విధానాలను వీధుల్లో విడిచి... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విధానాలను వీధుల్లో విడిచి...

విధానాలను వీధుల్లో విడిచి...

Written By news on Saturday, January 18, 2014 | 1/18/2014

విధానాలను వీధుల్లో విడిచి, సమైక్యవాదాన్ని గాలికొదిలి... శాసనసభ వేదికగా అంటకాగుతున్న అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలు వైఎస్సార్‌సీపీపై మూకుమ్మడిగా దాడి ప్రారంభించాయి. రెండు కళ్ల సిద్ధాంతం, ప్రాంతాలవారీ వాదనలతో గందరగోళం సృష్టించిన ఆ రెండు పార్టీలు సమైక్యజెండాను భుజానికెత్తుకున్న వైఎస్సార్‌సీపీపై దాడి చేయడానికి ఒక్కటయ్యాయి. శాసనసభలో శుక్రవారం చోటుచేసుకున్న ప్రసంగాలు, పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. విభజన ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి, ఎలాంటి ఆటంకాలు లేకుండా బిల్లును ఢిల్లీ చేర్చడానికి అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే శాసనసభలో వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకొంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
 శుక్రవారం పరిణామాలివీ...
 -    తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉందని పార్టీ పోలిట్‌బ్యూరో ఎప్పుడో నిర్ణయించిందంటూ సభావేదికపైనే టీడీపీ సభ్యుడు రావుల నొక్కి చెప్పినా ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర సభ్యులు నోరు విప్పరు. ఒక పార్టీ తరఫున ఒకే అభిప్రాయం చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయరు.
-    అప్రజాస్వామికంగా సాగుతున్న చర్చలో పాల్గొనలేమని వైఎస్సార్‌సీపీ వాకౌట్ చేస్తే.. మంత్రి ఆనం అభ్యంతరం వ్యక్తంచేశారు. నిరసన తెలిపేవారు ఇంత సుదీర్ఘంగా మాట్లావద్దంటూ... వైఎస్సార్‌సీపీపై విమర్శల దండకం అందుకున్నారు. గతవారం కూడా సభలో ఇవే అంశాలను చెప్పారని, మరోసారి నిరసన వ్యక్తం చేయడానికి కూడా ఆ పార్టీకి అవకాశం ఇవ్వద్దని స్పీకర్‌ను కోరారు. టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్‌దీ అదే మాట. అయితే ఓటింగ్ కోసమే విజయమ్మ పట్టుబడుతున్న విషయాన్ని కావాలనే విస్మరించారు.
 
 -   ‘‘సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల అసలు రంగు బయటపెట్టడం ద్వారా అప్రజాస్వామికంగా సాగుతున్న విభజన ప్రక్రియను విజయమ్మ సభలో ఎండగట్టారు. ఓటింగ్ ఉంటుందో లేదో చెప్పకుండా జరిగే చర్చలో పాల్గొనమన్నారు. సర్కారు తీరుకు నిరసనగా ఆమె మాట్లాడుతున్నప్పుడు.. సమైక్యవాదులని చెప్పుకుంటున్న వారంతా రాజకీయ ప్రయోజనాల కోసం చూశారే తప్ప.. సమైక్యవాదానికి అనుకూలంగా కలిసివచ్చే చిరు ప్రయత్నం కూడా చేయలేదు’’ అని ఒక నేత మీడియాపాయింట్ వద్ద వ్యాఖ్యానించారు.
 
 -    ‘‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏదీ స్పష్టంగా చెప్పరు. కనీసం సవరణలూ ప్రతిపాదించరు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోరు, ఆయనముందే పార్టీ సభ్యులు పరస్పర అనుకూల, వ్యతిరేక వాదనలు వినిపిస్తారు. కాంగ్రెస్ పార్టీలోనూ అంతే. కానీ వైఎస్సార్‌సీపీ సభ్యులు మాట్లాడితే.. ఇరు వైపుల నుంచి రెండు పార్టీలకు చెందిన సభ్యులు ప్రాంతాలకు అతీతంగా విమర్శలకు దిగారు’’ అని ఒక మరో నేత విశ్లేషించారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప.. సమైక్యవాదం ఎవరికీ పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: