01 December 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Vasi Reddy Padma press meet on 7th December 2013

Written By news on Saturday, December 7, 2013 | 12/07/2013

Shobha Nagi Reddy press meet on 7th December 2013

సిఎం కిరణ్ గారూ సర్వేలు చూసి భయపడుతున్నారా?

సిఎం కిరణ్ గారూ సర్వేలు చూసి భయపడుతున్నారా?: గట్టు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారూ సర్వేలు చూసి భయపడుతున్నారా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన రెడ్డిని ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలను గట్టుతోపాటు వైఎస్ఆర్ సిపి నాయకురాళ్లు శోభానాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ ఖండించారు. ఇప్పుడొచ్చిన ఈ ఆవేశం నాలుగు నెలల క్రితం ఏమైందని అడిగారు.

 సమైక్యం కోసం మీరు చేసిందేమిటి? అని సీఎంను ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి‌, చంద్రబాబు నాయుడు ఇద్దరూ సమైక్య చీడపురుగులని వారు విమర్శించారు.

నిరాశపడవలసిన అవసరంలేదు

నిరాశపడవలసిన అవసరంలేదు: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: రాష్ట్ర విభజన అయిపోయిందని ఎవరూ నిరాశపడవలసిన అవసరంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లవలసిన సమయం ఇదేనన్నారు.

చేయవలసినంత పాపం చేసి ఇప్పుడు విభజన అయిపోయింది, ఇక తాము అడ్డుకోలేం అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని విమర్శించారు. ఒక పక్క అందరూ ఒప్పుకున్న తరువాతే సిడబ్ల్యూసి నిర్ణయం జరిగిందని అధిష్టానం నేతలు చెబుతున్నారని, మరో పక్క కాంగ్రెస్ మోసం చేసిందని ఇక్కడి నేతలు చెప్పడం  విడ్డూరంగా ఉందన్నారు.  అధిష్టానం కనుసన్నల్లో ఉంటామని చెప్పిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఇలా మాట్లాడటం ఎవరిని మోసం చేయడానికి అని అడిగారు.వారి మాటల్లో విశ్వసనీయత లేదని విమర్శించారు. సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న తరువాత ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామాలు చేయలేదు అని ప్రశ్నించారు. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న ఓ పెద్ద డ్రామా అన్నారు.

చంద్రబాబు నాయుడు  విభజన జరగాలి, న్యాయం జరగాలి అంటారు. సమైక్యత అనే మాటే ఆయన ఎత్తరని విమర్శించారు. టిడిపి నేతలు చంద్రబాబు ఫొటో పెట్టుకొని తెలంగాణలో ఒక విధంగా, సీమాంధ్రలో ఒక విధంగా వ్యవహరిస్తున్నారన్నారు.

సమైక్యం కోసం ఏం చేస్తున్నారు?

సమైక్యం కోసం ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం కాంగ్రెస్, టీడీపీలు ఒక్క ప్రయత్నమైనా చేస్తున్నాయా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర సమైక్యత కోసం తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పార్టీల నేతలను కలవడంతో పాటు అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలను, ముఖ్యమంత్రులను కలసి మద్దతు కూడగడుతుంటే... ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ నేతలు కలసి ఒకే మాటను వల్లెవేస్తూ తమపై బురద చల్లుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గమైన చర్యలను తిప్పికొట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఆ పనిచేయకపోగా కొబ్బరికాయ సలహాలిస్తూ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. జూలై 30న సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన తర్వాత నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలని చంద్రబాబు అడగటం, అదే లైన్‌లో కేంద్రం ముందుకెళ్లడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
 
 పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జూపూడి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు తెలుగు ప్రజల మనోభావాలను గాలికొదిలేసి సిగ్గులేకుండా సొల్లుకబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందంటూ దొంగ ఏడుపు ఏడుస్తున్న లగడపాటి రాజగోపాల్ ఇంకా అదే పార్టీలో ఎందుకు కొనసాగుతున్నట్లని సూటిగా ప్రశ్నించారు. వారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆపార్టీకి రాజీనామా చేయడంతో పాటు వెంటనే రాష్ట్రపతి వద్దకెళ్లి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
 
 బంద్‌కు బాబు మద్దతెందుకివ్వలేదు: వాసిరెడ్డి పద్మ
రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ, దీనివల్ల నష్టపోయే ప్రాంతాల్లో జరుగుతున్న బంద్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు మద్దతివ్వలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. విభజనవల్ల సీమాంధ్ర ప్రాంతానికి నష్టం జరగడంలేదని బాబు భావిస్తున్నారా? విభజనను సమర్థిస్తున్నారా? అని అడిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బంద్‌ను విజయవంతం చేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను అడ్డుపెట్టుకొని  కృష్ణానదీ మిగులు జలాలు దక్కకుండా చేసిన సోనియాగాంధీ చర్యలను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని తమ అధినేత జగన్ నిర్ణయించారని చెప్పారు.

నేడు పులివెందులకు విజయమ్మ

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ శనివారం పులివెందులకు రానున్నారు. అందుకు సంబంధించి పర్యటన దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శనివారం ఉదయం పులివెందులలో జరిగే వైఎస్ జార్జిరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే విజయమ్మ పాల్గొని జార్జిరెడ్డి విగ్రహం వద్ద నివాళులు అర్పించి, అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్థానికంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం.

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గొట్టిపాటి నరసయ్య కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గొట్టిపాటి నరసయ్య కన్నుమూత
పర్చూరు : మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి నరసయ్య (51) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న నరసయ్య ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

రేపు ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా యద్దనపూడిలో అంత్యక్రియలు జరుగుతాయి. నరసయ్య 1997 ఉపఎన్నికల్లో, 1999 ఎన్నికల్లో మార్టూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన తండ్రి గొట్టిపాటి హనుమంతరావు సీనియర్ రాజకీయవేత్తగా, మంత్రిగా పనిచేశారు. తండ్రి మరణానంతరం 97 ఉపఎన్నికల్లో నరసయ్య గెలుపొందారు.

చంద్రబాబు విజిల్ వేస్తున్నారు

Written By news on Friday, December 6, 2013 | 12/06/2013

చంద్రబాబు విజిల్ వేస్తున్నారు: అంబటి
ఏలూరు: రాష్ట్రం చీలిపోదని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు ఇప్పుడేం సమాధానం చెబుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. సిగ్గుంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేయాలని, అప్పుడే విభజన ఆగిపోతుందన్నారు. ఏలూరు మండలం తంగెళ్లమూడిలో శుక్రవారం నిర్వహించిన దెందులూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడి విభజన పక్రియ ఆగదా అని ప్రశ్నించారు. ఓట్లు- సీట్లు రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న విభజన  ఆటకు రెండు కళ్ల సిద్ధాంతం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విజిల్ వేస్తున్నారని దుయ్యబట్టారు. విభజన పక్రియను ఆపేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పార్టీ నేతలను కలుస్తుంటే.. చంద్రబాబు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విభజన జరగనీయబోమంటూ టీవీల్లో షో ఇస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వమని ప్రగల్భాలు పలికిన కావూరి, చిరంజీవి మంత్రి పదవులు రాగానే కిమ్మనకుండా ఉండిపోయారని విమర్శించారు. విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన లగడపాటి రాజగోపాల్ తన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడం లేదంటూ నాటకాలు ఆడుతున్నాడని దుయ్యబట్టారు. సమావేశంలో వైసీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైసీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్తలు పీవీ రావు, అశోక్‌గౌడ్, కొఠారు రామచంద్రరావు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

సీమాంధ్ర బంద్ విజయవంతం

రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సీమాంధ్రలో తలపెట్టిన బంద్ విజయవంతమైంది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్ ను విజయవంతం చేశారు. బస్సులన్నీ డిపోలకే పరిమితం అయిపోయిపోగా, దుకాణాలు కూడా మూతబడ్డాయి. విభజన ప్రక్రియను ఆపేవరకు తమ పోరాటం ఆపేది లేదని నాయకులు, ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

బంద్ ను పొడిగించిన వైఎస్సార్ సీపీ

బంద్ ను పొడిగించిన వైఎస్సార్ సీపీవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజించాలని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా చేపట్టిన బంద్ ను రేపటి్కి వరకు పొడిగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రజల ఆకాంక్ష మేరకు రేపు కూడా బంద్ కు వైఎస్ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. జగన్ పిలుపు మేరకు నేడు నిర్వహించిన బంద్ విజయవంతమయింది.
 
 విభజన వల్ల నష్టపోయే ప్రాంత ప్రజలంతా మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్ ను విజయవంతం చేశారు. ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. విభజన ప్రక్రియను ఆపేవరకు తమ పోరాటం ఆపేది లేదని నాయకులు, ప్రజలు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీలు నాయకులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే ఊరుకోబోమని ఆందోళనకారులు హెచ్చరించారు.

అడ్డుకోకపోతే, ఇతర ప్రాంతాలకు ఇదే పరిస్థితి: వైఎస్ జగన్

అడ్డుకోకపోతే, ఇతర ప్రాంతాలకు ఇదే పరిస్థితి: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
లక్నో :
రాష్ట్ర విభజన అంశంపై సమాజ్ వాదీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మద్దతును కోరేందుకు వచ్చానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అర్టికల్ 3 సవరణ గురించి తాము చర్చించామని వైఎస్ జగన్ తెలిపారు. విభజన అంశానికి వ్యతిరేకంగా తాము వెల్లడించిన అభిప్రాయాలకు అఖిలేష్ మద్దతించినందుకు ధన్యవాదాలు అని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తో ప్రారంభమైన అడ్డగోలు విభజన అన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంది అని జగన్ హెచ్చరించారు. 
 
అసెంబ్లీలో తీర్మానం చేయకుండా రాష్ట్రాన్ని విభజించడం మంచి సాంప్రదాయం కాదు అని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ తీర్మానం చేయకుండా ఓ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం అని అన్నారు.  అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన అంశం ఢిల్లీ చేతికి అప్పగిస్తే అనేక అనర్ధాలకు దారితీసే ప్రమాదం ఉంది, ఇతర ప్రాంతాలకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది అని ఆయన అన్నారు.
 
ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు విభజనను అడ్డుకోవడానికి ముందుకు రావాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టే అంశంపై బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతోపాటు అన్ని పార్టీల మద్దతు కోరుతున్నాం అని వైఎస్ జగన్ తెలిపారు. 

Kostha area MP seats-NTV Nielsen Survey

Total MP seats- 17

YSRCP- 12-16

TDP-  0-2  (no guarentee)

CONGRESS_  0-2 (no guarentee)


YSRCP will win 87-95 seats in Kostha area- NTV Nielsen Survey

toatal seats-123

congress  4-7 seats

tdp- 23-27 seats

ysrcp - 87-95

ప్రజలు కోరుకుంటున్న ముఖ్యమంత్రి - ఎన్ టి వి నీల్సన్ సర్వే

48% people in kostha area wanted YS Jagan as CM

తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తాం: అఖిలేష్ యాదవ్

తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తాం: అఖిలేష్ యాదవ్వీడియోకి క్లిక్ చేయండి
లక్నో :
చిన్న రాష్ట్రాలకు సమాజ్ వాదీ పార్టీ వ్యతిరేకం అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు తాము పూర్తిగా వ్యతిరేకం అని అఖిలేష్ తెలిపారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టే తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తాం అని ఆయన అన్నారు.
యూపీ నుంచి ఉత్తరాంచల్ విడిపోయినా ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.  చిన్న రాష్ట్రాలతో సమస్యలు పరిష్కారం కావు ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సుదీర్ఘ అనుబంధం ఉంది అని.. రాజకీయాలకు అతీతంగా మా స్నేహం కొనసాగుతుంది అఖిలేష్ అన్నారు. 

లక్నోలో వైఎస్ జగన్ కు ఘనస్వాగతం

లక్నోలో వైఎస్ జగన్ కు ఘనస్వాగతం
లక్నో: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లక్నోలో ఘన స్వాగతం లభించింది. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ తో భేటీ నేపథ్యంలో జగన్ శుక్రవారం లక్నోకు చేరుకున్నారు.ఆయనకు లక్నో ఎయిర్ పోర్టులో యూపీ తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో రాజ కీయ పక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను కలవనున్నారు.
 
ఈ మేరకు ఆయన శుక్రవారం మధ్యాహ్నం 12 గం.లకు హైదరాబాద్ లో బయలదేరి లక్నోకు చేరుకున్నారు.మరి కాసేపట్లో అఖిలేశ్ యాదవ్‌తో సమావేశమవుతారు.

చంద్రబాబూ..మీ నోరు ఎందుకు మూతబడింది?

చంద్రబాబూ..మీ నోరు ఎందుకు మూతబడింది?వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్:రాష్ట్ర విభజనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపడం లేదని వైఎస్సార్ సీపీ నేత వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపిన నేపథ్యంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ సీమాంద్ర బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. తమ పార్టీ చేపట్టిన బంద్ విజయవంతమైందని ఆమె తెలిపారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న బాబు బంద్ విషయంలో వెనుకంజ వేయటాన్ని ఆమె నిలదీశారు. సీమాంధ్రలో తలపెట్టిన బంద్ పై బాబు ఎందుకు స్పందించడం లేదని పద్మ ప్రశ్నించారు.
 
చంద్రబాబు  నోరు మూతపడటానికి కారణాలేంటో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.  ప్రజల భాగస్వామ్యంతో బంద్ సంపూర్ణంగా జరిగిందన్నారు. కృష్టా జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును తప్పకుండా ఆశ్రయిస్తామన్నారు.

దమ్ముంటే కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయాలి

'దమ్ముంటే కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయాలి'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి తాము వ్యతిరేకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. కేబినెట్ నిర్ణయం రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగిస్తోందని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్రలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపుకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు.
విజభనను అడ్డుకోవాల్సిన టీడీపీ నేతలు తమను విమర్శించటం ఎంత వరకూ సబబు అని జూపూడి ప్రశ్నించారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇంకా పార్టీలో ఎందుకున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు. చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని సూచించారు.

రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లోని 13 జిల్లాల్లో బంద్ ఉధృతంగా ...

హైదరాబాద్ : రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్ర జిల్లాల ప్రజలు రగిలిపోతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం బంద్ పాటిస్తున్నారు. విద్యర్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు.

రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లోని 13 జిల్లాల్లో బంద్ ఉధృతంగా జరుగుతోంది. విద్యా సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీస్ బస్సులను ఎక్కడిక్కడ నిలిపివేశారు. రహదారులను దిగ్భంధించారు. ప్రజలు స్వచ్ఛంధంగా తరలివచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సీమాంధ్రకు అదనపు బలగాలను తరలించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీమాంధ్రలో జరుగుతున్న బంద్ దృశ్యాలు..

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తిరుపతిలో విద్యార్థినుల ఆగ్రహం
తిరుపతి పట్టణంలో భద్రత బలగాల కవాతు
అనంతపురంలో దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భద్రత

కడపలో బంద్ చేస్తున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
కడపలో ఆపేసిన ఆర్టీసీ బస్సులు
గుంటూరులో రోడ్డుపై బైఠాయించిన  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
నిర్మానుషంగా ఉన్న గుంటూరు బస్టాండు
 నెల్లూరు నగరంలో బంద్ దృశ్యం 
నెల్లూరులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బైక్ ర్యాలీ
ఒంగోలులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు
ఒంగోలు బస్టాండ్ లో నిర్మానుష వాతావరణం

Jupudi Prabhakar Rao press meet on 06-12-13

గడప గడపలో ఒకే నినాదం వైఎస్సార్ కాంగ్రెస్‌

మీ ఆడపడుచును ఆదరించండి
పుత్తూరు రూరల్, న్యూస్‌లైన్ : ‘మీ ఆడపడుచుగా భావించి నన్ను ఆదరించండి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యురాలు ఆర్.కె.రోజా కోరారు. ఆమె గురువారం గేట్‌పుత్తూరు 5వ వార్డులో గడప గడపలో ఒకే నినాదం వైఎస్సార్ కాంగ్రెస్‌ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. రెండవ రోజు ఆమెకు మహిళలు అఖండ స్వాగతం పలికారు. ఆమెకు శాలువలు కప్పి పూలమాలలు వేసి సన్మానించారు.

ఈ సందర్భంగా రోజా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారం వైఎస్సార్ కాంగ్రెస్ ద్వారానే సాధ్యమన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. తెలుగు జాతిలో చిచ్చు పెట్టి వేడుక చూస్తోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ సమైక్య నినాదంతో ముందుకెళుతోందన్నారు.

జగనన్న ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా 5వ వార్డులో మురుకులు కాలుస్తూ తమను ఆదరించాలని అభ్యర్థించారు. జిల్లా కన్వీనర్ కళత్తూరు నారాయణస్వామి మాట్లాడుతూ ప్రజలు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. నగరి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య వాదని, సమైక్య నినాదంతో ముందుకు వెళుతున్నారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దేశంలోని అన్ని పార్టీల నాయకులు, అధ్యక్షుల మద్దతు కూడగడుతున్నారని తెలిపారు.

సమైక్యవాది ఎవరైనా ఉన్నారంటే ఒక్క వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు ఇస్తూ, విభజన వాదానికి ఆజ్యం పోసిన మూలకారకుడు చంద్రబాబని ఆరోపించారు. అధిష్టానం ఆదేశాల మేరకు రోజుకొక ప్రకటన చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని రాయలసీమ ప్రజలు క్షమించరన్నారు. బ్రదర్ అనిల్‌కుమార్ తండ్రి మృతిపై సంతాపం తెలియజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు రోజా ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు.

నెల్సన్ మండేలా మృతి వైఎస్ జగన్ తీవ్ర సంతాపం


హైదరాబాద్ : తెల్లవారి గుండెల్లో ప్రచండాగ్నులు రగిలించిన నల్లసూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు.

భారత జాతి పిత మహాత్మ గాంధీ బోధించిన అహింస, శాంతియుత విధానాలు తనకు స్ఫూర్తినిచ్చాయని తరచు చెప్పడమే కాక, వాటిని పక్కాగా పాటించిన నెల్సన్ మండేలా అంతటి మహోన్నత వ్యక్తికి నివాళులర్పించడానికి అక్షరాలు రావట్లేదని, కేవలం అశ్రువులే వస్తున్నాయని జగన్ తెలిపారు.

Rayalaseema loksabha seats-Ntv survey

Written By news on Thursday, December 5, 2013 | 12/05/2013


YSRCP will win 39-44 seats in Rayalaseema- NTV Survey

NTV Survey



https://www.facebook.com/photo.php?fbid=10152039529530699&set=a.10151068008785699.465714.676235698&type=1&theater

Popular Posts

Topics :