేద విద్యార్థి కూడా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని విజయమ్మ గుర్తుచేశారు.

సుదీర్ఘమైన రాష్ట్ర రాజకీయాల్లో రాజశేఖరరెడ్డి ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకొని, అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పక్కా ప్రణాళికతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. అవసరమైనచోట ప్రాజెక్టులు కట్టడం, పరిశ్రమలు నెలకొల్పడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారన్నారు. ‘‘కొందరు కాంగ్రెస్ నేతలు, సీఎం మాట్లాడుతూ... వైఎస్ అమలు చేసిన పథకాలు ఎక్కడ ఆగాయని ప్రశ్నిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఏకంగా సవాల్ విసురుతున్నారు. వైఎస్ అనే పదం రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. పాలనకు వైఎస్ అనే పదం కొత్త అర్థం చెప్పింది. ఆ పదం ప్రజానాయకుడు ఎలా ఉండాలనే దానికి భావితరాలకు మార్గదర్శకంగా నిలిచింది. పేదలకు, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు వెలుగునిచ్చింది.

అన్నింటికీ మించి వైఎస్ అనే పదం రాష్ట్ర ప్రజలకొక భరోసా ఇచ్చింది. ఇప్పుడు వైఎస్ పథకాలు ఎలా ఉన్నాయని అడిగితే గడప గడపా సమాధానం చెబుతుంది. పథకాలు ఎప్పుడో ఆగిపోయాయని ప్రతీ గొంతు వినిపిస్తోంది..’’ అని స్పష్టంచేశారు. రాజశేఖరరెడ్డి అంటే ఒక నమ్మకం, ఒక ఆశయం కాబట్టే ఆయన రాష్ట్ర ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారన్నారు. విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల చదువుకొని ఇంజనీర్లు, డాక్టర్లమయ్యామని చెప్పుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తన ఐదేళ్ల హయాంలో ఒక్కపైసా పన్ను పెంచకుండా అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని డజన్ల కొద్దీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలుగువారు గర్వంగా తలెత్తుకునేలా చేస్తే.. ప్రస్తుత పాలకులు దుష్ట ఆలోచనలతో రకరకాల ఆంక్షలు పెట్టి ఆ పథకాలను ఒక్కొక్కటిగా నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బడ్జెట్ రూ.1.61 లక్ష కోట్లకు చేరినా ఫీజులివ్వరా..?
రాజశేఖరరెడ్డి పాలన పగ్గాలు చేపట్టినప్పుడు ప్రభుత్వ ఖజానా కేవలం రూ. 40 వేల కోట్లు మాత్రమే ఉండగా.. ఆయన ఐదేళ్ల పాలనలో రూ. 1.40 లక్షల కోట్లకు చేర్చారని విజయమ్మ గుర్తుచేశారు. ‘‘ప్రస్తుతం ప్రభుత్వ బడ్జెట్ 1.61 లక్షల కోట్లకు చేరింది. ఖజానా ఇంత పెరిగినా విద్యార్థులకు ఫీజులు ఎందుకు చెల్లించడంలేదు? ఇంత గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు..’’ అని విజయమ్మ సూటిగా ప్రశ్నిం చారు. బడ్జెట్‌లో ఒకేసారి నిధులు ఎందుకు కేటాయించడంలేదని నిలదీశారు.

వైఎస్ 25 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించారని, అప్పట్లో ఎలాంటి కొరత లేకుండా ఫీజులు మొత్తం ప్రభుత్వమే భరించిందని వివరించారు. ప్రస్తుత పాలకులు మాత్రం ఒక్కో కాలేజీకి ఒక్కో ఫీజు సృష్టించి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గందరగోళంలోకి నెడుతున్నారని విమర్శించారు. ‘‘పదివేల ర్యాంకుపైబడిన విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వరట! సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ఆ పథకం నుంచి తీసేశారు. రెండేళ్ల విరామం ఉంటే అనర్హులట. మళ్లీ ఈ పథకానికి ఆధార్‌లింక్ చేస్తున్నారు. ఎమ్మార్వో నుంచి పేదరికం సర్టిఫికెట్ తెచ్చుకోవాలట. ఇలా రకరకాల ఆంక్షలు పెట్టి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చుతున్నారు’’ అని మండిపడ్డారు.

పథకాన్ని గందరగోళంలోకి నెట్టిన సీఎం కిరణ్... ఏ శాస్త్రీయత ఆధారంగా ఒక్కో కాలేజీకి ఒక్కో ఫీజు నిర్ధారించారని ప్రశ్నించారు. ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క ఏడాదిలో ఫీజులు ఎందుకు మారుతున్నాయో ఎవరికీ అంతుపట్టని విషయంగా ఉందన్నారు. యాజమాన్య కోటా సీట్లు కూడా అండర్‌టేకింగ్‌లో అమ్ముకోవచ్చంటూ పచ్చజెండా ఊపిన ప్రభుత్వం ఎవరికి కొమ్ముకాస్తున్నట్లు అని అడిగారు. వీళ్లా మమ్మల్ని విమర్శించేవారంటూ దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఐదుసార్లు దీక్షలు చేసినట్లు తెలిపారు. పథకం సక్రమంగా అమలు చేయాలని తాము ఎంత డిమాండ్ చేసినా ఈ మొద్దు ప్రభుత్వంలో చలనం కలగడంలేదని నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే దళిత విద్యార్థిని వరలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తుచేసుకోవాలని హితవు పలికారు.

కౌన్సెలింగ్ ఎప్పుడో ఎవరికీ తెలియదు..
ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కావాల్సిన ఈ సమయంలో ఇప్పటిదాకా కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించే స్థితిలో కూడా ప్రభుత్వం లేదని విజయమ్మ విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో కౌన్సిలింగ్ పూర్తి చేసి తరగతులు ప్రారంభిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతోందని దుయ్యబట్టారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా నీట్, ఐఐటీ లాంటి వాటిల్లో రాష్ట్ర విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. నీట్, ఐఐటీ లాంటి ప్రవేశ పరీక్షలపై నిర్ణయం తీసుకునే అపెక్స్ బోర్డులో రాష్ట్రానికి చెందిన సభ్యులు లేకపోవడం వల్లే అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్రమంత్రివర్గంలో రాష్ట్రం నుంచి 13 మంది మంత్రులు, 30 మంది ఎంపీలు ఉండి కూడా అపెక్స్‌బోర్డులో సభ్యుడిని చేర్పించలేకపోయారన్నారు. కేంద్ర అనాలోచిత చర్యల కారణంగా రాష్ట్రానికి చెందిన వేలాది మంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఉన్న స్కూళ్లను మూసేస్తున్నారు..
కేంద్రం ప్రవేశపెట్టిన విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడమే లేదని విజయమ్మ విమర్శించారు. విద్యార్థులు లేరనే సాకుతో ఇప్పటిదాకా 1,850 స్కూళ్లను మూసేసిందని, పాఠశాలలో లోపాలను సరిచేయకుండా.. విద్యార్థులు లేరంటూ మూసేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఒక్క టీచర్‌తో నడుస్తున్న పాఠశాలలు ఐదారు వేలకు పైబడి ఉన్నాయని చెప్పారు. బీసీ విద్యార్థుల కోసం రాజశేఖరరెడ్డి దాదాపు 300 హాస్టళ్లను తీసుకొస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా మూసేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధ్వానంగా సంక్షేమ హాస్టళ్లు..
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని విజయమ్మ అన్నారు. బడ్జెట్‌లో సంక్షేమ హాస్టళ్ల నిర్వాహణ కోసం రూ.6,830 కోట్లు కేటాయించి కేవలం రూ.3,108 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మెస్‌చార్జీల విషయంలో కూడా అదే ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.8,600 కోట్లు కేటాయించామని ప్రకటించడమే తప్ప వాటిని ఖర్చుచేసింది లేదన్నారు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అధికారుల పరిస్థితి కూడా యథారాజా.. తథాప్రజా అన్నట్లు తయారైందన్నారు. ఈ ప్రభుత్వం వల్ల ఏ ఒక్క వర్గానికి మేలు జరగడంలేదని, వైఎస్ మరణం తర్వాత ఇప్పటి దాకా ఒక కొత్త ఇల్లు, తెల్లరేషన్‌కార్డు, పెన్షన్లు మంజూరు చేసిన దాఖలాలు లేవని చెప్పారు.

రైతులకు రాజశేఖరరెడ్డి ఇన్‌పుట్ సబ్సిడీ 300 శాతం పెంచితే, కిరణ్ ప్రభుత్వం అంతే శాతం తగ్గించిందన్నారు. ఈ ప్రభుత్వం ఓవైపు ఉన్న పథకాలకు తూట్లుపొడుస్తూ.. మరోవైపు రోజుకో కొత్త పథకం ప్రవేశపెడుతోందని మండిపడ్డారు. బంగారు తల్లి పథకం ప్రవేశపెట్టి దాన్ని కూడా ఆధార్‌కు లింక్ చేసి ఆంక్షలు విధించారన్నారు. రాష్ట్రంలో సగం మందికి ఆధార్ లేకపోతే పథకానికి ఎలా అర్హులు అవుతారని ప్రశ్నించారు. ఈ పాలకులకు పథకాలు ప్రవేశపెట్టడమే తప్ప వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాలన్న ఆలోచన లేదని విజయమ్మ అన్నారు. 

విద్యార్థులూ.. మీ ఫీజుల ఇబ్బందులు చెప్పండి!
ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయినా ప్రభుత్వం అలాంటిదేమీ లేదని చెబుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు తమ వివరాలను తెలియజేయాలని, అందుకోసం పార్టీ ఐటీ విభాగం ద్వారా ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించినట్టు విజయమ్మ ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థినీ, విద్యార్థులు తమ వివరాలను వెబ్‌సైట్ feesreimbursement@ ysrcongress.com కు మెయిల్ చేయాలని కోరారు.

కాలేజీలకు వెళ్లి చెప్పే ధైర్యం ఉందా?: శోభానాగిరెడ్డి
విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కల్పిస్తున్నామని ప్రకటిస్తున్న ప్రభుత్వానికి అదే విషయాన్ని కాలేజీలకు వెళ్లి చెప్పే ధైర్యం ఉందా? రీయింబర్స్‌మెంట్ అందరికీ అందితే వైఎస్ విజయమ్మ మూడుసార్లు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండుసార్లు దీక్ష చేయాల్సిన అవసరమేముంది? ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, సంతృప్త స్థాయిలో పింఛన్లు అంటే తానే గుర్తొచ్చేలా వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలు పెట్టారు. ఆ పేరును మరిపించే కుట్ర జరుగుతోంది. వైఎస్‌పై అభిమానం ఉందని చెప్తున్న ఉండవల్లి ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినపుడు ఎందుకు మాట్లాడలేదు? విచారణ పేరుతో 14 నెలలుగా జగన్‌ను జైల్లో ఉంచితే ఎందుకు మాట్లాడటం లేదు? సీబీఐ కాంగ్రెస్ పెంపుడు కుక్కలాగా మారిపోయింది. ఈ విషయాన్ని మేం చెప్పడం కాదు. యూపీఏ మిత్రపక్షాలే ఆరోపిస్తున్న విషయం ఉండవల్లి గమనించడం లేదా? 


షర్మిల పాదయాత్ర చూసి బొత్సకు నిద్ర పట్టడం లేదు: కొండా సురేఖ
పాదయాత్ర సమయంలో చూసిన కష్టాలకు స్పందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గానికి మేలుచేసే నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు తన ప్రజా వ్యతిరేక చర్యలతో వారు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి తీసుకెళ్తోంది. సమస్యల్లో విలవిలాడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. షర్మిల పాదయాత్ర కు విజయనగరం జిల్లాలో వచ్చిన స్పందన చూసి నిద్ర పట్టకపోవడంవల్లే పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా బొత్స తన స్థాయి ఏంటో నిరూపించుకుంటున్నారు. వైఎస్ మరణించిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలంటూ సంతకాల సేకరణ చేసింది బొత్స కాదా?

జగనన్న వస్తేనే బతుకులు బాగుపడతాయి

- కిరణ్ సర్కారుపై తమకు నమ్మకం పోయిందంటున్న జనం
- కష్టాలన్నీ షర్మిలకు చెప్పుకుంటున్న ప్రజానీకం
- జగనన్న వస్తేనే బతుకులు బాగుపడతాయని విశ్వాసం
- జగనన్న వస్తారని, రాజన్న రాజ్యం తెస్తారని భరోసా ఇస్తున్న షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘సర్కారుపై ప్రజలకు నమ్మకం పోయింది. రాజన్న ఉండుంటే ఇన్ని కష్టాలు ఉండేవి కాదు.. ఇప్పుడు ఆయన లేరు. జగనన్నే మమ్మల్ని ఈ కష్టాల కడలి నుంచి గట్టెక్కించాలమ్మా’ అంటూ ప్రజలు దివంగత మహానేత కుమార్తె షర్మిలను కలిసి వేడుకుంటున్నారు. వారికి షర్మిల ధైర్యం చెబుతూ ‘త్వరలోనే జగనన్న వస్తారు.. మనందరినీ రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తారు. మీకు మంచి రోజులు వస్తాయి’ అని భరోసా ఇస్తూ చిరునవ్వుతో ముందుకు సాగుతున్నారు. ప్రజల గోడు పట్టని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా షర్మిల ను కలిసిన పలువురు ప్రజలు తమ సమస్యలు చెప్పుకొన్నారు.


కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదు..
అంటిపేటలో రైతులు వెలమల దానబాబు, పైల నాగభూషణరావు షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘వెంగళరాయ సాగర్ నుంచి శివారు భూములకు చుక్క నీరు రావడం లేదమ్మా.. లచ్చయ్యపేట నుంచి నీరు ఇటు వచ్చేసరికే కాలువ ఎండిపోతోంది. చూడండమ్మా...అప్పట్లో సుజయ్ కృష్ణ రంగారావు ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఇచ్చిన నిధులతో మరమ్మతులు చేశారు. ఆ తరువాత దీన్ని పట్టించుకోనేలేదు. దీంతో 24,700 ఎకరాలకు నీరు అందాల్సి ఉన్నా అందడం లేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. అప్పట్లో మహానేత మరో ఐదువేల ఎకరాలకు నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయనే ఉండుంటే నీరు వచ్చేది. ఇప్పటి కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదమ్మా’’ అంటూ ఆవేదన చెందారు. దీనికి షర్మిల స్పందిస్తూ.. ‘‘కొన్నాళ్లు ఓపిక పట్టండన్నా.. మన రాజ్యం వస్తుంది.. మీ భూములన్నింటికీ నీళ్లు అందిస్తాం’’ అని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.
జగనన్నే దారి చూపించాలి..
కాశయ్యపేటలో షర్మిలను పాడి రైతులు కలిశారు. ‘‘మా ఊళ్లో పాడి సమృద్ధిగా ఉంది. అయినా ఆదాయం మాత్రం లేదు. పాలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడులు పెట్టలేక పశువులను అమ్ముకుంటున్నాం. డెయిరీకి రోజుకు వెయ్యి లీటర్ల పాలు ఇస్తున్నా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం లేదమ్మా. పశుగ్రాసం దొకరడం లేదు. దాణా ధరలు పెరిగాయి. అయినా ఏదో అలవాటు పడ్డ వృత్తికదా అని కొనసాగిద్దామంటే పశువుల కొనుగోలుకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాకైనా మాకు ఓ దారి చూపించండమ్మా’’ అంటూ మొరపెట్టుకున్నారు. ‘‘కొన్నాళ్లు ఓపిక పట్టండమ్మా.... అన్నీ సర్దుకుంటాయి. మీకు గిట్టుబాటు ధర వస్తుంది. ఆర్థికంగా స్థిరపడతారు’’ అని షర్మిల వారికి ధైర్యం చెప్పి భవిష్యత్‌పై నమ్మకం కలిగించారు.

17.5 కిలోమీటర్ల మేర యాత్ర..
పాదయాత్ర 214వ రోజు శుక్రవారం పార్వతీపురం నియోజకవర్గంలోని లచ్చయ్యపేటలో మొదలైంది. అంటిపేట, ఖాసాపేట, కాశయ్యపేట, పెదభోగిలి, చినభోగిలి, సీతానగరం, అప్పయ్యపేట, జోగింపేట, గుచ్చిమి, మరిపివలస, చిన్నరాయుడుపేట మీదుగా యాత్ర చేశారు. గుచ్చిమి, మరిపివలస, చిన్నారాయుడు పేటలో గ్రామస్తులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి షర్మిలకు ఆహ్వానం పలికారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఆమె ముందుకు సాగారు. చివరగా నర్సిపురంలో మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు. 

ఈ సందర్భంగా రోడ్డు కిక్కిరిసిపోయింది. పెద్ద ఎత్తున జనం వచ్చి షర్మిలతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. నర్సిపురం శివారులో ఏర్పాటు చేసిన బసకు షర్మిల రాత్రి ఎనిమిది గంటలకు చేరుకున్నారు. శుక్రవారం ఆమె మొత్తం 17.5 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్రలో పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు, పార్టీ నాయకులు ప్రసాదరాజు, కొయ్యప్రసాదరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు కొయ్యా న శ్రీవాణి, జమ్మాన ప్రసన్నకుమార్, గర్భాపు ఉదయభాను, నాయకులు కొత్తపల్లి గీత, ద్వారపురెడ్డి సత్యనారాయణ, భూపతిరాజు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

దీక్షకు పలు సంఘాల మద్దతు


 ‘పెద్ద చదువులు...పేదలందరి హక్కు!’ అనే నినాదంతో అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎలాంటి పరిమితులు లేకుండా వర్తింపజేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రెండు రోజులపాటు చేసిన నిరాహారదీక్షకు వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మద్దతు లభించింది. దీక్ష మొదలైనప్పటి నుంచీ ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా శిబిరానికి వేలాది మంది విద్యార్థులు కదం తొక్కుతూ వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. గురువారం ఉదయం ప్రారంభమైన దీక్ష శుక్రవారం సాయంత్రం ముగిసింది. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం పరిరక్షణకు జరుగుతున్న పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పేటెంట్ ఉందని తన దీక్ష ద్వారా విజయమ్మ చాటి చెప్పారు. ఫీజుల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విజయమ్మ గతంలో ఇదే విధంగా రెండేసి రోజుల పాటు రెండు దఫాలు దీక్షలు చేశారు.

మూడోసారి చేసిన దీక్షకు జంటనగరాలతో సహా పరిసరాల్లోని ఇంజనీరింగ్, ఇతర వృత్తి కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు భారీ సంఖ్యలో వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సామాన్య ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో విజయమ్మతో కలిసి దీక్షలో కూర్చున్నారు. పలు ప్రజా సంఘాల నేతలు శుక్రవారం కూడా వచ్చి ఫీజులు లేక లక్షలాది మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, రోజా, కూన శ్రీశైలం గౌడ్, జ్యోతుల నెహ్రూ, ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, జనక్‌ప్రసాద్, నందమూరి లక్ష్మీపార్వతి తదితరులు దీక్షా వేదికపై మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ నేతలు కొణతాల రామకృష్ణ, ఎం.వి.మైసూరారెడ్డి, కె.కె.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని వెంకట్రామయ్య(నాని), గొట్టిపాటి రవికుమార్‌తో సహా పలువురు ప్రముఖులు దీక్షా శిబిరాన్ని సందర్శించారు.

భారీగా బీసీల మద్దతు: పలువురు బీసీ సంఘాల నేతలు విజయమ్మను కలిసి తమ మద్దతు ప్రకటించారు. దీక్ష తొలి రోజునే రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తన అనుచరులతో తరలివచ్చారు. బీసీ యునెటైడ్ ఫ్రంట్ నాయకుడు పాలూరి రామకృష్ణయ్య, ఆరెకటిక సంఘం నాయకులు గురు చరణ్, సురేష్ , నాయీ బ్రాహ్మణ సంఘం, రాష్ట్ర వాయిద్య కళాకారుల సంఘం ప్రతినిధులు దీక్షకు వచ్చారు. మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి, ఆర్య వైశ్య సంఘం, నిరుద్యోగుల సంఘం ప్రతినిధులు కూడా దీక్షకు తరలి వచ్చి తమ మద్దతు ప్రకటించారు.

ఇంకెన్నాళ్లీ కుట్రలు ?

- ప్రజాకోర్టులో జగన్ ముమ్మాటికీ నిర్దోషే
- కృష్ణా జిల్లా జగయ్యపేటలో సాక్షి చైతన్యపథంలో వక్తలు 

సాక్షి, జగ్గయ్యపేట: ‘‘సీబీఐ ఉద్దేశపూర్వకంగానే కుట్ర చేస్తోంది. జగన్ బెయిల్ పిటీషన్ విచారణకు వచ్చినప్పుడలా ముందురోజు ఏదో ఒకరకమైన హడావుడి చేసి తీర్పును పరోక్షంగా ప్రభావితం చేయ టం వారి నైజంగా కనిపిస్తోంది. జగన్‌పై ఇంకెన్నాళ్లు ఈ కుట్రలు సాగిస్తారు’’ అని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటవాసులు ప్రశ్నించారు. ‘సాక్షి’ చైతన్యపథం శుక్రవారం జగ్గయ్యపేటలో జరిగింది. న్యాయవాదులు, విద్యావేత్తలు, మేధావులు పాల్గొన్న ఈ సదస్సుకు నాగరాజు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 

జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ పార్టీ ప్రారంభించాకే వేధింపులు అధికమయ్యాయని తెలిపారు. విచారణకు పిలిచి జగన్‌ను రాత్రికి రాత్రే అరెస్ట్ చేయటం వెనుక కాంగ్రెస్‌కు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శిం చారు. ఉపాధ్యాయ సమాఖ్య నేత ఎం. సత్యనారాయణ మాట్లాడుతూ గోదావరి కేజీ బేసిన్‌లో అక్రమా లు, ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు పలు సంస్ధలకు భూములు కట్టబెట్టడం, వోక్స్ వ్యాగ న్ కుంభకోణం ఇలా అనేకం ఉన్నా ఎందుకు వీటిని సుమోటోగా తీసుకోలేదని ప్రశ్నించారు.

విశ్రాంత ప్రభుత్వ సాంకేతిక అధికారి షేక్‌జిలానీ మాట్లాడుతూ సీబీఐ వింతపోకడలు అవలంబిస్తోం దన్నారు. జియాలజిస్ట్ ధరణికోట వెంకటరమణ మాట్లాడుతూ మొదట రూ.లక్ష కోట్లు, ఆ తర్వాత రూ.48వేల కోట్లు అవినీతి జరిగిందని, ఇప్పుడు రూ.30 కోట్లు అంటోందని, దీనిబట్టే తెలుస్తోంది దర్యాప్తులో ఎంత డొల్లతనం ఉందో అని మండిపడ్డారు. బీసీ యువజన సంఘ ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ గతంలో ఏ కేసులో వ్యవహరించని రీతిలో సీబీఐ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్ విజ యమ్మ చంద్రబాబుపై రెండువేల పేజీలతో కోర్టుకు ఫిర్యాదు చేస్తేఎందుకు కొట్టివేశారో అర్థం కాని ప్రశ్న గా మిగిలిపోయిందన్నారు. విశ్వభారతి కళాశాల కరస్పాండెంట్ కె.పద్మశేఖర్ మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో సీబీఐ కుట్ర సాగిస్తుందని ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.

సిక్కోలులో రేపటి నుంచి.. మరో ప్రజాప్రస్థానం

*** వీరఘట్టం మండలం కడకెల్ల వద్ద జిల్లాలోకి ప్రవేశం
*** ఇచ్ఛాపురం వరకు కొనసాగనున్న షర్మిల పాదయాత్ర
*** యాత్రను జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా ప్రజలు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ నెల 21న(ఆదివారం) జిల్లా లో ప్రారంభం కానుంది. తండ్రి దివంగత మహానేత వై.ఎస్. అడుగుజాడల్లో.. సోదరుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు ఆయన సోదరి షర్మిల చేపట్టిన ఈ సుదీర్ఘ పాదయాత్ర చివరి మజిలీ అయిన శ్రీకాకుళం జిల్లాలో ఆ రోజు నుంచి కొనసాగుతుందని వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభా పక్ష ఉపనేత ధర్మాన కృష్ణదాస్, ఆ పార్టీ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో సాగుతున్న షర్మిల పాదయాత్ర పార్వతీపురం నియోజకవర్గం మీదుగా ఆదివారం మధ్యాహ్నం వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామం వద్ద శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తుందని వారు పేర్కొన్నారు.

ఇచ్ఛాపురం వరకు కొనసాగే మరో ప్రజాప్రస్థానాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు సహకరించాలని కోరారు. వైఎస్‌కు, ఆయన కుటుంబానికి జిల్లా ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందేనని, అందుకనే వైఎస్‌ఆర్‌సీపీకి జిల్లాలో ఇంతటి ఆదరణ లభిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ తనయ షర్మిల తలపెట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో ముగియడం జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలు తమ సమస్యలను నేరుగా షర్మిలకు వివరించవచ్చునన్నారు.

జిల్లా ప్రజలకు ఏ కష్టం వచ్చిన తమ పార్టీ అండగా ఉంటోందని, షర్మిల యాత్ర ఉద్దేశం కూడా అదే అయినందున ప్రజలు ఈ ప్రభుత్వ పాలనలో ఎదుర్కొంటున్న కష్టాలను ఆమె దృష్టికి తేవాలని సూచిం చారు. గతంలో వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి కుటుంబానికి చేరాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో అవన్నీ ఒక్కొక్కటిగా చేజారిపోతున్నాయన్నారు. ఇలాంటి సమస్యలు తెలుసుకునేందుకే అలుపెరుగకుండా పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిలను మరింత ప్రోత్సహించేం దుకు పార్టీ సమన్వయకర్తలు, జిల్లా కమిటీ సభ్యులు, యువజన, విద్యార్థి విభాగాలు, పార్టీలోని ఇతర అన్ని విభాగాల ముఖ్యులు తరలిరావాలని, జిల్లాలోకి ప్రవేశించే సమయంలో ఆమె ఘన స్వాగతం పలకాలని వారు విజ్ఞప్తి చేశారు.

నర్సిపురం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర శనివారం నర్సిపురం నుంచి ప్రారంభమైంది. అనంతరం యర్రా కృష్ణమూర్తి కాలనీ మీదగా పార్వతీపురం చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. అనంతరం కొత్తవలస, ఉల్లిభద్ర జంక్షన్,సుంకి గ్రామాల మీదుగా షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. అయితే ఆమె చేపట్టిన పాదయాత్ర శనివారం 215వ రోజుకు చేరుకుంది.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 215వ రోజు(జిల్లాలో పదమూడవ రోజు) సాగే వివరాలను పాదయాత్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు శుక్రవారం ప్రకటించారు. శనివారం ఉదయం యర్రా కృష్ణమూర్తి కాలనీ, పార్వతీపురంలలో పాదయాత్ర చేసిన తరువాత పార్వతీపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కొత్తవలసలో పాదయాత్ర చేసి మధ్యాహ్న భోజన విరామం కోసం ఆగుతారు. విరామం తరువాత ఉల్లిభద్ర జంక్షన్, సుంకి గ్రామా ల్లో పాదయాత్ర చేసి రాత్రి బస చేస్తారు. 

జిల్లాలో పదమూడవ రోజు పర్యటించే ప్రాంతాలు
యర్రా కృష్ణమూర్తి కాలనీ, పార్వతీపురం, కొత్తవలస, ఉల్లిభద్ర జంక్షన్, సుంకి.

ఆదిలాబాద్ పర్యటనకు బయలుదేరిన విజయమ్మ

వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన

 హైదరాబాద్: అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయిం బర్స్‌మెంట్ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ రెండ్రోజులపాటు నిరాహార దీక్ష చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శనివారం ఆదిలాబాద్ జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల సందర్శనకు వెళుతున్నారు. శుక్రవారం ఫీజు దీక్ష వేదిక నుంచి విజయమ్మ మాట్లాడుతూ.. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, సంభవిస్తున్న వరదల కారణంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్ట పోయారన్నారు. ఈ ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు చొరవ తీసుకుని సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులకు అండగా నిలవాలని పిలుపు నిచ్చారు. తాను ఆదిలాబాద్ జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను సందర్శించనున్నట్లు చెప్పారు.

ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్ మండలం పెండల్‌వాడలో వరద బాధితులను ఆమె కలుసుకుంటారు. ఆదిలాబాద్, భోరజ్, తర్నా(బి) నిజాంపూర్, బాలాపూర్, సానాపూర్, లేఖర్‌వాడల మీదుగా పెండల్‌వాడకు విజయమ్మ చేరుకుంటారు. ఈ పర్యాటనలో ఆమె వెంట ఆ పార్టీ నేతలు కొండాసురేఖ, జనక్ ప్రసాద్ ఉన్నారు.

ఒక్కొక్కరికీ ఒక్కో ఫీజు ఎందుకు ?

Written By news on Friday, July 19, 2013 | 7/19/2013

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ చేపట్టిన రెండురోజుల ఫీజు పోరు శుక్రవారం సాయంత్రం ముగిసింది. విద్యార్థినులు ఆమెకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అంతకు ముందు ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. పథకాల అమలులో అది చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. కోతలు, మూసివేతలు విధానంతో ప్రభుత్వం నడుస్తోందని ఆమె విశ్లేషించారు.
శ్రీమతి విజయమ్మ ప్రసంగం ఆమె మాటల్లోనే.. ఫీజు రీయింబర్సుమెంటు రాని వారు feesreimbursment@ysrcongress.com కి పంపితే ప్రభుత్వానికి పంపుదాం. జగన్ బాబు త్వరలో బయటకి వస్తారు. ఆయన మీ అందరి గురించి ఆలోచిస్తున్నారు.

మహానేత కార్యక్రమాలు ఎక్కడ ఆగాయో ప్రతి గడపా చెబుతుంది
రాజశేఖరరెడ్డిగారిని ప్రేమించిన ప్రతి హృదయానికీ, జగన్ బాబును, షర్మిలను ఆదరించిన ప్రతి ఒక్కరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాజశేఖరరెడ్డిగారు అమలు చేసిన పథకాలు ఎక్కడ ఆగిపోయాయని ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎక్కడ ఆగిపోయాయో చెప్పమని ఏకంగా సవాళ్ళే విసురుతున్నారు. ఆ కార్యక్రమాల అమలు ఎక్కడనుంచి వచ్చయి, ఎక్కడ ఆగిపోయాయి అనే అంశాలకు సమాధానం గడప గడప నుంచి వినిపిస్తుంది. మహానేత సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాష్ట్రంలోని అందరి కష్టాలూ దగ్గర్నుంచి చూశారు. ఏ జిల్లాకు ఏంచేయాలి, ఏ మనిషికి ఏ సాయం చేయాలి అనే అంశంపై ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఎక్కడ ఏ ప్రాజెక్టు అవసరం, ఏ మనిషికి ఎక్కడ ఏది అవసరం, విద్యార్థికి ఏది అవసరం, వృద్ధులకు ఏది అవసరం అనేది ఆయన నిర్ణయించారు. వైయస్ అన్న పదమే రాష్ట్ర గతిని మార్చేసింది. రాజకీయాన్ని మలుపు తిప్పింది. రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది. ప్రజానాయకుడు ఎలా ఉండాలో మార్గదర్శకంగా నిలిచింది. పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు ఆయన హస్తం ఆపన్న హస్తమైంది. విద్యార్థులకు వరమైంది. వికలాంగులు, వితంతువులు, వృద్ధులను ఆయన హస్తం ఆదుకుంది. పేదలకు ఆరోగ్యశ్రీ సంజీవని అయ్యింది. ప్రసవ వేదన పడే వారికి, ఆపత్సమయంలో ఉన్నవారి ప్రాణాలను 108 కాపాడింది. 104 ఇంటింటా వైద్యం అందించింది. అక్కచెల్లెళ్ళను లక్షాధికారులనుచేయాలనే తలంపునుంచే పావలా వడ్డీ పథకం రూపొందింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు కింద ఆదుకోవడానికి ఆయన ఓ తండ్రిలా ఆలోచించారు. ఇలా చెప్పుకుంటే పోతే డజన్ల కొద్దీ పథకాలున్నాయి. ఎనిమిదిన్నర కోట్ల మందికి  సంక్షేమాన్ని, అభివృద్ధిని చేరువ చేశారు. తెలుగువాడు గర్వంగా తలెత్తుకునేలా వైయస్ అన్న పదం చేసింది.

ప్రతి గుండెలో రాజన్న కొలువయ్యారు 
రాజశేఖరరెడ్డిగారు ప్రతి గుండెలో ఉన్నారు. ప్రతి మనిషికీ ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి తెలుగువాడి గుండెలో ఆయన పదిలంగా ఉన్నారు. గ్రామాలకెడితే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్నవారు తమ గుండెలు చూపించి వైయస్ ఇక్కడున్నారని చూపిస్తున్నారు. ఫీజు రీయింబర్సుమెంటు పథకంతో చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. 

కేటాయింపులు ఘనం.. విడుదల స్వల్పం
రాజశేఖరరెడ్డిగారి మొదటి సంవత్సరం బడ్జెట్ 40వేల కోట్లు, రెండో సంవత్సరం లక్షా నాలుగువేల కోట్లు. కిరణ్ కుమార్ రెడ్డిగారు లక్షా అరవైవేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇంత బడ్జెట్లో విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు అమలుచేయలేరా అని అడుగుతున్నా. ఎందుకీ గందరగోళం. ప్రతి పేదవాడి పిల్లలు చదువుకుంటే వారిళ్ళో వెలుగులు నిండుతాయని రాజశేఖరరెడ్డిగారు ఆలోచించారు. ఎంత పెద్ద చదువైనా చదువుకోండని చెప్పారన్నారు. 28 లక్షల మందికి ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఆరోజు ఏ కొరతా లేదు. పేదల చదువును ప్రభుతవ బాధ్యతగా మహానేత భావించారు. ఇప్పుడు ఒక్కొక్కరికీ ఒక్కో ఫీజు ఎందుకు పెడుతున్నారు? వీళ్ళ చర్యలు అపహాస్యంగా ఉన్నాయి. పదివేల లోపు ర్యాంకు వచ్చిన వారికే ఫీజు రీయింబర్సుమెంటు అందుతుందని ఇప్పుడు ప్రభుత్వం చెబుతోంది. ఎస్సీ, ఎస్టీలకు కేంద్రం 70 శాతం ఇస్తుందనీ, మిగిలినది రాష్ట్రం ఇస్తుందనీ చెబుతున్నారు. ప్రస్తుతం సెల్పు ఫైనాన్సు కోర్సులకు ఇలా గే ఇస్తారట. ఒక డిగ్రీకీ, మరో డిగ్రీకి మధ్య చదువుకోడానికి ఎక్కువ వ్యవధి ఉండకూడదట. డిగ్రీ తరవాత ఒక్క పీజీకే అనుమతిస్తారట. ఆధార్ సంఖ్యతో ముడిపెడుతున్నారు. ఎమ్మార్వో పేదరికం ధ్రువపత్రం ఇవ్వాలట. ఎన్నో ఆంక్షలు, మెలికలు పెట్టి ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఈ పథకం ఉందా.. లేదా అనే అంశంపై తల్లిదండ్రులు,పిల్లలలో గందరగోళం నెలకొంది. ఏ కాలేజీలో ఎంత ఫీజు కట్టాల్సొస్తుందోఅని భయపడుతున్నారు. ఇలా కాకుండా ఏకమొత్తం కేటాయిస్తే గందరగోళం ఉండదు.  259 కళాశాలల్లో 35 వేలు ఫీజు పెట్టారు. దీనికి శాస్త్రీయత ఏమిటి? దీనికి ఏది ప్రాతిపదిక?  175 కళాశాలల్లో 35 వేల నుంచి లక్షా పదమూడు వేల రూపాయల ఫీజు పెట్టారు. 197 కాలేజీలకు 30 వేలు పెట్టారు. కారణం ఏమిటంటే  ఆ కాలేజీలు లెక్కలు చూపలేదనీ, సెప్టెంబరు 30లోగా ఆన్ లైన్ లో లెక్కలు చూపాలని వారిని ప్రభుత్వం కోరింది. వాళ్ళలో కొందరు కోర్టుకు వెళ్ళారు. ఏఎఫ్ఆర్‌సీ చెప్పినట్లు ఫీజులు కట్టించుకోమని కోర్టు చెప్పింది. యాజమాన్య కోటాలో రెట్టింపు ఫీజులు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. వీళ్ళెవరికి కొమ్ము కాస్తున్నారని అడుగుతున్నా. వాసవి కళాశాలలో లక్షా తొమ్మిది వేల రూపాయల ఫీజట. ఇంతే కాకుండా ఏటా ఫీజు మారుతోంది. రకరకాల కాలేజీలతో రకరకాల ఫీజులతో నడుస్తోంది. ఇన్ని సమస్యలు లేకుండా.. సక్రమంగా కాలేజీలకు ప్రభుత్వం ఫీజు చెల్లిస్తే యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళే అవసరమే లేదు. దీనివల్లే ఫీజులు రకరకాలుగా మారాయి. తనిఖీలు చేస్తామని చెప్పి, యాజమాన్యాలు ఇచ్చిన లెక్కల తంతుతో వాటిని ముగించారు. ఏ కాలేజీలో ఫీజులు ఏమేరకు తగ్గాయో తెలియడం లేదు. 639వ జీవో ప్రకారం కొత్త నిబంధనలను ప్రభుత్వం విధించింది. 2013-14లో వచ్చిన 14 లక్షల మందికి ఫీజు కట్టడానికి నూరు కోట్ల రూపాయలవుతుంది. దాన్ని కూడా చేయలేదు. కొందరికి మాత్రమే చెల్లించారు. ఉపకార వేతనాలు, మెస్ చార్జీలు సక్రమంగా చెల్లించడం లేదు. కేటాయింపులు భారీగా చూపుతూ, నిధుల విడుదలలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. 2012-13లో నాలుగు వేల కోట్ల రూపాయలైతే.. 2085కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలినది 500 కోట్లనుకుంటే వెయ్యి కోట్లు మాత్రమే మిగిలింది. 

కొత్త వారికి ఈ ఏడాది ఇంతవరకూ కౌన్సిలింగు కూడా ఎందుకు మొదలుకాలేదు. పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే కళాశాలలు మొదలయ్యాయి. ప్రభుత్వ చేతగానితనం వల్లే ఇలా జరుగుతోంది. రాజశేఖరరెడ్డిగారు చేసి చూపించారు. ఆయన ఇచ్చిన విద్యార్థుల సంఖ్యను రానురాను కోతలు పెడుతూ తగ్గిస్తున్నారు. చివరికి ఇది నామమాత్రంగా మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. 

ఎన్ఐటీ, ఐఐటి, సీబీఐటీల్లో 2012 వరకు జేఈఈ నిబంధనల ప్రకారం పరీక్ష రాస్తే సరిపోయేది. అప్పటినుంచి ఇంటర్ మార్కుల వెయిటేజీ పరిగణలోకి తీసుకుంటామని కొత్త నిబంధన అమలులోకి తెచ్చారు. ఎపెక్సు బోర్డులో మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేదు. సభ్యత్వం ఉన్న మహారాష్ట్రకు ఇంటర్లో 68శాతం వెయిటేజీ తీసుకుంటామని చెప్పారు. నాగాలాండ్లో 41 శాతం తీసుకుంటారట. మన రాష్ట్రంలో మాత్రం 81.8% మార్కులు రావాలట. మనకెందుకు ఇంత పెర్సటేంజి? ఈ రాష్ట్రంలో 31మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మనకి అన్యాయం జరుగుతుంటే వారంతా ఏం చేస్తున్నారు? ఎపెక్సు బోర్డులోమనకెందుకు సభ్యత్వం లేదు. ప్రతి చోట మనకు నష్టమే జరుగుతోంది. కేటాయింపులుంటాయి కానీ విడుదల ఉండదు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు 6838కోట్లు కేటాయించామని చెప్పి, ఖర్చు పెట్టినది మాత్రం 3128 కోట్లే. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్లో 8600 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇంతవరకూ టెండర్లను పిలవలేదు. ఏ అంశంపైనా సరైన పర్యవేక్షణ లేదు.. చిత్తశుద్ధి లేదు. అధికార యంత్రాంగం కూడా అలాగే వ్యవహరిస్తోంది. 

పింఛన్లు పెరిగింది లేదు

పింఛన్ల విషయానకి వస్తే చంద్రబాబు గారి హయాంలో 16 లక్షల మందికి ఇస్తే రాజశేఖరరెడ్డిగారి హయాంలో 78 లక్షల మందికి ఇచ్చారు. అందులో ఎనిమిదిన్నర లక్షల మంది మరణించారు. అయినా కూడా కొత్తవారికి పింఛన్లు ఇవ్వలేదు. రాజశేఖరరెడ్డి గారి హయాంలో వెంటనే కొత్తవారికి ఇచ్చేవారు. చంద్రబాబు హయాంలో మాదిరిగానే ఇప్పుడు పరిస్థితి ఉంది. ఏ వర్గానికి న్యాయం చేసే పరిస్థితి లేదు. బంగారు తల్లి పథకం పెట్టి దానిని ఆధార్ కార్డుకు అనుసంధానం చేశారు. కానీ సగం మందికి ఆధార్ లేదు. ప్రతి అంశంలోనూ ఇలా ఉంది. కేంద్రం చేసిన ప్రాథమిక విద్యా హక్కు చట్టం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తరువాత రాష్ట్రంలో 1850 పాఠశాలలను మూసేశారు. పదిమంది కంటే తక్కువ విద్యార్థులున్నారని సాకు చెబుతోందీ ప్రభుత్వం. పిల్లల్ని తల్లిదండ్రులు ఎందుకు పంపడం లేదో తెలుసుకుని పరిష్కారం కనుగొనాలి తప్ప మూసివేయడం తగదు. 

చట్టాలకు విలువేది

చేసిన చట్టాలకు విలువలేకుండా పోతోంది. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇరవై వేలు, ఒక్క టీచరూ లేనివి  అయిదారువేలున్నాయి. టాయిలెట్లు, భవనాలు లేని స్కూల్సున్నాయి. వీటన్నింటినీ ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్మో చేపట్టవచ్చు కదా. ఎక్కడికక్కడ మూసేయడమో లేదా కోత పెట్టడమో ప్రభుత్వం చేస్తోంది. ఆహార భద్రత పథకం ఇంతవరకూ లేదు. రెండు రూపాయల కిలో బియ్యం పథకంతో రాజశేఖరరెడ్డిగారు ఎంతోమందికి అన్నంపెట్టారు. అన్నీ చట్టాలు చేస్తున్నారు తప్ప అమలులోకి రావడం లేదు. ప్రస్తుతం ఎవరికీ న్యాయం చేయడంలేదు. ఫీజు రీయింబర్సుమెంటు మీద ఐదో సారి దీక్ష చేశామన్నారు. మొదటిసారి జగన్మోహన్ రెడ్డిగారు వారంరోజులు దీక్ష చేశారు. ఎందుకలా అని అడిగితే నేను వారం రోజులు అన్నం తినకపోతే నష్టంలేదనీ, విద్యార్థులకు ఎంతోకొంత మేలు జరిగితే చాలనీ చెప్పారన్నారు. 

http://www.ysrcongress.com/news/top_stories/ys-a-faith-and-assurance.html

బొత్స సప్లయర్‌గా పని చేశారా?: కొండా సురేఖ

వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సమయంలో చూసిన కష్టాలకు స్పందించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గానికి మేలుచేసే నిర్ణయాలు తీసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఫీజు పోరు దీక్షలో ఆమె మాట్లాడారు. ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతున్న ప్రభుత్వం వారిని ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి తీసుకెళ్తోందని విమర్శించారు. సమస్యల్లో విలవిలాడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతోందన్నారు. విద్యార్థుల చదువులు గాలిలో దీపంలా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

వైఎస్ఆర్ పై బొత్స చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందిస్తూ... '3000 కిలోమీటర్ల యాత్ర పూర్తిచేసిన షర్మిలపై ఆరోపణలు చేసేవారికి బుద్ధి ఉండాలి. షర్మిల పాదయాత్ర కు జిల్లాలో వచ్చిన స్పందన చూసి నిద్ర పట్టకపోవడంవల్లే పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆరోపణలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న మద్యం షాపుల వల్ల ప్రజలు నష్టపోతున్నారని షర్మిల చెప్పినదానిపై అలాంటి ఆరోపణలు చేయవచ్చా? బ్రదర్ అనిల్‌కు చేసిన సహాయం గురించి ఆయన్నే అడగండని చెప్పే బదులు చేసిన సహాయం ఏంటో బొత్స ఎందుకు చెప్పట్లేదు? వైఎస్‌పై వ్యక్తిగత విమర్శలు చే యడం ద్వారా బొత్స తన స్థాయి ఏంటో నిరూపించుకుంటున్నారు. 

తాగే అలవాటు మగవారికి ఉంటే వారు ఇంట్లో తాగుతారు. వైఎస్ అలా తాగి ఉంటే ఆ సమయంలో బొత్స అక్కడ ఎందుకు ఉన్నారు? 365 రోజులు తాగేవారు అని చెప్తున్న బొత్స అన్ని రోజులు వెంట ఉన్నారంటే అక్కడ సప్లయర్‌గా పనిచేసేవారా? బొత్స పనుల వల్ల ‘కేబినెట్‌లో అవినీతి మంత్రి’ అని వైఎస్ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం మరిచినట్లున్నారు. వైఎస్ మరణించిన తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలంటూ సంతకాల సేకరణ కోసం మంత్రుల క్వార్టర్‌లోని తన నివాసానికి పిలిచి బ్రేక్‌ఫాస్ట్ పెట్టి మరీ బొత్స అప్పుడు మంత్రులుగా ఉన్న మాకు చెప్పలేదా? ఇవన్నీ మరిచి బొత్స విమర్శలు చేయడం వింతగా ఉంది' అని కొండా సురేఖ అన్నారు.

YS Vijayamma Slams Rulers

పాలకులు కళ్లు తెరవాలి: వైఎస్ విజయమ్మ

కిరణ్ ఏలుబడిలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం నామమాత్రంగా తయారయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. లక్షలాది మంది పేదలకు లబ్ది చేకూర్చే ఈ పథకాన్ని అర్థంలేని ఆంక్షలతో కాంగ్రెస్ సర్కారు గందరగోళంలో పడేసిందని ఆమె అన్నారు. ఇందిరా పార్క్ వద్ద 48 గంటల పాటు చేపట్టిన ఫీజు పోరు దీక్షను ఆమె ముగించారు. ఆ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. 

పాలకుల మొద్దు కారణంగా విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేయాల్సిన పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మంజూరులో మాత్రం చేతివాటం చూపుతోందని విజయమ్మ ఆరోపించారు. ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజీలకు కౌన్సెలింగ్ నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాష్ట్రంలో 4 వేల ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు మూసివేసే పరిస్థితి నెలకొందన్నారు. 

వైఎస్సార్ పైసా పన్ను విధించకుండా సంక్షేమ పథకాలు అమలు చేశారని విజయమ్మ గుర్తు చేశారు. ప్రతి మనిషికి భరోసాయిచ్చారని తెలిపారు. తెలుగువారందరి గుండెలో ఆయన ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లిన వైఎస్సార్ అమలు చేసిన పథకాల గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. వైఎస్ అంటే ఓ నమ్మకం, ఓ భరోసా అని పేర్కొన్నారు. వైఎస్సార్ పేరు రాజకీయాలకు కొత్త అర్థం చెప్పిందన్నారు. 

జగన్ త్వరలోనే బయటకు వస్తాడని విజయమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జై జగన్ అంటూ అభిమానులు, కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేయడంతో సభాప్రాంగణం హోరెత్తింది. ఈ నినాదాలు పాలకులకు వినబడి కళ్లు తెరవాలని అన్నారు. దీంతో ముందుంది మంచికాలం అంటూ విజయమ్మ భరోసా ఇచ్చా - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=638242&Categoryid=14&subcatid=0#sthash.xwA2C6iK.dpuf

YS Vijayamma 2nd Day Fee Deeksha

కుట్రతోనే జగన్‌కు బెయిల్ నిరాకరణ

- టాడా కేసుల్లోని వ్యక్తులకూ బెయిల్ ఇచ్చారు
- ఫెరా కేసుల్లోనూ 180 రోజుల్లోనే బెయిల్ 
- గుడివాడలో ‘సాక్షి’ చైతన్యపథంలో వక్తలు 

సాక్షి, గుడివాడ: టాడా కేసుల్లోని వారికి బెయిలిచ్చారు.. ఫెరా చట్టం వర్తించే కేసుల్లో కూడా బెయిల్ వస్తుంది. ఈ కేసుల్లో నిందితుడు దరఖాస్తు చేయకుండానే 180 రోజుల్లో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తారు. దేశంలో పెద్దపెద్ద నేరాలు చేసిన వ్యక్తులకు కూడా నిర్ణీత కాలవ్యవధిలో బెయిల్ వస్తున్నది. రాష్ట్రంలో అనూహ్య ప్రజాభిమానం ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ ఎందుకు మంజూరు కావడం లేదు. దీంతో ఆయనపై ఏ స్థాయిలో కుట్ర జరిగిందో ప్రతి ఒక్కరికీ అర్థమవుతూనే ఉంది. కాంగ్రెస్ ఆడుతున్న ఈ రాక్షసక్రీడను తమ ఓటుతో తిప్పికొట్టి జగనన్నను జనం మధ్యకు తీసుకువస్తామంటూ గుడివాడవాసులు శపథం చేశారు.

గురువారం కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో ఉన్న సహకారభవన్‌లో ‘సాక్షి చైతన్య పథం’ జరిగింది. నాగరాజు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సదస్సులో పట్టణానికి చెందిన మేధావులు, న్యాయవాదులు, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, యువత పెద్దసంఖ్యలో పాల్గొని తమ భావావేశాల్ని వ్యక్తం చేశారు. గుడివాడ బార్ అసోసియేషన్ కార్యదర్శి కె.మురళి మాట్లాడుతూ, దేశ సర్వోన్నత న్యాయస్థానం మందలించినప్పటికీ సీబీఐ తీరులో ఏ మాత్రం మార్పు రాలేదన్నారు. అధికారపార్టీలు సీబీఐని రాజకీయ అస్త్రంగా మార్చుకుని ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్నాయన్నారు. 

ఈ వేధింపులు జగన్ విషయంలో పరాకాష్టకు చేరాయన్నారు. పెట్టుబడుల కేసులో అన్నీ డాక్యుమెంటరీ అధారాలే ఉంటాయని, అలాంటప్పుడు సాక్ష్యాలు, సాక్షులను జగన్ ప్రభావితం చేస్తారని వాదిస్తూ బెయిల్‌ను అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. సీనియర్ న్యాయవాది నీలం బెంజిమెన్ మాట్లాడుతూ, కేవలం అభియోగాల ఆధారంగా జగన్‌ను 14 నెలలుగా జైలుతో బంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైద్యులు మలిరెడ్డి రవి మాట్లాడుతూ, ప్రజాభిమానం ఉన్న జగన్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకే అన్యాయంగా జైలులో నిర్బంధించారని ధ్వజమెత్తారు. రిటైర్డ్ టీచర్ ఏలేటి విలియం జోషి మాట్లాడుతూ, జగన్‌కు జరిగిన అన్యాయం, సీబీఐ తీరుపై జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. మెనార్టీ సంక్షేమ నేత షేక్ గౌస్ మాట్లాడుతూ, వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందుల పాల్జేస్తున్న కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గృహిణి బి. ఇంద్రాణి మాట్లాడుతూ, కుళ్లిన రాజకీయ వ్యవస్థలో ప్రజల కష్టాలు చూసి వారి పక్షాన నిలిచినందుకే జగన్‌ను జైలు పాల్జేశారన్నారు.

ఇలాంటి వారికి మళ్లీ ఎందుకు ఓటేయాలి?

- ఈ పాలకులు వైఎస్ పెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తున్నారు 
- బొబ్బిలి బహిరంగ సభలో షర్మిల ధ్వజం
- ఉచిత విద్యుత్‌ను కుదించినందుకు ఓటేయాలా?
- ఫీజు రీయింబర్స్‌మెంటుకు ఆంక్షలు పెట్టి విద్యార్థుల జీవితాలతో బేరాలాడుతున్నందుకా?
- రైతులకు తగిన మద్దతు ధరలు ఇవ్వనందుకా?
- పక్కా ఇళ్లు, పెన్షన్లు ఇవ్వనందుకా?
- ప్రజలపై రూ.32 వేల కోట్ల కరెంటు చార్జీలు మోపినందుకు ఓటేయాలా?
- కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు
- ఇలాంటి సర్కారును సాగనంపాల్సిన చంద్రబాబు వాళ్లతో కుమ్మక్కయ్యారు 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, కర్షకులు, కార్మికులు, పేదలు అందరూ కష్టాలు అనుభవిస్తున్నారని, ఎవరికీ సంతోషం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ఈ ప్రభుత్వం పట్ల రాష్ట్రంలో ఎవరికీ విశ్వాసం లేదని అన్నారు. ‘‘ఈ పాలకులు వైఎస్ పెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తున్నారు. విద్యుత్, ఆర్టీసీ, రిజిస్ట్రేషన్ చార్జీలు, ఎరువుల ధరలను అడ్డగోలుగా పెంచుతున్నారు. అసలు ప్రజలపై పగబట్టిందా? అన్నట్లుంది ఈ సర్కారు వైఖరి. 

ఈ కాంగ్రెస్ నేతలు తమకు ఓటేయాలంటూ మీ ముందుకు వస్తారు. ఇలాంటి వారికి మళ్లీ ఎందుకు ఓటేయాలి? వీరు నాలుగేళ్లలో ఒక్కసారైనా ప్రజల గురించి ఆలోచించారా? కరెంటు చార్జీల పేరుతో అడ్డగోలుగా 32 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపినందుకు ఓటేయాలా? ఎరువుల ధరలు 300 నుంచి 800 శాతం పెంచినందుకా? ఉచిత విద్యుత్‌ను 4, 3 గంటలకు కుదించినందుకా? పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినా మద్దతు ధర పెంచనందుకు ఓటేయాలా?’’ అని ఆమె ప్రశ్నించారు. ప్రజల్ని గాలికి వదిలేసిన ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా ఆమె గురువారం బొబ్బిలి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

నాలుగేళ్లు గడిచిపోతున్నా వాగ్దానాలు నిలబెట్టుకోలేదు: 
‘‘ఈ ప్రభుత్వం సరిగా కరెంటు ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో 20 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. అందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా? ఆరోగ్యశ్రీ నుంచి 133 వ్యాధుల తొలగించారు. 97 ఆస్పత్రులనూ తొలగించారు.. అందుకు ఓటేయాలా? 104 కనబడకుండా పోయినందుకా? పక్కా ఇళ్ల పథకానికి పాడి కట్టినందుకా? ఒక్క కొత్త రేషన్‌కార్డూ ఇవ్వనందుకా? కనీసం ఒక కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయనందుకా? ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికి ఆంక్షలు పెట్టి విద్యార్థుల జీవితాలతో బేరాలాడుతున్నందుకు ఓటేయాలా? 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని, 30 కిలోల బియ్యమిస్తామని మేనిఫెస్టోలో వాగ్దానాలు ఇచ్చి.. నాలుగేళ్లు గడచిపోతున్నా సిగ్గులేకుండా మాట నిల బెట్టుకోనందుకు ఓటేయాలా? అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఈ నాయకులు ఏ మొఖం పెట్టుకుని అడుగుతున్నారు?’’ అని షర్మిల నిలదీశారు. ప్రజలకు ఏమీ చేయని కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని దుయ్యబట్టారు.

సర్కారుకు చంద్రబాబు అండ..
‘‘ప్రజలను ఇన్ని రకాలుగా వేధిస్తున్న ప్రభుత్వాన్ని సాగనంపే ఉద్దేశంతో అన్ని ప్రతిపక్ష పార్టీలూ అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు కాంగ్రెస్‌ని రక్షిస్తూ వస్తున్నారు. అవినీతి వ్యవహారాల్లో తనపై కేసులు పెట్టకుండా ఉండేందుకుగాను ఆయన కాంగ్రెస్‌ని కాపాడుతున్నారు. ఈయన తీరు చూస్తుంటే రాబందులు రాజ్యం చేస్తుంటే.. గుంట నక్కలు తాళం వేస్తున్నట్లు ఉంది’’ అని షర్మిల మండిపడ్డారు. వైఎస్ మీద అభిమానంతో పలువురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే వాటిని మార్చిలోగా ఆమోదించకుండా జూన్‌కు వాయిదా వేశారని, ఉప ఎన్నికలు వస్తే ఓడిపోతామన్న భయంతోనే ఇలా చేశారని షర్మిల అన్నారు.

ఉప ఎన్నికలను కూడా ఎదుర్కొనలేని వీళ్లు ఓ నాయకులా? అని ప్రశ్నించారు. ‘‘జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేక కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఆయన్ను అక్రమంగా జైల్లో పెట్టించాయి. దేవుడున్నాడు. త్వరలోనే జగనన్న బయటికి వచ్చి రాజన్న రాజ్యం తెస్తాడు. విలువలు, విశ్వసనీయత గల ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అప్పుడు జగనన్న పేదలందరికీ పక్కా ఇళ్లు, వృద్ధులు, వితంతువులకు రూ.700, వికలాంగులకు రూ.1,000 పెన్షన్ అందిస్తారు. వైఎస్సార్ అమ్మ ఒడి పథకం కింద పిల్లలు చదువుకుంటే తల్లిదండ్రులకు ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తారు. పదోతరగతి వరకూ నెలకు రూ.500, ఇంటర్ చదివితే రూ.700, డిగ్రీవారికి రూ.వెయ్యి చొప్పున తల్లి ఖాతాలో వేస్తారు. మహిళలు, రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తారు’’ అని భరోసా ఇచ్చారు.

15.3 కిలోమీటర్ల పాదయాత్ర: పాదయాత్ర 213వ రోజు గురువారం బొబ్బిలి నియోజకవర్గం రొంపిల్లిలో పాదయాత్ర ప్రారంభించిన షర్మిల.. పారాది, సీతారాంపురం, మెట్టవలస, బొబ్బిలి మీదుగా యాత్ర చేశారు. బొబ్బిలిలో పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తర్వాత లచ్చయ్యపేట మీదుగా యాత్ర చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు.

గురువారం ఆమె మొత్తం 15.3 కిలో మీటర్లు నడిచారు. దీంతో 2,850.9 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. ఈ కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు, పార్టీ జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు, పార్టీ సీజీసీ సభ్యుడు కొణతాల రామకృష్ణ, పార్టీ నేతలు ప్రసాదరాజు, బేబీ నాయన, దాడి వీరభద్రరావు, గండి బాబ్జీ, తిప్పల నాగిరెడ్డి, గద్దె బాబూరావు, కొయ్య ప్రసాదరెడ్డి, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, బోకం శ్రీనివాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. 

గాంధేయవాదమా? బ్రాందేయవాదమా?
‘‘నేను పాదయాత్రలో ఉండగా ఓ రోజు పన్నెండేళ్ల కుర్రాడు నాతోబాటు చెప్పుల్లేకుండా నడిచాడు. చెప్పులేస్కోలేదేం తమ్ముడూ.. మీ అమ్మా, నాన్నా ఏం చేస్తుంటారు అని ప్రశ్నిస్తే ‘అక్కా మా అమ్మానాన్నా ఇద్దరూ కూలికి వెళ్తారు. అయితే మా నాన్న అమ్మను కొట్టి కూలీ డబ్బులు లాక్కుని తాగేస్తాడు. తాగొచ్చి మళ్లీ కొడతాడు. ఇంట్లో డబ్బుల్లేవు.. అందుకే చెప్పులు వేసుకోలేదక్కా’ అని చెప్పాడు. ఇది విన్నాక నాకు చాలా బాధ వేసింది. ఈ విషయం ఎన్నిసార్లు గుర్తొచ్చిందో తెలీదు. ఈ పాలకులు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. గాంధీ వారసులమని, గాంధేయవాదులమని చెప్పుకుంటూ బ్రాందేయవాదాన్ని అమలు చేస్తున్నారు.’’ - షర్మిల

ఏకగ్రీవ సర్పంచులను తన్నుకుపోయేందుకు టీడీపీ, కాంగ్రెస్ కుయుక్తులు

- ఏకగ్రీవ సర్పంచులను తన్నుకుపోయేందుకు టీడీపీ, కాంగ్రెస్ కుయుక్తులు
- ‘పై చేయి’ కోసం టీడీపీ, కాంగ్రెస్ పడరాని పాట్లు 
- సర్పంచుల సంఖ్య పెంచుకోవడానికి పన్నాగాలు 
- భారీ నజరానాలు చూపుతూ గాలం వేస్తున్న వైనం
- వైఎస్సార్‌సీపీ సహా ఇతర పార్టీల వారినీ లాక్కునే యత్నం
- నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల మకాం
- ఎలాగైనా మనవైపునకు తిప్పుకోండి: నేతలకు బాబు హుకుం 

సాక్షి, హైదరాబాద్: ఇప్పటిదాకా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో కలిసిమెలిసి రాజకీయాలు చేస్తున్న అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం.. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో తామే పైచేయి సాధించామని చెప్పకునేందుకు నానా కుయుక్తులకు తెర తీస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన క్షణం నుంచే పరస్పర సహకార ధోరణిలో వెళ్లేలా అవి వ్యూహాన్ని రూపొందించుకోవడం తెలిసిందే. ఆ మేరకు ముందే ఒప్పందానికి వచ్చి మరీ పంచాయతీలవారీగా ఉమ్మడి అభ్యర్థిని నిలబె ట్టడం, పోటీ తప్పదనుకునే చోట్ల ఓట్లు చీలకుండా డమ్మీ అభ్యర్థులను బరిలో నిలపడం వంటి ప్రయత్నాలు చేశాయి. కానీ ఏం చేసినా ఏకగ్రీవ పంచాయతీల్లో వారికి అనుకున్న ఫలితం దక్కలేదు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని చెప్పే కుట్రలో భాగంగా ఏకగ్రీవమైన వారిని తమ ఖాతాలో వేసుకోబోయి ఇరు పార్టీలూ భంగపడ్డాయి. ఏం చేసినా ఏకగ్రీవాల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగడంతో ఇప్పుడవి మలి విడత కుట్రలకు తెరతీశాయి. ఏకగ్రీవంగా గెలిచిన స్వతంత్రులందరినీ తమవైపు తిప్పుకోవడానికి శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తున్నాయి. ఇందుకు పెద్దఎత్తున కసరత్తు చేసినట్టు ఆయా పార్టీల నేతలే చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకవైపు, టీడీపీ నేతలు మరోవైపు ఇందుకోసం ఇప్పటికే జిల్లాల్లో మకాం వేశారు.

స్వతంత్రులకు గాలం వేసే పనిలో పడ్డారు. భారీగా ముట్టజెప్పి వారిని తమ పార్టీ ఖాతాలో వేసుకునే పనులకు జోరు పెంచారు. అభ్యర్థులకు ఫోన్లు చేసి మరీ తమ పార్టీకి మద్దతుగా నిలవాలని, భారీ నజరానాలిస్తామని బుజ్జగిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో స్వయంగా ముఖ్యమంత్రి కిరణే ఎమ్మెల్యేలను, మంత్రులను ఇందుకు పురమాయించినట్టు తెలిసింది. అందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా వారికి సూచిస్తున్నట్టు సమాచారం. ఏం చేసైనా ఏకగ్రీవం లెక్కలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండేలా వాటిని భారీగా మార్చాల్సిందేనని వారికి కిరణ్ లక్ష్యం నిర్దేశించారట. అందుకోసం ఒక్కో ప్రాంత సర్పంచుకు ఒక్కో రేటును కూడా అధికార పార్టీ నిర్ధారించినట్టు చెబుతున్నారు. స్వతంత్రులకే గాక, వైఎస్సార్‌సీపీతో పాటు ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన వారికి కూడా కాంగ్రెస్, టీడీపీ గాలమేస్తున్నాయి. ఏకగ్రీవాల్లో దెబ్బ తినడంతో ఎన్నికలు జరిగే పంచాయతీల్లోనైనా ‘పై చేయి’ సాధించేలా కుమ్మక్కుకు మళ్లీ తెర తీశాయి.

బాబు ఫోను పురమాయింపులు: మొత్తం వ్యవహారాన్ని బాబు తన కనుసన్నల్లో నడిపిస్తున్నారు. ఒకే నామినేషన్ పడ్డ గ్రామాల వివరాలను తెప్పించుకుని, వాటిల్లో సింహభాగం టీడీపీవేనంటూ ఆయన జోరుగా లీకులిచ్చారు. 599 సర్పంచ్ స్థానాలను టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుందంటూ పత్రికలకు ఈ-మెయిళ్లు పంపి హడావుడి చేశారు. కానీ వాస్తవాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉండటంతో కంగుతిన్న బాబు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాల్లో మంచి ఫలితాలు సాధించామనే సంకేతాలను ప్రజల్లోకి పంపకపోతే టీడీపీ భవితవ్యంపై నీలినీడలు ఖాయమని భావించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన స్వతంత్రుల వివరాలను తెప్పించుకున్నారు. బుధ, గురువారాల్లో పార్టీ నేతల తో సుదీర్ఘంగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఎంత ఖర్చు చేసైనా సరే వారిని టీడీపీకేసి తిప్పుకోవాల్సిందిగా పురమాయించారు. ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతల్లో ఉన్న టీడీపీ నేతలంతా అదే పనిలో ఉన్నారు. అయితే స్వతంత్ర సర్పంచ్‌లు తమ ఎన్నికల ఖర్చు కంటే ఎక్కువగా ముట్టజెప్పాలని డిమాండ్ చేస్తున్నట్టు పలువురు టీడీపీ నేతలు బాబుకు వివరించడంతో, ‘‘మన కోటరీ ముఖ్యుల ‘ఆర్థిక’ సాయంతో ప్రతి అసెంబ్లీ స్థానం పరిధిలోనూ ఎక్కువ మంది సర్పంచులు టీడీపీ ఖాతాలోనే ఉండేలా చూడండి’’ అంటూ ఆదేశించినట్టు సమాచారం!

ఎన్నికలు జరిగే చోటా...: ఎన్నికలు అనివార్యమైన పంచాయతీల్లో టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కొనసాగుతోంది. గెలిచే అవకాశమున్న బయటి అభ్యర్థులను ఎలాగోలా తమవైపు ఆకర్షించే పనుల్లో అవి తలమునకలయ్యాయి. మంత్రులు జిల్లాల్లోనే మకాం వేసి మంతనాల్లో మునిగి తేలుతున్నారు. 

రుజువులివిగో...
నవ్విపోదురు గాక...: మహబూబ్‌నగర్ నియోజకవర్గం హన్వాడ మండల కిష్టంపల్లి పంచాయతీ సర్పంచ్‌గా సరోజ, ఉప సర్పంచ్‌గా వెంకటయ్య వైఎస్సార్‌సీపీ మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన కాంగ్రెస్ మద్దతుతోనే గెలిచారంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పారు. కానీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మాత్రం వాటిని ఖండించారు. తాము వైఎస్సార్‌సీపీ మద్దతుతోనే గెలిచామని పార్టీ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు.
నానా ప్రలోభాలు...: తూర్పుగోదావరి జిల్లాలో పశుసంవర్ధక మంత్రి పినిపే విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం నియోజకవర్గం నడిపూడి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికైన బి.ఆదినారాయణను కాంగ్రెస్ వైపు తిప్పుకున్నారు. ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి, అల్లవరం మొగళ్లమూరు సర్పంచ్‌లనూ ఇలాగే ఒత్తిడి చేస్తున్నారు. ఖమ్మం జిల్లా దమ్మాయిగూడెం పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవమైన వైఎస్సార్‌సీపీ నేత దేవళ్ల జ్యోతిని కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఒత్తిడి చేస్తున్నారు.

నాది వైఎస్సార్‌సీపీయే: తాను వైఎస్సార్‌సీపీ నేతనని, ఆ పార్టీ మద్దతుతోనే ఏకగ్రీవంగా గెలిచానని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొత్తపూసలమర్రు సర్పంచ్ బస్వాని చంద్రరావు వివరించారు. కానీ టీడీపీ, కాంగ్రెస్ నేతలు తమ పార్టీ తరఫున గెలిచినట్టుగా చెప్పాలంటూ ప్రలోభపెడుతున్నారని తెలిపారు. ఉణుదుర్రు సర్పంచ్ దాట్ల పర్వత వర్ధనమ్మ కూడా తాను వైఎస్సార్‌సీపీ మద్దతుతో ఎన్నికైతే, టీడీపీ నుంచి గెలిచినట్టు చెప్పాలని ఎమ్మెల్యే వెంకటశివరామరాజు ప్రలోభపెడుతున్నారన్నారు. 

వైఎస్సార్‌సీపీ సర్పంచ్ హైజాక్! : గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కొండకావూరు పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవమైన వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి నలమాల కిశోర్‌కుమార్‌ను కాంగ్రెస్ నేతలు ఏకంగా ఎత్తుకెళ్లారు. ఆయన సర్పంచ్‌గా ఏకగ్రీవమైనట్లు బుధవారం అధికారికంగా ప్రకటించగానే మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అనుచరులు వచ్చి, కాంగ్రెస్ కండువా వేసుకోవాలంటూ బెదిరించారు. తాను వైఎస్సార్‌సీపీ అభ్యర్థినని బహిరంగంగా చెబుతున్నా బలవంతంగా కారెక్కించి కాసు ఇంటికి తీసుకెళ్లారు. ప్రలోభపెట్టి, కాంగ్రెస్ కండువా వేసి మంత్రితో కలిపి ఫొటోలు తీయించారు. 

మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం నర్మెట మండలం నర్సాపూర్‌లో ఏకగ్రీవంగా ఎన్నికై దేవరాజుల మురళి అనే టీఆర్‌ఎస్ మద్దతుదారును ప్రలోభపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు.

‘అనంత’లో బెదిరింపుల పర్వం: అనంతపురంలో వైఎస్సార్‌సీపీ మద్దతుతో, స్వతంత్రంగా బరిలో ఉన్న అభ్యర్థులను టీడీపీ, కాంగ్రెస్ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కళ్యాణదుర్గంలో కొందరు నమ్మకమైన పోలీసు అధికారులను నియమించుకున్న మంత్రి రఘువీరారెడ్డి వారి ద్వారా వైఎస్సార్‌సీపీ తదితర నేతలను బెదిరిస్తున్నారు. ప్రచారంలో పాల్గొనొద్దని, పోలింగ్ నాడు గ్రామంలో ఉంటే అంతుచూస్తామని బెదిరిస్తున్నారు. శింగనమలలోనూ పోలీసులను, తన ఫ్యాక్షనిస్టు అనుచరులను మంత్రి శైలజానాథ్ ఉసిగొల్పుతున్నారు. చిత్తూరు జిల్లాలో పోలీసులే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి ఆరోపించారు.

Popular Posts

Topics :