రేపు ఓటరు నమోదు కార్యక్రమం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు ఓటరు నమోదు కార్యక్రమం

రేపు ఓటరు నమోదు కార్యక్రమం

Written By news on Friday, January 24, 2014 | 1/24/2014

రేపు ఓటరు నమోదు కార్యక్రమం
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం హైదరాబాద్ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు.. తప్పుల సవరణలకు దరఖాస్తుల స్వీకరణ, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్‌కేంద్రాల్లో కొత్త ఓటర్ల అభినందన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొత్తగా ఓటరుగా నమోదైన 18 -19 ఏళ్ల వారికి ఎపిక్ కార్డులు అందజేయనున్నారు.
 
 వివరాలివీ...
 ఓటర్ల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లాలోని పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 3091 పోలింగ్ కేంద్రాల్లో శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటు నమోదు దరఖాస్తులు స్వీకరిస్తారు.
     
 ఇటీవల కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకున్నవారిలో 18-19 ఏళ్ల వారికి గుర్తింపు కార్డులిస్తారు.
     
 కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఫారం-6ను భర్తీ చేయాలి.
     
 ఇతరత్రా అవసరాల కోసం పోలింగ్‌స్టేషన్లలో ని సిబ్బందిని సంప్రదించి సంబంధిత ఫారం-7, ఫారం-8, ఫారం-8ఎలను భర్తీచేయాలి.
 పాటించాల్సినవి..
     
 దరఖాస్తులు తప్పుల్లేకుండా భర్తీ చేయాలి.
     
 చిరునామా మారినప్పుడు, ఓటరు కార్డులోనూ దానిని సరి చేయించుకోవాలి.
     
 పాత ఇంటి చిరునామాను తొలగించుకొని, కొత్త  చిరునామాతో కొత్త ఐడీ కార్డు పొందాలి.
     
 ఓటరు కార్డును అడ్రస్‌ప్రూఫ్‌గా వినియోగించుకోవాలంటే ఇంటిపేరు పూర్తిగా రాయాలి.
Share this article :

0 comments: