6,23,88,619.. ఇదీ రాష్ట్ర ఓటర్ల సంఖ్య - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 6,23,88,619.. ఇదీ రాష్ట్ర ఓటర్ల సంఖ్య

6,23,88,619.. ఇదీ రాష్ట్ర ఓటర్ల సంఖ్య

Written By news on Sunday, February 2, 2014 | 2/02/2014


రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 50,00,731
విజయనగరంలో అత్యల్పంగా 16,86,019
14 జిల్లాల్లో మహిళలే అధికం
సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకటన


 సాక్షి, హైదరాబాద్: తుది జాబితా ఖరారైన తర్వాత రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య తొలిసారిగా 6 కోట్లు దాటింది. మొత్తం ఓటర్లలో మహిళల కన్నా పురుషులు స్వల్పంగా అధిక సంఖ్యలో ఉన్నారు. అరుుతే 14 జిల్లాల్లో మాత్రం మహిళా ఓటర్లే అధికంగా నమోదయ్యారు. ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించడంతో 18- 19 ఏళ్ల మధ్య కొత్త ఓటర్లు 15,06,317 మంది నమోదు కావడం విశేషం. అనేక జిల్లాల్లో 50 వేలకు పైగానే కొత్త ఓటర్లు నమోదయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారి జాబితాను ఎన్నికల కమిషన్ శనివారం విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో 6,23,88,619 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చింది.

జిల్లాల వారీగా అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 50,00,731 ఓటర్లు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 16,86,019 ఓటర్లు నమోదయ్యారు. తొలిసారిగా జాబితాలో స్త్రీ, పురుషులు కాని ‘అదర్స్’ కేటగిరీని ప్రవేశపెట్టగా, ఈ కేటగిరీ కింద 4,433 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు నమోద య్యారు. వీరిలో 18- 19 ఏళ్ల వయస్సు వారు 504 మంది ఉన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఖరారు చేసిన తుది జాబితాలో 5,78,92,259 మంది ఓటర్లుగా నమోదయ్యూరు. అనంతరం ఇప్పటివరకు ఐదుసార్లు ఓటర్ల జాబితాలో సవరణలు జరిగారుు. ఈ సందర్భంగా చేసిన తొలగింపులు, చేర్పుల అనంతరం 2013 జనవరి 15 నాటి సవరించిన జాబితా ప్రకారం 5,81,43,670 మంది ఓటర్లుగా నమోదు కాగా తాజాగా ఈ సంఖ్య 6,23,88,619కి పెరిగింది.


Share this article :

0 comments: