గంగిరెద్దులా తల ఊపుతున్న కిరణ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గంగిరెద్దులా తల ఊపుతున్న కిరణ్

గంగిరెద్దులా తల ఊపుతున్న కిరణ్

Written By news on Friday, January 10, 2014 | 1/10/2014

'గంగిరెద్దులా తల ఊపుతున్న కిరణ్'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి గంగిరెద్దులా తల ఊపి విభజనకు సహకరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు ఎద్దేవా చేశారు. శుక్రవారం వారు ఇరువురు అసెంబ్లీ మీడియా పాయింట్ ఎదుటు మాట్లాడుతూ... రాష్ట్ర విభజన అప్రజాస్వామికమని అందుకే అసెంబ్లీ నుంచి తామ పార్టీ సభ్యులు వాకౌట్ చేసినట్లు వివరించారు. విభజన బిల్లును తిరస్కరిస్తు స్పీకరుకు పత్రలు ఇచ్చినట్లు చెప్పారు.
 
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై భూమన, శ్రీకాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇరుప్రాంత ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజమని వారు ఆరోపించారు. టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయన్నారు.
Share this article :

0 comments: