ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన జగన్

ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన జగన్

Written By news on Sunday, January 5, 2014 | 1/05/2014


జిఎస్ ఎల్ వి(జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్)-డి5 ప్రయోగం విజయవంతం కావడంతో జగన్ ఇస్రో శాస్త్రవేత్తలను అ
భినందించారు...ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోగాలు చేసి భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని ఆకాంక్షించారు...


వీడియోకి క్లిక్ చేయండి
నెల్లూరు: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి  జిఎస్ ఎల్ వి(జియో సింక్రనస్ శాటిలైట్  లాంచ్ వెహికిల్)-డి5 రాకెట్ సాయంత్రం 4:18 గంటలకు నింగికెగిసింది. ఇది జిశాట్ 14వ ఉపగ్రహాన్ని తీసుకువెళ్లింది. భారత అంతరిక్ష ప్రస్థానంలో మరో కీలక ప్రయోగం ఇది. రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్లిన తరువాత శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు.

ఈ ప్రయోగాన్ని గతేడాది ఆగస్టు 19ననే చేపట్టాల్సి ఉండగా, రాకెట్ రెండో దశలో ఇంధన లీకేజీ కారణంగా ఆఖరి గంటలో వాయిదా పడింది. ఇస్రో ఇంతవరకూ ఏడు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు చేపట్టింది. రెండే  విజయవంతం అయ్యాయి. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లో కీలక దశ అయిన అప్పర్ క్రయోజెనిక్ దశను ఇస్రో స్వదేశీయంగానే తయారుచేసింది. షార్‌లో కౌంట్‌డౌన్ ప్రక్రియను శనివారం సాయంత్రం ఇస్రో చైర్మన్ కె. రాధాకృష్ణన్ పరిశీలించారు. ప్రయోగం నేపథ్యంలో షార్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. మత్స్యకారులు ఆదివారం చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేశారు.

జీఎస్‌ఎల్‌వీ ప్రత్యేకతలు:
 జీఎస్‌ఎల్‌వీ డీ5 పొడవు: 49.13 మీటర్లు
 బరువు: 414.75 టన్నులు ప్రయోగం
ఖర్చు: రూ.205 కోట్లు  (రాకెట్‌కు రూ.160 కోట్లు, ఉపగ్రహానికి రూ.45 కోట్లు)
 జీశాట్-14 బరువు:1,982 కిలోలు పనిచేసే కాలం: 12 ఏళ్లు
Share this article :

0 comments: