వైఎస్ఆర్ కాంగ్రెస్‌ వ్యూహంపై రేపు చర్చ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కాంగ్రెస్‌ వ్యూహంపై రేపు చర్చ

వైఎస్ఆర్ కాంగ్రెస్‌ వ్యూహంపై రేపు చర్చ

Written By news on Wednesday, January 15, 2014 | 1/15/2014

వైఎస్ఆర్ కాంగ్రెస్‌ వ్యూహంపై రేపు చర్చ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేపు గురువారం సమావేశం అవుతున్నారు.  శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

రాష్ట్ర విభజనను  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా  వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే ఈ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రాష్ట్ర విభజనపై చర్చను ఖండించారు. చర్చలో పాల్గొనడమంటే రాష్ట్ర విభజనను అడ్డుకోవడమేనని చెప్పారు.  పార్టీ శాసన సభాపక్ష నాయకురాలు వైఎస్‌ విజయమ్మ కూడా రాష్ట్ర విభజనపై అసెంబ్లీలోనే కాంగ్రెస్‌ , టీడీపీలను నిలదీశారు. మెజార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ రెండు నడుచుకోవడంలేదని విమర్శించారు. వాకౌట్ చేశారు. ఆందోళనకు దిగారు. అరెస్ట్ అయ్యారు.  ఇవే కాకుండా మరిన్ని అంశాలు  గురువారం  వైఎస్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది
Share this article :

0 comments: