ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు:ఈసీ వర్గాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు:ఈసీ వర్గాలు

ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు:ఈసీ వర్గాలు

Written By news on Sunday, January 5, 2014 | 1/05/2014

వీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం  కసరత్తు ప్రారంభించింది. ఏప్రిల్ రెండో వారంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమీషన్ వర్గాలు తెలిపాయి. మొత్తం ఐదు విడతల్లో జరిగే ఈ ఎన్నికలు ఏప్రిల్ రెండో వారం నుంచి మే మొదటి వారం వరకూ జరుగుతాయని ఈసీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.  ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ ను మార్చిలో ప్రకటించే అవకాశం ఉందని విశ్వసీయ వర్గాల సమాచారం.
 
ప్రస్తుత 15వ లోక్‌సభ పదవీకాలం మే 31తో ముగియనుండటంతో జూన్ 1కల్లా 16వ లోక్‌సభ ఏర్పాటయ్యేలా చూసేందుకు సకాలంలో ఎన్నికలు జరుపుతామని... విడతలవారీగా పోలింగ్ నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే.

http://www.sakshi.com/news/national/elections-in-april-second-week-94672?pfrom=home-latest-story
Share this article :

0 comments: