అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైన కుమ్మక్కు కుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైన కుమ్మక్కు కుట్ర

అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైన కుమ్మక్కు కుట్ర

Written By news on Sunday, January 26, 2014 | 1/26/2014

తోడు దొంగాట!
విభజన బిల్లుపై బాబు, కిరణ్ కొత్త డ్రామా
అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైన కుమ్మక్కు కుట్ర
 
 సాక్షి, హైదరాబాద్: కుమ్మక్కు కుట్రపై మరోసారి పరదా తొలగిపోయింది. సభా నాయకుడైన సీఎం కిరణ్, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విభజన బిల్లుపై ఇంతకాలంగా ఆడుతున్న కలిసికట్టు డ్రామా శాసనసభ సాక్షిగా మళ్లీ బట్టబయలైంది. బిల్లుపై శనివారం సభలో జరిగిన చర్చలో వారిద్దరూ ప్రదర్శించిన ద్వంద్వ ప్రమాణాలు, విస్మయకర ధోరణులు అసెంబ్లీ మొత్తాన్నీ నిర్ఘాంతపరిచాయి. వారు ఇంతకాలం కేవలం ఒక రాజకీయ పార్టీని దెబ్బ తీయడమే ఏకైక ధ్యేయంగా ప్రయత్నించారన్న వాస్తవం బిల్లుపై ప్రదర్శించిన కుట్రపూరిత వైఖరితో శనివారం సభ ముందు ఆవిష్కృతమైంది. బిల్లుపై 42 రోజులుగా అన్ని పరిణామాలూ తమ కళ్లెదుటే సాగుతున్నా ఇంతకాలం నిమ్మకు నీరెత్తినట్టు మిన్నకుండిపోయిన బాబు, కిరణ్ ఉన్నట్టుండి తాజాగా కొత్త వాదనను తెరపైకి తెచ్చిన తీరు పార్టీలకు అతీతంగా సభ్యులందరినీ విస్మయపరిచింది.
 
 తప్పుడు బిల్లుపై చర్చ చేయాల్సిన అవసరమే లేదని చంద్రబాబు, అసలు ముసాయిదా బిల్లును శాసనసభకు పంపే అధికారమే లేదని కిరణ్ శనివారం సభలో వ్యాఖ్యానించడంతో వారి అసలు రంగు బయటపడింది. బిల్లు రాజ్యాంగవిరుద్ధమని కిరణ్ అనడం, అవునంటూ ఆ వెంటనే బాబు వత్తాసు పలకడం, పైగా ‘ఈ సభకు హక్కులున్నాయి. మన హక్కును మనం కాపాడుకుందాం’ అంటూ సీఎంకు సలహా ఇవ్వడం, బిల్లును తిప్పి పంపుతూ తీర్మానం చేద్దామంటూ సభ ముగియగానే స్పీకర్‌కు కిరణ్ నోటీసివ్వడం వంటి పరిణామాలన్నీ వారి కుమ్మక్కును బాహాటంగా పట్టించాయి.
 
 ఇంతకాలం నోరెందుకు విప్పనట్టు?
 
 గత డిసెంబర్ 13న విభజన బిల్లు రాష్ట్రానికి వచ్చీ రాగానే ఆగమేఘాలపై అసెంబ్లీకి చేరుకోవడం, స్పీకర్ దాన్ని సభ ముందు పెట్టడం మొదలుకుని నాటకీయ పరిణామాల్లో బిల్లుపై చర్చ మొదలవడం దాకా చకచకా జరిగిపోవడం తెలిసిందే. ఇవన్నీ కూడా సభా నాయకునిగా, విపక్ష నేతగా సభలో కీలక పాత్ర పోషించాల్సిన కిరణ్, బాబుల కళ్లముందే జరిగాయి. పైగా చర్చ విషయంలోనే స్పీకర్ ఏకంగా మూడుసార్లు బీఏసీ కూడా నిర్వహించారు. అయినా వారిద్దరూ బిల్లుపై చర్చ అనవసరమని గానీ, ముసాయిదాను సభకెలా పంపుతారని గానీ గత 42 రోజుల్లో పొరపాటున కూడా అనకపోవడం గమనార్హం. పైగా బిల్లుపై ఇప్పటిదాకా దాదాపు 100 మంది సభ్యులు అభిప్రాయాలను వెల్లడించినా తాము మాత్రం నోరే విప్పకుండా చోద్యం చూస్తూ వచ్చారు. బిల్లుకు మద్దతుగా, వ్యతిరేకంగా తమ కళ్లముందే సభ్యులు ప్రాంతాలవారీగా నిరసనలకు, ఆందోళనకు, నిందారోపణలకు దిగుతున్నా పట్టనట్టే వ్యవహరించారు. అలాంటిది, శనివారం వారు ఒక్కసారిగా మాట్లాడిన మాటలు యావత్ సభ్యులనూ విస్మయపరిచాయి. కాంగ్రెస్, టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. బిల్లు విషయమై బాబు, కిరణ్ వ్యవహార శైలిపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలూ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘బిల్లు రాజ్యాంగ విరుద్ధమని భావించినప్పుడు ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నట్టు? శనివారం సభలో చేసిన వాదనలే ఇంతకాలంగా బీఏసీకి వచ్చి చెప్పలేదెందుకు? కేవలం తమ సొంత ఇమేజ్‌ని పెంచుకోవడానికి ఇలా రాష్ట్రం మొత్తాన్నీ వీరిద్దరూ పణంగా పెడతారా?’’ అంటూ అన్ని పార్టీల నేతల నుంచీ పలు ప్రశ్నలు విన్పించాయి.
 
 చర్చ జరగాల్సిందేనన్న నేతలు: నిజానికి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాల్సిందిగా కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామని విభజన బిల్లు శాసనసభకు రాకముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించడం తెలిసిందే. దాన్ని కాంగ్రెస్, టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. బిల్లుపై చర్చించడమంటే విభజనకు అంగీకరించినట్టే అవుతుందంటూ వైఎస్సార్‌సీపీ నెత్తీనోరూ బాదుకున్నా వారు పట్టించుకోలేదు. విభజన జరగాలని చూస్తున్నందుకే బిల్లుపై చర్చలో పాల్గొనడం లేద ంటూ విమర్శలకు కూడా దిగారు. రూల్ 77 కింద డిసెంబర్ 16వ తేదీనే స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ నోటీసిస్తే ఎగతాళి చేసిన నాయకులే, ఈ రోజు అదే నిబంధన కింద నోటీసివ్వడం చూసి కాంగ్రెస్, టీడీపీ నాయకులే నివ్వెరపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నోటీసుతో పోలిస్తే వీరిచ్చిన దాంట్లో ఏం తేడా ఉందంటూ ప్రశ్నిస్తున్నారు.
 
 తొలినుంచీ కుట్రపూరితంగానే: డిసెంబర్ 12న ప్రస్తుత శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగా, విభజన బిల్లు 13వ తేదీన సభకు చేరింది. మర్నాడే స్పీకర్ దాన్ని సభ ముందుంచారు. ఏదైనా బిల్లును సభలో ప్రవేశపెట్టాక చర్చ చేపట్టేందుకు కొన్ని సంప్రదాయాలున్నాయి. ముందుగా సభా నాయకుడో, సంబంధిత మంత్రో బిల్లును ప్రవేశపెడితే సభ అనుమతి మేరకు దాన్ని స్పీకర్ పరిగణనలోకి తీసుకుని చర్చ ప్రారంభించాలని సూచిస్తారు. కానీ అలాంటిదేమీ లేకుండానే బిల్లుపై చర్చ ప్రారంభమైనట్టు అప్పటి సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు చెప్పిన విషయం వివాదాస్పదమైంది. కానీ ఆ వివాదాన్ని అంతటితో వదిలేద్దామని, చర్చ మొదలైనట్టేనని డిసెంబర్ 17 నాటి బీఏసీలో కిరణ్ (ఆయన పాల్గొన్నది ఈ ఒక్క బీఏసీలోనే) అన్నారు! పైగా బిల్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వచ్చాక కేవలం 17 గంటల్లోనే ఆగమేఘాలపై వ్యవహారమంతా పూర్తి చేసి దాన్ని అసెంబ్లీకి చేర్చారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్ లో ఉన్న రోజే ఆ ఫైలుపై చకచకా సంతకాలు పూర్తి చేయడమే గాక, ఆ విషయాన్ని కిరణే స్వయంగా దిగ్విజయ్ చెవిలో వేశారు. ఇక కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ నగరంలో ఉన్న రోజునే నాటకీయంగా బిల్లుపై సభలో చర్చను ప్రారంభించారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, సమైక్య తీర్మానం చేద్దామని 16 న వైఎస్సార్‌సీపీ ప్రతిపాదిస్తూ 77 నిబంధన కింద నోటీసిస్తే మాత్రం కాంగ్రెస్, టీడీపీ సీమాంధ్ర నేతలు దానిపై స్పందించలేదు.
 
 ఆంతర్యమేంటి?: బిల్లుపై సభకు మార్గనిర్దేశం చేయాల్సిన ఇద్దరు నాయకులు ఇంతకాలం తప్పించుకునే ధోరణిలో, బిల్లుతో తమకేమాత్రం సంబంధం లేదన్నట్టు సభలో వ్యవహరించారు. చర్చకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు మరో నాలుగు రోజుల్లో ముగుస్తున్న దశలో వారిద్దరూ పథకం ప్రకారమే కొత్త అవతారం ఎత్తినట్టు సభ వేదికగా జరిగిన సంఘటనలు స్పష్టం చేస్తున్నాయంటున్నారు. బిల్లుపై ఎంతోకాలంగా వైఎస్సార్‌సీపీ లేవనెత్తుతున్న అంశాలనే శనివారం కిరణ్ కూడా చెప్పుకొచ్చారు. నిజానికి సభను నడిపించడంలో సభా నాయకుడు (సీఎం), ప్రధాన ప్రతిపక్ష నేతలదే కీలక పాత్ర. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని భావించినప్పుడు, లేదా దాన్ని కేంద్రానికి తిప్పి పంపాలకున్నప్పుడు.. దానిపై వారిద్దరూ మిగతా పక్షాలతో చర్చించి అవగాహనకు వచ్చి ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ తాము మాత్రమే చాంపియన్లమని ప్రచారం చేసుకోవాలన్న ఎత్తుగడతోనే ముందునుంచీ వెళుతున్నందున మిగిలిన పక్షాలను గానీ సభ్యులనుగానీ పరిగణలోకి తీసుకోలేదని తేలిపోయింది. నిజానికి బిల్లుపై మరోసారి గడువు పెంపు కోరకుండా, బిల్లును సాఫీగా కేంద్రానికి తిప్పిపంపడానికి ఒక వ్యూహం మేరకు వీరిద్దరు కొత్త డ్రామాకు తెరతీశారని సీమాంధ్ర నేతల్లో బలంగా వినిపిస్తోంది!
 
 దేన్ని పరిగణనలోకి తీసుకోవాలి?: ప్రస్తుతం అసెంబ్లీలో చర్చిస్తున్న అంశం కేవలం విభజన బిల్లు మాత్రమే. అది రాష్ట్రపతి నుంచి వచ్చినందున దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. కానీ సీఎం మాత్రం బిల్లుకు అనుబంధంగా కేంద్ర హోం శాఖ లేదా మరో శాఖ రాసే ఉత్తర ప్రత్యుత్తరాలను పరిగణనలోకి తీసుకుని సందేహాలు వ్యక్తం చేయడంలోని హేతుబద్ధతపై కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హోం శాఖ నుంచి వచ్చిన లేఖను అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదని, సభ పరిధిలోకి రాని అంశాన్ని, అది కూడా ఆ విషయాన్ని ఇంతకాలం తన వద్ద గోప్యంగా ఉంచుకుని... ఈ రోజు అదేదో రాజ్యాంగ విరుద్ధమైనట్టుగా కిరణ్ చూపడమేంటని తెలంగాణవాదుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.
 
 అసలు విషయాన్ని పక్కనపెట్టి: ఇక... ‘విభజనా, సమైక్యమా అన్నది కాదు ఇక్కడ సమస్య...’ అంటూ సభను దారి మళ్లించేందుకే బాబు ప్రయత్నించారని టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. అసలు బిల్లు ఉద్దేశమే రాష్ట్రాన్ని విభజించడం కాగా,అందుకు విరుద్ధంగా మాట్లాడటంలోనే బాబు దాటవేత వైఖరి, దోబూచులాట, ద్వంద్వ ప్రమాణాలు బయట పడ్డాయని వారంటున్నారు. బిల్లుపై చర్చ ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ నుంచి కనీసం ఓ డజను మంది దానిపై మాట్లాడారు. విభజించాలని కొందరు, వద్దని మరికొందరు వాదించారు. ఇవన్నీ సభలో బాబు సాక్షిగానే జరిగాయి. దాదాపు నెలన్నరగా ఇదంతా జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి.... శనివారం ఒక్కసారిగా బాబు వాటన్నింటినీ పక్కనపెట్టడం, కిరణ్‌కు వత్తాసు పలకడం టీడీపీ వారినీ నివ్వెరపరిచింది.
Share this article :

0 comments: