ఆంధ్రజ్యోతి ఎండీ ప్రాజెక్టుకు అనుమతిపై ఆగ్రహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆంధ్రజ్యోతి ఎండీ ప్రాజెక్టుకు అనుమతిపై ఆగ్రహం

ఆంధ్రజ్యోతి ఎండీ ప్రాజెక్టుకు అనుమతిపై ఆగ్రహం

Written By news on Tuesday, January 28, 2014 | 1/28/2014

ఆంధ్రజ్యోతి ఎండీ ప్రాజెక్టుకు అనుమతిపై ఆగ్రహం
విజయవాడ: విజయవాడ సమీపంలోని బుడమేరు కాలువపై ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ పవర్ ప్రాజెక్ట్ కు ప్రభుత్వం అనుమతివ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రుల నిర్ణయాన్ని కాదని కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించడంపై మండిపడ్డారు.

పవర్ ప్రాజెక్ట్ అనుమతి విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సాక్షి దిన పత్రిక మంగళవారం వెలుగులోకి తెచ్చింది. బుడమేరు కాల్వపై రాధాకృష్ణకు చెందిన ‘యాక్టివ్’ పవర్ ప్లాంట్‌కు గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన అనుమతులే అత్యంత వివాదాస్పదం కాగా, గత ఐదారేళ్లుగా మూతపడి ఉన్న ఈ ప్లాంటుకు కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం మరింత వివాదాస్పదం కానుంది. శనివారం అనుమతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం కొత్త పార్టీ ఏర్పాటు వార్తలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో, ఒక ఎల్లో పత్రికాధిపతికి దక్కిన ఈ కానుక రాజకీయ, ఇంధన వర్గాల్లో చర్చనీయాంశమైంది!

వరదలు వచ్చే ప్రతిసారి బుడమేరు కాల్వ ద్వారా విజయవాడ పట్టణంలో ముంపు సమస్య తలెత్తుతోంది. ఆధునీకరణ చేయకుంటే విజయవాడకు ముంపు తప్పదని గతంలో ఇంజనీరింగ్ నిపుణులు నివేదించారు. బుడమేరు ఆధునీకరణకు ప్లాంటు అడ్డంకిగా మారింది. దీంతో చంద్రబాబు ఇచ్చిన ఎన్‌వోసీని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కారు రద్దు చేసింది. రోశయ్య హయాంలోనూ ఈ ప్రాజెక్టుకు అనుమతి నిరాకరించారు. ఇద్దరు సీఎంలు కాదన్న ప్లాంటుకు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Share this article :

0 comments: