నేటి నుంచి వైఎస్ జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుంచి వైఎస్ జగన్ పర్యటన

నేటి నుంచి వైఎస్ జగన్ పర్యటన

Written By news on Monday, January 20, 2014 | 1/20/2014

నేటి నుంచి వైఎస్ జగన్ పర్యటనవీడియోకి క్లిక్ చేయండి
 సాక్షి, చిత్తూరు : వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో విడత ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర చిత్తూరు జిల్లాలో సోమవారం ప్రారంభమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు.
 
     వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి జిల్లాలో నాలుగో విడత యాత్రను ప్రారంభిస్తారు.
 
     విమానాశ్రయం, ఆర్‌కేపురం, కేఎల్‌ఎం హాస్పిటల్ జంక్షన్ మీదుగా అత్తూరు క్రాస్ వరకు రేణిగుంట మండలంలో రోడ్‌షో నిర్వహిస్తారు.
 
     నగరి నియోజకవర్గం వడమాలపేట మండలంలోకి ప్రవేశిస్తారు. పూడి, కాయం, కాయంపేట గ్రామాల్లో రోడ్‌షో నిర్వహిస్తారు. చంద్రగిరి నియోజకవర్గం బ్రాహ్మణపట్టు మీదుగా తిరిగి వడమాలపేట మండలంలోకి వెళతారు. చింతకాల్వ, పత్తిపుత్తూరు, అప్పలాయగుంట, తిరుమణ్యం, టీఆర్‌కండ్రిగ, గొల్లకండ్రిగ, వడమాల మీదుగా వడమాలపేట వరకు రోడ్‌షో నిర్వహిస్తారు.
 
     {బాహ్మణపట్టు, పత్తిపుత్తూరులో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు.
     వడమాలపేట నుంచి లక్ష్మీపురం, తడుకు స్టేషన్ మీదుగా పుత్తూరు మండలంలోని మజ్జిగకుంట, తడుకు, గొల్లపల్లె, పుత్తూరు అగ్రహా రం, ఈసలాపురం మీదుగా పుత్తూరు వరకు రోడ్‌షో నిర్వహిస్తారు.
 
     పుత్తూరులోని కార్వేటినగరం సర్కిల్‌లో సాయంత్రం నిర్వహించే బహిరంగసభలో ప్రజలనుద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారు.
 
     రెండవ రోజు 21వ తేదీ కార్వేటినగరంలో సమైక్య శంఖారావం బహిరంగ సభతో పర్యటన ప్రారంభమవుతుంది.
 
     ఆర్‌కేవీపేట, చింతమంది క్రాస్, అన్నూరు క్రాస్, అమ్మపల్లె క్రాస్, కొల్లాగుంట, లక్ష్మీపురం మీదుగా ఎస్‌ఆర్‌పురం వరకు రోడ్‌షో నిర్వహిస్తారు.
 
     పుల్లూరు క్రాస్, శూలగపల్లె క్రాస్ మీదుగా తెల్లగుండ్లపల్లె చేరుకుంటారు. అక్కడ పోతగంటి నరసయ్య కుటుంబాన్ని ఓదారుస్తారు.
 
     వేణుగోపాలపురం, ఆదిమాకులపల్లె, గంగమ్మ గుడి, కొత్తపల్లిమిట్టకు చేరుకుంటారు. కొత్తపల్లిమిట్టలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కొటార్లపల్లెలో మిట్టపల్లె పెద్దబ్బరెడ్డి కుటుంబాన్ని ఓదారుస్తారు.
Share this article :

0 comments: