ఇప్పటికైనా సమైక్య తీర్మానం: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇప్పటికైనా సమైక్య తీర్మానం: విజయమ్మ

ఇప్పటికైనా సమైక్య తీర్మానం: విజయమ్మ

Written By news on Saturday, January 25, 2014 | 1/25/2014

ఇప్పటికైనా సమైక్య తీర్మానం: విజయమ్మ
స్పీకర్‌కు విజయమ్మ లేఖ
టీ బిల్లును తిప్పి పంపేందుకు రాష్ట్రపతిని కోరాలి
77, 78 నిబంధనల కింద గత నెల నోటీసులిచ్చిన వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం


సాక్షి, హైదరాబాద్: 
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను పునఃపరిశీలన నిమిత్తం కేంద్ర మంత్రివర్గానికి తిరిగి పంపాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరుతూ శాసనసభలో ఇప్పటికైనా తీర్మానాలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత వై.ఎస్.విజయమ్మ కోరారు. ఈ మేరకు శుక్రవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఆమె ఒక లేఖ రాశారు. గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన 77, 78 నిబంధనల కింద రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయాలని తామిచ్చిన నోటీసుపై పది రోజుల్లోపు తదుపరి చర్య చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకూ దాని ఊసే లేదని ఆమె గుర్తు చేశారు.
 
  గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన అవే నిబంధనల కింద పునర్వ్యవస్థీకరణ బిల్లును కేంద్ర మంత్రివర్గ పునఃపరిశీలన నిమిత్తం వెనక్కి పంపాల్సిందిగా రాష్ట్రపతిని కోరుతూ తీర్మానం చేయాలని ఇచ్చిన నోటీసుపై కూడా పది రోజుల గడువు దాటినా ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆమె స్పీకర్ దృష్టికి తెచ్చారు. తామిచ్చిన ఈ రెండు నోటీసుల మేరకు ఇప్పటికైనా తీర్మానాలు చేయాలని విజయమ్మ కోరారు. ఈ లేఖపై పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకులు ధర్మాన కృష్ణదాస్, మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, తెల్లం బాలరాజు, కొరుముట్ల శ్రీనివాసులు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, గొల్ల బాబూరావు సహా పలువురు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.
Share this article :

0 comments: