ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా) : 'చంద్రబాబును నమ్ముకుంటే మన గొయ్యిని మనమే తవ్వుకున్నట్టు’ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల హెచ్చరించారు. ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, ప్రజల పక్షాన నిలబడకుండా కాంగ్రెస్‌తోనే అంటకాగుతున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తీరుకు నిరసనగా శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోకి శుక్రవారం ప్రవేశించింది. ఇరవై కిలోమీటర్లకు పైగా కొనసాగిన ఈ పాదయాత్రలో పలు గ్రామాల ప్రజలు తమ అభిమాన నాయకుడు రాజన్న తనయను కలిశారు. వారి సమస్యలు చెప్పుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న శ్రీమతి షర్మిల ధైర్యంగా ఉండాలంటూ వారికి భరోసానిచ్చారు.
‘చంద్రబాబు 1999 ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వస్తే మహిళలకు బంగారు మంగళ సూత్రాలు ఇస్తానని, ఆడపిల్లలు పుడితే వారికి రూ.5 వేలు, స్కూలుకు వెళ్లేందుకు సైకిల్, వాళ్లు చదివినంత వరకు పెద్ద చదువులు చదివిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను మరిచిపోయారు. అడ్డగోలు కరెంటు చార్జీల వసూళ్ల పేరుతో సంసారాలు కూల్చారు. రైతులను పట్టుకొచ్చి జైలుకు పంపారు. ఇంట్లో మగవాళ్లు లేకపోతే ఆడవాళ్లను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో నిలబెట్టారు. ఇలాంటి అవమానం భరించలేక మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు అధికారం కట్టబెడితే రైతు రుణాలను మాఫీ చేస్తానని చెబుతున్నారు' అని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు.

కన్న తండ్రిలా పరిపాలించిన వైయస్ఆర్ :
‘వైయస్ఆర్ కంటే ముందు, ఆ తరువాత చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ముందు తొమ్మిదేళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ మూడేళ్ల నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైయస్ఆర్ సువర్ణ పాలన కొనసాగింది. ఒక్క వైయస్ఆర్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఈ రోజు వైయస్ఆర్ సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారు. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైయస్ఆర్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా ఆయన పింఛన్లు ఇచ్చారు. పెన్షన్లే కాదు.. అరోగ్యశ్రీ, 108, 104. పావలా వడ్డీ రుణాలు, ఉచిత విద్యుత్, పక్కా ఇళ్లు ఇలా అన్ని సంక్షేమ పథకాలు అమలుచేసి చూపెట్టారు. అన్ని సంక్షేమ పథకాలు అమలుచేసి ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచని రికార్డు ముఖ్యమంత్రి వైయస్ఆర్. కానీ మన దురదృష్టం కొద్దీ ఆ కాలం పోయింది. ఇప్పుడు మన కర్మకొద్దీ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు.
కిరణ్‌ది బాబు పాలనకు కొనసాగింపే :
చంద్రబాబు నాయుడు పాలనంతా ఒక చీకటి అధ్యాయం.. ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్ ప్రభుత్వం నడుస్తోంది. వైయస్ఆర్ ఇచ్చిన పింఛన్లకు ఇవ్వాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఏనాడో అటకెక్కించారు. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళలను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ.3 వడ్డీ తీసుకుంటున్నారని చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు. ఇప్పటికే ఎరువుల ధరలు 300 శాతం నుంచి 800 శాతానికి పెంచారు. ఆర్టీసీ చార్జీలు మూడుసార్లు పెంచారు. రూ.305 ఉన్న వంటగ్యాస్ ధర రూ.440 చేశారు. అదీ సబ్సిడీ ఉంటే.. సబ్సిడీ లేకుంటే రూ.1000 ఒక్క గ్యాస్ సిలిండర్‌కు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ చార్జీలు, వ్యాట్, కరెంటు చార్జీలు ప్రతి ఒక్కటీ పెంచేశారు’ అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.
శుక్రవారం పాదయాత్ర 20.1 కి.మీ. :
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 228వ రోజు శుక్రవారంనాడు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం రంగోయ్ జంక్షన్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి మకరాజువాక, హరిపురం, మందస, కొత్తపల్లి, పాలవలస, కొర్లాం, లక్కవరం, బూర్గాంల మీదుగా కొనసాగింది. బూర్గాం శివారులో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8 గంటలకు శ్రీమతి షర్మిల చేరుకున్నారు. మొత్తం 20.1 కిలోమీటర్ల దూరాన్ని ఆమె నడిచారు.
వేగంగా ‘విజయ ప్రస్థానం’ స్తూప నిర్మాణం :
‘విజయ ప్రస్థానం’ స్తూపం నిర్మాణం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. పదమూడున్నర అడుగుల స్థలంలో చేపట్టిన ఈ నిర్మాణంలో ఐదడుగుల పెడస్టల్‌పై పది అడుగుల వైయస్ఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహానికి రెండు వైపులా రెండు ఆర్చిలను పదిహేను అడుగుల ఎత్తులో నిర్మించారు. పెడస్టల్‌పై శ్రీమతి షర్మిల ఫొటోతో ఉన్న గ్రానైట్ పలకను అమర్చనున్నారు. ఈ రెండు ఆర్చిల మధ్య వైయస్ఆర్ కాంగ్రెస్ గుర్తు ఉండేలా ఏర్పాటు చేశారు. ఆర్చి, ప్రవేశద్వారం, గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయి. ఆదివారం ఇక్కడ జరగనున్న శ్రీమతి షర్మిల పాదయాత్ర ముగింపు బహిరంగసభకు ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నాయి. లక్షల సంఖ్యలో వచ్చే అభిమానులకు ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.

http://www.ysrcongress.com/news/top_stories/smt-sharmila-slams-chandrababu-naidu.html