సమైక్య తీర్మానంపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్య తీర్మానంపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

సమైక్య తీర్మానంపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

Written By news on Thursday, January 9, 2014 | 1/09/2014

శాసనసభలో గురువారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చించాలని టీడీపీ, గ్రామ సేవకుల వేతనాలు పెంచాలని కోరుతూ సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

కాగా తెలంగాణ బిల్లు ముసాయిదాపై శాసనసభలో అసలు చర్చే మొదలు కాలేదని వాదిస్తూ వచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నేతలు రూటు మార్చి.. చర్చకు అంగీకరించారు. ఇప్పటివరకు చర్చను అడ్డుకున్న టీడీపీ సీమాంధ్ర నేతలు నిన్న నాటకీయ పరిణామాల మధ్య వెనక్కు తగ్గారు. స్పీకర్ పోడియం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు నిరసన కొనసాగిస్తున్నప్పటికీ పట్టించుకోలేదు. సభలో మంత్రి వట్టి వసంతకుమార్ విభజన బిల్లుపై చర్చను కొనసాగించారు. ఎట్టకేలకు కాంగ్రెస్‌, టీడీపీ పరస్పర అంగీకారంతో టీ ముసాయిదా బిల్లుపై చర్చ మొదలైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Share this article :

0 comments: