5 వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 5 వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్

5 వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్

Written By news on Sunday, January 12, 2014 | 1/12/2014

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఇసి) కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణా ప్రక్రియను వేగవంతం చేసింది. 5 లేక 6 వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలన్న యోచనలో ఉంది. నోటిఫికేషన్ విడుదలకు ఫిబ్రవరి 18, 26 తేదీలు ఇసి పరిశీలనలో ఉన్నాయి. ఫిబ్రవరి 18 అయితేయ 5 వారాలు, 26 అయితే 6 వారాలు గడువు మాత్రమే ఉంది. ఈ ప్రకారం అయితే ముందుగా అనుకున్నదానికంటే కొద్ది రోజులు ముందే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 1తో ముగియనుంది. మే 31 నాటికి కొత్త సభ ఏర్పాటు కావాలి. మన రాష్ట్ర శాసనసభ గడువు   జూన్ 2వ తేదీతో ముగియనుంది. లోక్‌సభతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు ఎన్నికలు నిర్వహిస్తారు. హర్యానా శాసనసభకు అక్టోబరు 24వరకు గడువు ఉంది. అయితే ఆ ప్రభుత్వం కోరితే ఆ రాష్ట్ర శాసనసభకు  కూడా ముందే ఎన్నికలను నిర్వహించే అంశాన్ని కూడా ఈసీ పరిశీలిస్తోంది.  ఓటరు జాబితాల్లో కొత్త ఓటర్ల చేర్పు తర్వాత లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉన్నవారి సంఖ్య దాదాపు 80 కోట్లు ఉంటుందని అంచనా.
Share this article :

0 comments: