రాష్ట్ర సమైక్యత కోరుకున్న మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర సమైక్యత కోరుకున్న మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి

రాష్ట్ర సమైక్యత కోరుకున్న మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి

Written By news on Saturday, January 18, 2014 | 1/18/2014

బాబుతో జైసమైక్యాంధ్ర అనిపించగలరా?
హైదరాబాద్ : ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత టీడీపీకి లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో టీడీపీలా తమది రెండుకళ్ల సిద్ధాంతం కాదని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి ఉంటే మీ నాయకుడితో జై సమైక్యంధ్ర అనిపించగలరా అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పని గోవిందా అని ఆయన అన్నారు.

రాష్ట్ర సమైక్యత కోరుకున్న మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.  వైఎస్ హయాంలో తెలంగాణలో బాగా అభివృద్ధి జరిగిందన్నారు. మూడు ప్రాంతాలను వైఎస్ సమానంగా చూశారన్నారు. రాష్ట్ర ప్రజల మేలుకోరే తాము సమైక్యవాదాన్ని వినిపిస్తున్నామని భూమన అన్నారు. విభజన జరుగుతోందని తెలియగానే మొదట స్పందించింది వైఎస్ఆర్ సీపీయేనని ఆయన గుర్తు చేశారు.

తమ సమైక్య పోరాటం రాజకీయ లబ్ధి కోసం కాదని స్పష్టం చేశారు. సమైక్య తీర్మానం పెట్టాలని తాము తొలి నుంచి కోరుతున్నామన్నారు.  విభజన బిల్లుకు తాము వ్యతిరేకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది లోపలా, బయటా ఒకటే మాట అని భూమన స్పష్టం చేశారు. విభజనకు సహకరిస్తున్నారంటూ ఆరోపణలు చేయటం దుర్మార్గమని భూమన మండిపడ్డారు
Share this article :

0 comments: