అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు

అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు

Written By news on Wednesday, January 29, 2014 | 1/29/2014

శాసనసభలో బుధవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. విభజన బిల్లు తిప్పి పంపాలని ఇచ్చిన వాయిదా తీర్మానంపై సభలో చర్చ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన వైఖరిపై చర్చ జరపాలని తెలుగుదేశం పార్టీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి.

ఎప్పటిలాగానే ఆందోళనలు, నిరసనలు, నినాదాలతో హోరెత్తిన అసెంబ్లీ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే గంటపాటు వాయిదా పడింది.  ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దాంతో వాయిదా తీర్మానాలపై చర్చించాల్సిందేనంటూ పార్టీలకతీతంగా ఇరుప్రాంతాలకు చెందిన సభ్యులు స్పీకర్‌ పోడియంవద్ద ఆందోళనకు దిగడంతో..సభాకార్యకలాపాలు స్థంభించిపోయాయి. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో అసెంబ్లీ హోరెత్తింది.


Share this article :

0 comments: