బడ్జెట్-2014 ముఖ్యాంశాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బడ్జెట్-2014 ముఖ్యాంశాలు

బడ్జెట్-2014 ముఖ్యాంశాలు

Written By news on Monday, February 17, 2014 | 2/17/2014

కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం సోమవారం లోక్ సభలో 2014-15 ఏడాదికిగాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ కు సంబంధించిన ముఖ్య అంశాలు :

* గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం
*2013లో గ్లోబల్‌ జీడీపీ వృద్ధిరేటు: 3 శాతం
*2013-14 ఆర్థిక లోటును 4.65 శాతానికి పరిమితి చేస్తాం
*2013-14లో ఆహార ధాన్యాల ఉత్పత్తి: 263 మిలియన్‌ టన్నులు
*కరెంట్‌ అకౌంట్‌ లోటు(సీఏడీ): 45 బిలియన్‌ డాలర్లు
*ఆహార ద్రవ్యోల్బణమే పెద్ద సమస్య
*ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వం, ఆర్ బీఐ చర్యలు తీసుకుంటున్నాయి
*ఇండియాకు రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ భయం లేదు
*ఈ ఏడాది 15 బిలియన్‌ డాలర్ల ఫారెక్స్‌ నిల్వలు జమ అయ్యాయి

*వ్యవసాయ రుణాల లక్ష్యం: రూ.7.35 లక్షల కోట్లు
*గతంలో వ్యవసాయ రుణాల అంచనా: రూ.7 లక్షల కోట్లు
*ఎగుమతుల లక్ష్యం: 326 బిలియన్‌ డాలర్లు (గతం కంటే 6.4 శాతం ఎక్కువ)
*పెట్టుబడుల రేటు: 34.8 శాతం, సేవింగ్స్‌ రేటు: 30.1 శాతం
*2013-14 జీడీపీ వృద్ధిరేటు అంచనా: 4.9 శాతం
*జనవరి ఆఖరుకు కేబినెట్‌ ప్యానెల్‌ క్లియర్‌ చేసిన ప్రాజెక్టులు: 296
*మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పుంజుకోవడం లేదు
*ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల ఫండింగ్‌ నిబంధనల్ని సడలించాం

*2013-14లో అదనంగా జమ కానున్న 29300 మెగావాట్ల విద్యుదుత్పత్తి
*గడిచిన 9 క్వార్టర్లలో జీడీపీ వృద్ధిరేటు 7.9 నుంచి 4.4 శాతానికి పతనం
*డిసెంబరు, మార్చి క్వార్టర్లలో 5.2 శాతం, 4.9 శాతం ఉంటుందని అంచనా
*రూపాయి హెచ్చుతగ్గులను ప్రభుత్వం, ఆర్ బీఐ, సెబీ నియంత్రించాయి
*చక్కెరపై నియంత్రణను పూర్తిగా ఎత్తివేశాం

*నిర్మాణంలో 50 వేల మెగావాట్ల థర్మల్‌, జల విద్యుత్‌ ప్లాంట్లు
*2013-14లో జాతీయ సోలార్‌ మిషన్‌ రెండో దశ మొదలైంది
*విధానపరమైన నిర్ణయాల్లో నిష్క్రియాపరత్వం లేదు
*వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 అల్ట్రా మెగా పవర్‌ ప్లాంట్లు ప్రారంభం
*రూ.100 కోట్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ఫండ్‌
*అభివృద్ధిలో యూపీఏకి సాటి వచ్చే ప్రభుత్వం లేదు

*ఈశాన్య రాష్ట్రాల కోసం అదనంగా రూ.1200 కోట్ల కేటాయింపు
*భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎఫ్ డీఐ విధానాలను సరళీకరించాం
*జాతీయ సోలార్‌ మిషన్‌ కింద 2 వేల మెగావాట్ల ప్రాజెక్టులు
*జనవరి నాటికి క్లియర్‌ చేసిన 296 ప్రాజెక్టుల విలువ: రూ.6.6 లక్షల కోట్లు
*57 కోట్ల మందికి ఆధార్‌ కార్డులు జారీ చేశాం
*బొగ్గు ఉత్పత్తి 554 మిలియన్‌ టన్నులకు పెరుగుతుంది

*గడిచిన పదేళ్లలో సగటున బొగ్గు ఉత్పత్తి: 361 మిలియన్‌ టన్నులు
*ప్రణాళిక వ్యయంలో మార్పు లేదు, రూ.5.55 లక్షల కోట్లే
*2013-14లో ప్రణాళికేతర వ్యయం బడ్జెట్‌ అంచనాలను మించుతుంది
*2014-15లో ప్రణాళికేతర వ్యయం : రూ.12.07 లక్షల కోట్లు
*2014-15లో సబ్సిడీలు: రూ.2.65 లక్షల కోట్లు
*2014-15లో ఫుడ్‌ సబ్సిడీ అంచనా: రూ.1.15 లక్షల కోట్లు
*నిర్భయ ఫండ్‌కు అదనంగా రూ.100 కోట్లు
*2014-15లో ఇంధన సబ్సిడీ: రూ.65 వేల కోట్లు
*ఈ ఏడాదికి చెందిన రూ.35 వేల కోట్ల ఇంధన సబ్సిడీని వచ్చే సంవత్సరానికి రోల్‌ ఓవర్‌ చేస్తాం

*ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.33,725 కోట్లు
* పీఎస్ యూ బ్యాంకుల్లో క్యాపిటల్‌ పెట్టుబడి: రూ.11,200 కోట్లు
*రక్షణ శాఖకు: రూ.2.24 లక్షల కోట్లు, గతంలో: రూ.2.04 లక్షల కోట్లు
*2014-15లో వ్యవసాయ రుణాల లక్ష్యం: రూ.8 లక్షల కోట్లు
*మైనార్టీ వ్యవహారాల శాఖకు: రూ.3,711 కోట్లు
*ట్యాక్స్‌ శ్లాబులో ఎలాంటి మార్పు లేదు
*క్యాపిటల్‌ గూడ్స్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌లకు ఎక్సైజ్‌ సుంకం 2 శాతం తగ్గింపు

*సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగాలకు ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు
*ఆటో రంగానికి ఊరట
*ఎస్ యూవీ వాహనా ఎక్సైజ్‌ సుంకం 30 నుంచి 24 శాతానికి తగ్గింపు
*చిన్న కార్లపై ఎక్సైజ్‌ సుంకం 8 శాతానికి తగ్గింపు
*పెద్ద, మధ్య తరహా కార్లపై ఎక్సైజ్‌ సుంకం 20 శాతానికి తగ్గింపు

*2014-15లో రెవిన్యూ లోటు 3 శాతానికి తగ్గుతుంది
*2014-15లో ద్రవ్యలోటు 4.1 శాతానికి తగ్గుతుంది
*చిన్న కార్లపై 4 శాతం ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు
*రూ.5 లక్షల కారు రూ.20 వేల దాకా తగ్గే అవకాశం
*రైస్‌ కంపెనీలకు సర్వీసు ట్యాక్స్‌ ఊరట
*దేశంలో మొబైల్‌ ఫోన్ల తయారీని ప్రోత్సహిస్తాం
Share this article :

0 comments: