సమైక్యత గొంతు నొక్కిన అధికార,ప్రతిపక్షాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్యత గొంతు నొక్కిన అధికార,ప్రతిపక్షాలు

సమైక్యత గొంతు నొక్కిన అధికార,ప్రతిపక్షాలు

Written By news on Thursday, January 9, 2014 | 1/09/2014

సమైక్యత గొంతు నొక్కిన అధికార,ప్రతిపక్షాలు
శాసనసభ సాక్షిగా అధికార, ప్రతిపక్షాలు ఒక్కటై సమైక్య గొంతును నొక్కేశాయి. సమైక్యమని అరిచినందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను సభ నుంచి గెంటివేశారు.  కోట్ల మంది తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నినదించినందుకు వారిని అరెస్టు చేయించారు.  శాసనసభలో  తెలంగాణ బిల్లుపై ఓటింగ్ జరిపేందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిరాకరించడంతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు వినిపించారు. వెంటనే శాసన సభ వ్యవహారాల మంత్రి సాకే శైలజానాథ్ మొత్తం 15 మంది సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో ఆమోదించి, అందరినీ సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్  సూచించారు. ఆ వెంటనే మార్షల్స్‌  వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలను  బలవంతంగా  బయటకు తీసుకెళ్లారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో అందుకు నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బయటకు వచ్చారు.  ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మెల్యేలు లాబీల్లో  నిరసన వ్యక్తం చేశారు. సమైక్యవాదం వినిపిస్తే అసెంబ్లీ నుంచి గెంటేస్తారా? అని ప్రశ్నించారు. కిరణ్‌, బాబులే సమైక్య ద్రోహులని మండిపడ్డారు.

ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుబడుతూ అసెంబ్లీ బయటకు వచ్చి రోడ్డుపైనే నిరసనకు సిద్ధమయ్యారు.  వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.  విజయమ్మతోపాటు   ఎమ్మెల్యేలందరిని గోషామహల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.  ఎమ్మెల్యేలు అక్కడ కూడా తమ నిరసనను కొనసాగించారు. దాదాపు మూడు గంటల పాటు పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే ఎమ్మెల్యేల  ఆందోళన కొనసాగింది.  ఎమ్మెల్యేలకు మద్దతుగా అక్కడకు వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.   సీఎం కిరణ్‌, డిజిపిలు విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో  కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయాలకు  అనుగుణంగా నడుచుకుంటున్నారని దుయ్యబట్టారు. బాబు డైరెక్షన్‌లోనే అసెంబ్లీ సాగుతోందని నిప్పులు చెరిగారు. నిన్నటి వరకు సమైక్య తీర్మానమన్న టిడిపి, ఇప్పుడు మాట మార్చిందని విమర్శించారు. ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలకు నచ్చజెప్పడానికి  సౌత్‌ జోన్‌ అడిషనల్‌ డీసీపీ  నాగరాజు తీవ్రంగా ప్రయత్నించారు.  ఆ పార్టీ శాసనసభాపక్షం నేత విజయమ్మకు విజ్ఞప్తి చేశారు.  పోలీసు ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యేలు ఆందోళన విరమించారు.

శాసనసభలో విజయమ్మ సమైక్యవాణి: తెలంగాణ బిల్లుపై  చర్చకు ముందు ఓటింగ్‌ పెట్టాలి. ఆ తర్వాతే చర్చను మొదలుపెట్టాలి. విభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? అన్నదానిపై ఓటింగ్‌ జరపాలి.  బిల్లుపై ఓటింగ్‌ ఉంటుందా? లేదా? అన్నదానిపై ప్రభుత్వం, స్పీకర్‌ స్పష్టత ఇవ్వడంలేదు. ఓటింగ్‌ పెడతారా? లేదా? అన్నదానిపై మా అనుమానాలు మాకు ఉన్నాయి. అందుకనే సమైక్య తీర్మానం పెట్టమని పదేపదే ప్రాథేయపడుతున్నాం. తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా సీఎం కిరణ్‌ కుమార్‌ను పదేపదే కోరాం. అయినా తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడం దురదృష్టకరం. చంద్రబాబు, కిరణ్‌ చెబుతున్నట్లుగా బిల్లుపై చర్చలో పాల్గొంటే విభజన అనంతర సమస్యలపైనే మాట్లాడాల్సి వస్తుంది. చర్చలో పాల్గొనడం అంటే విభజనకు అంగీకరించినట్టే కదా? మేం విభజనకు వ్యతిరేకం, సమైక్యమే మా నినాదం. విధానం లేకుండా కేంద్రం విభజనకు దిగింది.  బెంగాల్‌ మాజీ సీఎం బి.సి.రాయ్‌ విధానం మాకు ఆదర్శం. అసెంబ్లీలో తీర్మానం చేసి మేరు-బారు ప్రాంతం తూర్పుపాకిస్థాన్‌లో కలవకుండా ఆయన చూశారు. ఆనాడు బెంగాల్ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది.
Share this article :

0 comments: