12/21/2013
Jagan Mohan Reddy birthday celebrations in Begumpet
Written By news on Saturday, December 21, 2013 | 12/21/2013
12/21/2013
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరులో శనివారం సమైక్య శంఖారావం సభను ఏర్పాటు చేశారు. ఈ శంఖారావం సభలో పాల్గొన్న ఆదినారాయణరెడ్డి, జగన్ నాయకత్వంలో రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని చెప్పారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి కూడా ఈ సభలో పాల్గొన్నారు.
కాగా, రాష్ట్ర విభజన పాపం కిరణ్, చంద్రబాబులదేనని వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని.. దేశవ్యాప్తంగా ఆలోచింప చేసిన వ్యక్తి ఒక్క జగన్ మాత్రమేనని తెలపారు.
జగన్ ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారు

కాగా, రాష్ట్ర విభజన పాపం కిరణ్, చంద్రబాబులదేనని వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని.. దేశవ్యాప్తంగా ఆలోచింప చేసిన వ్యక్తి ఒక్క జగన్ మాత్రమేనని తెలపారు.
12/21/2013
హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం పోరాడటమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజుకు ఇచ్చే కానుక అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీస్తే తెలుగుజాతి బలహీనపడిపోతుందని తెలిపారు. తెలుగుజాతి బలహీనపడకూడదని పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రతిమాట కూడా భారత దేశంలో చర్చనీయాంశం అవుతోందన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఊరుకోబోమని గట్టు అన్నారు. జగన్ జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు మాట్లాడారు. రాష్ట్రం నుంచి నీచ రాజకీయాలను పారద్రోలడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతపురంజిల్లా కదిరిలో జగన్ జన్మదిన వేడుకలు పూలవ్యాపారస్తులు ఘనంగా నిర్వహించారు. వేమారెడ్డి సర్కిల్‌లో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత జక్కల ఆదిశేషు పాల్గొని కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పేదలకు, వృద్దులకు బట్టలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం యువతకు ఆదర్శమని చెప్పారు
సమైక్యాంధ్ర పోరాటమే జగన్ కు ఇచ్చే కానుక

న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఢిల్లీ ఏపీ భవన్‌లో శనివారం ఘనంగా జరిగాయి. యువతకు చిహ్నం వైఎస్ జగన్ అని మన్యసీమ ఉద్యమ నేత చందా లింగయ్య దొర అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్‌ఆర్ తనయుడికి బ్రహ్మరథం పడుతున్నారని ఆయన తెలిపారు. జగన్ కు ఎదురొడ్డి నిలిచేవారికి భవిష్యత్తు ఉండదని పార్టీ అభిమానులు అన్నారు.
ఇక హైదరాబాద్‌లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయాన్ని పూలతో అలంకరించారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్న పార్టీ కార్యకర్తలు, వైఎస్‌ఆర్ అభిమానులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Jagan birthday celebrations in AP bhavan
ఇక హైదరాబాద్‌లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయాన్ని పూలతో అలంకరించారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్న పార్టీ కార్యకర్తలు, వైఎస్‌ఆర్ అభిమానులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
12/21/2013
ఏవైనా డిమాండ్లను సాధించాలంటే అందుకు చాలా మార్గాలుంటాయి. కానీ, గాంధీ మహాత్ముడు చూపిన మార్గం.. అహింసాయుత దీక్ష. ఈ దీక్షనే ఆయుధంగా చేసుకుని బాపూజీ అనేక విజయాలు సాధించారు. ఆ స్ఫూర్తిని యువనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిపుచ్చుకున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఆయన దీక్షలనే మార్గంగా ఎంచుకున్నారు. ముందుగా 2010 డిసెంబర్ 21, 22 తేదీలలో విజయవాడలో లక్ష్యదీక్ష చేశారు. రైతులు, చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ 48 గంటలపాటు నిరవధిక నిరాహారదీక్షను ఆయన చేపట్టారు. సీతమ్మవారి పాదాల వద్ద ఇసుక తిన్నెలపై లక్ష్య దీక్ష పేరిట ఆయన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జగన్ తో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రైతుల సమస్యలపై హస్తినాపురి వేదికగా జల దీక్ష చేపట్టారు. 2011 జనవరి 11వ తేదీన ఆయన ఈ దీక్ష చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆయన చేపట్టిన దీక్షను రాత్రి 8.30 గంటల వరకు అనుమతించిన పోలీసులు, ఆ తర్వాత ఆయన్ను అరెస్టు చేశారు. అరెస్టుకు సహకరించకపోతే లాఠీచార్జిలో రైతులు కూడా గాయపడతారన్న ఉద్దేశంతో జగన్ వెంటనే అరెస్టయ్యారు. తర్వాత ఆయనను విడుదల చేశారు.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, నిర్మాణాన్ని పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జగన్ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి 2011 ఫిబ్రవరి ఏడో తేదీన పాదయాత్రను ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు సాగిన ఈ పాదయాత్ర పదో తేదీన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగే ప్రాంతంలో ముగిసింది. ఈ యాత్రకు హరిత యాత్రగా నామకరణం చేశారు.
రాష్ర్టంలో నిత్యావసరాల ధరలు మండిపోతున్నా ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. దీనికి తోడు కేద్రం పెట్రోలు ధర పెంచి, సామాన్యుడి నడ్డి విరిచింది. దీనిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ‘తూర్పుతీరం’లో ఓ పక్క సాగరం మరో పక్క జనసాగరం వెంట ఉండగా 2011 జనవరి 22న విశాఖపట్నం రామకృష్ణా బీచ్‌లో లక్షలాది అభిమానుల సమక్షంలో ‘జనదీక్ష’ నిర్వహించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ జగన్ హైదరాబాద్ నడిబొడ్డున నిర్వహించిన ఫీజు పోరుకు విద్యార్థి లోకం యావత్తు మద్దతు పలికింది. హైదరాబాద్ నడిబొడ్డున ధర్నాచౌక్‌లో 2011 ఫిబ్రవరి 18న లక్షల మంది విద్యార్థుల సాక్షిగా జగన్ ‘ఫీజుపోరు’ను ప్రారంభించి వారం రోజుల పాటు నిర్విఘ్నంగా నిర్వహించారు. ఆకలిదప్పులను తట్టుకొని అభిమానుల అండదండలే ప్రాణంగా దీక్ష చేపట్టిన జననేత ఏడవ రోజు దీక్ష విరమించారు. మరణించిన ఇంజినీరింగ్ విద్యార్థిని వరలక్ష్మి తల్లిదండ్రులు గుండె జంగయ్య, లక్ష్మమ్మ జగన్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.
తుఫానులు, వరదలతో రైతన్న నడ్డి విరిగిపోయింది. 2010 డిసెంబరు తొలివారంలో వచ్చిన తుఫాను కారణంగా 16 జిల్లాల్లో 27 లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది. 23.19 లక్షల మంది రైతులు రూ.3000 కోట్ల మేర నష్టపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన గుంటూరు రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు చేతికి అందిన పంటను నడిరోడ్డుపై వేసి తగలబెట్టారు. తనను పట్టించుకునే నాయకుడు లేడని విలవిల్లాడుతున్న అన్నదాతకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు. రైతు పడుతున్న వేదనను ప్రభుత్వానికి తెలియజెప్పేందుకు గుంటూరు వేదికగా 2011, మే 15, 16 తేదీల్లో మెతుకు ముట్టకుండా నిరాహార దీక్ష నిర్వహించారు.
ఇక అధికారపార్టీ కుట్ర కారణంగా 16 నెలల పాటు కారాగార వాసం అనుభవించాల్సి వచ్చినా కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమమే ఊపిరిగా జననేత ముందుకు దూకారు. రాష్ట్ర విభనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తన విధానం ప్రకటించడంతో బయట ఉన్న నాయకులెవ్వరూ పట్టించుకోకపోయినా.. కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జగన్ 2013 అక్టోబర్ ఐదో తేదీ ఉదయం నుంచి చంచల్‌గూడ జైలులో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఐదు రోజుల పాటు నిరాఘాటంగా ఆయన దీక్ష కొనసాగింది. ఆరోగ్యం క్షీణిస్తోందని, ఘనపదార్థాలు తీసుకోవాలని వైద్యులు చెప్పినా, ఆయన ససేమిరా అనడంతో పోలీసులు జగన్ ను బలవంతంగా తొమ్మిదో తేదీ రాత్రి తొలుత ఉస్మానియా ఆస్పత్రికి, తర్వాత నిమ్స్ కు తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించారు.
ప్రజల కోసం, ప్రజల మధ్య, ప్రజలతోనే ఉంటూ ప్రజానాయకుడిగా వారి గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సాక్షి చెబుతోంది.. హేపీ బర్త్ డే.
దీక్షా దక్షుడు.. లక్ష్య సాధకుడు

12/20/2013
YSRCP MLA Srikanth Reddy press meet on 20-12-13
Written By news on Friday, December 20, 2013 | 12/20/2013
12/20/2013
అఫిడవిట్లపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల సంతకాలు
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి, స్పీకర్, సుప్రీంకోర్టుకు 'సమైక్య' అఫిడవిట్లు సమర్పించనున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి అఫిడవిట్లు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అఫిడవిట్లు సమర్పించేందుకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరారు. ఈ నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమైక్య అఫిడవిట్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అఫిడవిట్లు ఇవ్వడానికి ఎమ్మెల్యేలందరూ ముందుకు రావాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిన్ని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ఇందుకు ముందుకు రావాలని వారిని కోరారు. శీతకాల విడిది కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 31 వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు.

హైదరాబాద్: సమైక్య పరిరక్షణ వేదిక ఈ నెల 21న ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఈ మేరకు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుకు వైఎస్‌ఆర్ సీపీ నేత మైసూరారెడ్డి లేఖ రాశారు. అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
విలువలు, విశ్వసనీయత కలిగిన రాజకీయాలను అనుసరించే పార్టీగా... తమ పార్టీ రెండు పడవల మీద ప్రయాణాన్ని వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో, పార్లమెంట్‌లో ప్రాంతాలవారీగా సభ్యుల్ని ఎగదోస్తున్న కాంగ్రెస్, టీడీపీలను చూస్తూనే ఉన్నామని తెలిపారు. సమైక్యవాదానికి కట్టుబడని ఆ పార్టీలతో తాము వేదిక పంచుకోబోమని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఇలాంటి సమావేశాలను హర్షించరని లేఖలో పేర్కొన్నారు.
ఆ పార్టీలతో వేదిక పంచుకోం: మైసూరారెడ్డి

విలువలు, విశ్వసనీయత కలిగిన రాజకీయాలను అనుసరించే పార్టీగా... తమ పార్టీ రెండు పడవల మీద ప్రయాణాన్ని వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో, పార్లమెంట్‌లో ప్రాంతాలవారీగా సభ్యుల్ని ఎగదోస్తున్న కాంగ్రెస్, టీడీపీలను చూస్తూనే ఉన్నామని తెలిపారు. సమైక్యవాదానికి కట్టుబడని ఆ పార్టీలతో తాము వేదిక పంచుకోబోమని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఇలాంటి సమావేశాలను హర్షించరని లేఖలో పేర్కొన్నారు.
12/20/2013
Jagan Mohan Reddy
చేతులు జోడించి సవినయంగా విన్నపం చేస్తున్నాను.
ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను చూసినప్పుడు ఇలాంటి అవసరం ఎంతైనా ఉందనిపిస్తోంది. అందుకే ఇంత గట్టిగా విన్నపం చేయాల్సి వ స్తోంది’’ అని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రపతి ఎక్కడో ఢిల్లీలో లేరు. మన దగ్గరే ఉన్నారు. అఫిడవిట్‌ను కూడా తయారు చేశాం (కాపీని చూపించారు). సమైక్యానికి అనుకూలంగా ప్రతి ఒక్కళ్లం పార్టీలకు అతీతంగా సంతకాలు పెడదాం’’ అంటూ ఆహ్వానించారు. సమైక్యం కోసం తాము చివరి రోజు, చివరి నిమిషం, చివరి క్షణం దాకా పోరాడతామని ప్రకటించారు. ‘‘నిజాయితీతో, చిత్తశుద్ధితో గట్టిగా పోరాడతాం. పారదర్శకంగా కనిపిస్తాం. విడిపోతే తెలుగు జాతి విచ్ఛినమవుతుంది. మన రాష్ట్రం 1.75 లక్షల కోట్ల బడ్జెట్‌తో దేశంలో మూడో స్థానంలో ఉంది. విడిపోతే ఏర్పడే రాష్ట్రాల్లో ఒకటి 8, మరోటి 13వ స్థానానికి దిగజారుతాయి. ఉద్యోగాల యువత ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితి. రైతన్నకు నీళ్లందక ఎటు వైపు చూడాలో తెలియని పరిస్థితి వస్తాయి. విడిపోతే రెండు రాష్ట్రాలూ నాశనం అవుతాయి. ఎప్పుడైనా మహానగరం, సముద్ర తీరం ఒక్కటిగా ఉంటేనే.. ఎయిర్‌పోర్టు, సీపోర్టులు కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. వాటిని విడగొట్టిన రోజున ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రం మొత్తం నాశనమవుతుంది’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు.
పార్లమెంటులో పరువు తీశారు
తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి, ఇన్నేళ్లుగా రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు సమైక్యంపై గొంతు ఎందుకు పెగలడం లేదని ప్రశ్నించారు. ‘‘బాబును నేనివాళ అడగదల్చుకున్నా. రైతన్న తనకు నీళ్లు లేవని, ఎక్కడికి వెళ్లాలని అడుగుతుంటే మీరెందుకు పలకడం లేదు? చదువుకున్న పిల్లాడు తాము ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలని అడుగుతుంటే పలకడం లేదేం?’’ అంటూ తూర్పారబట్టారు. పార్లమెంటు సమావేశాల్లో కొన్ని పార్టీల తీరు చూసి బాధనిపించిందని టీడీపీని ఉద్దేశించి జగన్ చెప్పారు. ‘‘చంద్రబాబు తన ఎంపీల్లో నలుగురిని (సీమాంధ్ర) ఒకవైపు, ఇద్దరిని (తెలంగాణ) మరోవైపు పెట్టారు. సమావేశాల చివరి రోజైతే బాబు నిర్వాకం చూసి నిజంగా బాధనిపించింది. ఆయన ఎంపీల్లో నలుగురు, కాంగ్రెస్‌కు చెందిన మరో నలుగురైదుగురు, మేం ముగ్గురం వెల్‌లోకి వెళ్లాం. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతూ, అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేయసాగాం.
కానీ బాబుకు చెందిన మరో ఇద్దరు ఎంపీలు (తెలంగాణ) నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్ కలిసి రాలేదు. పైగా వచ్చిన వారిని కూడా, మీరెందుకు పోతున్నారంటూ తిట్టసాగారు. టీడీపీ తాలూకు ఈ వైఖరిని చూసి స్పీకర్ నవ్వారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా నవ్వారు. మన రాష్ట్రానికి చెందిన పార్టీలే ఒక వైఖరనేదే లేకుండా ఇలా మనల్ని మనమే పలుచన చేసుకునే పరిస్థితుల్లోకి నెట్టిన బాబు తీరు చూసి ఎంతో బాధనిపించింది’’ అంటూ జగన్ ఆవేదన వెలిబుచ్చారు. అసెంబ్లీలో కూడా బాబు, టీడీపీ వ్యవహరించిన తీరులో ద్వంద్వ వైఖరి అడుగడుగునా కనపడిందని జగన్ అన్నారు. ‘‘రెండుసార్లు బీఏసీ సమావేశం జరిగినా బాబు హాజరవలేదని గుర్తు చేశారు.
ఇరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలను వాటికి పంపి, మీరు మీరు ఎలాగైనా కొట్టుకొండంటూ చేతులు దులుపుకున్నారని ఆక్షేపించారు. ‘‘ఎనిమిది రోజులు సమావేశాలు జరిగితే బాబు తన గదికే పరిమితమయ్యారు తప్ప అసెంబ్లీ హాల్లో అడుగు పెట్టలేదు. విభజన బిల్లుపై చర్చ సందర్భంలో, నెల్సన్ మండేలా సంతాప తీర్మానం కోసం మరో ఐదు నిమిషాలు మాత్రం సభకు హాజరైనట్టున్నారు. తాను సభలోకి రాకుండా, ఇరు ప్రాంతాల టీడీపీ సభ్యులకు తలో రకం ప్లకార్డులిచ్చి, ‘కొందరు అటువైపు, మరికొందరు ఇటువైపు గొడవ చేయండ’ంటూ పంపారు. పైగా రెండు రకాల ప్లకార్డులూ ఒకే చోట ముద్రించారు. బహుశా రాష్ట్ర చరిత్రలోనూ, దేశ చరిత్రలోనూ ఇంతకన్నా దారుణమైన రాజకీయ పార్టీ మరోటి ఉండదేమో’ అని జగన్ అన్నారు.
సమైక్యం పేరుతో మోసగిస్తున్న కిరణ్
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా బాబు మాదిరిగానే వ్యవహరిస్తున్నారని జగన్ విమర్శించారు. ‘‘ఒకవైపునేమో తాను సమైక్యానికి తాను కట్టుబడి ఉన్నానని మోసం చేస్తా ఉంటాడు. రెండోవైపునేమో విభజన బిల్లు 17 గంటల్లోనే ఏకంగా అసెంబ్లీకి వచ్చేలా తాను సంతకాలు చేసేశారు. తన కార్యదర్శులందరి చేత సంతకాలు చేయించేసి బిల్లును అసెంబ్లీకి పంపించారు. ఆ రోజు స్పీకర్‌ను టీడీపీ అడ్డుకోవడం, పథకం మేరకు డిప్యూటీ స్పీకర్ వెళ్లడం, సీఎం వెళ్లకుండా డిప్యూటీ సీఎం మాత్రమే వెళ్లడం, బాబు కూడా సరిగ్గా చర్చ మొదలైందని చెప్పడానికా అన్నట్టు సభలోకి ఇలా వచ్చి, అలా కనపడి వెళ్లడం, ఆ తరవాత మళ్లీ అసెంబ్లీలో అడుగే పెట్టకపోవడం... ఇలా అత్యంత నాటకీయంగా చేశారు’’ అంటూ దుయ్యబట్టారు. వీళ్లసలు మనుషులేనా అనిపించేంతగా రాజకీయాలు చె డిపోవడం బాధాకరమన్నారు. పథకం ప్రకారం ఇంత దారుణంగా కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్న వీళ్లు రాజకీయ నాయకులా అని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘‘ఇప్పటికీ నేనొకటే మాట చెబుతున్నా. బాబు, కిరణ్ ఇద్దరికీ చెబుతున్నాను. వాళ్లిద్దరినీ నమ్ముకుని ఉన్న ప్రతి ఎమ్మెల్యేకూ చెబుతున్నా. ఈ నాయకులు ఏం చెప్పినా, ఏం చేసినా ఎమ్మెల్యేలంతా తమ మనస్సాక్షికి అనుగుణంగా అడుగులు వేయాలి’’ అని పిలుపునిచ్చారు.
పార్లమెంటులో గళమెత్తాం
పార్లమెంటులో వైఎస్సార్‌సీపీకి ఉన్న బలం చాలా తక్కువైనప్పటికీ సమైక్య గళాన్ని గట్టిగా విన్పించామని జగన్ గుర్తు చేశారు. ‘‘మాకు ముగ్గురే ఎంపీలం ఉన్నప్పటికీ పార్లమెంటు సమావేశాలకు ప్రతి రోజూ నాతో సహా అంతా హాజరయ్యాం. పార్టీ అధ్యక్షున్ని గనుక సభకు పోవాల్సిన పని లేదని నేననుకోలేదు. ప్రతి రోజూ పార్లమెంటు వెల్‌లోకి వెళ్లాను. వాయిదా తీర్మానమైతేనేం, అవిశ్వాస తీర్మానమైతేనేం.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతా ఉన్న అన్యాయాన్ని దేశమంతా చూసేట్లుగా, ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉందని దేశం మొత్తానికీ తెలిసేట్లుగా పార్లమెంటును ప్రతి రోజూ అడ్డుకున్నాం. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వేరే రాష్ట్రాల పార్టీలు కూడా మనవైపు మాట్లాడేలా వాటితో గళం విప్పించాం. సమాజవాదీ, శివసేన వంటి పార్టీలతోనూ వాయిదా తీర్మానాలిప్పించాం’’ అని పేర్కొన్నారు. తమ పార్టీ సభ్యులు ఆరుసార్లు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం లేఖలిచ్చారని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ‘‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరో 70 రోజుల్లో బంగాళాఖాతంలో కలపబోతున్నారని తెలిసి కూడా అవిశ్వాసానికి మేం మద్దతివ్వడానికి కారణముంది. సోనియాగాంధీపై అవిశ్వాసం ప్రకటిస్తూ, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపేందుకు ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దాన్ని దేశం మొత్తం చూడాలని, రాష్ట్రానికి సోనియా చేస్తున్న అన్యాయం దేశమంతటికీ అర్థం కావాలని, ఈ అంశం హైలైట్ కావాలని మేం ముగ్గురం కూడా దానికి మద్దతిచ్చాం. ఆ క్రమంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. కానీ ఈ విషయంలో టీడీపీయే వెనకడుగు వేసింది. వారి ఎంపీల్లో నలుగురు మాత్రమే మాకు మద్దతిచ్చారు. వారి లోక్‌సభా పక్ష నాయకుడు నామా అయితే మద్దతివ్వడం దేవుడెరుగు, వెల్‌లోకి వెళ్లిన మాపై వెటకారంగా కూడా మాట్లాడారు. కేవలం బాబు నేతృత్వంలోని టీడీపీ మాత్రమే ఇలా వ్యవహరించగలదు’’ అంటూ ధ్వజమెత్తారు.
బాల్ వేస్తున్నదే వాళ్లు
చివరి బంతి ఇంకా మిగిలే ఉందన్న కిరణ్ వ్యాఖ్యలను ప్రస్తావించగా, ‘అదే సమస్య. బాల్ వాళ్లే వేస్తున్నారు, అది బౌన్సరా, గూగ్లీనా అని చూసుకుని మేం మళ్లీ బ్యాట్ అడ్డం పెట్టాల్సి వస్తా ఉంది. వాళ్లే పథకాలు పన్నుతున్నారు. వాళ్లే బాల్స్ వేస్తున్నారు. వాళ్లే కొడుతున్నారు. అన్నీ వాళ్ల ఇష్టానుసారం చేస్తున్నారు. తొలుత నీళ్లు అరికాళ్ల దాకా వచ్చాయి. తరవాత మోకాళ్ల దాకా, నడుము దాకా, ఇప్పుడు పీకల దాకా వచ్చాయి. అయినా కిరణ్ మాత్రం ‘అన్నీ బానే ఉన్నాయి. అన్నీ నేను చూసుకుంటాను’ అంటున్నాడు. గతంలో సమ్మె చేసిన ఉద్యోగులను కూడా సరిగ్గా ఇలాంటి మాటలతోనే భయపెట్టి విరమింపజేశారు. జూలై 30న సీడబ్ల్యూసీ తెలంగాణ తీర్మానం చేసింది. దాదాపుగా ఐదు నెలలు కావస్తోంది. ఈ ఐదు నెలల్లో ఎప్పుడైనా అసెంబ్లీని పిలిచి సమైక్య తీర్మానం చేయించి పంపే అవకాశమున్నా పొరపాటున కూడా కిరణ్ ఏ రోజూ అలా చేయలేదు. పైగా ప్రత్యేక విమానంలో బిల్లు రాగానే కిరణ్‌తో పాటు కార్యదర్శులంతా చకచకా సంతకాలు పెట్టి మరీ అసెంబ్లీకి పంపారు’’ అన్నారు.
సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిగా మద్దతు ఇస్తాం
కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై వైఎస్సార్‌సీపీ వైఖరి చాలా స్పష్టంగా ఉందని జగన్ చెప్పారు. ‘‘ఎన్నికల తరవాత ఎన్డీఏ వస్తుందో, ఏమొస్తుందో తెలియదు గానీ... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధాని చేసేందుకు సంపూర్ణ మద్దతిస్తామని గట్టిగా పునరుద్ఘాటిస్తున్నాం’’ అన్నారు. బీజేపీకి మద్దతిస్తారా అని ప్రశ్నించగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండని గట్టిగా కోరడానికే బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ వద్దకు వెళ్లామని గుర్తు చేశారు. రాష్ట్రపతి వ్యాఖ్యలను ప్రస్తావించగా ఆయన ఏమన్నారో తనకు తెలియదన్నారు. ‘‘70 శాతం మంది ప్రజలు ఇవాళ సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటప్పుడు సమైక్యం అనకుండా ఎవరైనా విభజన అనే మాట అన్నారంటే, వాళ్లు నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేదా అని వారికి వారే ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఒకవేళ అలా అని ఉంటే మాత్రం ఆయన దాన్ని సవరించుకోవాలి’’ అని బదులిచ్చారు. జగన్ తన కుమారుని లాంటి వాడని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ మళ్లీ చెప్పారని ప్రస్తావించగా, ‘మీరు లాగి కొడితే అప్పుడు (అనడం) ఆపేస్తారు’ అని జగన్ జవాబిచ్చారు.
రాష్ట్రపతికి సమైక్య’ విన్నపం

- రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కలసికట్టుగా విన్నవిద్దాం
- ఆ మేరకు అఫిడవిట్లు సమర్పిద్దాం
- పార్టీలకతీతంగా ముందుకు రావాలి
- బాబు, కిరణ్ అడ్డుకున్నా మనస్సాక్షి మాటే వినాలి
- ముగ్గురమే ఉన్నా పార్లమెంటులో సమైక్య గళం విన్పించాం
- బాబు మాత్రం పార్లమెంటులో రాష్ట్ర పరువు తీశారు
- ఏ ప్రాంత సభ్యులతో ఆ ప్రాంత వాదం విన్పించారు
- ద్వంద్వ వైఖరిలో బాబును తలదన్నుతున్న కిరణ్
- ఇంతగా కుమ్మక్కైన వీళ్లా నాయకులంటూ నిలదీయాలి
- సమైక్యం కోసం తుది క్షణం దాకా పోరాడతాం

సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాకే బిల్లుపై చర్చ చేపట్టాలి

- బాబు బౌలింగ్ చేయరు.. కిరణ్ బ్యాటింగ్ చేయరు!బాబు బౌలింగ్ చేయరు.. కిరణ్ బ్యాటింగ్ చేయరు!
- వైఎస్ విజయమ్మ విమర్శ
- రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి
- తుదికంటా పోరాడతామని ఉద్ఘాటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అసలు బౌలింగే చేయరని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బ్యాటింగ్ చేయరని, అయినప్పటికీ ఇద్దరూ క్రీజ్‌లో ఉంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన అంశాన్ని సీఎం క్రికెట్ ఆటతో పోల్చుతున్నారని విలేకరులు ప్రస్తావించినప్పుడు విజయమ్మ పైవిధంగా స్పందించారు. అసెంబ్లీలోని వైఎస్సార్ సీఎల్పీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో ముచ్చటించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే సమైక్యంగా ఉండాలని, అందుకే తమ పార్టీ సమైక్యంగా ఉంచాలని బలంగా కోరుకుంటోందని చెప్పారు. సమైక్యంగా ఉంచే విషయంలో చివరి వరకు పోరాటం చేస్తామన్నారు. అసెంబ్లీని సమావేశపరచి సమైక్య తీర్మానం చేయాలని తమ పార్టీ తొలి నుంచీ కోరుతోందని, అయినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పెడచెవిన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇపుడు విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన తరుణంలో కూడా తీర్మానం పెట్టడం లేదన్నారు. కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరగడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమని, ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆనాడే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హెచ్చరించారని గుర్తుచేశారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను విలేకరులు ప్రస్తావించగా ‘చంద్రబాబు పరిస్థితులను బట్టి తన సిద్ధాంతాలను మార్చుకుంటూ ఉంటారు. గతంలో.. బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని అనేకసార్లు చెప్పిన బాబు ఇపుడు అదే బీజేపీతో పొత్తు కోసం వెంట పడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌పై ఢిల్లీకి వెళుతున్న అఖిలపక్షంలో తమ పార్టీ తరఫున పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎం.వి.ఎస్.నాగిరెడ్డి (రైతు విభాగం కన్వీనర్) ఉంటారని విజయమ్మ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాకే బిల్లుపై చర్చ చేపట్టాలి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
శాసన మండలిని తిరిగి ఎప్పుడు సమావేశపరిచినా.. ముందు సమైక్య తీర్మానం ప్రవేశపెట్టిన తరువాతనే విభజన బిల్లుపై చర్చ చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, ఆదిరెడ్డి అప్పారావు డిమాండ్ చేశారు. వారు గురువారమిక్కడ మాట్లాడుతూ.. సమైక్య తీర్మానం ప్రవేశపెట్టే వరకూ.. సభను అడ్డుకుంటూనే ఉంటామని స్పష్టం చేశారు.
12/19/2013
హైదరాబాద్: సమైక్య నినాదాన్ని జగన్‌మోహన్‌రెడ్డి బలంగా వినిపించడం జీర్ణించుకోలేకనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎంపీ రాజగోపాల్ విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి జయప్రకాష్ ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. చంద్రబాబుకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం చేతకాదని.. రాజగోపాల్‌లో ఢిల్లీ వీధులలో రాజకీయ డ్రామాలు ఆడడమే పనిగా ఆయన పేర్కొన్నారు.
జగన్ సమైక్య వాదనకు సీమాంధ్ర ప్రజలు స్పందిస్తున్న తీరు చూసి వచ్చే ఎన్నికల్లో తమకు పుట్టగతులుండవనే భయంతో నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు పరోక్షంగా తాము అందిస్తున్న సహకార బండారం బయటపడుతుంనే భయంతో పసలేని పదాలు ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు.
వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు ఉండే టీఎంసీ, అన్నాడీఎంకే, జేడీయూ, డీఎంకే, బీజేడీ, సమాజ్‌వాదీ, అకాలీదళ్ పార్టీలనే కాకుండా యూపీఏ భాగస్వామి అయిన శరద్‌పవార్ కూడా రాష్ట్ర విభజన పట్ల తన వైఖరిని మార్చుకునేలా జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు కూడగట్టారని పేర్కొన్నారు. ప్రస్తుత విభజన విధానాన్ని అడ్డుకుంటామని బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయరు, చేసేవారిని హర్షించలేని మనస్తత్వం ఆ ఇద్దరి నేతలదని దుయ్యబట్టారు.
జీర్ణించుకోలేకే జగన్‌పై విమర్శలు: అడుసుమల్లి
Written By news on Thursday, December 19, 2013 | 12/19/2013

జగన్ సమైక్య వాదనకు సీమాంధ్ర ప్రజలు స్పందిస్తున్న తీరు చూసి వచ్చే ఎన్నికల్లో తమకు పుట్టగతులుండవనే భయంతో నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు పరోక్షంగా తాము అందిస్తున్న సహకార బండారం బయటపడుతుంనే భయంతో పసలేని పదాలు ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు.
వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు ఉండే టీఎంసీ, అన్నాడీఎంకే, జేడీయూ, డీఎంకే, బీజేడీ, సమాజ్‌వాదీ, అకాలీదళ్ పార్టీలనే కాకుండా యూపీఏ భాగస్వామి అయిన శరద్‌పవార్ కూడా రాష్ట్ర విభజన పట్ల తన వైఖరిని మార్చుకునేలా జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు కూడగట్టారని పేర్కొన్నారు. ప్రస్తుత విభజన విధానాన్ని అడ్డుకుంటామని బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయరు, చేసేవారిని హర్షించలేని మనస్తత్వం ఆ ఇద్దరి నేతలదని దుయ్యబట్టారు.
12/19/2013
పార్టీలకు అతీతంగా కదలిరండి: ఎమ్మెల్యేలకు జగన్ పిలుపు

హైదరాబాద్: రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసం ఎమ్మెల్యేలు అందరూ పార్టీలకు అతీతంగా కదలిరావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పిలుపు ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమైక్యానికి అనుకూలంగా ఎమ్మెల్యేలు అందరూ అఫిడవిట్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇద్దాం రమ్మని కోరారు. అందరికి పేరుపేరున నమస్కరించి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో ఒక వేళ ఓటింగ్ పెట్టినా పెట్టకపోయినా ఈ అఫిడవిట్లు ఇద్దాం రమ్మన్నారు. ఇక్కడ జరిగే కుళ్లు కుతంత్రాలు, కుమ్మక్కు రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేలు అందరూ వారివారి మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా మన దగ్గరికే వచ్చిన రాష్ట్రపతిని కలిసి సమైక్యానికి అనుకూలంగా అఫిడవిట్లు ఇద్దామన్నారు.
తమ పార్టీకి లోక్ సభలో బలం తక్కువగా ఉన్నా ప్రతిరోజూ ఆందోళలు చేసినట్లు తెలిపారు. లోక్ సభ సమావేశాలకు తమ పార్టీ సభ్యులు ముగ్గురం ప్రతిరోజూ హజరై ఒకే మాటపై నిలబడినట్లు చెప్పారు. రాష్ట్రానికి జరిగే అన్యాయం దేశం మొత్తానికి తెలియడం కోసం లోక్ సభలో ఏదో ఒక రూపంలో ఆందోళనలు చేశామన్నారు. వాయిదా తీర్మానాలు, అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. పార్లమెంటు చివరి రోజు టిడిపి నేతల ప్రవర్తన బాధ కలిగించిందని చెప్పారు. చంద్రబాబు నాయుడుకు చెందిన నలుగురు ఎపిలు ఒక రకంగా మాట్లాడితే, మరో ఇద్దరు మరో రకంగా మాట్లాడారని విమర్శించారు. నలుగురు ఎంపిలు ముందుకు వస్తే, ఇద్దరు ఎంపిలు రారని చెప్పారు. టిడిపి ఎంపిల వైఖరి చూసి స్పీకర్ నవ్వుకున్నారన్నారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా నవ్వారని చెప్పారు.
అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు అదే వైఖరి అవలంభించారన్నారు. అసెంబ్లీకి వచ్చి తన గదిలో కూర్చుంటారు గానీ, అసెంబ్లీ హాలులోకి మాత్రం రారని చెప్పారు. ఒక్కసారి మాత్రం నెల్సన్ మండేలా మృతికి సంతాపం తెలపడం కోసం వచ్చారన్నారు. 8 రోజుల్లో బిఏసి రెండు సార్లు సమావేశం అయింది. చంద్రబాబు నాయుడు మాత్రం ఒక్కసారి కూడా హజారు కాని విషయా్న్ని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి కూడా అంతేనన్నారు. సమైక్య ముసుగులో ఉన్న విభజన వాది అన్నారు. ఉద్యోగుల చేత సమ్మె విరమింపజేశారని గుర్తు చేశారు. అవకాశం ఉన్నా సీఎం అసెంబ్లీని సమావేశపరచి, సమైక్య తీర్మానం చేయలేదని చెప్పారు. ఆయన విభజనకు వ్యతిరేకం అని చెబుతారు. తెలంగాణ బిల్లుపై మాత్రం సంతకాలు చేస్తారని చెప్పారు. బిల్లు వచ్చిన తరువాత 17 గంటల్లో బిల్లుపై సంతకం చేసి సభకు పంపించారన్నారు. బిల్లు చర్చకు వచ్చే సమయంలో ముఖ్యమంత్రి రారు. స్పీకర్ రారు. ఉప సభాపతితో సభ నడిపిస్తారని చెప్పారు. అంతా నాటకీయంగా జరిపించేస్తారని విమర్శించారు. ఈ ఇద్దరు నాయకులను నమ్ముకోవద్దని, ఎమ్మెల్యేలు తమ మనస్సాక్షికి అనుకూలంగా వ్యవహరించాలని కోరారు. అఫిడవిట్ లు రాష్ట్రపతికి ఇవ్వడానికి రావాలని కోరారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఎవరు ఉంచుతారో వారినే ప్రధానిని చేస్తామని తాము హైదరాబాద్ సభలో లక్షల మంది సమక్షంలో చెప్పామని, అదే మాటకు కట్టుబడి ఉన్నామని జగన్ తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసం చివరిని నిమిషం వరకు నిజాయితో గట్టిగా పోరాడతామని చెప్పారు. రాష్ట్రం విడిపోతే దేశంలో రెండవ అతి పెద్ద జాతి అయిన తెలుగుజాతి విచ్చిన్నం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో బడ్జెట్ విషయంలో రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది. విడిపోతే ఒక రాష్ట్రం 8వ స్థానం కోసం, మరో రాష్ట్రం 13వ స్థానం కోసం పోటీపడుతుందన్నారు. రెండు రాష్ట్రాలు నాశనమైపోతాయని హెచ్చరించారు. ఎయిర్ పోర్టులు, సీపోర్టులు కలసి ఉంటే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు.

చంద్రబాబు వైఖరిని చూసి నవ్వుతున్నారు-జగన్

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణపై అనుసరిస్తున్న వైఖరిని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
తమ పార్టీకి ముగ్గురే ఎమ్.పిలే ఉన్నా, తామంతా పార్లమెంటుకు వెళ్లి ఒకే స్టాండ్ మీద ఉన్నామని,పార్టీ అధ్యక్షుడిని అయినా తాను కూడా స్పీకర్ వెల్ లోకి వెళ్లామని జగన్ అన్నారు.అవిశ్వాస తీర్మానం, వాయిదా తీర్మానాల రూపంలో దేశం మొత్తం తెలిసే విదంగా రోజూ అడ్డుకున్నామని జగన్ అన్నారు.సమాజవాది పార్టీ, శివసేన వంటి పార్టీలతో వాయిదా తీర్మానాలు ఇప్పించామని ఆయన చెప్పారు.చంద్రబాబు నలుగురు ఎమ్పిలను ఒకవైపు , ఇద్దరు ఎమ్.పిలను మరో వైపు పెట్టారని, చివరి రోజు చంద్రబాబుకు చెందిన నలుగురు ఎమ్.పిలు , కాంగ్రెస్ ఎమ్.పిలు నలుగురైదుగురు వెల్ లోకి వెళ్లామని ఆయన తెలిపారు.అదే సమయంలో టిడిపి ఎమ్.పిలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాధోడ్ లు వెల్ లోకి వెళ్లేవారిని తిడుతూ ఉన్నారని ఆయన అన్నారు. మన రాష్ట్రం నుంచే ఒకవైఖరి లేకుండా వ్యవహరిస్తున్న తీరు చూసి స్పీకర్ మీరాకుమార్ , అసదుద్దీన్ ఒవైసీ నవ్వారని జగన్ ఎద్దేవ చేశారు.శాసనసభలో సైతం టిడిపి ఇలాగే చేస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు శాసనసభకు వెళ్లినా ఛాంబర్ లోనే కూర్చుంటున్నారని ఆయన అన్నారు.ఇరువైపులా వాదించుకోమని చెబుతున్నారని, అందరికి ఒకేచోట నుంచి ప్లకార్డులు రాసి పంపించారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా పధకం ప్రకారం కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని జగన్ ఆరోపించారు. తెలంగాణ బిల్లుపై ఆయన సంతకం చేశారని,ఆయన అదికార్లతో సంతకాలు చేయించారని ఆయన అన్నారు.ఈ ఎమ్మెల్యేలు అంతా మనస్పూర్తి సాక్షిగా అడుగులు వేయాలని జగన్ పిలుపు ఇచ్చారు.

kommineni
12/19/2013
డెబ్బై రోజులలో కాంగ్రెస్ ను బంగళాఖాతంలో

డెబ్బై రోజులలో కాంగ్రెస్ ను బంగళాఖాతంలో కలపబోతున్నారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. అయినా అవిశ్వాసం పెట్టామని అన్నారు. అయినా తాము ఎందుకు అవిశ్వాసం పెట్టామంటే, కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఎమ్.పిలు సోనియాగాంధీపై అవిశ్వాసం ప్రకటిస్తున్న విషయాన్ని దేశమంతా తెలియచేయడం కోసం తాము మద్దతు ఇచ్చామని ఆయన అన్నారు. టిడిపి ఎమ్.పిలు ఇద్దరు,ముఖ్యంగా టిడిపిపి నేత నామా నాగేశ్వరరావు వ్యతిరేకించడమే కాకుండా , తమ పట్ల వెటకారంగా కూడా మాట్లాడారని ఆయన అన్నారు.రాష్ట్రపతి విభజనకు అనుకూలంగా మాట్లాడి ఉంటే ఆయన సరిచేసుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు.మొత్తం మునిగిపోతున్నా అంతా బాగానే ఉందని కిరణ్ చెబుతున్నారని ,విభజన జరగదని చెబుతున్నారని అన్నారు.శాసనసభలో సమైక్య తీర్మానం చేసే అవకాశం ఉన్నప్పట్టికీ ఆ ప్రయత్నం కిరణ్ ఎందుకు చేయలేదని ఆయన అన్నారు.స్పీకర్ ను తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడ్డుకుంటారని, ఉప సభాపతి అప్పుడు సభకు వెళతారని, సరిగ్గా ఆ సమయంలోనే చంద్రబాబు కూడా అక్కడకు వెళ్లి చర్చ మొదలైందనిపిస్తారని జగన్ ఆరోపించారు.ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారికే పూర్తి మద్దతు ఇస్తామని గతంలో చెప్పామని,ఇప్పుడు కూడా చెబుతున్నానని జగన్ ఒక ప్రశ్నకు స్పష్టం చేశారు.దాని గురించే రాజ్ నాద్ సింగ్ ను కలిశానని అన్నారు.బిజెపి వారు చంద్రబాబుతో స్నేహం చేస్తారా?లేదా అన్నది వేరే విషయం అని,తాము రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నామని జగన్ తెలిపారు.చివరి నిమిషం వరకు సమైక్యం కోసమే,నిజాయితీగా పోరాడతామని, పారద్శకంగా ఉంటామని ఆయన చెప్పారు.
12/19/2013
రాష్ట్రపతి దగ్గరకు అందరం వెళదాం-జగన్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా సమైక్యం కోరుకునే ఎమ్మెల్యేలంతా పార్టీలకు అతీతంగా అఫిడవిట్ లు సమర్పిస్తే మంచిదని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందరం కలిసికట్టుగా వెళ్లి అడుగుదామని అందరికి చేతులు జోడించి విన్నవిస్తున్నానని ఆయన అన్నారు., చంద్రబాబు,కిరణ్ లు అడ్డుతగిలినా, ఎమ్మెల్యేలు మాత్రం దీనికి అనుకూలంగా ఉండవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
kommineni
12/19/2013

హైదరాబాద్, 19 డిసెంబర్ 2013 : సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని తెలియజెప్పేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం చెవి వద్ద క్యాలీఫ్లవర్ పువ్వులు పెట్టుకుని, నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించవద్దంటూ, తెలంగాణ బిల్లుపై చర్చకు ముందే సభలో సమైక్య తీర్మానం చేయాలంటూ పార్టీ తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, పార్టీ ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. సీఎం కిరణ్ ఉత్తర కుమారుడిలా సమైక్యం అంటూ ప్రగల్భాలు పలికారని విమర్శించారు. ప్రజల చెవిలో కాలీఫ్లవర్ పువ్వులు పెట్టిన కిరణ్ విధానాన్ని ఎండగట్టేందుకే తాము ఇలా నిరసన వ్యక్తంచేశామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం తప్ప మరే అంశాన్నీ వైయస్ఆర్ కాంగ్రెస్ ఆమోదించబోదన్నారు. వీర సమైక్యవాదిగా ఫోజు కొడుతున్న కిరణ్ ఓ కాగితపు పులి అని వ్యాఖ్యానించారు.

కేబినెట్ నోట్ తయారు కాక ముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేద్దామంటే ఈ ఉత్తర కుమారుడు పట్టించుకోలేదని పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించారు. అసెంబ్లీలో బిల్లు వచ్చే రోజు అనారోగ్యం నెపంతో సీఎం తప్పించుకోవడం వెనుక ఏదో మతలబు ఉందని వారు ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం శ్రమకు ఓర్చి సమ్మె చేసిన ఎన్జీవోలు ఒక్కొక్కరినీ కిరణ్ బెదరించి పవిత్రమైన ఉద్యమానికి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు కిరణ్ చెప్పే అబద్ధాలను నమ్మవద్దని, సరైన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, అసెంబ్లీ సమావేశాల్లో గురువారంనాడు కూడా నిన్నటి సంఘటనలే పునరావృతం అయ్యాయి. ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన రెండు నిమిషాల్లోనే గంట పాటు వాయిదా పడ్డాయి. స్పీకర్ సభలోకి వచ్చేసరికే ఇరు ప్రాంతాల సభ్యులంతా పోడియాన్ని చుట్టుముట్టారు. తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో సభ మార్మోగిపోయింది.
ప్రతిపక్షాలు సభలో ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ యధావిధిగా తిరస్కరించటంతో చర్చకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ సభ్యులు పట్టుబట్టారు. దానితో సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలిగింది. శాసనసభలో గందరగోళం నెలకొనటంతో సమావేశాలను స్పీకర్ గంటపాటు వాయిదా వేశారు.
అసెంబ్లీకి క్యాలీఫ్లవర్లతో వైయస్ఆర్‌సీపీ సభ్యులు

ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే దాన్ని తుంగలో తొక్కిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. రక్షకులే భక్షకులుగా మారిన చందంగా ఎలాంటి చర్చలు జరుపకుండానే ప్రస్తుత శీతాకాల సమావేశాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రజాస్వామ్య బద్ధంగా జరగడం లేదని, ఆర్టికల్-3ను సవరించేలా చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం కోరినా కేంద్రం పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. నిర్దేశించిన గడువుకు రెండు రోజుల ముందుగానే పార్లమెంటు సమావేశాలను ప్రభుత్వం బుధవారంనాడు నిరవధికంగా వాయిదా వేసిన అనంతరం ఆయన మరో ఎంపీ ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరిలతో కలిసి విజయ్‌చౌక్‌లో మీడియాతో మాట్లాడారు.
ఆర్టికల్-3 ని అడ్డుపెట్టుకొని దేశాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీన్ని అడ్డుకోవాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కోరామని మేకపాటి అన్నారు. దీన్ని సవరించాలన్న తమ డిమాండ్‌కు అన్ని పార్టీలు అంగీకరించినా కేంద్రం మాత్రం వెనక్కి వెళ్లిందని దుయ్యబట్టారు. ఇక తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగకుండా కేంద్రం తప్పించుకుందని విమర్శించారు.
ఆర్టికల్-3 ప్రకారం ఇష్టారీతిగా విభజనపై నిర్ణయం తీసుకోమని తాము ఏనాడూ చెప్పలేదని, తండ్రిలా అందరికీ న్యాయం చేయమని మాత్రమే తాము చెప్పామని మేకపాటి గుర్తుచేశారు. తాము అఖిలపక్షానికి ఇచ్చిన లేఖను వక్రీకరించవద్దని ఆయన మీడియాకు సూచించారు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని, అలాంటప్పుడు ఇష్టారీతిగా విభజిస్తామంటే కుదరదని చెప్పారు.
రానున్న సమావేశాలు జీవన్మరణమే: ఎస్పీవై రెడ్డి :
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ నాయకత్వంలో సర్వశక్తులూ ఒడ్డుతున్నామని ఎంపీ ఎస్పీవై రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి చర్చ జరగకుండా ప్రస్తుత సమావేశాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఫిబ్రవరిలో జరిగే సమావేశాలు తమకు జీవన్మరణమేనని చెప్పారు. లోక్‌పాల్ బిల్లు దేశంలో అవినీతిని రూపుమాపి విప్లవాత్మక మార్పు తెస్తుందని తాము భావిస్తున్నామని తెలిపారు.
మా తీర్మానాన్ని పట్టించుకోలేదు - మైసూరా :
ఆర్టికల్-3ని సవరించాలని కోరుతూ తమ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్, ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీ ఎంపీ మైసూరారెడ్డి చెప్పారు. రాష్ట్రాల విభజన అడ్డగోలుగా ఉండరాదని, దానికి ఓ కమిటీ వేయడమా? అసెంబ్లీ తీర్మానం చేయడమా? ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలని తాము కోరుతున్నామని తెలిపారు. తాము బుధవారం సైతం అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చామని, అయితే లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందిన వెంటనే స్పీకర్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారని తెలిపారు.
ప్రజా సమస్యలపై ఎటువంటి చర్చలు జరుపకుండా, కేవలం తమ పనులు చక్కబెట్టుకోవాలనే దృక్పథంతోనే కేంద్రం వ్యవహరించిందని మైసూరారెడ్డి దుయ్యబట్టారు. కేంద్రం అత్యంత కీలకంగా తీసుకొచ్చిన లోల్‌పాల్ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఆయన తెలిపారు
http://www.ysrcongress.com/news/news_updates/mp-mekapati-slams-central-govt.html

జేసీ దివాకర్ రెడ్డి
జగన్ పోరాటాన్ని అభినందించిన జేసీ

- కాంగ్రెస్ పార్టీకి ఓ కన్ను ఇప్పటికే పోయింది
- చంద్రబాబుకు రెండుకళ్లూ పోయే ప్రమాదముంది
- ఇలాంటి సభను ఎప్పుడూ చూడలేదు
12/19/2013
హైదరాబాద్: : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు తన సిద్ధాంతాలను మార్చుకున్నారని ఆరోపించారు.
గురువారం ఆమె హైదరాబాద్ లో మీడియా చిట్ చాట్ లో ... రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని గత ఆరు నెలలుగా ముఖ్యమంత్రి కిరణ్ ను తమ పార్టీ కోరుతున్న సంగతిని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఆయన నుంచి స్పందన కరువైందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన తరువాత ఇప్పుడు సమైక్య తీర్మానం కుదరదంటూ సీఎం విడ్డూరంగా మాట్లాతున్నారని ఆమె పేర్కొన్నారు.
అప్పుడే సమైక్య తీర్మానం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అంటూ విజయమ్మ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బౌలింగ్ చేస్తుంటే సీఎం కిరణ్ బ్యాటింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విభజన జరిగే వరకు చంద్రబాబు బాల్ వేయరు, కిరణ్ బ్యాటింగ్ చేయరని ఆమె పేర్కొన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు వెళ్లే అఖిలపక్షంలో తమ పార్టీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంవీఎస్ నాగిరెడ్డి హాజరవుతురన్నారు.
ప్రముఖ రచయిత్రి కాత్యాయనీ విద్మహే రచించిన సాహిత్యాకాశంలో సగం-స్త్రీల అస్తిత్వ సాహిత్యం కవిత్వం, కథ అనే సాహిత్య విమర్శ గ్రంథం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాత్యాయనీని వైఎస్ విజయమ్మ అభినందనలు తెలిపారు.
బాబు బాల్ వేయరు...కిరణ్ బ్యాటింగ్ చేయరు: విజయమ్మ

హైదరాబాద్ : శాసనసభలో గురువారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన రెండు నిమిషాల్లోనే గంటపాటు వాయిదా పడింది. స్పీకర్ సభలోకి వచ్చేసరికే ఇరుప్రాంతాల సభ్యులంతా పోడియం చుట్టుముట్టారు. తెలంగాణ, జైసమైక్యాంధ్ర నినాదాలతో సభ మార్మోగిపోయింది.
విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించటంతో...చర్చకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ సభ్యులు పట్టుబట్టారు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను గంటపాటు వాయిదా వేశారు.
మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారంటూ నల్లదుస్తులు ధరించి... క్యాలీఫ్లవర్లు పట్టుకొని సభకు హాజరయ్యారు.
క్యాలీఫ్లవర్లతో సభకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించటంతో...చర్చకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ సభ్యులు పట్టుబట్టారు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను గంటపాటు వాయిదా వేశారు.
మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారంటూ నల్లదుస్తులు ధరించి... క్యాలీఫ్లవర్లు పట్టుకొని సభకు హాజరయ్యారు.
12/19/2013
వైఎస్సార్‌సీపీకి ఫ్యాన్ గుర్తు

వైఎస్సార్‌సీపీకి ఫ్యాన్ గుర్తు
కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కామన్ సింబల్‌గా (ఎన్నికల చిహ్నంగా) సీలింగ్ ఫ్యాన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2011 మార్చి 12న ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీ, ఆ తర్వాత అదే గుర్తుపై రాష్ట్రంలో అనేక ఉప ఎన్నికలను ఎదుర్కొంది. 2011 మేలో కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ‘సీలింగ్ ఫ్యాన్’ గుర్తుతోనే రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించడం తెలిసిందే. తర్వాత 2012 మార్చిలోనూ, జూన్‌లోనూ జరిగిన ఉప ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభతో పాటు 16 అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సీలింగ్ ఫ్యాన్ గుర్తుపైనే పోటీ చేసి గెలిచారు.
తర్వాత పార్టీ ప్రమేయం లేని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ, శాసనసభ సాధారణ ఎన్నికల్లో కామన్ సింబల్‌గా సీలింగ్ ఫ్యాన్ గుర్తునే కేటాయించాలని కోరుతూ డిసెంబర్ 1న, 3న పార్టీ సీఈసీ సభ్యుడు కె.శివకుమార్ ఈసీకి వేర్వేరుగా లేఖలు రాశారు. ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్ అండ్ అలాట్‌మెంట్) ఆర్డర్-1968 ప్రకారం వైఎస్సార్‌సీపీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తును ఈసీ కేటాయించింది. సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్‌సభ, 294 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు దీన్నే ఉమ్మడి గుర్తుగా కేటాయిస్తారు. ఈ మేరకు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జారీ చేసిన రెండు వేర్వేరు ఉత్తర్వులకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి ఈసీ సమాచారం పంపింది.
12/19/2013
హైదరాబాద్ :
అడ్డుకుంటానంటూనే విభజనకు కిరణ్ పూలబాట

- అడ్డుకుంటానంటూనే విభజనకు కిరణ్ పూలబాట
- సీమాంధ్ర నేతల మూకుమ్మడి ఆవేదన
- అంతా చేసి ఇప్పుడు
- రిటైర్డ్ హర్ట్ అయ్యారు
- పరిణామాలన్నింటి పరమార్థమదే
- కాంగ్రెస్ నేతల్లోనూ అంతర్మథనం
సాక్షి, హైదరాబాద్: ‘స్టార్ బ్యాట్స్‌మన్’ చేతులెత్తేశారా? బంతి పడకముందే బ్యాట్‌ను కింద పడేశారా? అడుగడుగునా ‘ఫిక్సింగ్’ నాటకాన్ని రంజుగా రక్తి కట్టిస్తూ వస్తున్నారా? చేయాల్సిందంతా చేసి, చివరికి తనకు తానే రిటైర్డ్ హర్ట్‌గా ప్రకటించుకుని పెవిలియన్ బాట పడుతున్నారా? ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై సీమాంధ్ర నేతల్లో ఇప్పుడు ఇదే అంశంపై జోరుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని కొంతకాలంగా ప్రతి వేదికపైనా పదేపదే చెబుతూ వస్తున్న కిరణ్, వాస్తవానికి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు. అంతేగాక ఈ విషయమై సోషల్ మీడియాలోనూ కిరణ్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ మాటలకు, జరుగుతున్న పరిణామాలకు పొంతన లేకుండా పోతుండటంతో ఆయన చుట్టూ తిరుగుతున్న నేతలు కూడా తీవ్ర అయోమయంలో పడ్డారు. విభజనపై పరిస్థితిని సాగదీస్తున్నట్టు పైకి కనబడుతూనే, చివరికి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా పరిస్థితులను కిరణ్ సానుకూలపరుస్తూవస్తున్నారన్న భావన వారిలో ఏర్పడింది. ముఖ్యంగా... ఏవైతే జరగవని ఆయన చెబుతూ వస్తున్నారో సరిగ్గా వరుసగా అవే జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇందుకు పలు ఉదాహరణలను కూడా చూపుతున్నారు.
జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజన నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ, ‘విభజన జరగదు’ అంటూ ఒక్కో సందర్భంలో ఒక్కో అంశాన్ని తెరపైకి తెస్తూ కిరణ్ ఇప్పటికి నాలుగున్నర నెలలు గడిపారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టిద్దామని, తద్వారా విభజన ప్రక్రియ ఆగిపోతుందని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న రోజే నేతలంతా ప్రతిపాదించినా, ‘దాన్నివల్ల ప్రయోజనం ఉండద’ంటూ కిరణ్ దాటవేశారు. పైగా అసెంబ్లీలో తీర్మానం చేయకుండా విభజనకు ముందుకు వెళ్లలేరని నమ్మబలుకుతూ వచ్చారు. ఆ తీర్మానాన్ని ఓడించడానికైనా అందరూ పదవుల్లో ఉండాలంటూ నేతలకు నచ్చజెప్పారు.
సీడబ్ల్యూసీ తీర్మానం చేసినా కేబినెట్ నోట్ తయారీ అంత సులభం కాదని, పైగా అది కేంద్ర మంత్రివర్గం ముందుకు అంత తొందరగా రాదని పేర్కొన్నారు. చివరికి విభజన నోట్ టేబుల్ ఐటంగా కేబినెట్ ముందుకు వచ్చేదాకా సీమాంధ్ర మంత్రులను, ఎమ్మెల్యేలను రోజుకో రకంగా మభ్యపెడుతూ వచ్చారు. నోట్‌ను కేంద్ర కేబినెట్ యథాతథంగా ఆమోదించడమే గాక, బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం ఉండబోదని కూడా తేల్చేసింది. దాంతో, ‘తీర్మానముంటుంది.. ఓటింగ్ ఉంటుంది... బిల్లును ఓడిస్తాం’ అని అప్పటిదాకా చెబుతూ వచ్చిన కిరణ్ వాటన్నిటినీ పక్కనపెట్టి 371డి వంటి అంశాలను తెరపైకి తెచ్చి మరికొంత కాలం కథ నడిపారు.
కాదు కాదంటూనే...
ఒకవైపు విభజనకు అవసరమైన సమాచారమంతటినీ కేంద్ర మంత్రుల బృందానికి ఎప్పటికప్పుడు చేరవేస్తూనే పైకి మాత్రం అదంత సులభం కాదని, సమస్యలన్నీ పరిష్కరించకుండా ముందుకు పోలేరని కూడా కిరణ్ బుకాయిస్తూ వచ్చారు. కానీ కేంద్ర మంత్రివర్గం విభజన బిల్లుకు ఆమోదముద్ర వేయడమే గాక ఆ మర్నాడే దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి కూడా పంపింది. దాంతో అప్పటిదాకా కిరణ్ కేవలం అధిష్టానం ఆదేశానుసారమే తమతో నాటకీయంగా వ్యవహరిస్తూ వచ్చారన్న భానవ సీమాంధ్ర నేతల్లో బలంగా నాటుకుంది. అంతేగాక సరిగ్గా విభజన బిల్లు రాష్ట్రానికి వచ్చే సమయానికి శాసనసభ సమావేశాలు జరిగేలా కూడా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహించారని సీమాంధ్ర నేతలంటున్నారు. రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య వ్యవధి ఆర్నెల్లకు మించకూడదు. సాధారణంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నవంబర్‌లోనే పూర్తి చేయొచ్చు. కానీ కిరణ్ మాత్రం విభజన బిల్లు ఢిల్లీలో ఓ కొలిక్కి వచ్చేదాకా అసెంబ్లీ సమావేశాల పట్ల ఆసక్తి చూపలేదు. సరిగ్గా బిల్లు అసెంబ్లీకి వస్తుందన్న సమాచారం అందాక, డిసంబర్ 12 నుంచి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
13న విభజన బిల్లు రాష్ట్రపతి నుంచి రాష్ట్రానికి చేరింది. నిజానికి ఎప్పట్లా నవంబర్‌లోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ముగించి ఉంటే టీ బిల్లుపై చర్చ తదితరాలకు ఆస్కారమే ఉండేది కాదని సీమాంధ్ర నేతలంటున్నారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువును పొడగించాలని కోరడమూ వీలయ్యేదని చెబుతున్నారు. ఇవేమీ చేయకపోగా, అసెంబ్లీ నిర్వహణ విధివిధానాల ఖరారుకు 11న జరిగిన బీఏసీ సమావేశానికి కూడా కిరణ్ హాజరు కాలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా హాజరు కాలేదు. విభజన బిల్లు సభలో ప్రవేశపెట్టాలని ఆ భేటీలో తీర్మానించారు. వారిద్దరు గనుక బీఏసీకి హాజరై ఉంటే, వారు ముందుగా అనుకున్నట్టే అసెంబ్లీసమావేశాలు డిసెంబర్ 14తో నిరవధికంగా వాయిదా పడేవి. వారు రాని కారణంగా డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తదితర తెలంగాణ నేతలు సమావేశాలను ఏడు రోజుల పాటు నిర్వహించాలని గట్టిగా పట్టుబట్టడం, అందుకు ఆమోదముద్ర పడటం జరిగిపోయాయని సీమాంధ్ర నేతలు వాపోతున్నారు.
విభజన బిల్లుపై చర్చ ఈ సమావేశాల్లోనే మొదలవాలని అధిష్టానం ఆదేశించిన కారణంగానే కిరణ్ వ్యూహాత్మకంగా బీఏసీకి డుమ్మా కొట్టారని భావిస్తున్నారు. తీరా విభజన బిల్లుపై చర్చకు తేదీని ఖారారు చేసేందుకు మరోసారి నిర్వహించిన బీఏసీలో పాల్గొన్న కిరణ్, ‘బిల్లుపై చర్చ జరగాలి. దీనిపై మీ మీ అభిప్రాయాలు చెప్పండి’ అని ఆయా పార్టీలకు సూచించడం సీమాంధ్ర నేతలను విస్మయపరిచింది! పైగా విభజన బిల్లుపై చర్చను మూడు విడతలుగా చేపట్టాలన్న సీఎం సూచనపైనా సీమాంధ్ర నేతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రపతి ఇచ్చిన గడువును పూర్తిగా ఉపయోగించుకుంటామన్న కారణం చూపి మొత్తం మీద బిల్లుపై విస్తృత స్థాయి చర్చ జరిగినట్టు చూపేందుకే ఈ ప్రతిపాదన తెచ్చారంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నాయకత్వానికి వ్యతిరేకంగా చిన్న మాటన్నా షోకాజులు, సస్పెన్షన్లకు దిగడం కాంగ్రెస్ అధిష్టానానికి రివాజు. అలాంటిది, నేరుగా అధిష్టానాన్నే ధిక్కరిస్తున్నట్టుగా కిరణ్ పైకి ఎన్ని వ్యాఖ్యలు, ప్రకటనలు చేసినా పెద్దలు చూసీ చూడనట్టు పోయిందంటే, అంతా హస్తిన స్క్రిప్టు ప్రకారమే జరిగిందని చెప్పకనే చెప్పినట్టేనన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ శిబిరం నుంచే విన్పిస్తున్నాయి. క బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగే కీలక సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్ వచ్చి, బిల్లుపై చర్చకు ఏ రోజున బీఏసీ భేటీ జరగాలి మొదలుకుని పలు అంశాలపై ‘దిశానిర్దేశం’ చేయడాన్ని అంతా గమనించారని సీమాంధ్రకు చెందిన మంత్రి ఒకరు నిర్వేదంగా వ్యాఖ్యానించారు.
12/18/2013
వైఎస్ఆర్ సిపికి కామన్ గుర్తుగా సీలింగ్ ఫ్యాన్
Written By news on Wednesday, December 18, 2013 | 12/18/2013
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం(సిఇసి) సీలింగ్ ఫ్యాన్ ను కామన్ గుర్తుగా కేటాయించింది. రాష్ట్రంలోని 294 శాసనసభ, 42 లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసే పార్టీ అభ్యర్థులకు సీలింగ్ ఫ్యాన్ కామన్ గుర్తుగా ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పంపిన ఉత్తర్వులు పార్టీ కార్యాలయానికి అందాయి.
పార్టీ లోక్ సభ, శాసనసభ సభ్యులు గత ఉప ఎన్నికల్లో ఈ గుర్తుపైనే గెలిచారు. అదే సీలింగ్ ఫ్యాన్ ను కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీకి కేటాయించడం పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీలింగ్ ఫ్యాన్ గుర్తును రాష్ట్రంలో ఎవరికీ కేటాయించరు.

రాజేష్ పై కావూరి దొంగ కేసులు పెట్టించారు: వైఎస్సార్సీపీ
చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ అరెస్టును వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. అధికారులపై కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఒత్తిడి చేసి.. మద్దాల రాజేష్‌పై దొంగకేసులు పెట్టించారని, ఆయనను ఓ ఉగ్రవాది తరహాలో బంధించి మరీ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కావూరి సాంబశివరావు సమైక్యాంధ్రకు ద్రోహం చేసినందుకే ప్రజలు ఆయనను నిలదీశారని, అలాంటి సమయంలో సమైక్యవాదులపై దాడులు చేయించడం కావూరికి తగదని ఎమ్మెల్యేలు అన్నారు.
కంపెనీల్లో అక్రమ పెట్టుబడుల కోసం కావూరి సమైక్యవాదాన్ని తాకట్టు పెట్టారని శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. తక్షణమే మద్దాల రాజేష్ పై కేసులు ఉపసంహరించి కావూరి క్షమాపణ చెప్పాలని, లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమైక్య ద్రోహులెవరికైనా ప్రజలు ఇలాగే బుద్ధి చెబుతారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సిపి అఫిడవిట్లు
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ కు అఫిడవిట్లు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ శాసనసభ్యులు రెండు పేజీల అఫిడవిట్లు సిద్ధం చేశారు. విభజనను వ్యతిరేకిస్తూ పలు కారణాలను ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
వైఎస్ఆర్ సిపి అటు లోక్ సభలోనూ, ఇటు శాసనసభలోనూ రాష్ట్ర సమైక్యత కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. అవిశ్వాసంపై చర్చ జరగాలని వైఎస్ఆర్ సిపి సభ్యులు పట్టుబట్టి ఆందోళనకు దిగడంతో స్పీకర్ రెండు రోజుల ముందుగానే లోక్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. శాసనసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వైఎస్ఆర్ సిపి సభ్యులతోపాటు ఇతర సభ్యుల ఆందోళనతో శాసనసభను రేపటికి వాయిదా వేశారు.

ఇదిలా ఉండగా, విభజన బిల్లులోని అంశాలపై సమగ్ర సమాచారం లేకుండా చర్చ ఎలా జరుపుతారంటూ వైఎస్ఆర్ సిఎల్ పి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ కు లేఖ రాసింది.
12/18/2013
అవిశ్వాసానికి పట్టుబడితే వాయిదావేశారు

న్యూఢిల్లీ: తమ పార్టీ సభ్యులు అవిశ్వాస తీర్మానంపై పట్టుబడితే లోక్ సభను వాయిదావేశారని వైఎస్ఆర్ సిపి సిజిసి సభ్యుడు ఎంవి మైసూరా రెడ్డి చెప్పారు. లోక్ బిల్లుకు ఆమోదం తెలిపిన తరువాత వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన రెడ్డితోపాటు ఆ పార్టీ సభ్యులు సమైక్యనినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు. సమైక్య నినాదాల హోరులో సభ జరిగే అవకాశం లేకపోవడంతో స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు.
అనంతరం మైసూరా రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలను మొక్కుబడిగా నడిపించారని విమర్శించారు. లోక్‌పాల్ బిల్లుకు మద్దతిస్తూ స్పీకర్‌కు తాము లేఖ ఇచ్చినట్లు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 సవరణపై చర్చజరిగాలని వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. ప్రభుత్వానికి సమస్యలపై చర్చించే చిత్తశుద్ధిలేదన్నారు. ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని మండిపడ్డారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందిన తరువాత అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుబడితే సభను వాయిదా వేశారని మైసూరా రెడ్డి చెప్పారు.

న్యూఢిల్లీ: లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. లోక్ పాల్ బిల్లును ఆమోదించిన తర్వాత సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. సీమాంధ్ర ఎంపీల అవిశ్వాస తీర్మాన నోటీసులతో రెండ్రోజులు ముందుగానే సమావేశాలను కేంద్రం ముగించింది.
సీమాంధ్ర సభ్యుల ఆందోళనల మధ్యే లోక్‌పాల్ బిల్లుకు లోక్ సభ ఈ రోజు ఆమోదం తెలిపింది. యూపీఏ ప్రభుత్వంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించాలని సీమాంధ్ర ఎంపీలు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద వైఎస్‌జగన్ సహా ఎంపీల ఆందోళన చేపట్టారు. అవిశ్వాసానికి వైఎస్సార్‌సీపీ నోటీసు ఇచ్చింది. సీమాంధ్ర ఎంపీల అవిశ్వాస నోటీసులను సభలో స్పీకర్ ప్రస్తావించారు. ఈ రోజు రెండు అవిశ్వాస తీర్మాన నోటీసులందాయని కూడా తెలిపారు. సభ నిర్వహణకు సహకరిస్తే నోటీసులను పరిగణలోకి తీసుకుంటానని స్పీకర్ చెప్పారు. అయితే చర్చకు మాత్రం అనుమతివ్వలేదు. దీంతో సీమాంధ్ర ఎంపీలు ఆందోళన కొనసాగించారు.
సభ జరిగే అవకాశం లేకపోవడంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు. తమకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానం నెగ్గుతుందన్న భయంతోనే లోక్ సభ సమావేశాలను కేంద్రం వాయిదా వేయిందని సీమాంధ్ర ఎంపీలు ఆరోపించారు. అవిశ్వాస తీర్మాన నోటీసులను స్వీకరించిన స్పీకర్- దీనిపై సభలో చర్చకు అనుమతించకపోవడం తమ ఆరోపణలకు బలాన్నిస్తోందని వారంటున్నారు
అవిశ్వాసం రాకుండా లోక్‌సభ నిరవధికంగా వాయిదా

హైదరాబాద్ : సమైక్య తీర్మానానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. బుధవారం ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ సమైక్య ముసుగులో సీఎం, చంద్రబాబు విభజనకు పాల్పడుతున్నారని విమర్శించారు. సమగ్ర సమాచారం లేకుండా బిల్లుపై చర్చ సాధ్యం కాదని శోభా నాగిరెడ్డి స్పష్టం చేశారు. సమైక్య తీర్మానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని ఆమె అన్నారు.
విభజనకు కిరణ్, బాబు సహకరిస్తున్నారు

12/18/2013
సాక్షి, హైదరాబాద్: బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ప్రజా శ్రేయస్సు పట్టదా? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. తన పార్టీ రెండు ప్రాంతాల్లో బతకాలంటారే తప్ప, ప్రజల శ్రేయస్సు కోసం రెండు ప్రాంతాలు కలిసుండాలని ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, గొల్ల బాబూరావు, టి.బాలరాజు, శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. విభజన వల్ల రెండు ప్రాంతాలకు తీరని నష్టం వాటిల్లుతుందని తెలిసినప్పటికీ తన రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్నారని చంద్రబాబుపై భూమన మండిపడ్డారు.ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ మాదిరిగా చంద్రబాబు కూడా ఇంత ఘోరంగా దిగజారడం చూసి ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని చెప్పారు. తాము మాత్రం ప్రజల తరఫునే నిలబడ్డామని, రాజకీయంగా నష్టపోయినా ఫర్వాలేదని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని బీరాలు పలికి, చివరకు విభజనకు తలుపులు బార్లా తెరిచిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు.
బీఏసీకి హాజరు కాలేదేమి?: h
ప్రధాన ప్రతిపక్షస్థానంలో ఉన్న చంద్రబాబు బీఏసీ సమావేశానికి హాజరుకాకపోవడాన్ని ఏ సిద్ధాంతమంటారో ఆయనే చెప్పాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీఏసీకి కూడా బాబు ఇరుప్రాంత నేతలను పంపించి ద్వంద్వ వైఖరిని అవలంబించారని దుయ్యబట్టారు.
బాబుకు ప్రజాశ్రేయస్సు పట్టదా?

బీఏసీకి హాజరు కాలేదేమి?: h
ప్రధాన ప్రతిపక్షస్థానంలో ఉన్న చంద్రబాబు బీఏసీ సమావేశానికి హాజరుకాకపోవడాన్ని ఏ సిద్ధాంతమంటారో ఆయనే చెప్పాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీఏసీకి కూడా బాబు ఇరుప్రాంత నేతలను పంపించి ద్వంద్వ వైఖరిని అవలంబించారని దుయ్యబట్టారు.
12/18/2013
సాక్షి, న్యూఢిల్లీ :
రెండుసార్లు జగన్ బైఠాయింపు

- స్పీకర్ పోడియం వద్ద బైఠాయింపు..
- జత కలిసిన ఎంపీలు మేకపాటి, ఎస్పీవై
- ‘ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలి’ అంటూ ప్లకార్డుల ప్రదర్శన..
- స్తంభించిన సభ.. కొనసాగిన వాయిదాల పర్వం
- మరోవైపు సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీల నిరసన
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం లోక్‌సభలో తీవ్రస్థాయిలో ఆందోళన సాగించారు. మంగళవారం సభలో ఆయన స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి బైఠాయించారు. ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆయన వెంట పోడియం వద్ద బైఠాయించిన ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నినదించారు. ‘సేవ్ డెమొక్రసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ’, ‘కీప్ ఆంధ్రప్రదేశ్ యునెటైడ్’ అని మేకపాటి, ఎస్పీవై ప్లకార్డులు ప్రదర్శించారు. గతవారం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జగన్‌తో ఎంపీలు మేకపాటి, ఎస్పీవైతో కలిసి విభజనకు వ్యతిరేకంగా ఆందోళన సాగించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉభయసభలు కేంద్రమంత్రి శీష్‌రాం ఓలా మృతికి నివాళులర్పించి మంగళవారానికి వాయిదాపడ్డాయి. మంగళవారం లోక్‌సభలో గతవారం మాదిరిగానే వాయిదాల పర్వం కొనసాగింది.
దీంతో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే సభ బుధవారానికి వాయిదాపడింది. రాజ్యసభ కూడా ఉదయం 11 గంటలకు సమావేశమైన వెంటనే గొడవతో 12కు వాయిదాపడింది. 12కు తిరిగి సమావేశమైనపుడు రాజ్యసభ లోక్‌పాల్ బిల్లుపై చర్చించి ఎట్టకేలకు ఆమోదం తెలిపింది.
రెండుసార్లు జగన్ బైఠాయింపు: ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశం కాగానే ఇతర పార్టీల సభ్యులతోపాటు జగన్, మేకపాటి, ఎస్పీవై పోడియం వద్దకు వెళ్లారు. జగన్, ఎస్పీవై అక్కడే బైఠాయించి నినాదాలు అందుకున్నారు. ఇటువైపు ఈ ముగ్గురూ, అటువైపు టీడీపీ, కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు, ఇంకా ఇతరపక్షాల సభ్యులు కలిసి సాగించిన ఆందోళనతో లోక్‌సభ దద్దరిల్లింది. వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన సాగించిన సభ్యుల్లో కాంగ్రెస్ నుంచి సబ్బం హరి, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్‌కుమార్, టీడీపీ నుంచి ఎన్.శివప్రసాద్, ఎం.వేణుగోపాల్‌రెడ్డి, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణరావు ఉన్నారు.
సభ సాగడానికి సహకరించాలని స్పీకర్ మీరా కుమార్ చేసిన విజ్ఞప్తిని ఆందోళన చేస్తున్న సభ్యులు లెక్కపెట్టలేదు. ఫలితంగా.. ప్రారంభమైన రెండు నిమిషాలకే సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తిరిగి సభ ప్రారంభమైనప్పుడు ఉదయం దృశ్యాలే పునరావృతమయ్యాయి. జగన్, ఎస్పీవై, మేకపాటి స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి బైఠాయించి నినాదాలు చేయసాగారు. అటుపక్కన కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి ఉదయం తరహాలోనే తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. జస్టిస్ గంగూలీని తొలగించాలంటూ సౌగత రాయ్ (తృణమూల్) నినాదాలు చేశారు. చైనా దళాలు తరచూ భారత భూభాగంలోకి చొరబడడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ సమాజ్‌వాది పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. వేరే అంశాలపై మరికొందరు సభ్యులు ఆందోళనకు దిగారు.
గందరగోళంలోనే బిల్లులు, పద్దులు: సభలో గందరగోళం నెలకొన్నా.. వివిధ శాఖల పార్లమెంటరీ స్థాయీ సంఘాల నివేదికలు, బిల్లులను సభలో ప్రవేశపెట్టడానికి స్పీకర్ అనుమతించారు. మంత్రులు, సభ్యులు.. మొత్తం 30 మంది నివేదికలు, సవరణ బిల్లులను సభ ముందు ఉంచారు. ఆఖరున.. తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎస్టీల జాబితాను సవరించడానికి వీలుగా రాజ్యాంగ సవరణ బిల్లును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిషోర్ చంద్రదేవ్ బిల్లును సభకు సమర్పించారు. ఈ తతంగమంతా పూర్తికావడానికి 15 నిమిషాలు పట్టింది. అంతసేపూ జగన్ పోడియం వద్ద కూర్చుని నినదిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తయిన వెంటనే స్పీకర్ అవిశ్వాస నోటీసును ప్రస్తావించారు. ‘‘టీడీపీ ఎంపీ ఎం.వేణుగోపాలరెడ్డి, ఇతరులు ఇచ్చిన అవిశ్వాస నోటీసును సభ ముందుంచడం నా బాధ్యత. నోటీసును చేపట్టాలంటే.. సభలో 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి. సభ సజావుగా సాగితే.. 50 మంది సభ్యులను లెక్కబెట్టడానికి వీలవుతుంది. సభ సాగడానికి సహకరించండి’’ అని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. మిగతా సభ్యులెవరూ పట్టువీడటానికి సిద్ధంగా లేకపోవడంతో ఆమె 12.17కు సభను బుధవారానికి వాయిదా వేశారు.
మీకో దండం: దిగ్విజయ్‌తో జగన్
లోక్‌సభ వాయిదా పడిన తర్వాత ఎంపీలు మేకపాటి, ఎస్పీవై రెడ్డితో కలిసి జగన్‌మోహన్‌రెడ్డి కొంతసేపు పార్లమెంటు సెంట్రల్‌హాలులో గడిపారు. వెలుపలికి వస్తున్న సమయంలో జగన్‌ను... హాలు ద్వారానికి ఓ వైపున విలేకరులతో మాటామంతీ సాగిస్తున్న దిగ్విజయ్‌సింగ్ గమనించారు. ఆయన జగన్‌వైపు తిరిగి... ‘జగన్, మిస్టర్ జగన్... ప్లీజ్ కం.. ప్లీజ్ కం’ అని రమ్మని పిలిచారు. దీనికి జగన్ ప్రతిస్పందిస్తూ తానున్న చోటునుంచే చేతులెత్తి నమస్కారం పెట్టి ముందుకు కదలబోయారు. ఇది చూసిన దిగ్విజయ్, ‘మీరు నాతో మాట్లాడదల్చుకోలేదా?’ అని జగన్‌ను ప్రశ్నించారు. ‘అవును, నేను మాట్లాడదల్చుకోలేదు’ అని జగన్ బదులిచ్చి సహ ఎంపీలతో కలిసి ముందుకు నడిచి అక్కడినుంచి నిష్ర్కమించారు.
Subscribe to:
Posts (Atom)