29 December 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రాష్ట్రాన్ని గాలికొదిలేసిన అసమర్ధనేత చంద్రబాబు

Written By news on Saturday, January 4, 2014 | 1/04/2014

'రాష్ట్రాన్ని గాలికొదిలేసిన అసమర్ధనేత చంద్రబాబు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో నిర్ణయాన్ని వెల్లడించకుండా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తమ విధానాన్ని చెప్పకుండా రాష్ట్రాన్ని గాలికొదిలేసిన అసమర్ధనేత'' అని వైఎస్సార్ కాంగ్రెస్ నేత జూపూడి ధ్వజమెత్తారు.
 
చంద్రబాబు తన హయాంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేశారా? ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లుపొడిచింది వాస్తవం కాదా? అని మండిపడ్డారు. చంద్రబాబూ నీ వాగ్దానాలన్నీ నీటి మీద రాతలే కదా? ఆయన ఎద్దెవా చేశారు. చంద్రబాబు అంతా అబద్దాల కోరు మరొకరున్నారా? అంటూ జూపూడి ప్రభాకార రావు విమర్శించారు.

స్పీకర్ కు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పిటిషన్

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతోపాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్ కు పిటిషన్ అందజేశారు. మొత్తం 11 పేజీల పిటిషన్ ను స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు వైఎస్ విజయమ్మ అందజేశారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే ఏర్పడే నష్టాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పిటిషన్ లో వివరించింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ... రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ కు పిటిషన్ ఇచ్చిన మొట్టమొదటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
 

YS Vijayamma addressing to media at Assembly Media Point

యూపీని కాకుండా ఏపీనే ఎందుకు విభజిస్తున్నారు

యూపీని కాకుండా ఏపీనే ఎందుకు విభజిస్తున్నారు
హైదరాబాద్ : : ఎనిమిదిన్నర కోట్ల తెలుగు ప్రజలను ఎలా విభజన చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. నాయకుల కోసమే రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ఏర్పాటు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 20 కోట్లు  జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ ను కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ను మాత్రమే ఎందుకు హడావిడిగా విభజన చేస్తున్నారని విజయమ్మ అన్నారు. దేశంలో హిందీ తర్వాత తెలుగు మాట్లాడే ప్రజలే ఎక్కువ మంది ఉన్నారన్నారు.

 సంప్రదాయం ప్రకారం విభజనకు అసెంబ్లీ తీర్మానం జరపాలని ఆమె కోరారు. శాసనసభ వాయిదా అనంతరం విజయమ్మ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. విభజనపై కనీస సాంప్రదాయాలను కూడా కేంద్రం పాటించటం లేదని ఆమె మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాలు అయిన జార్ఖండ్, చత్తీస్ గఢ్ ఏర్పడినప్పుడు ఎస్సార్సీతోనే విభజన జరుగుతుందన్నారు. కనీస తీర్మానం లేకుండా విభజన ప్రక్రియ ఎలా చేస్తారని విజయమ్మ ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీలో తీర్మానం తర్వాతే తెలంగాణ బిల్లుపఐ చర్చ ఉండాలన్నారు.

చిదంబరం ప్రకటనలోనూ రాజకీయ ఉద్దేశాలు కనిపిస్తున్నాయని అన్నారు. పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతుంటే అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కళ్లు మూసుకున్నారని విజయమ్మ ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు లేక రాష్ట్రం నీళ్లు కోల్పోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్మట్టిలా ప్రాజెక్టులు కట్టి ఉంటే ఎన్నో నీళ్లు దక్కేవన్నారు. రాష్ట్ర విభజన కంటే సమైక్యానికే రాష్ట్రంలో ఎక్కువ మద్దతు ఉందని విజయమ్మ అన్నారు.

విభజన జరిగితే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ ఉప్పునీళ్లే గతి అని....కట్టిన ప్రాజెక్టులకు నీళ్లు ఎలా వస్తాయని విజయమ్మ ప్రశ్నించారు. కలిసి ఉన్నప్పుడే కృష్ణా జలాల పంపిణీపై ట్రిబ్యునల్ ప్రయోజనాలు నెరవేరటం లేదని ఆమె గుర్తు చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతానికి నీళ్లు ఎలా ఇస్తారన్నారు. చంద్రబాబు చేసిన పాపం రాష్ట్రానికి శాపంలా మారిందన్నారు. కలిసి ఉన్నప్పుడే జల కలహాలు ఉంటే విడిపోతే ఎలా అని ప్రశ్నించారు. దిగువ రాష్ట్రాల వాళ్లు ఎలా బతకాలో యూపీఏ చెప్పాలని విజయమ్మ డిమాండ్ చేశారు.

అన్ని పరిశ్రమాలు హైదరాబాద్ కే పరిమితం అయ్యాయని విజయమ్మ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజధానితో పాటు మిగతా నగరాలు కూడా అభివృద్ధి చెందాయన్నారు. గత అరవై ఏళ్లుగా కలిసి అభివృద్ధి చేసుకున్న ప్రాంతాన్ని వీడిపోవాలంటే ఎలా అన్నారు.  పరిష్కారం చూపకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారన్నారు.

సమైక్య తీర్మానం చేసేంతవరకూ అడ్డుకుంటాం

అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి తీరాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా మన రాష్ట్రంలో మాత్రమే అసెంబ్లీలో తీర్మానం చేయకుండా విభజించాలని భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వీలుగా సమైక్య తీర్మానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర విభజన అంశాన్ని రిఫరెండంగా తీసుకుని ఎన్నికలకు వెళదామని వైఎస్‌ఆర్‌సీపీ మిగిలిన పార్టీలకు సవాల్‌ విసిరింది. ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే మిగిలిన పార్టీలు తమ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధమా అని వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. సమైక్యమే తమ అజెండా అని మిగిలిన పార్టీలు వారి వైఖరి వెల్లడించాలని డిమాండ్‌చేశారు.

సమైక్య తీర్మానం చేసేంతవరకూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటామని వైఎస్‌ఆర్‌సీపీ స్పష్టంచేసింది. టీడీపీ నేతలు కొందరు సమైక్యమంటూ... మరికొందరు విభజనకు అనుకూలంగా నినాదాలు చేస్తూ గందరగోళానికి గురిచేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు విమర్శించారు. టీడీపీ వైఖరి ఏమిటనేది ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రజలకు స్పష్టంచేయాలని డిమాండ్‌ చేశారు

నిజమైన సమైక్య ఉద్యమ నేత జగన్

వీరవాసరం, న్యూస్‌లైన్ :
 నిజమైన సమైక్యాంధ్ర ఉద్యమ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని వైఎ స్సార్ సీపీ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. వీరవాసరం తూర్పు చెర్వు సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు సమైక్యాంధ్ర కోసం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు చెప్పారు. న్యాయపరంగా పోరాడి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ధీమా వ్యక్తం చేశారు. భీమవరం నియోజకవర్గ ఇన్‌చార్జి గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ, బీజేపీలను వచ్చే ఎన్నికల్లో బంగాళా ఖాతంలో కలపాలని నినదించారు. పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయ సాధన జగన్ వల్లే సాధ్యమన్నారు.
 
  వీరవాసరం గ్రామానికి చెందిన వెలమ యూత్, విశ్వ బ్రహ్మణ సంఘం, తెలగా సంఘ యూత్, చినపేట, పెదపేటకు చెందిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రఘురామకృష్ణంరాజు, గ్రంధి శ్రీనివాస్‌లు వారికి పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అల్లు వెంకట సత్యనారాయణ, మేడిద జాన్సన్, వేగేశ్న కనకరాజు సూరి, గుణ్ణం నాగబాబు, ఆకెన వీరాస్వామి, కోటిపల్లి బాబు, నాగరాజు వెంకట శ్రీనివాసరాజు, గూడూరి ఓంకా రం, నేతల జ్ఞానసుందరరాజు, చికిలే మంగతాయారు, అమిరపు నాగభూషణశర్మ, నూకల కనకారావు, నాగరాజు సత్యనారాయణరాజు, కోడే యుగంధ ర్, రేవూరి గోగురాజు, పేరిచర్ల నరసిం హరాజు, మద్దాల రమణ, ముదునూరి రామకృష్ణంరాజు,కాటం స్టాన్లీరాజు, రెడ్డి రాంబాబు, పెద్దిరెడ్డి రామారావు, పైడికొండల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Naidu won with bogus votes from Kuppam, says Srikanth Reddy

Written By news on Friday, January 3, 2014 | 1/03/2014

బాబు.. బోగస్ బాబా? దొంగ బాబా?

బాబు.. బోగస్ బాబా? దొంగ బాబా?వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని కుప్పంలో బోగస్ ఓట్లతో గెలవడమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విజయరహస్యమని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాబు బోగస్ ఓట్లపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుని బోగస్ బాబు అనాలా? లేదా దొంగ బాబు అనాలా ? అని శ్రీకాంత్ రెడ్డి ఎద్దెవా చేశారు.

కుప్పం బోగస్‌ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. కాగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రాష్ట్ర బంద్ విజయవంతమైందని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

శాఖ మార్పు.. సమైక్యాంధ్ర కోసం కాదు

`శాఖ మార్పు.. సమైక్యాంధ్ర కోసం కాదు`
విశాఖపట్నం: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత కీలక తరుణంలో శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును తప్పించడంపై తెలంగాణలో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పు అంశం ఇరు ప్రాంతాల్లో భావోద్వేగాలు పెంచడానికే తప్ప సమైక్యాంధ్ర కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసింది కాదని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ విమర్శించారు. సమైక్య తీర్మానం అసెంబ్లీ చేయాల్సిందేనని కొణతాల పేర్కొన్నారు. కాగా, శ్రీధర్ బాబు శాఖను మార్చి వాణిజ్య పన్నుల శాఖ అప్పగించడాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా వ్యతిరేంచిన సంగతి తెలిసిందే.

Samaikya agitation: YSRCP bandh in Kurnool

సమైక్యాంధ్రకు మద్దతుగా కొనసాగుతున్న బంద్

హైదరాబాద్ : రాష్ట్ర విభజన బిల్లుపై చర్చను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సీమాంధ్రలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. విభజన బిల్లుపై రాష్ట్ర అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన విధానాన్ని వైఎస్ఆర్ సీపీ తీవ్రంగా నిరసిస్తోంది. జగన్ పిలుపు మేరకు సమైక్యవాదులు బంద్‌లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.పలు వ్యాపార సంస్థలు... స్వచ్చందంగా బంద్‌లో పాల్గొన్నాయి.

విభజన బిల్లుపై చర్చను వ్యతిరేకిస్తూ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు సీమాంధ్రలో బంద్ జరుగుతోంది. గుంటూరు, విశాఖ, కృష్ణ, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో తెల్లవారుజాము నుంచే బంద్ కొనసాగుతోంది. పార్టీ శ్రేణులతోపాటు సమైక్యవాదులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. డిపోల నుంచి బస్సులు బయట రావటం లేదు.

మరోవైపు బంద్‌తోపాటు నేటి నుంచి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌ పార్టీ శ్రేణులకు, సమైక్యవాదులకు పిలుపునిచ్చారు. 4న మోటారు సైకిళ్ల ర్యాలీ, 6న మానవహారాలు, 7 నుంచి 10 వరకు తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఆపార్టీ నిర్ణయించింది. శాసనసభా సమావేశాల్లో జరిగే పరిణామాలను బట్టి ఆ తదుపరి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయనుంది. ఈ నెల ఐదు నుంచి సమైక్య శంఖారావం యాత్రను జగన్‌ పునఃప్రారంభించనున్నారు. చిత్తూరు జిల్లా తంబంళ్లపల్లి నుంచి సమైక్య శంఖారావం ప్రారంభం కానుంది

బాబు అండతోనే కేంద్రం విభజన చేస్తోంది

బాబు అండతోనే కేంద్రం విభజన చేస్తోందివీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : శాసనసభలో సమైక్య తీర్మానమే లక్ష్యంగా తాము పని చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తక్షణమే సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లి మీడియా పాయింట్ వద్ద భూమన మాట్లాడుతూ... విభజనతో రెండు ప్రాంతాలకు ఇబ్బందులు తప్పవన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓట్లు, సీట్లు కోసమే విభజిస్తున్నారని ఆరోపించారు.
 
రాజకీయ లబ్ది కోసమే తెలంగాణ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. విభజనతో ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల నదీ జలాలు విషయంలో తీవ్ర సమస్యలు ఏర్పడతాయన్నారు. దీని వల్ల సీమాంధ్రలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అండ చూసుకుని కేంద్ర ప్రభుత్వం విభజనకు దిగిందని ఆయన వెల్లడించారు.

లౌకిక పార్టీ వైయస్ఆర్ సి‌పినే -అమీర్ అలీ ఖాన్


బాబు..బోగస్ కుప్పం

http://www.sakshi.com/video/news/bogus-voter-list-in-babu-constituency-8702?pfrom=home-top-videos

కుప్పంలో 43 వేల బోగస్ ఓట్లున్నాయని భన్వర్‌లాల్ వెల్లడి
 
 సాక్షి, చిత్తూరు/కుప్పం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెలుపు బాగోతం బట్టబయలైంది. ఆయన కుప్పంనుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించడానికి కుప్పలు తెప్పలుగా ఉన్న బోగస్ ఓట్లే కారణమని వెల్లడైంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక కూడలిగా ఉంది. నియోజకవర్గంలోని నాలుగు వుండలాల్లో 1.96 లక్షలకుపైగా ఓటర్లుండగా... అందులో 43 వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ 15 రోజుల కిందట చేసిన ప్రకటన రాష్ర్టవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతో కంగుతిన్న అధికారులు ఓటర్ల జాబితాను చక్కదిద్దే పనులను హడావుడిగా చేపట్టారు. ఈ క్రమంలో బోగస్ ఓటర్లపేర్లు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి.
 
ఇందులో సుమారు 20వేల వరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారని అధికారులు చెబుతున్నారు. కుప్పం ప్రాంతంలో ఒక సావూజికవర్గానికి చెందిన ఓట్లు 40 శాతం వరకు ఉన్నాయి. ఈ సామాజికవర్గానికి చెందిన వారికి కుప్పం, తమిళనాడు రాష్ట్రంలో బంధువులు అధికంగా ఉన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం వీరందరూ రెండు రాష్ట్రాల్లోనూ ఓటరు, రేషన్‌కార్డులు పొంది ఉన్నారని వెల్లడైంది. ఇటీవల నియోజకవర్గ పరిధిలోని రావుకుప్పం వుండలం కెంచనబల్ల పంచాయుతీ పరిధిలోని ఓటర్ల జాబితాను అధికారులు పరిశీలించారు. ఈ పంచాయుతీ పరిధిలో 2,689 వుంది ఓటర్లున్నారు. వీరి పేర్లే శాంతిపురం వుండలం బడుగువూకులపల్లె, కుప్పం పట్టణంలోని బీసీ కాలనీలోని ఓటర్ల జాబితాలోనూ ఉన్నట్లు తేలింది. ఈ పంచాయుతీలోనే 500 పైగా బోగస్ ఓట్లు ఉన్నట్లు నిర్ధారించారు. గుడుపల్లె వుండలంలోని పొగురుపల్లె, గుండ్లసాగరం పంచాయుతీల్లో 100కు పైగా ఓటర్లు ఇతర రాష్ట్రాల వారు ఉన్నట్లు తేలింది.
 
 టీడీపీ ఇన్‌చార్జ్ ఇలాకాలో భారీగా బోగస్ ఓట్లు
 
 కుప్పం నియోజకవర్గంనుంచి చంద్రబాబు నాయుడు 1989 నుంచి వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. 1989లో 6,918, 1994లో 56,518, 1999లో 65,687, 2004లో 59,558, 2009లో 44,885 ఓట్ల మెజారిటీ సాధించారు. 1989లో మొదటిసారి సాధించిన మెజారిటీకి తరువాత 1994లో సాధించిన మెజారిటీకి మధ్య భారీ వ్యత్యాసం కనిపించడం బోగస్ ఓట్ల వల్లనేనన్న విమర్శలు వినవస్తున్నాయి. అప్పటినుంచే బోగస్ ఓటర్ల నమోదుకు శ్రీకారం జరిగివుంటుందని, అందువల్లనే ఆ తరువాత జరిగిన ప్రతి సాధారణ ఎన్నికల్లో కూడా అదే మెజారిటీ కొనసాగి ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
 కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పీఎస్ వుునిరత్నం ఇలాకా కంగుంది పంచాయతీలో భారీ ఎత్తున బోగస్ ఓట్లు బయుటపడటాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ఈ పంచాయతీలో 5,124 మంది ఓటర్లు ఉన్నారు. తమిళనాడులోని తివ్ముంబట్ట సమీపం అరసనాపురం పంచాయుతీకి చెందిన గొల్లపల్లె వాసులు 1,000 వుందికిపైగా కంగుంది పంచాయుతీలోనూ బోగస్ ఓటర్లుగా ఉన్నారు. వీరి మధ్య బంధుత్వం ఉండటంవల్ల రెండు ప్రాంతాల్లోనూ ఓటర్లుగా చలావుణీ అవుతున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పంచాయతీలో ఇలా ఉంటే నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నేతలు తమిళనాడు, కర్ణాటక ప్రాం తాల్లోని బంధువర్గానికి చెందిన 10నుంచి 20వేల మందిని ఇక్కడ ఓటర్లుగా న మోదు చేయించినట్లు తెలుస్తోంది. వారందర్నీ రప్పించి ఓట్లు వేసుకోవడం వల్లే బాబుకు మెజారిటీ తగ్గకుండా వస్తోందన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది.
 

 విచారిస్తే వెలుగులోకి వాస్తవాలు:కుప్పం నియోజకవర్గంలో బోగస్ ఓట్ల వ్యవహారంపై లోతుగా విచారణ జరిపితే మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉంది. 4 మండలాల్లోని పంచాయతీల్లో ప్రతి ఓటునూ తనిఖీ చేస్తే వేలసంఖ్యలో బోగస్ ఓట్లు వెలుగుచూడనున్నాయి. తమిళనాడులో ఉంటూ ఇక్కడ ఓటు పొం దిన వ్యక్తి ఇచ్చిన డోర్ నంబరులో ఇప్పుడు ఉంటున్నాడా లేక బంధువుల డోర్ నంబర్ ఇచ్చాడా అనేది పరిశీలించాల్సి ఉంది. ఇందుకోసం రెవెన్యూ యంత్రాం గం ఎక్కువ మంది సిబ్బందిని డెప్యుటేషన్‌పై నియమించి తనిఖీలు చేయాలి. ఇదే తరహా విచారణ కర్ణాటక సరిహద్దు గ్రామాల్లోనూ జరపాల్సి ఉంది.
 
 బోగస్ ఓట్లు తొలగిస్తాం: మునినారాయణ, తహశీల్దార్, కుప్పం
 
 వీఆర్వోలను క్షేత్రస్థాయిలో గ్రామాలకు పంపుతున్నాం. తమిళనాడు, కర్ణాటకవాసులు ఓటర్లుగా ఉన్న విషయమై విచారణ చేపడుతున్నాం. మూడు, నాలుగు రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతాం. బోగస్ ఓట్లను తొలగిస్తాం.

అధికార పార్టీ ఓట్ల రాజకీయం

పక్కి (బొబ్బిలి టౌన్), న్యూస్‌లైన్:స్థానికంగా లేని వారి పేర్లును ఓటర్ల జాబితాలో ఎలా చేర్చుతారని అడిగినందుకు అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో వైఎస్సార్ సీపీకి చెందిన ఓ కార్యకర్తకు తీవ్ర గాయూలయ్యూయి. బొబ్బిలి మండలంలోని పక్కి గ్రామంలో అదనంగా 143 మంది ఓటుహక్కు కలిగి ఉన్నారని, వాటిని తొలగించాలని కోరుతూ కొందరు స్థానికులు (ఫార్మ్-7లో) ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బొ బ్బిలి మండల ప్రత్యేకాధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి. గోవర్దనరావు గురువారం గ్రామంలో దర్యాప్తు చేపట్టారు. అరుుతే ఫిర్యా దుదారులు, ఓటర్ల జాబితాలో అదనంగా పేర్లు ఉన్న వారిలో కొంతమంది విచారణకు హాజరుకాలేదు. వచ్చిన కొంతమందిని అధికారులు విచారణ చేస్తుండగా.. అధికార పార్టీ నేత, ప్రభుత్వ మాజీ విప్ శంబంగి కారు డ్రైవర్ చిన్నా ఫిర్యాదుదారులపై దురుసుగా ప్రవర్తించారు. 
 
 దీన్ని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన మరికొంతమంది వ్యక్తులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బంకురు బాబూరావు, మరడ రాము, శంబంగి ధనంజయ్ నాయుడుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో బంకురు బాబూరావుకు తీవ్ర గాయాలయ్యాయి. విచారణ అధికారులు సమస్యా త్మకంగా గ్రామంగా గుర్తించి ముందుగానే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే ఉం డడంతో తోపులాట కాస్తా కొట్లాటకు దారి తీసింది. పోలీసులు, దర్యాప్తు అధికారులు ఇరువర్గాలను సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. 
 
 ఇక్కడ దర్యాప్తు చేస్తే తమకు రక్షణ లేదని వేరేచోట నిర్వహించాలని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రాత పూర్వకంగా దర్యాప్తు అధికారిని కోరడంతో ఆయన ప్రస్తుతానికి దర్యాప్తును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆయన అక్కడి బీఎల్‌ఓలతో సమీక్ష నిర్వహించారు. కాగా దాడిపై వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బంకురు బాబూరావు, రెడ్డి బాబూరావు, శంబంగి ధన ంజయ్‌నాయుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పక్కి సర్పంచ్ శంబంగి వేణుగోపాలనాయుడు, ప్రభుత్వ మాజీ విప్ శం బంగి వెంకట చినప్పలనాయుడు, ఆయన కారు డ్రైవర్ చిన్నా, రంభ కృష్ణమార్తి దాడికి కారణమని తెలిపారు. కాగా విచారణ కోసం ఇతర గ్రామాల నుంచి కొంతమంది ఓటర్లు మళ్లీ తాము విచారణకు హాజరుకాలేమని దర్యాప్తు అధికారికి తెలిపారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా కొనసాగుతున్న బంద్

 రాష్ట్ర విభజన బిల్లుపై చర్చను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సీమాంధ్రలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. విభజన బిల్లుపై రాష్ట్ర అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన విధానాన్ని వైఎస్ఆర్ సీపీ తీవ్రంగా నిరసిస్తోంది. జగన్ పిలుపు మేరకు సమైక్యవాదులు బంద్‌లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.పలు వ్యాపార సంస్థలు... స్వచ్చందంగా బంద్‌లో పాల్గొన్నాయి.

విభజన బిల్లుపై చర్చను వ్యతిరేకిస్తూ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు సీమాంధ్రలో బంద్ జరుగుతోంది. గుంటూరు, విశాఖ, కృష్ణ, ప్రకాశం, కర్నూలు, చిత్తూ,రు ప్రకాశం జిల్లాలో తెల్లవారుజాము నుంచే బంద్ కొనసాగుతోంది. పార్టీ శ్రేణులతోపాటు సమైక్యవాదులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. డిపోల నుంచి బస్సులు బయట రావటం లేదు.

మరోవైపు బంద్‌తోపాటు నేటి నుంచి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌ పార్టీ శ్రేణులకు, సమైక్యవాదులకు పిలుపునిచ్చారు. 4న మోటారు సైకిళ్ల ర్యాలీ, 6న మానవహారాలు, 7 నుంచి 10 వరకు తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఆపార్టీ నిర్ణయించింది. శాసనసభా సమావేశాల్లో జరిగే పరిణామాలను బట్టి ఆ తదుపరి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయనుంది. ఈ నెల ఐదు నుంచి సమైక్య శంఖారావం యాత్రను జగన్‌ పునఃప్రారంభించనున్నారు. చిత్తూరు జిల్లా తంబంళ్లపల్లి నుంచి సమైక్య శంఖారావం ప్రారంభం కానుంది.

5 నుంచి జగన్ సమైక్య శంఖారావం కొనసాగింపు

Written By news on Thursday, January 2, 2014 | 1/02/2014

5 నుంచి జగన్ సమైక్య శంఖారావం కొనసాగింపు
హైదరాబాద్: ఈ నెల 5వ తేదీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి  సమైక్య శంఖారావం కొనసాగించనున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అక్టోబర్ 26న హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో జగన్ సమైక్య శంఖారావం పూరించిన విషయం తెలిసిందే.

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి సమైక్యశంఖారావం  ప్రారంభమవుతుందని వైఎస్‌ఆర్‌ సీపీ ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం చెప్పారు.

గ్యాస్‌ ధరలు పెంచి ఇంటికే నిప్పు పెడుతుంది

`గ్యాస్‌ ధరలు పెంచి ఇంటికే నిప్పు పెడుతుంది`వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: మరోమారు గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నల్లా సూర్యప్రకాశ్ రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి ఇంటికే నిప్పు పెడుతుందోని ఆయన విమర్శించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం వేయడమే పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ హయాంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ లు, కోర్టులు ఏర్పాటు చేసి రుణాలు వసూలు చేసింది వాస్తవం కాదా? అని ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని నల్లా సూర్యప్రకాశ్‌రావు చెప్పారు.

కాగా, ప్రభుత్వం వినియోగదారులపై సబ్సిడీ సిలిండర్ (14.2 కేజీ) ధర రూ.1,112 నుంచి రూ.1,327కు పెరిగింది. ఒక్కో సిలిండర్‌పై 30 రూపాయల చొప్పున పెంచి వినియోగదారుల నెత్తిన మరింత భారం వేసింది. దీంతో వినియోగదారుడు మొదట సిలిండర్ తీసుకునేటప్పుడు రూ.215 అదనంగా చెల్లించాలి.

Nalla Surya Prakash press meet on 2nd January 2014

వంట గ్యాస్ ధర పెంపు ఉపసంహరించాలి

వంట గ్యాస్ ధర పెంపు ఉపసంహరించాలి
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీలేని వంట గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం పెంచిన రూ.215ను వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సామ్యానుడికి పెనుభారం మోపే చర్యలను పార్టీ  కేంద్ర పాలక మండలి(సీజీసీ) సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. సబ్సిడీ లేని వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.1112 నుంచి 1327కు పెంచడం దారుణమన్నారు. ఒకవైపు నిత్యావసర ధరలు, కూరగాయలు మండుతుంటే మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం, మరోపక్క గ్యాస్ ధరలు పెంచి సామ్యానుడి నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు.
 
 పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యాస్ ధరల విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే ప్రజలపై భారం పడకుండా చూడగలిగారన్నారు. ‘చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టే నాటికి 1995లో గ్యాస్ సిలిండర్ ధర రూ.147గా ఉంది. అది ఆయన హయాంలోనే వంద శాతం పెరిగి రూ.305కు చేరింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్రం గ్యాస్ ధరలను పెంచినా ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే భరించేలా వైఎస్ చర్యలు తీసుకున్నారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత పాలన పగ్గాలు చేపట్టిన రోశయ్య హయాంలో కేంద్రం పెంచిన రూ.50ని ప్రజలపైనే రుద్దారు. సీఎం కిరణ్ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ.450కి చేరింది’ అని తెలిపారు.
 
 అవినీతి గురించి బాబా మాట్లాడేది?
 బహిరంగ చర్చలంటూ చంద్రబాబు చేసిన సవాల్‌ను ప్రస్తావించగా... ‘ముందు ఆయనపై ఉన్న ఆరోపణలపై విచారణకు సిద్ధపడాలి. చంద్రబాబు తనపై విచారణలు జరపొద్దంటూ, కమిషన్లను ఉపసంహరింపచేయాలంటూ కోర్టులకెళ్లి ‘స్టే’లు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. బాబు హయాంలో వేలాది ఎకరాలను ఆయన అనుయాయులకు పప్పుబెల్లాల మాదిరిగా పంచిపెట్టారు. అవినీతి గురించి చంద్రబాబు ఎంత తక్కువ మాట్లాడితే ప్రజలు అంత సంతోషిస్తారు’ అని వ్యాఖ్యానించారు.

అద్దంకిలో టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జన్యకాండ

అద్దంకిలో క‘రణం’
అద్దంకి, న్యూస్‌లైన్: ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యకాండకు తెగబడ్డారు. కర్రలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం కుమారుడు వెంకటేష్ స్వయంగా తన కార్యకర్తలను దాడులకు ప్రోత్సహించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి నిరసనగా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రాస్తారోకో చేస్తున్న వారిపై కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్న పోలీసులు అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
 
 వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ అద్దంకిలోని తమ కార్యాలయంలో బుధవారం న్యూఇయర్ వేడుకలు నిర్వహించారు. ఆయన్ని కలిసేందుకు నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ నేతలు, కార్యకర్తలు రాసాగారు. అలా వస్తున్న కార్యకర్తలను సింగరకొండ నుంచి వస్తున్న టీడీపీ నేతలు గేలి చేశారు. దీన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. రాడ్లూ, కర్రలతో తీవ్రంగా కొట్టారు. భయంతో పరిగెడుతున్న కార్యకర్తల వెంటబడి మరీ కొట్టారు. చేతిలో ఇనుప రాడ్లూ, కర్రలు పట్టుకుని పరిగెడుతూ టీడీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. మోటార్ సైకిళ్లను ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను చింపివేశారు. ఈ దాడిలో ఆరుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. డీవీకే రెడ్డి, దుగ్గి నర్సింహారెడ్డి, చుండూరు మురళీసుధాకర్, నర్రా నాగేశ్వరరావు, కర్రి పరమేశ్, సురేష్ (గొట్టిపాటి రవికుమార్ కార్ డ్రైవర్)లు గాయపడ్డారు. వారిలో డీవీకే, దుగ్గిల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.
 
 వైఎస్సార్‌సీపీ నేతల ధర్నా
 టీడీపీ వర్గీయుల దౌర్జన్యానికి నిరసనగా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ ఆందోళనకు దిగారు. మేరదమెట్ల-నార్కెట్‌పల్లి రహదారిపై కార్యకర్తలు, నాయకులతో ధర్నా నిర్వహించారు. ఇది తెలిసిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు మళ్లీ వైఎస్సార్ కాంగ్రేస్ కార్యకర్తలపై రాళ్ల వర్షం కురిపించారు. దాంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు, ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.  ప్రతిఘటించడానికి సిద్ధపడిన వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. చివరకు ఇరువర్గాలతో పోలీసులు చర్చలు జరిపి నచ్చజెప్పి పంపారు.
 
 కరణం బలరాం కుమారుడి వీరంగం
 పోలీసులు అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చినప్పటికీ టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం వర్గం మాత్రం కయ్యానికి కాలుదువ్వింది.  పోలీసులు సర్దిచెప్పడంతో ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన విరమించి అక్కడి నుంచి నిష్ర్కమిస్తుండగా, అక్కడికి చేరుకున్న టీడీపీ నేత కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ మళ్లీ ఉద్రిక్తతను రేకెత్తించారు. వెంకటేష్ ఏకంగా తన వాహనం ఎక్కి తొడకొట్టి మరీ సవాల్ విసిరారు. ‘మా సంగతి మీకు తెలుసు... జాగ్రత్తగా ఉండండి...ఎవర్నీ తిరగనివ్వం’ అని హెచ్చరించారు. చేతిలో పార్టీ జెండా పట్టుకుని వేలు చూపిస్తూ ఊగిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కరణం బలరాం కుమారుడిని నియంత్రించలేదు.. సరికదా ఇనుప రాడ్లూ, కర్రలు పట్టుకుని ఉన్న కార్యకర్తలను మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించారు. సీనియర్ నేత బలరాం, ఆయన కుటుంబ దౌర్జన్యకాండపై స్థానికులు విస్తుపోయారు.
 
 కరణం రౌడీయిజానికి భయపడం
 గొట్టిపాటి రవికుమార్
 కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ దౌర్జన్యాలకు భయపడేది లేదని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు తానుగానీ తమ పార్టీగానీ ఎంతవరకైనా న్యాయబద్ధంగా పోరాడతామన్నారు. కరణం బలరాం ఒక ఫ్యాక్షనిస్టని, ఆయన నేరచరిత్ర అందరికీ తెలిసిందేనని అన్నారు. హత్య కేసుల్లో కరణం బలరాం జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ జ్ఞానోదయం కలగలేదన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు వెంకటేష్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ పిల్ల రౌడీ అవతారం ఎత్తి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు.

రేపు రాష్ట్రబంద్

రేపు రాష్ట్రబంద్
పార్టీ శ్రేణులు, సమైక్యవాదులకు వైఎస్సార్‌సీపీ పిలుపు
టీ బిల్లుపై రాష్ట్రపతి వర్తమానాన్ని కేంద్రం పంపిన తీరుకు నిరసన
వారం పాటు నిరసన కార్యక్రమాలు
4న బైక్ ర్యాలీ, 6న మానవహారాలు..
7-10 వరకు తాలూకా కేంద్రాల్లో  రిలే నిరాహార దీక్షలు: మైసూరారెడ్డి
బాబుతో బహిరంగ చర్చకు సిద్ధమని వెల్లడి


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన బిల్లుపై అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి వర్తమానాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన విధానాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈ నెల 3న(శుక్రవారం) రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైన రాజకీయ వ్యవహారాల  కమిటీ(పీఏసీ)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాన్ని కూడా ఖరారు చేశారు. ‘రాష్ట్రపతి వ ర్తమానాన్ని’ కేంద్రం పంపిన విధానం రాజ్యాంగ స్ఫూర్తిని, సమాఖ్య స్ఫూర్తిని ఎగతాళి చేసే విధంగా ఉందని సమావేశం  అభిప్రాయపడింది. సమావేశం వివరాలను పార్టీ పీఏసీ సభ్యులు ఎం.వి.మైసూరారెడ్డి వెల్లడిస్తూ ఆ వర్తమానం పంపిన తీరు చూస్తే ఇక్కడుండేది ఒక రాష్ట్రమని, ప్రభుత్వం, చట్ట సభలున్నాయనే గుర్తింపు కూడా లేకుండా సొంత ఇంటి వ్యవహారంగా ప్రవ ర్తించారని ధ్వజమెత్తారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా శాసనసభలో వ్యవహరిస్తున్న తీరును కూడా ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.

 నిరసనల వారం..

 కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా 3న బంద్ చేయడంతో పాటుగా వరుసగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తమ పార్టీ శ్రేణులు, సమైక్యవాదులకు పిలుపునిస్తున్నామని మైసూరా అన్నారు. 4న మోటారు సైకిళ్ల ర్యాలీ, 6న మానవహారాలు, 7 నుంచి 10 వరకు తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. శాసనసభా సమావేశాల్లో జరిగే పరిణామాలను బట్టి ఆ తదుపరి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేస్తామన్నారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మూడూ దారుణంగా నష్టపోతాయని, అందుకే తమ పార్టీ సమైక్యం కోసం త్రికరణశుద్ధితో పోరాడుతోందని అన్నారు. ఏపీఎన్జీవోలు బంద్ కూడా 3నే ఉందని ప్రస్తావించగా శాసనసభా సమావేశాలు ప్రారంభం అవుతున్నది 3నే కనుక తమ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చిందని, రెండూ యాధృచ్ఛికం కావచ్చని అన్నారు. అయినా సమైక్యం కోసం ఎవరు ఆందోళనకు పిలుపునిచ్చినా మద్దతునిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్, విభజించాల్సిందిగా లేఖ ఇచ్చిన టీడీపీతో కలిసి తమ పార్టీ పనిచేయబోదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 ఆ 18 అంశాలపై చర్చకు సిద్ధమే..

 అవినీతిపై జగన్‌తో బహిరంగ చర్చకు తాను సిద్ధమని తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై మైసూరా స్పందిస్తూ.. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ.. బాబు తాలూకు 18 అవినీతి అంశాలపై హైకోర్టులో పిల్ వేస్తే సాంకేతిక కారణాలను అడ్డం పెట్టుకుని ఆపుకొన్నారని గుర్తుచేశారు. ఈ అంశాలపై ఆయన పిలిస్తే చర్చకు తాము సంసిద్ధమేనని అన్నారు. మంత్రుల శాఖల మార్పిడి అనేది ముఖ్యమంత్రి ఇష్టమని, అయినా శ్రీధర్‌బాబు శాఖను మార్చడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. విభజన విషయంలో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు. బిల్లుపై చర్చ జరగాలని ముఖ్యమంత్రి చేసిన సూచనను ప్రస్తావించగా గతంలో రాష్ట్రాల ఏర్పాటులో గానీ, విభజనలో గానీ ఆయా అసెంబ్లీల్లో తీర్మానాలు చేయడం ద్వారానే సాధ్యమైందని అన్నారు. ఆర్టికల్ 3 కింద రాష్ట్రాలను విభజించే అధికారం కేంద్రానికి ఉన్నప్పటికీ అందుకు కచ్చితంగా ఒక ప్రాతిపదిక అంటూ ఉండాలన్నారు. ఇదే విషయం సర్కారియా, పూంఛి కమిషన్లు రెండూ చెప్పాయన్నారు.
 

Ummareddy condemns hike of non-subsidised LPG cylinder price

Written By news on Wednesday, January 1, 2014 | 1/01/2014

Mysura announces YSRCP agitation schedule

Jagan Mohan Reddy challenges Chandrababu Naidu

ఆ 18 అంశాలపై చర్చకు బాబు సిద్ధమేనా?

ఆ 18 అంశాలపై చర్చకు బాబు సిద్ధమేనా?
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతికి సంబంధించి 18 అంశాలపై వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కోర్టులో పిటిషన్ వేశారని,  ఆ అంశాలపై చర్చకు బాబు సిద్ధమేనా? అని వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత ఎంవి మైసూరా రెడ్డి ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి  అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. చంద్రబాబు బహిరంగ చర్చకు వస్తే అన్ని బయటకు వస్తాయన్నారు. చంద్రబాబు మరొకరిమీద అవినీతి ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఒక వేలు చూపిస్తే నాలుగు వేళ్లు తనవైపు చూపిస్తాయన్న విషయం చంద్రబాబు తెలుసుకుంటే మంచిందని సలహా ఇచ్చారు.

రాష్ట్ర విభజన బిల్లు రాజ్యాంగ స్పూర్తిని ఎగతాళి చేసేలా ఉందన్నారు.  రాష్ట్రపతి  విభజన బిల్లు పంపిన విధానం, దానిపై అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా ఈ నెల 3న తమ పార్టీ బంద్ కు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. 4న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మోటారు బైక్‌ ర్యాలీలు, 6న మానవహారాలు,  7 నుంచి 10 వరకు రిలేదీక్షలు చేస్తామని వివరించారు. శాసనసభలో జరిగే పరిణామాలను బట్టి తమ పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని తెలిపారు.

తెలంగాణ బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని తెలిపారు. శాసనసభలో సమైక్యతీర్మానం కోసం పట్టుబడతామని చెప్పారు. ఇప్పటికైనా అసెంబ్లీలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలే విభజనకు బాధ్యులని ఆయన అన్నారు. తకు సీఎం కిరణ్‌ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము అనుసరించాల్సిన వ్యూహం తమకు ఉందని మైసూరారెడ్డి తెలిపారు.

జనజాతర

జనజాతర

     జగన్‌కు అదే ఆదరణ
     అదే ఆప్యాయత
     వాడవాడలా స్వాగత తోరణాలే
     చిరునవ్వుతో పలకరించిన జననేత  
 సాక్షి, తిరుపతి:
 జిల్లాలో రెండో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర చేపట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ప్రతిపల్లెలో, ప్రతి వాడలో ప్రజలు ఆదరించారు. పూలతో స్వాగతించారు. చిన్నారులు, పెద్దలు, వృద్ధులు  తేడా లేకుండా ఆయనను ఆప్యాయంగా పలకరించారు. దీంతో అనుకున్న షెడ్యూలు కన్నా, మూడు గంటలు ఆలస్యంగా పర్యటన సాగినా, ఏ మాత్రం విసుగు లేకుండా ఆయన రాక కోసం ప్రజలు బారులు తీరి నిలబడ్డారు.
 
 మంగళవారం ఉదయం పుంగనూరులో బయలుదేరిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పుంగనూరులోని ప్రతి వీధి జాతరను తలపించింది. వేలాదిమంది అభిమానులు జననేతతో మాట్లాడేందుకు చుట్టుముట్టారు. పుంగనూరు పట్టణం సరిహద్దులో ఉన్న విష్ణుభారతి పాఠశాల విద్యార్థులు స్వాగతం పలికారు. పార్టీ నేత అక్కసాని భాస్కర్ రెడ్డి టపాకాయలు పేల్చారు. తరువాత జగన్‌మోహన్‌రెడ్డి మైనారిటీ నాయకుడు ఖాదర్ ఖాన్ ఇంటికి వెళ్లి, తేనీరు సేవించారు. అక్కడి నుంచి ఉలవలదిన్నె, రాగానిపల్లె మీదుగా బాలాజీ కాలనీ వద్దకు చేరుకోగా, మహిళలు హారతి పట్టి స్వాగ తం పలికారు. శాంతినగర్ వాసులు బ్యాండు మేళం ఏర్పాటు చేశారు. రామపల్లెకు చేరుకోగానే అక్కడ టపాకాయలు పేల్చి స్వాగతం పలికారు. సుగాలిమిట్ట చేరుకుని, అక్కడ వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి సుగాలి సోదరులతో కలసి రిటైర్డ్ ఎంపీడీవో వెంకటరెడ్డియాదవ్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
 
 విగ్రహావిష్కరణ తరువాత పూజగానిపల్లెలో చర్చికి వెళ్లి కేక్‌కట్ చేశారు. భీమగానిపల్లెకు చేరుకున్న వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి మహిళలు హారతులు ఇవ్వ గా, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. గాంధీపురం సర్పంచ్ భాస్కర్ రెడ్డి నాయకత్వంలో పూజగానిపల్లె వద్ద లంబాడీలు ఆహ్వానం పలికారు. ఈడిగపల్లెలో పూలవర్షం కురిసింది. సర్పంచ్ అమరనాథరెడ్డి ఆయనను స్వాగతించా రు. సమీపంలోని గ్రీన్‌వ్యాలీ స్కూల్ విద్యార్థినులు పూలతో ఆహ్వానించారు. 150వ మైలు వద్ద మహిళలు హారతులు పట్టగా, డప్పుల మోతలు, టపాకాయ లు పేలుస్తూ ఆహ్వానించారు. ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు,  వైఎస్‌ఆర్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు ఆహ్వానించారు. వారి డైరీని జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. భీమనేని రెస్టారెంట్ వద్ద మదనపల్ల్లె సమన్వయకర్త షమీమ్ అస్లాం స్వాగతం పలికారు.
 
 వలసపల్లెలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వలసలపల్లె క్రాస్ మీదుగా మదనపల్లె నియోజకవర్గంలోకి ప్రవేశించిన జగన్‌మోహన్‌రెడ్డికి మొలకలదిన్నె వద్ద పార్టీ నాయకుడు బాబ్‌జాన్ దాదాపు వంద వాహనాలతో స్వాగతం పలికారు. బసినికొండ చేరుకున్న జననేతను ఒక విద్యార్థిని తెలుగుతల్లి వేషధారణతో ఆహ్వానించగా, మహిళలు హారతులు పట్టారు. డప్పు లుకొట్టి సంబరం చేసుకున్నారు. నిమ్మనపల్లె సర్కిల్‌వద్ద టపాకాయలు పేల్చా రు. మదనపల్లెలోని సీఎస్‌ఐ మిషన్ కాంపౌండ్‌లోని మహిళలు జగన్‌మోహన్‌రెడ్డి ని చూసేందుకు బారులు తీరారు. చిత్తూరు బస్టాండ్‌వద్ద వందలాదిమంది చేరుకుని ఎదురుచూశారు. ఆయన రాగానే కొండంత సంబంరంతో జేజేలు పలికారు. మదనపల్లెలో అడుగడుగునా వందలాదిమంది జగన్‌మోహన్‌రెడ్డి కోసం ఎదురుచూశారు. మదనపల్లె పట్టణంలో ఆయనకు దాదాపు ఒకటిన్నర  గంట సమయం పట్టింది. బెంగళూరు బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం రెండో విడత సమైక్య శంఖారావానికి తాత్కాలిక విరామం ఇచ్చి ఆయన బెంగళూరు మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు.
 
 ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, ప్రవీణ్ కుమార్‌రెడ్డి, గాంధీ, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు మిథున్‌రెడ్డి, యువజన కన్వీనర్ ఉదయ్‌కుమార్, పల్లికొండేశ్వర ఆలయం ట్రస్టు బోర్డు సభ్యుడు చిందేపల్లి మధుసూదన్ రెడ్డి, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్, రెడ్డెప్ప, మున్సిపల్ మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, నాగరాజరెడ్డి, ఆవుల అమరేంద్ర, మైనారిటీ నాయకుడు అక్తర్ అహ్మద్, పీఎస్ ఖాన్  తదితరులు పాల్గొన్నారు.
 

భవిష్యత్ వైఎస్‌ఆర్‌సీపీదే

వేముల, న్యూస్‌లైన్ : భవిష్యత్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షులు వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలోని భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లె, మీదిపెం ట్ల కోట గ్రామాల్లో మంగళవారం మండల నా యకులు నాగేళ్ల సాంబశివారెడ్డితో కలిసి వైఎస్ అవినాష్‌రెడ్డి గడప.. గడప కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో గడప.. గడప తొక్కుతూ వైఎస్‌ఆర్ సీపికి అండగా నిలవాలని మహిళలను, వృద్ధులను, యువకులను అభ్యర్థించారు. వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి రాగానే ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అందిస్తామని హామీనిచ్చారు. ఇప్పటికి గ్రామాల్లో సంక్షేమ పథకాలు అందని నిరుపేదలు చాలామంది ఉన్నారని తెలిపారు.
 
 సమస్యలకు పరిష్కారం చూపుతాం.. :
 ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై స్పందించిన వైఎస్ అవినాష్‌రెడ్డి సమస్యలకు పరిష్కారం చూపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రతిచోట పింఛన్ రాలేదని.. పక్కాగృహం మంజూరు కాలేదని.. ఉపాధి అవకాశాలు కుల్పించాలనే సమస్యలే ఎక్కువగా ఆయన దృష్టికి వచ్చాయి. వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి రాగానే.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
 
 నాలుగో రీచ్‌లో భూములను తీసుకొనేలా చూడండి :
 తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టుకు నాల్గవ రీచ్‌లో భూములు తీసుకునేలా చూడాలని బాధిత రైతులు వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టుకు నాల్గవ రీచ్ కింద భూములను తీసుకుంటామని చెప్పిన యూసీఐఎల్ ఆ తర్వాత పట్టించుకోలేదని వివరించారు. ప్రాజెక్టు భూములు తీసుకోక.. పంటలు సాగు చేయక పొలాలన్నీ బీళ్లుగా మారాయని.. ఆ భూములను యూసీఐఎల్ తీసుకొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రాజెక్టు ఇడీ బెహల్‌తో చర్చిస్తానని.. బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీనిచ్చారు.
 ఆయా గ్రామాల్లో అపూర్వ స్వాగతం :
 గడప.. గడపకు విచ్చేసిన వైఎస్‌ఆర్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆ పార్టీ మండల నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డిలకు ఆయా గ్రామాల్లో అపూర్వ స్వాగతం లభించింది. గ్రామ సరిహద్దులకు చేరిన వెంటనే డప్పు వాయిద్యాల మధ్య టపాసులు పేల్చుతూ తమ అభిమాన నేతను సాదరంగా గ్రామాల్లోకి ఆహ్వానించారు. గ్రామానికి చేరిన వెంటనే ఆయనతో నాయకులు, కార్యకర్తలు, యువకులు కరచాలనం కోసం పోటీపడ్డారు. కార్యక్రమంలో వేల్పుల సొసైటీ అధ్యక్షులు శివశంకర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాజారెడ్డి, బయపురెడ్డి, మరకా శివకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

బాబును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు

ఇందుకూరుపేట, న్యూస్‌లైన్ : గాంధీజీ పోరాట పటిమ, అన్నాహజారే స్ఫూర్తితో ముందుకు పోతున్నానని బాబు ప్రజాగర్జనలో చేసిన ఉపన్యాసం విని రాష్ట్ర ప్రజలు నవ్విపోతున్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి అన్నారు.
 
 మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన సిమెంట్ రోడ్ల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్టాంపులు, నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు, స్కాలర్‌షిప్‌లు, భూ కుంభకోణం, దొం గనోట్లు, ఎంసెట్, ఇంటర్ పేపర్ల లీకేజీలు చంద్రబాబు హయాంలోనే జరిగాయన్నారు. ఇవన్నీ గాంధీజీ, అన్నాహజారే చేయమన్నారా? అని ప్రశ్నిం చారు. బాబు కుమారుడు లోకేష్ విదేశాల్లో చదువుకునేందుకు సత్యం రామలింగరాజు డొనేషన్ కట్టి చదివించిన విషయం మరిచిపోయారా?ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంట్లో ఎక్కడచూసినా నోట్ల కట్టల బస్తాలు ఉండేవని, రూ.500 నోట్ల కట్ట బస్తా ఒకటి పనిమనిషి ఇంట్లో పెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

ఇలాంటి వ్యక్తి ఈ రోజు అవినీతి గురించి, అవినీతిని అంతం చేస్తామని మాట్లాడుతుంటే ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు, తెలుగువారందరు ఒకటిగా ఉండాలని కాకుండా చంద్రబాబు, కిరణ్ రాజకీయాల కోసం సర్వనాశనం చేస్తున్నారని ఆరోపిం చారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.  
 
 జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం ప్రకారం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తీర్మానించిన తర్వాతే శాసనసభను సజావుగా సాగనిస్తామన్నారు. లేనిపక్షంలో తమ నాయకురాలు వైఎస్ విజయమ్మతో కలసి జనవరి మూడో తేదీన నిర్వహించనున్న శాసనసభ సమావేశాలను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, నాయకులు గునపాటి సురేష్‌రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు గొల్లపల్లి విజయ్‌కుమార్, భీమవరపు వెంకటకృష్ణారెడ్డి, గురజాల బుజ్జిబాబు పాల్గొన్నారు.

నాకు సంబంధం ఉందని నిరూపించు!

నాకు సంబంధం ఉందని నిరూపించు!
జూబ్లీహిల్స్‌లో భవనంపై బాబుకు పి.రవీంద్రనాథ్‌రెడ్డి సవాల్
ఆరోపణలు చేస్తున్న నీరజారావుకు త్వరలో టీడీపీ టికెట్!


కడప, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 2లో జీహెచ్‌ఎంసీ కూల్చిన భవనానికి, తనకు ఎటువంటి సంబంధం లేదని కడప మాజీ మేయర్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తనకు సంబంధముందని మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. దీనిపై ఏ వేదికపై అయినా సరే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. తనది తప్పయితే చంద్రబాబు కాళ్లు పట్టుకుంటానని, లేదంటే ఆయన తన కాళ్లు పట్టుకోవాలని సవాల్ విసిరారు. మంగళవారం వైఎస్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనంతపురం రైలు ప్రమాదంలో 26 మంది చనిపోయి అనేకమంది గాయాల పాలైతే పరామర్శించడానికి సమయం లేని చంద్రబాబుకు 420 గజాల స్థల వివాదంపై పరిశీలనకు వెళ్లడానికి మాత్రం టైమ్ ఉందా అంటూ ఎద్దేవా చేశారు.
అందుకే నీరజారావు ఆరోపణలు..
కొన్ని పత్రికలు, చానెళ్లతో కుమ్మక్కై చంద్రబాబు డ్రామా ఆడిస్తున్నారని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. భూమి విషయంలో తమపై ఆరోపణలు చేస్తున్న నీరజారావు ఎవరా అని విచారిస్తే ఆమె టీవీ9 చానల్లో మహారాష్ట్ర వింగ్ చూస్తున్నారని, గతంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా పనిచేశారని తెలిసిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఆమెకు టీడీపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోందని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురదచల్లడానికి తనను పావుగా వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తన హయాంలో జరిగిన కుంభకోణాలు, ఆయన ఆస్తుల వివరాలను బయట పెట్టాలన్నారు.  రామోజీ ఫిల్మ్‌సిటీలో 1600 ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ అని ట్రిబ్యునల్ తీర్పునిస్తే చంద్రబాబుకు అది ఎందుకు కనిపించదని ప్రశ్నించారు.
 

చంద్రబాబుకు చాలెంజ్

ప్రజల్లోకి వెళ్లి నీ పాలన మళ్లీ తెస్తానని చెప్పగలవా?  
టీడీపీ అధినేతకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్
 నువ్వు రూపాయి ఇస్తానన్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
 ఎందుకంటే తొమ్మిదేళ్ల పాలనలో నువ్వు ప్రజలకు  పది పైసల మేలు కూడా చేయలేదు
  అదే జగన్ రూ.50 ఇస్తానన్నా ప్రజలు నమ్ముతారు..  గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా
  ఎన్టీఆర్ హామీలనూ తుంగలో తొక్కిన ఘనత బాబుదే
  ఇప్పుడు అదే చంద్రబాబు అన్నీ ఉచితమంటూ సునాయాసంగా హామీలిస్తున్నారు
  రాష్ట్రంలో ప్రతి గొంతూ ‘జై సమైక్యాంధ్ర’ అని నినదిస్తోంది..  అయినా బాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి అర్థం కావటం లేదు
  దమ్ము, ధైర్యం ఉంటే రండి ఎన్నికలకు పోదాం..
 

 ‘సమైక్యశంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నారు. రకరకాల ఎన్నికల హామీలు ఇస్తున్నారు. ఇదే చంద్రబాబును చాలెంజ్ చేస్తున్నాను. ప్రజల్లోకి వెళ్లి నీ తొమ్మిదేళ్ల పాలన తిరిగి తెస్తానని ప్రజలకు చెప్పగలవా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగ న్‌మోహన్‌రెడ్డి సవాల్ విసిరారు. నాడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. ఎన్టీఆర్ పథకాలను కూడా తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు.
 
 2014లో తాను అధికారంలోకి వచ్చిన తరువాత దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైఎస్సార్ సువర్ణ యుగాన్ని మళ్లీ తీసుకొని వస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ సువర్ణయుగం 30 ఏళ్ల పాటు కొనసాగుతుందని, ఆ రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాని గుండె చప్పుడు వింటానని, ప్రతి పేదవాని మనసు ఎరుగుతానని భరోసా ఇచ్చారు. ‘‘నేను చనిపోయిన తరువాత కూడా ప్రతిపేదవాడి ఇంట్లో నాన్నగారి ఫొటో పక్కన నా ఫొటో కూడా పెట్టుకునేంతలా పేదవాడి కోసం కృషి చేస్తాను’’ అని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ జగన్ కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర మలిదశ నాలుగో రోజు మంగళవారం చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో కొనసాగింది. మదనపల్లె నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. సమైక్య నినాదాల మధ్య సాగిన జగన్ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 ఆ మాట.. జై సమైక్యాంధ్ర..
 

 ఇవాళ ప్రతి గొంతు ఒకే ఒక మాట మాట్లాడుతోంది. ప్రతి మనసు ఒకే ఒక ఆలోచనతో ఉద్యమ బాట పట్టింది. ఆ ఒకే ఒక్క మాట ఏమిటీ అని అంటే.. ‘జై సమైక్యాంధ్ర’. అయినా కూడా మన ఖర్మ ఏమిటంటే ఈ గడ్డ మీద పుట్టిన చంద్రబాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి మాత్రం అర్థం కావట్లేదు. సోనియాగాంధీకి మన భాష రాదు, మన దేశం గురించి కూడా సరిగా తెలియదు కాబట్టి ఆవిడ గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. సోనియాగాంధీ తన కొడుకును ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టుకోవడం కోసం ఇవాళ మన పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది.. తెలియని వారికి ఏదైనా చెప్పొచ్చని. కానీ కళ్లుండి కూడా కబోదుల్లా నాటకం ఆడుతున్న వీళ్లకు ఎలా చెప్పాలి? చంద్రబాబూ నీకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి, సోనియాగాంధీకి.. మీకు దమ్ము, ధైర్యం ఉంటే రండి ఎన్నికలకు పోదాం. సమైక్య నినాదంతో నేను యావత్తు రాష్ట్రం తిరుగుతాను.. 30 ఎంపీ స్థానాలు గెలుచుకొని వస్తాను. గెలుచుకోవడమే కాదు ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతాం. ప్రజల్లోకి రావడానికి మీకు దమ్ము, ధైర్యం ఉందా? ఇలా బస్సులో మీరు ఈ పక్కనుంచి వెళ్తే మీ మీద కోడి గుడ్ల దగ్గర నుంచి టమాటాల వరకు అన్నీ పడతాయనే సంగతి మీకు మాత్రం తెలియదా?  
 
 చంద్రబాబు సభలకు జనం రాకున్నా.. వచ్చినట్లు..
 
 ఆ దివంగత నేత వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఒక సువర్ణయుగాన్ని చూపించారు. ఆ సువర్ణయుగంలో ఎవ్వరు కూడా విడిపోదాం అని అడగని పరిస్థితుల్లో వైఎస్సార్ రాష్ట్రాన్ని నడిపించారు. ఆయన చనిపోయిన తరువాత రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ ఎలా తయారైపోయిందంటే.. నిజాయితీ కరువైంది. ఎంతలా కరువై పోయిందంటే సమైక్యంగా ఉండాలని రాష్ర్టమంతటా ఉద్యమ బాట పడుతుంటే చంద్రబాబు మొన్న తిరుపతికి వచ్చి ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన మాటలు వింటే ఆయన ఒక నాయకుడా? అని పిస్తోంది. ఇవాళ ‘ఈనాడు’ దినపత్రికలో చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఒంగోలులో జరిగిన ఒక మీటింగ్ ఫొటో వేశారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఫొటోలో వేసిన దాని ప్రకారం కనీసం మదనపల్లిలో ఈ రోజు ఇక్కడ ఉన్న జనాభా కూడా అక్కడ ఉన్నట్టు కనిపించలేదు. 10 వేల మంది జనాభా కూడా లేకపోయినా కుర్చీలు వేశారు.. కుర్చీలు వేసి జనాలు ఎక్కువగా ఉన్నట్టు చూపించుకునే కుయుక్తులు పన్నుతున్నారు.
 
 నాడు హామీలిచ్చి.. ఏం చేశావ్ బాబూ?
 
 చంద్రబాబు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు రకరకాల హామీలు ఇస్తూ పోతున్నారు. తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు 8 సార్లు కరెంటు చార్జీలు పెంచిన చంద్రబాబు.. ఇవాళ కరెంటు చార్జీలు తగ్గిస్తారట. మీ మామ ఎన్టీఆర్ గారు రూ.2కే కిలో బియ్యం ఇస్తే దాన్ని రూ 5.25 చేసింది నువ్వు కాదా? మద్యపానాన్ని నిషేధిస్తామని ఎన్నికలకు వెళ్లి.. ఎన్నికలయ్యాక మాట మార్చలేదా? గ్రామగ్రామాన బెల్టు షాపులు పెట్టించలేదా? ఇదీ చంద్రబాబు విశ్వసనీయత. ఆ వేళ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఉచిత కరెంటు ఇవ్వాలని ప్రతిపక్షాలు అడిగితే.. ఉచిత కరెంటు ఇస్తే ఈ తీగలు మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని చంద్రబాబు వెటకారం చేశారు. ఇప్పుడు ఇదే చంద్రబాబు అన్నీ ఉచితంగా ఇస్తామని చాలా సునాయాసంగా చెప్తున్నారు.
 
 అదీ సువర్ణయుగం అంటే..
 
 ఇదేచంద్రబాబు అవ్వాతాతల పెన్షన్ గురించి మాట్లాడుతారు. నాకు బాగా గుర్తింది ఆ వేళ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవ్వాతాతలకు ముష్టి వేసినట్లు కేవలం రూ. 70 మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. అది కూడా గ్రామంలో 20-30 మంది కంటే ఎక్కువ మందికి పెన్షన్లు ఉండే వి కాదు. ఊళ్లో ఎవరైనా ఒకరు చనిపోతేగాని మరొకరికి పెన్షన్ ఇవ్వని దుస్థితి. చంద్రబాబు హయాంలో పెన్షన్ల సంఖ్య కేవలం 16 ల క్షలు మాత్రమే. ఆ తరువాత ప్రియతమ నాయకుడు వైఎస్సార్ ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చారు. 16 లక్షలు ఉన్న పెన్షన్లను ఏకంగా 71 లక్షలకు తీసుకొని పోయారు. రూ. 70 ఇచ్చే పెన్షన్‌ను రూ. 200 పెంచి ఆ అవ్వాతాతల గుండెల్లో కొలువయ్యాడు. అదీ రామరాజ్యం అంటే..సువర్ణయుగమంటే.’’
 
 జగన్ వెంట యాత్రలో..
 
 జగన్ వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు అమరనాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, షమీం అస్లాం, డి.ఉదయ్‌కుమార్  తదితరులు పాల్గొన్నారు.
 
 బాబు రూపాయి ఇస్తానన్నా ప్రజలు నమ్మరు..
 ‘‘ఇదే చంద్రబాబు మైకులు పట్టుకొని నిన్న మాట్లాడుతూ... కాపు కులస్తులకు రిజర్వేషన్లు ఇస్తానని వాగ్దానం చేశారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదయ్యా... ఆ రోజు కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని నీకు తట్టిందా? లేదు. విశ్వసనీయత గురించి ఇంకొక మాట చెప్పాలి. చంద్రబాబు ప్రజలకు ఒక్క రూపాయి ఇస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అదే జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు రూ. 50 ఇస్తానని చెప్పినా కూడా ప్రజలంతా హర్షధ్వానాలతో నమ్మే పరిస్థితి ఉంది. కారణం చంద్రబాబు 9 ఏళ్లు పరిపాలన చేసినపుడు రూపాయి ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు కనీసం 10 పైసలు కూడా ప్రజలకు మేలు చేసిన దాఖలాలు లేవు.’’
 
 జగన్‌కు జనం బ్రహ్మరథం

 సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘సమైక్య శంఖారావం’ యాత్ర చిత్తూరు జిల్లాలో మంగళవారం ఉత్సాహంగా సాగింది.  పుంగనూరు నియోజకవర్గం నుంచి మంగళవారం ప్రారంభమైన యాత్రకు మదనపల్లె వరకూ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సుగాలిమిట్టలో జగన్ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాంపల్లె, ఈడుగపల్లె, 150 మైలు, వలసపల్లె, మొలకలదిన్నె, బసినికొండ, నిమ్మనపల్లె క్రాస్ మీదుగా యాత్ర చేశారు. మధ్యలో వలసపల్లెలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మదనపల్లెలోని చిత్తూరు బస్టాండ్ మీదుగా, బెంగళూరు బస్టాండ్ చేరుకుని అక్కడ జంక్షన్‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.

 ముగిసిన రెండో విడత: చిత్తూరు జిల్లాలో రెండో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మంగళవారంతో ముగిసింది. మదనపల్లె బహిరంగ సభలో ప్రసంగించిన జగన్ రోడ్డు మార్గంలో నేరుగా బెంగళూరు విమానాశ్రయానికి వె ళ్లిపోయారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు యాత్ర ఏడు రోజులు కొనసాగింది. మొదటి విడతలో రెండు కుటుంబాలను, రెండవ విడతలో ఐదు కుటుంబాలను మొత్తం ఏడు కుటుంబాలను జగన్  ఓదార్చినట్లు వైఎస్సార్ సీపీ నేత తలశిల రఘురాం తెలిపారు. రెండో విడత యాత్ర నాలుగు రోజులు కొనసాగింది. ఈ నెల 28న అనంతపురం జిల్లా కొత్తచెర్వు వద్ద జరిగిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద బాధితులను పరామర్శించారు. 4 నుంచి తిరిగి యాత్ర ప్రారంభమవుతుంది.
 

Happy New Year

ప్రతీ ఇంటా సంతోషాలు నిండాలి: వైఎస్ జగన్
Wish you and your families a Very Happy and Prosperous New Year.. - YS Jagan

రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటా సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2014లో రాష్ట్రంలోని 9 కోట్ల ప్రజల భద్రతకు, అభివద్ధికి, సంక్షేమానికి భరోసా లభించాలని ఆకాంక్షించారు. క్యాలెండర్ల మార్పుతో పాటు 2014 ఈ రాష్ట్రంలోని, దేశంలోని ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పునకు దారితీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జగన్ తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు.

ప్రతీ ఇంటా సంతోషాలు నిండాలి

Written By news on Tuesday, December 31, 2013 | 12/31/2013

ప్రతీ ఇంటా సంతోషాలు నిండాలి: వైఎస్ జగన్
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటా సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2014లో రాష్ట్రంలోని 9 కోట్ల ప్రజల భద్రతకు, అభివద్ధికి, సంక్షేమానికి భరోసా లభించాలని ఆకాంక్షించారు.
 
క్యాలెండర్ల మార్పుతో పాటు 2014 ఈ రాష్ట్రంలోని, దేశంలోని ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పునకు దారితీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జగన్ తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు.

పేదల ఇళ్లల్లో.. మా ఫొటో ఉండేలా పరిపాలిస్తా

పేదల ఇళ్లల్లో.. మా ఫొటో ఉండేలా పరిపాలిస్తా: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
చిత్తూరు: కొడుకు కోసం తెలుగువారి జీవితాలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెలగాటమాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ నగరాన్ని వదిలివెళ్లాలట, మరి సోనియా గాంధీ ఎక్కడకు వెళ్లాలో చంద్రబాబునాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలు చెప్పాలని  వైఎస్ జగన్ ఘాటుగా ప్రశ్నించారు. సమైక్య శంఖారావంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు వైఎస్ జగన్ మంగళవారం చేరుకున్నారు. అక్కడి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల వైఖరిపై మండిపడ్డారు.  వైఎస్ హయాంలో ప్రజలు సువర్ణయుగాన్ని చూశారని చెప్పారు. వైఎస్ పాలనలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కూడా రాలేదని జగన్ గుర్తుచేశారు. అందరూ రండి ఎన్నికలకు పోదామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నేను సమైక్యవాదంతో ఎన్నికల్లోకి వస్తానని వైఎస్ జగన్ సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలో ఎనిమిది సార్లు విద్యుత్‌ బిల్లులు పెంచిన ఆయన ఇప్పుడు తగ్గిస్తానని హామీ ఇస్తున్నారని జగన్ విమర్శించారు.

మద్యపాన నిషేధాన్ని ఎన్టీఆర్ అమలుచేస్తే ఎత్తేసింది చంద్రబాబు అని ఆయన ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ రూ.2కు కిలో బియ్యం ఇస్తే రూ. 5 పెంచింది చంద్రబాబు కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అప్పులు పాలైన రైతన్న ఆత్మహత్య చేసుకుంటే తిన్నది ఆరగక చనిపోతున్నారన్నది చంద్రబాబు అని చెప్పారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో పెన్షన్లు 16లక్షలు మాత్రమేనని, కానీ పింఛన్లను 16నుంచి 78 లక్షలకు పెంచిన ఘనత వైఎస్సార్ దేనని జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు రూ. 70పింఛన్ ఇస్తే వైఎస్సార్ రూ. 200కు పెంచారని చెప్పారు. వైఎస్సార్ సువర్ణయుగాన్ని మళ్లీ తీసుకొస్తానని, ప్రతి పేదవాడి గుండెచప్పుడు వింటానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నేను చనిపోయినా.. పేదల ఇళ్లల్లో నా ఫోటో, మానాన్న ఫోటో ఉండేలా పరిపాలిస్తానని వైఎస్ జగన్ ఘాటుగా జవాబులిచ్చారు.

Jagan speech in Madanapalle, Chittoor district

ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది

ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది: జగన్
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో  వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం కొనసాగుతోంది. డిసెంబర్‌ 27న మొదలైన రెండో విడత సమైక్య శంఖారావానికి  చిత్తూరు జిల్లా ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారు.  మహిళలు, యువత , విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు.  వృద్దులు  నడవలేని స్థితిలో కూడా మహానేత వైఎస్ఆర్ తనయుడ్ని చూడటానికి తరలి వస్తున్నారు. 
తనకోసం వచ్చిన  ప్రతి ఒక్కరితో జగన్‌ ఆప్యాయంగా మాట్లాడుతున్నారు.  పెద్దాయన ఉన్నప్పుడు పించన్ వచ్చేదని..ఆయన పోయిన తరువాత రావడంలేదని ఓ వృద్దురాలు  చెప్పటంతో......  మన ప్రభుత్వం వచ్చిన తరువాత అప్లికేషన్ పెట్టు..నీకు న్యాయం జరిగేటట్లు చూస్తానని జగన్‌ ఆవృద్దురాలికి మాట ఇచ్చారు.

ఇక మహిళలు హారతులు పడుతూ జగన్‌కు గ్రామగ్రామాన స్వాగతం పలుకుతున్నారు. ఓ వికలాంగ వృద్దురాలు తనకు  పింఛన్ రావడంలేదని...అధికారులు పింఛన్ ఇవ్వడానికి నిరాకరించారని ఆమె తన గోడును వెలిబుచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్దురాలుకు  జగన్‌ ధైర్యం చెప్పి పంపించారు.  నాలుగు నెలలు ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది అంటూ తనను కలవడానికి వచ్చిన వృద్దులకు జగన్ భరోసా చెప్పారు‌.  మరోవైపు మహిళలు చంటి పిల్లలను చంకన వేసుకుని  మహానేత తనయుడ్ని చూడటానికి వచ్చారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యశంఖారావం 30-12- 2013 photos





















Popular Posts

Topics :