24 November 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

కుప్పం సమైక్య శంఖారావం photos

Written By news on Saturday, November 30, 2013 | 11/30/2013

నిజాయితీతో కూడిన  రాజకీయాల కోసమే సమైక్య శంఖారావం  బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ సాయంత్రం జరిగిన  సమైక్య శంఖారావం  భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుప్పంలోకి ప్రవేశించిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు ఘనస్వాగతం పలికారు. జైజగన్ నినాదాలతో కుప్పం మారుమోగిపోయింది.  జగన్ సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

KUPPAM IGNORES CHANDRABABU, GIVES JAGAN A PASSIONATE WELCOME

. sakshipost
In a major embarrassment to Telegu Desam Party Chief Chandrababu Naidu, people came out in throes to great YSR Congress Party president Jagan Mohan Reddy, whose Samaikhya Sankharavam yatra was off to a great start in Kuppam on Saturday.
In spite of fervent pleas by Naidu to the people of his constituency to boycott Jagan's yatra, there was an outpouring of massive crowds from various parts of Chittoor, who gathered in Kuppam to express their solidarity to the cause of Samaikyandhra. Since morning, thousands of Jagan's supporters, YSR CP activists, made their presence felt in the yatra and slogans of 'Jai Samaikyandhra' and 'Jai Jagan' filled the air.
Addressing a mammoth gathering of people at Kuppam bus stand on Saturday evening Jagan made an impassioned plea, asking them to stand by him in his fight for 'Samaikyandhra'. He pointed out that the separatist leaders were adamant on dividing the Telugu people, but their plans will not succeed.

Why are you dividing us? Jagan to Sonia

He asked Congress Chief Sonia Gandhi the reason behind her decision to split the Telegu race? "Is it because she wanted to pave the way for her son, Rahul Gandhi to become prime minister?," Jagan asked. 
Seeking questions from Congress Chief, Sonia Gandhi, Jagan asked that in case bifurcation does take place, where will the students go? Recalling his father, former CM YS Rajashekara Reddy's role in keeping the employment rates high, he said that when YSR was alive, in a year companies would queue up to hire close to 57,000 students in campus recruitment.
He also questioned Sonia's citizenship. The party president said that Sonia had obtained Indian citizenship only in 1983, that is 15years post her marriage with Rajiv Gandhi. "Now, suppose a Bill is brought in the Parliament asking all foreigners who obtained Indian citizenship 30 years ago to leave the country, will you (Sonia) like it?" he asked.

Naidu and CM black spots on history of Chittoor

Accusing CM Reddy and Naidu of playing partisan politics, Jagan said that just like the moon is tainted with black spots so is the history of Chittoor which two black spots.
The 40-year-old enumerating the issues that will steam from bifurcation added that if it were to take place then the partition would transform the state of AP into a desert.
"Water flows into our state only after Almatti and Naryanpur dams are full. In such a situation if another state comes in between water to Srisailam and Nagarjuna Sagar would become scarce," he said.
Jagan pointed out that due to the ongoing tussle, the situation in the capital has deteriorated so much that even a small town like Coimbatore has raced Hyderabad. "Hyderabad was in third position nationally in attracting investments and going by the latest data, the city stands at 12th place now. Even Coimbatore is ranked seventh now, way ahead of Hyderabad," he said.  
Accusing Naidu of keeping quiet and not cooperating on Samaikyandhra, Jagan said that when the APNGO's employees went to Naidu and requested him to resign from the post, he blatantly said no.
He pointed out that when Naidu asked Kuppam to close their shops and homes for Jagan, he wondered if that was said for him or for Naidu. He appealed to the people of Kuppam to question Naidu, as to why the latter didn't write letters in favour of 'Samaikyandhra?'
He also urged people to question the CM on his silence over state bifurcation and his failure to pass resolutions in favour of a united AP in assembly.
Say no to the separatist designs of Sonia, others: Jagan to Kuppam
While culminating his stirring speech, Jagan instigated the crowd to say ‘no’ to the separatist designs of Sonia and Chandrababu, Kiran Kumar Reddy. He further inspired the heavy turnout asking them to change the language to express their resentment.
When Jagan asked the crowd whether they support the division of the State, the mammoth gathering rose on their toes and shouted ‘no’.
He called upon the public to carry out the same unrelenting spirit for united State till the general elections to choose representatives, who reflect their aspirations.
“We will make PM who supports united AP. We will choose our own destiny and will rule the Delhi politics,” he said.
-Siva@Sakshipost

YSRCP leader Roja's speech in Kuppam

Jagan unveils YSR statue at Vendigam palli

YS Jagan's speech in Kuppam

కుప్పంలో వైఎస్ జగన్ సమైక్య శంఖారావం photos

నిజాయితీతో కూడిన  రాజకీయాల కోసమే సమైక్య శంఖారావం  బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ సాయంత్రం జరిగిన  సమైక్య శంఖారావం  భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుప్పంలోకి ప్రవేశించిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు ఘనస్వాగతం పలికారు. జైజగన్ నినాదాలతో కుప్పం మారుమోగిపోయింది.  జగన్ సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

నిజాయతీ రాజకీయాల కోసమే సమైక్య శంఖారావం: జగన్

నిజాయతీ రాజకీయాల కోసమే సమైక్య శంఖారావం: జగన్
కుప్పం: నిజాయితీతో కూడిన  రాజకీయాల కోసమే సమైక్య శంఖారావం  బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ సాయంత్రం జరిగిన  సమైక్య శంఖారావం  భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుప్పంలోకి ప్రవేశించిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు ఘనస్వాగతం పలికారు. జైజగన్ నినాదాలతో కుప్పం మారుమోగిపోయింది.

చిత్తూరు జిల్లా ప్రత్యేకతలు తెలియజేస్తూ జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాయలు ఏలిన రతనాల సీమ - వెంకటేశ్వరుడు కొలువైన, కాణిపాకం వినాయకుడు ఉన్న నేల చిత్తూరు జిల్లా అని అన్నారు. చందమామలో  మచ్చలు ఉన్నట్లుగా మన చిత్తూరు జిల్లాకు రెండు మచ్చలు చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.  అది మన ఖర్మ అని కూడా అన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలతోపాటు అందరూ  సమైక్యంగా ఉండాలని కోరుకుంటుంటే వీరిద్దరూ విడిపోవాలని కోరుకుంటున్నారని విమర్శించారు. నిజాయితో కూడిన రాజకీయాలకు వారు దూరంగా ఉన్నారన్నారు.  సమైక్య శంఖారావం పిలుపుతో నాయకులలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రాన్ని ఎవరు విడగొడతారో చూద్దాం అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం అని పిలుపు ఇచ్చారు. ఎన్నికలు వస్తున్నాయి, 30 పైచిలుకు పార్లమెంటు స్థానాలు గెలుచుకుని  ఢిల్లీ కోటలు బద్దలు కొడదాం అన్నారు. కాంగ్రెస్ పెద్దలకు, ప్యాకేజీ అడుగున్న చంద్రబాబుకు రాష్ట్రం విడిపోతే జరిగే నష్టాలు తెలుసా? అని అడిగారు. నీటి విషయాలు చూడండి. మహారాష్ట్ర అవసరాలు తీరిన తరువాత, కర్ణాకటలోని అల్మట్టీ డ్యామ్ నిండితే గానీ మన రాష్ట్రానికి నీరు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులలో మరో రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచినీళ్లు లేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చిరించారు. మిగులు జలాలపై మనకు ఉన్న హక్కును తీసివేసే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే ఇలా ఉంటే, విడిపోతే పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించాలన్నారు. చిన్న చిన్న ఉద్యోగులు తమ సంపాదనతో హైదరాబాద్ లో ఇల్లులు కొనుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఆస్తుల విలువ పడిపోతే సోనియా గాంధీ ఇస్తారా? కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తారా? ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు నాయుడు ఇస్తారా? అని ప్రశ్నించారు. కుమ్మక్కు రాజకీయాలు చేసేది చంద్రబాబు, వేలెత్తి చూపేది జగన్ వైపు అన్నారు. ఢిల్లీ అధికారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం ఇది అన్నారు.

విదేశీయుల భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ పార్లమెంటులో ఒక బిల్లు ఆమోదిస్తే, మీ పరిస్థితి ఏమిటని సోనియా గాంధీని ప్రశ్నించారు. కలసి ఉంటున్న తెలుగువారిని విడదీయాలని మీకు ఎలా అనిపించిందని సోనియా గాంధీని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ నేతలు కల్లు తాగిన కోతుల్లా తయారయ్యారని విమర్శించారు.
విభజనకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎందుకు లేఖ ఇవ్వలేదని ప్రశ్నించారు.

బూర్గుల రామకృష్ణారావు వంటి వారు విశాలాంధ్ర కోసం పోరాడారని, పదవులు వదులుకున్నారని గుర్తు చేశారు.
చరిత్ర తెలియనివారు బలంగా ఉన్న తెలుగుజాతిని విడగొట్టాలనుకుంటున్నారని బాధపడ్డారు. తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేయడానికి రాష్ట్రాన్ని విడగొడుతున్నారని మండిపడ్డారు. తన కొడుకుని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడానికి మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగులను భయపెట్టి వారితో సమ్మె విరమింపజేశారన్నారు. అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడంలేదు? సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానం ఎందుకు ప్రవేశపట్టడంలేదు? అని కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు.  వైఎస్ హయాంలో కేంపస్ ఇంటర్వ్యూలు జరిగేవని,  ఏటా 57వేల ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు.  ప్రతి రాష్ట్రానికి వెళ్లి సమైక్యాంధ్రకు అక్కడి నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్ఫుడు ఈ రాష్ట్రం విడిపోతే, రేపు మీ రాష్ట్రాలు విడిపోయే పరిస్థితి ఏర్పడుతుందని వారికి తెలియచెబుతున్నట్లు చెప్పారు.  అభివృద్ధిలో హైదరాబాద్ పరిస్థితి దిగజారిపోతోందన్నారు. కోయంబత్తూరు కూడా హైదరాబాద్ కంటే ముందు ఉందని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులకు పరిశ్రమలు తరలిపోతున్నాయి. ఈ పరిస్థితులలో ఉద్యోగాలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. జై సమైక్యాంధ్ర, జై వైఎస్ఆర్, జై తెలుగుతల్లి అని నినాదాలు చేస్తూ జగన తన ప్రసంగాన్ని ముగించారు.

అంతకు ముందు ఆయన కుప్పం మండలం తంబుగానిపల్లెలో వైఎస్ఆర్ ఆలయాన్ని ప్రారంభించారు.

జగన్ సమక్షంలో వైఎస్ ఆర్ సీపీలోకి టీడీపీ నేతలు

జగన్ సమక్షంలో వైఎస్ ఆర్  సీపీలోకి టీడీపీ నేతలు
కుప్పం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభ పోటెత్తింది. ఈ సందర్భంగా జగన్ సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో రామకుప్పం మాజీ ఎంపీపీ, జిల్లా కురుబ సంఘం అధ్యక్షుడితో సహా పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. చంద్రబాబు కంచుకోటగా భావించే కుప్పంలో జగన్ కు అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

జగన్ రాక సందర్భంగా కుప్పంలో పోటెత్తిన జనం

జగన్ రాక సందర్భంగా కుప్పంలో పోటెత్తిన జనం
కుప్పం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రాక సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పంలో జనం పోటెత్తారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం అన్న విషయం తెలిసిందే. ఇక్కడ జగన్ సమైక్య శంఖారావం పూరించనున్నారు. సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభ కోసం జనం చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలి వచ్చారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులతో కుప్పం రోడ్లు కిక్కిరిసిపోయాయి. రోడ్లు నిండిపోవడంతో జనం జగన్ కోసం మేడలపైన, మిద్దెలపైన ఎక్కి ఎదరు చూస్తున్నారు. ఎటు చూసినా జనమే జనం.  కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.

అంతకు ముందు జగన్ కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యం వెళ్లి  అక్కడ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణవార్త విని గుండెపోటుతో మరణించిన వెంకటేష్ కుటుంబాన్ని ఓదార్చారు.  అండగా ఉంటామని జగన్ వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత  వెండిగంపల్లెలో  మహానేత వైఎస్ఆర్  విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు

Jagan leaves for Kuppam, will launch Samaikya Sankharavam Yatra

YS Jagan's Odarpu Yatra in Kuppam

వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
చిత్తూరు : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్త జీర్ణించుకోలేక అసువులు భాసిన వెంకటేష్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యం చేరుకుంటారు. అక్కడ వైఎస్ మరణవార్త విని గుండెపోటుతో మరణించిన వెంకటేష్ కుటుంబాన్ని ఓదార్చిన జగన్ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతకు ముందు తమిళనాడు సరిహద్దు క్రిష్ణగిరిలో  యువనేతకు ప్రజల  ఘన స్వాగతం పలికారు.

మరోవైపు కుప్పంలో జనం పోటెత్తారు. కార్యకర్తలు, సమైక్యవాదులతో రోడ్లు కిక్కిరిసాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. జగన్ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు.  కాగా జగన్  ఎడుంగపల్లెలో, మల్లానూరు క్రాస్‌లో మహానేత విగ్రహాలను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత కుప్పం చేరుకుని బస్డాండ్ కూడలిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అదే ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. సాయంత్రానికి గుడుపల్లె మండలం కంచిబందార్లపల్లెకు చేరుకుని లక్ష్మి కుటుంబాన్ని ఓదార్చుతారు

వైఎస్ఆర్ సిపి సమన్వయకర్తల నియామకం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ నియోజకవర్గం, శాసనసభ నియోజకవర్గం సమన్వయకర్తలను నియమించింది. కర్నూలు లోక్ సభ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా బుట్టా రేణుక, నంద్యాల శాసనసభ సమన్వయకర్తగా భూమా నాగిరెడ్డిలను నియమించారు. సూర్యాపేట  శాసనసభ  సమన్వయకర్తగా బీరవోలు సోమిరెడ్డిని, తుంగతుర్తి అసెంబ్లీ సమన్వయకర్తగా వెంకటేశ్వర్లును, ముథోల్ అసెంబ్లీ సమన్వయకర్తగా రవి ప్రసాద్ ను నియమించారు.

ఆదిలాబాద్ జిల్లా పార్టీ కన్వీనర్ గా వినాయకరెడ్డి, కరీంనగర్ జిల్లా  పార్టీ కన్వీనర్ గా సింగిరెడ్డిని నియమించారు.  తిరుపతికి చెందిన ఓవీ రమణ, ఆత్మకూరుకు చెందిన  బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వెంకటగిరికి చెందిన  పాపకన్ను రాజశేఖరరెడ్డిలను పార్టీ కేంద్ర పాలక మండలి(సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్-సిఇసి)సభ్యులుగా నియమించారు.

సమైక్యం కోసం పోరాడుతున్న ఒకే ఒక్కడు

'సమైక్యం కోసం పోరాడుతున్న ఒకే ఒక్కడు'
కాకినాడ: : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర చేపట్టారు. ఆ యాత్ర విజయవంత కావాలని తూర్పు గోదావరి జిల్లా మహిళలు శనివారం కాకినాడలో ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రసిద్ధ బాలత్రిపుర సుందరి దేవాలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు.
 
అనంతరం మహిళలు మాట్లాడుతూ.... సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వారు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి వైఎస్ జగన్ సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభించడం పట్ల వారు హార్షం ప్రకటించారు.
 
కాంగ్రెస్ పార్టీ విభజనపై మెండి వైఖరితో ముందుకు వెళ్తున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహారిస్తున్న తీరుపట్ల మహిళలు ఈ సందర్బంగా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ సమైక్యవాదం, ప్రతిపక్ష నేత చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతాన్ని ఈ సందర్బంగా తూర్పు గోదావరి జిల్లా మహిళలు ఎండగట్టారు

సమైక్య శంఖారావానికి బయల్దేరిన వైఎస్ జగన్

సమైక్య శంఖారావానికి బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం యాత్రకు బయల్దేరారు. శనివారం ఉదయం ఆయన లోటస్ పాండ్ నుంచి చిత్తూరు జిల్లాకు పయనం అయ్యారు. ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లారు. అక్కడ నుంచి కుప్పం చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కుప్పంలో జరిగే బహిరంగ సభ నుంచి జగన్ సమైక్య శంఖారావం ప్రారంభించనున్నారు.

కాగా జన హృదయనేత  వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్త విని అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించడానికి గతంలో ఓదార్పు యాత్ర చేసిన జగన్‌మోహన్‌రెడ్డి.. చిత్తూరులో ఈ యాత్ర చేయలేదు. ఇప్పుడు సమైక్య శంఖారావంతోపాటు ఓదార్పు యాత్ర కూడా నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్ కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యం చేరుకుంటారు. అక్కడ వైఎస్ మరణవార్త విని గుండెపోటుతో మరణించిన వెంకటేష్ కుటుంబాన్ని ఓదార్చుతారు.

తర్వాత ఎడుంగపల్లెలో, మల్లానూరు క్రాస్‌లో మహానేత విగ్రహాలను ఆవిష్కరిస్తారు. 2 గంటలకు కుప్పం చేరుకుని బస్డాండ్ కూడలిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అదే ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. సాయంత్రానికి గుడుపల్లె మండలం కంచిబందార్లపల్లెకు చేరుకుని లక్ష్మి కుటుంబాన్ని ఓదార్చుతారు. ఇక ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన సమయంలో ఆశించిన మేరకు జనం నుంచి స్పందన రాని నేపథ్యంలో  జగన్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బాబు పాపం.. రాష్ట్రానికి శాపం!

బాబు పాపం.. రాష్ట్రానికి శాపం!
  •  ఆనాడే ప్రాజెక్టులు నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు
  •   ఆ ప్రాజెక్టులన్నింటికీ నేడు ట్రిబ్యునల్ నీటిని కేటాయించేది
  •   కానీ బాబు తొమ్మిదేళ్ల పాలనలో  ప్రాజెక్టులను పట్టించుకోలేదు
  •   పైగా ఆయన హయాంలోనే ఎగువ రాష్ట్రాల్లో ఆలవుట్టి వంటి మెగా ప్రాజెక్టుల నిర్మాణం
  •   ఇవన్నీ విస్మరించి వైఎస్‌పై దుష్ర్పచారం
 సాక్షి, హైదరాబాద్: గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల నిర్మాణంపై అనుసరించిన వైఖరే ఇప్పుడు రాష్ట్రానికి పెనుశాపంగా మారింది! ఒకవైపు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు సమీపిస్తున్నా అప్పటి సీఎం చంద్రబాబు మిన్నకుండిపోయారు. ప్రాజెక్టులకు డబ్బుల్లేవంటూ చేతులు ముడుచుకొని కూర్చోవద్దని, వాటిని పూర్తిచేయుకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వైఎస్ అనేకమార్లు చెప్పారు. చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని హెచ్చరించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఖాతరు చేయులేదు. తీరా వైఎస్ వుుఖ్యవుంత్రి అయ్యాక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయుటానికి నడుంబిగించారు. వుహారాష్ట్ర, కర్ణాటక ఇందుకు అభ్యంతరం తెలిపాయి. కొత్త ట్రిబ్యునల్ ఎదుట ఆ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపేరుుంచాలని పట్టుబట్టారుు. 
 అప్పుడు మిగులు జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు మేం ఎలాంటి హక్కులు కోరబోవునీ, ఎలాగూ మిగులు జలాలపై వూకు స్వేచ్ఛ ఉంది కాబట్టి వాటిపై ఆధారపడే నిర్మించుకుంటావునీ వైఎస్ ప్రభుత్వం ఒక లేఖ ఇచ్చింది. ఆ తర్వాతే ఆ ప్రాజెక్టుల ప్రగతి సాధ్యమైంది. లేకపోతే వాటిని ఆరంభించడమే సాధ్యం కాకపోయేది. నాడు బాబు ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం కారణంగా నేడు ఈ పరిస్థితి నెలకొంది. ట్రిబ్యునల్ ఏర్పడే నాటికే ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి కావడమో లేక.. నిర్మాణాలు చివరి దశలో ఉండి ఉంటే.. ఇప్పుడు ఈ నష్టం జరిగేది కాదు. ప్రాజెక్టులు ఉన్నందున నీటి కేటాయింపులు వచ్చేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ఇలాగే ప్రయోజనం పొందాయి. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో తప్పిదాలు ఇంకా రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ట్రిబ్యునల్ తీర్పు కూడా అందులో ఒక భాగం!
 బాబు హయాంలోనే బాబ్లీ..
 రాష్ట్రంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు చంద్రబాబు హయాంలోనే రూపు దిద్దుకుంది. పైగా టీడీపీ ముఖ్యనేతకు చెందిన సంస్థే దాన్ని నిర్మించింది. నిర్మాణం పూర్తయ్యాక ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్టును అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. అలాగే ఎగువ కృష్ణాలో కర్ణాటక నిర్మించిన ఆలమట్టిని కూడా బాబు హయాంలోనే పూర్తయింది. దాంతో ఈ ప్రాజెక్టుకు నీటి  కోటాను పెంచుతూ ప్రస్తుత ట్రిబ్యునల్ తీర్పును వెల్లడించింది.
 ఆనాడే నిర్మించి ఉంటే...
 ప్రస్తుత బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 2004 ఏప్రిల్ 2న ఏర్పాటైంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ వైఎస్ సీఎం అయిన తర్వాత చేపట్టినవే. జలయజ్ఞం కింద మొత్తం 86 ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో ఆయన హయాంలోనే 12 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరందించారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగానే కల్వకుర్తి, నెట్టెంపాడు, గాలేరు-నగరి,  హంద్రీనీవా, వెలిగొండ, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టులను చేపట్టారు.
ఇవి ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది. వీటిలో కొన్ని ఎన్టీఆర్, చంద్రబాబు కూడా శంకుస్థాపన చేసినవి ఉన్నాయి. అయితే వాటిని నిర్మించడంలో విఫలమయ్యారు. వైఎస్ వచ్చిన తర్వాత వాటికి మోక్షం కలిగింది. గతంలోనే ఈ ప్రాజెక్టులను నిర్మించి ఉంటే.. నేడు ట్రిబ్యునల్ వీటికి నీటి కేటాయింపులను చేసేది. సాధారణంగా ట్రిబ్యున ల్ ఏర్పాటు కంటే ముందే పూర్తయిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను చేయడం ఆనవాయితీ. దాంతో రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది. 
 అయితే ట్రిబ్యునల్ మొదలైన తర్వాత వీటిని చేపట్టినందున ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరం చెప్పాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణాలను నిలుపుదల చేయించాల్సిందిగా ట్రిబ్యునల్‌పై ఒత్తిడి తీసుకువచ్చాయి. దాంతో ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడానికి వీలుగా ప్రభుత్వం వీటికి నికర జలాలను కోరబోమనే అఫిడవిట్‌ను దాఖలు చేసింది. వీటిని మిగులు జలాల ఆధారంగానే చేపట్టినందున, వరద నీటిని ఉపయోగించుకుంటామని చెప్పింది. ఇలా కాకుండా గతంలోనే ఈ ప్రాజెక్టులు పూర్తయినట్టయితే.. నేడు ట్రిబ్యునల్ వాటికీ నీటికి కేటాయించడానికి అవకాశం ఉండేది. 
 నికర జలాలంటే...
  •  కృష్ణా బేసిన్‌లో 47 సంవత్సరాల ప్రవాహాల్లో 65 శాతం నీటి లభ్యతను ఆధారంగా చేసుకొని.. బేసిన్‌లో ఏటా అందులోబాటులోకి వచ్చే జలాల పరిమాణాన్ని లెక్కిస్తారు. అవే నికర జలాలు.
  •  మిగులు జలాలు: నదీ పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడు.. సాధారణం కంటే అధిక పరిమాణంలో లభ్యమయ్యే నీటినే మిగులు జలాలు అంటారు.
  •  వరద జలాలు: వరదల సమయంలో నదిలో అధికంగా (నికర, మిగులు జలాలకు మించి) ప్రవహించే నీరు.
  •  డిపెండబిలిటీ అంటే..?: 75 శాతం డిపెండబిలిటీ అంటే.. వందేళ్లలో 75 సంవత్సరాల్లో వచ్చిన నీటి ప్రవాహం సరాసరి.

టీడీపీలో గుబులు

బాబు కోట నుంచిజగన్ శంఖారావం
=నేడు కుప్పం నుంచి సమైక్య శంఖారావం ప్రారంభం
 =వివిధ ప్రాంతాల నుంచి కుప్పం చేరుకుంటున్న అభిమానులు
 =టీడీపీలో గుబులు

 
సాక్షి, తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయు డు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెప లాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బాబు ఇలాకాలో శనివారం అతి పెద్ద బహిరంగ సభ జరుగుతోంది. దీనికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. బాబు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కుప్పంలో ఏ పార్టీ కూడా ఇంత పెద్ద బహిరంగ సభ నిర్వహించలేదు. తొలిసారిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భారీ సభ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రాక సందర్భంగా కుప్పం సరిహద్దు కాళికమ్మ ఆలయం వద్ద నుంచి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం నాయకుల్లో గుబులు నెలకొంది. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం కుప్పంలో ప్రారంభమై శ్రీకాకుళం వరకు సాగనుంది. తొలి రోజున నాలుగు చోట్ల దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు కుప్పం నియోజకవర్గం వైఎస్‌ఆర్ సీపీ సమన్వయకర్త సుబ్రమణ్యం రెడ్డి ఏర్పాట్లు చేపడుతున్నారు.

ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి జిల్లా కన్వీనర్ నారాయణస్వామి కుప్పం చేరుకున్నారు. జగన్ పర్యటన పర్యవేక్షణను టూర్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం చేపడుతున్నారు. సమైక్య శంఖారావం సభకు కుప్పం పరిసర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి కుప్పం నియోజకవర్గం వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ శ్రేణులతో నిండిపోయింది. జగన్ పైపాళెంలో ఓదార్పు ముగించుకుని వచ్చిన తరువాత సమైక్య శంఖారావం సభను బస్‌స్టాండ్ వద్ద నిర్వహిస్తారు.

దీనికోసం భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. సమైక్య శంఖారావానికి జిల్లాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో పాటు, కార్యకర్తలు, పార్టీలకతీతంగా ప్రజలు హాజరుకానున్నారు. వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి సమైక్య సభపై కుప్పం వాసులు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ సమైక్యంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, సమైక్యత కోసం కట్టుబడిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని అంటున్నారు.

చంద్రబాబు నాయుడు కుప్పంలో నీళ్లు రాకపోయినా పట్టించుకోవడం లేదని, విభజన జరిగితే అసలు నీళ్ల్లే దొరకవని ఆందోళనగా ఉందంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో కుప్పంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది

వైఎస్సార్సీపీలో చేరుతా:పలాస ఎమ్మెల్యే

పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు
 మందస, న్యూస్‌లైన్: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు బాటలో తానూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ప్రకటించారు. మందస మండలం హరిపురంలో శుక్రవారం ఆయన ముఖ్యకార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రజలు విశ్వసించే పార్టీలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నానని, ఈ విషయమై అభిప్రాయాలు చెప్పాలని కోరారు. తాము కోరుకునేదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనేనని, జైజగన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అందరూ సహకరిస్తే తనకు గుర్తింపునిచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు సాకారం చేసేందుకు మరింత కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు.


శ్రీకాకుళం: ‘మీ మాట కోసమే ఎదురు చూస్తున్నాం. వైఎస్‌ఆర్ అంటే మాకెంత అభిమానమో మీకు తెలుసు. మీకు కూడా ఆయనంటే అభిమానమని మాకు తెలుసు. మీరు ఊ కొట్టారు.. అదే చాలు..  అందరం కలిసికట్టుగా వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళదామని’ పలాస నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొన్నారు. ఇదే అభిప్రాయంతో ఉన్న ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులకు బాసటగా నిలిచారు. ఆయన చేసిన జగన్నినాదానికి కోరస్‌గా సై అన్నారు. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు వెంట వైఎస్‌ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్న జగన్నాయకులు దీనిపై కాంగ్రెస్ నేతలు, ముఖ్య కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మందస మండలం హరిపురం వద్ద కొబ్బరితోటలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. 
 
 మందసతోపాటు వజ్రపుకొత్తూరు, పలాస మండలాలకు చెందిన పీఏసీఎస్ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, ఏఎంసీ అధ్యక్షులు, పలువురు సర్పంచులు, పార్టీ మండల అధ్యక్షులు  సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన మనసులో మాట బయట పెట్టారు. రాష్ట్రాన్ని విడగొట్టాలని నిర్ణయించడం ద్వారా కాంగ్రెస్ చె య్యరాని తప్పు చేసింది. ఇక రాష్ట్రంలో ఆ పార్టీకి మనుగడ లేదు. దివంగత వైఎస్‌ఆర్ ఎంతగా ఆదరించారో నాకు తెలుసు. ఆయన కలలను సాకారం చేయడం వైఎస్‌ఆర్ సీపీతోనే సాధ్యమవుతుంది. అయితే మీ అందరి సహకారం కావాలి. మీరు ఏం చెబుతారో తెలుసుకోవాలని పిలిపించానని చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీతోనే రాజకీయ భవిష్యత్ ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆయనతో పాటే మన పయనం ఉండటం మంచిదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. 
 
 నినాదాల హోరు
 ఎమ్మెల్యే మనసలోని మాట బయటకు వచ్చిన వెంటనే సమావేశ ప్రాంగణం వైఎస్‌ఆర్ జిందాబాద్, జగన్ జిందాబాద్ అన్న నినాదాలతో మార్మోగింది. అనంతరం ప్రసంగించిన పలువురు సర్పంచులు, ఇతర ముఖ్యనేతలు ఎమ్మెల్యేకు పూర్తి మద్దతు ప్రకటించారు.  వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు మూకుమ్మడిగా ఆమోదం తెలిపారు. దీంతో పలాస నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ పూర్తిగా వైఎస్‌ఆర్ సీపీలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా ఆమదాలవలస, టెక్కలి, పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోనే ఉంటారా? పార్టీ మారుతారా? అనే అంశంపై చర్చ సాగుతున్నది. వైఎస్‌ఆర్ ద్వారా పార్టీలోకి రావడమే కాకుండా, ప్రజలకు బాగా చేరువయ్యేందుకు దివంగత వైఎస్‌ఆర్ చేపట్టిన పథకాలే ముఖ్య కారణమనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని పలువరు కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మనుగడ కోల్పోయే పార్టీలోనే ఉండి మనం కూడా మనుగడ కోల్పోదామా? లేక ప్రజలకు చేరువవుతున్న పార్టీ వైపు వెళదామా? అనే విషయంలో ఎమ్మెల్యేలు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికిప్పుడు వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళితే తమకు పదవులు దక్కవనే సందేహంలోనూ వారు ఉన్నట్లు సమాచారం. అయితే మనుగడేలేని పార్టీ కంటే అధికారంలోకి రాబోయే పార్టీలోనే ఉండటం మంచిదనే అభిప్రాయాన్ని ఎమ్మెల్యేల వద్ద వారి సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం నియోజకవర్గంలో...

కుప్పం నుంచి వైఎస్ జగన్ `సమైక్య శంఖారావం`
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే బహిరంగ సభ ద్వారా సమైక్య శంఖారావం పూరించనున్నారు. ఆయన శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి, అక్కడ్నుంచి కుప్పం చేరుకుంటారు.   ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి శుక్రవారం అనుమతి మంజూరు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కుప్పంలో జరిగే బహిరంగ సభ నుంచి జగన్ సమైక్య శంఖారావం ప్రారంభించనున్నారు. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన సమయంలో ఆశించిన మేరకు జనం నుంచి స్పందన రాని నేపథ్యంలో  జగన్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
 వైఎస్ మరణవార్త విని అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించడానికి గతంలో ఓదార్పు యాత్ర చేసిన జగన్‌మోహన్‌రెడ్డి.. చిత్తూరులో ఈ యాత్ర చేయలేదు. ఇప్పుడు సమైక్య శంఖారావంతోపాటు ఓదార్పు యాత్ర కూడా నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్ కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యం చేరుకుంటారు. అక్కడ వైఎస్ మరణవార్త విని గుండెపోటుతో మరణించిన వెంకటేష్ కుటుంబాన్ని ఓదార్చుతారు. తర్వాత ఎడుంగపల్లెలో, మల్లానూరు క్రాస్‌లో మహానేత విగ్రహాలను ఆవిష్కరిస్తారు. 2 గంటలకు కుప్పం చేరుకుని బస్డాండ్ కూడలిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అదే ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. సాయంత్రానికి గుడుపల్లె మండలం కంచిబందార్లపల్లెకు చేరుకుని లక్ష్మి కుటుంబాన్ని ఓదార్చుతారు.

రేపు కుప్పం నుంచి వైఎస్ జగన్ `సమైక్య శంఖారావం`

రేపు కుప్పం నుంచి వైఎస్ జగన్ `సమైక్య శంఖారావం`
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర చిత్తూరు జిల్లాలో శనివారం నుంచి ప్రారంభంకానుంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ సమైక్య శంఖారావం సభలు నిర్వహించడంతో పాటు వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కూడా జగన్ ఓదారుస్తారు. 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జగన్ కుప్పం నియోజకవర్గంలోని పైపాలెం గ్రామానికి చేరుకుని వెంకటేష్ కుటుంబాన్ని ఓదార్చనున్నారు.

రేపు మద్యాహ్నం ఒంటిగంటకు వెండుగంపల్లె వద్ద వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. అదేరోజు మద్యాహ్నం రెండు గంటల సమయంలో కుప్పంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళి ఆర్పించనున్నారు. ఆ తరువాత కుప్పంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేసి, ఆపై బహిరంగ సభను జగన్ ప్రారంభిస్తారు. రేపు సాయంత్రం బాబానగర్‌, లక్ష్మీపురంలో వైఎస్ జగన్ పర్యాటించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు కంచిబండార్లపల్లెలో లక్ష్మి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ ఓదార్చనున్నారు.

Jananeta YS Jagan flays State government for inaction

Written By news on Friday, November 29, 2013 | 11/29/2013

Jananeta YS Jagans Samaikya Sankaravam Official Teaser... From Kuppam

వైఎస్సార్ సీపీలో చేరిన కాంగ్రెస్ నేత బాలనాగిరెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. జిల్లా కాంగ్రెస్ నేత బాలనాగిరెడ్డి శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. బాలనాగిరెడ్డితో సహా వెయ్యి మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, పార్టీ నేతలు తోపుదుర్తి కవిత, ఆలూరు సాంబశివారెడ్డిలు హాజరైయ్యారు.  బాలనాగిరెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి వైఎస్సార్ సీపీ కండువా కప్పారు. దీంతో ఆ జిల్లాకు చెందిన మంత్రి శైలజానాథ్కు ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది.
 

Mysura Reddy press meet on 29th November 2013

ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు ఏడారిగా...

'అసమర్ధ సీఎం ఉండటం వల్లే ఈ దుస్థితి'
కర్నూలు:  ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు ఏడారిగా మారతాయని వైఎస్సార్ సీపీ నేత శోభా నాగిరెడ్డి తెలిపారు. అసమర్ధ సీఎం, నిలదీయలేని ప్రతిపక్షనేత ఉండటం వల్లే  రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందనిఆమె మండిపడ్డారు. ట్రిబ్యునల్ తీర్పుతో ..తెలంగాణ, రాయలసీమ ఏడారిగా మారే అవకాశం ఉందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకో్వాలని ఆమె సూచించారు. ట్రిబ్యునల్ పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
 
ఆంధ్రప్రదేశ్ విద్యుత్, సాగునీటి కష్టాలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. కృష్ణానది నీటి కేటాయింపులపై ఏర్పాటైన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు వ్యతిరేకంగానే ఉండే అవకాశముందనే వార్తలు ఊపందుకున్నాయి. ఒకవేళ ట్రిబ్యునల్ తీర్పు ఆంద్రప్రదేశ్ కు వ్యతిరేకంగా ఉంటే తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు ఎడారిగా మారే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు.
 

చంద్రబాబు ఆ ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకోలేదు

'బాబు నిర్లక్ష్యం వల్లే ఏపీకి అన్యాయం'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: కర్ణాటకలో అక్రమ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసమర్ధతే కారణమని వైఎస్సార్ సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. 1997 నుంచి 2003 వరకూ అక్రమ ప్రాజెక్టులను కర్ణాటక నిర్మించిన విషయాన్ని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ కాలంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆ ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకోలేదని మండిపడ్డారు. కర్ణాటకలో ప్రాజెక్ట్‌లను నిర్మించకుండా అడ్డుకోవడానికి బాబు ఏం చేశారో తెలపాలని నిలదీశారు. చంద్రబాబుకు ఆనాడు రైతుల పట్ల శ్రద్ధ లేకపోవడమే నేటి దుస్థితికి కారణమని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
 
మిగిలిన జలాలపై హక్కు ఉందని వైఎస్ రాజశేఖర రెడ్డి లేఖ రాయలేదని, రాష్ట్రంలో ప్రాజెక్టులను అడ్డుకుంటారనే అప్పట్లో లేఖ రాశారన్నారు. తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికే టీడీపీ ఈ ఆరోపణలకు దిగుతోందన్నారు.ఇప్పటికైనా నీటి కోసం పోరాటనికి కలిసి రావాలని టీడీపీకి విజ్ఞప్తి చేశారు.

Popular Posts

Topics :