11 August 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

విజయమ్మ దీక్షా వేదిక గుంటూరుకు మార్పు

Written By news on Saturday, August 17, 2013 | 8/17/2013

విజయమ్మ దీక్షా వేదిక గుంటూరుకు మార్పు

గుంటూరు : అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపకుండా.. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నిరంకుశ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపడుతున్న ఆమరణ దీక్ష వేదిక మారింది. ఈనెల 19వ తేదీ నుంచి విజయవాడ బందరు రోడ్డులోని పీవీపీ కాంప్లెక్సు ఎదురుగా దీక్ష చేపట్టాలని తొలుత నిర్ణయించినా, తర్వాత ఈ వేదికను గుంటూరుకు మారుస్తూ పార్టీ అగ్ర నాయకులు నిర్ణయం తీసుకున్నారు.


ఈ నెల 19 ఉదయం గుంటూరులో వైఎస్ విజయమ్మ దీక్షను ప్రారంభిస్తారు. విజయమ్మతో పాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వారిని పార్టీ నేతలు వారిస్తున్నారు. విజయమ్మ మాత్రమే దీక్ష చేస్తారని, పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెకు మద్దతుగా రిలే  నిరాహార దీక్షలు చేయొచ్చని సూచిస్తున్నారు.


http://www.sakshi.com/news/andhra-pradesh/ys-vijayammas-hunger-strike-venue-changed-to-guntur-57873

'చిత్తశుద్ధితో ఉద్యమం చేస్తున్న వైఎస్ఆర్ సిపి'

'చిత్తశుద్ధితో ఉద్యమం చేస్తున్న వైఎస్ఆర్ సిపి'మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

కడప(వైఎస్ఆర్ జిల్లా): సీమాంధ్రకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో చిత్తశుద్ధితో ఉద్యమం చేస్తున్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అనుసరించే వైఖరికి నిరసనగా ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడిలను పరామర్శించేందుకు ఈరోజు ఆయన ఇక్కడకు వచ్చారు. ఆరు రోజులుగా దీక్ష చేస్తున్నవారిని పెద్దిరెడ్డి పరామర్శించారు.
ఈ సందర్బంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేదుకు కాంగ్రెస్, తెలుగుదేశంవారు నాటకాలాడుతున్నారని విమర్శించారు. ఆ పార్టీల ఎమ్మెల్యేలు  ఇచ్చిన రాజీనామాలు స్పీకర్ ఫార్మేట్ లో లేవన్నారు.


source:sakshi

YSRCP leaders Deeksha in Kadapa

కాంగ్రెస్ డ్రామాలాడుతోంది: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

కడప : అందరికీ సమన్యాయం చేయాలంటూ ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కడప మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోగ్యం క్షీణించింది. బీపీ, షుగర్‌ లెవల్స్‌ ప్రమాదకర స్థాయికి పడిపోయాయని వైద్యులు తెలిపారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డితో పాటు పెద్దఎత్తున ప్రజలు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా డ్రామాలాడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు.


కాగా ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి దీక్షలకు  ఈసీ గంగిరెడ్డి సంఘీభావం తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి జమ్మలమడుగులో వెంకటేశ్వర దేవాలయంలో 101 టెంకాయలు కొట్టారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా పులివెందులలో నిర్వహించిన భారీ ర్యాలీలో వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు, జేఏసీ నేతలు, ఉపాధ్యాయాలు పాల్గొన్నారు.

YSR's death puts question mark over AP's growth

ఆంటోని కమిటీ వల్ల ఎలాంటి ప్రయోజం ఉండదు

కడప: : ఎ.కే.ఆంటోని కమిటీ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజం ఉండదని రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు శనివారం స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీలు అన్ని భూస్థాపితం కాక తప్పదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రైల్వేకోడూరులో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం మూడో రోజుకు చేరుకుంది.
 
అయితే వైఎస్ ఆర్ కడప జిల్లాలో సమైక్యవాదులు చేపట్టిన నిరసనల హోరు ఉధృతంగా సాగుతోంది. కడప నగరంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రరెడ్డిలతోపాటు అదే జిల్లాలోని రాజంపేటలో స్థానిక ఎమ్మెల్యే ఆమర్ నాథ్ రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షతో ఆరో రోజుకు చేరుకుంది. అలాగే కలెక్టరేట్ ఎదుట వికలాంగుల  ఆమరణదీక్షతోపాటు న్యాయవాదులు, ఉపాధ్యాయులు చేపట్టిన రిలే దీక్షలు కూడా కొనసాగుతున్నాయి.

అది ఉత్తుత్తి కమిటీయే

అది ఉత్తుత్తి కమిటీయే
కాంగ్రెస్ ప్రకటనకు, కేంద్రం కదలికకు పొంతనే లేదు
కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు వినడానికే ఆంటోనీ కమిటీ
ప్రత్యేక రాష్ట్రంపై కేంద్ర హోంశాఖ రాజ్యాంగ ప్రక్రియ కొనసాగింపు
దేని పని దానిదే అన్నట్లుగా సాగిపోతున్నా నోరెత్తని కాంగ్రెస్ ముఖ్యులు
కమిటీతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగుతుందని స్పష్టంచేసిన బొత్స
సమైక్య ఉద్యమమూ మీడియాతోనే ఉధృతమవుతోందని అభిప్రాయం
19, 20 తేదీల్లో ఢిల్లీలో తెలంగాణ, సీమాంధ్ర నేతలతో కమిటీ భేటీ

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానంతో ఏర్పడ్డ పరిణామాల నేపథ్యంలో ఏఐసీసీ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీకి ఎలాంటి ప్రాధాన్యమూ లేదని, అది ఉత్తుత్తి కమిటీయేనని స్పష్టమవుతోంది. కమిటీ ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రకటనకు, తెలంగాణ ప్రక్రియపై కేంద్రం కదలికలకు పొంతనే కనిపించడం లేదు. తెలంగాణ తీర్మానంతో సీమాంధ్రలో తలెత్తిన ఉద్యమ వేడిని తాత్కాలికంగా చల్లార్చడానికి ఆంటోనీ కమిటీని కాంగ్రెస్ కంటితుడుపుగా తెరపైకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. కమిటీ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నామనే పేరుతో ఉద్యమ ఉధృతిని తగ్గించి ఆపై తన పనిని సాఫీగా కొనసాగించేందుకే కాంగ్రెస్ పెద్దలు కమిటీ నాటకానికి తెరతీసినట్లు తాజా పరిస్థితి స్పష్టం చేస్తోంది. తెలంగాణపై రాజ్యాంగ ప్రక్రియ కొనసాగింపునకు, ఆంటోనీ కమిటీ అభిప్రాయాల సేకరణకు సంబంధం లేదని, దేని దారి దానిదేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సైతం చెబుతున్నారు.
 
 ఆంటోనీ కమిటీ తెలంగాణ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న అభ్యంతరాలు, అభిప్రాయాలు మాత్రమే వింటుంది తప్ప ప్రత్యేక రాష్ట్రంపై కేంద్రం చేపట్టే ప్రక్రియతో ఈ కమిటీకి ఎలాంటి సంబంధం లేదని బొత్స పేర్కొంటుండడం గమనార్హం. ‘‘కమిటీ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు, అభ్యంతరాలు వింటుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యాంగపరమైన ప్రక్రియను కేంద్ర హోంశాఖ కొనసాగిస్తూ పోతుంది. ఆంటోనీ కమిటీతో తెలంగాణ ప్రక్రియ ఆగబోదు. దేని పని దానిదే’’ అని బొత్స సత్యనారాయణ శుక్రవారం తనను కలసిన మీడియాతో అన్నారు. పైగా కమిటీ నివేదిక ఇవ్వడానికి గడువు లేదని ఆయన అంటున్నారు. కమిటీ  స్వీకరించే అభిప్రాయాలతో కానీ, అది ఇచ్చే నివేదికలతో కానీ కేంద్రానికి సంబంధం లేకుండా ప్రత్యేక రాష్ట్రంపై కేంద్రం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడు జరుగుతున్నదీ అదే. కమిటీకి సీమాంధ్ర  ప్రాంత నేతలు చెప్పే అభ్యంతరాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోకుండానే రాజ్యాంగపరమైన చర్యలను కేంద్రం కొనసాగించుకుపోతున్నా కాంగ్రెస్ పార్టీ నేతలు గొంతెత్తడం లేదు. సీడబ్ల్యూసీ తీర్మానంపై  కాంగ్రెస్ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వచ్చినందున వారందరినీ ఏకాభిప్రాయంలోకి తెచ్చేందుకు కమిటీ ప్రయత్నిస్తుందని బొత్స పేర్కొంటున్నారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానానికి అనుగుణంగానే అందరినీ నడిపించేందుకు తప్ప సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను వినడం ఈ కమిటీ లక్ష్యం కాదన్న అంశం బొత్స మాటల్లోనే తేటతెల్లమవుతోంది.
 
 అభిప్రాయాల స్వీకరణ తూతూమంత్రంగానే..
 ఆంటోనీ కమిటీ అభిప్రాయాల స్వీకరణ తీరు కూడా ఏదో తూతూమంత్రంగానే అన్నట్లు సాగుతోంది. ఇలా అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించి ఆ తర్వాత ఉద్యమవేడి చల్లారగానే కేంద్రం తన ప్రక్రియను ముందుకు తీసుకుపోతుందని అంటున్నారు. ప్రస్తుతం ఆ కమిటీ ఢిల్లీ నుంచి కదిలే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం పార్లమెంటు జరగని రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చే ప్రయత్నం కూడా కమిటీలో కనిపించడం లేదు. పార్లమెంటు సమావేశాలున్నందున ఈనెల 30 వరకు కమిటీ ఎక్కడికీ వెళ్లదని, ఎవరైనా అక్కడికే వెళ్లి అభిప్రాయాలు చెప్పుకోవాలని, అది కాంగ్రెస్ అంతర్గతవ్యవహార కమిటీ కనుక ఆ పార్టీ నేతల కే అభిప్రాయాలు వ్యక్తపరిచే అవకాశం ఉంటుందని పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలొచ్చాయి. పార్టీ నేతలు కూడా స్వేచ్ఛగా కమిటీ ముందు హాజరయ్యే పరిస్థితి అసలే లేదు.
 
 కమిటీని ఎవరు కలవాలన్నా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్పాలి. కమిటీని కలుస్తామనే వారి వివరాలను వారిద్దరూ ఏఐసీసీకి పంపిస్తారు. ఆ తర్వాత కమిటీ అనుమతిని అనుసరించి ఎంపికచేసిన నేతలకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. బయటి వ్యక్తులకు అసలు అవకాశమే ఇవ్వకుండా కమిటీతో చర్చల తతంగాన్ని పైపైనే ముగించాలన్నది పార్టీ పెద్దల అభిప్రాయం. ఇదిలా ఉంటే అందుకు విరుద్ధంగా బయటి వ్యక్తులకు, సంస్థలకు అవకాశమిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స కొద్దిరోజులక్రితం చేసిన ప్రకటన పార్టీలో వివాదాస్పదమైంది. ఆ ప్రకటనలో ఒక ఫోన్ నంబర్‌ను కూడా ఆయన ఇచ్చారు.
 
 ఈ ప్రకటనపై ఏఐసీసీ అగ్ర నేతలు బొత్సపై ఆగ్రహించినట్లు తెలుస్తోంది. దీంతో కంగుతిన్న బొత్స శుక్రవారం మాటమార్చారు. ఇది పార్టీ అంతర్గత కమిటీయేనని, పార్టీ నేతల్లోని అపోహలను తొలగించడానికే దీన్ని ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. పీసీసీ చీఫ్ ఇచ్చిన ఫోన్ నంబర్‌కు దాదాపుగా 200కు పైగా కాల్స్, 60కి పైగా ఎస్సెమ్మెస్‌లు వచ్చాయని తెలుస్తోంది. ‘‘మాకు వచ్చిన ఎస్సెమ్మెస్‌లలో చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. 13 గ్రూపులు మాత్రం అపాయింట్‌మెంటు కోరాయి. వాటిలోనూ స్పష్టత లేదు. చాలా మంది కమిటీ ముందు చెప్పాల్సిన అభిప్రాయాలను మెసేజ్ రూపంలో ఇచ్చారు’’ అని బొత్స పేర్కొన్నారు. పార్టీని సంప్రదించిన సంస్థలకు అవకాశం ఇవ్వడం ఇష్టం లేకపోవడం కారణంగానే అవేవీ ప్రతిష్టాత్మకమైనవి కావని పార్టీ నేతలు పక్కన పెట్టేస్తున్నారు.

http://www.sakshi.com/news/top-news/no-sanctity-to-antony-committee-57720

విజయమ్మ దీక్షకు మద్దతు


విశాఖపట్నం :  అనకాపల్లి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆమరణదీక్షకు మద్దతు తెలిపేందుకు పార్టీ శ్రేణులు కదిలి రావాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం  పార్టీ కార్యకర్తలతో సమీక్షించారు. ఈ నెల 22 నుంచి జిల్లాలో పార్టీ చేపట్టే సమైక్య బస్సు యాత్రలను విజయవంతం చేసే బాధ్యత అందరిదీ అన్నారు. బస్సు యాత్రల విషయమై మాట్లాడేందుకు జిల్లా పార్టీ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు పార్టీ రాష్ర్ట నేత కొణతాలను కలిశారు.


యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్, పార్టీ శ్రేణుల పాత్రపై మాట్లాడారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై నియోజకవర్గ నేతలను కొణతాల ఆరా తీశారు. విజయమ్మ  దీక్షకు సంఘీభావంగా నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు చేపట్టాలన్నారు. పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ మద్దతుదారులను నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటివారంలో అభినందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.


కొణతాలను కలిసినవారిలో గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, పట్టణ కన్వీనర్ మందపాటి జానకిరామరాజు, అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మలసాల కిశోర్, మండల నాయకులు గొర్లి హరిబాబు, సూరిశెట్టి రమణ అప్పారావు చోడవరం నియోజవర్గానికి చెందిన అడపా నర్సింహమూర్తి, సూర్యనారాయణ, కర్రి తమ్మునాయుడు  ఉన్నారు.

వైఎస్‌ఆర్ సీపీ ప్రభంజనం తథ్యం

చింతూరు :
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్‌ఆర్ సీపీ ప్రభంజనం తథ్యమని పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం చింతూరులో దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా ప్రజల గుండెల్లో దివంగత సీఎం వైఎస్‌ఆర్ చిరస్మరణీయంగా నిలిచారని అన్నారు. ఆయన ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ఏర్పాటైన వైఎస్‌ఆర్ సీపీని బలీయ శక్తిగా రూపొందించేందుకు, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు శ్రేణులు కృషి చేయాలని కోరారు. వైఎస్‌ఆర్ సీపీ ప్రభంజనాన్ని చూసి కాంగ్రెస్, టీడీపీ తట్టుకోలేకపోతున్నాయని, వాటి నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. వైఎస్‌ఆర్ సీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదనే విషయాన్ని ప్లీనరీ స్పష్టంగా చెప్పిందన్నారు. కేంద్రం తండ్రి పాత్ర పోషించి, ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని పార్టీ కోరుతోందని చెప్పారు. 
 
తెలంగాణలో వైఎస్‌ఆర్ సీపీ బలహీనపడిందంటూ కాంగ్రెస్-టీడీపీ సాగిస్తున్న దుష్ర్పచారాన్ని పార్టీ శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చగల సత్తా కేవలం ఆయనకు (జగన్‌మోహన్ రెడ్డికి) మాత్రమే ఉందని నమ్ముతున్నారని చెప్పారు. వై ఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి రాగానే.. పోల వరం ముంపు ప్రాంతంలోని రైతులకు ఎకరాకు మూడులక్షల రూపాయలను ఇప్పిస్తుందని, చింతూరు మండలంలోని నేలకోట, వీఆర్‌పురం మండలంలో దయ్యాలమడుగు ప్రాజెక్టులను పూర్తిచేయిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు తెల్లం వెంకట్రావు (భద్రాచలం), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), నాయకులు కడియం రామాచారి, ఎండి.మూసా, మానె రామకృష్ణ, రామలింగారెడ్డి, మన్మధ హరి, జమాల్‌ఖాన్, సుధాకర్, చిట్టిబాబు, ఆసిఫ్ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎన్.ఆర్.ఐ. వింగ్ ఉదారత

Written By news on Friday, August 16, 2013 | 8/16/2013

ఈ మధ్య ఉత్తరాఖాండ్‌లో సంభవించిన ఘోర ప్రకృతి వైపరీత్య నష్టాన్ని పూడ్చడానికి, ఛారధామ్ పుననిర్మాణం కొరకు తమ వంతు సహాయం రూ.5 లక్షలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్.ఆర్.ఐ వింగ్, వివిధ దేశాలలో ఉన్న పార్టీ ప్రతినిధులు విరాళాలను వింగ్ కన్వీనర్ మేడపాటి వెంకట్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారి ద్వారా ఉత్తరాఖండ్ సి.ఎం. రిలీఫ్ ఫండ్‌కు అందజేయడం జరిగింది. 

 విరాళాలు అందజేసిన దాతలు:  

అమెరికా నుండి..

మేడపాటి వెంకట్, రమేష్ రెడ్డి వల్లూరు, పవన్ నరమ్ రెడ్డి, సి. సుబ్బారెడ్డి, డా. వాసుదేవ్ రెడ్డి, దయాకర్ రెడ్డి, విశ్వనాథ్ కిచిలి, రఘు పాడి, సుబ్బారెడ్డి షమ్మి, శ్రీనివాస్ చిట్టలూరు, కుమార్ అశ్వపతి, ప్రవర్థన్ చెమ్ముల, నారాయణరెడ్డి, మురళి బండ్లపల్లి, రఘు సిద్ధపురెడ్డి, రవి బల్లాడ, ప్రసాద్ గురిజాల, స్వదీప్‌రెడ్డి 

 కువైట్ నుండి..

  వై.లలితరాజా, యమ్.బాలిరెడ్డి, దాసరి సంక్షేమ సంఘం, కొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి, కె.రమణయాదవ్, టి.జి. భాస్కర్ రెడ్డి, ఆకుల ప్రభాకర్, రహిమాన్ ఖాన్, దుర్గరెడ్డి, వైఎస్ లాజరస్, చింతల చంద్ర శేఖర్‌రెడ్డి, నాయని మహీశ్వర్ రెడ్డి, యమ్, వి.నరసారెడ్డి, గోవింద్ నాగరాజు, తెట్టురఫి, మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, వి.పి.రామచంద్ర రెడ్డి, చింత శివారెడ్డి,వినోద్ కుమార్ దేవా, రక్కసి శ్రీను, పి.సత్తార్ ఖాన్, రవి నాయుడు, సురేంద్రబాబు నాయుడు, నూర్ భాషా, షేక్ ఇనియత్, కె.వాసుదేవారెడ్డి, ఎ.వెంకట సుబ్బారెడ్డి, మల్లు వెంకట రెడ్డి, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పి. సురేష్ కుమార్ రెడ్డి, మర్రి కళ్యాణ్, షేక్ అజీజ్, ఓ.పి.శివారెడ్డి, సుదర్శన్ రెడ్డి, యస్.మున్నా, డి.గంగాధర్, దిబ్బి రెడ్డి సుబ్బారెడ్డి. 

 యూ.కె. నుండి.. 

సందీప్ రెడ్డి

YSR's death puts question mark over AP's growth

హైదరాబాద్‌లో ఓటింగ్ పెట్టి చూడండి

కర్నూలు: రాష్ట్ర విభజనకు సంబంధించి హైదరాబాద్ నగరంలో ఓటింగ్ పెట్టి చూస్తే..ఎక్కువ మంది దేనికి మద్దతు ఇస్తున్నారో తేలిపోతుందని వైఎస్సార్‌సీపీ నేత భూమా నాగిరెడ్డి తెలిపారు. రాజకీయ నేతల తీరుపై మండిపడ్డ భూమా నాగిరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజన జరిగిందని ఒకసారి, జరగలేదని మరొకసారి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. సీమాంధ్ర రాజకీయ నేతలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్కసారి ఓటింగ్ పెడితే ప్రజలు సమైక్యాంధ్రాకే మద్దతిస్తారని తెలిపారు.
 
 సమైక్యాంధ్ర మద్దతుగా ఉద్యమం మరింత ఊపందుకుంది. రాష్ట్ర విభజన  అంశంపై సీమాంధ్ర ఆందోళన కారులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

విజయమ్మ దీక్షకు ఉద్యోగుల మద్దతు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు శుక్రవారం భేటీ అయ్యారు. ఈనెల 19వ తేదీ నుంచి విజయవాడలో వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు వారు తమ మద్దతు ప్రకటించారు. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడానికి ఆమె చేస్తున్న దీక్షకు ఉద్యోగుల పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.

విభజన నిర్ణయంపై గత 15 రోజులుగా సచివాలయంలో ఆందోళనలు నిర్వహిస్తున్నామని, తమ నిరసన కార్యక్రమాలకు వైఎస్‌ఆర్‌ సీపీ పూర్తిగా సంఘీభావం తెలిపిందని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఛైర్మన్‌ మురళీకృష్ణ తెలిపారు. వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా తమ ఆందోళనల్లో పాల్గొన్నారని ఆయన అన్నారు.

నావికుల మృతికి విజయమ్మ సంతాపం

సింధు రక్షక్ జలాంతర్గామి ప్రమాదంలో భారత నావికా దళానికి చెందిన 18మంది మృతి పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేకించి ఈ దుర్ఘటనలో అసువులు బాసిన విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు యువ నావికులు తూతిక రాజేశ్, దాసరి దుర్గాప్రసాద్ కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతినీ తెలియజేశారు.  భారత నావికా దళంలో నావికులుగా పనిచేస్తూ దేశ సేవలో నిమగ్నమై ఉన్న ఈ యువకుల మృతితో వారి కుటుంబాలకే కాక, దేశానికి కూడా తీరని నష్టం వాటిల్లిందని ఆమె తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఈ పెను విషాదాన్ని ఎదుర్కొనడానికి వారి కుటుంబాలకు తగినంత ఆత్మ స్థైర్యాన్ని ప్రసాదించాలని శ్రీమతి విజయమ్మ ప్రార్థించారు.

Vijayamma to go on indefinite fast from Aug 19

బందరు రోడ్డులో విజయమ్మ సమరభేరీ దీక్ష

బందరు రోడ్డులో విజయమ్మ సమరభేరీ దీక్ష

విజయవాడ: : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ నెల 19వ తేదీన విజయవాడలో చేపట్టనున్న ఆమరణ దీక్షకు వేదిక ఖరారు అయింది. బందరు రోడ్డులోని పీవీపీ కాంప్లెక్స్ ఎదురుగా వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్ష చేపడతారని ఆ పార్టీ నేతలు సామినేని ఉదయభాను, జలీల్ ఖాన్, గౌతమ్ రెడ్డిలు శుక్రవారం విజయవాడలో వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనే ఏకైక లక్ష్యంతో వైఎస్ విజయమ్మ సమరభేరీ దీక్ష చేపట్టనున్నారని వారు తెలిపారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి, సీమాంధ్ర ప్రజలకు చులకనగా చూస్తోందని వారు ఆరోపించారు. సీమాంధ్రుడిగా చంద్రబాబుకు పౌరుషం ఉంటే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే సమైక్యాంధ్ర ఉద్యమంలో చంద్రబాబు పాల్గొనాలని వారు సూచించారు. తెలుగుదేశం నుంచి వలసలు నిరోధించి, పార్టీని కాపాడేందుకే బాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉదయభాను, జలీల్ ఖాన్, గౌతమ్ రెడ్డిలు ఈ సందర్భంగా గుర్తు చేశారు

వైఎస్ఆర్ సీపీలోకి కాంగ్రెస్, టీడీపీ నేతలు

చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్‌, టీడీపీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో  చిత్తూరుకు చెందిన పలువురు కాంగ్రెస్‌, టీడీపీ మాజీ కౌన్సిలర్‌లు, స్థానిక నేతలు శుక్రవారం పార్టీలో చేరారు.  దాదాపు 100 మంది స్థానిక నేతలు పార్టీలో చేరారు. వీరంతా బీసీల్లో వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు.
జిల్లాలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నప్పటికీ తమ కులానికి ఇప్పటివరకు రాజకీయ ప్రాధాన్యం లేకపోవడంతో వైఎస్‌ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ కచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తుందని విజయమ్మ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పాల్గొన్నారు.

రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారే: భూమన

రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారే: భూమన
తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతిలో సమైక్యాంధ్రకు మద్దతుగా గాంధీ బొమ్మ సర్కల్‌లో వైఎస్ఆర్ సీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం మంచి నీళ్ల దీక్షకు దిగారు. ఎమ్మెల్యేతో పాటు వందలాది మంది మహిళలు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారి అవుతుందన్నారు.సాగునీరే కాకుండా తాగునీటికి కూడా కరువు ఏర్పడుతుందని అన్నారు.

రాయలసీమకు చుక్కనీరు కూడా రాదని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి జఠిల సమస్యలు ఉన్నా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. సీట్ల కోసం సోనియా గాంధీ కపట నాటకం ఆడుతుందని ఆయన విమర్శించారు. విభజనకు మద్దతుగా చంద్రబాబు నాయుడు  లేఖ ఇచ్చి సీమాంధ్ర ప్రజల జీవితాలతో ఆడుకున్నాడని ఎమ్మెల్యే భూమన ఘాటుగా విమర్శించారు

Pandagala Digivachavu

YSR Congress poised for stunning victory in Seemandhra; TDP set to lose both regions

For a change, a staunch supporter of Chandrababu Naidu and Telugu Desam Party carried a report saying that the TDP will never benefit from its firm stand on supporting a separate Telangana state. The recent partial ‘improvement’ in Panchayat elections has also been reversed and heading for a doom as Chandrababu Naidu again angered the Seemandhra people with his reiteration of his support to Telangana when the entire Seemandhra has burning ever since CWC announcement.
“His stand on Telangana will not benefit the party both in Telangana and Seemandhra. This is a grave mistake. It will be a complete washout for TDP in Seemandhra. 2014 elections will decide the future of Chandrababu Naidu” the reports said.
In contrast, YSR Congress party headed by YS Jaganmohan Reddy is taking deep roots in Seemandhra. The popularity of YSRCP is growing enormously as it seems to be the only political party which is actively participating in Samaikyandhra movement, taking up Deekshas for a unified AP.
National media reported that people have now started thinking about Congress and TDP as ‘backstabbers and cheaters of Samaikyandhra’ whom they will teach a lesson in the next elections for cutting the state into pieces for their political benefits. Congress and TDP leaders have been literally chased away from the general public for their brazen support to division of the state.
The support for for YSR Congress party is so intense that as per reports, YSR Congress party will form the next government by winning the required seats from just seven districts. Unlike anti-Jagan media reports, the party might deliver a surprise even in Telangana region, which has lakhs of YSR supporters who will never vote for other parties but for YSRCP, an observers said.

http://hydfirst.com/ysr-congress-poised-for-stunning-victory-in-seemandhra-tdp-set-to-lose-both-regions/

విజయమ్మ దీక్షకు ఎపి ఎన్జీవోల మద్దతు


సమ్మెకు విజయమ్మ మద్దతుకోరిన ఎపి ఎన్జీవోలు
 ఏ ప్రాంత ప్రజలకూ అన్యాయం జరగకుండా చూడాలన్నదే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ అభిమతం అని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. న్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని ఆమె కోరుతున్నారని చెప్పారు. శ్రీమతి విజయమ్మను లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసంలో గురువారం ఎపి ఎన్జీవో సంఘం ప్రతినిధులు కలిసి నిరవధిక సమ్మెకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అశోక్‌బాబు మీడియాతో మాట్లాడారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలనూ తాము కోరుతున్నామని ఆ క్రమంలోనే శ్రీమతి విజయమ్మను కలుసుకున్నామన్నారు. అనంతరం వైయస్ఆర్‌ ‌కాంగ్రెస్ ‌పార్టీ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్ష, నిరంకుశ వైఖరికి నిరసనగా శ్రీమతి విజయమ్మ ఈ నెల 19 నుంచి చేయనున్న నిరవధిక నిరాహార దీక్షకు ఎపి ఎన్జీవోలు మద్దతు పలికారని చెప్పారు.

http://www.ysrcongress.com/news/news_updates/ap-ngos-solidarity-to-smt-vijayamaas-indifinite-fast.html

విశాఖ జిల్లాలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ బస్సు యాత్ర

 రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ అనుసరించిన ఏకపక్ష, నిరంకుశ తీరుకు నిరసనగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖపట్నం జిల్లాలో బస్సుయాత్ర చేయాలని నిర్ణయించింది. ఈ బస్సుయాత్ర ఈ నెల 22న పాయకరావుపేటలో ఆరంభమవుతుంది. 28వ తేదీ వరకూ కొనసాగే ఈ బస్సుయాత్ర మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కొనసాగుతుందని పార్టీ నాయకులు గురువారం విశాఖలో తెలిపారు. బస్సు యాత్రకు సంబంధించి గురువారంనాడు విశాఖపట్నంలో పార్టీ నాయకులు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

http://www.ysrcongress.com/news/news_updates/ysrcp-bus-tour-from-22nd-august-in-vizag-dist.html

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు

* పంద్రాగస్టు వేడుకల్లో విజయమ్మ ఆవేదన* కోట్లాది మంది రోడ్లెక్కుతున్నా పట్టదా?* ప్రజలే సైన్యంగా మారే రోజులు తొందర్లో వస్తాయి* కాంగ్రెస్ కుట్రలకు వారే తెరదించుతారు* అధికార పార్టీ ఓట్లు, సీట్లే లక్ష్యంగా వ్యవహరిస్తోంది* ఏ ఒక్కరితో చర్చించకుండా తనకు తాను నిర్ణయాలు తీసుకుంటోంది* ఇరు ప్రాంతాలకు సర్దిచెప్పాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి* కాంగ్రెస్ వైఖరికి నిరసనగానే ఆమరణ దీక్ష సాక్షి, హైదరాబాద్: గత పక్షం రోజులుగా రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం పట్టడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే ఎమర్జెన్సీ పాలన తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాలు ఏమాత్రం పట్టకుండా ఓట్లు, సీట్లే లక్ష్యంగా అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈనెల 19న విజయవాడలో ఆమరణ దీక్షకు సిద్ధమైనట్లు తెలిపారు. ప్రజలే సైన్యంగా మారి  కాంగ్రెస్ కుట్రలకు తెరదించే రోజులు తొందర్లోనే ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


67 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం పార్టీ కార్యాలయంలో విజయమ్మ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు, ప్రజా ఆందోళనలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. ప్రసంగం ఆమె మాటల్లోనే...


తండ్రిలా న్యాయం చేయాలని అడుగుతున్నాం..

కేంద్రంలో అధికారంలో ఉన్న వారు తండ్రిలా న్యాయం చేయాలని అడుగుతున్నాం. రాష్ట్రంలో అందరితో చర్చించాలని అడుగుతున్నాం. కానీ మనం అడిగే ప్రశ్నలకు కేంద్రం, కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసే పరిస్థితిలేదు. ఒక ప్రాంతానికి మంచి చేయడమంటే గర్వించదగినదే. కానీ ఇతర ప్రాంతాలను గురించి ఆలోచన చేయకుండా కేవలం ఓట్లు, సీట్ల కోసం నిర్ణయాలు తీసుకోవడం దారుణం. ఏ ఒక్కరితో చర్చించకుండా తనకు తాను నిర్ణయాలు తీసేసుకుంటోంది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చెప్పిన విషయాలను పెడచెవిన పెట్టింది.


ఇరు ప్రాంతాలకు న్యాయం చేయని పక్షంలో విభజించే హక్కు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నాం. న్యాయం చేయలేని పక్షంలో యథాతథంగా ఉంచాలని కోరుతున్నాం. తెలంగాణకు న్యాయం జరిగితే మంచిదే, అడ్డుపడే వాళ్లం కూడా కాదు. కానీ రెండు ప్రాంతాలకు సర్దిచెప్పాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. జటిలమైన సమస్యలకు జవాబు చెప్పాలి. అయితే కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఏ ఒక్క సమస్యకు పరిష్కారం చూపడంలేదు. కేంద్రం.. ఒక తండ్రిలా బిడ్డలందరికీ సమ వాటాలు పంచివ్వాలి. వారి నిర్ణయం అలా లేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్లు, సీట్ల ప్రాతిపదికన ఎన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తామనే ఆలోచనతోనే ఉంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రభావం భవిష్యత్తు తరాలపై కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది.


వైఎస్ ఆకాంక్ష.. పేదవాడి ముఖంలో చిరునవ్వు


ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకాంక్షించారు. పేదవాడికి ప్రభుత్వం భరోసా ఉండాలని కోరుకున్నారు. మాటలే కాదు చేతల్లో కూడా చేసి చూపించారు. రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, 108, 104, ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ, పేద విద్యార్థులు ఉన్నత చదవులు అభ్యసించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులు గర్వంగా తలెత్తుకొని బతికేందుకు ఉచిత విద్యుత్, కరెంటు బకాయిలు ఎత్తేయడం, రుణమాఫీ వంటి కార్యక్రమాలు చేశారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు, గ్రామీణ ఉపాధి, ఉద్యోగాలు ఇలా పేదరికం నుంచి ప్రజలను బయటకు తీసుకొచ్చే ఎన్నో ప్రయత్నాలు చేశారు.


వైఎస్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు మేలు చేసే సీఎంగా నిలబడ్డారు. ఆయన ఏనాడు కూడా ఒక ప్రాంతానికి మంచి చేయడం కోసం మరో ప్రాంతానికి హాని తలపెట్టే ఆలోచన చేయలేదు. మూడు ప్రాంతాల్లో కూడా ప్రాజెక్టులు చేపట్టి సాగునీరు, తాగునీరు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు. జిల్లాకో విశ్వవిద్యాలయం, మెడికల్ కాలేజీ, జేఎన్‌టీయూ, ఐఐటీ, ఐఐఐటీ, బిట్‌‌సిపిలానీ, జేకేసీ ఏర్పాటు చేశారు. ఐటీ రంగంలో ప్రఖ్యాత కంపెనీలను తీసుకొచ్చారు.
హైదరాబాద్‌ను కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డు, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే, అంతర్జాతీయ విమానాశ్రయం, కృష్ణా జలాలు, మెట్రోరైల్ ఇలా ఎన్నో చేశారు. సంక్షేమ పథకాల ద్వారా మనిషికి కావాల్సినవన్నీ ఇచ్చారు. శాచ్యురేషన్ పద్ధతిలో అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందేందుకు కృషి చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా భావించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆయన ఉండుంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేది.
రాజ్యాంగ అధికారాలు దుర్వినియోగం..


అభియోగాల మీద విచారణ కూడా చేయకుండా జనం మధ్యలో ఉన్న జగన్‌బాబును 15 నెలలుగా అక్రమంగా నిర్భంధించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిష్ వారు సైతం ఇలా చేసుండరు. సీబీఐని చేతిలో పెట్టుకొని, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ పరిపాలన సాగిస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను దుర్వినియోగ పరుస్తూ, ఈ రోజు ఎమర్జెన్సీ పరిస్థితులను తలపించేలా చేస్తున్నారు. వ్యతిరేకంగా ఉన్న వారిని జైల్లో పెడుతున్నారు.


చంద్రబాబు మద్దతుతోనే అడ్డగోలు విభజన


రాష్ట్రానికి సంబంధించి గత కొంత కాలంగా రకరకాల వార్తలు వెలువడుతున్నా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు అన్నీ తెలిసినా ఎందుకు స్పందించలేదని అడుగుతున్నాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ముందే కేంద్రాన్ని హెచ్చరించి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు. మా ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు వారు చేసుంటే కేంద్రంపై ఒత్తిడి పెరిగి జూలై 30న విభజనపై తొందరపాటు ప్రకటన వచ్చి ఉండేది కాదు. అయితే  చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళపరుస్తున్నారు.


2008, 2012లో ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేసిన మాదిరిగా లేఖ ఇచ్చి రాష్ట్రాన్ని ఇష్టమున్నట్లు విభజించుకోండని చెప్పారు. చంద్రబాబు సహకారం వల్లే విభజన ప్రకటన వచ్చింది. అన్ని ప్రాంత ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని గట్టిగా ఎందుకు చెప్పలేకపోయారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి జలాల విషయంలో చిక్కుముడులున్నాయి. విభజన వల్ల కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచినీరు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలి.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామంటున్నారు కానీ దానికి నీరు ఎక్కడ్నుంచి వస్తోంది? అలాగే శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితి కూడా అంతే. వీటికి జవాబేలేదు. ఈ రోజు రాష్ట్రంలోని ప్రతీ గ్రామం నుంచి పది మందికి పైగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఇలా ఏదో ఒక విధంగా హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇలా అరవై ఏళ్లుగా ఉంటున్న వారి విషయంలో కేసీఆర్ మాటలు చూస్తే భయాందోళనలు కలుగుతున్నాయి. అంతేకాదు రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్ నుంచే రూ.90 వేల కోట్ల ఆదాయం లభిస్తోంది.


రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? సంక్షేమ పథకాలు ఏ విధంగా నడిపించాలి. పరిస్థితులు అంతా ఈ విధంగా ఉంటే చంద్రబాబు మాత్రం... నాలుగు లక్షల కోట్లు ఇస్తే అన్ని సర్దుకొని వెళ్లిపోతాం. కొత్త రాజధాని నిర్మించుకుంటామంటున్నారు. చంద్రబాబు తోడుగా ఉన్నారనే కాంగ్రెస్ ముందూవెనక ఆలోచన చేయకుండా విభజన చేస్తోంది. పైగా సీమాంధ్రకు సంబంధించి రాజధాని విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చిచ్చుపెడుతోంది. కర్నూలు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు అంటూ ఒక్కోసారి ఒక్కో పేరు చెబుతూ ఇక్కడ కూడా విద్వేషాలు రగిలిస్తోంది. 

అందుకే దీక్ష చేస్తున్నా...

కాంగ్రెస్ పార్టీ ఒక వైపు తెలంగాణ ప్రక్రియ ఆగదు అంటూనే మరోవైపు ఏమైనా సమస్యలుంటే ఆంటోని కమిటీకి చెప్పండని అంటోంది. ఆ కమిటీ కూడా రాష్ట్రానికి రాదట! ఢిల్లీ వచ్చి చెప్పమంటోంది. ఇప్పటిదాకా ప్రణబ్ కమిటీ, రోశయ్య, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీలన్నీ చూశాం. ఆంటోనీ కమిటీ వల్ల న్యాయం జరుగుతుందని నమ్మకం లేకనే జగన్‌బాబు, నేను పదవులకు రాజీనామా చేశాం. పది, పదిహేను రోజులుగా ఇన్ని కోట్ల మంది రోడ్లెక్కి ఉద్యమం చేస్తున్నా.. ఎన్జీవోలు పెన్‌డౌన్ చేస్తున్నా కాంగ్రెస్‌కు పట్టడం లేదు. అందుకే నేను ఈనెల 19 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆకాంక్షిస్తుంది.. ప్రజల మధ్య అసూయకు తావు లేకుండా ఉండాలనేదే మా ధేయ్యం.

ఐదవ రోజుకు చేరిన శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ ఆమరణ దీక్షలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డిలు చేపట్టిన దీక్ష 5వ రోజుకు చేరింది. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్ర నాథ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేతల బ్లడ్‌షుగర్‌, సోడియం లెవల్‌ తగ్గాయని, దీక్షను ఇంకా కొనసాగిస్తే ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. 
 
ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, అమర్‌నాథ్‌రెడ్డిల చేపట్టిన ఆమరణ దీక్షలు 2వ రోజుకు చేరాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాన్ని  వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్‌ జిల్లా వ్యాప్తంగా రహదారుల దిగ్బంధం, రోడ్లపైనే వంటావార్పు కార్యక్రమాలను సమైక్యాంధ్రవాదులు కొనసాగిస్తున్నారు. 

‘సీమాంధ్ర అగ్ని గుండంగా మారడానికి సోనియానే కారణం’

Written By news on Thursday, August 15, 2013 | 8/15/2013

‘సీమాంధ్ర అగ్ని గుండంగా మారడానికి సోనియానే కారణం’
తిరుపతి: సీమాంధ్ర అగ్ని గుండంగా మారడానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే కారణమని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విన్నూత్నంగా  నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భూమన పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రజల  కళ్లలో సోనియా గాంధీ కారం కొట్టారనే పొట్లాలను భూమన పంపిణీ చేశారు.
 
 
 ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితులకు సోనియానే ప్రధాన కారణమన్నారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. విజయమ్మ దీక్ష ప్రకటనతో కాంగ్రెస్-టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఆమె దీక్షకు సీమాంధ్ర ప్రజలు మద్దతుగా ఉంటారని భూమన తెలిపారు.

'విజయమ్మ దీక్షకు పూనుకోవడం శుభపరిణామం'

అనంత: రాష్ట్ర ప్రయోజనల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్ష చేయడానికి పూనుకోవడం శుభపరిణామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం  మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. విజయమ్మ దీక్షను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఆమె చేపట్టబోతున్న దీక్షకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 
సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ దీక్షను స్వాగతిస్తున్నామని సమైక్యాంధ్ర రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ బుధవారం తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, మహిళా, కార్మికులందరూ విజయమ్మ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు పెద్దఎత్తున ముందుకు రావాలని కోరారు. సీమాంధ్రకు చెందిన మాజీ మంత్రులు, రాజకీయేతర ప్రముఖులు, ఉద్యోగ జేఏసీ నాయకులు, విద్యార్థి నాయకులు, మేధావులు, రైతు నాయకులతో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు శివాజీ తెలిపారు

చంద్రబాబు వల్లే రాష్ట్రం రెండుముక్కలు

ఒంగోలు : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్రం రెండు ముక్కలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడివి అవకాశవాద రాజకీయాలని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తాను అనుకూలమేనంటూ ఒకవైపు కేంద్రానికి లేఖ ఇచ్చి, తర్వాత ఇప్పుడు మాత్రం మాట మారుస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీపై కూడా జూపూడి ప్రభాకర రావు తీవ్రంగా మండిపడ్డారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని ఆయన విమర్శించారు.

టీడీపీ దొంగ దీక్షను జనం నమ్మరు

సీమాంధ్రలోని టీడీపీ ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర అంటూ దొంగ దీక్ష చేస్తే జనం నమ్మె పరిస్థితిలో లేరని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ గురువారం విజయవాడలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశంపార్టీ గతంలో లేఖ ఇచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ నేతలు క్విట్ సోనియా అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకే తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు నిరవధిక దీక్ష చేపడుతున్నట్లు జోగి రమేష్ ఈ సందర్బంగా  వివరించారు.

అయితే తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పూటకోమాట మార్చి పబ్బం గడుపుకుంటున్నారని కంకిపాడు మాజీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ విజయవాడలో ఆరోపించారు. 2008లోనే తెలంగాణాకు అనుకూలం అంటూ బాబు కేంద్రానికి లేఖ ఇచ్చారన్నారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు స్ఫష్టమైన వైఖరిని తెలిపిన తరువాతే దీక్ష చేపట్టాలని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణుతోపాటు దేవినేని నెహ్రూలు టీడీపీ ఎమ్మెల్యే ఉమాకు సూచించారు

లాల్ జాన్ బాషా మృతి పట్ల విజయమ్మ దిగ్బ్రాంతి

తెలుగుదేశంపార్టీ ఉపాధ్యక్షుడు లాల్ జాన్ బాషా ఆకస్మిక మృతి పట్ల వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిరాడంబరుడు, సౌమ్యుడైన లాల్ జాన్ బాషా రోడ్డు ప్రమాదంలో మరణించడం తన మనసుసు కలిచివేసిందని తెలిపారు.

మైనార్టీల అభ్యున్నతికి ఆయన  అంకితభావంతో విశేషమైన కృషి చేశారని చెప్పారు. పార్లమెంట్ లో ఇరుసభలకు ఎన్నికై పలు ప్రజా సమస్యలపై స్పందించి ప్రజాహిత రాజకీయాల్లో కొనసాగారని విజయమ్మ వివరించారు. లాల్ జాన్ బాషా కుటుంబసభ్యలకు వైఎస్ విజయమ్మ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తు లాల్ జాన్ బాషా ప్రయాణిస్తున్న కారు నల్గొండ జిల్లాలోని నార్కెట్ పల్లి సమీపంలోని కామినేని ఆసుపత్రి వద్ద డివైడర్ ను డీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటనలో బాషా అక్కడికక్కడే మృతి చెందారు

వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

వైఎస్ ఆర్ సీపీ కార్యాలయంలో ఘనంగా  స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలువైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగిస్తున్న వైఎస్ విజయమ్మ.
హైదరాబాద్: : కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేధించడానికి ప్రజలే ఒక సైన్యంగా మరి ఉప్పెనలా వచ్చే రోజు త్వరలోనే ఉందని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. నగరంలోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ విజయమ్మ గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ ప్రసంగించారు.


క్రాంగెస్ పార్టీలో అగ్రనేతలకే స్వాతంత్ర్యం వచ్చింది కానీ ...ప్రజలకు కాదని ఆమె స్ఫష్టం చేశారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజించు- పాలించు సిద్ధాంతాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రజలకు ఓటేయాలి విజయమ్మ ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఎదిరిస్తే జైలులో పెడుతున్నారు తెలిపారు.


ఓట్లు- సీట్లే పరమావధిగా తీసుకున్న ఏ నిర్ణయాన్ని ఏ ఒక్కరూ హర్షించరని ఈ సందర్భంగా విజయమ్మ తెలిపారు. చంద్రబాబుది పూటకో మాట, రోజుకో తీరులా వ్యవహారిస్తున్నారని విజయమ్మ మండిపడ్డారు. చంద్రబాబు సహకారం వల్లే విభజన జరిగిందన్న సంగతి బహిరంగ రహస్యమని పేర్కొన్నారు. విభజనను సమర్థిస్తూ చంద్రబాబు కాకి లెక్కలు చెప్పారన్న సంగతిని విజయమ్మ ఈసందర్భంగా గుర్తు చేశారు.వైఎస్‌ను ప్రేమించే హృదయానికి, జగన్, షర్మిలను అక్కున చేర్చుకున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు విజయమ్మ తెలిపారు.


దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధి, సంక్షేమంలను  రెండు కళ్లుగా భావించారన్నారు. అన్ని ప్రాంతాలకు మేలు చేసే విధంగా ఆ మహానేత సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన జరిగితే అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాలకు సమన్యాయం జరగాలని తమపార్టీ మొదటినుంచి అడుగుతోందని వైఎస్ విజయమ్మ తెలిపారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతోపాటు పలువురు కార్యకర్తలు అధిక సంఖ్య జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.

HAPPY INDEPENDENCE DAY

HAPPY INDEPENDENCE DAY


Photo: Happy Independence Day

Like, Share and Spread our Party official page and help in growing the community (https://www.facebook.com/ysrcpofficial)

Vijayamma to take up indefinite fast

Written By news on Wednesday, August 14, 2013 | 8/14/2013

రాష్ట్ర విభజనపై ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ

రాష్ట్ర విభజనపై ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షురాలు, ప్రజా ప్రతినిధులంతా ఎందుకు తమ పదవులకు రాజీనామా చేయాల్సివచ్చిందో శ్రీమతి విజయమ్మ ఒక లేఖ ద్వారా ప్రధానిమంత్రి మన్మోహన్ సింగ్‌కు తెలియజేశారు. అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవరికీ అన్యాయం జరగకుండా, ఒక తండ్రిలా నిర్ణయం తీసుకోని పక్షంలో కేంద్రంలో పాలకులు రాజ్యాంగ ద్వారా రాష్ట్రాన్ని విభజించే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం ధర్మం కాదని, రాష్ట్రాన్ని యధావిధిగా కొనసాగించటమే ధర్మమని అన్నారు.
 
 రాష్ర్టంలో ఉన్న మూడు పార్టీలు-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, సీపీఐ(ఎం) ఈ మూడూ ఒకే మాట చెబుతున్నాయని, న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని విడగొట్టవద్దు. యథావిధిగా కలిపే ఉంచండి..అంటున్నాయని వివరించారు. ఒకవైపు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తున్నప్పుడు, బంద్‌లు జరుగుతున్నప్పుడు..వంద శాతం ఏకాభ్రిప్రాయం రాజకీయ పార్టీలన్నింటి మధ్య సాధించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ పార్టీ ఎలా చెప్పగలుతోందని ప్రశ్నించారు.
 
 రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఒప్పుకున్నది-తెలుగుదేశం పార్టీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ, బిజేపీ ఈ ఐదు పార్టీలు మాత్రమేనని, ఓట్ల కోసం, సీట్ల కోసం అధికార పార్టీ అన్యాయం చేస్తుంటే..ఓట్లు పోతాయని , సీట్లు పోతాయని,తనకు రావాల్సిన క్రెడిట్ పోతుందని ప్రతిపక్షంలో ఉన్న కొన్ని పార్టీలు విభజన ద్వారా జరిగిన అన్యాయాన్ని గురించి స్పందించకుండా ఉంటే , ఇక ఈ రాష్ట్రం తరుపువారు ఇక్కడివారి గోడు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు.
 
 ‘‘ కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉందంటే..నెత్తిన  తుపాకీ పెట్టి ఒప్పుకుంటారా? చస్తారా అని అడిగినట్లు ఉందన్నారు.  ఒకవేళ అంగీకరించకపోయినా, మా ఇష్టం ప్రకారం చెయ్యాల్సింది చేస్తాం ..అన్నట్టు ఉంది. ఇక్కడ రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చింది..అని కాంగ్రెస్ వారు చెప్పటం తప్పుదారి పట్టించటం కదా? ఇలా ఎందుకు కేంద్రంలో అధికారంలో ఉన్నవారు చెబుతున్నారో? ఇన్ని కోట్ల మంది రాష్ట్రాన్ని విడగొట్టదని చెబుతున్నా..వీరందరి జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమేనా?’’ అని ప్రశ్నించారు.
 
 తమ రాజీనామా సందర్భంలో మేము విడుదల చేసిన లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నామని,దాన్ని చదివి ఇక్కడి సమస్యల్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండని కోరారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంటే, తమకు అధికార బలం ఉంది కదా అని నిర్ణయం తీసుకుంటే..రాష్ట్రం మనిషి చేసిన ఎడారిగా మారుతోందని హెచ్చరించారు. అలాంటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని తరతరాలు దోషిగా భావిస్తాయన్నారు.

విభజించాలంటే ప్రాతిపదిక, హేతుబద్ధత ఉండాలి

Dr. Mysura Reddy pressmeet at YSRC Central office on 14th August 2013

 న్యాయం చేయలేనప్పుడు, ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 19 నుంచి విజయవాడలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి ఈ విషయం ప్రకటించారు. అందరికీ ఆమోదయోగ్యం అయ్యేలా పరిష్కారం చూడాలని కేంద్రానికి తాము మొదటి నుంచీ చెబుతున్నామని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం తీరు చూస్తే ఆ దిశలో ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం లేదని మైసూరారెడ్డి విమర్శించారు.‌ కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ఏకపక్షంగా, నిరంకుశంగా ఉందని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించాలంటే ప్రాతిపదిక, హేతుబద్ధత ఉండాలని అన్నారు.‌ కానీ రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని విభజించాలనే కుట్ర పన్నుతున్నట్లు కనిపిస్తోందని దుయ్యబట్టారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మద్దాల రాజేశ్‌ కూడా పాల్గొన్నారు.

ఏ కోణంలో చూసినా ఒక ప్రాంతంలోని సీట్ల కోసం మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకున్నదనిపిస్తోందని మైసూరారెడ్డి ఆరోపించారు. గతంలో రాష్ట్ర పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ ప్రభుత్వమే వేసిన శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సుల గురించి పార్లమెంటులో ఎప్పుడూ కూడా చర్చించిన పాపాన పోలేదని మైసూరారెడ్డి తెలిపారు. ఆ సిఫార్సులు ఈ ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్లు కూడా కనిపించడం లేదన్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్‌ పార్టీ తరఫున హైపవర్‌ కమిటీని ఎఐసిసి వేసిందని, ఇతర పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఆ కమిటిని ఏ విధంగా సంప్రదిస్తారని మైసూరా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు మాత్రమే ఆ కమిటీతో మాట్లాడుకోవచ్చట. అది కూడా పిసిసి అధ్యక్షుడు ఎవరికి అపాయింట్‌ ఇమ్మంటే వారికి మాత్రమే ఇస్తారట అని ఎద్దేవా చేశారు.

రాజధాని గురించి, రాజ్యాంగపరమైన చిక్కుల గురించి కాంగ్రెస్‌ పార్టీ ఆలోచన చేసినట్లు లేదని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ఇరు ప్రాంతాలకు హైదరాబాద్‌ను పది సంవత్సరాలు రాజధానిగా ఉంచితే పరిపాలన ఏ విధంగా సాధ్యమవుతుందన్న ఇంగితజ్ఞానం కూడా వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు లేకపోవడం దారుణం అన్నారు. నదీజలాల పంపిణీ సమస్య చాలా చిక్కుతో కూడుకున్నదన్నారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకోకుండా కాంగ్రెస్‌ పార్టీ ఒంటెత్తు పోకడలు పోతోందని మైసూరారెడ్డి దుయ్యబట్టారు. విభజన అందరితోనూ చర్చించాల్సిన సమస్య అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ మాటలు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఒక మీడియా ప్రతినిధి అడిగినప్పుడు మైసూరా వ్యాఖ్యానించారు. దిగ్విజయ్‌సింగ్‌ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంటోనీ కమిటీ ముందుకు తమ పార్టీ వెళ్ళే ప్రసక్తే లేదని మరో ప్రశ్నకు ఆయన స్పష్టంచేశారు.
http://www.ysrcongress.com/news/top_stories/smt-vijayamma-indefinite-fast-from-19th-august-at-vijayawada.html

‘వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీకి ఇంగిత జ్ఞానం లేదు’

‘వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీకి ఇంగిత జ్ఞానం లేదు’
హైదరాబాద్: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ రాజీకీయ వ్యవహారాల పార్టీ కమిటీ సభ్యడు మైసూరారెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజనపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీ అని పిలవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనకు సంబంధించి బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరికి, హేతుబద్దత లేకపోవడానికి ఇదొక ఉదాహరణని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సమావేశం.. ఆ పార్టీకే పరిమితమైనపుడు మిగతా పార్టీలు ఎలా మాట్లాడతాయన్నారు. జాతీయహోదా కల్గిన కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల కన్నా దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం అవలంభిస్తున్న తీరు రాజకీయ లబ్ధి కోసమే అని మైసూరా అభిప్రాయపడ్డారు.
 
 కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్‌లో హడావుడి చేసే కంటే.. గవర్నర్ వద్దకు వెళ్తే మంచిదని ఆయన సూచించారు. టీడీపీ నేతలు పార్లమెంట్‌లో ఎందుకు ఆందోళన చేస్తున్నారని మైసూరా ప్రశ్నించారు. ప్రభుత్వం కూలిపోయే యోచనే వారి కుంటే గవర్నర్ వద్ద వెళితే సరిపోతుందన్నారు. పీసీసీ చీఫ్ అనుమతితో ఆంటోని కమిటీ ముందు తమ వాదనలు వినిపించాలనడం హాస్యాస్పదమన్నారు.

పొత్తుల కోసం చంద్రబాబు పాట్లు

పొత్తుల కోసం చంద్రబాబు పాట్లుచంద్రబాబు
ఆయనకు అధికాం లేకపోయినా, జాతీయ స్థాయిలో చక్రం తిప్పకపోయినా  నిద్రపట్టదు. ఆయన ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు. అయినా ఆయన అధికారంలోకి రావడానికి పడరాని పాట్లు పడుతున్నారు. మళ్లీ అధికారంలోకి రాలేనని తెలిసినా, అధికారంలోకి రాగానే తొలి సంతకం పలానా దానిపై పెడతానాని చెప్పడం మాత్రం మానరు. అధికారంపై ఆయనకు అంత ఆశ. 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ఎమ్మెల్యేలను పశువులతో పోల్చడానికి కూడా వెనుకాడరు.  మహానుభావుడు ఎన్టీఆర్ ను దెబ్బతీసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అని మీకు ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది.

 రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే కాదు, దేశంలో కూడా వచ్చే ఎన్నికల్లో  మూడవ కూటమిదే అధికారమని, చక్రం తిప్పేది కూడా తానేనని ఇప్పటివరకు ఆయన కలలు కన్నారు.  ఇప్పుడు చంద్రబాబుకు  అసలు విషయం బోధపడినట్లుంది.  తానేది చెప్పినా జనం నమ్మరని ఒక నిర్ణయానికి వచ్చేసినట్లున్నారు.  మిత్రులు లేనిదే వచ్చే ఎన్నికల్లో  గట్టెక్కలేనని గట్టి నమ్మకానికి వచ్చేశారు.  అందుకే బీజేపీతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపధ్యంలో చంద్రబాబు పథకం ప్రకారం పావులు కదులుతున్నాయి. నాడు మతతత్వ పార్టీ అని దూరంగా పెట్టిన బీజేపీకి మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  చంద్రబాబు పథకంలో భాగంగానే బావమర్థి బాలయ్య, నమ్మిన బంటు మురళీమోహన్‌ మొన్న హైదరాబాద్‌ వచ్చిన బిజెపి ప్రచార సారధి, గుజరాత్ ముఖ్యమంత్రి  నరేంద్ర మోడీని కలిసినట్టు స్పష్టమవుతోంది.  సినీ పరిశ్రమ తరపున వీళ్లిద్దరూ నరేంద్ర మోడీని కలిసినా, అసలు ఉద్దేశం వేరే ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు పథకంలో భాగంగానే మోడీ నోటి నుంచి ఎన్టీఆర్‌ పేరు వచ్చినట్టు తెలుస్తోంది. తన ప్రసంగంలో ఎన్టీఆర్‌ను నరేంద్ర మోడీ ఆకాశానికి ఎత్తారు. కేంద్రంలో  కాంగ్రెస్సేతర పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ప్రధాన కారణం ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు.  

1999లో చంద్రబాబు బీజేపీతో దోస్తీ చేశారు. నాటి ఆ మైత్రీ బంధం  బాగా కలిసొచ్చింది. అప్పటి వరకు రాష్ట్రంలో చిన్న పార్టీగా  ఉన్న బీజేపీ, పొత్తు కారణంగా నాటి ఎన్నికల్లో  ఏకంగా ఏడు స్థానాల్లో విజయం సాధించింది.  అంతకు ముందుగాని, ఆ తర్వాతగాని బీజేపీ ఆ స్థాయిలో రాష్ట్రంలో గెలిచిన దాఖలాలు  ఇప్పటి వరకూ లేవు. 1999 నుంచి 2004 వరకు 30 మంది ఎంపీలతో టీడీపీ కేంద్రంలో ఎన్ డిఏ  ప్రభుత్వంలో చక్రం తిప్పింది. ఆ కూటమికి చంద్రబాబు నాయుడు కన్వీనర్‌గా కూడా వ్యవహరించారు. గోధ్రా ఘటనల తర్వాత మైనార్టీ ఓటర్లు దూరమవుతారనే భయంతో,  2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీతో దోస్తి కట్ చేశారు.  నాటి నుంచి ఆ పార్టీతో అంటిముట్టనట్టుగానే వ్యవహరించారు. మారిన రాజకీయ పరిణామాలలో ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కీలక మిత్రుడవసరమని భావిస్తున్న చంద్రబాబు మనస్సు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఏ మోడీ కారణంగానైతే బీజేపీకి దూరమయ్యారో,  ఇప్పుడు అదే  మోడీతో జట్టు కట్టేందుకు తహతహలాడుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని వస్తున్న ఎన్నికల సర్వేలు,  దేశ యువతంతా  మోడీ మ్యాజిక్‌కు దాసోహమంటోందని వస్తున్న కథనాలు చంద్రబాబును పునరాలోచనలో పడేసినట్టు కనిపిస్తోంది.  మోడీపై ఉన్న మోజు ద్వారా  రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే ఆలోచనలో చంద్రాబబు ఉన్నట్లు అర్ధమవుతోంది.  

 1999లో బీజేపీతో పొత్తు కుదుర్చుకొని కేంద్రం ద్వారా అన్ని పనులు చేసుకున్న చంద్రబాబు రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. 1999 ఎన్నికల్లో  12 మంది బీజేపీ తరపున గెలిస్తే, 2004 వచ్చేసరికి ఆ సంఖ్య రెండుకు పడిపోయింది.  ఏ ఇజాలు లేవు ఉండేది టూరిజమేనని కమ్యూనిస్టులను ఎగతాళి చేసిన చంద్రబాబు 2009లో మహాకూటమి పేరుతో  వారితో పొత్తు పెట్టుకొని  దెబ్బకొట్టారు.

2004లో పోయిన అదృష్టం 2009లో వస్తుందనుకున్న చంద్రబాబు ఆశలు అడియాసలే అయ్యాయి.  ఇక ఇప్పటి పరిస్థితి చూస్తే మరీ ఆధ్వాన్నంగా ఉంది. టిడిపి నుంచి 13 మంది ఎమ్మెల్యేలతోపాటు సీనియర్ నేతలు అనేక మంది  వెళ్లిపోయారు.  దాంతో పార్టీలో కార్యకర్తలు కూడా పలచబడిపోయారు. ఈ స్థితిలో వచ్చే ఎన్నికల్లో  టీడీపీ సొంతంగా గెలవలేదన్న విషయం బాబుకు తెలుసు. దాంతో పొత్తుల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.  చంద్రబాబు  వల్లే తాము బలహీనపడ్డామని ఆగ్రహంతో ఉన్న పార్టీలు మరి ఇప్పుడు  ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి. అయితే రాజకీయాలలో ఎవరైనా కలవడానికి అవకాశం ఉందనేది మాత్రం జగమెరిగిన సత్యం. 
http://www.sakshi.com/news/features/chandrababu-try-to-alliance-57058

ఈ దుస్థితికి సోనియా, చిరంజీవి, బాబు కారణం

కడప, 14 ఆగస్టు 2013: ప్రజా కంటక కాంగ్రెస్‌ పాలనకు వ్యతిరేకంగా తాము ఉద్యమిస్తే.. కాపాడిన చరిత్ర చంద్రబాబు, చిరంజీవిలదే అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న అన్ని ఉద్యోగ, ఇతర సంఘాలకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుత దుస్థితికి సోనియా గాంధీ, చిరంజీవి, చంద్రబాబు నాయుడు అని శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్‌రెడ్డి, కడప మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష బుధవారానికి మూడవ రోజుకు చేరుకుంది.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తన పదవులకు రాజీనామా చేసి సీమాంధ్ర ఉద్యమంలోని ప్రత్యక్షంగా రావాలని వైయస్ఆర్‌ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, కడప నగర మాజీ మేయర్ రవీంద్రనాథ్రెడ్డి డిమాండ్ చేశారు. రాజీనామా చేయకుండా చంద్రబాబు ముసలికన్నీరు కారుస్తున్నారని వారు ఎద్దేవా చేశారు. ఈ ప్రజా కంటక ప్రభుత్వం సరిగా పనిచేయలేదు.. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉందని అవిశ్వాస తీర్మానం పెడితే.. తాను కూల్చను నిర్మిస్తానంటూ ఆ రోజు చిరంజీవి ముందుకు వచ్చారని శ్రీకాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. మరోసారి అవిశ్వాసం పెడితే.. తనపై ఉన్న కేసుల నుంచి తనను రక్షించుకునేందుకు ప్రభుత్వాన్ని కాపాడింది చంద్రబాబు అన్నారు. ఆహార భద్రత బిల్లు విఫయంలో సీమాంధ్ర ఎంపిలు, మంత్రులు విప్‌ను ధిక్కరించాకే సీమాంధ్రకు రావాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రజాభిప్రాయానికి మద్దతు తెలపాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ తన ఇష్టానుసారం రాష్ట్రాన్ని విభజించడం చాలా అన్యాయం అని రవీంద్రనాథ్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రం కోసం ఎవరూ ప్రాణత్యాగం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌, టిడిపిల కుమ్మక్కు రాజకీయాల కారణంగానే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని రవీంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర సమస్యలు తెలుసుకునేందుకు ఏర్పా‌టైన ఆంటోని కమిటీకి తెలుగు భాష తెలియదని వారు పేర్కొన్నారు. తెలుగు తెలియని ఆ కమిటీకి విన్నపాలు ఎలా చేయాలని వారు ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కడపలో వారు చేపట్టిన దీక్షకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్, కిరాణా మర్చంట్, రైస్ మిల్లర్ల అసోసియేషన్లు సంఘీభావాన్ని ప్రకటించాయి. కాగా, శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డిలకు వైద్యులు బుధవారం ఉదయం పరీక్షలు నిర్వహించారు. వారిద్దరి పల్సురేటు తగ్గినట్లు పరీక్షల్లో తేలింది.

19 నుంచి విజయమ్మ ఆమరణదీక్ష

19 నుంచి విజయమ్మ ఆమరణదీక్షవిజయమ్మ
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరికి నిరసన తెలుపుతూ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ నెల 19 నుంచి విజయవాడలోఆమరణ దీక్ష చేపట్టనున్నారు. న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని ఆమె దీక్ష చేయనున్నారు.

రాష్ట్ర విభజన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తీసుకున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి విమర్శిస్తోంది. విభజనకు కాంగ్రెస్ అనుసరించే విధానాలకు నిరసనగా ఆ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ అబ్దికోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపిస్తోంది. కేంద్రం ఓ తండ్రిలా వ్యవహరించి రెండు ప్రాంతాలకు సమ న్యాయం చేయమని వైఎస్ఆర్ సిపి కోరుతోంది.

http://www.sakshi.com/news/andhra-pradesh/vijayamma-to-go-on-hunger-strike-from-august19-against-congress-policies-57056

జ్ఞాపక శక్తి కోల్పోయిన చంద్రబాబు

జ్ఞాపక శక్తి కోల్పోయిన చంద్రబాబు:శోభానాగిరెడ్డిశోభా నాగిరెడ్డి
కర్నూలు: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జ్ఞాపక శక్తి కోల్పోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. అప్పుడు విభజనన్న బాబు కొత్త రాజధానికి 4 లక్షల కోట్ల రూపాయలు అడిగారు,  ఇప్పుడు యూటర్న తీసుకుని  సమైక్యాంధ్ర అంటున్నారన్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు కపట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

పాలమూరు లిప్ట్ ఇరిగేషన్ సర్వేకు జీవో 72ను విడుదల చేశారు. ఈ  జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిగులు జలాలపై ఆధారపడుతున్న రాయలసీమను ఆదుకోవాలని కోరారు. జీవో వెనక్కి తీసుకునేంతవరకు రాయలసీమ మంత్రులు ప్రతాపరెడ్డి, టిజి వెంకటేష్లను నిలదీయాలన్నారు. రాయలసీమకు నీళ్లు అందేంతవరకు వైఎస్ఆర్ సీపీ  న్యాయపోరాటం చేస్తుందని హెచ్చరించారు.

‘ఓదార్పు’ వద్దన్నవాళ్లు... తామెందుకు ఓదార్చలేకపోయారో?

‘ఓదార్పు’ వద్దన్నవాళ్లు... తామెందుకు ఓదార్చలేకపోయారో?
 జగన్ కోసం - 444రోజులు: అన్నా... మీరు చేసిన తప్పేమిటి? అన్యాయంగా మిమ్మల్ని కటకటాల్లో పెట్టి, ప్రజలతో మీరు గడపవలసిన అమూల్యమైన సమయాన్ని ఈ బడుగు, బలహీనవర్గాల వారిని అక్కున చేర్చుకోవడమేనా మీరు చేసిన మహా నేరం? ప్రజాధనాన్ని దోచుకున్నవారు కేంద్రం ఆశీస్సులతో సుఖంగా ఉన్నారే! మీకేంటి ఇంతటి శిక్ష?! ఓదార్చడమే తప్పయిందా? ప్రజాబంధువైన మీ నాన్నగారి ఆశయాల కోసం నిరంతరం శ్రమిస్తుండడమే నేరమా? మీరు జైల్లో ఉన్నందుకు ఈ కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీల నాయకులు సంతోషిస్తున్నారేమో కానీ, మిమ్మల్ని అభిమానించే కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. మీ చిరునవ్వును చూడకుండా, మీ చేతి స్పర్శ లేకుండా, ధీమా ఇచ్చే మీ పలుకు లేకుండా ఎంతకాలం మేం గడపాలి? ఎన్నికల బరిలో వయసులో చిన్నవారైన మీతో పోటీ పడలేక, అధిష్టానం మిమ్మల్ని ప్రజల మధ్యలోనే లేకుండా చేయడానికి వేసిన ఎత్తుగడ... అరెస్టు. అందుకోసం సీబీఐని అడ్డుపెట్టుకుంది.
 
  మీ నిర్దోషిత్వం త్వరలోనే వెల్లడవుతుంది. అధికార ఒత్తిడులకు తలొగ్గి మిమ్మల్ని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు తల దించుకునే పరిస్థితి వచ్చి తీరుతుంది. కాంగ్రెస్ లక్ష్యం కానీ, తెలుగుదేశం ధ్యేయం కానీ ఎన్నికల్లో గెలవడం తప్ప, ప్రజాసంక్షేమం కాదు. మీ మాదిరిగా ఈ కాంగ్రెస్ నాయకులు ఆనాడు బాధితులను ఓదార్చే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు? వై.ఎస్.ఆర్.ని అంతటివారనీ ఇంతటివారనీ ఆనాడు ఆకాశానికి ఎత్తేసినవారు, ఆయన మరణంతో గుండె ఆగిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి కూడా వెళ్లలేదేం? తనయుడిగా మీరు చేసినట్లు, ఆ మహానేత అనుచరులుగా వారు ఎందుకు బాధితుల ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. దీన్నిబట్టే అర్థం అవుతోంది కదన్నా... ఎవరు నిజమైన నాయకుడో, ఎవరు ప్రజలకు అవసరమైన నాయకుడో! జనం కోసం జగన్, జగన్ కోసం జనం అన్నమాట ముమ్మాటికీ నిజం. అందుకే మీ విడుదల కోసం ప్రజానీకం ఎదురు చూస్తోంది. ఎన్నికల్లో మీ విజయం కోసం పాటుపడేందుకు సిద్ధంగా ఉంది.
 - ములకలపల్లి సుధాకర్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ జిల్లా
 
  అధిష్టానం చెప్పినట్లు వినేవారు... ప్రజానాయకులు ఎలా అవుతారు?
 ఇంత చిత్రమైన రాజకీయాలను, విశ్వాసఘాతుక విమర్శలను మేమెన్నడూ చూడలేదు, వినలేదు! మాట తప్పని, మడమ తిప్పని ఒక యువనాయకుడికి ఇన్ని కష్టాలా? ఆ కుటుంబంపై ఇన్ని విమర్శలా? ఇన్ని కుట్రలా? ఒక ఇంట్లో తండ్రి మరణిస్తే, వారసత్వంగా కొడుకే బాధ్యతలు స్వీకరిస్తాడు. రాష్ట్రంలోని కోట్లాదిమంది నిరుపేదలకు పెద్ద దిక్కులాంటి నాయకుడైన వై.ఎస్.ఆర్.గారు మరణిస్తే ప్రజల బాధ్యతను జగన్ తీసుకోవడం న్యాయమే కదా! అక్రమాస్తులు అంటున్నారు? ఒక్కదానికైనా రుజువుందా? రుజువులు ఉన్న చంద్రబాబుు, వాద్రాలను వదిలిపెడతారు, జగన్‌ను మాత్రం జైల్లో ఉంచుతారు! ఇదేం అరాచకం? రాజకీయాలలో అధికారమే పరమావధి కావచ్చు.
 
  కానీ ఆ అధికారం కోసం ఒక ప్రజానాయకుడిని జైల్లో నిర్బంధించడం అప్రజాస్వామికం కాదా! ధైర్యముంటే నేరుగా పోరాడండి, ప్రజా తీర్పు కోరండి. అంతే తప్ప నియంతల్లా మారి, నోటికొచ్చినట్లు మాట్లాడకండి. అలా మాట్లాడి వీరు సాధిస్తున్నదేమిటంటే.... ప్రజల విశ్వాసం కోల్పోవడం. ఈ కాంగ్రెస్, తెలుగుదేశం పెద్దల్ని... ఒక్కర్నైనా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పమనండి... జగన్‌కున్నంత ప్రజాదరణ తమకు ఉందని! చెప్పలేరు. ఎందుకంటే రాజకీయం కోసమే రాజకీయాల్లోకి వచ్చినవారు కారు జగన్. ప్రజాసంక్షేమం కోసం తండ్రి తరఫున వచ్చినవారు. ప్రజలు ఏ నాటికైనా అలాంటి మనిషినే తమ నాయకుడిగా ఎన్నుకుంటారు తప్ప, అధికారం కోసం అధిష్టానం చెప్పినట్లు వినే నాయకులనుకాదు.  
 - టి.రజనీకాంత్, మెదక్
 మా చిరునామా:  జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@ gmail.com

ఘన విజయం సాధిస్తాం..

నిజామాబాద్ : తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బాజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల మారిన రాజకీయ పరిణామాలతో పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అపోహలను దూరం చేశారు. రానున్న రోజుల్లో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ విషయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు అవలంబిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇచ్చినట్లే ఇచ్చిన కాంగ్రెస్ మరోవైపు సీమాంధ్రలో ధర్నాలు, రాస్తారోకోలు చేయిస్తోందని విమర్శించారు. చంద్రబాబు కూడా తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే యూ టర్న్ తీసుకున్నారని ఆరో పించారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూనే.. సీమాంధ్రలోని ఆ పార్టీ నేతలను ఉసిగొల్పుతున్నారని బాబుపై విమర్శలు గుప్పించారు. ప్రజలను మోసం చేస్తున్న ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
 
అతిగా స్పందిస్తున్నారు..
తమ పార్టీ పట్ల కొన్ని పత్రికలు, చానళ్లు అతిగా స్పందిస్తున్నాయని బాజిరెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడే ఆ పార్టీని వీడిపోయినా పెద్దగా పట్టించుకోని కొన్ని పత్రికలు.. తమ పార్టీ నుంచి ఒకరిద్దరు నేతలే వెళ్లిపోయినా అత్యుత్సాహం చూపుతూ కథనాలు రాస్తున్నాయని, ఇందులో ఆంతర్యమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో తమ పార్టీని బలహీనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పదవులు, స్వప్రయోజనాలు ఆశించి వచ్చిన ఒకరిద్దరు నేతలే పార్టీ మారుతున్నారన్నారు. వారికి ఆయా పార్టీల్లోనూ ఆశించిన స్థానం దక్కదని పేర్కొన్నారు. ఒకరిద్దరు నేతలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీ బలహీనపడబోదన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారన్నారు.
 
ఘన విజయం సాధిస్తాం..
‘ఇందిరాగాంధీపైనా కేసులు బనాయించి జైలులో పెట్టారు.. కానీ ఆమె బయటకు రాగానే ఎన్నికల్లో గెలిచి దేశాన్ని పాలించారు. అలాగే మహానేత వైఎస్ అకాల మరణం తర్వాత తమ పార్టీ అధినేత జగన్‌ను కూడా తప్పుడు కేసులతో జైలులో పెట్టారు. ఆయన బయటకు వచ్చి ఘన విజయం సాధిస్తారు’ అని బాజిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమవేశంలో జుక్కల్ నియోజకవర్గ సమన్వయకర్త నాయుడు ప్రకాశ్, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ సులోచన, యువజన విభాగం రాష్ట్ర నాయకుడు బాజిరెడ్డి జగన్, జిల్లా కన్వీనర్ కంఠం ధర్మరాజు, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ పంచరెడ్డి చరణ్, అధికార ప్రతినిధులు రఫీక్‌ఖాన్, విజయలక్ష్మి, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, నాయకులు గంగాధర్, అనిల్ కులకర్ణి, పండిత్‌ప్రేమ్, రమాకాంత్, అరుణజ్యోతి, సునీత, భారతి, ఇస్మాయిల్, ప్రకాశ్, కె.నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Popular Posts

Topics :