నేడు నెల్లూరు జిల్లాలో సమైక్య శంఖారావం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు నెల్లూరు జిల్లాలో సమైక్య శంఖారావం

నేడు నెల్లూరు జిల్లాలో సమైక్య శంఖారావం

Written By news on Friday, January 31, 2014 | 1/31/2014

సమైక్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రవేశించనుంది. ఆయన సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో ఉదయం 10 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు, సాయంత్రం 6 గంటలకు గూడూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగే సభల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి 1న ఉదయం వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోనూ, సాయంత్రం 5 గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలోనూ జరిగే సభల్లో ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 2న ఆయన ఇడుపులపాయలో జరిగే రెండో ప్రజాప్రస్థానం(ప్లీనరీ)కుహాజరవుతారని పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
 చిత్తూరులో 26 రోజులపాటు యాత్ర: చిత్తూరు జిల్లాలో 26 రోజుల పాటు సాగిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర గురువారంతో ముగిసింది.
 
  జిల్లాలో 2013 నవంబర్ 30న ప్రారంభమైన ఈ యాత్ర నాలుగు విడతలుగా సాగింది. మొత్తం 26 రోజుల పాటు 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ పర్యటించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన 24 మందికి చెందిన కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. తిరుపతి నియోజకవర్గంలో రెండు కుటుంబాలను ఓదార్చాల్సి ఉన్నప్పటికీ అక్కడి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఉండటంతో ప్రస్తుతానికి మినహాయించారు. త్వరలో అక్కడ కూడా పర్యటిస్తారని రఘురామ్ తెలిపారు.

 నాల్గో విడతలో చిత్తూరు జిల్లాలో 11 రోజుల పాటు కొనసాగిన శంఖారావం యాత్రకు అపూర్వ స్పందన లభించింది. 12వ రోజు శుక్రవారం ఉదయం జిల్లాలోని సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుంది.
 
 ఈ యాత్ర రెండురోజుల పాటు జిల్లాలో సూళ్లూరుపేట, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల పరిధిలోని 13 మండలాలు, 108 గ్రామాల మీదుగా కొనసాగుతుంది. జగన్‌మోహన్‌రెడ్డి శంఖారావం యాత్రకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చిత్తూరు జిల్లా కంటే యాత్రను రెట్టింపు విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, జిల్లా ప్రజలు సమైక్యోత్సాహంతో ఉన్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి రానున్నారు.
 
 తొలిరోజు శంఖారావం యాత్ర వివరాలు
 శుక్రవారం ఉదయం సూళ్లూరుపేట మండలంలోని పెళ్లకూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ తెలిపారు.
  ఉదయం 10 గంటలకు నాయుడుపేటలో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు.  
  మధ్యాహ్నం 3 గంటలకు మనుబోలులో నిర్వహించే సభలో జగన్ ప్రసంగిస్తారు.
 సాయంత్రం 5 గంటలకు గూడూరు సభలో ప్రసంగిస్తారు.
  రాత్రి గూడూరులో బస చేస్తారు.
 రెండోరోజు యాత్ర వివరాలు
  శనివారం ఉదయం 10 గంటలకు వెంకటగిరి బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు.      సాయంత్రం 5 గంటలకు ఆత్మకూరు బహిరంగసభలో ప్రసంగిస్తారు.
Share this article :

0 comments: