ప్రాజెక్టులు పట్టని ప్రభుత్వం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రాజెక్టులు పట్టని ప్రభుత్వం

ప్రాజెక్టులు పట్టని ప్రభుత్వం

Written By news on Saturday, January 18, 2014 | 1/18/2014

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం భద్రాచలం వచ్చిన ఆయన పార్టీ జిల్లా కన్వీనర్ పాయం వెంకటేశ్వర్లుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సాగునీటి సౌకర్యం లేక జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
 
 రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం పథకాన్ని ప్రభుత్వం ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు. ఏజెన్సీలోని గిరిజన రైతుల ఉపయోగార్థం పాలెంవాగు, మోడికుంట, గుండ్లవాగు ప్రాజెక్టులకు వైఎస్ సమయంలోనే నిధుల కేటాయింపులు జరుగగా, వీటి గురించి ప్రస్తుతం పట్టించుకున్న నాథుడే లేడన్నారు. సాగునీటి ఇబ్బందులను అధిగమించి రెక్కల కష్టంతో పండించిన పంటకు కూడా ఈ ప్రభుత్వం తగిన గిట్టుబాటు ధర కల్పించకపోవటం బాధాకరమన్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం కనీసం ప్రకృతి వైపరీత్యాల సమయంలోనైనా తగిన రీతిలో స్పందించి ఆదుకోకపోవడం విచారకరమన్నారు. గోదావరి వరదలతో పరివాహక రైతులకు అపార నష్టం వాటిల్లిందని, అనేక మంది ఇళ్లను కూడా కోల్పోయారని, వారికి మాత్రం నేటికి తగిన రీతిలో పరిహారం అందలేదని అన్నారు. ప్రజల కష్టాలు పట్టించుకోని ఈ ప్రభుత్వాలు ఉండి ఉపయోగమేమిటని ప్రశ్నించారు. రైతు బాధలు తొలగించే రాజన్న రాజ్యం జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో త్వరలోనే వస్తుందన్నారు.  
 
 సంక్షేమ పథకాలు జగన్‌తోనే సాధ్యం : వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ పాయం
 సంక్షేమ పథకాలు ప్రజలకు  సవ్యంగా అందాలంటే జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ పాయం వెంకటేశ్వర్లు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధన కోసం ఏర్పడిన వైఎస్సార్‌సీపీ త్వరలోనే అధికారంలోకి వస్తుందని అన్నారు. రాజన్న రాజ్యం కోసం అన్ని వర్గాల ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజా వ్యతిరేక పాలన చేసే ఈ ప్రభుత్వానికి రోజుల దగ్గర పడ్డాయన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పాగా వేయనున్నట్లుగా తెలిపారు. ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గ సమన్వయకర్తలు తాటి వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ, డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడబోతున్నారని జోస్యం చెప్పారు.
 
 ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు యర్రంశెట్టి ముత్తయ్య, పార్టీ విభాగాల రాష్ట్ర కమిటీ సభ్యులు కడియం రామాచారి, ఉప్పాడ ప్రసాదరెడ్డి, నాయకులు మంత్రిప్రగడ నర్సింహారావు, గంటా కృష్ణ, మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఉమామహేశ్వరి, పట్టణ కన్వీనర్ పెద్దినేని శ్రీనివాస్, మహిళా విభాగం మండల కన్వీనర్ దామెర్ల రేవతి పాల్గొన్నారు.
Share this article :

0 comments: