22 September 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

చంద్రబాబు పట్టుబడ్డ దొంగ

Written By news on Saturday, September 28, 2013 | 9/28/2013

హైదరాబాద్ 28 సెప్టెంబర్ 2013: సమైక్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పట్టుబడ్డ దొంగని వైయస్ఆర్ కాంగ్రెస్ నేత తమ్మినేని సీతారాం అభివర్ణించారు. ఐఎమ్జీ, ఎమ్మార్ కుంభకోణాల నుంచి బయటపడేస్తే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తానని చిదంబరంతో అర్ధరాత్రి కుమ్మక్కయ్యింది చంద్రబాబునాయుడేనని చెప్పారు. అలాంటి వ్యక్తి విజయమ్మ గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారనడమేంటని ప్రశ్నించారు. బెయిలు వచ్చినందుకు రాహుల్ గాంధీని కలిసి కృతజ్ఞతలు చెప్పారనడం ఎంత వరకూ సమంజసమని నిలదీశారు. బెయిలు ఎలా వచ్చిందో చంద్రబాబుకు తెలియదా అని అడిగారు. సుప్రీం కోర్టు సీబీఐకి దర్యాప్తు నిమిత్తం సమయ నిర్దేశం చేసిన విషయాన్ని మరిచారా అని కూడా ప్రశ్నించారు. చార్జి షీట్లు దాఖలు చేయడం పూర్తయిన తర్వాత బెయిలు వస్తే ఇన్ని రకాలుగా ఆరోపణలు చేయడమేమిటన్నారు. తాను సమైక్యవాదో, విభజన వాదో స్పష్టం చేయాలని ఆయన చంద్రబాబును నిలదీశారు. ప్రజల ముందు మీరు పచ్చి అవకాశవాదిగా నిలబడబోతున్నారని స్పష్టంచేశారు. అవకాశాన్ని వీడాలని సూచించారు. పదవీ వ్యామోహంతో ఇచ్చిన తెలంగాణ అనుకూల లేఖను కప్పిపుచ్చుకోవడానికే ఇన్ని నాటకాలాడుతున్నారని ఆయన విమర్శించారు. సీఎం రమేష్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. 'మేం చెప్పిందే కరెక్టనీ తప్పించుకోలేరు... ఎందుకంటే మీపై మేము చట్టరీత్యా చర్యలు తీసుకోబోతున్నాం' అని తమ్మినేని హెచ్చరించారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామో లేదో చెప్పాల్సింది పోయి... ఇవేం చవకబారు ఆరోపణలని ఆయన ఎద్దేవా చేశారు. చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపితే కట్టుబడతామని సవాలు చేశారు.

http://www.ysrcongress.com/news/news_updates/celebration-in-washington-dc.html

అందరూ కలసికట్టుగా విభజనను అడ్డుకోవాలి

అందరూ కలసికట్టుగా విభజనను అడ్డుకోవాలి: జగన్ పిలుపువిస్తరించు & ప్లే క్లిక్ చేయండి
హైదరాబాద్:  రాష్ట్రాన్ని విడదీయటానికి చేస్తున్న కుట్రలను తెలుగు ప్రజలంతా కలిసి అడ్డుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి  జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. లోటస్‌ పాండ్‌లో ఈరోజు తనను కలిసిన సమైక్యాంధ్ర అడ్వకేట్స్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

జగన్  ప్రసంగ పాఠం: రాయలసీమ, కోస్తాఆంధ్ర, తెలంగాణ అన్నిప్రాంతాలు సమైక్యంగా ఉండాలని మనం అడుగుతున్నాం. పెద్దదిగా ఉంటేనే రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. 60 శాతం మంది ప్రజలు మాకు అన్యాయం జరిగిందని రోడ్డు ఎక్కారు. ఆ అన్యాయం పార్టీలకు, కేంద్రానికి కనిపించడంలేదా?

రాష్ట్రాన్ని విభజిస్తే పది జిల్లాలలో తన్నుకునే పరిస్థితి వస్తుంది. న్యాయం చేయలేనప్పుడు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎవ్వరికీ ఆమోదం కాకపోయినా విభజన ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజాయితీగా విభజనను అడ్డుకోవాలి. ఓట్లు, సీట్లు పోతాయని మౌనంగా ఉండటం మంచిదికాదు. విభజనను ఆపకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. రెండు రాష్ట్రాలుగా విడగొడితే నీళ్లు ఎలా ఇస్తారు? నాగార్జున సాగర్, శ్రీశైలంకు నీల్లు ఎలా వస్తాయి? కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచినీళ్లు ఎవరు ఇస్తారు? రాష్ట్రం ఒకటిగా ఉంటేనే నీటి సమస్య రాదు.

చదువుకున్న ప్రతి కుర్రవాడు ఉద్యోగం కోసం హైదరాబాద్ వైపే చూస్తున్నాడు.  రాష్ట్ర ఆదాయంలో సగం హైదరాబాద్ నుంచే వస్తోంది. అదే ఆగిపోతే జీతాలు ఎలా ఇస్తారు? రాష్ట్రాన్ని విడగొట్టవద్దని జెఏసీ ద్వారా లేఖ రాయండి, నేను తొలి సంతకం పెడతాను అని చెప్పాను. అందరం కలిస్తేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది. పంపకాల్లో తండ్రి పిల్లలకు న్యాయం చేయాలి. న్యాయం చేయలేనప్పుడు యథావిథిగా వదిలివేయాలి.  సిపిఎం, ఎంఐఎం, వైఎస్ఆర్ సిపి మూడు పార్టీలు సమైక్యాంధ్ర కోరుతున్నాయి.  మిగిలిన పార్టీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలో నిజాయితీ లోపించింది. ప్రతి సమైక్యవాది, జెఏసి సభ్యుడు టిడిపిని అడగండి.  ఆ తరువాత టిడిపిని కూడా జేఏసిలోకి రానివ్వండి.

సోనియా గాంధీ డైరెక్షన్‌లో రాష్ట్రంలో పెద్ద డ్రామా

సోనియా డైరెక్షన్‌లో రాష్ట్రంలో డ్రామా : కొణతాలవిస్తరించు & ప్లే క్లిక్ చేయండి
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ డైరెక్షన్‌లో రాష్ట్రంలో పెద్ద డ్రామా జరుగుతోందని వైఎస్ఆర్ సిపి రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నఈ  డ్రామాలో పాత్రదారులు, సూత్రదారులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబులేనన్నారు.  పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  మోడ్రన్‌ గిరీశంలా కనిపిస్తున్నారని విమర్శించారు. సీఎం పరిస్థితి ఇల్లు కాలుతుంటే బొగ్గులు ఏరుకున్నట్లుందన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని డిమాండ్ చేశారు.  టీడీపీ స్మశాన వైరాగ్యంలో ఉందని అన్నారు.


కాంగ్రెస్‌ ఆడుతున్న క్రికెట్‌ మ్యాచ్‌లో ప్రజల్ని బాలుని చేసి ఆడుకోవద్దని కోరారు. తెలంగాణ ప్రకటన వచ్చిన రోజునే సీఎం కిరణ్‌ కేబినెట్‌కు రాజీనామా చేసి ఉంటే ప్రకటన ఆగి ఉండేదన్నారు.  అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా సమైక్యవాదం ఆమోదం పొందుతుందని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్‌ ముందుకు తెలంగాణ నోట్‌ రాకముందే సమైక్య తీర్మానాన్ని పంపించాలన్నారు. టీడీపీ భవిష్యత్‌ అంధకారమై వైఎస్‌ఆర్‌సీపీపై అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం ఇష్టం ఉంటే సీఎం, చంద్రబాబులు రాజీనామాలు చేసేవాళ్లని కొణతాల అన్నారు.

ఉద్యమం దారిమళ్లించేందుకు టిడిపి కుట్ర:శోభానాగిరెడ్డి

ఉద్యమం దారిమళ్లించేందుకు టిడిపి కుట్ర:శోభానాగిరెడ్డి
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దారిమళ్లించడానికి టీడీపీ కుట్ర చేస్తుందని వైఎస్ఆర్ సిపి శాసనసభ్యురాలు శోభానాగి రెడ్డి ఆరోపించారు. విభజన లేఖను వెనక్కి తీసుకోకుండా ఉండేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఎస్ కుటుంబంపై అడ్డగోలు వార్తలు రాపిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపై ఆరోపణలు రుజువు చేయలేకపోతే, సిఎం  రమేశ్‌ శాశ్వతంగా పదవి నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు.

తమని ఎన్ని తిట్టిన పర్వాలేదని చంద్రబాబు విభజన లేఖను మాత్రం  వెనక్కి తీసుకోవాలని కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి చంద్రబాబు ముందుకు వస్తే తాము కూడా సహకరిస్తామని శోభానాగిరెడ్డి చెప్పారు.

'వైఎస్ఆర్ సీపీపై అసత్య ప్రచారాన్నికట్టిపెట్టండి''

'వైఎస్ఆర్ సీపీపై అసత్య ప్రచారాన్నికట్టిపెట్టండి''
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అబద్ధాల్ని కూడా ఆధారాలుగా నిరూపించే ప్రయత్నం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. టీడీపీ నాయకుడు సీఎం రమేష్ సొంతంగా దర్యాప్తు సంస్థను నడుపుకొంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ పదేపదే అసత్యాలను ప్రచారం చేస్తోందని ఉమ్మారెడ్డి ఆరోపించారు. ఇకనైనా వీటిని మానుకోవాలని లేకుంటే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

YS Jaganmohan Reddy's press meet

జగన్ కు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక సభ్యుల అభినందన

 సమైక్యాంధ్రకోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక సభ్యులు అభినందనలు తెలిపారు. లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ నివాసంలో ఆయనను పరిరక్షణ వేదిక సభ్యులు శనివారం మధ్యాహ్నం కలిశారు.

త్వరలోనే తాము రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ కేంద్రానికి తీర్మానం పంపిస్తామని, ఆ తీర్మానంపై వైఎస్ జగన్ తొలి సంతకం చేస్తామన్నారని వేదిక సభ్యులు తెలిపారు. కేబినెట్‌ నోట్‌ కంటే ముందే అసెంబ్లీని తక్షణమే సమావేశపరిచి సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని, తెలంగాణ విభజనకు అనుకూలంగా లేఖలిచ్చిన రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ వేదిక రాష్ట్ర సమన్వయకర్త వి.లక్ష్మణరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

మోపిదేవిని పరామర్శించిన జగన్‌

మోపిదేవిని పరామర్శించిన జగన్‌
హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావును పరామర్శించారు. మోపిదేవి అనారోగ్యంతో కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జగన్‌ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పలుకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కుటుంబీకులతో కూడా జగన్‌ మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సలహాదారు సి.సి.రెడ్డిని కూడా పరామర్శించారు.

మంగళగిరికి చెందిన పార్టీ నేత మున్నంగి గోపిరెడ్డి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తల్లి ఎన్‌.ధనమ్మ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని వారి వద్దకు కూడా జగన్‌ వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించి త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా జగన్‌ను చూడటానికి పెద్ద ఎత్తున జనం తోసుకొచ్చారు. చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి కోసం వచ్చిన సందర్శకులు జగన్‌తో కరచాలనం చేయడానికి, పలుకరించడానికి పోటీలుపడ్డారు. పలువురు రోగులు తమ కష్టాలను జగన్‌తో చెప్పుకున్నారు. జగన్‌వెంట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బొబ్బిలి రంగారావు తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు కూడా మోపిదేవి, గోపిరెడ్డిలను పరామర్శించారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖాయం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖాయం: మేకపాటి
న్యూఢిల్లీ : సమైక్యాంధ్ర ప్రదేశ్‌లోనే ఎన్నికలను ఎదుర్కొంటామని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. తమ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను గెలుచుకొని జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్రను పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద శుక్రవారం నిర్వహించిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ధర్నాలో పాల్గొన్న అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.

కాంగ్రెస్‌తో ఎంపీ వైఎస్‌ జగన్‌ కుమ్మక్కయినట్టు చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకవేళ కుమ్మకై్క ఉంటే జగన్‌ 16 నెలలపాటు జైలులో ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. సమస్య పరిష్కరించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని వీరప్పమొయిలీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా... అది ఆయన భావనని, దానికి మనమేం చేయలేమని చెప్పారు.

యూపీఏతో పొత్తు విషయమై ప్రశ్నించగా... ‘‘రానున్న ఎన్నికల్లో 100 సీట్లు వచ్చే పార్టీ లేదు. కాంగ్రెస్‌ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాదు. ఫలితాలు అంతా అయోమయంగా ఉంటాయి. ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి లౌకిక శక్తులతో కలిసి ముందుకువెళతాం’’ అని బదులిచ్చారు. జగన్‌ను నష్టపర్చడానికి కాంగ్రెస్‌ ఎత్తుగడలో భాగంగానే దిగ్విజయ్‌సింగ్‌ జగన్‌, కాంగ్రెస్‌ డీఎన్‌ఏ ఒక్కటేనని వ్యాఖ్యానించారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ఓట్లు వేయడం కోసమే అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని తాము డిమాండ్‌ చేస్తున్నామని తెలిపారు.

రాజీనామాల ఆమోదం కోసం నేడు స్పీకర్‌ను కలవనున్న మేకపాటి
 రాష్ట్రాన్ని విభజించకుండా, సమైక్యంగానే కొనసాగించాలన్న డిమాండ్ తో తన… పదవికి రాజీనామా సమర్పించిన… మేకపాటి రాజమోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌తో సమావేశం కానున్నారు. రాజమోహన్‌ రెడ్డి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే. శనివారం లోక్‌సభ స్పీకర్‌ను కలసి, తమ రాజీనామాలు వెంటనే ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తానని మేకపాటి తెలిపారు.

వైఎస్సార్‌ సీపీ మొదటి నుంచీ చెప్తూనే ఉంది...

ఢిల్లీ సమైక్య మహాధర్నాలో వైఎస్‌ విజయమ్మ ఉద్ఘాటన
కోట్ల మంది రోడ్లపైకి వచ్చినా కాంగ్రెస్‌కు చీమ కుట్టినట్టు లేదు
కాంగ్రెస్‌, టీడీపీలు డ్రామాలు ఆడుతున్నాయి ఆ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేల్ని రాజీనామాల కోసం నిలదీయండి.. ‘సమైక్య’మని చెప్పలేని పార్టీలతో ప్రమాదం
సమైక్యాంధ్ర కోసం లేఖపై పార్టీల అధ్యక్షులతో సంతకాలు తీసుకోండి.. మొదటి సంతకం వైఎస్‌ జగన్‌ చేస్తారు..
జంతర్‌మంతర్‌ వద్ద సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల మహాధర్నా.. మద్దతుగా పాల్గొన్న విజయమ్మ సహా పలువురు వైఎస్సార్‌ సీపీ నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ సంక్షోభంతోనే రాష్ట్ర విభజన ఆగుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పునరుద్ఘాటించారు. విభజనపై ఆందోళనతో కోట్లాది మంది రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నా కాంగ్రెస్‌కు చీమకుట్టినటై్టనా లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. రాజీనామాలు చేయాలని కాంగ్రెస్‌ కేంద్ర, రాష్ట్ర మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడే నిలదీయాలని పిలుపునిచ్చారు. లేఖను వెనక్కి తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబును డిమాండ్‌ చేయాలని ఉద్యోగులను కోరారు.

గతంలో డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన తర్వాత జరిగిన రాజీనామాలతోనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయాన్ని విజయమ్మ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా రాజ్యాంగ సంక్షోభం వస్తే కానీ సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. అలాగే.. సమైక్యవాదులు ఎవరు, విభజనవాదులు ఎవరనేది గుర్తించాలని సూచించారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ ఒక లేఖను తయారు చేయించి, ఆ లేఖపై అన్ని పార్టీల అధ్యక్షుల సంతకాలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖపై తొలి సంతకం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పెడతారని చెప్పారు. ఈ లేఖపై సంతకాలతో ఎవరు ఎటువైపు ఉన్నారనేది తేలిపోతుందని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద శుక్రవారం మహాధర్నా నిర్వహించింది. ఈ ఆందోళన కార్యక్రమానికి విజయమ్మ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం తప్పితే ప్రత్యామ్నాయం లేదు. ఈ విషయాన్ని శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది. నేడు రాష్ట్రం రావణ కాష్టంగా ఉంది. అన్నదమ్ములా ఉండాల్సిన మనలో అంతరాలు పెరిగాయి.

హైదరాబాద్‌ సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు రెండు వర్గాలుగా చీలటం చూస్తున్నాం. రాను రాను కొట్టుకునే పరిస్థితి దాపురిస్తోంది. దీనికి కాంగ్రెస్‌, టీడీపీలే కారణం’’ అని తూర్పారబట్టారు. కోట్లాది మంది భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై జరుగుతున్న ఉద్యమంలో ఉద్యోగుల మొర ఆలకించాలని కోరుతూ ఇక్కడకు వచ్చి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున, తన తరఫున, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. విజయమ్మ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే...

కాంగ్రెస్‌, టీడీపీలు డ్రామాలాడుతున్నాయి
‘‘రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ విధానం తెలపకుండా, ఎవరితో చర్చించకుండా గంటసేపు సీడబ్ల్యూసీలో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. యూపీఏ మిత్రపక్షాలతో మాట్లాడారు కానీ.. రాష్ట్రంలోని పార్టీలతో మాట్లాడాల్సిన అవసరం లేదా? ప్రజలను విశ్వా„సంలోకి తీసుకోలేదు. ప్రజలకు జవాబు చెప్పకుండా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వటానికి నిర్ణయం జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు బ్లాంక్‌ చెక్‌ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ భయపడి ఉండేది. ఇప్పుడు కోట్ల మంది రోడ్లపై వచ్చారు. కాలేజీ, స్కూళ్లు, బస్సులు, ఆఫీసులు నడవటంలేదు. అయినా కాంగ్రెస్‌కు చీమకుట్టినట్టు లేదు.

58 రోజుల నుంచి ఆందోళన జరుగుతున్నా జవాబు చెప్పలేని స్థితిలో కాంగ్రెస్‌ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ప్రకటన నిర్ణయం జరగలేదు. కాంగ్రెస్‌, టీడీపీ డ్రామాలు మొదలుపెట్టాయి. సీఎం కిరణ్‌, పీసీసీ చీఫ్‌ బొత్సలు ఇరు ప్రాంతాల నుంచి రోడ్‌మ్యాప్‌లు తీసుకెళ్లి చర్చించారు. ఆ రోజే గట్టిగా ఉండి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. టీడీపీ, బీజేపీ రాజీనామాలు చేస్తే సీడబ్ల్యుసీ నిర్ణయం వెనక్కి తీసుకుంటారని మంత్రి కొండ్రు మురళి చెప్తున్నారు. మీరు రాజీనామా చేసి ఇతరుల రాజీనామాలు అడిగితే బాగుంటుంది. మరోవైపు సీఎం కిరణ్‌ సమైక్యం అని చెప్తున్నారు. ఉద్యోగ సంఘాలను హైజాక్‌ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు.

‘సమైక్య ఇందిరా కాంగ్రెస్‌’ అనే పేరుతో ఎన్నికల్లోకి వస్తామని లీకులిస్తున్నారు. చంద్రబాబు తొలుత బ్లాంక్‌ చెక్‌ ఇచ్చారు. తర్వాత సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. నాలుగైదు లక్షల కోట్లు ఇస్తే కొత్త రాజధాని నిర్మించుకోవచ్చని చెప్పారు. ఉద్యమం ఉధృతమైన తర్వాత ఆత్మగౌరవం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. రెండు ప్రాంతాల వారిని తీసుకువచ్చినట్టు ఢిల్లీకి వచ్చి చెప్పారు. లేఖ వెనక్కి తీసుకోలేదు. తెలంగాణనూ సమర్థించలేదు. సమైక్యాంధ్ర అని చెప్పలేదు. ద్వంద్వ వైఖరులతో కాంగ్రెస్‌, టీడీపీలు నడుస్తున్నాయి.

వైఎస్సార్‌ సీపీ మొదటి నుంచీ చెప్తూనే ఉంది...
ఏ ప్రాంతానికీ అన్యాయం చేయవద్దని, అవసరమైతే తండ్రిలా విభజన చేయాలని నిర్ణయం రాకముందు నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ చెప్తూ వస్తోంది. తండ్రిలా విభజన చేయలేనప్పుడు విభజన హక్కు మీ చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారు? 30న నిర్ణయం రాబోతోందని ఎమ్మెల్యేలతో లేఖలు రాయించాం. అన్యాయం చేస్తే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదని హోంమంత్రి షిండేకు లేఖ రాశాం. న్యాయం చేయలేకపోతే విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పాం.

వైఎస్సార్‌ సీపీ ఒక్కటే స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసింది. మిగిలిన పార్టీలు అలా చేయలేదు. ఆంటోనీ కమిటీ ద్వారా న్యాయం జరగదని నేనూ, జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేశాం. వేరే రాష్ట్రానికి తరలిస్తారని ప్రచారం జరిగినప్పటికీ జగన్‌ ఒంటరిగా జైలులో వారం రోజుల పాటు దీక్ష చేశారు. నీళ్లు ఎలా.. ఉద్యోగం, ఉపాధి ఎలా? ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌ నిండితే గానీ మనకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌ కట్టేటప్పుడు చంద్రబాబు చూస్తా కూర్చున్నారు. ఆ పాపం నేడు మనం అనుభవిస్తున్నాం. దిగువప్రాంతానికి కరువు వచ్చినా, వరదలొచ్చినా సమస్యే. శ్రీశైలానికి నీళ్లు ఎలా ఇస్తారు? నాగార్జునసాగర్‌కు నీళ్లు ఎక్కడి నుంచి ఇస్తారు? పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటున్నారు.. ఎక్కడి నుంచి నీళ్లు నింపుతారు? కృష్ణా పరీవాహక ప్రాంతం అంతా ఒకవైపు ఉంచుతారా? అన్నదమ్ముల మధ్య కొట్లాట ఇలానే పెడతారా? మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి మద్రాసును దూరం చేశారు.

60 ఏళ్లుగా మనం కట్టుకున్న హైదరాబాద్‌ నుంచి మనలను వెళ్లిపొమ్మంటున్నారు. రాష్ట్రం ఇంకా ఏర్పాటు కాలేదు. అప్పుడే కేసీఆర్‌ మనల్ను వెళ్ళిపోవాలంటున్నారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఏ రాష్ట్రానికి వెళ్లాలి? ఉద్యోగాల కోసం ఏ రాష్ట్రానికి వెళ్లాలి? కూలీలు పనుల కోసం, వ్యాపారం కోసం వ్యాపారస్తులు హైదరాబాద్‌ వైపు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌ నుంచి వెళ్ళిపోవాలంటే ఎలా బతకాలి? రాష్ట్ర బడ్జెట్‌లో 40 నుంచి 50 శాతం వరకు హైదరాబాద్‌ నుంచే వస్తుంది. ఒక ప్రాంతానికి వస్తే ఇటువైపు వారికి (సీమాంధ్ర) జీతాలు చెల్లించే పరిస్థితే ఉండదు. ఇక సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తారు?

తెలంగాణలో సమస్యలు లేవని కాదు...
తెలంగాణలో సమస్యలు లేవని కాదు. అక్కడా సమస్యలు ఉన్నాయి. ప్రాణహిత-చేవెళ్ల పూరె్తైత్తే ఏడు జిల్లాలు సస్యశ్యామలమవుతాయని దివంగత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కలలు కన్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణ ఉద్యమం ఉంది. అయితే ఉద్యమం అభివృద్ధి, సంక్షేమం వైపు తీసుకెళ్లింది. ఉచిత విద్యుత్‌, విద్యుత్‌ బకాయిల మాఫీ 70 శాతం తెలంగాణ ప్రజలకు ఉపయోగపడింది. సంక్షేమ పథకాలు ఇంటింటికి, మనిషి మనిషికి అందించటం జరిగింది.

టీడీపీ నుంచి ఉద్యమ పార్టీగా బయటకు వచ్చి టీఆర్‌ఎస్‌ పెట్టి వచ్చిన నాయకులు రాజశేఖరరెడ్డి నాయకత్వాన్ని సమర్థించిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్‌ హయాంలో వెనుకబాటుతనం ఉద్యమం లేదు. రాష్ట్రాన్ని విభజించాలనే ఉద్యమానికి బలం లేదు. విభజన జరగలేదు. ఇప్పుడేదైతేరాష్ట్రం విడిపోవాలని ఉద్యమం చేస్తున్న టీఆర్‌ఎస్‌ ఆ రోజు రెండుగా చీలిపోయింది. రాజశేఖరరెడ్డి సమర్థవంతమైన నేత. 23 జిల్లాలకు, మూడు ప్రాంతాలకు సమన్యాయం చేశారు. మూడు ప్రాంతాలకు నీళ్లు ఉండాలని 86 ప్రాజెక్టులు తీసుకున్నారు. రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే 86 ప్రాజెక్టులు పూరె్తై ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. సమర్థుడైన నాయకుడుంటే అన్ని ప్రాంతాల్లో సమ అభివృద్ధి జరుగుతుందనేది చూశాం.

రాష్ట్ర అభివృద్ధి కోసమే సమైక్య నిర్ణయం...
రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు నడవటానికి జగన్‌ నాయకత్వంలో సమైక్యాంధ్ర నిర్ణయం తీసుకోవటం జరిగింది. కాంగ్రెస్‌, టీడీపీల అసలు రంగు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ సంఘాలు విచిత్ర వాదన చేస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని నడుపుతామని చెప్తున్నారు. అసలు సమస్య పుట్టింది రాజకీయం నుంచే. సమైక్యమని చెప్పలేని నాయకులు, పార్టీలను ఆహ్వానించి వారితో కలిసి ఉద్యమం చేయటం చాలా ప్రమాదకరం. సమైక్యం అనేది ఎవరు? విభజనదారులు ఎవరు? అనేది గుర్తించాలి.

సమైక్యంపై ఒక లేఖ తయారు చేయండని, మొట్టమొదటగా జగన్‌ సంతకం చేస్తారని చెప్పటం జరిగింది. ఆ లేఖను తయారు చేసి అన్ని పార్టీల అధ్యక్షులతో సంతకాలు పెట్టించండి. సంతకాలు పెట్టినప్పుడు సమైక్యవాదులు ఎవరు, విభజన వాదులెవరనేది తేలిపోతుంది. విభజించి లాభం పొందేవారు ఎవరనేది మనకు, ప్రజలకు తెలుస్తుంది. అన్ని పార్టీలను సమైక్య నినాదంపై తీసుకురావటానికి కృషి చేయాలని ఉద్యోగుల సంఘాలను నేను కోరుకుంటున్నా.’’మహాధర్నాకు మద్దతుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్‌.విజయమ్మతో పాటు.. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఇతర నాయకులు ఉమ్మారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నిజాయితీగా పోరాడుతున్నది ఒక్క జగన్‌ మాత్రమే

సమైక్యతకు కృషిచేస్తున్నది జగనే: ఎస్పీవై రెడ్డి
హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, నంద్యాల లోక్‌సభ సభ్యుడు ఎస్పీవై రెడ్డి శుక్రవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయన తన మద్దతుదారులతో కలిసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పార్టీలో చేరారు. వారికి జగన్‌ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్‌ జైల్లో ఉన్నా సమైక్యాంధ్ర కోసం నిజాయితీగా నిరాహారదీక్ష చేశారని ప్రశంసించారు.

సమైక్యాంధ్ర కోసం నిజాయితీగా పోరాడుతున్న రాజకీయ నాయకుడు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని చెప్పారు. అందుకే సమైక్యాంధ్రకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు ఆయన ప్రకటించారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తోందని, అందుకే ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎంపీ పదవికి శనివారం రాజీనామా చేయనున్నట్టు తెలిపారు. అందుకోసం లోక్‌సభ స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ ఖరారైందన్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఫ్యాక్స్ చేయనున్నట్లు తెలిపారు.

రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతో పాటు పేదరికాన్ని నిర్మూలించవచ్చని చెప్పారు. ఎస్పీవై రెడ్డి నిర్ణయాన్ని పార్టీ తరఫున అభినందిస్తూ ఆహ్వానిస్తున్నట్లు శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి తెలిపారు. రైతులకు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా స్పందించి ఆదుకోవడంలో ఎస్పీవై రెడ్డి ముందుంటారని చెప్పారు. ఆయనకు పార్టీ అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని ఆమె వివరించారు.

జగన్ పై కాంగ్రెస్ విషవ్యూహం

Written By news on Friday, September 27, 2013 | 9/27/2013


http://www.tupaki.com/news/view/Congre/38425

మోపిదేవికి జగన్ పరామర్శ

మోపిదేవికి జగన్ పరామర్శ
అంతకుముందు శ్రీ జగన్మోహన్ రెడ్డి కేర్ ఆస్పత్రికి వెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉన్నదీ అడిగి, తెలుసుకున్నారు. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సలహాదారు సిసి రెడ్డిని కూడా ఆయన పరామర్శించారు.

దున్న ఈనిందని ఎల్లో మీడియా అంటే..దూడను కట్టేయమంటూ టీడీపీ వత్తాసు

దున్న ఈనిందని ఎల్లో మీడియా అంటే..దూడను కట్టేయమంటూ టీడీపీ వత్తాసు
సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల ధర్నాలో వైఎస్సార్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌.విజయమ్మ పాల్గొంటే ఎల్లో మీడియాకు ఎందుకంత అక్కసని ఆ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ ప్రశించారు. ‘దున్న ఈనిందని ఎల్లో మీడియా ప్రసారం చేస్తే... దూడను కట్టేయమంటూ టీడీపీ వత్తాసు పలికినట్లుంది’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. సోనియాగాంధీని శుక్రవారం రాత్రి 10గంటలకు విజయమ్మ కలుస్తున్నారంటూ ఒక చానల్‌ ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేయడం...దాన్ని పట్టుకొని టీడీపీ నాయకులు ప్రెస్‌మీట్‌ పెట్టి పిచ్చికూతలు కూస్తున్నారు. ఢిల్లీ వెళ్లిందే సోనియాకు కృతజ్ఞతలు తెలపడానికంటూ మాట్లాడుతున్నారు. కానీ విజయమ్మ ఈరోజు సాయంత్రం 5గంటలకే తిరుగు ప్రయాణం చేసేందుకు ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా గురువారం సాయంత్రమే విమాన టిక్కెట్లు బుక్‌చేసుకున్నారని తెలిపారు.అందుకు సంబంధించిన పత్రాలను మీడియాకు ఆమె మీడియాకు చూపించారు.
 
ఇలా రోజూ ఎన్నో అసత్యాలు చెబుతున్నా తాము నోటితో ఖండించుకోవాల్సి వస్తోందని, అయితే ఈ విషయంలో ఆధారాలు ఉండటంతో వారి నైజాన్ని నిరూపించగలుగతున్నామని వివరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొదటి నుంచి వైఎస్సార్‌సీపీపై ఎల్లోగ్యాంగ్‌ రకరకాల కథనాలను వండి వార్చడం, దాన్ని పట్టుకునే టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి దుమ్మెత్తిపోయడం ఆనవాయితీగా కొనసాగుతుందని ధ్వజమెత్తారు. ప్రజల్లో వైఎస్సార్‌సీపీకి లభిస్తున్న ఆదరణను తగ్గించేందుకు మరుగుజ్జు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ

వైఎస్సార్ సీపీలో చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డి
హైదరాబాద్: కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ సమక్ష్యంలో ఆయన పార్టీలో చేరారు. ఆయనను జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరినట్టు ఎస్పీవై రెడ్డి తెలిపారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ ను కలిసి తన రాజీనామా ఆమోదింపజేసుకుంటానని చెప్పారు. అంతకుముందు జగన్ తో ఎస్పీవై రెడ్డి సమావేశమయ్యారు. ఇరువురు నేతలు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు.

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎస్పీవై రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ సీపీ రాజీలేని పోరాటం చేస్తోంది. సమ న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీవై రెడ్డి..


http://www.sakshi.com/video/news/nandyal-mp-spy-reddy-joins-ysrcp-4302

జగన్ ను కలవనున్న కాంగ్రెస్ ఎంపీ ఎస్పీవై.రెడ్డి

వైఎస్ జగన్ తో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి భేటి!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కర్పూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి శుక్రవారం సాయంత్రం కలువనున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై గత కొంతకాలంగా ఎస్పీవై రెడ్డి ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు వైఎస్ జగన్ తో భేటి కానున్నారు. అయితే వైఎస్ జగన్ తో ఎస్పీవైరెడ్డి భేటి రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపుతోంది

నెటిజన్లు మెచ్చిన నాయకుడు.. జగన్!!

నెటిజన్లు మెచ్చిన నాయకుడు.. జగన్!!
హైదరాబాద్ : జగన్.. జగన్.. జగన్.. నెటిజన్లు చేస్తున్న నామజపమిది!! అవును.. మన రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా చూసినా నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న పేరు ఎవరిదో కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన రెడ్డిదే!! కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్.. ఇలాంటి నాయకులందరినీ తలదన్ని జగన్ మోహనరెడ్డి ముందంజలో నిలిచారు. 2009 జనవరి నుంచి 2013 సెప్టెంబర్ వరకు 'గూగుల్ ట్రెండ్స్'ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది.

జగన్, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్.. ఈ నలుగురు నాయకులలో భారతదేశంలో ఉన్న నెటిజన్లు ఎక్కువగా ఎవరిపేరు సెర్చ్ చేస్తున్నారో చూస్తే, అందరి కంటే ఎక్కువగా జగన్ కోసమే సెర్చ్ చేశారు. సగటున చూసుకుంటే జగన్ కోసం 23% మంది, కిరణ్ కుమార్ రెడ్డి కోసం 0% మంది, చంద్రబాబు నాయుడు కోసం 1% మంది, కేసీఆర్ కోసం 13% మంది సెర్చ్ చేసినట్లు గూగుల్ ట్రెండ్స్ లో స్పష్టమైంది. జాతీయ పత్రికలు కూడా ఈ విషయాన్ని పతాక శీర్షికలతో ప్రధాన కథనాలలో ప్రచురించాయి.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన నాటినుంచి జగన్ కు సంబంధించిన కథనాలు, చిత్రాల కోసం నెటిజన్లు ఇంటర్ నెట్ ను విపరీతంగా గాలించారు. ఓదార్పు యాత్ర, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా, కొత్తగా పార్టీ ఏర్పాటు... ఇవన్నీ నెటిజన్ల హాట్ ఫేవరెట్లే అయ్యాయి. ఇక తాజాగా 484 రోజుల జైలు జీవితం నుంచి జనజీవితంలోకి జగన్ అడుగుపెట్టగానే ఒక్కసారిగా వెబ్ సైట్ల మీద నెటిజన్లు దాడి చేసినంత పనిచేశారు. ఒకేసారి వేల సంఖ్యలో జగన్ విడుదలకు సంబంధించిన కథనాలు, చిత్రాలు, వీడియోలను వీక్షించారు

తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చండి

'తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చండి'
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం శాసనసభ సభాపతి నాదెండ్ల మనోహర్ ను కలిశారు.   తక్షణమే అసెంబ్లీని సమాపర్చాలని ఈ సందర్భంగా వారు స్పీకర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం పెట్టాలని ఎమ్మెల్యేలు సభాపతి ను కోరారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం ఏవిధంగా అయితే  ప్రత్యక సమావేశం ఏర్పాటు చేశారో అదే పద్థతిలో సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం కోసం అసెంబ్లీ సమావేశపరచాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని ఇంకా కాలయాపన చేయవద్దని కోరారు. స్పీకర్ ను కలిసిన అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ  తమది... పార్టీ అధ్యక్షుడిదీ ఒకే మాట అన్నారు

ఇడుపులపాయకు అనుమతిపై విచారణ 30కి వాయిదా

తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించేందుకు అక్టోబర్‌ 1, 2 తేదీల్లో ఇడుపులపాయకు అనుమతించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పిటిషన్ పై సోమవారంలోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సీబీఐకి న్యాయస్థానం ఆదేశించింది.

నిజానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే రైతుల సమావేశంలో, ట్రాక్టర్ల ర్యాలీని అక్టోబర్‌ 1న విజయమ్మ నేతృత్వంలో తలపెట్టడం, అనంతర పరిణామాల్లో జగన్‌ బెయిల్‌పై విడుదలవడం తెలిసిందే. ర్యాలీకి తాను స్వయంగా సారథ్యం వహించాలని ఆయన భావిస్తున్నారు.
అయితే 1, 2 తేదీల్లో ఇడుపులపాయ వెళ్లాలని జగన్‌ యోచిస్తుండటం, 3న విచారణ కోసం కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో ర్యాలీని 4న జరపాలని యోచిస్తున్నారు. అందులో పాల్గొనేందుకు అనుమతించాల్సిందిగా కోర్టును జగన్‌ కోరారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు అక్టోబర్ నాలుగో తేదీకి వాయిదా వేసింది

టీడీపీ, కాంగ్రెస్ నేతలను నిలదీయండి

టీడీపీ, కాంగ్రెస్ నేతలను నిలదీయండి: విజయమ్మవిస్తరించు & ప్లే క్లిక్ చేయండి
న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్ తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న ధర్నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె యూపీఏ సర్కారు మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్నదమ్ముల్లా ఉన్న తెలుగువారి మధ్య అంతరం పెంచారని, విభజనను తెలుగుప్రజలు ఎప్పటికీ అంగీకరించబోరని.. రాష్టాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రజలకు జవాబు చెప్పకుండా విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నిర్ణయంతో జనం ఇక్కట్లు పడుతున్నారని, దాదాపు 60 రోజులుగా సాగుతున్న సమ్మె వల్ల సీమాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మీద తీవ్రప్రభావం పడుతోందని ఆమె గుర్తు చేశారు.

ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోజు ముందుగా సమైక్య వాదనను వినిపించలేదని, ఇప్పుడు మాత్రం విభజన వద్దంటూ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి ఒక్కరు కూడా తమ పదవులకు రాజీనామాలు చేయలేదని, పైపెచ్చు కొత్త పార్టీ పెట్టి పోటీ చేస్తామంటున్నారని మండిపడ్డారు. పదవులపై తప్ప సమైక్యంపై వారికి చిత్తశుద్ధి లేదని, అసలు చంద్రబాబు లేఖ వల్లే కేంద్రం ధైర్యం చేయగలిగిందని ఆమె చెప్పారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను ఎందుకు విభజించలేదని, కేవలం తెలుగువారిని మాత్రమే ఎందుకు చీలుస్తున్నారని నిలదీశారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను సమైక్య రాష్ట్రం విషయమై ప్రజలు నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు.
అన్యాయమైన నిర్ణయాలు తీసుకుంటే వైఎస్ఆర్ సీపీ చూస్తూ ఊరుకోదని విజయమ్మ స్పష్టం చేశారు. ఆంటోనీ కమిటీతో ఎలాంటి న్యాయం జరగదని, హైదరాబాద్‌లో అందరం కలిసికట్టుగా ఉన్న తమను ఇప్పుడు వెళ్లిపోమంటే ఎలాగని ప్రశ్నించారు. పోలవరానికి ఎక్కడి నుంచి నీళ్లు ఇస్తారు? విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలి? అని నిలదీశారు. రాష్ట్ర బడ్జెట్‌లో సింహభాగం హైదరాబాద్‌ నుంచే వస్తోందన్న విషయాన్ని కూడా ఆమె గుర్తుచేశారు

శ్రీకాకుళం జిల్లా కన్వీనర్‌గా ధర్మాన కృష్ణదాస్

శ్రీకాకుళం : వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్‌గా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం రాత్రి తెలిపింది. కృష్ణదాస్ మొదటి నుంచీ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. జిల్లాలో పార్టీని ముందుకు నడిపించడంలో తన వంతు పాత్ర  పోషించారు. ఇప్పటివరకు జిల్లా కన్వీనర్‌గా ధర్మాన పద్మప్రియ కృష్ణదాస్ పనిచేశారు. అయితే గ్రామ స్థాయి నుంచి నిర్మాణ పరంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణదాస్ సరైన నాయకుడిగా భావించి జిల్లా బాధ్యతలను అప్పగించారు. 
 
సీఈసీ సభ్యురాలిగా పద్మప్రియ
ఇప్పటివరకు జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించిన ధర్మాన ప్రద్మప్రియ కృష్ణదాస్‌ను కేంద్ర కార్యనిర్వాహక మం డలి(సీఈసీ) సభ్యురాలిగా నియమిం చారు. ప్రస్తుతం సీఈసీలో ఎమ్మెల్యేలు, కొందరు ముఖ్య నాయకులు సభ్యులుగా ఉన్నారు. 

ఇలా ప్రతిరోజూ ఒక కథనానికి కారణం నిద్రలేని రాత్రులు మొదలుకావటమేనేమో!!

‘ఇందు’ కే రామోజీ చిందులు
జగన్‌కు బెయిలు రావటంతో ‘ఈనాడు’ రోజుకో కథనం
 ఆఖరికి బాబు అర్థంలేని సందేహాలనే పేర్చి బ్యానర్ స్టోరీ

 వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులపై సీబీఐ దర్యాప్తును రెండేళ్లకు పైగా డ్రైవర్ సీట్లో కూర్చుని నడిపించిన రామోజీ రావుకు దర్యాప్తు ముగియటం ఏమాత్రం మింగుడు పడటం లేదు. సుప్రీంకోర్టు గడువుతో... కోర్టు ధిక్కరణ భయంతో... సీబీఐ దర్యాప్తును ముగించగా... దానివల్ల జగన్‌కు బెయిలు రావటం ఎల్లో ముఠాధిపతికి అస్సలు గిట్టడం లేదు. అందుకే కోర్టు విచారణకు సైతం స్వీకరించని చార్జిషీట్ల పేరు చెబుతూ... వారం రోజులుగా జగన్‌ను టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. ఆఖరికి తన సియామీ కవల చంద్రబాబు వ్యక్తం చేసిన అర్థంలేని సందేహాలతో బుధ, గురువారాల్లో  పతాక కథనాల్ని కూడా వండేశారు. బహుశా... ఇలా ప్రతిరోజూ ఒక కథనానికి కారణం నిద్రలేని రాత్రులు మొదలుకావటమేనేమో!!
 
 ఇందుకు భూ విందు అంటూ... బుధవారం అడ్డగోలు రాతలు అయినా విచారణకు స్వీకరించని చార్జిషీటు రామోజీకెలా వచ్చింది? అవి ఎకరా రూ. 20 వేలు కూడా విలువ చేయని భూములు అలాంటి వాటికి ఎకరాకు రూ. 1.75 లక్షల ధర నిర్ణయం అనంతపురంలో పరిశ్రమలు రావాలన్నదే వైఎస్ ఆలోచన 2006లో సైన్స్ సిటీ కోసం ఏపీఐఐసీ భూ సేకరణ ప్రకటన నీరు లేక అది వెనక్కెళ్లటంతో సేకరణ నిలిపివేత ఆ తరవాత ఏ పరిశ్రమా రాలేదు; ముందుకొచ్చిన లేపాక్షి సోమశిల నుంచి నీటి కేటాయింపు; దాన్ని తేవడానికే భారీ ఖర్చు అవన్నీ పరిగణనలోకి తీసుకుని రుణం మంజూరు చేసిన బ్యాంకు ప్రభుత్వ రేటు వేరు; బ్యాంకు రేటు వేరంటూ 2002లో నిబంధన
 ఆ నిబంధన తెచ్చింది చంద్రబాబు; దాని ప్రకారమే కేటాయింపులు అప్పటి నిబంధనల ప్రకారమే
ఇందూకు రుణమిచ్చిన బ్యాంకులు దాన్ని విక్రయ విలువగా కట్టేసి... 1,207 కోట్ల లాభమంటూ పిచ్చి రాతలు  హైదరాబాద్ నడిబొడ్డున ఐఎంజీకి 850 ఎకరాలు కేటాయించిన బాబు ఎకరా కేవలం రూ. 50 వేలకు; భళా అంటూ సమర్థించిన రామోజీ జీఎంఆర్‌కు 2,000 ఎకరాలు చాలన్నా... 5,500 ఎకరాల కేటాయింపు  లండన్ హీత్రూ విమానాశ్రయం కూడా 3,000 ఎకరాల్లోనే బాబు ఏది చేసినా రైటనే తీరులో ఈనాడు తందాన తాన కోర్టులు ఆదేశాలిచ్చినా ఆయనవైపు చూడనే చూడని సీబీఐ  ఎకరా ఇరవై వేలు చెప్పినా కొనటానికి ముందుకు రాని భూములవి.  భూగర్భ జలాల జాడ క నపడదు. వర్షం ఊసే ఉండదు.  అప్పులు తెచ్చి పంట పెడితే రైతుకు మిగిలేది అప్పు మాత్రమే.
 
 అలాంటి వెనకబడిన జిల్లాలో... ఎడారిని తలపించే భూముల్లో... ఓ పారిశ్రామిక పార్క్ పెడితే పెద్ద ఎత్తున పరిశ్రమలొస్తాయని భావించారు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి. అలాంటి ప్రయత్నం ఏ చంద్రబాబు నాయుడో చేస్తే... ఎల్లో మీడియాకు పూనకం వచ్చేసుండేది. ఇక ఆ జిల్లా సింగపూర్‌లా మారిపోతుందంటూ అమెరికా ఫొటోలు వేసి మరీ కథనాలు వార్చేసేది. ఆ కంపెనీ ప్రతినిధులు పచ్చి దొంగలైనా సరే... ఇంద్రులు- చంద్రులంటూ పొగిడేసేది. కానీ అలాంటి ప్రయత్నం వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేయటం దానికి ససేమిరా గిట్టలేదు. అందుకే... అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ను ఆది నుంచీ అది అడ్డుకుంటూనే వస్తోంది. ఇందూ ప్రాజెక్ట్స్ నుంచి గానీ, దాని అధిపతి శ్యాంప్రసాద్‌రెడ్డి నుంచి గానీ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లోకి రూపాయి పెట్టుబడి రాకున్నా... దాన్నీ ‘క్విడ్ ప్రో కో’ గాటన కట్టేసింది. ఎల్లో మీడియా కనుసన్నల్లో సాగిన దర్యాప్తులో సీబీఐ కూడా తందాన తాన అనేసింది. అది వేసిన చార్జిషీటంటూ... మళ్లీ అదే ఎల్లో కథనాన్ని బుధవారం వండి వార్చింది ఈనాడు. ‘లేపాక్షి పేరుతో ఇందూకు భూ విందు’ పేరిట బుధవారం పతాక శీర్షికలో ప్రచురించిన కథనంలో నిజానిజాలేంటి? ఇందూ ప్రాజెక్ట్స్ నిజంగానే జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టిందా? అక్కడ భూముల విలువ నిజంగా ఎంత? బ్యాంకులు ఎందుకు ఎకరాకు రూ.15 లక్షల రుణమిచ్చాయి? ఇలా రుణం తీసుకోవటం తప్పా? ఇవన్నీ వివరించేదే ఈ ‘ఏది నిజం?’
 
 అనంతపురం - బెంగళూరు మధ్య దూరం 240 కిలోమీటర్లు. దీనికి నడిమధ్యలో... అంటే అటు అనంతపురానికి, ఇటు బెంగళూరుకు దేనికైనా 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చిలమత్తూరు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చూసినా 100 కిలోమీటర్ల దూరం. గోరంట్ల, చిలమత్తూరు మండలాలు రెండూ చిత్రావతి నది పరివాహక ప్రాంతం పరిధిలోనివే. కాకుంటే 1996లో రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కర్ణాటక ప్రభుత్వం చిత్రావతిపై పరగోడు వద్ద ఓ బ్యారేజీని నిర్మించింది. దాంతో నది ఎండిపోయింది. భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లదీ అదే పరిస్థితి. వాటిపై ఆధారపడి సాగుచేస్తున్న భూములూ బీడువారాయి.
 
  
పంటలు లేక, భూగర్భ జలాలూ లేక అల్లాడుతున్న ఆ గ్రామాల్లో పరిశ్రమలొస్తే జిల్లా రాత మారుతుందని వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భావించింది. 2006లో సైన్స్ సిటీకి పచ్చజెండా ఊపింది. ఏపీఐఐసీ భూ సేకరణ ప్రకటనలిచ్చింది. కానీ నీటివసతి లేకపోవటంతో అక్కడ తమకు అవసరం లేదంటూ సైన్స్ సిటీ యాజమాన్యం వెనక్కెళ్లిపోయింది. దీంతో ఏపీఐఐసీ ఇతర పరిశ్రమల్ని ఆహ్వానించింది. ఎవ్వరూ ముందుకు రాలేదు. భూ సేకరణ నిలిపేసింది. ఆ తరవాత ముందుకొచ్చింది లేపాక్షి సంస్థ. ఆ సంస్థ ఇచ్చిన నిధులతోనే భూసేకరణ చేసింది ఏపీఐఐసీ. అదీ... లేపాక్షి భూముల అసలు కథ.

 100 కిలోమీటర్లంటే సమీపమా?

 ఇంకా విచారణకు స్వీకరించని చార్జిషీటును ఉటంకిస్తూ ‘ఈనాడు’ తన కథనంలో రాసిన అతిశయోక్తులు, అసత్యాలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది... ఈ భూములు బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో ఉన్నాయని రాసేయటం. అసలు 100 కిలోమీటర్ల దూరాన్ని ‘సమీపంలో’ అని రాయటం ఏటైపు జర్నలిజం? విశాఖపట్నానికి, శ్రీకాకుళానికి మధ్య దూరమెంత? 100 కిలోమీటర్లు కాదా? దానర్థం విశాఖపట్నానికి శ్రీకాకుళం సమీపంలో ఉన్నట్లేనా? మధ్యలో ఒక జిల్లా కూడా ఉందే!!! అయినా నిందితుడికి కూడా అందని చార్జిషీటు ‘ఈనాడు’కెలా వచ్చింది? సీబీఐతో ఉన్న బంధం వల్లా?
 
 ధర ఎన్నడైనా రూ.70 వేలు మించిందా?
 
లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూమి కేటాయించేదాకా చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో భూమి ఎన్నడూ ఎకరా రూ.65-70 వేలు మించలేదు. దీనికి ఆధారం 2008లో ఆయా మండలాల్లో జరిగిన లావాదేవీలే. ఈ లావాదేవీల ప్రకారం 2008లో అక్కడ భూ విలువలు సర్వే నంబర్లను బట్టి రూ.20,000 నుంచి రూ.50,000 వరకు ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం లేపాక్షికి ఎకరాకు రూ.1.75 లక్షల ధరను నిర్ణయించింది. 8 వేల ఎకరాల కోసం భూసేకరణ పూర్తికాక ముందే రూ.119 కోట్లను మూడు విడతలుగా ఏపీఐఐసీకి చెల్లించింది లేపాక్షి సంస్థ. ఆ నిధులతోనే భూసేకరణ చేసింది ఏపీఐఐసీ. ‘ఈనాడు’ మాత్రం అవాస్తవాలతో చెలరేగిపోయింది. 2006లో ఏపీఐఐసీ భూసేకరణ ప్రకటనలిచ్చిందని, దీనికి వ్యతిరేకంగా పత్రికల్లో కథనాలు రావటంతో నిలిపేసిందని రాశారు రామోజీ. నిజానికి సైన్స్ సిటీ ప్రతిపాదన, అది వెనక్కెళ్లిపోవటం ‘ఈనాడు’కు తెలియనివేమీ కావు. కానీ 2006 నుంచే లేపాక్షి కోసం భూములు సేకరించారని చెప్పే కుట్రలో ఇదో భాగం. అంతే!!
 
 ఇవన్నీ తలతిక్క లెక్కలు కాదా?
 రామోజీ, సీబీఐ లెక్కలు ఎంత తలతిక్కవో ఇది చూస్తే తేలిగ్గానే అర్థమవుతుంది. ఎకరాను రూ. 1.75 లక్షలకు కొనుక్కున్న లేపాక్షి సంస్థ... దాన్లో 4,650 ఎకరాలను బ్యాంకుల వద్ద తనఖా పెట్టి రూ.830 కోట్లను రుణంగా తెచ్చుకుందని, ఈ లెక్కన మొత్తం భూమి విలువ రూ.1,326 కోట్లని, దాన్లో ప్రభుత్వానికి చెల్లించిన 119 కోట్లను మినహాయిస్తే లేపాక్షి సంస్థకు రూ.1,207 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లని సీబీఐ పేర్కొందంటూ రామోజీ రాసి పారేశారు.
 
 అసలు రుణానికి, అమ్మకానికి తేడా లేదా రామోజీ? ఆ సంస్థ భూముల్ని తనఖా పెట్టి రుణం తెచ్చుకుంటే... ఆ విలువను మొత్తం భూములకు వర్తింపజేసి... లెక్కగట్టేసి... ఆ లెక్కన చూస్తే దానికి 1,207 కోట్లు లాభమనటం ఏ స్థాయి పైత్యం? ఆ సంస్థేమైనా ఆ భూముల్ని ఎకరా రూ.15 లక్షల చొప్పున విక్రయించిందా? అప్పుడు కదా దానికి లాభం వచ్చిందని చెప్పగలిగేది? రుణం తీసుకుంటే ఆ రుణం చెల్లించొద్దా? అందరూ రామోజీ మాదిరి రుణాలు ఎగ్గొట్టి కోర్టుల చుట్టూ తిప్పించేవారే ఉంటారా? అసలు ఫిలిం సిటీలో ఎకరా రూ.లక్ష చొప్పున కొని దాన్ని బ్యాంకుల వద్ద తనఖా పెట్టినపుడు ఎకరాకు రూ.లక్ష చొప్పునే రుణం తీసుకున్నారా? మరి అన్ని వేల కోట్ల అప్పులు ఎలా పుట్టాయి రామోజీ?
 
 బాబు హయాంలోనే ఆ నిబంధనలు...
 లేపాక్షి భూముల విషయానికొస్తే అవన్నీ ఎడారి భూములు. అక్కడ ఏ పరిశ్రమ లేదా ప్రాజెక్టు రావాలన్నా నీరు తప్పనిసరి. అందుకే సోమశిల నుంచి దీనికి ప్రభుత్వం నీరు కేటాయించింది.  ఆ నీటిని తీసుకురావటానికి కడప జిల్లా నుంచి లేపాక్షి దాకా పైప్‌లైన్లు వేయాలంటే... ఆ ఖర్చు ఎకరాకు రూ.10 నుంచి 15 లక్షలు అవుతుంది. అది లేపాక్షి సంస్థ భరించాల్సిందే. ఆ ఖర్చు భరించి పైప్‌లైన్ వేస్తేనే.. సోమశిల నీళ్లు తెస్తేనే ఇక్కడ పెట్టే పరిశ్రమలకు నీళ్లందుతాయి. అప్పుడే ఏ ప్రాజెక్టయినా ఇక్కడకొస్తుంది. బ్యాంకులు రుణాలిచ్చే ముందు ఆ భూములకు విలువ కట్టే ముందు ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటాయి.
 
 అందుకే బ్యాంకుల విలువకు అక్కడ ప్రభుత్వం కట్టిన విలువతో సంబంధం ఉండదు. ఈ నిబంధనను 2002లో అమల్లోకి తెచ్చింది, అమలు చేయించింది కూడా చంద్రబాబే. బాబు హయాంలో భూ కేటాయింపులు పొందిన సంస్థలు ఇదే రకంగా తనఖాలూ పెట్టుకున్నాయి. అప్పటి నుంచి ఇటీవలి దాకా అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఈ నెల్లోనే మార్చారు. ఇకపై బ్యాంకులు అక్కడి మార్కెట్ విలువకన్నా ఎక్కువ మొత్తాన్ని రుణంగా మంజూరు చేయరాదనే నిబంధన విధించారు. మరి నిబంధనల ప్రకారం బ్యాంకులు రుణాలిచ్చినపుడు అది తప్పెలా అవుతుంది? రుణం వేరు... అమ్మకం వేరన్న సంగతి సీబీఐకి గానీ, రామోజీకి గానీ తెలియదనుకోవాలా? చిలమత్తూరు, గోరంట్ల, కోడూరు మండలాల్లో లేపాక్షి సంస్థ రాకముందు ఎకరా రూ.50 వేలు కూడా పలకని పరిస్థితి ఉండేదని, అందుకే రూ.1.75 లక్షలుగా నిర్ణయించేసరికి చాలామంది తమ భూములు కొనుక్కోవాలంటూ డిమాండ్లు చేశారని సీబీఐకి తెలియదా? రామోజీకి తెలియదా? తెలుసుకోవాల్సిన అవసరం దర్యాప్తు సంస్థలకు లేదా?
 
 జగన్ సంస్థల్లో ఇందూ పెట్టుబడులు సున్నా!
 లేపాక్షికి భూముల్ని కేటాయించినందుకు ప్రతిగా శ్యామ్ ప్రసాద్‌రెడ్డి రూ.50 కోట్లను జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారని ‘ఈనాడు’ రాసిపారేసింది. నిజానికి జగన్ సంస్థల్లోకి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నుంచి గానీ, ఇందూ ప్రాజెక్ట్స్ నుంచి గానీ రూపాయి కూడా పెట్టుబడిగా రాలేదు. ఇందూ ప్రాజెక్ట్స్‌కు చెందిన ఇందూ టెక్‌జోన్‌కు శంషాబాద్ అవతల భూమి కేటాయించకముందే... లేపాక్షికి భూములు కేటాయించక ముందే... ‘సాక్షి’లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన పెట్టుబడిని ఇందూతో ముడిపెడుతోంది సీబీఐ. దాన్ని కావాలని వదిలిపెట్టి నేరుగా ఇందూ పెట్టుబడులు సాక్షిలోకి వచ్చాయని రాసేశారు రామోజీ!!
 
 నిజానికి నిమ్మగడ్డ ప్రసాద్‌కు, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి అంతకు ముందు నుంచే వ్యాపార లావాదేవీలున్నాయి. అందులో భాగంగానే శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు ప్రసాద్. నిజానికి అప్పటికే ప్రసాద్ చాలా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. కేర్ ఆసుపత్రి, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మా టీవీ... ఇలా చాలా సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రసాద్... వాటిలో భాగంగానే శ్యామ్‌ప్రసాద్ రెడ్డికి చెందిన సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టారు. ఇన్వెస్ట్‌మెంట్లు చేయడానికే ఆయన ఒక ఫండ్‌ను కూడా ఏర్పాటు చేశారంటే ఆయన ఎంతటి సీరియస్ ఇన్వెస్టరో అర్థం చేసుకోవచ్చు. మ్యాట్రిక్స్ నుంచి మొదలుపెడితే ప్రతిచోటా విజయవంతమైన ఇన్వెస్టరుగా అంతర్జాతీయ ఖ్యాతిని కూడా ఆర్జించారాయన.
 
 అలాంటి ప్రసాద్ కేవలం జగన్ మోహన్‌రెడ్డి సంస్థలో పెట్టుబడులు పెట్టారనే కారణంతో... ఆయనకు ఇందూ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డితో సంబంధాలున్నాయనే కారణంతో... ఇందూకు ఆ తరవాత ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను చూపెట్టి వీటన్నిటికీ లింకు పెట్టడాన్ని ఏమనుకోవాలి? మోకాలు కూడా కాకుండా... బోడిగుండుకూ, అరికాలుకూ లింకు పెడుతున్నారనుకోవద్దా? ఇంతకన్నా ఘోరమేమైనా ఉంటుందా? పారిశ్రామిక వేత్తగా, సీరియస్ ఇన్వెస్టర్‌గా నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఈ రాష్ట్రంలో ఎందరో పారిశ్రామిక వేత్తలతో సంబంధాలుండొచ్చు. అలాంటి ప్రసాద్ కేవలం సాక్షిలో ఇన్వెస్ట్ చేశారనే కారణంతో... ఆ పారిశ్రామికవేత్తలందరినీ వెదికి, వారిలో ప్రభుత్వ ప్రాజెక్టులు చేపట్టిన ప్రతివారినీ పట్టుకుని లింకులు పెట్టుకుంటూ పోతే... వాటికి ‘క్విడ్ ప్రో కో’ ఆపాదిస్తూ పోతే ఏమవుతుంది? దాన్ని దర్యాప్తు అంటారా? అలాంటి వార్తలు రాసేవాటిని పత్రికలంటారా?
 
 ఇదేమైనా ఐఎంజీ బాగోతమా?
 లేపాక్షి సంస్థ భూములకు దరఖాస్తు చేసేనాటికి ఆర్‌ఓసీలో రిజిస్టరు కూడా కాలేదని, ఇదంతా కుట్రపూరితంగానే జరిగిందని రాసేసింది ‘ఈనాడు’. అసలు ఏ ప్రాజెక్టయినా ఒప్పందం కుదిరే వరకూ దాని మాతృసంస్థ పేరుతోనే నడుస్తుంది. ఖరారయ్యాక, ఒప్పందం చేసుకునే ముందు మాత్రమే దాన్ని ఏ పేరుతో పెట్టాలనుకున్నారో ఆ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేస్తారు. ఆ సంగతి సీబీఐకిగానీ, రామోజీకి గానీ తెలియదనుకోవాలా? ఈ దేశంలో ఏ సంస్థయినా ఇలానే చేస్తుంది కదా!! ఒప్పందం, కేటాయింపు ఇవన్నీ సదరు గ్రూప్ సంస్థ అనుభవం, సత్తా ఆధారంగానే జరుగుతాయి కదా? ఇవన్నీ తెలియదా?
 
 అయినా ఇందూ సంస్థ ఏమైనా ఐఎంజీ లాంటిదా? ఎక్కడో అనంతపురంలో ఎకరా రూ. 1.75 లక్షలకు చేసిన భూ కేటాయింపును ప్రస్తావిస్తున్న రామోజీరావుకు గానీ, సీబీఐకి గానీ... హైదరాబాద్ నడిబొడ్డున... 850 ఎకరాలను... ఎకరా కేవలం రూ. 50 వేల చొప్పున ఊరూపేరూ లేని బోగస్ సంస్థకు కట్టబెట్టిన బాబు బాగోతం ఎన్నడూ కనిపించదెందుకు? దీనిపై దర్యాప్తునకు ఆదేశించినపుడు కూడా సీబీఐ తనకు సిబ్బంది లేరని తప్పించుకుందంటే ఏమనుకోవాలి? దీనిపై కోర్టు విచారణకు ఆదేశించినపుడు సైతం ఒక్క కథనం రాసే ధైర్యం రామోజీరావు చెయ్యలేదంటే ఎలా భావించాలి?
 
 ఊరూపేరూ లేని సంస్థ తరఫున బిల్లీరావు, పేట్‌రావు అనే ఇద్దరు వ్యక్తులు దరఖాస్తు చేయటం... చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఆగమేఘాలపై భూ కేటాయింపు చేసేయటం... భూములతో పాటు స్టేడియాలను కూడా అప్పగించటం... ఇవన్నీ ఏమనుకోవాలి? అనంతపురంలో ఎకరా రూ. 1.75 లక్షలకు కేటాయిస్తే అది తప్పా? అది పరిశ్రమల కోసం కాదా? హైదరాబాద్ నడిబొడ్డున ఎకరా రూ.50 వేలకు కట్టబెట్టేస్తే... అది ఈ రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయడానికా? ఒలింపిక్ విజేతలు పుట్టకురావటానికా? ఎందుకింత దౌర్భాగ్యపు రాతలు రామోజీ? అప్పట్లో ఐఎంజీని ఆకాశానికెత్తేసింది మీ పత్రికే కదా? ఎందుకని? అది చంద్రబాబు కేటాయించింది కాబట్టా? ఇదేమో రాజశేఖరరెడ్డి కేటాయించింది కనకనా? ఇవేం విలువలు?
 
 భూ కేటాయింపుల్లో బాబును మించేదెవరు?
 అసలు భూ కేటాయింపుల్లో చంద్రబాబును మించిన వారెవరైనా ఉన్నారా? ఆయన కేటాయింపుల్లో అవకతవకలపై ఎన్ని ఆరోపణలొచ్చినా, ఆఖరికి కోర్టులు కూడా ఆదేశాలు జారీ చేసినా ఎన్నడూ సీబీఐ అటువైపు చూడదెందుకు? ఎన్నడూ రామోజీ ఒక్క రాత కూడా రాయరెందుకు? అసలు జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి హైదరాబాద్‌లో 2,000 ఎకరాలు సరిపోతుందని కేంద్ర సంస్థలు సైతం నివేదికలు ఇవ్వలేదా? వాటన్నిటినీ పక్కనబెట్టి ఏకంగా 5,500 ఎకరాలు కేటాయించిన ఘనత బాబుది కాదా?
 
 
అదెన్నడూ రామోజీకి తప్పుగా ఎందుకు కనిపించలేదు? ఎక్కడైనా ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికైనా ఇన్ని వేల ఎకరాలిచ్చారా? అంతర్జాతీయ ఖ్యాతి పొందిన సింగపూర్ చాంగీ విమానాశ్రయానికి కూడా మొత్తం భూమి 3,200 ఎకరాలే. ప్రపంచంలోనే అత్యధిక ఎయిర్‌ట్రాఫిక్ ఉండే న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం మొత్తం ఏరియా కూడా 4,900 ఎకరాలు. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయాన్ని చూస్తే మొత్తం ఏరియా 3,000 ఎకరాలు. అత్యంత బిజీ ఎయిర్‌పోర్టయిన ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం కొలువైంది కూడా 4,900 ఎకరాల్లోనే. కానీ చంద్రబాబు మాత్రం హైదరాబాద్ విమానాశ్రయానికి 5,500 ఎకరాలివ్వటమే అంతర్జాతీయ రికార్డు.

ఢిల్లీ బయల్దేరి వెళ్లిన వైఎస్ విజయమ్మ

ఢిల్లీ బయల్దేరి వెళ్లిన వైఎస్ విజయమ్మ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. నేడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తలపెట్టిన మహాధర్నాలో  ఆమె పాల్గొననున్నారు.  ఈరోజు ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయం నుండి విజయమ్మ, పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయరాదంటూ వైఎస్‌ఆర్‌సీపీతో పాటు, సచివాలయ ఉద్యోగులు ఢిల్లీలో నినదించనున్నారు.

 ఉదయం 10 గంటలకు ఉద్యోగులు ఏపీ భవన్‌ నుంచి ర్యాలీగా జంతర్‌మంతర్‌ వద్దకు చేరుకుంటారు.  ఆ తర్వాత సాయంత్రం నాలుగంటల వరకు మాహాధర్నా కొనసాగుతుంది. ఉద్యోగుల మహాధర్నాలో వైఎస్‌ విజయమ్మ పాల్గొంటారు.

నోట్‌కు ముందే తీర్మానం


* వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ డిమాండ్‌.. సీఎంకు లేఖ
విభజనకైనా, ఏకీకరణకైనా అసెంబ్లీ తీర్మానం సంప్రదాయం..
అదే సంప్రదాయం ప్రకారం ముందుగానే సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపుదాం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయడానికి తక్షణమే శాసనసభను సమావేశ పరచాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పార్టీ శాసనసభాపక్ష నాయకురాలు వైఎస్‌ విజయమ్మ డిమాండ్‌ చేశారు. విభజన నోట్‌ కేంద్ర కేబినెట్‌ ముందుకు రావడానికి ముందే ఈ తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాల్సిన అవసరముందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి గురువారం ఆమె లేఖ రాశారు. అందులోని వివరాలిలా ఉన్నాయి...

ముఖ్యమంత్రి గారికి,
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించాలని జూలై 30న సీడబ్ల్యూసీ ఏకపక్షంగా, అడ్డగోలుగా ఏకగ్రీవ తీర్మానం చేసిన నాటి నుంచీ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అక్కడ జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోయాయి. ఈ అవాంఛిత రాజ్యాంగ సంక్షోభానికి పూర్తి బాధ్యత వహించాల్సింది కేంద్ర, రాష్ట్రాలు రెండింట్లోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీయే.

ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకోవడం సముచితం. సంబంధిత రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేయనిదే కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ మొదలే కాబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. పైగా ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం మొదటి ఎస్సార్సీ సిఫార్సుల మేరకే జరిగినా... ఆ మేరకు ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్‌ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాల విలీనానికి అంగీకరిస్తూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీల నుంచి తీర్మానాలు కూడా తీసుకోవడం జరిగింది.

కాబట్టి, అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కేబినెట్‌ నోట్‌ సిద్ధమవక ముందే తీర్మానాన్ని ఆమోదించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.
- వైఎస్‌ విజయమ్మ

4న గుంటూరులో ట్రాక్టర్ల ర్యాలీకి జగన్‌

4న గుంటూరులో ట్రాక్టర్ల ర్యాలీకి జగన్‌
వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టుకు పిటిషన్‌
అక్టోబర్‌ 1,2 తేదీల్లో ఇడుపులపాయ ప్రయాణానికీ అనుమతించాలని వినతి
సీబీఐకి నోటీసులు జారీ, విచారణ నేటికి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే రైతుల సమావేశంలో, ట్రాక్టర్ల ర్యాలీలో పార్టీ అధ్యక్ష హోదాలో పాల్గొనేందుకు అక్టోబర్‌4న గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించేందుకు అక్టోబర్‌ 1, 2 తేదీల్లో ఇడుపులపాయకు కూడా అనుమతించాలని ఆయన… కోర్టుకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదంటూ బెయిల్‌ ఉత్తర్వుల్లో విధించిన… షరతును సడలించాలని ఆయన… కోరారు.

జగన్‌ తరఫు న్యాయవాది జి.అశోక్‌ రెడ్డి గురువారం ఈ మేరకు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నిజానికి గుంటూరు ర్యాలీని అక్టోబర్‌ 1న విజయమ్మ నేతృత్వంలో తలపెట్టడం, అనంతర పరిణామాల్లో జగన్‌ బెయిల్‌పై విడుదలవడం తెలిసిందే. ర్యాలీకి తాను స్వయంగా సారథ్యం వహించాలని ఆయన భావిస్తున్నారు. అయితే 1, 2 తేదీల్లో ఇడుపులపాయ వెళ్లాలని జగన్‌ యోచిస్తుండటం, 3న విచారణ కోసం కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో ర్యాలీని 4న జరపాలని యోచిస్తున్నారు. అందులో పాల్గొనేందుకు అనుమతించాల్సిందిగా కోర్టును జగన్‌ కోరారు.

‘‘వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో గుంటూరులో సమావేశానికి, భారీ ప్రదర్శనకు రైతులు ఏర్పాట్లు చేసుకున్నారు. నేతల కోరిక మేరకు, పార్టీ అధ్యక్షునిగా నేను వాటిలో పాల్గొనాల్సి ఉంది. అలాగే నా తండ్రి దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే మిక్కిలి ప్రేమాభిమానాలున్న వ్యక్తిగా ఇడుపులపాయలో ఆయన సమాధిని సందర్శించాలని భావిస్తున్నా. దాంతోపాటు పులివెందులలోని మా పూర్వీకుల ఇంటిని కూడా సందర్శించాలని కోరుకుంటున్నా. సుదీర్ఘకాలంగా రిమాండ్‌లో ఉన్నందున… అక్కడికి వెళ్లలేకపోయా’’ అని పిటిషన్‌లో జగన్‌ వివరించారు.

పిటిషన్‌ను పరిశీలించిన ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు... సీబీఐకి నోటీసులు జారీచేస్తూ, విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి ఈ నెల 23న బెయిల్‌ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు... ఆయన… హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని షరతు విధించిన విషయం తెలిసిందే.

30న గవర్నర్‌ను కలవనున్న జగన్‌, ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించడానికి వీలుగా తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలసి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ మేరకు వినతిపత్రం అందించడానికి 30న ఉదయం 11 గంటలకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఖరారైంది. ఆ రోజున పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలసి సమైక్య తీర్మానం కోసం అసెంబ్లీని సమావేశపరచాలని కోరనున్నారు.

నేడు స్పీకర్‌తో ఎమ్మెల్యేల భేటీ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయడానికి వీలుగా తక్షణం అసెంబ్లీని సమావేశపర్చాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను ఆయన చాంబర్‌లో కలిసి కోరనున్నారు. గురువారం ఉదయమే కలవాలని భావించినా, ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల భేటీని వాయిదా వేసుకున్నారు.

విజయమ్మ లేఖతో సి.ఎమ్. పై ఒత్తిడి

Written By news on Thursday, September 26, 2013 | 9/26/2013

సీఎం కిరణ్ కు వైఎస్ విజయమ్మ లేఖ
తెలంగాణ నోట్ సిద్దం కాకముందే శాసనసభను సమావేశపర్చాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు, శాసనసభ పక్ష నేత విజయమ్మ కోరారు. ఆమె ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానాన్ని ఆమోదింపజేయాలని ఆమె సూచించారు.రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా విజయమ్మ వ్యాఖ్యానించారు.


వైఎస్ జగన్ రాకను స్వాగతిస్తూ డాలస్ మహానగరంలో సమావేశం

డాలస్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై జైలు నుంచి విడుదలవడాన్ని డాలస్ ఎన్‌ఆర్‌ఐ వై‌ఎస్‌ఆర్‌సీపీ అభిమానులు స్వాగతించారు. జననేత 16 నెలల తర్వాత ప్రజల మధ్యలోకి వచ్చిన శుభసందర్భంలో ఆయన రాకను స్వాగతిస్తూ డాలస్ మహానగరంలోని మయూరి ఇండియా రెస్టారెంట్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ముఖ్య అతిథిగా వ్యవహరించారు. కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్ జగన్ సేవలు ఆంధ్రప్రదేశ్ కి ఎంతో అవసరమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.

మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావలసిన అవసరముందని, ఆయన నాయకత్వం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటుందని, ఆయన సీఎం అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గురున్నాథ్ రెడ్డి, తోపుదుర్తి కవిత కాన్ఫరెన్స్ ఫోన్ కాల్ ద్వారా డాలస్ వై‌ఎస్‌ఆర్‌సీపీ అభిమానులతో మాట్లాడారు.

శ్రీధర్ రెడ్డి కొర్శపాటి, గుర్రం శ్రీనివాసుల రెడ్డి, జయ చంద్ర, ప్రతాప్  భీమిరెడ్డి, చిలుకూరి గోపి, రమణా పుట్లూరు, తిరుమల్, శ్రీనివాసులు, ఎన్‌ఎం‌ఎస్ రెడ్డి, రమణా క్రిష్టపాటి, మురళి, సుధాకర్, మహేష్, సుబ్బారెడ్డి నార్పల, పల్గుణ, భాస్కర్ గడికోట, ఉమా మహేష్, జయ సింహా, ఉమా మహేశ్ కొర్రి మనోహర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వైఎస్ జగన్ రాకతో న్యూజెర్సీలో పండుగ

వైఎస్ జగన్ రాకతో న్యూజెర్సీలో పండుగ
న్యూజెర్సీ: వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలునుంచి బయటకు రావడంతో అమెరికాలో పండుగ వాతావరణం నెలకొంది. ఆళ్ళ రామిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ రాఘవ రెడ్డి, సురేష్ రెడ్డి, హరి వేల్కుర్, శ్రీకాంత్ గుడిపాటి, అన్నారెడ్డి, రమణ దేవులపల్లి, శ్రీకాంత్ పెనుమాడ, ప్రతాప్ భీమిరెడ్డి, సంతోష్ పాతూరి ఆధ్వర్యంలో జరిగిన  సమావేశానికి ఈశాన్య అమెరికాలో ఉంటున్న 300 పైగా వైఎస్సార్ అభిమానులు హాజరైనారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైనా పలువురు వక్తలు ప్రసంగించారు.
ఓదార్పు యాత్రకు వెళతానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఆస్తులు పోయినా, జైలుకు వెళ్లినా పర్వాలేదు అని ధైర్యంగా మాట మీద నిలబడిన ధీరుడు వైఎస్ జగన్.  మన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరధం పట్టడం చూస్తుంటే ఎంత గొప్ప నాయకుడైనాడో తెలిసిపోతున్నది. ఇంతటితో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి కుటుంబానికి కష్టాలు తీరిపోవాలని కోరుకుంటూ జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు విశ్రమించకుండా అన్ని విధాలా వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉంటామని కార్యకర్తలు అందరూ ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేశారు.  మంగళవారం పనిరోజు అయినప్పటికీ ఇంతమంది అభిమానులు తమ సంతోషాన్ని పంచుకోవడానికి కలుసుకున్నారు.

ఈ సందర్భంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ రాజన్న రాజ్యం తీసుకు రాగలిగిన ఏకైక నాయకుడు జగనే అని, అలాగే కేంద్రంలో కాంగ్రెస్ పీడ విరగడ కావాలని ఆకాంక్షించారు. రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డులో ఇలాంటి సమయంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి నీరాజనం పట్టడం చూస్తేంటే జనంలో ఎంత అభిమానం ఉన్నదో అర్ధం అవుతున్నదని తెలియ చేశారు. రామిరెడ్డి మాట్లాడుతూ జగన్ లాంటి నాయకుణ్ణి భారత దేశం మొత్తం మీద వెతికినా కూడా ఒక్క నాయకుడు కూడా దొరకడని, కేసులకు భయపడి ఎంతో మంది నాయకులు తలవంచారని ఒక్క జగనే ధైర్యంగా నిలబడి పోరాడాడని చెప్పారు. ఈ సభలో సురేష్ రెడ్డి, రమణ దేవులపల్లి, శ్రీకాంత్ పెనుమాడ, ప్రతాప్ భీమిరెడ్డితో పాటు పలువురు వక్తలు ప్రసంగించారు. కాగా, ఈ సమావేశం ఆళ్ళ రామిరెడ్డి వందన సమర్పణతో ముగిసింది.

సత్వరమే అసెంబ్లీని సమావేశపరచాలంటూ సీఎం కిరణ్ కు వైఎస్ విజయమ్మ లేఖ


హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. సత్వరమే అసెంబ్లీని సమావేశపరచాలంటూ ఆమె లేఖలో డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానాన్ని ఆమోదింపజేయాలని విజయమ్మ సీఎంకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నోట్ సిద్ధం కాకముందే అసెంబ్లీని సమావేశపరచాలని ఆమె కోరారు. యూపీఏ సమన్వయ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న అనంతరం సీమాంధ్రలోని ఉద్యమం ఎగసి పడుతున్న తెలిసిందే. ఈ తరుణంలో వైఎస్ విజయమ్మ సీఎం కిరణ్ కు లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను లేఖలో వివరించారు.

అంతకుముందు సమైక్య రాష్ట్రం ఉద్యమంలో భాగంగా గురువారం వైఎస్సార్ సీపీ సీపీఎంతో చర్చలు జరిపింది.  సమైక్యరాష్ట్ర ఉద్యమం కోసం సీపీఎంతో ప్రాథమిక చర్చలు జరిపామని సమావేశం ముగిసిన అనంతరం వైఎస్సార్ సీపీ నేత ఎం.వి మైసూరారెడ్డి తెలిపారు. కలిసి ఉద్యమం చేద్దామనే కోణంలో చర్చ సాగిందని  ఆయన అన్నారు. రాష్ట్ర ఐక్యతకోసం సీపీఎంతో చర్చలు జరిపిన అనంతరం మైసూరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో చర్చించి నిర్ణయం త్వరలో చెప్తామన్నారని మైసూరా అన్నారు. ఉద్యమంపై రెండు పార్టీల మధ్య భావసారూప్యత ఉన్నా, కలిసి ఉద్యమం చే్ద్దామనే కోణంలో చర్చించామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

కేంద్రంలో చక్రం తిప్పనున్న జగన్http://www.tupaki.com/news/view/Ja/38320

వైఎస్ జగన్ కు గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్!

రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో తీర్మానం విషయంపై చర్చించే అంశంపై అపాయింట్ మెంట్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సానుకూలంగా స్పందించారు. సెప్టెంబర్ 30 తేదిన సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్ మెంట్ కేటాయించారు. రాష్ట్రాన్ని విభజించకుండా సమైక్యంగా ఉంచాలనే అంశంపై తమ పార్టీ వైఖరిని గవర్నర్ కు  వైఎస్ జగన్ వివరించనున్నారు. 
 
తెలంగాణపై కేంద్రం తీర్మానం పంపడానికి ముందే రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి... సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  డిమాండ్‌ చేస్తోంది.  అలాగే అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి, సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం చేయాలని,  తీర్మానం తర్వాత రాజీనామాలు ఆమోదించుకోవాలనే మూడు డిమాండ్లతో స్పీకర్‌ను కలుస్తామని శోభానాగిరెడ్డి వెల్లడించారు. 

సీపీఎంతో ప్రాథమిక చర్చలు జరిపాం: మైసూరారెడ్డి

సీపీఎంతో  ప్రాథమిక చర్చలు జరిపాం: మైసూరారెడ్డి
హైదరాబాద్: సమైక్యరాష్ట్ర ఉద్యమం కోసం సీపీఎంతో ప్రాథమిక చర్చలు జరిపామని వైఎస్సార్ సీపీ నేత ఎం.వి మైసూరారెడ్డి తెలిపారు. కలిసి ఉద్యమం చేద్దామనే కోణంలో చర్చ సాగిందని  ఆయన అన్నారు. రాష్ట్ర ఐక్యతకోసం సీపీఎంతో చర్చలు జరిపిన అనంతరం మైసూరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో చర్చించి నిర్ణయం త్వరలో చెప్తామన్నారని మైసూరా అన్నారు. ఉద్యమంపై రెండు పార్టీల మధ్య భావసారూప్యత ఉన్నా, కలిసి ఉద్యమం చే్ద్దామనే కోణంలో చర్చించామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఈ చర్చల్లో పాల్గొన్న బి.వి.రాఘవులు అనంతరం మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ బృందం కలిసి పనిచేద్దామని ప్రతిపాదించిదన్నారు. ఈ విషయాన్ని పార్టీలో చర్చించి తమ నిర్ణయం చెప్తామని వారికి తెలిపినట్లు రాఘవులు తెలిపారు

గవర్నర్ అపాయింట్ కోరిన జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి....రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్ కోరారు. తీర్మానం విషయంపై చర్చించేందుకు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తెలిపారు. తెలంగాణపై కేంద్రం తీర్మానం పంపడానికి ముందే రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి... సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  డిమాండ్‌ చేస్తోంది.  అలాగే అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి, సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం చేయాలని,  తీర్మానం తర్వాత రాజీనామాలు ఆమోదించుకోవాలనే మూడు డిమాండ్లతో స్పీకర్‌ను కలుస్తామని శోభానాగిరెడ్డి వెల్లడించారు

ఇడుపాలపాయ వెళ్తా, అనుమతించండి

ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో ఇడుపులపాయ వెళ్లేందుకు, నాలుగో తేదీన గుంటూరు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు.
తన  తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధిని సందర్శించేందుకు  అక్టోబర్‌ ఒకటి, రెండు తేదీల్లో అనుమతి ఇవ్వాలని కోర్టును  కోరారు. అలాగే అక్టోబర్‌ 4న  గుంటూరులో రైతులు నిర్వహిస్తున్న ర్యాలీ, సమావేశంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. జగన్‌మోహన్‌ రెడ్డికి జామీను మంజూరు సందర్భంగా ఆయనను హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే

లోటస్ పాండ్ కు రెండోరోజు అభిమానుల తాకిడి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం లోటస్‌ పాండ్‌ గురువారం కూడా జన సంద్రమైంది.  జగన్‌ను చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తున్నారు. అభిమానులను ఆయన... కాసేపట్లో వీరిని కలవనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యకర్తలు, అభిమానులను కలుస్తారు. దాంతో తమ అభిమాన నేతను చూసేందుకు తరలి వస్తున్నారు.

Jagan out, alarm in rival camps-Indianexpress

The release of Y S Jagan Mohan Reddy has raised concern in all other parties in Andhra Pradesh (AP).
The Congress has more or less given up hope in 13 districts — nine of coastal Andhra and four of Rayalaseema — after agreeing to the formation of a Telangana state. Its game plan to tie up with the TRS and sweep Telangana is also in jeopardy.

If YSRCP contests 20 Assembly seats in and around Hyderabad — it could upset the calculation of the Congress and the TRS.

Wednesday morning, hardly 12 hours after his release, Jagan had a glass of juice and rushed to meet visiting party MLAs. They discussed the political situation in the state and the YSRCP organisation and structure and its role in the anti-bifurcation agitation. Political commentator Telakapalli Ravi said N Chandrababu Naidu was not so comfortable openly supporting the anti-bifurcation agitation and as such, Jagan was well-placed to take over its leadership.
"The last bypolls were held when Jagan was in jail and still YSRCP won. Out of jail, he is an even bigger threat to the TDP. The Telangana issue has consolidated the position of Jagan in Seemandhra,'' he said.


http://www.indianexpress.com/news/jagan-out-alarm-in-rival-camps/1174382/

Popular Posts

Topics :