15 September 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

కిరణ్‌కుమార్‌రెడ్డికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్

Written By news on Saturday, September 21, 2013 | 9/21/2013

నోట్‌కు ముందే సమైక్య తీర్మానం చేయండి
సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్
http://www.ysrcongress.com/news/top_stories/pass-assembly-resolution-for-samaikyandhra.html
హైదరాబాద్, 21 సెప్టెంబర్ 2013: రాష్ట్ర విభజనపై కేంద్రం నోట్‌ రాక ముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి పంపించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని విజ్ఞప్తి చేసింది. పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సూచన మేరకు 3,112 కిలోమీటర్లు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పూర్తిచేసిన శ్రీమతి షర్మిల, ఆమెతో పాటు పాదయాత్రలో పాల్గొన్న వారిని, పాదయాత్రలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ తీర్మానం చేసినట్లు అంబటి రాంబాబు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా చేసిన రాష్ట్ర విభజనపై కేంద్ర హోంమంత్రి నోట్‌ రాక ముందే.. దాన్ని ఆపడం కోసం సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మరో తీర్మానం చేసినట్లు తెలిపారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తరువాత రాంబాబు మీడియా ప్రతినిధులకు సమావేశం వివరాలను వెల్లడించారు.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు గోడ మీది పిల్లిలా చంద్రబాబు ఉండడానికి వీల్లేదని, తక్షణమే ఆయన, టిడిపి ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేయాలని డిమాండ్‌చేస్తూ తీర్మానం చేసినట్లు చెప్పారు. చంద్రబాబు సమైక్యవాదో, ప్రత్యేక వాదో చెప్పాలని అన్నారు. యాత్రల పేరుతో డ్రామాలాడవద్దని హితవు పలికారు. సమైక్య వాదిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోజు కొడుతున్నారని, కేంద్రం రోడ్‌ మ్యాప్‌లు అడిగినప్పుడు ఇచ్చారని, జూలై 30న సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకునే ముందు సిఎంతో అనేక దశల్లో మంతనాలు జరిపిందన్నారు. నిర్ణయం తీసుకున్న తరువాత పది రోజుల దాకా కిరణ్‌ మాట్లాడని వైనాన్ని అంబటి వేలెత్తి చూపించారు. సీమాంధ్రలో ఉద్యమం పెరిగిపోయిన తరువాత తాను కూడా సమైక్య వాదినే అని మాట్లాడడాన్ని రాంబాబు తప్పుపట్టారు. 
విభజన విషయం ముందే తెలిసినా మౌనంగా ఉన్న కిరణ్‌రెడ్డి ఇప్పుడు మాట్లాడడమేమిటని ప్రశ్నించారు. విభజన నిర్ణయంతో రాష్ట్రం రావణకాష్టంలా మారిపోయిన సమస్య అయిందన్నారు. రాష్ట్రపతి పంపించినప్పుడు తీర్మానం చేస్తామని కాకుండా తక్షణమే అసెంబ్లీని సమావేశ పరిచి, విభజన సమస్యను చర్చించి, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తీర్మానం చేసి పంపాలని కాంగ్రెస్‌ పార్టీని, ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేస్తూ మరో తీర్మానం చేసినట్లు తెలిపారు.
సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న దశలో జెఎసిలు ప్రజాప్రనిధులు రాజీనామాలు చేసేలా ఒత్తిడులు పెంచాలని పార్టీ విస్తృత సమావేశం డిమాండ్‌ చేసిందని అంబటి చెప్పారు. రాజీనామాలు చేయకుండా సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నామని నాటకాలాడుతున్న వారిని కూడా రాజీనామాలు చేసేలా జెఎసిలు ఒత్తిడి చేయాలని కోరింది.

నెల రోజుల సమైక్య కార్యాచరణ:

సమైక్య ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 1 వరకూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణను పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు. అక్టోబర్‌ 1న గుంటూరు నుంచి విజయవాడ వరకూ పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల భారీ ర్యాలి నిర్వహిస్తారు. మహాత్మా గాంధీ జయంతి రోజు అక్టోబర్‌ 2న సీమాంధ్రలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరాహార దీక్షలు చేయాలని పార్టీ కో ఆర్డినేటర్లను ఆదేశించింది. వారితో పాటు ఔత్సాహికులైన వారు నిరవధిక నిరాహార దీక్షలు కూడా చేయాలని సూచించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ అధ్యక్షతన శనివారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించింది.

విభజన విషయంలో రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న మంత్రులు, కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధుల ఇళ్ళ ముందుకు అక్టోబర్‌ 7 వ తేదీన వెళ్ళి పదవులకు రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పుష్పగుచ్ఛాలు ఇచ్చి శాంతియుతంగా డిమాండ్ చేయాలని పార్టీ సమావేశం తీర్మానించింది. 10వ తేదీన అన్ని మండల కేంద్రాల్లోనూ రైతులతో దీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాంబాబు తెలిపారు.
17 అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సమైక్య నినాదంతో రిక్షాలు, ఆటోలతో ర్యాలీ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇక 21న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలతో వంటావార్పూ, ముగ్గులు లాంటి కార్యక్రమాలు, మానవహారాలు నిర్వహించాని తీర్మానించింది. 24వ తేదీన అన్ని నియోజకవర్గాల్లోనూ యువతతో బైక్‌ ర్యాలీలు నిర్వహించనున్నట్లు అంబటి వెల్లడించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన‌ గ్రామ సర్పంచ్‌లు, సర్పంచ్‌లుగా పోటీచేసి ఓడిపోయిన వారందరితో 26న జిల్లా కేంద్రాల్లో ఒక రోజు నిరాహార దీక్ష చేయాలని పార్టీ సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. 29న విద్యార్థులు, యువకులతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీమాంధ్రలోని అన్ని గ్రామ పంచాయతీలలోనూ సమైక్యాంధ్ర తీర్మానాలు చేయాలని కోరుతూ పార్టీ విస్తృత భేటి నిర్ణయించిందని అంబటి చెప్పారు.

సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎంత తీవ్రంగా ఉన్నా విభజిస్తామని, నోట్‌ సిద్ధం చేస్తున్నామని చెబుతున్న కేంద్ర మెడలు వంచి అయినాసరే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందని అంబటి పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

చంద్రబాబుపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్

http://www.ysrcongress.com/news/top_stories/ysr-congress-demands-cbi-probe-on-chandrababu.html
టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తిచేసింది. ఈమేరకు శనివారం ఆ పార్టీ లెజిస్లేచరి కమిటీ గవర్నరును కలిసి వినతి పత్రం సమర్పించింది. గవర్నరుకు రాసిన లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది..

గౌరవనీయులైన
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర
గవర్నరు గారికి,


చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తొమ్మిదేళ్ళూ రాష్ట్రం రోజుకో కుంభకోణంతో అతలాకుతలమైంది. కాగ్ వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. తక్కువ సామర్థ్యం గల విద్యుత్తు ప్రాజెక్టుల మంజూరు, బీపీఎల్ పవర్ ప్రాజెక్టు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థయిన ఏపీజిపిసిఎల్ కంటే 200శాతం ఎక్కువగా స్పెక్ట్రమ్, జీవీకే సంస్థలకు  ధరను నిర్ణయించడం అంశాలపై కాగ్ చంద్రబాబునాయుడు వైఖరిని తూర్పారపట్టింది. ఏపీజీపీసీఎల్ తన 174 మెగావాట్ల కంబైన్డు సైకిల్ గ్యాస్ బేస్‌డ్ పవర్ ప్రాజెక్టుకు మెగావాట్ ధర 2.70కోట్ల రూపాయల ధరను అమలుచేయగా.. జివికె, స్పెక్ట్రమ్ కంపెనీలకు 4.50కోట్లుగా చేసుకునేందుకు అనుమతించారు. 
వివిధ ప్రాజెక్టుల మంజూరు, కాకినాడ ఓడరేవు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్ సిటీ ప్రాజెక్టు, ఐఎమ్‌జీ, ఇమార్, కోనసీమ పవర్ ప్రాజెక్టు, తదితరాల కేటాయింపులో చంద్రబాబుపై లెక్కకుమిక్కిలి ఫిర్యాదులు వచ్చాయి. హైటెక్ సిటీ ప్రాజెక్టుకు గ్లోబల్ టెండర్లు పిలవకుండానే కొద్దిమందికే పరిమితం చేసి తన అభిమాన ఎల్ అండ్ టి కంపెనీకి రాష్ట్రానికి కేవలం 11 శాతమే ఈక్విటీ లభించేలా చేశారు. హైటెక్ సిటీకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు వాణిజ్య ప్రాంతంలో అత్యంత ఖరీదైన స్థలాన్ని ఉచితంగా ఇచ్చింది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో స్థలాన్ని కేటాయించిన యజమానికి 50 శాతం ఈక్విటీ షేర్ ఇచ్చారు. ఈ అంశంలో చట్టాన్ని చంద్రబాబు ఏ రకంగా తోసిరాజన్నారో సుస్పష్టం.
ఐఎమ్‌జీ భారత్ సంస్థకు మార్కెట్ విలువకంటే అయిదు శాతం కంటే తక్కువ ధరకు భూముల కేటాయింపు టీడీపీ హయాంలో చోటుచేసుకున్న అవినీతిలో ప్రముఖమైనది. ఇది భారత దేశంలోనే అతి పెద్ద కుంభకోణాలలో ఒకటి. క్రీడలకు ప్రోత్సాహం ముసుగులో  అత్యంత ఖరీదైన భూముల్ని చేజిక్కించుకోవడానికి రచించిన పక్కా ప్రణాళిక ఇది. 2003లో రాష్ట్ర అసెంబ్లీ రద్దయిన తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం 850 ఎకరాలను చంద్రబాబు నాయుడు సన్నిహితుడైన చిత్తూరు జిల్లాకు చెందిన అహోబిల రావు ప్రమోటర్ గా ఉన్న ఐఎమ్‌జీ కంపెనీకి కేటాయించారు. ఈ అంశాన్ని చంద్రబాబు కనీసం క్యాబినెట్ దృష్టికి కూడా తీసుకెళ్ళలేదు. ఎమ్ఓయూ ప్రకారం సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఐఎమ్‌జికి ఎకరానికి యాబై వేల రూపాయల చొప్పున ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. వాస్తవానికి మార్కెట్ విలువ ప్రకారం ఎకరా మూడు కోట్ల రూపాయలు. శంషాబాద్ ప్రాంతంలోని 450 ఎకరాలను కూడా ఇచ్చారు. ఆ స్థలం ఇప్పుడు ఎంతో అమూల్యమైనదిగా మారింది. ఈ స్థలాన్ని ఎకరం 25వేల రూపాయలకు చంద్రబాబు ప్రభుత్వం విక్రయించింది. విమానాశ్రయం ప్రారంభించిన అనంతరం మరో 25వేలు చెల్లించేలా నిబంధన పెట్టింది. ఆ ప్రాంతంలో రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు వినియోగించేందుకు ఈ మొత్తాన్ని ఉద్దేశించింది. ఈ స్థలం విలువ ఎకరం కోటి రూపాయల వరకూ ఉంది. ఐఎమ్‌జీ యూఎస్ అనుబంధ సంస్థని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం విశ్వసించింది. వాస్తవానికి  ఐఎమ్‌జీ తాను ఫ్లోరిడాలోని ఐఎమ్జీ అకాడమీ అనుబంధమని రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించింది. ఈ అంశంపై చర్చలు గానీ, సంప్రతింపులు గానీ జరిగిన దాఖలాలు లేవు. ఐఎమ్జీ సంస్థ కేవలం లక్ష రూపాయలు మాత్రమే షేర్ క్యాపిటల్ గా చెల్లించింది. అందులో 99శాతాన్ని అహోబిలరావు తన అధీనంలో ఉంచుకున్నారు. మిగిలిన ఒక శాతాన్ని ఆయన సోదరుడు ప్రభాకరరావు తన స్వాధీనంలో ఉంచుకున్నారు. కుప్పంలో ప్రశ్నార్థకంగా మిగిలిన ఇజ్రాయిల్ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రభాకరరావుకు మంజూరయ్యేలా చంద్రబాబు వ్యవహరించారు. ఇంతే కాకుండా.. ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన ఎనిమిది స్టేడియాలను శ్యామ్ కంపెనీకి 45 సంవత్సరాల లీజుకు ఇచ్చారు. ఇందులో మొదటి ఐదు సంవత్సరాలు స్టేడియాల నిర్వహణకు ఏడాదికి 2.5 కోట్ల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. 45 సంవత్సరాల తర్వాత తాను నిర్ణయించిన ధరకు వాటిని ఐఎమ్జీ కొనుగోలు చేస్తుంది. మూడేళ్ళపాటు నీరు, విద్యుత్తు సౌకర్యాలను ఉచితంగా కల్పించడంతోపాటు పదేళ్ళ పాటు వీటి ఆదాయంపై వినోదపన్ను మినహాయింపునిచ్చింది. ఈ మొత్తం లావాదేవీ వెనుక టీడీపీ ప్రభుతవ్వ పెద్దల హస్తముంది. ఈ అంశంలో మరో విచిత్రమైన విషయమేమిటంటే దర్యాప్తునకు సిబ్బంది లేరని సీబీఐ తప్పించుకోవడం. ఇదే సీబీఐ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారి ఇళ్ళపై దాడులకు మాత్రం 28 బృందాలను ఏర్పాటుచేసి, రోజుల వ్యవధిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

2001లో టీడీపీ ప్రభుత్వం ఇమార్ సంస్థకు ఎకరానికి 28 లక్షల రూపాయల చొప్పున 535 ఎకరాలను కేటాయించింది. 1998లోనే అక్కడికి సమీపంలోని తన భూమిని చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి ఎకరా కోటి రూపాయలకు విక్రయించారు. బీహెచ్ఈఎల్ వంటి సంస్థకు ఈ స్థలాన్ని ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున రాయితీ విక్రయించి ఉంటే ఆదాయం సమకూరుతుందనీ, ఉపాధి దొరుకుతుందనీ అనుకుని ఉండేవారం, కానీ అది లగ్జరీ విల్లాల నిర్మాణానికీ, గోల్ఫు కోర్సు ఏర్పాటకూ ఆ స్థలాన్ని ఇమార్ కొనుగోలు చేసింది. ఎందుకింత సబ్సిడీని ప్రభుత్వం ఇచ్చింది అనే ప్రశ్నకు ఇమర్ ప్రమోటరుతో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సంబంధబాంధవ్యాలున్నాయి. 250 ఎకరాలు చాలన్న ప్రమోటరుకు 500 ఎకరాలు కేటాయించిన చంద్రబాబు ఉదారత చాటడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదు. ఈ ప్రాజెక్టు కూడా గ్లోబల్ టెండర్ల ద్వారా నిర్ణయించలేదు. ఆహ్వానించిన కొద్దిమంది పెట్టుబడుదారుల మధ్యే ఈ ఒప్పదం జరిగిపోయింది. ఇమార్ అంశంపై లోతుగా విచారించిన సీబీఐ చంద్రబాబు నాయుడు విచారించడానికి తిరస్కరించింది. ఇమార్ ప్రాజెక్టు వల్ల 1200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

ఇవే కాక, ఏలేరు కుంభకోణం, టీడీపీ నేతలతో కలిసి రామకృష్ణగౌడ్ పాల్పడిన దొంగ నోట్ల వ్యవహారం, స్టాంప్ పేపర్ల కుంభకోణం కూడా ప్రస్తావనార్హం. కోలా కృష్ణమోహన్ తో చంద్రబాబు ఏ విధంగా అంటకాగిందీ అందరికీ తెలిసిందే. 
సీపీఎం పార్టీ తెలుగు దేశం ప్రభుత్వం కుంభకోణాలను వివరిస్తూ ఏకంగా చార్జీషీటునే విడుదల చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా చంద్రబాబు నాయుడుపై 1998లో వంద ఆరోపణలు చేసింది. తమకు కనుక అధికారం ఇస్తే చంద్రబాబునాయుడును అరెస్టు చేస్తామని కూడా ఆ సందర్భంగా తెలిపింది. అనంతరం, లోక్ సభలో చంద్రబాబు మద్దతు అవసరమై చార్జి షీటు సంగతినే మరిచింది. 

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మద్దతు అవసరం కావడంతో చంద్రబాబుకు మరోసారి అదృష్టం కాలిదగ్గరకొచ్చింది. 90మంది టీడీపీ ఎమ్మెల్యేల  మద్దతుతో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోంది. ప్రజల మీద భారాన్ని మోపుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుపై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ అందుకే పట్టించుకోవడం లేదు. 

ప్రస్తుతం చంద్రబాబు రాష్ట్రాన్ని విభజించడంలో కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభావాన్ని కనీసం తెలంగాణ ప్రాంతంలోనైనా తగ్గించాలనే తాపత్రయంతో ఆయన ఈ కుయుక్తికి పూనుకున్నారు. ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడనే నానుడిని అనుసరించి కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశవాద పొత్తును కొనసాగిస్తూ, చంద్రబాబుపై దర్యాప్తులు చేయించకుండా కాలం వెళ్లదీస్తోంది. అవినీతి, అనైతికతల ఛాంపియన్ అయిన చంద్రబాబు తన హయాంలో సాగిని కుంభకోణాలను మరిచి, ప్రస్తుతం తాను అవినీతి పారదోలతానని చెబుతున్నారు. అక్టోబర్ 2న న్యూఢిల్లీలో అవినీతి వ్యతిరేక సదస్సును నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు. 
సమానత్వం కోరుకునే వారు ముందు తమ చేతలను నిష్కళంకంగా ఉండాలనే నానుడిని గుర్తుతెచ్చుకోవాలి.  ఈ క్రమంలో టీడీపీ హయాంలో సాగిన అవినీతి, అక్రమాలపైన, ప్రత్యేకంగా ఇమార్, ఐఎమ్జీ వ్యవహారలపైనా సీబీఐ దర్యాప్తు చేయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి.

మీ విశ్వసనీయులు 

వైయస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచరి పార్టీ

అందరూ రాజీనామా చేయాలి

అందరూ రాజీనామా చేయాలి: విజయమ్మ డిమాండ్
హైదరాబాద్: సమైక్య రాష్ట్రం కోసం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశ ముగింపు సందర్భంగా ఆమె ప్రసంగించారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు,  కేంద్రరాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతో సహా టీడీపీ ఎంపిలు, ఎమ్మెల్యేలంతా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేద్దామని పిలుపు ఇచ్చారు. ఓట‌్లు, సీట్ల కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాటాలు చేయదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీలే ఆ పని చేస్తాయన్నారు.

సమైక్య ఉద్యమాన్ని కార్యకర్తలు, నేతలు, అభిమానులు బాగా చేశారన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ఉద్దృతం చేద్దామని పిలుపు ఇచ్చారు.  చంద్రబాబు తన లేఖను వెనక్కు తీసుకోవాలని గట్టిగా ఒత్తిడి తెద్దామని చెప్పారు. ప్రజలందరి బాగు కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఎప్పటికీ పాటుపడుతుందన్నారు. మనమంతా కలిసి వైఎస్ఆర్ కలలుకన్న సువర్ణయుగం సాధిద్దామని చెప్పారు.

 వైఎస్‌ విజయమ్మ అధ్యక్షత వహించిన  పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి  పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర పాలక మండలి సభ్యులు, జిల్లా, మండల నేతలు హాజరయ్యారు.

నెల రోజుల పాటు ముమ్మరంగా సమైక్య ఉద్యమం

నెల రోజుల పాటు ముమ్మరంగా సమైక్య ఉద్యమం: అంబటి రాంబాబువిస్తరించు & ప్లే క్లిక్ చేయండి
హైదరాబాద్ : నెల రోజుల పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 1 వరకూ ఉద్యమ కార్యాచరణను పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శనివారం ప్రకటించారు. అక్టోబర్‌ 1న గుంటూరు నుంచి విజయవాడ వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తారని, అక్టోబర్‌ 2 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు సహా పార్టీ శ్రేణుల నిరవధిక, రిలే నిరాహారదీక్షలు జరుగుతాయని ఆయన చెప్పారు. అలాగే అక్టోబర్ 7న కాంగ్రెస్, టీడీపీ నేతల నివాసాల వద్ద ధర్నాలు చేస్తారని, అక్టోబర్‌ 10న మండల కేంద్రాల్లో రైతులతో దీక్ష నిర్వహిస్తారని అన్నారు.

అక్టోబర్‌ 17న నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీ చేస్తారు. 21న నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలతో నిరసన కార్యక్రమాలు ఉంటాయి. 24న నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. 26న సర్పంచ్‌లు, సర్పంచ్‌గా పోటీచేసిన అభ్యర్థులు కలిసి జిల్లా కేంద్రాల్లో ఒకరోజు దీక్ష చేస్తారు. అక్టోబర్‌ 29న నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో నిరసన కార్యక్రమాలు ఉంటాయి. నవంబర్ 1న అన్ని పంచాయతీల్లో గ్రామసభలు, సమైక్యాంధ్ర కోరుతూ తీర్మానాలు చేయనున్నట్లు అంబటి రాంబాబు ప్రకటించారు.

సమైక్య ఉద్యమంలో మనదే ముందంజ: షర్మిల


హైదరాబాద్ : సమైక్య ఉద్యమంలో వైఎస్సార్‌సీపీ ముందంజలో ఉందని పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొని.. నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలంతా వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నారని, విభనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయడంతో ప్రజల్లో మనపట్ల విశ్వాసం పెరిగిందని తెలిపారు. నిర్ణయం వెలువడక ముందే విభజనను వ్యతిరేకించిన పార్టీ వైఎస్సార్‌సీపీ ఒక్కటేనని ఆమె అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు కూడా అత్యంత ప్రాధాన్యమైనవని ఈ సందర్భంగా షర్మిల చెప్పారు. మన ఉద్యమానికి ఉద్యోగుల నుంచి మంచి మద్దతు లభిస్తోందని, ఉద్యమంలో మరింత దూకుడుగా వెళ్తామని తెలిపారు.
నియోజకవర్గాల సమన్వయ కర్తలంతా సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్నారని, ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని షర్మిల తెలిపారు. ఓట్ల కోసం సీట్ల కోసం కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని విభజిస్తోందని,
టీడీపీ అధినేత చంద్రబాబు అందుకు పూర్తిగా సహకరించారని మండిపడ్డారు. తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండడం కోసమే 

సమైక్య ఉద్యమంలో మనదే ముందంజ: షర్మిలమనం పోరాడుతున్నామని, రాష్ట్ర ప్రజలు సంక్షేమంగా ఉండడం కోసం పోరాడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల రాజీనామాకు ఒత్తిడి పెంచాలని సూచించారు. విభజనకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేయాలని సమావేశంలో షర్మిల పిలుపునిచ్చారు.

YSRCP leaders meet Governor on Tealngana issue

అదే స్పూర్ఫితో ముందుకు వెళ్లాలి

అదే స్పూర్ఫితో ముందుకు వెళ్లాలి: విజయమ్మ
హైదరాబాద్ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పుట్టి మూడేళ్లు పూర్తికాకుండానే... పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని... ఇదే స్పూర్తిని 2014 ఎన్నికల్లో కొనసాగించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పిలుపునిచ్చారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టి దిగ్విజయంగా కొనసాగించిన పథకాలే స్ఫూర్తిగా ముందుకు సాగుతామన్నారు.
వైఎస్‌ఆర్‌ మూడు ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వైఎస్‌ విజయమ్మ అధ్యక్షత వహించారు. ఈ భేటికి పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర పాలక మండలి సభ్యులు, జిల్లా, మండల నేతలు హాజరయ్యారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్ సూచనల మేరకు.. వైఎస్‌ విజయమ్మ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

బాబుకు ఆత్మ లేదు... గౌరవం లేదు: మేకపాటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కోరామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నెల్లూరు లోక్ సభ సభ్యుడు మేకపాటి రాజమోహనరెడ్డి వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజభవన్ లో గవర్నర్ ను కలసి విజ్ఞప్తి చేశారు. అనంతరం రాజభవన్ బయట ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మేకపాటి మాట్లాడుతూ... అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాల్లోని ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని గవర్నర్ కు వివరించామన్నారు.
 
రాష్ట్ర విభజనపై నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకోవాలని కోరామని చెప్పారు. ఓ వేళ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే హైదరాబాద్ లాంటి నగరం సీమాంధ్రలో నిర్మించుకోవాలంటే ఎన్నేళ్లు పడుతుందని అని మేకపాటి ప్రశ్నించారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో తెలంగాణ, సీమాంధ్రుల శ్రమ ఉందని తెలిపారు. విభజన వల్ల ఏర్పడుతున్న సమస్యలపై పరిష్కారం చెప్పకుండా రాష్ట్రాన్ని విభజించడం ఎంతవరకు కరెక్ట్ ఆయన మరోసారి ప్రశ్నించారు.
 
విభజన ప్రకటన వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, అవేమి పట్టించుకోకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు న్యూఢిల్లీలో తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఓ వైపు తగలబడుతోంటే చంద్రబాబు నీరో చక్రవర్తిలా వ్యవహారిస్తున్నారని వ్యాఖ్యానించారు.
 
చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు నవ్విపోతారన్నారు. చంద్రబాబుకు ఆత్మలేదు... గౌరవం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీలు రాజకీయంగా ఎదుర్కొనలేకే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోందని మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు.

గవర్నర్ ను కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో శనివారం ఆయన నివాసమైన రాజభవన్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు ఈ సందర్బంగా గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాసు, అమర్నాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, గొల్లబాబురావు, గుర్నాథరెడ్డి, బాలినేని, ప్రసన్నకుమార్ రెడ్డి, బాలరాజు, శ్రీనివాసులు, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, దేవగుడి నారాయణరెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, మేక శేషుబాబు తదితరులు ఆ భేటీలో పాల్గొన్నారు.

అసలు ఇది ప్రజాస్వామ్యమేనా..?

కాంగ్రెస్, టీడీపీలకు జనఘోష పట్టదా? : విజయమ్మ
ఇంత జరుగుతున్నా చలనం రాదా?: విజయమ్మ ఆవేదన
 సమైక్య రాష్ట్రం కోసం కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలి
 చంద్రబాబు తన లేఖను వెనక్కు తీసుకోవాలి.. టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి
 రాష్ట్రం రావణ కాష్టంగా రగలటానికి కారణం కచ్చితంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ సీపీ రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కోరింది
 పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారు... నేనూ, జగన్ నిరాహార దీక్షలు చేశాం

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ముఖ్యమంత్రితో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దానిని వెనక్కి తీసుకోవాలని, ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు రోడ్డెక్కి రోజుల తరబడి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలో ఎందుకు చలనం రావటం లేదని విజయమ్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టేందుకు వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
 
 దాంతో వారంతా పోలీసుస్టేషన్ వద్దే ధర్నా చేపట్టారు. ఈ విషయం తెలిసి పార్టీ ప్రజాప్రతినిధులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్తున్న మంత్రులకు చేతనైతే అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమైక్యత కోసం తమ పార్టీ ప్రజాప్రతినిధులు చేపట్టిన నిరసన కార్యక్రమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన ధోరణిని ఆమె తప్పుబట్టారు.
 
 అసలు ఇది ప్రజాస్వామ్యమేనా..?
 ‘‘నిరసన తెలపటం రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు గర్హనీయం. అసలు ఇది ప్రజాస్వామ్యమేనా..?’’ అని విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘రాష్ట్రాన్ని విభజిస్తూ నోట్ తయారైందన్న నేపథ్యంలో మా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన దీక్ష చేపట్టదలచారు. తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్‌లకు నివాళి అర్పించి.. అసెంబ్లీకి వెళ్లి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపాలనుకున్నారు. కానీ, పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అరెస్ట్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించటం బాధాకరం. ఇటీవలే జగన్‌బాబు దీక్ష సందర్భంగా ఆసుపత్రిలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులమైన మమ్మల్ని కూడా లోపలికి అనుమతించకపోవటంతో నిరసన తెలిపిన కార్యకర్తలందరినీ చావబాదారు. పోలీస్‌స్టేషన్ తీసుకెళ్లి ఇష్టానుసారం కొట్టారు. ప్రభుత్వం ఇంతలా ఎందుకు వ్యవహరిస్తోందో అర్థంకావట్లేదు’’ అని ఆమె నిరసన తెలిపారు.
 
 గంటసేపు సీడబ్ల్యూసీలో చర్చించి నిర్ణయమా?
 ‘‘రాష్ట్రం ఈ రోజు రావణకాష్టంలా మండుతోంది. అన్నదమ్ముల మధ్య అంతరాలు పెంచుతున్నారు. ఈ పరిస్థితికి కారణం కచ్చితంగా కాంగ్రెస్, టీడీపీలే. కాంగ్రెస్ పార్టీ ఏఒక్కరితో చర్చించకుండా, ప్రజలతో సంబంధం లేకుండా సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష అధినేతగా ఉన్న చంద్రబాబు ఎలాంటి షరతులు లేకుండా విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. దాంతో కాంగ్రెస్ పార్టీ కేవలం గంట సేపు సీడబ్ల్యూసీలో చర్చించి రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకుంది’’ అని ఆమె ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవికి, ఇతర ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు కట్టబెట్టటం, ల్యాంకో రాజగోపాల్‌కు పనులు అప్పగించడం.. వంటి పక్కా ప్రణాళికలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల నోళ్లను ఆ పార్టీ అధినాయకత్వం మూయించిందన్నారు.
 
 వారి నాటకాలు బయటపడుతున్నాయి...
 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు రాష్ట్ర విభజన నిర్ణయం ముందే తెలిసి కూడా... వారి స్వలాభం కోసం ఒక ప్రాంతాన్ని తాకట్టు పెట్టారని విజయమ్మ మండిపడ్డారు. విభజన ప్రకటన జరిగిన పది రోజుల తర్వాత కాంగ్రెస్ నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించి, ప్రజలు అడగాల్సిన ప్రశ్నలను వారే ఎదురు ప్రశ్నించారని.. దీనిని చూస్తే వారి నాటకాలేమిటో స్పష్టంగా బయటపడుతున్నాయని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. ఈ రోజు కేంద్ర, రాష్ట్ర మంత్రులు సమైక్యం అనటమే తప్ప పదవులకు మాత్రం రాజీనామా చేయటంలేదని ఎండగట్టారు. గతంలో ఒక సారి రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినప్పుడు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే నిర్ణయం వెనక్కుపోయిన విషయాన్ని విజయమ్మ గుర్తుచేశారు. అదే విధంగా ఈసారి కూడా పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేస్తే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే అవకాశం కచ్చితంగా ఉంటుందన్నారు.
 
 చంద్రబాబు తన రాజకీయ స్వలాభం కోసం రాష్ట్రాన్ని రెండు చీల్చటానికి సహకరించారని విజయమ్మ దుయ్యబట్టారు. కేంద్రం విభజన ప్రకటన వెలువరిచిన మరుసటి రోజున ప్రెస్ మీట్ పెట్టి బాబు విభజన నిర్ణయాన్ని స్వాగతించారని ఆమె గుర్తుచేశారు. కొత్త రాజధాని కోసం నాలుగైదు లక్షల కోట్లు కావాలని ఆయన అడగటం సిగ్గుచేటన్నారు. ఈ రోజు ఉద్యమం ఇంతపెద్ద ఎత్తున జరుగుతున్నా, ఉద్యోగ సంఘాలు 50 రోజులుగా రోడ్లపై ఉద్యమిస్తున్నా, చంద్రబాబు మాత్రం తన లేఖ వెనక్కి తీసుకోవటలేదని ధ్వజమెత్తారు.
 
 మూకుమ్మడి రాజీనామాలతోనే కేంద్రంపై ఒత్తిడి...
 ‘‘వైఎస్సార్‌సీపీ మాత్రం మొదటి నుంచి ఒకటే మాట చెబుతోంది. విభజనపై మీడియాలో వార్తలు వెలువడుతుండటంలో.. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ పలుమార్లు లేఖలు రాశాం. ఏ నిర్ణయం తీసుకున్నా ఒక తండ్రిలా తీసుకోవాలని కోరాం. అలాంటి పరిస్థితి లేదని తెలిసి కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారు. ఆంటోని కమిటీ ద్వారా కూడా రాష్ట్రానికి ప్రయోజనం ఉండదని భావించి నేను, జగన్‌బాబు పదవులకు రాజీనామా చేశాం. జగన్ జైల్లో ఉన్నా వారం రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. గుంటూరు వేదికగా నేను కూడా దీక్ష చేశా.
 
 అన్యాయాన్ని నిరసిస్తూ షర్మిలమ్మ ‘సమైక్య శంఖారావం’ పేరిట బస్సుయాత్ర చేసింది. మా పార్టీ నేతలందరితో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించాం. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సమైక్యంగా ఉంచాలని సూచించాం’’ అని విజయమ్మ వివరించారు. ‘‘ఇంత చేసినా కేంద్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో చలనం రావటం లేదు. అందుకే టీడీపీ ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు, రాష్ట్రంలోని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి విభజన నిర్ణయం వెనక్కుతీసుకునే అవకాశం ఉంటుంది’’ అని ఆమె పేర్కొన్నారు.

ఎంపీ, ఎమ్మెల్యేలమైన మాకు కూడా రాజధానిలో నడిచే హక్కులేదా?

పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల ఆందోళన భగ్నం
 అసెంబ్లీకి వెళ్లకుండా తెలుగుతల్లి విగ్రహం వద్దే అరెస్టు
 దీంతో పోలీస్ స్టేషన్‌లోనూ కొనసాగిన ధర్నా
 కాంగ్రెస్, టీడీపీ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు
 అసెంబ్లీకెళ్లే హక్కు తమకు లేదా అని నిలదీసిన ఎమ్మెల్యేలు
 చరిత్రహీనుడిగా మిగలొద్దంటూ చంద్రబాబుకు హితవు
 విభజన లేఖను వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్
 రాష్ట్రం కోసం మరిన్ని పోరాటాలు చేయాలి: విజయమ్మ
 నేతలకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేసినపార్టీ గౌరవాధ్యక్షురాలు

 
 ఎన్ని ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో చలనం రావటం లేదు. అందుకే టీడీపీ ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు, రాష్ట్రంలోని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి విభజన నిర్ణయం వెనక్కుతీసుకునే అవకాశం ఉంటుంది.
 - వైఎస్ విజయమ్మ

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ, విభజన పట్ల కాంగ్రెస్, టీడీపీ అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు శుక్రవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ప్రజాప్రతినిధులు, నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కానీ, వారంతా పోలీస్‌స్టేషన్‌లోనూ ధర్నా కొనసాగించారు. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధుల సమైక్య నినాదాలతో పోలీస్‌స్టేషన్ ఆవరణ దద్దరిల్లింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ ఆందోళన కొనసాగింది. అనంతరం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్వయంగా గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నేతలను పరామర్శించారు. సమైక్య డిమాండ్‌పై మరిన్ని ఆందోళనలు చేపట్టాల్సి ఉన్నందున ఈ ఆందోళనను నిలిపివేయాలని సర్దిచెప్పడంతో.. ప్రజాప్రతినిధులు, నేతలు వారి ఆందోళన విరమించారు.
 
 రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో పాటు, విభజన అంశంలో కాంగ్రెస్, టీడీపీ వైఖరులను నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం పదిగంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు పదిహేను మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, పద్నాలుగు మంది తాజా మాజీ ఎమ్మెల్యేలు సచివాలయం వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహం వద్దకు చేరుకుని, నివాళి అర్పించారు. అయితే, తెలుగుతల్లి విగ్రహం పరిసరాల్లో అప్పటికే భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించడంతో పాటు అక్కడ ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. వెంటనే ఆ ముళ్ల కంచెను తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన పట్ల కాంగ్రెస్, టీడీపీల ద్వంద్వ వైఖరులను నిరసిస్తూ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ, ఎలాంటి షరతులూ లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
 
 స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రానికి ద్రోహం తలపెట్టడం మంచిది కాదని, చరిత్రహీనుడిగా మిగలవద్దని చంద్రబాబుకు హితవు చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. అలాగే కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులంతా సీడబ్ల్యూసీ నిర్ణయానికి వ్యతిరేకంగా పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద కొంతసేపు బైఠాయించారు. అనంతరం పొట్టిశ్రీరాములు విగ్రహం వద్దకు వెళ్లి పూలతో నివాళి అర్పించారు. పొట్టి శ్రీరాములు ఆశయసాధన కోసం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ ప్రాణాలైనా అర్పిస్తామంటూ పెద్దపెట్టున నినదించారు. తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, నేతలంతా పాదయాత్రగా ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి, నివాళులర్పించారు.
 
 అక్కడి నుంచి అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసేందుకు బయలుదేరుతుండగానే.. పోలీసులు చుట్టుముట్టి వారిని అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీకి వెళ్లే హక్కు తమకు ఉందంటూ వారు ప్రతిఘటించడంతో తోపులాట చోటుచేసుకుంది. ‘‘మేమంతా అసెంబ్లీకి వెళ్లాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో ప్రజాస్వామ్యయుతంగా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతాం.. మీరు పక్కకు తప్పుకోండి’’ అని వారు కోరినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. దాంతో ఎమ్మెల్యేలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘‘ఎంపీ, ఎమ్మెల్యేలమైన మాకు కూడా రాజధానిలో నడిచే హక్కులేదా?’’ అని నేతలు పోలీసులను నిలదీశారు. పోలీసులు ఇదేమీ పట్టించుకోకుండా, నిరంకుశంగా వ్యవహరిస్తూ నేతలందరినీ వ్యాన్లలో ఎక్కించి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
 
 పోలీస్‌స్టేషన్‌లో ధర్నా: పోలీసులు తమను అడ్డుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో... వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నేతలంతా గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే బైఠాయించి తమ ఆందోళన కొనసాగించారు. కాంగ్రెస్, టీడీపీ వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. చెవుల్లో పూలు పెట్టుకుని, మోకాళ్లపై నిలుచుని.. ఇలా రెండున్నర గంటల పాటు నిరసన తెలిపారు. అయితే, వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నేతలను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ స్వయంగా గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ముందుముందు మరిన్ని పోరాటాలు చేయాల్సి ఉంటుందని నచ్చజెప్పి వారి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం పోలీసులు వారందరినీ సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
 
 ధర్నాలో పాల్గొన్న నేతలు
 ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి... ఎమ్మెల్యేలు భూమా శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, గొల్ల బాబూరావు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి,  కె.శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎ.బాలరాజు, ఆకేపాటి అమరనాథరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి.గుర్నాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కాటసాని రామిరెడ్డి... ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, మేకా శేషుబాబు, దేవగుడి నారాయణరెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు... తాజా మాజీ ఎమ్మెల్యేలు తానేటి వనిత, సుజయకృష్ణ రంగారావు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కొడాలి నాని, పేర్నినాని, ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అమరనాథరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జోగి రమేష్, మద్దాల రాజేష్, బాలనాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదతరులతో పాటు పలువురు పార్టీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు

సమైక్య రాష్ట్రం కోసం వైయస్ఆర్‌సిపి ధర్నా photos

Written By news on Friday, September 20, 2013 | 9/20/2013

https://www.facebook.com/ysrcpofficial

విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: విజయమ్మ
హైదరాబాద్ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టేందుకు వెళుతుండగా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారిని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అరెస్ట్ అయిన  ఎమ్మెల్యేలకు మద్దతుగా విజయమ్మ .... పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధర్నా చేస్తున్న ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయటం దారుణమన్నారు. ఎమ్మెల్యేలను పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొట్టారని విజయమ్మ అన్నారు. అరెస్ట్ లను చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని అనుమానం కలుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

ఎటువంటి షరతులు లేకుండా తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చినందువల్లే రాష్ట్రం ప్రస్తుతం రావణకాష్టంలా మారిందని విజయమ్మ అన్నారు. ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్, టీడీపీ పార్టీలే కారణమన్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుందని.... సమ్మెలో విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని... విభజనపై చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలన్నారు.
విభజన ముందు ఒకలా.... తర్వాత మరోలా చంద్రబాబు మాట్లాడుతున్నారని.... కొత్త రాజధానికి రూ.4,5 లక్షల కోట్లు సరిపోతాయని విభజన ప్రకటనను బాబు సమర్థించారని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు.  సీడబ్ల్యూసీలో గంటసేపు చర్చలు జరిపి కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని.... అప్పట్లో రాష్ట్రవిభజనపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న.... కాంగ్రెస్ ఇప్పుడు కూడా వెనక్కి తీసుకుంటే

తప్పేంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ తాను, వైఎస్ జగన్ నిరాహార దీక్ష చేసామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ రాష్ట్రపతిని కూడా కలిశామని విజయమ్మ తెలిపారు. రాష్ట్రాన్ని విడదీయ వద్దంటూ షర్మిల బస్సుయాత్ర చేశారని ఆమె పేర్కొన్నారు.  చంద్రబాబునాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని విజయమ్మ డిమాండ్ చేశారు.


'జగన్‌ బయటకొస్తే చంద్రబాబు పారిపోతారు'


హైదరాబాద్ : జగన్‌ను చూస్తే టీడీపీ నేతలకు ఎందుకంత భయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, గొల్ల బాబూరావు, కాపు రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. అవినీతికి మూల పురుషుడు చంద్రబాబు అన్నారు. జగన్‌ ఎప్పుడు బయటకొస్తే ఏ దేశం పారిపోవాలని బాబు ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకి ఒళ్లంతా విషముందని అందుకే వైఎస్ కుటుంబంపై ఎప్పుడూ చంద్రబాబు విషం కక్కుతుంటారని అన్నారు. చంద్రబాబును తెలుగు తమ్ముళ్లు వదిలేసే రోజు అతిత్వరలో ఉందని చెప్పారు. జగన్ పై ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని, తామే సీబీఐ డైరెక్టర్లు అన్నట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

వైఎస్సార్ సీపీ సమావేశంలో షర్మిల

వైఎస్సార్ సీపీ సమావేశంలో షర్మిల
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. తన తల్లితో కలిసి షర్మిల కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. షర్మిల మొట్టమొదటిసారిగా ప్రధాన కార్యాలయంలో  పార్టీ సమావేశంలో పాల్గొనడం విశేషం. రేపు జరగనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఎజెండాను ఖరారు చేసే అంశంపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. పార్టీ సీఈసీ సభ్యులు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

రేపు ఉదయం సీజీసీ నేతలతో పాటు పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యులు, జిల్లా కన్వీనర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, అసెంబ్లీ సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులందరితో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సమైక్య ఉద్యమాన్ని గ్రామగ్రామాన విస్తరించడం, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు వీడి సమైక్యం కోసం ఉద్యమించేలా ఒత్తిడి పెంచడంతో పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఈ సమావేశాల్లో ఖరారు చేయనున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అరెస్ట్

శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.  రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు శుక్రవారం  అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టేందుకు తెలుగు తల్లి విగ్రహం నుంచి ర్యాలీగా అసెంబ్లీకి బయల్దేరారు.
అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అరెస్ట్ చేశారు.  అయితే శాంతియుతంగా నిరసన తెలియచేసేందుకు వెళుతున్న తమను బలవంతంగా అరెస్ట్ చేయటం అప్రజాస్వామ్యమన్నారు. అరెస్ట్ చేసినవారిని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ఎటాక్ జగన్.. చంద్రబాబు ఆదేశాలు

ఎటాక్ జగన్.. చంద్రబాబు ఆదేశాలు
సమైక్యోద్యమాన్ని పక్కన పెట్టండి
నాలుగు రోజులూ ప్రెస్‌మీట్లతో హోరెత్తించండి 
తర్వాత మన మీడియా చూసుకుంటుంది
నేను కూడా ఢిల్లీలో చేయాల్సిందంతా చేస్తా
సాక్షి, హైదరాబాద్: 
‘‘ఈ రోజు నుంచి వచ్చే నాలుగు రోజుల పాటు ఏ రోజూ వదలకుండా జగన్‌పై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ విపరీతంగా ప్రచారం చేయండి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్రలో హోరెత్తుతున్న ఉద్యమం గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఇదెందుకని నన్నడగకండి. అది తర్వాత చూసుకుందాం. ముందుగా నేను చెప్పినట్టుగా రోజూ విలేకరుల సమావేశం పెట్టి జగన్ టార్గెట్‌గా ఆరోపణలు గుప్పించండి. మన పత్రికలు వాటినెలా ప్రచురించాలన్నది నాకు వదిలిపెట్టండి. ఈ మూడు రోజులు నేను ఢిల్లీ వెళ్తున్నాను. అక్కడ నేను చేయాల్సింది చేస్తా’’ టీడీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా జారీ చేసిన ఆదేశాలివి!
 
 గురువారం పలువురు నేతలతో ఆయన భేటీ అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కొద్ది రోజులుగా టీడీపీ నేతలు పెడుతున్న విలేకరుల సమావేశాలను, గుప్పిస్తున్న విమర్శలను పరిశీలించారు. రానున్న నాలుగు రోజులు మాత్రం జగన్‌పై ఆరోపణలను పెంచాలని, ఇంకా ఘాటుగా స్పందించాలని ఆదేశించారు. రోజువారీగా ఏ ఏ అంశాలపై దృష్టి సారించాలి, ప్రెస్ మీట్లలో ఎలా మాట్లాడాలన్న దానిపై సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, వర్ల రామయ్య, ఎ.రేవంత్‌రెడ్డిలతో ప్రత్యేకంగా కమిటీ వేశారు. జగన్‌ను టార్గెట్ చేస్తూ అవసరమైతే రోజూ ఉదయం 11 గంటలకు ఒకసారి, సాయంత్రం మరోసారి ప్రెస్ మీట్లు పెట్టాలన్నారు. బెయిల్ కోసం జగన్ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సెప్టెంబర్ 9 లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించడం, ఆ సమయంలో కింది కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించడం తెలిసిందే. దాంతో బెయిల్ కోసం జగన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో, ఆయనపై మరింతగా ఆరోపణలు గుప్పించాలని బాబు నిర్ణయించినట్టు టీడీపీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గడువు ముగిసేదాకా కూడా జగన్‌పై బాబు, టీడీపీ నేతలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తూ రావడం తెలిసిందే.
 
 ‘‘జగన్‌పై హైకోర్టులో కేసు నమోదు చేసింది మొదలు, దర్యాప్తు సాగినంతకాలం ఏదోరకంగా సీబీఐకి సహకరించాం. ఇప్పుడు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ చెబుతోంది గనుక ఇక సీబీఐపైనా విమర్శలు ఎక్కుపెట్టండి’’ అని నేతలకు బాబు చెప్పినట్టు ఆ వర్గాలు తెలిపాయి. దాంతో గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో, టీడీఎల్పీలో వర్ల, రేవంత్, గాలి వేర్వేరుగా విలేకరుల సమావేశాలు నిర్వహించారు. జగన్ బెయిల్ వ్యవహారం, సీబీఐ దర్యాప్తు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు, సాక్షి మీడియా గ్రూపు తదితరాలపై వారు విమర్శలు గుప్పించారు. పలు చానళ్లలో అవి ప్రముఖంగా ప్రసారమయ్యాయి. సీబీఐ వైఎస్సార్ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిందని వర్ల ధ్వజమెత్తారు. జగన్ కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ ఎలా చెబుతుందని ప్రశ్నించారు. దానిపై సీబీఐ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై అవసరమైతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఇంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సాక్షి దినపత్రిక, టీవీ చానళ్లను సీబీఐ ఎందుకు మూసివేయలేదని రేవంత్ ప్రశ్నించారు. వాటిని మూసేస్తే అంతా సంతోషించేవారన్నారు. ‘‘జగన్‌కు వేళకు టిఫిన్, భోజనం లభిస్తున్నాయి. అలాంటప్పుడు బెయిల్ ఎందుకు కోరుతున్నారో చెప్పాలి’’ అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల రాజీనామాలన్నీ బోగస్ అని గాలి విమర్శించారు.
 
 21 నుంచి 23 వరకూ ఢిల్లీలో చంద్రబాబు
 చంద్రబాబు శనివారం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లి, సోమవారం రాత్రో, మంగళవారం ఉదయమో హైదరాబాద్ చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించామని, మరికొందరు పెద్దలను కూడా కలిసే అవకాశముందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు చెప్పారు.

పరాకాష్టకు చేరిన రామోజీ రాతలు

* పరాకాష్టకు చేరిన రామోజీ రాతలు
జగన్ బెయిల్‌పై తీర్పు వెలువడే ముందు విషపు రాతలు
భారతి సిమెంట్‌పై వాస్తవాల్ని వదిలిపెట్టి ఏకపక్ష కథనం
  ప్రైవేటు భూమి కొనుగోలు చేస్తే... ప్రభుత్వానికి నష్టమంటూ రాతలు
*  లీజు పొందిన గుజరాత్ అంబుజా ఐదేళ్లుగా ఫ్యాక్టరీ పెట్టనే లేదు అందుకే రద్దు;
మూడేళ్లలో ఫ్యాక్టరీని సాకారం చేసిన జగన్

*  దానిద్వారా ప్రస్తుతం 8 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి
*  కావాలనే వాస్తవాలను విస్మరించి రామోజీ రంకెలు
*  దర్యాప్తు ఆరంభం నుంచీ ఇవే తరహా విషపు రాతలు
*  దానికి ఎల్లో మీడియా, చంద్రబాబు తందాన తాన
*  విచారణకే స్వీకరించని చార్జిషీటు రామోజీకెలా అందింది?
 వైఎస్ కుటుంబంపై విషంగక్కేలా దారుణ వ్యాఖ్యలు చేస్తూ... మళ్లీ దానికి ‘సీబీఐ చార్జిషీట్’ అనే రంగు పులిమారు. అయినా సీబీఐ కోర్టుకిచ్చిన పత్రాలు ఈనాడు చేతికెలా వచ్చాయి? అవిభక్త కవలల్లాంటి రామోజీ-చంద్రబాబులు సీబీఐతో కుమ్మక్కయిన ఫలితమా ఇది?
 
 నిత్యం ఉషోదయంతోపాటే జగన్ నామ జపం చేయనిదే పొరపాటున కూడా పొద్దు గడవని ‘ఈనాడు’.. వైఎస్సార్‌సీపీ అధినేతపై షరామామూలుగానే మళ్లీ విషం కక్కింది. ఈసారి మరింతగా దిగజారిపోయింది. ఆ క్రమంలో నైచ్యానికే నయా అర్థం చెప్పింది. ‘సీబీఐ వేసిన చార్జిషీట్’ అంటూ గురువారం పతాక శీర్షికల్లో అది వండి వార్చిన కథనాన్ని చూస్తే గోబెల్స్ కూడా గుండెలు బాదుకోవాల్సిందే! ఇంకా బయటికి వెల్లడేకాని, న్యాయమూర్తి విచారణకైనా స్వీకరించని, నిందితుడికి కాపీ కూడా ఇవ్వని చార్జిషీట్‌లోని వివరాలు ఇవేనంటూ శివాలెత్తిపోయి రామోజీ రాసిన రోత రాతలపై..
 
 బరితెగించడానికైనా, దిగజారిపోవటానికైనా ఒక హద్దుంటుంది
 అరాచకానికైనా, నైచ్యానికైనా పరాకాష్టంటూ ఒకటుంటుంది

 కానీ రామోజీరావు, ఆయన విషపుత్రిక ‘ఈనాడు’ వాటన్నిటినీ ఎప్పుడో దాటేశారు!. న్యాయస్థానాల్లో ప్రమాణం చేసి మరీ అవలీలగా అబద్ధాలాడేస్తారు రామోజీ! బంధువుల్ని కూడా వదలకుండా నమ్మినవారిని నిలువునా వంచిస్తారు రామోజీ! ఫోర్జరీ, చీటింగ్  కేసులు ఎదుర్కొంటున్నా... పన్ను కట్టలేదన్న కేసులు పెండింగ్‌లో ఉన్నా... ‘మార్గదర్శి’ పునాదులే అక్రమమని చెప్పే కేసులు న్యాయస్థానాల్లో నడుస్తున్నా... కనీస విలువలు పాటించాలన్న జ్ఞానం ఆయనకు రాకపోవటమే దారుణం. సీబీఐ వేసిన ‘చార్జిషీట్’ అంటూ గురువారం పతాక శీర్షికల్లో ‘ఈనాడు’ వండి వార్చిన కథనమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. అసలు ఏ దర్యాప్తు సంస్థయినా కోర్టుకు చార్జిషీటు సమర్పిస్తే ఆ చార్జిషీటును తొలుత న్యాయమూర్తి విచారణకు స్వీకరించాలి. 
 
అప్పుడే అది బహిరంగమవుతుంది. పెపైచ్చు నిందితుడికి కాపీ ఇస్తారు. కానీ రెండు రోజుల కిందట వేసిన చార్జిషీట్‌ను ఇంకా జడ్జి విచారణకు స్వీకరించనేలేదు. నిందితుడైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికీ దాని కాపీ అందలేదు. కానీ ఇంతలోనే రామోజీ శివాలెత్తేశారు. జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు పిటిషన్‌పై న్యాయస్థానం తీర్పు వెలువరించనుండటంతో... ‘దాన్ని ప్రభావితం చేయడానికా?’ అనే రీతిలో అడ్డగోలు రాతలు రాసేశారు. వైఎస్ కుటుంబంపై విషం గక్కేలా దారుణ వ్యాఖ్యలు చేస్తూ... మళ్లీ దానికి ‘సీబీఐ చార్జిషీట్’ అనే రంగు పులిమారు. అయినా సీబీఐ కోర్టుకిచ్చిన పత్రాలు ఈనాడు చేతికెలా వచ్చాయి? అవిభక్త కవలల్లాంటి రామోజీ-చంద్రబాబులు సీబీఐతో కుమ్మక్కయిన ఫలితమా ఇది?  
 
 బాబుపై దర్యాప్తుకు చేతులు రావు!
 దర్యాప్తు సంస్థతో రామోజీ-చంద్రబాబు కలయిక ప్రభావాన్ని ఇప్పటికే ఈ రాష్ట్రం ప్రత్యక్షంగా చూసింది. చంద్రబాబు, రామోజీల అక్రమాలపై విచారణ జరపండంటూ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులిచ్చినా సరే... సీబీఐ మాత్రం వాళ్ల జోలికే వెళ్లలేదు. ఆఖరికి ఈ మిత్రద్వయం సుప్రీంకోర్టుకు వెళ్లి, అక్కడా కాదన్నాక మళ్లీ హైకోర్టుకు వచ్చి... కేసు రెండు మూడు బెంచిలు మారేలా నాటకమాడేదాకా సీబీఐ కదిలితే ఒట్టు! చివరకు హైకోర్టులో జస్టిస్ రోహిణి నేతృత్వంలోని బెంచ్... అంతకుముందు ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేయటంతో ఆ దర్యాప్తు ఆగిపోయింది. దానికన్నా ముందు ఐఎంజీ  కేసులోనూ ఇంతే. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే... ఇదే సీబీఐ తనకు తగినంత సిబ్బంది లేరనే సాకుతో బాబును వదిలిపెట్టేసింది!!

 అదే సీబీఐ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విషయానికొచ్చేసరికి మాత్రం ఎక్కడలేని సత్తువనూ కూడగట్టుకుని ‘నభూతో...’ అన్న రీతిలో రెచ్చిపోయింది. 29 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ... ఇళ్లు, ఆఫీసులు, ఇన్వెస్టర్ల కార్యాలయాలు అన్నిటిపై ఏకకాలంలో దాడులు చేసి మరీ... 14 రోజుల్లోనే కోర్టుకు నివేదిక సమర్పించింది. బాబు-రామోజీ ద్వయం సీబీఐతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలకు ఇవన్నీ బలం చేకూర్చేవే కాదా?
 
 బాబు దొరికినా వదిలేశారందుకే!!
 బాబు అడ్డంగా దొరికింది ఐఎంజీ కేసులో మాత్రమే కాదు... ఎమ్మార్, రాంకీ కేసుల్లో కూడా. ఎందుకంటే శ్రీమంతుల గోల్ఫ్ కోర్సుకు ప్రభుత్వ భూమి ఇవ్వాలన్న ఆలోచన బాబుదే. 200 ఎకరాలివ్వాలనుకున్నా... అది చాలదని దాన్ని 435 ఎకరాలకు పెంచిందీ బాబే. ఎమ్మార్‌కు టెండరు దక్కేలా చక్రం తిప్పటమే కాక... అంత భూమినీ పప్పుబెల్లాలకు కట్టబెట్టేసిందీ ఈ బాబే. అన్ని చేసినా ఎమ్మార్‌పై దర్యాప్తులో మాత్రం బాబును వదిలేసింది దర్యాప్తు సంస్థ.
 
అదేమని కోర్టు అడిగితే... 2004 కన్నా ముందు జరిగిన దాన్ని తాము దర్యాప్తు చేయటం లేదని కూడా చెప్పింది!! ఏమనుకోవాలి ఈ బంధాన్ని? రాంకీ సంస్థకు విశాఖ ఫార్మా సిటీలో 2,142 ఎకరాలను సింగిల్ టెండర్‌పై కట్టబెట్టింది కూడా బాబే. కానీ ఈ అంశంపై దర్యాప్తు చేసినపుడు... గ్రీన్‌బెల్ట్ పెంచుతామని ప్రతిపాదించి పెంచనందుకు వైఎస్ ప్రభుత్వాన్నే సీబీఐ తప్పుబట్టింది తప్ప... 2,142 ఎకరాల్ని సింగిల్ టెండర్‌పై ఎలా కట్టబెట్టారని బాబును అడిగితే ఒట్టు! బాబుకెందుకు ఈ నజరానాలు? రాజ్యసభలో ఎఫ్‌డీఐ బిల్లుకు పరోక్షంగా మద్దతిచ్చినందుకా? రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలను గాలికొదిలేసినందుకా? రూ.32,000 కోట్ల కరెంటు భారం మోపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టిన దెబ్బకు మండిపడుతూ ప్రతిపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానం పెడితే విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్‌ను కాపాడినందుకా?
 
 బెయిల్ అనగానే ఢిల్లీకెందుకో?
 కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు ఇలా ఎన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తారు? చనిపోయిన నాయకుడిపై... అది కూడా మరణించిన ఏడాదిన్నర తరవాత... అది కూడా ఆయన తనయుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పాక... ఇద్దరూ కుమ్మక్కయి కేసులు వేయటం నిజం కాదా? చట్టప్రకారం 90 రోజుల్లో రావాల్సిన బెయిల్‌ను సాక్షుల్ని ప్రభావితం చేస్తారనే సాకుతో అడ్డుకోవటం అబద్ధమా? అయినా జగన్ బెయిల్ పిటిషన్ ఎప్పుడు విచారణకు వచ్చినా చంద్రబాబు ఢిల్లీకెందుకు వెళతారు? తన మనుషుల్నెందుకు పంపిస్తారు? ఏదో ఒక సంచలనాన్ని సృష్టిస్తూ... దాన్ని ఎల్లో మీడియా ద్వారా తాటికాయలంత అక్షరాలతో ఏదో జరిగిపోయినట్టుగా రాయించటం... న్యాయస్థానాల్ని ప్రభావితం చేసే రీతిలోనే ఆ రాతలుండటం... ఇవన్నీ ఎందుకు? ఏం! జగన్‌మోహన్‌రెడ్డికి బెయిలొస్తుందంటే బాబుకు అంత భయమెందుకు? రామోజీకి అంత ఉలుకెందుకు? జగన్ జనం గుండెల్లో ఉన్న నేత కనుక ఆయన బయటికొస్తే తమ చిరునామాలు గల్లంతౌతాయనా?
 
 కొనగలవా రామోజీ?
 ఇక్కడ రామోజీ గమనించాల్సిందేంటంటే... వైఎస్ రాజశేఖరరెడ్డి గనక నిజంగా తన కుమారుడికి మేలు చేయాలనుకుంటే ఎల్ అండ్ టీకి బాబు కట్టబెట్టినట్లుగా హైదరాబాద్ నడిబొడ్డున ఎకరా ఏ రూ.4 వేలకో ఇస్తారు గానీ... ఇలా ప్రైవేటు భూములను ఎకరా రూ.3 లక్షలు పై చిలుకు పెట్టి కొనుక్కునేలా ఎందుకు చేస్తారు? నిజం చెప్పాలంటే ప్రభుత్వ భూముల్లో ఉంటేనే మైనింగ్ లీజులకు విలువ. ఎందుకంటే కారుచౌకగా కట్టబెట్టే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేటు భూముల్లోనైతే కొనుగోలుదారే డిమాండ్‌కు తగ్గ ధర చెల్లించి మరీ కొనాలి. రామోజీ గనక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే అలాంటి భూములు చాలానే ఉంటాయి. అయినా సున్నపురాయి నిక్షేపాలు సిమెంట్ కంపెనీకి కాక దేనికైనా పనికొస్తాయా? సిమెంట్ కంపెనీకి వాటిని లీజుకిస్తే తప్పేంటి?
 
 అంబుజా ఎందుకు ఫ్యాక్టరీ పెట్టలేదు?
 గుజరాత్ అంబుజా కంపెనీ 2000 నుంచి 2005 వరకూ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టలేదన్న విషయం రామోజీ రాతల్లో కనిపిస్తుంది. దాన్ని ఏమాత్రం ప్రశ్నించని రామోజీ.. అలా చేయనందుకే ఆ లీజును జగన్‌కుఇచ్చారని. జగన్ మూడేళ్లలో ఫ్యాక్టరీ కట్టి చూపించారని మాత్రం చెప్పరు. ఎందుకంటే తన ‘పాలసీ’ పుట్టలో అది పట్టదు మరి! మరీ ఇంత దారుణమా రాజ గురివిందా!! ఈరోజు భారతి సిమెంట్ సంస్థ ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల పైచిలుకు మందికి ఉద్యోగాలు కల్పిస్తోందిగా!
 
  గుజరాత్ అంబుజా అక్కడ ప్లాంటు పెట్టని నేపథ్యంలో, జగన్ కూడా ముందుకు రాకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవా? కడప జిల్లాలో ‘భారతి’ వచ్చేదాకా పాతికేళ్లుగా ఒక్క సిమెంట్ కంపెనీ అయినా వచ్చిందా? అయినా ప్రైవేటు భూమిని కొనుక్కుని కంపెనీ పెడితే ప్రభుత్వానికి పన్నులు, ఇతర సుంకాల వల్ల భారీ ఆదాయమే తప్ప నష్టమెలా వస్తుంది? ఇదేమీ ఫిల్మ్ సిటీ మాదిరిగా పేద రైతుల్ని బెదిరించి, ప్రభుత్వ యంత్రాంగం సాయంతో కబ్జాలు చేసి సాధించుకున్న భూమి కాదు కదా! ఇప్పటికీ ఫిల్మ్ సిటీ భూముల్ని పోగొట్టుకుని వేదన అనుభవిస్తున్న రైతులు రామోజీ ఫిల్మ్ సిటీ చుట్టూ కోకొల్లలు. కానీ భారతి సిమెంట్ వల్ల నష్టపోయామనే వారిని ఒక్కరినైనా చూపించగలరా రామోజీ? మరెందుకీ దగుల్బాజీ రాతలు?
 
 ఈ మాత్రం ఇంగితం లేదా?
 
జగన్‌మోహన్‌రెడ్డి  బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. సోమవారం తీర్పు రానుంది. దర్యాప్తు పూర్తయిందని సీబీఐ చెప్పింది కనక ఇక బెయిల్‌కు అడ్డు ఉండకపోవచ్చన్నది న్యాయ వర్గాలు సైతం చెబుతున్న మాట. ఈ తరుణంలో ఇంకా ఎవరికీ అందని చార్జిషీటు సమాచారం ఎల్లో బ్రదర్స్ పత్రికల్లోనే ఎలా వచ్చింది? పోనీ ఆ చార్జిషీట్లోని సమాచారాన్ని యథాతథంగా ప్రచురిస్తారా అంటే అదీ లేదు. నాణేనికి ఒకవైపును మాత్రమే చూపిస్తూ... దానికి తమ తిక్క కామెంట్లు జోడిస్తూ నోటికొచ్చినట్టుగా వండి వార్చేస్తారు రామోజీ!! తీర్పుకు ముందు ఇంతటి భ్రష్టుపట్టిన రాతలు రాశారంటే రామోజీకి దురుద్దేశాలు లేవని నమ్మేదెవరు?
 
 ఇరికించాలన్నదే మీ లక్ష్యమా?
 
కేసు లేకపోయినా... తప్పు జరగకపోయినా... ప్రతి విషయంలోనూ ఏదో జరిగిపోయినట్టుగా రాసి అందరినీ ప్రభావితం చేయాలన్న దురుద్దేశంతో ఎల్లో కూటమి దిగజారి చేస్తున్న యుద్ధమిది. అందుకే ఇండియా సిమెంట్స్‌కు చంద్రబాబు ప్రభుత్వం నీళ్లివ్వటం రామోజీ దృష్టిలో గానీ, సీబీఐ దృష్టిలో గానీ తప్పు కాదు. అదే కంపెనీకి, అవే నీళ్లను రెన్యువల్ చేస్తూ వైఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం తప్పు!! అయినా నీళ్లు, కరెంటు ఇవ్వకపోతే కంపెనీలొస్తాయా?
 
 కంపెనీలు లేకుంటే ఉద్యోగాలొస్తాయా? పెన్నా సిమెంట్స్ అధిపతి తన సొంత భూమిలో హోటల్ కట్టుకుంటానంటే... మిగతా హోటళ్లలానే దానికి అనుమతి ఇస్తే... అది వైఎస్ ప్రభుత్వం ఇచ్చింది కనక తప్పేననే రీతిలో సాగిన దర్యాప్తు కాదూ ఇది!!?. దర్యాప్తు అధికారి నేరుగా మీడియాకు ఐదారు వందల ఫోన్ కాల్స్ చేసి... వైఎస్ కుటుంబంపై బురద చల్లటమే లక్ష్యంగా చేసిన దర్యాప్తు కాదూ ఇది? దాన్ని భూతద్దంలో చూపిస్తూ... వక్రీకరించి పతాక కథనాలు వండుతూ అటు ఎల్లో మీడియా... దానికి మద్దతుగా అపవిత్ర పొత్తులతో చెలరేగుతున్న ఎల్లో పార్టీ... ఇవన్నీ కలిసి ఈ రాష్ట్రం విభజన పేరిట రావణ కాష్టంలా మారినా దాంట్లోనే చలికాచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి భ్రష్టుపట్టిన వ్యవస్థల రాతల్ని ఈ రాష్ట్ర ప్రజలే తిరగరాస్తారు.
 
 సాయిరెడ్డి ఆ సమావేశాల్లో ఉన్నారా?
 భారతి సిమెంట్‌కు ఒక్క ఓబీసీ మాత్రమే రుణమిచ్చినట్టు... అది కూడా విజయసాయిరెడ్డి వల్లే వచ్చినట్టు ఎందుకీ కుట్రపూరిత రాతలు? ఆ సంస్థకు ఆరేడు బ్యాంకులు రుణాలిచ్చాయి. వాటిలో ఓబీసీ ఒకటి. మరి వాటన్నిటినీ సాయిరెడ్డి మేనేజ్ చెయ్యగలరా? అయినా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు బ్యాంకు బోర్డు ముందుకు వచ్చినప్పుడు సాయిరెడ్డి తనంత తనే సమావేశాల నుంచి బయటికెళ్లిపోయారు. అవన్నీ రికార్డులు చూస్తే తెలుస్తాయి. మరి దానర్థం కంపెనీ ప్రమోటర్లతో తనకున్న సంబంధాలు చెప్పినట్టు కాదా? అయినా బ్యాంకులు రుణాలిస్తే తప్పా? జగన్ తను వ్యక్తిగత గ్యారంటీ ఇవ్వటంతో పాటు షేర్లు కూడా తనఖా పెట్టారు. అంతేకాక ఆ రుణాన్ని అణా పైసల్తో సహా సకాలంలో చెల్లించారు. ఇందులో తప్పేముంది?
 
 అప్పటికే ఒక కంపెనీని విజయవంతంగా నడుపుతున్న జగన్‌కు బ్యాంకులు రుణాలిస్తే తప్పా? ఏం... మీలా చిత్తు కాగితాలు, పాత సీరియళ్ల పేటెంట్ హక్కుల్ని తనఖా పెట్టి వేల కోట్లు రుణం తీసుకోకపోవటమే తప్పా? ముఖ్యమంత్రి ఇంట్లో సంతకాలు జరగటమూ తప్పేనా? దానర్థం అప్పట్లో జగన్ ఇక్కడ లేరనేగా! బెంగళూరులో ఉండే జగన్‌మోహన్‌రెడ్డి నెలకు ఒకటిరెండు రోజులు ఇక్కడకు వస్తే... ఆ రెండు మూడ్రోజులు తన తల్లిదండ్రులతో ఉంటే అది తప్పా? బ్యాంకు అధికారులు బెంగళూరుకు ఖర్చులు పెట్టుకుని వచ్చే బదులు... ఇక్కడే సంతకాలు తీసుకుంటే అది అక్రమమా? కొన్ని సంతకాలు బెంగళూరులో కూడా పెట్టినా ఆ విషయం మాత్రం ఎందుకు రాయరు? ఎందుకీ కుట్రలు?
 
 న్యాయమూర్తి నివేదికా పట్టదా?
 
రాష్ట్ర ప్రభుత్వం గనక ఈ భూ కేటాయింపులో తప్పు చేసి ఉంటే ట్రిబ్యునల్‌లో గుజరాత్ అంబుజా వాదనలు వినిపించింది కదా! కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ ట్రైబ్యునల్ తీర్పు ఇవ్వటం రామోజీకి తెలియదా! ఆ తరవాత హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ రాజు నేతృత్వంలో కమిషన్ వేయడం.. ఆయన నివేదికనిస్తూ దీన్లో ఏ తప్పూ జరగలేదని చెప్పడం... ఇవేవీ రామోజీకి పట్టవా? ఒకవేళ పట్టినా, ‘కళ్లు మూసుకుని అబద్ధాలు చెబితే చాలు, ఎవరినైనా తప్పుదోవ పట్టించొచ్చు’ అన్న కుయుక్తా!?
 
 లీజు గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా?
 మైనింగ్ లీజుల గురించి మాట్లాడుతున్న రామోజీకి... అసలు లీజు అనే పదాన్ని పలికే నైతిక అర్హత ఉందా? హైదరాబాద్ నుంచి విశాఖపట్నం దాకా ఎక్కడ చూసినా రామోజీది గ‘లీజు’ చరిత్రేగా!! హైదరాబాద్‌లో లీజుకు తీసుకున్న భూమిని ఖాళీ చేయనంటూ భీష్మించుకుంటే చివరికి రాజకీయ జోక్యంతో స్థల యజమాని సెటిల్ చేసుకోవటం అబద్ధమా? అదే యజమానికి చెందిన విశాఖ స్థలాన్ని లీజు గడువు ముగిసినా ఇంకా ఖాళీ చెయ్యలేదు రామోజీ.
 
 అంతేగాక దాన్ని తన సొంత స్థలమని చెప్పి... కొంత భాగం ప్రభుత్వానికిచ్చి, పరిహారంగా ఇచ్చిన భూమిని తనే భోంచేసిన చరిత్ర ఆయనది. ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవటానికి చీటింగ్, ఫోర్జరీ వంటి ఇతర నేరాలకు పాల్పడ్డారనే కేసులూ నమోదయ్యాయి. ఇక విశాఖలో డాల్ఫిన్ హోటల్ కోసం లీజుకిచ్చిన వారిని బెదిరించి మరీ కారుచౌకగా కొట్టేసిన ఘనుడాయన. విజయవాడలో సొంత బంధువుల స్థలాన్ని లీజుకు తీసుకుని, గడువు ముగిసినా తిరిగివ్వకుండా న్యాయ పోరాటానికి దిగిన ఘనుడు కూడా! ఇలాంటి వ్యక్తికి ఎదుటివారు ఏం చేసినా అది అక్రమంగానే కనిపించటంలో చిత్రమేముంది?
 
 ఫిల్మ్ సిటీ భూముల మాటేంటి?
 నగరానికి అత్యంత సమీపంలో 2,500 ఎకరాలకు పైగా స్థలాన్ని... పేద రైతుల పొట్టగొట్టి, బెదిరింపులకు పాల్పడి మరీ ఫిల్మ్ సిటీ కోసం సొంతం చేసుకున్న రామోజీకి... ఇతరులు ఏం చేసినా అన్యాయంగా కనిపించటం ఆశ్చర్యం అనిపించదు. ఎకరాకు రూ.10-15 వేలు విదిలించి, పేద రైతుల్ని బెదిరించి మరీ భూముల్ని స్వాధీనం చేసుకున్న రామోజీకి భూముల క్రయ విక్రయాలన్నీ అక్రమాలుగానే కనిపించొచ్చు. ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని, అసైన్డ్ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, ఆఖరికి భూ దాన భూముల్ని కూడా భోంచేసిన రామోజీకి ప్రైవేటు వ్యక్తులకు భారీ ధర చెల్లించి కొనుక్కోవటం కూడా  నేరమనే అనిపించొచ్చు.
 
 రామోజీ కట్టాల్సిన పన్ను 1,117 కోట్లు!
 ఇతరులపై బురద జల్లటానికి చెలరేగిపోయే రామోజీకి... తన ఒంటికున్న మకిలి కనిపించకపోవటమే విచిత్రం. ఎందుకంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట అక్రమంగా డిపాజిట్లు తీసుకున్నందుకు ఆయనపై భారీగా ఐటీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీని ప్రకారం 2001-02 నుంచి 2005-06 మధ్య ఆయన  రూ.1,117 కోట్ల పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టారు. దీన్ని చెల్లించాలని ఐటీ నోటీసులివ్వడంతో రామోజీ కోర్టుకు వెళ్లారు. తనకు నోటీసులిచ్చిన అధికారికి దురుద్దేశాలు ఆపాదించటంతో కోర్టు కోపగించింది. రామోజీపై జరిమానా వేసింది. దాంతో జరిమానా చెల్లించి పిటిషన్లు విత్ డ్రా చేసుకున్నారు. అయినా మళ్లీ కొత్త పిటిషన్లు వేసి.. ఐటీ పేర్కొన్న చట్టాలేవీ తనకు వర్తించవన్నారు. హైకోర్టులో ఇది పెండింగ్‌లో ఉంది. కాకపోతే దీన్ని వెకేట్ చేయించడానికి 2009 నుంచి ఇప్పటిదాకా ఐటీ శాఖ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఏటా కనీసం రూ.120 కోట్ల మేరకు వడ్డీ నష్టపోతున్నా ఐటీ శాఖ ఎందుకు మిన్నకుందనేది ఎవరికీ అర్థం కాదు!


sakshi

Janam kosam Jagan Jagan Kosam Manam

Baga Baga Mande Gundela Sakshi ga ...

Tv9 Special "YSR Samikyavadi"

Written By news on Thursday, September 19, 2013 | 9/19/2013

Question Time with Sanjaya Baru- YSR against seperate state

దర్యాప్తు చేస్తే బాబు జీవితాంతం జైల్లోనే

దర్యాప్తు చేస్తే బాబు జీవితాంతం జైల్లోనే: వాసిరెడ్డి పద్మవిస్తరించు & ప్లే క్లిక్ చేయండి
హైదరాబాద్‌: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆస్తులపై దర్యాప్తుచేసే జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ''చంద్రబాబూ నీక్కూడా కొడుకు ఉన్నాడు. నీ కొడుకు ఎలా పెరిగాడు? ఎలా ఆస్తులు సంపాదించాడో అందరికీ తెలుసు. 9 ఏళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని నీ కొడుకు సంపాదించాడని కేసు వేస్తే... దాని ఆధారంగా జైల్లో పెడితే... నీకు ఎలా ఉంటుంది? చంద్రబాబూ!'' అని ప్రశ్నించారు. 44 అంశాల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఎన్నికల దగ్గర నుంచి పదవుల పందేరం దాకా చంద్రబాబు కుమ్మక్కయ్యారన్నారు.

వైఎస్ జగన్‌పై కేసులన్నీ రాజకీయకోణంతోనే వేశారన్నారు. చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం జగన్‌కు బెయిల్‌ ఖాయమని నిపుణులే చెప్తున్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో చంద్రబాబు, అతని బృందం కీచురాళ్లరొద చేస్తున్నారన్నారని విమర్శించారు. దర్యాప్తు చేసిన తర్వాత ఛార్జిషీట్లు వేశారన్న విషయం మరిచారన్నారు.
దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నది చంద్రబాబు కాదా? అని పద్మ ప్రశ్నించారు. కోర్టు విచారణలో ఉన్నకేసును కూడా ప్రభావితంచేయడానికి యత్నిస్తున్నారన్నారు. దీంతోనే ఈ కేసు రాజకీయ కేసని తేలిపోయిందన్నారు.

జగన్‌ను దోషిగా నిర్ధారించే ఆధారాల్లేవు కాబట్టే టీడీపీ శ్వేత పత్రం డ్రామా ఆడుతోందన్నారు. జగన్‌పై కేసు నిలబడదు కాట్టే శ్వేపత్రం వేస్తామని టీడీపీ చెబుతుందని చెప్పారు. చంద్రబాబు జైలు శిక్షకు గురయ్యే 18 అంశాలు ఉన్నాయని ఆమె తెలిపారు. వీటిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదలచేయగలరా? అని ప్రశ్నించారు. జగన్‌ బయటకు వస్తే తట్టుకోలేమని చంద్రబాబు బేజారెత్తిపోతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మతి భ్రమించిందన్నారు. కోర్టులను, కేంద్రాన్ని, దర్యాప్తు సంస్థలను ప్రభావితంచేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని విమర్శించారు. జగన్‌ను జైల్లోనే ఉంచాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు కాంగ్రెస్‌ కాళ్లు పట్టుకుంటున్నాడన్నారు.  చేస్తున్న పనులను చూస్తే ఆయన్ని రాజకీయ నాయకుడిగా కూడా గుర్తించడంలేదన్నారు.

Popular Posts

Topics :