యూపీని కాకుండా ఏపీనే ఎందుకు విభజిస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » యూపీని కాకుండా ఏపీనే ఎందుకు విభజిస్తున్నారు

యూపీని కాకుండా ఏపీనే ఎందుకు విభజిస్తున్నారు

Written By news on Saturday, January 4, 2014 | 1/04/2014

యూపీని కాకుండా ఏపీనే ఎందుకు విభజిస్తున్నారు
హైదరాబాద్ : : ఎనిమిదిన్నర కోట్ల తెలుగు ప్రజలను ఎలా విభజన చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. నాయకుల కోసమే రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ఏర్పాటు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 20 కోట్లు  జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ ను కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ను మాత్రమే ఎందుకు హడావిడిగా విభజన చేస్తున్నారని విజయమ్మ అన్నారు. దేశంలో హిందీ తర్వాత తెలుగు మాట్లాడే ప్రజలే ఎక్కువ మంది ఉన్నారన్నారు.

 సంప్రదాయం ప్రకారం విభజనకు అసెంబ్లీ తీర్మానం జరపాలని ఆమె కోరారు. శాసనసభ వాయిదా అనంతరం విజయమ్మ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. విభజనపై కనీస సాంప్రదాయాలను కూడా కేంద్రం పాటించటం లేదని ఆమె మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాలు అయిన జార్ఖండ్, చత్తీస్ గఢ్ ఏర్పడినప్పుడు ఎస్సార్సీతోనే విభజన జరుగుతుందన్నారు. కనీస తీర్మానం లేకుండా విభజన ప్రక్రియ ఎలా చేస్తారని విజయమ్మ ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీలో తీర్మానం తర్వాతే తెలంగాణ బిల్లుపఐ చర్చ ఉండాలన్నారు.

చిదంబరం ప్రకటనలోనూ రాజకీయ ఉద్దేశాలు కనిపిస్తున్నాయని అన్నారు. పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతుంటే అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కళ్లు మూసుకున్నారని విజయమ్మ ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు లేక రాష్ట్రం నీళ్లు కోల్పోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్మట్టిలా ప్రాజెక్టులు కట్టి ఉంటే ఎన్నో నీళ్లు దక్కేవన్నారు. రాష్ట్ర విభజన కంటే సమైక్యానికే రాష్ట్రంలో ఎక్కువ మద్దతు ఉందని విజయమ్మ అన్నారు.

విభజన జరిగితే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ ఉప్పునీళ్లే గతి అని....కట్టిన ప్రాజెక్టులకు నీళ్లు ఎలా వస్తాయని విజయమ్మ ప్రశ్నించారు. కలిసి ఉన్నప్పుడే కృష్ణా జలాల పంపిణీపై ట్రిబ్యునల్ ప్రయోజనాలు నెరవేరటం లేదని ఆమె గుర్తు చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతానికి నీళ్లు ఎలా ఇస్తారన్నారు. చంద్రబాబు చేసిన పాపం రాష్ట్రానికి శాపంలా మారిందన్నారు. కలిసి ఉన్నప్పుడే జల కలహాలు ఉంటే విడిపోతే ఎలా అని ప్రశ్నించారు. దిగువ రాష్ట్రాల వాళ్లు ఎలా బతకాలో యూపీఏ చెప్పాలని విజయమ్మ డిమాండ్ చేశారు.

అన్ని పరిశ్రమాలు హైదరాబాద్ కే పరిమితం అయ్యాయని విజయమ్మ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజధానితో పాటు మిగతా నగరాలు కూడా అభివృద్ధి చెందాయన్నారు. గత అరవై ఏళ్లుగా కలిసి అభివృద్ధి చేసుకున్న ప్రాంతాన్ని వీడిపోవాలంటే ఎలా అన్నారు.  పరిష్కారం చూపకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారన్నారు.
Share this article :

0 comments: