వైఎస్‌ఆర్‌సీపీ బాటలోకి కిరణ్‌, చంద్రబాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్‌సీపీ బాటలోకి కిరణ్‌, చంద్రబాబు

వైఎస్‌ఆర్‌సీపీ బాటలోకి కిరణ్‌, చంద్రబాబు

Written By news on Saturday, January 25, 2014 | 1/25/2014

వైఎస్‌ఆర్‌సీపీ బాటలోకి కిరణ్‌, చంద్రబాబుకిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాటలోకి వచ్చారు.  రాష్ట్ర విభజన బిల్లు అంతా తప్పులు తడకగా ఉందని, దాన్ని రాష్ట్రపతికి తిప్పి పంపాలని మంత్రి శైలజానాధ్ ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు  నోటీసు ఇప్పించారు. శాసనమండలిలో కూడా మంత్రి రామచంద్రయ్య ఇదే నోటీస్ ఇచ్చారు. టిడిపి కూడా ఇదే తరహా నోటీస్ ఇచ్చింది.

డిసెంబర్ 12నే ఈ తీర్మానం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు. ఇదే అంశంపై డిసెంబర్‌ 16న ఆ పార్టీ మరో లేఖ ఇచ్చింది. ఎప్పటి నుంచో వైఎస్ఆర్ సిపి నెత్తినోరు కొట్టుకున్నా  కిరణ్ వినలేదు. నిన్నటికి నిన్న కూడా ఆ పార్టీ ఈ విషయాన్ని స్పీకర్ కు గుర్తు చేసింది.  బిల్లు వచ్చి 44 రోజులు గడిచాయి. వైఎస్ఆర్ సిపి మొదటి నుంచి చెబుతూనే ఉంది. శాసనసభలో  బిల్లుపై  95 మంది సభ్యులు మాట్లాడారు. ఇప్పుడు ఆయనలో కదలిక వచ్చింది. రూల్‌ 77, రూల్‌78ల కింద స్సీకర్ కు నోటీస్‌ ఇచ్చారు.    ఉభయసభల్లో తీర్మానం ప్రవేశపెట్టాలని స్పీకర్‌ను కోరారు. పార్లమెంటులో పెట్టే బిల్లుని శాసనసభకు పంపకపోవడం ఆక్షేపణీయం అన్నారు. బిల్లు విషయంలో రాష్ట్రపతి తప్పేమీలేదని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు. కేంద్రం అసమగ్ర బిల్లు  పంపినట్లు చెప్పారు.

 కిరణ్ కుమార్ రెడ్డిని చూసి చంద్రబాబులో కదలిక వచ్చింది. టిడిపి  కూడా ఇంత కాలం తరువాత అదే తరహా నోటీస్ ఇచ్చింది. చంద్రబాబు కూడా అవే నిబంధనలు ప్రస్తావించి బిల్లును వెనక్కు పంపడానికి తీర్మానం చేయాలని కోరారు.


సీఎం కిరణ్, చంద్రబాబు చర్యలను కాంగ్రెస్, టిఆర్ఎస్ నేతలు దుయ్యబట్టారు. మొదటి రోజే బిల్లును తిరిగి పంపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ డిమాండ్ చేశారని టిఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేంద్ర గుర్తు చేశారు. అప్పడు మాట్లాడని సీఎం ఇప్పుడెందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. సభలో సమైక్యతీర్మానం చేయాలన్నా 10 రోజులు పడుతుందని చెప్పారు.

కిరణ్, చంద్రబాబులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు.  బిల్లుపై ఇన్నాళ్లు మాట్లాడకుండా సీఎం ఏం చేశారు? అని ప్రశ్నించారు. విభజన బిల్లు వెనక్కు పంపాలని సీఎం స్పీకర్‌కు లేఖ రాయడం ఏకపక్షం అన్నారు. సీఎం వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని  గండ్ర హెచ్చరించారు.
Share this article :

0 comments: