
ఈ ఏడాదే సమైక్య ఉద్యమం ఊపందుకుంది. ఉద్యమానికి జైలు నుంచే జగన్ మద్దతు పలికారు. అంతేకాకుండా జైలులో ఉండే సమైక్య రాష్ట్రం కోసం నిరవధిక దీక్ష చేశారు. జనానికి ఇంకా చేరువయ్యారు. న్యాయం జగన్ పక్షాన ఉండటంతో ఎంతకాలం జైలులో ఉంచగలరు? ఈ ఏడాది అక్టోబరు 24న బెయిలుపై విడుదలయ్యారు. పడిన కెరటం మళ్లీ పైకి లేచింది. సమైక్య శంఖారావం పూరించారు. సమైక్యవాదులకు అండగా నిలిచారు. ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అక్టోబరు 26న భారీ స్థాయిలో సమైక్య శంఖారావం బహిరంగ సభ విజయవంతంగా నిర్వహించారు. సమైక్యవాదుల ఆశాజ్యోతిగా నిలిచారు. జాతీయ స్థాయిలో సమైక్యవాణి వినిపించారు. దేశమంతటా పర్యటించి జాతీయ నాయకులను కలిశారు. సమైక్యతకు మద్దతు కూడగట్టారు. దేశమంతా రాష్ట్రం వైపు చూసే విధంగా లోక్సభలో ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయం గురించి ఎలుగెత్తి చాటారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నిజాయితీగా, పట్టుదలతో పోరాడుతున్న ఏకైక నేత జగన్.
రాష్ట్రం విడిపోతే తలెత్తే సమస్యలు నదీ జలాలు - ఉద్యోగులకు జీతాలు - యువతకు ఉద్యోగాలు - కొత్త రాజధాని ఏర్పాటు.... వంటి సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టారు. రాష్ట్రం విడిపోతే రెండు రాష్ట్రాలు నష్టపోతాయని హెచ్చరించారు. నీటి కోసం నిత్యం తన్నుకునే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సమైక్యంగా ఉంచడం కోసం చివరి క్షణం వరకు పోరాడతానని శపథం చేశారు. ఆ శపథానికి కట్టుబడి ముందుకు సాగుతున్నారు