కిరణ్, చంద్రబాబులు చీడపురుగులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిరణ్, చంద్రబాబులు చీడపురుగులు

కిరణ్, చంద్రబాబులు చీడపురుగులు

Written By news on Wednesday, February 19, 2014 | 2/19/2014

'కిరణ్, చంద్రబాబులు చీడపురుగులు'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడులపై తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వారిద్దరు పూర్తిగా సహకరించారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాకు చెందిన కిరణ్, చంద్రబాబులు చీడపురుగులుగా అభివర్ణించారు. 50 లక్షల మంది చిత్తూరు జిల్లావాసులు తలదించుకునేలా వారిద్దరు వ్యవహారించారని ఆరోపించారు.
 
రాష్ట్ర విభజనకు కిరణ్ గంగిరెద్దులా తల ఊపారని ఎద్దేవా చేశారు. తెలుగు ప్రజలను వంచించారని అన్నారు. చివరిదాకా సీఎం పదవిలో ఉండి కోట్లు దండుకోవడమే లక్ష్యంగా పని చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆధిష్టానం ఆదేశాల మేరకే కిరణ్ సీఎం పదవికి రాజీనామా చేశారన్నారు. విభజనకు అనుకూలంగా వ్యవహరించిన మరో ద్రోహి బాబు అని వ్యాఖ్యానించారు. రెండు ప్రాంతాల నేతలతో డ్రామాలు నడిపి... చంద్రబాబు విదూషకుడిగా నిలిచిపోయారని భూమన ఆరోపించారు. 
Share this article :

0 comments: