27 October 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రైలు ప్రమాద ఘటన జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టాలని జగన్ పిలుపు

Written By news on Saturday, November 2, 2013 | 11/02/2013

సహాయక చర్యలు చేపట్టాలని జగన్ పిలుపు
హైదరాబాద్: విజయనగరం జిల్లా గొట్లాంలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ఈ ప్రమాదంలో ఎక్కువ మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ఆదుకోవాలని పిలుపు ఇచ్చారు. క్షతగాత్రులకు రక్తం కావలసి ఉంటుందని, యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.


విజ‌య‌న‌గ‌రం: గత రెండు రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు దుర్ఘటన మరవకముందే  మరో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలోని గొట్లాం స‌మీపంలో  శనివారం దీపావ‌ళి పండుగ‌పూట పెనువిషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో రైలు కింద‌ప‌డి 15 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు.  సిగ్నల్ లేకపోవడంతో బొకారో రైలు అక్కడే ఆగిపోయింది. అప్పుడే బొకారొ ఎక్స్ ప్రెస్ -1, ఎస్‌-2 బోగీల్లో పొగ‌లు, మంటలు చెలరేగాయంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు భయపడి రైలులో నుంచి ఒక్కసారిగా పక్క ట్రాకుపై దూకారు. ప్ర‌య‌ణికులంతా చైన్‌లాగి హ‌డావుడిగా దూక‌డంతో, అదే స‌మ‌యంలో పక్క ట్రాక్ పైకి దూసుకొచ్చిన విజయవాడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో  ఇప్పటివరకూ 15 మంది మృతిచెందిన‌ట్టు స‌మాచారం. పలువురు గాయపడ్డారు.
ఈ ఘ‌ట‌న రాత్రి 7.15 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. రైలు ఒక్క‌సారిగా ఢీకొట్ట‌డంతో ట్రాక్‌పై మృత‌దేహాలన్ని చిధ్ర‌మైయ్యాయి. తెగిప‌డిన అవ‌య‌వాల‌తో ట్రాక్ భ‌యంక‌రంగా క‌నిపిస్తోంది. ఈ ఘోరప్రమాదంలో ఎంతమంది మృతిచెందారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. మృతుల్లో చిన్నారులు, మ‌హిళ‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. మృతుల్లో బెంగాల్ వాసులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉందని చెబుతున్నారు.

కిరణ్‌ది ఆచరణలో విభజన.. మాటల్లో సమైక్యం: గ‌ట్టు

కిరణ్‌ది ఆచరణలో విభజన.. మాటల్లో సమైక్యం: గ‌ట్టు
హైద‌రాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిది శ‌ల్యుడు సార‌థ్యమంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి గ‌ట్టు రామ‌చంద్ర‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం రాష్ట్ర‌విభ‌జ‌న చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేప‌థ్యంలో సీఎం కిర‌ణ్ ఆచ‌ర‌ణ‌లో విభ‌జ‌న..  మాట‌ల్లో మాత్రం స‌మైక్యం అంటున్నార‌ని గట్టు దుయ్య‌బ‌ట్టారు.  సమైక్యాంధ్ర ఉద్యమానికి చాంఫియన్ గా పోజులకొట్టే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. సోనియాగాంధీ ఎజెండాను అమలు చేస్తున్నారన్నారు. ప్రజల హక్కులను కిరణ్ సర్కార్ కాలరాస్తోంది అని ఆయన విమర్శించారు.
నల్గొండ జిల్లా మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాష్ట్రానికి మంత్రులా? జిల్లాకు మంత్రులా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. మంత్రి జానారెడ్డి దొంగ తెలంగాణ‌వాది అంటూ గ‌ట్టు రామచంద్రరావు విమర్శించారు.

వైఎస్ జగన్ పేరు వింటేనే కాంగ్రెస్, టీడీపీలు వణుకుతున్నాయి

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు వణుకుతున్నాయని ఆ పార్టీ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని ఆయన ఆరోపించారు. 
 
భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన నల్గొండ, ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లిన తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అడ్డుకోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తుంటే మాత్రం పూలతో స్వాగతం చెబుతున్నారని భూమన ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి అనడానికి ఇంత కంటే మంచి ఉదహారణ ఏం కావాలని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని విడదీయడానికి ఆయన చెప్పిన పద్ధతులనే కేంద్రం పాటిస్తోంది

చంద్రబాబు చెప్పినట్లే విభజన
రాష్ట్రాన్ని విడదీయడానికి ఆయన చెప్పిన పద్ధతులనే కేంద్రం పాటిస్తోంది
వైఎస్సార్ సీపీ నాయకుడు కొణతాల ధ్వజం
 అఖిలపక్షం పెట్టాలని అక్టోబర్ 7న చంద్రబాబు అడిగారు.. వీరు పెట్టారు
సమన్యాయమంటూ ఆయన ఢిల్లీలో దీక్షకు కూర్చోగానే జీవోఎం ఏర్పాటు చేశారు
ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో టీడీపీ అధినేత మాట్లాడాకే విభజన నిర్ణయం
రాష్ట్రంలోనే ఉన్న తెలంగాణకు విజయమ్మను ఎందుకు వెళ్లనీయలేదో సీఎం జవాబు చెప్పాలి
వరద బాధిత రైతులకు కేంద్ర సాయం కోసం జగన్ ప్రధాని, రాష్ట్రపతిల అపాయింట్‌మెంట్ కోరారు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పిన పద్ధతిలోనే కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ధ్వజమెత్తారు. కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం తమ పార్టీని ఇరుకున పెట్టేందుకే అంటూ బాబు మాట్లాడుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ‘‘బాబు మర్చిపోయారేమోగానీ, అక్టోబర్  ఏడో తేదీన ఆయన ఢిల్లీలో దీక్షకు కూర్చుంటూ స్పష్టంగా ఆఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు.
 
 ఆయన అఖిలపక్ష సమావేశం అన్నాకే ఈ రోజు సమావేశం పెట్టారు. సమన్యాయం చేయాలని ఆయన ఢిల్లీలో దీక్షకు కూర్చున్నాకే విభజన తరువాత ఏర్పడబోయే సమస్యల పరిష్కారం కోసం కేంద్రం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు 7వ తేదీన ఢిల్లీలో దీక్షకు కూర్చుంటే 8వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది. ఆయన ఢిల్లీ వెళ్లి అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడాకే రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిపోయింది. ఆయన మళ్లీ ఢిల్లీ వెళ్లి వచ్చాకే కేంద్ర మంత్రివర్గం రాష్ట్రవిభజన నిర్ణయానికి ఆమోదం తెలిపింది’’ అని కొణతాల వివరించారు.
 
 శుక్ర వారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబు ఢిల్లీ దీక్ష తరువాత ఆ పార్టీ నేతలే తమ అధినేత దీక్ష విజయవంతమైందని ప్రకటించుకుంటూ.. ఆ దీక్షకు కేంద్రం తలవంచే విభజన సమస్యలపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం వేశారని చెప్పుకున్నారని గుర్తు చేశారు. జులై 30న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తెలంగాణ అనుకూల ప్రకటన తీసుకున్న తరువాత కూడా చంద్రబాబు విలేకరుల సమావేశం పెట్టి మరీ ఆ నిర్ణయాన్ని స్వాగతించారన్నారు. కొత్త రాజధాని నిర్మానానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలని కూడా డిమాండ్ చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పటికీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు. చంద్రబాబు పైకి మాట్లాడేది ఒక రకంగా ఉంటుందని, చేసేది మరో రకంగా ఉంటుందని కొణతాల తూర్పారబట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరి సహకారంతోనే విభజన ప్రక్రియ వేగంగా జరుగుతుండడం దురదృష్టకరంగా అభివర్ణించారు.
 
 విజయమ్మ యాత్రను అడ్డుకుంది ప్రజలు కాదు, పోలీసులే..
 గతంలో వరంగల్ జిల్లా ఓదార్పుయాత్రకు బయలుదేరిన జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు కూడా తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను నల్లగొండ జిల్లా పర్యటనకు వెళ్లనీయకుండా చేయడం ద్వారా అప్పటి ఘటనను పునరావృత్తం చేసిందని కొణతాల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయమ్మ పర్యటనను అడ్డుకున్నది ప్రజలు కాదని, పోలీసులేనని గుర్తు చేశారు. వరద వల్ల న ష్టపోయిన రైతుల పరామర్శకు వెళ్లిన విజయమ్మను ఖమ్మం జిల్లాలో ప్రజలు ఆదరించారని, దీంతో జీర్ణించుకోలేని రాష్ట్ర ప్రభుత్వం తన శక్తియుక్తులను, పోలీసులను అడ్డంపెట్టుకొని ఆమెను నల్లగొండ జిల్లా ప్రజల దగ్గరకు వెళ్లకుండా చేశారన్నారు. విజయమ్మ వెంట ఉన్న పార్టీ నేతలందరినీ భయభ్రాంతులకు గురిచేశారన్నారు. తాను గట్టి సమైక్యవాదినని చెప్పుకునే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసే పోలీసుయంత్రాంగం ఈ సరికే రాష్ట్ర విభజన జరిగిపోయిందన్న రీతిలో వ్యవహరించడం.. ఆయన మంత్రివర్గంలో పనిచేసే మంత్రులే రెచ్చగొట్టడం వంటి ఘటనలు బాధాకరమన్నారు. ఇదే సమయంలో అదే ప్రాంతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన చేస్తుంటే ఎలాంటి ఆటంకాలూ లేకుండా పూర్తి వెసులుబాటు కల్పించారని అన్నారు.
 
 వైఎస్సార్ సీపీ అంటే ప్రభుత్వానికి గుండెల్లో రైళ్లు..
 విజయమ్మను ప్రజల వద్దకు వెళ్లనీయకుండా చేయడాన్ని బట్టే.. ప్రభుత్వ పెద్దలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతలా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చని కొణతాల అన్నారు. రాష్ట్రంలోనే ఉన్న ఒక ప్రాంతానికి విజయమ్మను ఎందుకు వెళ్లనీయలేదో స్పష్టంగా జవాబు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతున్న సమయంలోనే ఇలాంటి ఘటనలు శోచనీయమని.. ఈ రకంగా ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సినముఖ్యమంత్రి వేరొక పార్టీ గౌరవాధ్యక్షురాలికి రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు. విభజన ప్రక్రియకు ముందే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో తిరగడానికి వీలులేదన్నట్టు నిర్ణయాలు తీసుకునే వ్యక్తికి.. ఈ సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొ నసాగే హక్కులేదని ధ్వజమెత్తారు. రక్షణ కల్పించడం చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన మంత్రివర్గంలోని మంత్రులను నియంత్రించుకోలేరు.. తన చేతిలో ఉన్న విభజన ప్రక్రియను ఆపడం ఆయనకు చేతకాదని సీఎంపై విరుచుకుపడ్డారు.
 
 జగన్ ప్రధాని, రాష్ట్రపతిల అపాయింట్‌మెంట్ కోరారు..
 వరదలలో నష్టపోయిన రైతులకు కేంద్ర సాయం కోరేందుకు తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి, రాష్ట్రపతిల అపాయింట్‌మెంట్ కోరారని కొణతాల చెప్పారు. రాష్ట్రపతి నుంచి వచ్చే అపాయింట్‌మెంట్‌ను బట్టి ఆయనను వీలుంటే హైదరాబాద్‌లో లేదంటే ఢిల్లీలో కలుస్తారన్నారు. రైతులను ఆదుకునే అంశంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలను వారి దృష్టికి తీసుకువస్తారన్నారు. విభజన ప్రక్రియకు సంబంధించి 11 అంశాలపై జీవోఏంకు సూచనలు చేయాలంటూ కేంద్రం రాసిన లేఖ శుక్రవారం పార్టీ కార్యాలయానికి అందిందని చెప్పారు. దానిపై పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ పార్టీ మొదట నుంచీ సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటుందని.. కేంద్రం జీవోఎంను ఏర్పాటు చేసినప్పడు దానిని సైమన్ కమీషన్‌తో పోల్చుతూ, బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించామని గుర్తు చేశారు. తమ పార్టీ సమైక్యవాద వైఖరికి, కేంద్రం లేఖకు పొసగదని అనిపిస్తోందన్నారు. ఏది ఏమైనా లేఖపై పార్టీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మల దహనం

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మల దహనం
హుజూర్‌నగర్, న్యూస్‌లైన్ : వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనను రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడ్డుకున్నారంటూ నల్గొండ జిల్లా, హుజూర్‌నగర్ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు శుక్రవారం ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. మంత్రి ప్రోద్బలంతోనే కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో కొందరు దుండగులు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేశారని వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 నియోజకవర్గంలో తన మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని భావించిన మంత్రి తెలంగాణవాదం ముసుగులో ఇతర జిల్లాల నుంచి అల్లరిమూకలను దింపి అలజడి సృష్టించారని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వైఖరిపై వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వైఎస్‌ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పర్యటనను అడ్డుకోవడాన్ని, మహానేత వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం నియోజకవర్గంలో ఉత్తమ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మంత్రి అండతోనే విగ్రహాల ధ్వంసం జరిగిందని ఆరోపించారు. మనుగుడ ప్రశ్నార్థకంగా మారుతుందని భావించి తెలంగాణ ముసుగులో దాడులు చేయిం చారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. రానున్న రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
 
  మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రోద్భలం తోనే కొందరు దుండగులు నియోజకవర్గంలో వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని  నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై  మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. తు పాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించడానికి వస్తున్న  వైఎస్‌ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. నియోజకవర్గంలో తన మనుగడ ప్రశ్నార్థకంగా మారే  అవకాశం ఉందని భావించిన మంత్రి ఉత్తమ్.. తెలంగాణవాదం  ముసుగులో  ఇతర జిల్లాల నుంచి అల్లరిమూకలను దింపి అలజడి సృష్టించారని మండిపడ్డారు. ఏనాడూ ఉద్యమంలో పాల్గొనకుండా ఇప్పుడు తెలంగాణ ఊసెత్తడం హాస్యాస్పదమన్నారు. నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా తెలంగాణ బిడ్డలేనన్న విషయాన్ని మంత్రి గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
 
 వ్యక్తిగత ప్రయోజనాల కోసం రైతుల పరామర్శలను రాజకీయాలు చేయడం తగదన్నారు. వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, రానున్న ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు  అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి,కోడి మల్లయ్యయాదవ్, జడరామకృష్ణ, ముసంగిశ్రీను,గొట్టెముక్కల రాములు,కస్తాల ముత్తయ్య, పులిచింతల వెంకటరెడ్డి, మందా వెంకటేశ్వర్లు, కొమరాజు శ్రీను, అయిల ధనమూర్తి, దేవరకొండ వెంకన్న, కాలవ వెంకటేశ్వరరావు, పులిచింతల లక్ష్మమ్మ, పాతర్లపాటి లక్ష్మి, పశ్య మల్లేశ్వరి, దాసరి రాములు, బత్తిని సత్యనారాయణ, వేముల రాజు, పిల్లి మల్లయ్య, బారు రామారావు, నక్కా నరేష్ తదితరులు పాల్గొన్నారు.

విజయమ్మపై కక్ష.. చంద్రబాబుకు రక్ష...

* విజయమ్మ అడుగు పెట్టకుండా అడ్డంకులు
చంద్రబాబు పర్యటనకు పోలీసుల రెడ్ కార్పెట్  
తోక ముడుచుకున్న జిల్లా మంత్రులు  
* ఆద్యంతం పోలీసు పహారా నడుమ టీటీడీ అధినేత పర్యటన

మొన్న..
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నల్లగొండ జిల్లాలోకి అడుగు పెట్టకుండా సరిహద్దుల్లోనే  మంత్రుల ప్రోద్బలంతో పోలీసులు అడ్డుతగిలారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. వైఎస్సార్ సీపీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఆదేశాల మేరకు పోలీసులు ఆటో యజమానులు, ట్యాక్సీ డ్రైవర్లను బెదిరించారు. రాత్రికి రాత్రే కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారు. రోడ్లకు అడ్డంగా వాహనాలు నిలిపి రాళ్లు వేశారు. వీటిని సాకుగా చూపి.. పోలీసులు రెచ్చిపోయి జిల్లాలో పర్యటించకుండా విజయమ్మను హైదరాబాద్ పంపించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.
 
  నిన్న..
 రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటించే చంద్రబాబుకు కాంగ్రెస్ నాయకులు రెడ్ కార్పెట్ పరచి జిల్లా పర్యటన కు స్వాగతిం చారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి పర్యటన సజావుగా సాగేలా సహకరించారు. తెలంగాణ పౌరుడిగా సమైక్యవాదులను అడ్డుకున్నామని ప్రకటన చేసిన ఓ మంత్రి... చంద్రబాబును అడ్డుకోవడంలో మాత్రం తీవ్రంగా విఫలమయ్యారు. పలుచోట్ల తెలంగాణవాదుల నుంచి మినహా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కనీసం నినదించిన, నిరసన వ్యక్తం చేసిన దాఖలాలూ లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కుకు ఇది పరాకాష్ట.
 
 సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఆద్యంతం ఖాకీల పహారాలో సాగింది. దామరచర్ల మండలం విష్ణుపురంలోని ఇండియా సిమెంట్ కంపెనీ అతిథి గృహం నుంచి బయలుదేరింది మొదలు.. కట్టంగూరులో రాత్రి పర్యటన ముగిసే దాకా పోలీసులు చంద్రబాబును నీడలా వెన్నంటే ఉన్నారు. వందల సంఖ్యలో ఖాకీలు అడుగడుగునా బందోబస్తు నిర్వహించారు. పలుచోట్ల తెలంగాణవాదుల నుంచి నిరసనలు వ్యక్తం కాగా, వారిని పోలీసులు పక్కకు నెట్టివేశారు. ఇది మినహా బాబు పర్యటనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి నిరసన వ్యక్తం కాలేదు.
 
 ఈ ఘటన ద్వారా కాంగ్రెస్, టీడీపీల తెరవె నుక బాగోతం మరోసారి బట్టబయలైంది. జిల్లాలో గురువారం వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటనకు అడ్డుతగిలిన తీరు.. సజావుగా  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన పర్యటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. విజయమ్మ పర్యటన సందర్భంగా సాక్షాత్తూ రాష్ట్ర మంత్రే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి అధికార దుర్వినియోగానికి పాల్పడి నానా రభస చేశారు. రెండు రోజులూ తన నియోజకవర్గంలోనే మకాం వేసి స్థానికులు, పక్క నియోజకవర్గాలకు చెందిన తన అనుయాయులను ఉసిగొల్పిన విషయం తెలిసిందే.
 
 ఎస్పీని సైతం క్షేత్రంలోకి తీసుకొచ్చి పలు జిల్లాలకు చెందిన పోలీసులను మోహరించారు. ఎలాగైనా విజయమ్మను అడ్డుకోవాలన్న ముందస్తు వ్యూహంలో భాగంగానే అత్యుత్సాహం ప్రదర్శించారు. అంతేగాక పర్యటనను అడ్డుకుంటామని జిల్లాకు చెందిన సీనియర్ మంత్రితోపాటు ఎంపీ కూడా ప్రకటనలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటువంటి వారు తెలంగాణ అంశంపై ఎటూ తేల్చని చంద్రబాబు పర్యటన సాఫీగా జరిగేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా సహకరించడం విశేషం. తరచూ ప్రెస్‌మీట్‌లు ఏర్పాటు చేసి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తే ఓ ఎంపీ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అదే చంద్రబాబు తిరిగినా పట్టించుకోలేదు.
 
 తెలంగాణవాదులను చితకబాదిన పోలీసులు
 బాబు పర్యటన సందర్భంగా తెలంగాణవాదులపై పోలీ సులు లాఠీ ఝుళిపించారు. చంద్రబాబు కాన్వాయ్ దామరచర్లకు చేరుకోగానే తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన తెలుపుతూ, ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో తెలంగాణవాదులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ నెలకొంది. ఇదే సమయంలో పోలీసులు తెలంగాణవాదులపై లాఠీ ఝుళిపించారు.

చంద్రబాబు పర్యటనకు రెడ్ కార్పెట్ పరిచిన కాంగ్రెస్

Written By news on Friday, November 1, 2013 | 11/01/2013

చంద్రబాబు పర్యటనకు రెడ్ కార్పెట్ పరిచిన కాంగ్రెస్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడుతున్న డ్రామా మరోసారి బయటపడింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ జిల్లాలో చేపట్టిన పర్యటనకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది. తుపాను బాధితులను పరామర్శించేందుకు నల్గొండ బయలుదేరిన చంద్రబాబు పర్యటనపై కాంగ్రెస్ నేతలు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు.  బాబుకు భారీ బందోబస్తు కల్పించి తమ విధేయతను చాటుకున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణకు చంద్రబాబు అనుకూలంగా లేఖ ఇచ్చినందుకు ఆయన్ను అడ్డుకోలేమని ఏకంగా మంత్రి స్థానంలో ఉన్న జానారెడ్డి తెలిపారు. విజయమ్మ తెలంగాణ పర్యటనను అడ్డుకుని, బాబుకు అనుమతి ఇవ్వడం సర్వత్రా  విమర్శలకు తావిస్తోంది. 
 
 వైఎస్సార్ సీసీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు, చంద్రబాబు పర్యటన అడ్డుకోవడంపై వైఎస్సార్ సీపీ మండిపడింది.  దీంతో మరోమారు టీడీపీ-కాంగ్రెస్ కలిసి ఆడుతున్న కుట్ర రాజకీయం బయటపడిందని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న విజయమ్మను పోలీసులు అడ్డుకొన్న ప్రభుత్వం, బాబు పర్యటనకు మాత్రం మార్గం అనుకూలంగా వ్యవరిస్తోంది.

YSRCP observes AP Integration Day

త్వరలో జగన్ రాష్ట్ర పర్యటన: కొణతాల

త్వరలో జగన్ రాష్ట్ర పర్యటన: కొణతాల
విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన రెడ్డి త్వరలోనే రాష్ట్ర పర్యటన చేస్తారని పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. అఖిలపక్ష సమావేశం కంటే ముందుగానే శ్రీకృష్ణ కమిటీ నివేదికను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని కొణతాల అన్నారు. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు తమ పదవుల పరువు తీసేలా ప్రవర్తించారని విమర్శించారు. వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకోవడాన్ని తాము మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

జానా, ఉత్తమ్‌కుమార్‌లది దొరల అహంకారం

'జానా, ఉత్తమ్‌కుమార్‌లది దొరల అహంకారం'
హైదరాబాద్ : జాతీయ జెండా ఎగురవేయని తెలంగాణ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రారావు డిమాండ్ చేశారు. కొంతమంది తెలంగాణ మంత్రులు తెలుగు జాతిని అవమానపరుస్తున్నారని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలది దొరల అహంకారమని గట్టు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారిద్దరూ మంత్రులుగా ఉండే అర్హత కోల్పోయారన్నారు. తెలంగాణ ఏర్పడితే దొరల రాజ్యం వస్తుందే కానీ మరొకరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ జిల్లాల్లో జాతీయ జెండా ఎగురవేసే ఇతర ప్రాంతాల కలెక్టర్లను కూడా అరెస్ట్ చేయిస్తారా అని గట్టు ప్రశ్నించారు.

102 సంవత్సరాల తెలుగువారి ఆకాంక్షే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు అని గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. తెలంగాణ ఉన్న మంత్రులు తమ పదవులు చేపట్టినప్పుడు రాజ్యాంగానికి బద్ధులమై ఉంటామని రాజ్యాంగంపై ప్రమాణం చేసి......వారు జాతీయ జెండాను ఆవిష్కరించకపోవటం తెలుగుజాతిని, భారతదేశాన్ని అవమానించటం కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ అంటూ కోతలు కోస్తున్న నేతలు గతంలో ఏవిధంగా ప్రవర్తించారో ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.

సమైక్య రాష్ట్రం కోసం ముందుండి పోరాడతాం: శోభానాగిరెడ్డి

సమైక్య రాష్ట్రం కోసం ముందుండి పోరాడతాం: శోభానాగిరెడ్డి
హైదరాబాద్: : సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి స్ఫష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే క్రమంలో తమ పార్టీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని తెలిపారు. అందులోభాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యం కోసం కోర్టులను ఆశ్రయించిన సంగతిని శోభానాగిరడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

హైదరాబాద్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం శోభానాగిరెడ్డి మాట్లాడుతూ...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపున తెలుగు ప్రజలకు శోభానాగిరెడ్డి ఈ సందర్బంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది రాష్ట్రాన్ని ముక్కలు చేయాడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
 
అందులోభాగంగానే ప్రాంతాలు, ప్రజల మధ్య విద్వేషాలు రగులుస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం నాటకాలు ఆడుతున్నారని శోభానాగిరెడ్డి మండిపడ్డారు. భారీ వర్షాల కారణంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలలో నిన్న వైఎస్ విజయమ్మ పర్యటన పట్ల రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డిలు ప్రవర్తించిన తీరు దారుణమని పేర్కొన్నారు.

వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీనేతలు, కార్యకర్తలు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా పోరాటం చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆమె...  ప్రజలకు వైఎస్ జగన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  మరోనేత గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలది దొరల అహంకారమని విమర్శించారు. వారు వ్యవహరించిన తీరు దారుణమన్నారు.
Photo

అడుగడుగునా ఆదరణ

అడుగడుగునా ఆదరణ
సాక్షి, ఖమ్మం: వర్షాలు సృష్టించిన కల్లోలంతో బరువెక్కిన గుండెతో ఉన్న ఖమ్మం జిల్లా రైతుకు ‘మేమున్నాం.. అధైర్య పడకండి’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఓదార్పునిచ్చారు. గురువారం జిల్లాలో సాగిన ఆమె పర్యటన సందర్భంగా రైతులు తమ సమస్యలను ఆమెకు చెప్పుకొన్నారు. వారి కష్టాలు విని చలించిపోయిన ఆమె.. రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామంటూ భరోసానిచ్చారు.
 
గురువారం ఆమె ఖమ్మం జిల్లాలో పర్యటించి మధిర నియోజకవర్గంలోని మధిర మండలం సిరిపురం, బోనకల్లు మండలం కలకోట, వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలం పల్లిపాడు, ఖమ్మం అర్బన్ మండలం వీవీపాలెం, ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామాల్లో దెబ్బతిన్న పత్తి, వరి, మిర్చి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు కలిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ‘కౌలుకు తీసుకున్నాం.. పంట చేతికి రాలేదు.. మీరే దిక్కు’ అంటూ కలకోట మిర్చి రైతులు ఆమెకు తన సమస్యను ఏకరువు పెట్టారు. ‘అమ్మా వైఎస్ హయాంలో మేం దర్జాగా ఉన్నాం.. ఇప్పుడు ఎట్లా బతకాలిరా దేవుడా అన్నట్లున్నాయి పరిస్థితులు’ అంటూ గోడు వెళ్లబోసుకున్నారు.
 
కొణిజర్ల మండలం పల్లిపాడు, ఖమ్మంఅర్బన్ మండలం వి.వెంకటాయపాలెం, ముదిగొండ మండలం వెంకటాపురంలో ఆమె పత్తి పంటలను పరిశీలించారు. పూర్తిగా తడిసిన పత్తిని చూసి రైతులకు మద్దతు ధర ఇచ్చేలా సీసీఐతో పంట కొనుగోలు చేయించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధిర నుంచి నేలకొండపల్లి జిల్లా నలుమూలల నుంచి రైతులు ఆమె పర్యటనకు భారీగా తరలివచ్చారు. ఇటు రైతులు.. అటు పార్టీ క్యాడర్‌తో పాటు ప్రజలు విజయమ్మ పర్యటనకు అడుగడుగునా నీరాజనం పలికారు. కాగా విజయమ్మ పర్యటన సందర్భంగా ఖమ్మం జిల్లాలోఒకరిద్దరు ఆమెను అడ్డుకునేందుకు యత్నించారు. వైరా నియోజకవర్గం పల్లిపాడులో రైతులను పరామర్శించి వస్తున్న విజయమ్మ కారును తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులు ఇద్దరు అడ్డుకోవడానికి యత్నించారు. కారుపై కోడిగుడ్డు వేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నేలకొండపల్లిలో టీఆర్‌ఎస్ నాయకుడొకరు విజయమ్మను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని నిలువరించారు.
 
సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నాం: విజయమ్మ
‘రాష్ట్రం విడిపోయే ప్రసక్తేలేదు.. ఇది నేను మనస్సాక్షిగా చెబుతున్న మాట. విభజన అనేది తండ్రిలాగా చేయాలి.. కానీ కేంద్రం అలా చేయడం లేదు. అందుకే 60 శాతం మంది రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రోడ్డెక్కారు.. విభజిస్తే వీరికి అందరికీ సమస్యలు ఎదురవుతున్నాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడగొడితే అసెంబ్లీకి తీర్మానం రావాలి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంది’ అని విజయమ్మ స్పష్టంచేశారు. ఖమ్మం జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఆమె నేలకొండపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నల్గొండ జిల్లాలో దివంగత వైఎస్ విగ్రహాల ధ్వంసం విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని.. విగ్రహాలు ధ్వంసం చేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న నేతను ఎవరూ తీసేయలేరన్నారు.
 
 రాష్ట్రంలో మూడు ప్రాంతాలను వైఎస్ సమంగానే అభివృద్ధి చేశారన్నారు. 2010 నుంచి 2013 వరకు రూ.700 కోట్లు రైతులకు పంట నష్టపరిహారంగా విడుదల చేశామని ప్రభుత్వం ప్రకటిస్తే.. అది ఎక్కడా అందలేదని రైతులు చెబుతున్నారన్నారు. పంట నష్టం వివరాలు తెలుసుకోవడానికి అధికారులను కూడా పంపలేదంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుందన్నారు. చంద్రబాబు లాగా తాము అబద్ధాలు చెప్పమని, పంట పరిహారం ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. పంట నష్టంపై జిల్లాల వారీ నివేదికలు తయారు చేసి రాష్ర్ట ప్రభుత్వంతో పాటు ప్రధాని, కేంద్ర వ్యవసాయ మంత్రికి అందజేసి పరిహారం వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెస్తామన్నారు

పోలీసులా.. మంత్రులకు తొత్తులా?

పోలీసులా.. మంత్రులకు తొత్తులా?
సాక్షి, హైదరాబాద్: పోలీసులు రాష్ట్ర మంత్రులకు తొత్తులుగా మారి తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను అదుపులోకి తీసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాద ముసుగులో ఉన్న వేర్పాటువాదని ఆ పార్టీ నేతలు విమర్శించారు. ముంపు ప్రాంతాల్లో బాధిత రైతులను పరామర్శించేందుకు నల్లగొండ వెళ్లిన విజయమ్మను అడ్డుకోవడంపై డీజీపీ బి.ప్రసాదరావును కలిసిన అనంతరం పార్టీ శాసనసభాపక్ష ఉప నేత శోభానాగిరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామికమని, సమైక్య రాష్ట్రంలో ఎవరు ఏ ప్రాంతంలోనైనా పర్యటించే హక్కు రాజ్యాంగం కల్పించిందని చెప్పారు.
 
సమైక్యాంధ్రప్రదేశ్ చాంపియన్ అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే హోం శాఖ, పోలీసు శాఖ ఉందని, ఆయనే విజయమ్మ పర్యటనను పోలీసులు అడ్డుకునేవిధంగా చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే సమయంలో ముఖ్యమంత్రి వెళ్లి ఓదార్చాల్సి ఉందని, సీఎం చేయలేని పనిని విజయమ్మ చేస్తుంటే ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. విజయమ్మ పర్యటనను అడ్డుకోవడం, పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం వంటి ఘటనలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో వేలాది ఎకరాలు ముంపునకు గురై రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని, ఈ మంత్రులిద్దరూ సమైక్య రాష్ట్రంలోనే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులు కాలేదా? అని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జనక్ ప్రసాద్ డీజీపీని కలిసిన వారిలో ఉన్నారు.
 
డీజీపీ కార్యాలయం ఎదుట నిరసన
విజయమ్మను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డీజీపీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక్కసారిగా డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న పార్టీ కార్యకర్తలు ‘పోలీస్.. డౌన్‌డౌన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రభుత్వానికి తొత్తులుగా మారి విజయమ్మను అదుపులోకి తీసుకున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ని

విభజనపై నేడు నిరసన: మైసూరారెడ్డి

విభజనపై నేడు నిరసన: మైసూరారెడ్డి
విభజన నరకాసురుల దిష్టిబొమ్మలు తగులబెట్టాలని వైఎస్సార్‌సీపీ పిలుపు
1వ తేదీ ఉదయం సమైక్య తీర్మానాలు చేయాలి
ఆ మేరకు ప్రధానికి ఈమెయిల్స్ పంపాలి
6, 7 తేదీల్లో 48 గంటలపాటురహదారుల దిగ్బంధం

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవమైన నవంబర్ 1న  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగనున్నాయి. మెజారిటీ ప్రజల అభీష్టానికి నిలువెత్తు పాతర వేస్తూ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తున్నందుకు నిరసనగా శుక్రవారం రాత్రి విభజన నరకాసురుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఒక బలమైన రాష్ట్రాన్ని నిరంకుశంగా విడగొట్టాలని చూస్తున్న సోనియాగాంధీ, విభజనకు లేఖనిచ్చి సహకరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పదవిని పట్టుకుని వేలాడుతూ డ్రామాలాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, విభజనకు ఆజ్యం పోసిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఉదయం గ్రామసభలు ఏర్పాటు చేసి అందులో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానాలు చేయాలని కూడా పార్టీ కోరింది.
 
  ఆ తీర్మానాలను ప్రధానమంత్రికి ఈమెయిల్స్ ద్వారా పంపాలని సూచించింది. అదేరోజు రాత్రి 7 గంటల తరువాత నరక చతుర్ధశి రోజున నరకాసురుని వధించిన విధంగా విభజన నరకాసురులను కూడా బాణసంచాతో కూడిన దిష్టిబొమ్మలతో దగ్ధం చేయాలని పార్టీ కోరింది. ఈ నిరసన కార్యక్రమాలు ఊరూరా, వాడవాడలా చేసి కేంద్రానికి సమైక్యవాదాన్ని చాటిచెప్పాలని మైసూరా కోరారు. కాగా విభజనపై చర్చించడానికి నవంబర్ 7న కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) నిర్వహిస్తున్న సమావేశానికి నిరసనగా 6, 7 తేదీల్లో 48 గంటలపాటు రహదారుల దిగ్బంధం చేయాలని కూడా పార్టీ పిలుపునిచ్చింది.
 
 మహిళలు క్రియాశీలంగా పాల్గొనాలి
 నరకాసురునితో యుద్ధం చేసింది శ్రీకృష్ణుడే అయినప్పటికీ రాక్షసుడిని వధించడంలో కీలక పాత్ర వహించింది సత్యభామే కనుక ఈ దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమంలో మహిళలే చురుగ్గా పాల్గొనాలని వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి కోరారు.
 
 సమైక్య దినంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవమైన నవంబర్ 1వ తేదీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య దినంగా పాటించనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగే ఈ ఉత్సవంలో అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. ఉదయం 8.30 గంటలకు ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

జానా, ఉత్తమ్‌లు కిరణ్ కింద ఎందుకు పనిచేస్తున్నారు?

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బాజిరెడ్డి, గట్టు ధ్వజం
జానా, ఉత్తమ్‌లు కిరణ్ కింద ఎందుకు పనిచేస్తున్నారు?

 
 సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన పాలకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ.. దానిని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. మంత్రులుగా రాజ్యాంగాన్ని, పౌర హక్కులను కాపాడాల్సిన జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలే స్వయంగా వాటిని కాలరాస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్న వారైతే తాను సమైక్యవాద చాంపియన్ అని చెప్పుకుంటున్న సీఎం కిరణ్ కింద పనిచేయడానికి సిగ్గేయడం లేదా? అని అన్నారు.
 
 భారీ వర్షాల వల్ల అతలాకుతలమైన ప్రాంతాలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్లిన తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను అడ్డుకోవడం చూస్తుంటే వారికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రరావు వేరువేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 
జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఫైళ్లపై సంతకాలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. చీకట్లో అన్ని వ్యవహారాలు నెరుపుతూ, పైకి మాత్రం తెలంగాణవాదంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి రక్షణగా ఉండాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

తెలంగాణలో పర్యటిస్తే.. సీఎంనూ అరెస్టు చేస్తారా?

నల్లగొండ జిల్లా పర్యటనను అడ్డుకోవడంపై విజయమ్మ ఆగ్రహం
 
సాక్షి, ఖమ్మం: ‘నేను సమైక్యవాదిని అంటున్నారు.. మరి సీఎం తనకు తానే సమైక్యవాదినని ప్రకటించుకుంటున్నారు.. ఆయన తెలంగాణ జిల్లాలో పర్యటిస్తే అరెస్టు చేస్తారా..?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా సరిహద్దులో విజయమ్మను అదుపులోకి తీసుకొని నేలకొండపల్లి స్టేషన్‌కు తరలించిన అనంతరం  ఆమె అక్కడ విలేకరులతో మాట్లాడారు.

‘ఇదేమైనా పాకిస్తానా.. బంగ్లాదేశా..? మేమేమైనా రౌడీషీటర్లమా..? వీసా తీసుకొని తెలంగాణలో పర్యటించాలా..? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? ఇంకా ఎక్కడైనా ఉన్నామా.. ప్రభుత్వమే నాపర్యటను అడ్డుకుంటోంది’ అని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కష్టాల్లో ఉంటే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరూ వారిని పలకరించకుండా ఇంట్లో కూర్చున్నారని విమర్శించారు. తాము వెళ్తుంటే కుట్ర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారన్నారు.

‘ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి మాట ఇవ్వడం నేతల కర్తవ్యం.. ఇది నేను చేయడం తప్పా.. మనం ప్రజాస్వామంలో ఉన్నామా.. ఇంకెక్కడైనా ఉన్నామా’ అని ప్రశ్నించారు. కొంతమంది నాయకులు, పార్టీలు కుట్రలు చేసి వ్యక్తిగత స్వేచ్ఛను హ రిస్తున్నారన్నారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లు తెలంగాణ ప్రజల గోడు పట్టించుకున్నారు.. కానీ ఈ ప్రభుత్వానికి జనం గోడు పట్టదా’ అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో పర్యటనను ప్రజలు అడ్డుకోవడం లేదని, ప్రభుత్వం, ఇక్కడి నాయకులు అడ్డుకుంటున్నారన్నారు. వైఎస్ రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వం, ఆయన కష్టంతో మంత్రి పదవులు తెచ్చుకున్న మంత్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు.  

మళ్లీ నల్లగొండకు వస్తాం.. రైతులను కలుస్తాం..
కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునే నాయకులను ఎవ్వరూ ఆపలేరని, మళ్లీ నల్లగొండకు వచ్చి బాధిత రైతులను కలుస్తామని విజయమ్మ చెప్పారు.
 
నల్లగొండ ఎస్పీని ఫోన్‌లో నిలదీసిన విజయమ్మ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘తుపానుతో పంటలు నష్టపోయి బాధలో ఉన్న రైతులను పరామర్శించడానికి వస్తే రాజకీయం చేస్తారా..? ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, ప్రజల కోసం పనిచేసే పార్టీలు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కలవడానికి రాకుంటే ఎపుడు వస్తారు? మేమేమన్నా దాడులు చేయడానికి వస్తున్నామా? మమ్మల్ని ఎందుకు వెనక్కి వెళ్లిపొమ్మంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధిత రైతులను పరామర్శించాకే వెళతాం. రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీదే’ అని నల్లగొండ ఎస్పీ ప్రభాకరరావును వైఎస్ విజయమ్మ ఫోన్‌లో నిలదీశారు. నల్లగొండ జిల్లాకు వెళ్లకముందు ఖమ్మం జిల్లా పర్యటనలో ఉండగా ఆమె ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు.

నల్లగొండ జిల్లాకు అనుమతించబోమని పోలీసులు అనడంపై మండిపడ్డారు. బాధల్లో ఉన్న ప్రజలను ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా ఈ విషయం గమనించకుంటే ఎలా..? అంటూ ఎస్పీని ప్రశ్నించారు. ‘మాకు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ.. మూడు ప్రాంతాలు సమానమే, అయినా రైతులతో రాజకీయం ఏమిటి? నేనైతే వస్తున్నా.. రక్షణ కల్పిస్తారో.. వెంట ఉండి రాళ్లు వేయిస్తారో.. మీ ఇష్టం..’ అని అన్నారు. కాగా, ఎస్పీతో మాట్లాడిన అర్ధగంట తర్వాత వైఎస్ విజయమ్మ పార్టీ నేతలతో మాట్లాడి, బాధిత రైతులను పరామర్శించేందుకు ముందు నిర్ణయించిన మార్గంలోనే వెళ్లడానికి నేలకొండపల్లి నుంచి బయలుదేరారు. పోలీసులు ఆమెను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

పలకరింపు నిషేధం!

 వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన విజయమ్మపై కాంగ్రెస్ మంత్రుల బురద రాజకీయం
*  మంత్రులు ఉత్తమ్, జానా ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు
*  నల్లగొండలో అడుగుపెట్టకుండా విజయమ్మను అడ్డుకున్న ఖాకీలు
*  ఖమ్మం జిల్లాలో పర్యటన సాఫీగా సాగినా, ఉద్రిక్త పరిస్థితులు లేకున్నా పోలీసుల అత్యుత్సాహం
*  రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు
*  విజయమ్మను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
*  కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి, నేతల గృహ నిర్బంధం
 
సాక్షి ప్రతినిధులు, నల్లగొండ, ఖమ్మం: భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులను ఓదార్చి బతుకుపై భరోసా కలిగించేందుకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన పర్యటనపైనా కాంగ్రెస్ మంత్రులు రాజకీయాస్త్రం ప్రయోగించారు. విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని తాము పిలుపునిచ్చినా.. గురువారం ఖమ్మం జిల్లాలో ఆమె పర్యటన ప్రశాంతంగా సాగడంతో జీర్ణించుకోలేని మంత్రులు ఆమెను నల్లగొండ జిల్లాలో అడ్డుకోవడానికి పోలీసుల్ని పురమాయించారు. ఖద్దరు ఆదేశాలే తమ చట్టమన్నట్టుగా వందల మంది పోలీసులు రంగంలోకి దిగారు. నల్లగొండ జిల్లాలోకి ప్రవేశిస్తే శాంతిభద్రతలకు విఘాతం వాటిల్లుతుందంటూ విజయమ్మను జిల్లా సరిహద్దులోనే అడ్డుకున్నారు.

ఖమ్మం జిల్లాలో విజయమ్మ పర్యటన చాలా ప్రశాంతంగా సాగిందని ఆ జిల్లా ఎస్పీ సైతం ప్రకటించగా.. నల్లగొండ జిల్లా పోలీసులు మాత్రం శాంతిభద్రతల సాకు చూపడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆరుగాలం కష్టపడి కన్నబిడ్డలా సాకిన పంట మొత్తం వర్షాలకు దెబ్బతిని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ తరుణంలో వారికి ధైర్యం చెప్పేందుకు విజయమ్మ వస్తుంటే.. అడ్డుకోవడమేంటని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీశారు. తాము ఎంత చెప్పినా పోలీసులు వినకపోవడంతో విజయమ్మ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
‘సమైక్యవాదం వినిపిస్తున్న సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణ జిల్లాల్లో పర్యటించడానికి వస్తే.. శాంతి భద్రతలంటూ ఇలాగే ఆయన్ను అడ్డుకుంటారా? ఇదేమైనా పాకిస్థానా.. బంగ్లాదేశా?’ అంటూ మండిపడ్డారు. ఇందులో తమకు ఎలాంటి దురుద్దేశం లేదని, కేవలం పై నుంచి వచ్చిన ఆదేశాలనే తాము పాటిస్తున్నామంటూ పోలీసులు విజయమ్మకు చెప్పారు. రైతులు కష్టాల్లో ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శించడానికి వెళ్లకపోగా.. తాము వెళుతుంటే రాజకీయాలు చేయడమేంటని విజయమ్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు విజయమ్మను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

 మంత్రులు ఆదేశించారు.. పోలీసులు పాటించారు..
గురువారం ఖమ్మం జిల్లాలో వర్షాలు, వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి ఆ తర్వాత నల్లగొండ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో బాధిత ప్రాంతాల్లో విజయమ్మ పర్యటించాల్సి ఉంది. అయితే బుధవారం నుంచే జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు విజయమ్మ పర్యటనను అడ్డుకోవడానికి ప్రణాళిక రచించారు. సమైక్యవాదమంటున్న విజయమ్మ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలంటూ ప్రజలను రెచ్చగొట్టడానికి యత్నించారు. వీలైన చోటల్లా ఏదో రకంగా అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలను పురమాయించారు.
అయితే గురువారం ఖమ్మం జిల్లాలో విజయమ్మ పర్యటనా ప్రశాంతంగా సాగడం, రైతులు తరలివచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ తరఫున పోరాడాలని కోరారు. అక్కడక్కడా ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్, ఇతర పార్టీల కార్యకర్తలు మాత్రమే ఆమెను అడ్డుకుంటామంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత విజయమ్మ నల్లగొండ జిల్లాకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా మంత్రులు పూర్తిస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తాన్ని కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో మోహరించారు.

ఖమ్మం జిల్లాలో ఇద్దరు డీఎస్పీలతో పాటు నలుగురు సీఐలు, 8 మంది ఎస్‌ఐలు, 72 మంది పోలీసులు విజయమ్మ పర్యటనకు బందోబస్తుగా ఉంటే..  సరిహద్దులో మాత్రం నల్గొండ జిల్లాకు చెందిన ముగ్గురు డీఎస్పీలతో పాటు సుమారు 250 మంది పోలీసులు మకాం వేశారు. నల్లగొండ జిల్లాలో విజయమ్మ పర్యటన జరగకుండా చూడటమే ధ్యేయంగా పోలీసులు ఆ జిల్లాలో 144 సెక్షన్ అమలులోకి తెచ్చారు.

బైఠాయించిన విజయమ్మ
సరిహద్దులోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి వద్దకు విజయమ్మ చేరుకోగానే.. నల్లగొండ జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు కదలనీయబోమని పోలీసులు అనడంతో ఆమె అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విజయమ్మతో పాటు జిల్లా పార్టీ నాయకులు బీరవోలు సోమిరెడ్డి, గున్నం నాగిరెడ్డి, పాదూరి కరుణ, ఖమ్మం జిల్లా పార్టీ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం తదితర నాయకులంతా ధర్నాకు దిగారు. అర్ధగ ంటకు పైగానే ఈ నిరసన సాగింది. దీంతో పోలీసులు విజయమ్మను అదుపులోకి తీసుకొని ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి స్టేషన్‌కు తరలించారు.

నేలకొండపల్లిలో టెన్షన్..టెన్షన్
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం తెలుసుకొన్న కొద్ది సేపట్లోనే నేలకొండపల్లి, ముదిగొండ, కూసుమంచి మండలాల నుంచి భారీగా కార్యకర్తలు తరలివచ్చి నేలకొండపల్లి స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. విజయమ్మను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. అర్ధగంట పాటు ఆమెను పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచడంతో  పోలీస్‌స్టేషన్ ఎదుట ఖమ్మం-కోదాడ రహదారిపై కార్యకర్తలు ధర్నా చేశారు.

వారిని చేదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించినా వెరువకుండా నినాదాలు చేశారు. ముందస్తుగా ఈ పరిస్థితిని ఊహించిన పోలీసులు ఖమ్మం జిల్లా నుంచి విజయమ్మకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వారి వాహనాలను నేలకొండపల్లిలోనే అడ్డుకున్నారు. పోలీసులు తీరును నిరసిస్తూ వారంతా నేలకొండపల్లి పెట్రోల్‌బంక్ సమీపంలో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
 
విజయమ్మపై కోదాడ రూరల్‌స్టేషన్ లో కేసు నమోదు
నల్లగొండ జిల్లాలో పర్యటించేందుకు యత్నించినందుకు వైఎస్ విజయమ్మపై కేసు నమోదైంది. శాంతి భద్రతల దృష్ట్యా ‘295/13 అండర్ సెక్షన్ 151 సీఆర్‌పీసీ’ ప్రకారం విజయమ్మపై కేసు నమోదు చేసినట్లు కోదాడ రూరల్ ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. మరోవైపు హుజూర్‌నగర్ కోఆర్డినేటర్, పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డిని పోలీసు బందోబస్తు పెట్టి గృహనిర్బంధం చేశారు. సాయంత్రం అరెస్టు చేసి చిలుకూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
 
రైతుల ఆగ్రహం
వర్షం తాకిడితో పంటలు దెబ్బతిన్న నల్లగొండ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ రైతులంతా.. బాధలో ఉన్న తమను పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ వస్తున్నారని ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఆమె రాకతో జరిగిన నష్టం గురించి ప్రభుత్వానికి మరింత వివరంగా తెలిసే అవకాశం ఉండడంతో పాటు, తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావంతో వారున్నారు. తీరా విజయమ్మ పర్యటన జరగకుండా పోలీసుల రూపంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి అడ్డం పడడంతో రైతులు, బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
 
ఉత్తమ్‌కుమార్ భార్య హల్‌చల్..
విజయమ్మ పర్యటనను అడ్డుకునే ఏర్పాట్లను జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి దగ్గరుండి పర్యవేక్షించారు. గురువారం ఉదయమే ఆమె కోదాడకు చేరుకుని పట్టణంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పార్టీ పాత కార్యాలయానికి పిలిపించారు. ఎట్టి పరిస్థితుల్లో విజయమ్మను కోదాడ దాటనివ్వద్దంటూ వారికి నూరిపోశారు. పార్టీ కార్యకర్తలతో కోదాడ-ఖమ్మం రోడ్డుపై ఉన్న వంతెన వద్దకు చేరుకున్నారు. ఇంతలోనే వారికి టీఆర్‌ఎస్, జేఏసీ నేతలు జత కలిశారు. దాదాపు అరగంట సేపు ఆమె అక్కడే ఉండి వారికి ఆదేశాలిచ్చి వెళ్లిపోయారు. అయినప్పటికీ జనం పలుచగా ఉన్నారని భావించిన నాయకులు కోదాడ పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులను కొందరిని అక్కడికి తరలించారు. ఇంతలోనే ఖమ్మం జిల్లా సరిహద్దు అయిన పైనంపల్లి వద్ద విజయమ్మను అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం అందడంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తలు అక్కడి నుంచి ర్యాలీగా ఖమ్మం క్రాస్‌రోడ్డు చేరుకున్నారు.
 
మంత్రుల తీరుపై సర్వత్రా విమర్శలు..
కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో విజయమ్మ పర్యటనను అడ్డుకునేందుకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. ప్రధానంగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరూ వాహనాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. పోలీసుల ద్వారా బెదిరించి ఆటోలు పెట్టకుండా కట్టడి చేశారు. రాత్రికి రాత్రే రెండు నియోజకవర్గాల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలు ధ్వంసం చేయించారు. మొత్తం పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, అధికారులను ఆటాడించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ విజయమ్మను జిల్లా సరిహద్దు దాటి రానీయవద్దని హుకుం జారీ చేశారు. అయితే స్థానిక ప్రజలు సహకరిస్తారో లేదోనన్న అనుమానంతో ఆయన నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను తరలించి కోదాడలో మోహరింపజేశారు. హుజూర్‌నగర్, మేళ్లచెర్వు, రామాపురం క్రాస్‌రోడ్డు, ఖమ్మం క్రాస్‌రోడ్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో తన అనుచరులు, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వారిని సిద్ధంగా పెట్టుకున్నారు. పోలీసులను పెద్దసంఖ్యలో తీసుకువచ్చి భయోత్పాత వాతావరణం సృష్టించారు. మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసు అధికారులు చేసేదేమీ లేక అవసరానికి మించి బలగాలను తరలించారు. పూర్తిగా రాజకీయ, వ్యక్తిగత అజెండాతో జనాలను ఉసిగొల్పిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది.
 
రెండు నియోజకవర్గాలోవైఎస్ విగ్రహాల ధ్వంసం
విజయమ్మ నల్లగొండ జిల్లా పర్యటనకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందకు కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారు. ఎనిమిది విగ్రహాలను ధ్వంసం చేశారు. కోదాడ పట్టణంలోని ప్రమీల టవర్స్ సమీపంలోనూ, మండల పరిధిలోని గుడిబండ, చిలుకూరు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నిప్పు పెట్టారు. హుజూర్‌నగర్ మండల పరిధిలోని బూరుగడ్డ, మేళ్లచెర్వు మండల కేంద్రంతో పాటు దొండపాడు గ్రామంలోనూ, నేరేడుచర్ల మండల కేంద్రంలోనూ, గరిడేపల్లి మండల పరిధిలోని ఎల్‌బీ నగర్‌లోనూ వైఎస్ విగ్రహాలపై టైర్లు వేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు.

మీకు అండగా మేమున్నాం...వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది

‘మీకు అండగా మేమున్నాం...వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది...జగన్‌బాబు ఉన్నారు...’ అంటూ విజయమ్మ రైతులను ఓదార్చారు. మధిర, బోనకల్, వైరా, కొణిజర్ల, ఖమ్మంఅర్బన్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లో దెబ్బతిన్న పంటచేలను ఆమె గురువారం పరిశీలించారు. కార్యకర్తలు, అభిమానులు ఊరూరా ఆమెను ఘనంగా స్వాగతించారు.       కొణిజర్ల మండలం పల్లిపాడులో పత్తి రైతులు రాచబట్టి బకీరన్న, సుశీలతో మాట్లాడుతున్న వైఎస్ విజయమ్మకొణిజర్ల మండలం పల్లిపాడులో విజయమ్మ ఎదుట గోడు వెళ్లబోసుకుంటున్న మహిళముదిగొండ : వెంకటాపురంలో పత్తిచేనును పరిశీలిస్తున్న విజయమ్మబోనకల్ మండలం కలకోటలో మహిళా రైతులను ఓదారుస్తున్న విజయమ్మకొణిజర్ల మండలం పల్లిపాడులో పాడైన పత్తిని విజయమ్మకు చూపుతున్న మహిళా రైతు సామ్రాజ్యంమధిరలో విజయమ్మకు పొంగులేటి, మెండెం స్వాగతంనేలకొండపల్లిలో విజయమ్మను చూసేందుకు వచ్చిన ప్రజలుముదిగొండ: వెంకటాపురంలో మాట్లాడుతున్న విజయమ్మముదిగొండ మండలం వెంకటాపురంలో విజయమ్మకు తమ బాధలు చెప్పుకుంటూ విలపిస్తున్న రైతు కూలీలు, చిత్రంలో మచ్చా, పొంగులేటిముదిగొండ : వెంకటాపురంలో దెబ్బతిన్న పత్తిని చూపుతున్న రైతు రాయల నాగేశ్వరరావువీవీపాలెంలో ప్రజలకు అభివాదం చేస్తున్న విజయమ్మవీవీపాలెంలో విజయమ్మకు స్వాగతం పలుకుతున్న ప్రజలుఖమ్మం అర్బన్ : ఉల్లిగడ్డల ధరలు బాగా పెరిగాయంటున్న వీవీ పాలెం వాసి శాంతముదిగొండ: వెంకటాపురంలో మాట్లాడుతున్న విజయమ్మసత్తుపల్లి నియోజకవర్గంలో నష్టాల గురించి చెబుతున్న నంబూరిమధిరలో వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేస్తూ.. , కలకోటలో మిర్చిరైతు బగ్గూరి ఆదాంను ఓదారుస్తున్న విజయమ్మ

కలకోటలో మిర్చి పంటను పరిశీలిస్తూ.. , సిరిపురంలో చిన్నారుల ఉత్సాహంనేలకొండపల్లి మండలం పైనంపల్లి శివారులో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న విజయమ్మ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్లగొండ జిల్లా పార్టీ కన్వీనర్ బీరవల్లి సోమిరెడ్డిపైనంపల్లి శివారులో జనాలను చెదరగొడుతున్న పోలీసులునేలకొండపల్లి : పైనంపల్లి శివారులో అరెస్ట్‌కమ్మని విజయమ్మను కోరుతున్న పోలీసులువైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నాయకురాలు వాసిరెడ్డి పద్మను అరెస్ట్ చేస్తున్న పోలీసులునేలకొండపల్లి : పైనంపల్లి శివారులో నల్లగొండ జిల్లా పార్టీ కన్వీనర్ సోమిరెడ్డి అరెస్టు..

Popular Posts

Topics :