మీలో ఒక్కడిగా ఉంటా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీలో ఒక్కడిగా ఉంటా

మీలో ఒక్కడిగా ఉంటా

Written By news on Friday, January 24, 2014 | 1/24/2014

మీలో ఒక్కడిగా ఉంటా
శ్రీరంగరాజపురం, న్యూస్‌లైన్: మీలో ఒక్కడిగా ఉంటూ మీ కుటుంబ సమస్యల్లో పాలు పంచుకుం టానని మిట్టపల్లె పెద్దబ్బరెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలోని శ్రీరంగరాజపురం మండలం కొటార్లపల్లెకు చెందిన మిట్టపల్లె పెద్దబ్బరెడ్డి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మృతికి తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందాడు.

ఆ కుటుంబాన్ని జననేత గురువారం ఓదార్చారు. ముందుగా కుటుంబ సభ్యుల వివరాలు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పెద్దబ్బరెడ్డి కుమారులు రవి, అమర్, కుమార్తెలు శశికళ, చిత్రకళ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు అడిగి తెలుసుకున్నా రు. అభిమాన నేత తమ ఇంటికి వస్తున్నాడని తెలియడంతో పెద్దబ్బరెడ్డి కొడుకులు, కుమార్తెల పిల్లలు అం దరూ ఇంటికి వచ్చారు. గ్రామంలో పాఠశాల సౌకర్యం ఉందా? అని వారిని అడిగి తెలుసుకున్నారు. పా ఠశాల కొత్తపల్లెమిట్టలో ఉందని సమాధానం చెప్పా రు.

అక్కడ ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై పిల్లలను ఆరా తీశారు. పెద్ద కుమారుడు రవి జీవనం ఎలా అని అడిగారు. తనకు కోళ్ల ఫారం ఉందని, ఇంటిగ్రేషన్ పద్ధతిలో కోళ్లను పెంచుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకున్నారా అంటూ జననేత ప్రశ్నించారు. తిరిగి కట్టే పరిస్థితి తమకు లేదని, అందుకే రుణాలు తీసుకోలేదని సమాధానం ఇచ్చారు. మీకు భూమి ఎంత ఉంది, ఏఏ పంటలు వేస్తున్నారని అడిగారు.  పెద్దబ్బరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒక్కడిగా పెద్దబ్బరెడ్డి మనవళ్లు, మనుమరాళ్లతో నవ్వుతూ ఆనందంగా గడిపారు.

పెద్దబ్బరెడ్డికి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో అభిమానమని, అందుకే పెద్ద కుమారుడు రవి తన కుమార్తెకు షర్మిల అని పేరు పెట్టారని కుటుంబ సభ్యులు చెప్పడంతో, షర్మిలను పిలిచి ముద్దు పెట్టారు. వారు జగన్‌మోహన్‌రెడ్డికి రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మల్యేలు అమరనాథరెడ్డి, ప్రవీణ్ కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి, జిల్లా కన్వీనర్, జీడీనెల్లూరు నియోజకవర్గ  సమన్వయకర్త నారాయణస్వామి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంసీ విజయానందరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.
 
Share this article :

0 comments: