జనంలోకి వెళ్తే మీ బండారం ...... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనంలోకి వెళ్తే మీ బండారం ......

జనంలోకి వెళ్తే మీ బండారం ......

Written By news on Saturday, January 18, 2014 | 1/18/2014

 జనంలోకి వెళ్తే మీ బండారం బయటపడతుందని కాంగ్రెస్, టిడిపి నేతలను వైఎస్ఆర్ సిపి నేతలు హెచ్చరించారు. శాసనసభ వాయిదా వేసిన తరువాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ  తెలంగాణ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని తమ పార్టీ కోరుకుంటున్నట్లు తెలిపారు. సమైక్య తీర్మానం చేయాలని ఇప్పటికే తమ పార్టీ పలుమార్లు కోరిందని చెప్పారు.

విభజనకు వ్యతిరేకంగా మొదటిసారి గళమెత్తింది తమ పార్టీయేనని తెలిపారు. సమైక్యం కోసం వైఎస్ జగన్మోహన రెడ్డి  అలుపెరుగని పోరాటం చేశారని చెప్పారు.  రాష్ట్రపతి, ప్రధానికి సమైక్య ఆవశ్యకతను వివరించామన్నారు. విభజన నష్టాన్ని ప్రజలకు వివరించినది తమ పార్టీయేనన్నారు. ఒక ప్రాంతంలో పార్టీ నష్టపోతుందని తెలిసినా తాము సమైక్యాన్ని వీడలేదని చెప్పారు.

మూడు ప్రాంతాలను దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి  సమానంగా చూశారని చెప్పారు.  వైఎస్‌ హయాంలో తెలంగాణలో 20వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో అభివృద్ధి జరగలేదనడం  సరికాదన్నారు. మహానేత మరణాన్ని తట్టుకోలేక మరణించినవారిలో తెలంగాణవారే ఎక్కువమంది ఉన్నారని చెప్పారు. రాష్ట్ర విభజనను వైఎస్ఆర్ మొదట్నుంచీ వ్యతిరేకించారన్నారు. వైఎస్ఆర్ సీపీపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.

విభజిస్తూనే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమైక్యాంధ్ర అంటున్నారని విమర్శించారు. టిడిపి నేతలు కూడా విభజనకు సహకరిస్తూనే  నాటకాలాడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గల్లంతవుతుందని చెప్పారు.  ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని తాము కోరలేదని చెప్పారు. కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండేకు రాసిన లేఖలో విభజన చేయాలని కోరలేదని తెలిపారు. విభజనకు వ్యతిరేకంగా తమ పార్టీ  ఉద్యమాలు చేసినట్లు చెప్పారు. ఏ ప్రాంతానికీ మేలు జరగనప్పుడు విభజన ఎందుకు? అని ప్రశ్నించారు.  రాష్ట్రాన్ని ఇష్టమొచ్చినట్లుగా కోయమనలేదని, సమన్యాయం అంటే సమంగా పాలించమని అర్థం అని వివరించారు.
Share this article :

0 comments: