13 October 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

‘విభజన పేరుతో అహంకారంగా వ్యవహిరిస్తే సహించం’

Written By news on Saturday, October 19, 2013 | 10/19/2013

‘విభజన పేరుతో అహంకారంగా వ్యవహిరిస్తే సహించం’
గుంటూరు: రాష్ట్ర విభజన పేరుతో ప్రభుత్వం అహంకారంగా వ్యవహరిస్తే సహించేది లేదని వైఎస్సార్‌సీపీ నేత జూపూడి ప్రభాకరరావు హెచ్చరించారు.  ఈ నెల 26న నిర్వహిస్తున్న 'సమైక్య శంఖారావం' సభకు సమైక్యవాదులంతా తరలిరావాలని  ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. విభజన పేరుతో అహంకారంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదని ఆయన సూచించారు.
 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను వివరించేందుకే సమైక్య శంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు జూపూడి తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రామోజీరావులు కలిసి ఆడుతున్న కుట్రలను బయటపెడతామన్నారు. సమైక్య శంఖారావానికి సమైక్య వాదులంతా తరలి రావాలని ఆయన తెలిపారు.
 

'ల్యాంకో కోసమే లగడపాటి.. సోనియాకు పాదాభివందనం'

విజయవాడ : సంక్షోభంలో ఉన్న తన ల్యాంకో సంస్థను కాపాడుకోవడానికే కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. సోనియా గాంధీకి పాదాభివందనం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, గౌతంరెడ్డి విమర్శించారు. ల్యాంకోకు ఉన్న 40 వేల కోట్ల అప్పుల్లో 9 వేల కోట్ల మాఫీకి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అందువల్లే లగడపాటి చిత్తశుద్ధిలేని రాజీనామా చేసి పదవిలో కొనసాగుతున్నారని చెప్పారు. ఆస్ట్రేలియాలో ఆయనకున్న కంపెనీలపై కేసులున్నాయని తెలిపారు. ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు చేస్తామని ఇప్పటికీ నోరు మెదపడం లేదని ఉదయభాను, గౌతం రెడ్డి విమర్శించారు.

తుపాన్ బాధితుల్ని ఆదుకోండి: ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ

తుపాన్ బాధితుల్ని ఆదుకోండి: ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ
హైదరాబాద్ : ఫై-లీన్ తుపాన్ బాధితుల్ని ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శనివారం ప్రధాని మన్మోహన్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. తుపాన్ ప్రభావానికి శ్రీకాకుళం జిల్లాలో జరిగిన నష్టాన్ని వివరిస్తూ ప్రధానికి లేఖ రాశారు. అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. ఫైలిన్ బాధిత ప్రాంతాల్లో ఇటీవల విజయమ్మ పర్యటించిన సంగతి తెలిసిందే.

శ్రీకాకుళం జిల్లాలో భారీ నష్టం జరిగినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏరియల్ సర్వే కూడా చేయకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలు అంధకారంలో ఉన్నాయని, వెంటనే విద్యుత్ ను పునరుద్ధరించాలని విజయమ్మ కోరారు. రైతులు, మత్స్యకారులు పూర్తిగా నష్టపోయారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని వారు తనకు తెలిపారని లేఖలో పేర్కొన్నారు. నష్టపోయిన ప్రాంతాల్లో ఎకరాకు రూ.10వేల చొప్పున చెల్లించాలని, రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని ప్రధానిని విజయమ్మ కోరారు.

'సమైక్య శంఖారావం'ను విజయవంతం చేద్దాం: కొణతాల రామకృష్ణ

'సమైక్య శంఖారావం'ను విజయవంతం చేద్దాం: కొణతాల రామకృష్ణ
హైదరాబాద్: : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ తో ఈ నెల 26న నిర్వహిస్తున్న 'సమైక్య శంఖారావం' సభను విజయవంతం చేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. సమైక్యవాదులందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పీఠం కదిలేలా సమైక్య శంఖారావాన్ని పూరిద్దామంటూ కొణతాల ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీలు సహకరిస్తున్నాయని విమర్శించారు. సమైక్యాంధ్ర కోసం పార్టీలకు అతీతంగా పోరాడామంటూ సూచించారు. మహనీయుల త్యాగాలతో ఏర్పడ్డ తెలుగుగడ్డ విడిపోకూడదని కొణతాల రామకృష్ణ అన్నారు. వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సమైక్య శంఖారావం సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

సమైక్యవాదులారా.. 'సమైక్య శంఖారావం'కు తరలిరండి

సమైక్యవాదులారా.. 'సమైక్య శంఖారావం'కు తరలిరండి
హైదరాబాద్ : రాజకీయాలకు అతీతంగా సమైక్యవాదులందరూ 'సమైక్య శంఖారావం' సభకు తరలిరావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న 'సమైక్య శంఖారావం' సభ ఏర్పాట్లను పార్టీ నేతలతో కలసి శనివారం పరిశీలించారు.

తెలంగాణలో ఉన్న సమైక్యవాదులు కూడా సభకు తరలిరావాలని ఆమె అన్నారు. ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు హాజరుకావాలని, ఇదే తమ ఆహ్వానంగా భావించాలని శోభా నాగిరెడ్డి కోరారు.

సమైఖ్య శంఖారావంపై పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ చర్చలు

సమైఖ్య శంఖారావంపై పార్టీ  ఎమ్మెల్యేలతో జగన్ చర్చలు
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈనెల 26న జరప తలపెట్టిన సమైక్య శంఖారావం సభపై ఆయన ...పార్టీ నేతలతో చర్చించారు.పార్టీ ఎమ్మెల్యేలతో పాటు..తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీకి హాజరయ్యారు. సభ సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరిపారు. సమైక్య రాష్ట్రం డిమాండ్‌తో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 26న వైఎస్ఆర్ సీపీ సమైక్య శంఖారావం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

మొదట సభను 28వ తేదీన జరపాలని నిర్ణయించి పోలీసు అనుమతి కోరుతూ వైఎస్సార్సీపీ దరఖాస్తు కూడా చేసింది. అయితే 28వ తేదీ సోమవారం అవుతుందని, ఆ రోజు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 26న కానీ, 27న కానీ జరుపుకుంటే బావుంటుందని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. 27వ తేదీ ఆదివారం రోజు ఎల్బీ స్టేడియాన్ని వేరొకరు ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నారు. దాంతో 26వ తేదీ శనివారం సభ నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.

జగన్‌ను కలిసిన ఖమ్మం జిల్లా నేతలు

ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా నేతలు, కార్యకర్తలు పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితిని జగన్‌కు వివరించినట్లు మచ్చా, పొంగులేటి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ చేసే ప్రతిపనికి తాము అండగా ఉంటామన్నారు.
 
 జ
గన్‌ను కలిసిన వారిలో పినపాక, భద్రాచలం, వైరా, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల కన్వీనర్లు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, బానోత్ మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, నంబూరి రామలింగేశ్వరరావు, మట్టాదయానంద్, మధిర నియోజకవర్గ సీనియర్ నాయకులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ మెండెం జయరాజు, యువజన విభాగం మూడు జిల్లాల కో-ఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ భూక్యా దళ్‌సింగ్‌నాయక్, బీసీ సెల్ జిల్లా నాయకులు తోట రామారావు, బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మార్కం లింగయ్యగౌడ్, కడియం రామాచారి, జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ సంపెట వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జక్కం సీతయ్య, చంద్రశేఖర్, రైతుసంఘం జిల్లా కన్వీనర్ మందడపు సత్యనారాయణ, జిల్లా నాయకురాలు కీసర పద్మజారెడ్డి, జమలాపురపు రామకృష్ణ, మంత్రిప్రగడ నరసింహారావు, నగర మహిళా కన్వీనర్ కొత్తకుండ్ల శ్రీలక్ష్మి, రఘునాధపాలెం మండల కన్వీనర్ దుంపటి నగేష్, ఖమ్మం నగర ఉపాధ్యాయ విభాగం కన్వీనర్ షర్మిలా సంపత్, ముదిగొండ మండల కన్వీనర్ మర్రికంటి గురుమూర్తి, నాయకులు గంటా కృష్ణ,, కోయ రేణుక, నల్లా స్వరూపరాణి, అన్నపూర్ణ, మర్రికంటి భాస్కర్, చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు కిరణ్ తదితరులు ఉన్నారు.  
 
 టీడీపీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీలోకి...
 టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షురాలు మరికంటి ఊర్మిలాగౌడ్ శుక్రవారం హైదారాబాద్‌లో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.


విభజన తొలి ద్రోహి సోనియానే

* సమైక్య తీర్మానం కోసం వైఎస్సార్‌సీపీ డిమాండ్..
* కుదరదన్న సీఎం.. సచివాలయంలో ఎమ్మెల్యేల ధర్నా
* కేంద్రం కోరితే తప్ప తాను ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయలేనన్న కిరణ్
* సీ బ్లాక్ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన.. అరెస్టు
* తక్షణమే సభను సమావేశపరచాలని స్పీకర్‌ను కోరిన ప్రజాప్రతినిధులు
* సమైక్యవాదులెవరో, ద్రోహులెవరో తేలిపోతుందని వ్యాఖ్య    
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానించేందుకు శాసనసభను తక్షణమే ప్రత్యేకంగా సమావేశపరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని శుక్రవారం సచివాలయంలో కలిసి ఈ మేరకు డిమాండ్ చేశారు. కానీ అందుకు ఆయన ససేమిరా అన్నారు. అసెంబ్లీ ప్రత్యేక భేటీ కుదరదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం నేపథ్యంలో దానికి విరుగుడుగా శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, మేకతోటి సుచరిత, ధర్మాన కృష్ణదాస్, కాటసాని రామిరెడ్డి, కె.శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కర రామారావు తదితరులు కిరణ్‌ను కలిశారు. సమైక్య తీర్మానం కోసం అసెంబ్లీని వెంటనే ప్రత్యేకంగా సమావేశ పరచాలని డిమాండ్ చేశారు. కానీ వారి డిమాండ్‌ను కిరణ్ పట్టించుకోలేదు. శీతాకాల సమావేశాలకోసం డిసెంబర్‌లోనే సభ జరుగుతుందని చెప్పారు. కేంద్రం కోరితే తప్ప తనంతట తానుగా ముందస్తుగా సమావేశాలు ఏర్పాటు చేయలేనని కూడా ఆయన చెప్పినట్టు తెలిసింది. కిరణ్ తీరుతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సమైక్య తీర్మానం కోసం సభను సమావేశపరచాలనే డిమాండ్‌తో ఆయనకు వినతిపత్రం అందించారు.
అనంతరం జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేయడమే గాక సీఎం  కార్యాలయముండే సీ బ్లాక్ వద్ద ధర్నాకు దిగారు. ‘జగన్‌తోనే సమైక్యాంధ్ర సాధ్యం’, ‘సమైక్య జెండా, రాష్ట్రానికి అండ’, ‘సమైక్యం కోసం సభను సమావేశపరచాలి’, ‘జై సమైక్యాంధ్ర’, ‘బాబు, కిరణ్ మొండి వైఖరి నశించాలి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని అరగంటపాటు అక్కడే బైఠాయించారు. నినాదాలతో హోరెత్తించారు. దాంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కనీసం అక్కడున్న మీడియాతో మాట్లాడటానికీ అనుమతించలేదు. ప్రజాప్రతి నిధుల్ని బలవంతంగా ఎత్తుకెళ్లి వాహనం ఎక్కించి సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తు పై వదిలేశారు. ధర్నా నేపథ్యంలో సచివాలయంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెయిన్‌గేటు నుంచి సీ బ్లాక్ వరకు పోలీసు  వలయాన్ని ఏర్పాటు చేశారు.
 మరోవైపు అసెంబ్లీని తక్షణమే సమావేశపరచాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కూడా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల జరిగే నష్టాల్ని అసెంబ్లీద్వారా ప్రజలకు తెలపాల్సిన అవసరముందన్నారు. అదే సమయంలో సమైక్యవాదులెవరో, సమైక్యం ముసుగులో ద్రోహం చేస్తున్నవారి బండారమేమిటో కూడా బయటపడుతుందన్నారు. శుక్రవా రం మధ్యాహ్నం వారు అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్ కానందున వెంటనే సభను సమావేశపరచాలని కోరారు.

 సీమాంధ్రలో అగ్నిజ్వాలలు
స్పీకర్‌ను కలిసిన అనంతరం సహచర ఎమ్మెల్యేలతో కలసి భూమన మీడియాతో మాట్లాడారు. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో 79 రోజులుగా అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయన్నారు. ‘‘స్వాతంత్య్ర సంగ్రామం తరవాత అతిపెద్ద ఉద్యమం ఇదే. రాష్ట్రాన్ని విభజిస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఎడారవుతుంది. విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు తొలి నుంచీ పోరాడుతూనే ఉన్నారు. మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విభజనను వ్యతిరేకిస్తూ జైల్లోనూ, బయటా ఆమరణ దీక్ష చేశారు. ఈ నేపథ్యంలో విభజన విషయంలో ఎవరి బండారమేమిటో ప్రజలకు తెలియాలంటే తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాల్సిన అవసరముంది.

విభజనకు వ్యతిరేకంగా ఎగిసిపడుతున్న అగ్ని కీల లను ఆపడానికి సమైక్యవాద ముసుగులో నీళ్లు చల్లుతున్న ద్రోహుల బండారం కూడా సభ ద్వారానే బయటపడుతుంది. మేం సీఎంను కలసి ఇదే విషయం చెప్పి అసెంబ్లీని సమావేశపరచాలని కోరినా ఆయన అంగీకరించలేదు. అసెంబ్లీని సమావేశపరచడానికి డిసెంబర్  30 దాకా గడువుంది గనుక ఆలోపుసమావేశపరుస్తామని, విభజనపై కేంద్ర కేబినెట్ నోట్ వచ్చినప్పుడు అభిప్రాయ సేకరణ కూడా చేపడతామని బదులిచ్చారు. అసెంబ్లీ తీర్మానం చేసినా దానికి చట్టబద్ధత ఉండదు గనుక అసలు సభను సమావేశపరచాల్సిన అవసరమే లేదని కూడా కిరణ్ అన్నారు’’ అని తెలిపారు.

విభజన తొలి ద్రోహి సోనియానే
కాంగ్రెస్‌తో వైఎస్సార్సీపీ కుమ్మక్కైందంటూ వస్తున్న వార్తల్ని కొందరు విలేకరులు ప్రస్తావించగా భూమన తీవ్రంగా స్పం దించారు. రాష్ట్ర విభజన విషయంలో తొలి ద్రోహి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీయేనన్నారు. ‘‘మొదటి నుంచీ మేం ఇదే చెబుతూ పోరాడుతూనే ఉన్నాం కదా! సోనియా తరవాత... విభజనకు అనుకూల లేఖలిచ్చి, విభజన జరిగేదాకా నిద్ర కూడా పోకుండా, తీరా విభజన ప్రకటన వచ్చాక ఇప్పుడు హాయిగా నిద్ర పోతున్న చంద్రబాబు మరో ద్రోహి. 3వ అధికరణం ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని మేం చెప్పలేదు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగేలా, అందరి సమ్మతితో ఒక తండ్రిలా న్యాయం చేయాలని మాత్రమే చెప్పాం. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమంటే విభజించాలని కాదు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే న్యాయం జరుగుతుందనేది మా భావన. అంతే తప్ప ఏ ఒక్కరి అభిప్రాయమూ తెలుసుకోకుండా 3వ అధికరణాన్ని దుర్వినియోగం చేస్తూ, ఒక ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసే నిర్ణయం తీసుకోవాలని కాదు. ఇలాంటి నిర్ణయాన్ని మేం అంగీకరించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు.

గతంలో రాజీనామా చేసి, వాటిని ఆమోదించాలని స్పీకర్‌ను ఎందుకు కోరలేదని ప్రశ్నిం చగా, ‘అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని అడిగేందుకు వచ్చిన వాళ్లం రాజీనామాలను ఆమోదించాలని కోరతామా?’ అని బదులిచ్చారు. అసెంబ్లీని సమావేశపరిచి అందరి అభిప్రాయాలూ తీసుకున్నాక స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించుకుంటామని శోభా నాగిరెడ్డి చెప్పారు.

మరో ప్రజాప్రస్థానానికి ఏడాది పూర్తి

* ఇడుపులపాయలో 2012 అక్టోబర్ 18న మొదలైన పాదయాత్ర
* 2013 ఆగస్టు 4న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగింపు
* 14 జిల్లాల్లో 3,112 కిలోమీటర్ల సుదీర్ఘయాత్ర
* కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలపై దండయాత్ర
* అన్నకిచ్చిన మాటకోసం చరిత్ర సృష్టించిన షర్మిల
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తప్ప మరో రాజకీయ శక్తి ఎదగకూడదని ఆ రెండు పార్టీలు కుమ్మక్కయి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న రోజులు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లో ఉంటే తమ నాటకాలు సాగవని అక్రమంగా నిర్బంధించిన రోజులు... కష్టకాలంలో రాష్ట్ర ప్రజలకు తామున్నామంటూ భరోసా కల్పించడానికి జగన్‌మోహన్‌రెడ్డి తన సోదరి షర్మిలను దూతగా పంపించారు... ఆ రెండు పార్టీల కుట్రలను భగ్నం చేయడానికి బ్రహ్మాస్త్రంలా ప్రయోగించారు... మరో ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల సాహసోపేతమైన సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఏడాది పూర్తయింది. గత ఏడాది అక్టోబర్ 18 ఇడుపులపాయలోని తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులర్పించి బయలుదేరిన షర్మిల నిరాఘాటంగా 230 రోజుల్లో పాదయాత్ర పూర్తిచేశారు.
అశేష జనవాహిని మధ్య వైఎస్సార్‌జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభించి 2013 ఆగస్టు 4 వ తేదీనాటికి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 14 జిల్లాల్లో 3112 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వైఎస్సార్ జిల్లాతో మొదలుపెట్టి అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, గుంటూరు, కృష్ణా, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మరో ప్రజాప్రస్థానం యాత్ర సాగింది. ఈ 14 జిల్లాల్లో 116 అసెంబ్లీ నియోజకవర్గాలు, తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లు, 45 మున్సిపాలిటీలు, 195 మండలాల్లో ఏర్పాటు చేసిన అనేక బహిరంగ సభల్లో షర్మిల మాట్లాడారు.
మొత్తంగా 2,250 గ్రామాల నుంచి సాగిన ఈ సుదీర్ఘయాత్రలో ప్రజలు పడుతున్న కష్టనష్టాలెన్నింటినో ఆమె ప్రత్యక్షంగా చూడగలిగారు. 190కిపైగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి నేరుగా ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఇంతటి దారుణమైన ప్రభుత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని ప్రజలకు తెలియజెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు? ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారన్న విషయాన్ని ఆమె దాదాపు ప్రతి సభలోనూ ప్రజలకు విడమరిచారు.

రాష్ట్రంలో మూడో రాజకీయ శక్తి ఎదగకూడదన్న లక్ష్యంతో జగన్‌మోహన్‌రెడ్డిపై పన్నిన కుట్రలు, కుతంత్రాలను విజయవంతంగా ప్రజలకు వివరించారు. ప్రజాకంటక పాలన అందిస్తున్న కాంగ్రెస్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టినా తెలుగుదేశం పార్టీ మద్దతునిచ్చి ఆ ప్రభుత్వాన్ని కాపాడిన తీరును ఎండగట్టారు. అన్న మాటకు కట్టుబడి పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల సాహసాన్ని పార్టీ నేతలు గుర్తుచేసుకుని శుక్రవారం రోజున ఆమెకు అభినందనలు తెలిపారు.

జగన్ పిటిషన్‌పై విచారణ 23కు వాయిదా

Written By news on Friday, October 18, 2013 | 10/18/2013

జగన్ పిటిషన్‌పై విచారణ 23కు వాయిదా
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు, ఢిల్లీ వెళ్లేందుకు వీలుగా హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది.

ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రావాల్సి ఉన్నా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు సెలవులో ఉండడంతో.. విచారణ వాయిదాపడింది. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు వీలుగా మార్చి 31 వరకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ ఆడిటర్ విజయసాయిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ కూడా 23కు వాయిదా పడింది.

సీఎం ఛాంబర్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన ఫోటోలు

శాసనసభను తక్షణమే సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలంటూ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు.అనంతరం వినతి పత్రం సమర్పించారు.అసెంబ్లీని సమావేశ పరచటం కుదరదని చెప్పటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు చేతబట్టి సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారుఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను ...పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Ex Min Viswaroop joins YSRCP

Ummareddy hackles Naidu's comments on Jagan

సమైక్యవాదుల ఏకైక ఆశ జగన్

Seemandhr
Seemandhr
http://www.tupaki.com/news/view/Seemandhr/40530

'సమైక్య శంఖారావం' సభకు ఉత్తరాంధ్ర నుంచి 4 ప్రత్యేక రైళ్లు

విశాఖపట్నం : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ తో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న 'సమైక్య శంఖారావం' సభకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనం తరలిరానున్నారు. ఉత్తరాంధ్ర నుంచే ఇప్పటిదాకా నాలుగు ప్రత్యేక రైళ్లను సిద్దం చేసినట్టు వైఎస్ ఆర్ సీపీ నాయకుడు సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు.

ఉత్తరాంధ్ర వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం సమావేశమై సమైక్య శంఖారావం సభ ఏర్పాట్లను సమీక్షించారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వెళ్లనున్నట్టు రంగారావు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లడానికి రవాణా సదుపాయాలు కల్పించనున్నట్టు చెప్పారు. సమైక్య శంఖారావం సభకు రావడానికి మరిన్ని రైళ్లను ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విశ్వరూప్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విశ్వరూప్
హైదరాబాద్ : మాజీమంత్రి విశ్వరూప్ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ ....విశ్వరూప్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్వరూప్ ....మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విశ్వరూప్ మాట్లాడుతూ  సమైక్యాంధ్ర ఉద్యమంలో దూసుకు పోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తాను సుశిక్షితుడైన సైనికుడిలా పోరాడతానని చెప్పారు.

TDP supported us during no-trust motion: Congress leader Y Sivarami Reddy

Y Sivarami Reddy
Y Sivarami Reddy
Speaking in a discussion program on a TV channel, Congress senior leader and Government whip in the Council Y Sivarami Reddy had admitted that the Telugu Desam Party had indeed saved the Congress government during no-confidence motion.
Sivarami Reddy said TDP president Chandrababu Naidu colluded with the Congress party, and extending his support to the government during no-trust motion is part of the agreement. When TDP MLA Kottakota Dayakar Reddy claimed that TDP had never supported Congress party, Sivarami Reddy asked “is it not true that the Telugu Desam Party extended it support to the government during no-trust motion”.

http://hydfirst.com/tdp-supported-us-during-no-trust-motion-congress-leader-y-sivarami-reddy/

ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం


విస్తరించు & ప్లే క్లిక్ చేయండి
* సమైక్యాంధ్రప్రదేశ్ కోసం చివరిదాకా పోరాడుతాం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
* మొన్నటిదాకా సమైక్యమన్న కేంద్ర మంత్రులంతా ఇవాళ ప్యాకేజీలంటూ మాట్లాడుతున్నారు
* సోనియాగాంధీ చెప్పినట్లు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఆడుతున్నారు
* సమైక్యానికి అనుకూలంగా ఉన్నది వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం మాత్రమే
* ఇప్పటికైనా చంద్రబాబు, కిరణ్‌లు కలిసిరావాలి.. చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు
* ఇప్పటికీ కళ్లు తెరవకుంటే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఎడారే
* విభజన ముసాయిదా బిల్లు అసెంబ్లీకి రాకముందే సమైక్య తీర్మానం చేయాలి
* ఈ నెల 26న హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం సభ నిర్వహిస్తున్నాం
* ఈ వ్యవస్థలో నిజాయితీని తీసుకురావడానికి రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలిసిరావాలి
* సమైక్య రాష్ట్రం కోసం ఉద్యోగులు సహా అందరినీ ఈ సభకు ఆహ్వానిస్తున్నాం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదని, సమైక్యంగా ఉంచాలన్న గట్టి నినాదంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చడానికి అన్ని రకాల ప్రయత్నాలూ జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు శాసనసభను వెంటనే సమావేశపరిచేలా చూడాలని కోరుతూ గురువారం మరోసారి రాష్ట్ర గవర్నర్‌ను కలిసి విన్నవించిన అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి లోటస్‌పాండ్‌లోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

‘‘కనీసం ఇప్పటికైనా రాష్ట్ర అసెంబ్లీకి ముసాయిదా బిల్లు రాకముందే సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం చేయాలని మళ్లీ అడుగుతున్నాం. ఇవాళ కొందరు ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి విభజించాలని ఏకంగా నిరాహార దీక్ష చేస్తారు. ఆ నెపంతో ఆయన ఎంతమందిని కలిశారో, ఎవరిని కలిశారో నాకైతే తెలియదుకానీ.. రాష్ట్రాన్ని విభజించాలని నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత వెనువెంటనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇక్కడ ఉద్యోగ సంఘాల వారందరినీ ఒక్కొక్కరినీ పిలుచుకుని వారిని భయపెట్టి ఉద్యమబాట నుంచి తప్పుకొనేలా చేస్తున్నారు. అంతటితో సరిపోదన్నట్లుగా సమైక్యానికి కట్టుబడి ఉన్నామని మొన్నటిదాకా చెప్పిన కేంద్ర మంత్రులంతా ఇవాళ సమైక్యాన్ని పక్కనపెట్టి ప్యాకేజీలు కావాలన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ల తీరు చూస్తుంటే అసలు మనుషులేనా అని అనిపిస్తోంది’’ అంటూ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోనియా చెప్పినట్లు చేస్తున్నారు..
‘‘సోనియాగాంధీ గారేమో తన కొడుకును ప్రధానమంత్రిని చేయాలని చెప్పి, ఇక్కడ మా అందరి జీవితాలు, మా పిల్లలందరి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సోనియాగాంధీకి తగుదునమ్మా అన్నట్లుగా చంద్రబాబు అడ్డగోలుగా విభజన చేయడానికి మద్దతిస్తున్నారు. ఇక కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే సోనియా గీత గీస్తే ఒక్క అడుగు కూడా పక్కకువేయకుండా తు.చ. తప్పకుండా పాటిస్తూ మద్దతునిస్తున్నారు. ఇప్పటికైనా చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని వీరందరినీ హెచ్చరించారు. సమైక్యానికి అనుకూలంగా ఉన్నది వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం.. ఈ మూడు పార్టీలు మాత్రమే. చంద్రబాబు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని మూడు పార్టీల వైపునకు రమ్మని చెబుతున్నాం. మూడు పార్టీలు కాస్తా నాలుగు పార్టీలు కావాలి. నాలుగు తర్వాత అయిదు పార్టీలు కావాలి. అందరమూ ఒక్కటైతేనే ఇది సాధ్యపడుతుంది. విభజన ఆగుతుంది’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

‘‘చంద్రబాబు, కిరణ్‌కు ఒక్కటే చెప్పదల్చుకున్నా ఇద్దరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు. కనీసం ఇప్పటికైనా కళ్లు తెరవండి. కళ్లు తెరవకపోతే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా రాష్ట్రం ఎడారి అవుతుందన్న సంగతి మర్చిపోవద్దు. చదువుకున్న ప్రతి పేద పిల్లవాడు కూడా ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చినపుడు, ఆ హైదరాబాద్‌లో తనను పక్కనబెట్టినపుడు.. చంద్రబాబు, కిరణ్‌ను తిట్టుకునే పరిస్థితి వస్తుందని మర్చిపోవద్దు. ఇప్పటికైనా వీళ్లు కళ్లు తెరవాలి. అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలి. సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేయాలని వీరిద్దరినీ గట్టిగా డిమాండ్ చేస్తున్నా...’’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

సమైక్యమంటే మూడు ప్రాంతాలూ...
గతంలో కూడా గవర్నర్‌ను కలిసి అసెంబ్లీని సమావేశపర్చాలని వినతిపత్రం ఇచ్చామని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రికి కూడా ఇదే విషయమై లేఖల మీద లేఖలు రాశామన్నారు. ‘‘కేబినెట్ నోట్ రావడానికి ముందే రాష్ట్ర శాసనసభను సమావేశపరచి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కోరాం. కానీ మేం చేసిన వినతి అరణ్యరోదనగానే మిగిలి పోయింది. ఆ తరువాత కేంద్రం ఓ అడుగు ముందుకు వేసింది. అందుకే మళ్లీ చెబుతున్నా... ముసాయిదా బిల్లు అసెంబ్లీకి రాకముందే ఇప్పటికైనా సమైక్య తీర్మానం చేయాలి’’ అని ఆయన కోరారు.

ఈ నెల 26న హైదరాబాద్‌లో సభ జరుపుకోవడానికి పోలీసులు అనుమతినిచ్చారని, ఆ రోజున సమైక్య శంఖారావాన్ని పూరిస్తామని తెలిపారు. ‘‘సమైక్యం అంటే మళ్లీ మళ్లీ చెబుతున్నా.. సమైక్యం అంటే  అందులో తెలంగాణ ఉంటుంది.. కోస్తాంధ్ర ఉంటుంది.. రాయలసీమ ఉంటుంది. అన్ని ప్రాంతాలనూ సమైక్యంగా ఉంచాలనేదే నా అభిమతం. ఈ మూడు ప్రాంతాలకూ న్యాయం చేస్తానని స్పష్టంగా చెబుతున్నా.. సమైక్యం అంటే మూడు ప్రాంతాలనూ కలిపి ఉంచాలి. మూడు ప్రాంతాలకు న్యాయం జరిగేలా నేను ముందుంటానని చెప్పడానికే ఈ సమైక్య శంఖారావం నిర్వహిస్తున్నాం. ఇవాళ అందరితో కూడా నేను ఒకటే విన్నపం మళ్లీ మళ్లీ చేస్తున్నాను. రాజకీయాలను పక్కన పెట్టండి. ఈ వ్యవస్థలో నిజాయితీని తీసుకురండి. అందరూ ఒక్కటి కవాల్సిన అవసరాన్ని పక్కనబెడితే మాత్రం చరిత్రహీనులుగా మిగిలి పోయే పరిస్థితి వస్తుంది. అందుకే చంద్రబాబు, కిరణ్‌లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.. అయ్యా చరిత్రహీనులుగా మిగిలిపోకండి, రండి.. కలిసిరండి అని విజ్ఞప్తి చేస్తున్నా...’’ అని అన్నారు.

చివరిదాకా పోరాడుతాం..
సమైక్యాంధ్ర ఉద్యమం తగ్గిపోయిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా...‘‘మా ఖర్మ ఏంటంటే.. దిగ్విజయ్, సోనియాగాంధీ గారికి కుడి భుజమో.. ఎడమ భుజమో అర్థం కావడం లేదు కానీ ఆయన కుడి భుజం అయితే కిరణ్ ఆమెకు ఎడమ భుజం లాంటి వారు.. దిగ్విజయ్ ఉద్యమం తగ్గిపోయిందంటారు.. కిరణ్ దగ్గరుండి ఉద్యమబాట నుంచి ఒక్కొక్కరినీ తప్పించే కార్యక్రమం చేస్తారు.. విభజించండి అని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఏజెంట్‌గా ఏకంగా నిరాహారదీక్షలే చేస్తారు. నిజంగా ఇది మన ఖర్మ. అయినాగానీ నేనొక్కటైతే చెబుతాను. వీళ్లంతా మనుషులే! పైన దేవుడున్నాడు, కచ్చితంగా మేం మాత్రం ఉద్యమబాటను తీవ్రతరం చేస్తాం. చివరిదాకా పోరాటం గట్టిగా చేస్తాం’’ అని ఉద్ఘాటించారు.

కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘న్యాయంగా మీరే గుండెల మీద చెయ్యేసుకుని అడగండి, ఎవరు నిజాయితీగా ఉన్నారో.. ఎవరు నిజాయితీగా లేరో? ఎవరు 16 నెలలు జైల్లో ఉన్నారు? బయట ఉండి రాజ్యసభలో ఎఫ్‌డీఐ ఓటింగ్ దగ్గర నుంచి ఏకంగా అసెంబ్లీలో విప్ జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడిందెవరో? మీ గుండెల మీద చెయ్యేసుకుని అడగండి. నేను లోపల ఉన్నా నిజాయితీగా రాజకీయాలు చేశాను. బయట ఉండి చంద్రబాబు చేసిందేమిటి కాంగ్రెస్‌ను కాపాడ్డం తప్ప’’ అని అన్నారు. సమైక్య శంఖారావం సభకు ఉద్యోగ సంఘాలను కూడా ఆహ్వానిస్తారా అని ప్రశ్నించినపుడు ‘‘ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నా.. ప్రతి ఒక్కరినీ మీడియా ముఖంగా ఆహ్వానిస్తున్నా.. సమైక్యమంటే అందరినీ కలవమనే చెబుతున్నా’’ అని అన్నారు.

విలేకరుల సమావేశంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు, దేశాయి తిప్పారెడ్డి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎం.పి వి.బాలశౌరి, ఇతర నేతలు బి.జనక్‌ప్రసాద్, వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు.

అందరం రాజీనామాకు కట్టుబడి ఉన్నాం..
లోక్‌సభ సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాతోపాటు తమ పార్టీ ఎంపీలందరూ చేసిన రాజీనామాలను కూడా ఆమోదింప జేసుకుంటారని, ఆ మేరకు స్పీకర్ మీరాకుమార్‌పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

‘‘నేనొక్కడినే కాదు, మా రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, మా పార్టీలో ఎవరైతే ఉన్నారో వారు, మా పార్టీలో చేరబోతున్న వారు తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుంటారు. నేను స్పీకర్‌కు మళ్లీ ఒక లేఖను రాశాను. మీకు కూడా విడుదల చేస్తాను. కోర్టు ఆంక్షల వల్ల నేను ఢిల్లీకి రాలేకపోయినా, దయచేసి నా రాజీనామాను ఆమోదించండి అని రాశాను. రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి ఇద్దరూ శుక్రవారం ఢిల్లీకి నా లేఖ తీసుకుని వెళుతున్నారు. మా రాజీనామాలు కచ్చితంగా ఆమోదించండి అని స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తూనే ఉంటాం’’ అని ఆయన వివరించారు.

గవర్నర్‌తో భేటీ... ఫిరోజ్ ఖాన్ కు నివాళి ఫోటోలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం బిజీ బిజీగా గడిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు శాసనసభను వెంటనే సమావేశపరిచేలా చూడాలని కోరుతూ మరోసారి రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఫిరోజ్‌ఖాన్ కుటుంబీకులను పరామర్శించారు.


26న ఎల్బీ స్టేడియంలో సమైక్య శంఖారావం

* పోలీసుల సూచన మేరకు తేదీని మార్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్
Photo: 26న హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం సభ 
YS #Jagan to hold #Samaikya Shankaravam MEETING IN #HYDERABAD on 26th, October

అక్టోబర్ 26న సమైక్య శంఖారావం సభను  నిర్వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సమైక్య రాష్ట్రం డిమాండ్‌తో మొదట ఈ నెల 19నే హైదరాబాద్‌లో సభ నిర్వహించాలనుకున్నా.. ప్రభుత్వం అనుమతించలేదు. దాంతో వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించింది. సభ నిర్వహణకు బుధవారం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, 19వ తేదీ మరో రెండు రోజులే ఉండటంతో సమైక్య శంఖారావం సభను ఈ నెల 26వ తేదీకి పార్టీ వాయిదా వేసింది. ఆ మేరకు సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కె.శివకుమార్ బుధవారం నగర డీసీపీ కమలాసన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
సాక్షి, హైదరాబాద్: సమైక్య శంఖారావం సభను అక్టోబరు 28వ తేదీకి బదులుగా అక్టోబరు 26వ తేదీన జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సమైక్య రాష్ట్రం డిమాండ్‌తో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 26న సమైక్య శంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం ప్రకటించారు.

మొదట సభను 28వ తేదీన జరపాలని నిర్ణయించి పోలీసు అనుమతి కోరుతూ వైఎస్సార్సీపీ దరఖాస్తు కూడా చేసింది. అయితే, 28వ తేదీ సోమవారం అవుతుందని, ఆ రోజు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 26న కానీ, 27న కానీ జరుపుకుంటే బావుంటుందని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. 27వ తేదీ ఆదివారం రోజు ఎల్బీ స్టేడియాన్ని వేరొకరు ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నారు. దాంతో 26వ తేదీ శనివారం సభ నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.

నిజానికి ఈ నెల 19వ తేదీననే సభను నిర్వహించాలనుకున్నా పోలీసులు అనుమతించలేదు. వైఎస్సార్సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు సభకు షరతులతో కూడిన అనుమతిని బుధవారం మంజూరు చేసింది. అయితే, సభ నిర్వహణకు రెండు రోజులే సమయం ఉండటంతో సభను వాయిదా వేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Jagan consoles bereaved family of Firoz Khan

Written By news on Thursday, October 17, 2013 | 10/17/2013

YSR CP MLAs dharna before CM's house tomorrow, Samaikya Sankaaravam on 26: Jagan

కిరణ్, చంద్రబాబు కళ్లు తెరవాలి: జగన్

కిరణ్, చంద్రబాబు కళ్లు తెరవాలి: జగన్
హైదరాబాద్: సమైక్య రాష్ట్రం విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కళ్లు తెరవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని విజ్ఞప్తి చేశారు. తన నివాసం లోటస్ పాండ్ లో ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను అడ్డుకోకపోతే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు రాష్ట్రం ఎడారి అవుతుందని హెచ్చరించారు. చదువుకున్నవారు హైదరాబాద్ వస్తే ప్రతి పిల్లవాడు చంద్రబాబును, కిరణ్ కుమార్ రెడ్డిని తిట్టేపరిస్థితి వస్తుందన్నారు.  కేబినెట్ నోట్ తయారు కాకముందే శాసనసభను సమావేశపరిచి సమైక్యరాష్ట్రం తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాలని కోరారు. ఈరోజు తాము మరోసారి గవర్నర్ నరసింహన్ ను కలిసినట్లు చెప్పారు. శాసనసభను సమావేశపరచమని కోరినట్లు తెలిపారు.

చంద్రబాబు ఢిల్లీ వెళతారు. విభజించండి అని నిరాహార దీక్ష చేస్తారు. ఈ పేరుతో ఆయన అక్కడ ఎంతమందిని కలిశారో తెలియదన్నారు. అదే సమయంలో ఇక్క డ కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలను ఒక్కొక్కరిని కలుస్తారు. వారిని బెదిరించి సమ్మె విరమించే ప్రయత్నాలు చేస్తారు. మొన్నటిదాకా సమైక్యత అన్న కేంద్ర మంత్రులు, ఎంపిలు ఇప్పుడు ప్యాకేజీలు అడిగే ప్రయత్నంలో ఉన్నారన్నారు. ఉద్యమాన్ని వీరు ఎందుకు  నీరు గారుస్తున్నారో అర్ధం కావడంలేదంటున్నారు.

యూపిఏ చైర్ పర్స్ న్ సోనియా గాంధీ తనకు కుమారుడిని ప్రధానిని చేయడానికి రాష్ట్రాన్ని విభజించడానికి సిద్దపడ్డారని విమర్శించారు. ఆమె తమ పిల్లల జీవితాతో ఆడుకుంటున్నారన్నారు.  చంద్రబాబు అడ్డగోలుగా  ఆమెకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు.  సోనియాకు కావలసిన విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సోనియా ఎంత చెబితే అంతే. ఆమె చెప్పిన విధంగా చేస్తారని చెప్పారు. కిరణ్, చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని కోరారు. కలిసిరండని విజ్ఞప్తి చేశారు.

సమైక్యతకు అండగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఎం, ఎంఐఎం  మూడు పార్టీలని తెలిపారు. ఇప్పటికై చంద్రబాబు సిగ్గుతెచ్చుకొని ఈ మూడు పార్టీలతో కలవాలని పిలుపు ఇచ్చారు. ఆ మూడు నాలుగు, అయిదు పార్టీలు  అవ్వాలని  అన్నారు.

ఈ నెల 26న సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఈ సభకు అందరూ తరలిరావాలని పిలుపు ఇచ్చారు.  రేపు సిఎం ఇంటి వద్ద తమ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తారని చెప్పారు. స్పీకర్ ను కలుస్తారన్నారు.  సమైక్యత అంటే తెలంగాణ, కోస్తా ఆంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాలకు న్యాయం చేయని అర్ధం అన్నారు.

తమ రాజీనామాలు, తమ పార్టీలో చేరినవారి రాజీనామాలు  ఆమోదింపజేసుకుంటామని చెప్పారు. తాను ఢిల్లీ వెళ్లడానికి అడ్డంకులు ఉన్నందున  రాజమోహన రెడ్డి ద్వారా మరో లేఖ పంపి తన రాజీనామాను ఆమోదింపజేసుకుంటానని చెప్పారు.  ఎంపి లగడపాటి రాజగోపాల్ ఏదో అన్నారని తాను మాట్లాడటం మొదలు పెడితే బాగుండదన్నారు.

ఫిరోజ్ ఖాన్ కు నివాళులు అర్పించిన జగన్



హైదరాబాద్ : జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ముష్కర మూకలు జరిపిన కాల్పుల్లో అమరుడైన ఫిరోజ్‌ఖాన్ భౌతికకాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఫిరోజ్ ఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి.... సంతాపం తెలిపారు. నగర మేయర్ మాజిద్ హుస్సేన్ కూడా ఫిరోజ్ ఖాన్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. కాగా ఫిరోజ్‌ భౌతికకాయాన్ని సందర్శించేందుకు వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు. అనంతరం నవాబ్ సాహెబ్ కుంట స్మశాన వాటికలో అధికార లాంఛనాలతో ఫిరోజ్ ఖాన్ అంత్యక్రియలు జరిగాయి.



అంతకు ముందు మహ్మద్‌ ఫిరోజ్‌ఖాన్‌ భౌతికకాయాన్ని తోటి ఆర్మీ జవాన్లు ప్రత్యేక విమానం ద్వారా శంషాబాద్‌ విమానాశ్రయానికి, అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో పాతబస్తీకి తీసుకువచ్చారు. ఫలక్‌నుమా నవాబ్‌సాహెబ్ కుంటలో ఫిరోజ్‌ఖాన్‌ కుటుంబీకులకు పార్థీవ దేహాన్ని అప్పగించారు. కన్నీళ్ళ పర్యంతమైన ఫిరోజ్‌ఖాన్ తల్లి అక్తర్ బేగం, భార్య నస్రీన్ బేగం, ముగ్గురు పిల్లలను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.

తక్షణమే అసెంబ్లీని సమావేశపరచండి: జగన్

తక్షణమే అసెంబ్లీని సమావేశపరచండి: జగన్
హైదరాబాద్ : కేంద్రం ముసాయిదా బిల్లును అసెంబ్లీకి రాకముందే... విభజనకు వ్యతిరేకంగా  రాష్ట్ర అసెంబ్లీ సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరోసారి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం గవర్నర్‌ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేసింది. రాష్ట్ర అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి సమైక్య తీర్మానం చేసేలా చూడాలని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఈరోజు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.

 రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిస్థితుల్ని, అసెంబ్లీ సమావేశపరచాల్సిన ఆవశ్యతకను గవర్నర్‌కు ఈ సందర్భంగా జగన్‌ వివరించారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపేలా చూడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.గత నెలాఖరున కూడా వైఎస్‌ జగన్‌ ... గవర్నర్‌ను కలిశారు. అసెంబ్లీని సమావేశపరిచేలా చూడాలని వినతి పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. అడ్డుగోలు విభజన పట్ల పార్టీలు తమ వైఖరిని, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాన్ని చెప్పుకునేలా అవకాశం ఇవ్వాలని కోరారు
. ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా కేబినెట్‌ నోట్‌ ఆమోదం పొందడమే కాక...ప్రస్తుతం విభజన ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. ఈ సమయంలో అసెంబ్లీని సమావేశపరచడానికి అత్యున్నతులైన గవర్నర్‌ జోక్యాన్ని మరోసారి కోరుతున్నామన్నారు. రాష్ట్ర విభజన పట్ల అసెంబ్లీ నిర్ణయం ఏంటో తప్పనిసరిగా వెల్లడి కావాల్సిందేనన్నారు.

గవర్నర్ ను కలిసిన వైఎస్ జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాజభవన్ లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిశారు. జగన్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కూడా గవర్నర్ ను కలిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు శాసనసభను వెంటనే సమావేశపరచాలని జగన్ ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
కాగా  రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర కేబినెట్ నోట్‌కు ఆమోదముద్ర పడకముందే రాష్ట్ర అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి సమైక్యం కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఇదివరకు గవర్నర్‌కు ఒక వినతిపత్రం అందజేయడం తెలిసిందే. అయితే తెలంగాణ అంశంపై అసెంబ్లీ తీర్మానం కోరడం లేదన్న విషయం రూఢి అయిపోయి కేవలం అభిప్రాయానికి మాత్రమే బిల్లును పంపుతారని తేలిపోయిన నేపథ్యంలో మరోసారి జగన్ ....గవర్నర్ తో భేటీ అయ్యారు.

హైదరాబాద్ బయల్దేరిన విజయమ్మ

హైదరాబాద్ బయల్దేరిన విజయమ్మ
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైదరాబాద్ బయల్దేరారు.శ్రీకాకుళం జిల్లాలో నిన్న తుపాను బాధితుల్ని పరామర్శించిన  ఆమె గురువారం ఉదయం విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. పై-లీన్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి, కవిటి, సోంపేట మండలాల్లోని పలు మారుమూల గ్రామాల్లో విజయమ్మ నిన్న విస్తృతంగా పర్యటించారు.

ఆమె అడుగిడిన ప్రతిచోటా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ కష్టాలు చెప్పుకొన్నారు. రైతుల కష్ట నష్టాలు తెలుసుకుంటూ...బాధిత రైతులను పరామర్శిస్తూ... వలలు, బోట్లు, ఆస్తులు కోల్పోయిన మత్స్యకారులకు భరోసానిస్తూ...  రైతులకు అండగా ఉంటామని విజయమ్మ హామీ ఇచ్చారు.నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెబుతూ ఆమె ముందుకు సాగారు.

టీడీపీ పార్టీ కార్యాలయ భూమిలో ప్రైవేటు వ్యాపారం

=పార్టీ కార్యాలయ భూమిలో ప్రైవేటు వ్యాపారం
=ట్రావెల్స్ సంస్థకు అద్దెకు..
=అసాంఘిక కార్యక్రమాలకు నెలవు!
= హైదరాబాద్  జిల్లా టీడీపీ శాఖ నిర్వాకం

 
సాక్షి, సిటీబ్యూరో:  హైదరాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ శాఖ ‘సైడ్ బిజినెస్’ చేస్తోంది. పార్టీ కార్యాలయం నిమిత్తం ప్రభుత్వం నుంచి కారుచౌకగా భూమిని లీజుకు పొంది.. ఆ స్థలంలో కొంత భాగాన్ని మరో సంస్థ (థర్డ్‌పార్టీ)కి సబ్‌లీజుకిచ్చి వ్యాపారం నిర్వహిస్తోంది. దీన్ని నివారించాల్సింది పోయి పార్టీ రాష్ట్ర కార్యాలయ నేతలు సైతం పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. దీంతో జిల్లా నేతలు జంకూగొంకూ లేకుండా దందా కొనసాగిస్తున్నారు. పార్టీ కార్యాలయం కంటే ప్రైవేటు సంస్థ స్వాధీన స్థలమే ఎక్కువగా ఉండటంతో పాటు అందులో అడపాదడపా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఇదిలా ఉండగా, కారుచౌకగా పొందిన లీజు భూమికి రెండేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో సంబంధిత హిమాయత్‌నగర్ మండల రెవెన్యూ అధికారులు ఇటీవల నోటీసు జారీ చేశారు.
 
ఇదీ గ‘లీజు’ వ్యవహారం..

నగరం నడిబొడ్డున ఎంతో మార్కెట్ డిమాండ్ ఉన్న దోమలగూడ ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో 3000 చదరపు గజాల స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసమని ఏడాదికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వం నుంచి 30 ఏళ్లపాటు దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నారు. 2004లో కుదిరిన లీజు ఒప్పందం మేరకు, ప్రతి ఐదేళ్లకోసారి లీజు అద్దె పది శాతం పెంచాలి. ఆ లెక్కన ప్రస్తుతం ఏడాదికి రూ. లక్షా పదివేలు చొప్పున చెల్లించాల్సి ఉంది. సువిశాల విస్తీర్ణంలోని భూమిలో కొంత భాగం మేర మాత్రం పార్టీ కార్యాలయం, సభా కార్యక్రమాల కోసం మరో రేకుల షెడ్డు నిర్మించారు.

మొత్తం స్థలంలో దాదాపు 75 శాతం మేర ఖాళీగా ఉండటంతో దాన్ని ‘గణేశ్‌ట్రావెల్స్’ సంస్థకు వాహనాలు నిలుపుకునేందుకు (పార్కింగ్‌కు) అద్దెకిచ్చారు. అందుకు నెలకు దాదాపు రూ. 30 వేల మేరకు అద్దె వసూలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అంటే ఏటా అద్దె రూపేణా రూ. 3.60 లక్షలు పొందుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన లీజు అద్దె రూ. 1.10 లక్షలు పోను రూ. 2.50 లక్షలు ‘దేశం’ నేతలు వెనకేసుకుంటున్నారు.

ఈ ఆదాయం నుంచే కార్యాలయ నిర్వహణ ఖర్చులు వెళ్లదీస్తున్నారని సమాచారం. గతంలో జిల్లా కార్యాలయ నిర్వహణతోపాటు సిబ్బంది వేతనాలు, తదితర ఖర్చులు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి అందేవి. ప్రస్తుతం నిర్వహణ ఖర్చులు తగ్గినందున కాబోలు రాష్ట్ర కార్యాలయం సైతం ఈ ‘దందా’ను నివారించే పనిచేయలేదని తెలుస్తోంది. తొలుత ఈ అంశం దష్టికి వచ్చినప్పుడు ట్రావెల్స్ యజమాని పార్టీ మద్దతుదారుడని, కొద్ది రోజుల కోసం తాత్కాలికంగా వాహనాలు నిలుపుకునేందుకు అనుమతించామని తెలిపినట్లు సమాచారం.

అనంతరం అక్కడి నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో బహిరంగంగానే కార్యాలయ స్థలాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ పరం చేశారు. ట్రావెల్స్ కోసం వచ్చే,పోయే వారు పార్టీ కార్యాలయ సిబ్బంది లేని సమయంలో పేకాట వంటి కార్యక్రమాలు సాగిస్తుం డటం తెలిసి.. గత వారం పోలీసులు పట్టుకునేందుకు రాగా, పేకాటరాయుళ్లు పారిపోయినట్లు సమాచారం.

పార్టీ కార్యాలయ స్థలాన్ని ప్రైవేటుకు లీజుకివ్వడంతో ఇలాంటి అప్రదిష్ట రావడమే కాక పార్టీ కార్యక్రమాలు జరిగినప్పుడు నాయకులు, కార్యకర్తలు వాహనాలు నిలుపుకునేందుకు స్థలం లేక బయట రహదారిపైనే వాహనాలు నిలుపుకొంటున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని నాయకుడొకరు వాపోయారు. లీజు భూమిలో ప్రైవేటు ట్రావెల్స్ పార్కింగ్ గురించి ఇటీవలే తమ దృష్టికీ వచ్చిందని, విచారణ జరిపాక ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు తీసుకుంటామని  రెవెన్యూ అధికారులు చెప్పారు.
 http://www.sakshi.com/news/hyderabad/lease-land-country-danda-73652

నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం గురువారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలవనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం గురువారం మధ్యాహ్నం 12.45 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలవనున్నట్టు పార్టీ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసింది.

రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర కేబినెట్ నోట్‌కు ఆమోదముద్ర పడకముందే రాష్ట్ర అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి సమైక్యంకోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఇదివరకు గవర్నర్‌కు ఒక వినతిపత్రం అందజేయడం తెలిసిందే. అయితే తెలంగాణ అంశంపై అసెంబ్లీ తీర్మానం కోరడం లేదన్న విషయం రూఢి అయిపోయి కేవలం అభిప్రాయానికి మాత్రమే బిల్లును పంపుతారని తేలిపోయిన నేపథ్యంలో.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయడానికిగాను ఇప్పటికైనా శాసనసభను వెంటనే సమావేశపరచాలని గవర్నర్‌ను కోరనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

అసలు ప్రభుత్వమనేది ఉందా ?

అసలు ప్రభుత్వమనేది ఉందా ? : విజయమ్మ
‘‘తుపాను సృష్టించిన విలయానికి వేలాది మంది అభాగ్యులుగా మిగిలారు. రైతులు పూర్తిగా నష్టపోయారు. కొబ్బరి తోటలు నేలమట్టమయ్యాయి. జీడి రైతులూ తీవ్రంగా దెబ్బతిన్నారు. వరి పొలాలూ నీట మునిగాయి. మత్య్సకారుల పరిస్థితి దయనీయంగా మారింది. పడవలు, వలలు దెబ్బతిని ఉపాధి పూర్తిగా కోల్పోయారు. నాలుగు రోజులుగా అల్లాడుతున్నారు. అయినా ఇప్పటివరకూ ప్రభుత్వం స్పందించలేదు. ఇంతవరకు ముఖ్యమంత్రి కనీసం ఏరియల్ సర్వే అయినా చేయలేదు. పరిస్థితి ఏమిటో ఎలా ఉందో కూడా తెలియని దుస్థితిలో ప్రభుత్వం ఉంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘అసలు ప్రభుత్వం అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోంది’’ అంటూ ధ్వజమెత్తారు.

 తుపాను తాకిడికి దెబ్బతిన్న రైతులు, మత్య్సకారులకు తక్షణ సాయం అందించి ఆదుకోవాలని.. దెబ్బతిన్న పంటలకు పూర్తిస్థాయిలో పరిహారం అందించాలని.. వారికి ఇప్పటివరకూ ఇచ్చిన అన్ని రకాల రుణాలనూ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని విజయమ్మ డిమాండ్ చేశారు. శనివారం రాత్రి విరుచుకుపడిన పై-లీన్ పెను తుపానుతో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలోని తుపాను బాధిత ప్రాంతాల్లో విజయమ్మ బుధవారం విస్తృతంగా పర్యటించారు. కంచిలి, కవిటి, సోంపేట మండలాల్లోని పలు గ్రామాలు, మారుమూల పల్లెలను సైతం ఆమె సందర్శించారు. ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న తోటలు, పొలాలను స్వయంగా పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందటం లేదన్న బాధితులకు తాము అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. వారి తరఫున తమ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని హామీ ఇచ్చారు.

 ఈ సందర్భంగా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం జగతి గ్రామంలో విజయమ్మ విలేకరులతో మాట్లాడారు. ‘‘తుపాను వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దాన్ని తక్షణం చెల్లించాలి.  కొబ్బరి రైతులకు పడిపోయిన చెట్లకు మాత్రమే కాకుండా.. ఎకరా యూనిట్‌గా తీసుకుని పరిహారం ఇవ్వాలి. తుపాను కారణంగా దెబ్బతిన్న రైతులకు కేంద్రం రుణమాఫీ చేయాలి. వరి పొలాలు నీటితో నిండిపోవటంతో నాట్లు పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. అందువల్ల పంట నష్టపరిహారాన్ని వరికి కూడా వర్తింపజేయాలి. మత్స్యకారులకు ఈ రోజుకు కూడా కనీస సాయం అందలేదు. వెంటనే వారి జీవనభృతికి కావాల్సిన బియ్యం, ఇతర సరుకులు ప్రభుత్వం అందించాలి. వరదల్లో వలలు, బోట్లు పూర్తిస్థాయిలో కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి. తుపాను బాధితులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. తుపాను ప్రభావిత గ్రామాలు ఇంకా అంధకారంలో ఉన్నాయి.

  వెంటనే కరెంటు సరఫరా పునరుద్ధరించాలి. అలాగే తాగునీరు కూడా సరఫరా చేయాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు. తుపాను బాధితుల సాయం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర గవర్నర్‌ను, రాష్ట్రపతిని కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారని విజయమ్మ చెప్పారు. విజయమ్మ వెంట వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, మేకతోటి సుచరిత, పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు, సీజీసీ సభ్యులు కణితి విశ్వనాథం, పాలవలస రాజశేఖరం, ఎం.వి.కృష్ణారావు, సమన్వయకర్తలు పిరియా సాయిరాజ్, కలమట వెంకటరమణ, కిల్లి రామమోహన్‌రావు, బొడ్డేపల్లి మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌రావు, పి.ఎం.జె.బాబు, విశ్వరాయ కళావతి, వై.వి.సూర్యనారాయణ, వరుదు క ళ్యాణి, గొర్లె కిరణ్, వజ్జ బాబూరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతు కిరణ్‌కుమార్, మహిళా విభాగం కన్వీనర్ బల్లాడ హేమమాలినీరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొగ్గు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు

28న సమైక్యశంఖారావం సభ

సమైక్య శంఖారావం సభను అక్టోబర్ 28న నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సమైక్య రాష్ట్రం డిమాండ్‌తో మొదట ఈ నెల 19నే హైదరాబాద్‌లో సభ నిర్వహించాలనుకున్నా.. ప్రభుత్వం అనుమతించలేదు. దాంతో వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించింది. సభ నిర్వహణకు బుధవారం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, 19వ తేదీ మరో రెండు రోజులే ఉండటంతో సమైక్య శంఖారావం సభను ఈ నెల 28వ తేదీకి పార్టీ వాయిదా వేసింది. ఆ మేరకు సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కె.శివకుమార్ బుధవారం నగర డీసీపీ కమలాసన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

 కోర్టు తీర్పు సంతోషకరం
 సమైక్య శంఖారావం సభకు హైకోర్టు అనుమతినివ్వడాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి స్వాగతించారు. న్యాయం గెలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. హింసించి ఆనందించే స్వభావం ఉన్న ప్రభుత్వ పర్యవేక్షణలో పోలీసులు వ్యవహరిస్తుండడం దురదృష్టకరమని మైసూరా వ్యాఖ్యానించారు.

తాము తలపెట్టిన సభ ఎవరి మనోభావాలను గాయపరచడానికో లేదా ప్రజల మధ్య విద్వేషాలను రగల్చడానికో కాదని ఆయన స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలోనే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతాయనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపడమే తమ సభ ముఖ్య ఉద్దేశమన్నారు. సమైక్యంగా ఉండటం మన రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా క్షేమమని చెప్పారు.

ఫ్లోరిడాలో వైఎస్ జగన్‌కు మద్దతుగా సమావేశం

Written By news on Wednesday, October 16, 2013 | 10/16/2013

ఫ్లోరిడాలో వైఎస్ జగన్‌కు మద్దతుగా సమావేశం
ఫ్లోరిడా :
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న పోరాటానికి మద్దతుగా అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాసాంధ్రులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ జగన్ చేసిన దీక్షను కొనియాడారు. విభజనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చేస్తోన్న కృషి, పోరాట పటిమను పలువురు ఎన్నారైలు ప్రశంసించారు. 

http://www.sakshi.com/news/diaspora/meeting-at-florida-in-support-of-ys-jagan-mohan-reddy-73511?pfrom=home-latest-story

Jagan to meet Governor tomorrow

Samaikya sankhaaravaam - janam voice

ఏలూరు , నర్సాపురం పార్లమెంట్ పరిశీలకుల నియామకం

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడిగా తోట చంద్రశేఖర్ ,నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా కనుమూరి రఘురామ కృష్ణం రాజు నియామకం 

తోట చంద్రశేఖర్

వైఎస్సార్‌సీపీలో చేరిన తోట చంద్రశేఖర్కనుమూరి రఘురామ కృష్ణంరాజు 

Popular Posts

Topics :