సంక్షేమాన్ని గాలికొదిలిన ప్రభుత్వం: వైఎస్ విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సంక్షేమాన్ని గాలికొదిలిన ప్రభుత్వం: వైఎస్ విజయమ్మ

సంక్షేమాన్ని గాలికొదిలిన ప్రభుత్వం: వైఎస్ విజయమ్మ

Written By news on Tuesday, February 11, 2014 | 2/11/2014

సంక్షేమాన్ని గాలికొదిలిన ప్రభుత్వం: వైఎస్ విజయమ్మ

 సంక్షేమాన్ని గాలికొదిలిన ప్రభుత్వం  చేతగాని ప్రభుత్వం, చేతగాని పాలన వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి: విజయమ్మ
 పాత అంచనాలనే తిరగేసి తెచ్చారని విమర్శ
 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే సంక్షేమ పథకాలకు కేటాయింపులు తగ్గించుకోవాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం నాయకురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. నీటి పారుదల, గృహ నిర్మాణం, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజుల చెల్లింపు వంటి పథకాలకు ఈ బడ్జెట్‌లో భారీగా కోతలు వేశారని ఆమె వ్యాఖ్యానించారు. సోమవారం పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో సోమవారం ఆమె సహచర ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో 2013-14 ఏడాదికి సంబంధించిన సవరించిన అంచనాలే ఇవ్వలేదని... పాత అంచనాలనే మళ్లీ తిరగేసి 2014-15 బడ్జెట్‌పై మాట్లాడ్డానికేమీ లేకుండా చేశారని విమర్శించారు. ప్రభుత్వ చర్యలను తుర్పారబట్టారు. అవి ఆమె మాటల్లోనే..
 
  •   2012-13లో రూ. లక్షా 16 వేల కోట్ల మేరకు రాబడిని అంచనా వేయగా.. రూ. లక్షా 3 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. రూ. 13 వేల కోట్ల లోటు ఏర్పడింది. దాంతోపాటు రూ. 22,850 కోట్ల రుణాలు తెచ్చుకునే అవకాశం ఉండగా.. రూ. 17,850 కోట్లే సేకరించారు. మొత్తంగా రుణాలు తీసుకోవడంలో 5,300 కోట్లు, రాబడిలో రూ. 13,000 కోట్ల తగ్గుదల కలుపుకొని రూ. 18,000 కోట్లు ఖర్చు పెట్టే అవకాశం కోల్పోయాం.
  •   ఇక కేంద్రం నుంచి మనకు రూ. 14,940 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ రావాల్సి ఉండగా.. 7,687 కోట్లు మాత్రమే వచ్చాయి.
  •   2012-13 సంవత్సరానికి రూ. 54 వేల కోట్ల ప్రణాళికా వ్యయం అంచనాలుండగా... సవరించిన ప్రకారం ఆ మొత్తం రూ. 48 వేల కోట్లకు వచ్చింది. అందులోనూ ఖర్చు చేసింది రూ. 43 వేల కోట్లే. ఇక పెట్టుబడి వ్యయం రూ. 19,972 కోట్లయితే.. ఖర్చు చేసింది మాత్రం రూ. 15,137 కోట్లే.
  •   2004-09 మధ్య కాలంలో 11 నుంచి 12 శాతంగా ఉండిన రాష్ట్ర అభివృద్ధి రేటు.. ఇప్పుడు 5.29 శాతానికి పడిపోయింది.
  •   వీటన్నింటి కారణంగా... సంక్షేమ, ప్రజోపయోగ పథకాలకు తక్కువ నిధులు కేటాయించే పరిస్థితులు తలెత్తాయి. ప్రభుత్వ అసమర్థతే దీనికి కారణం.
  •   రాష్ట్రంలో 1994 వరకూ ఆస్తులు, అప్పుల నిష్పత్తి 101 ః 100గా ఉంటే 1994-2004 మధ్య కాలంలో (చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా) ఆస్తులు, అప్పుల నిష్పత్తి 50 ః 100గా ఉండేది. అలాంటిది వైఎస్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఆస్తులు గణనీయంగా పెరిగాయి. 2004-09 మధ్యలో ఆస్తులు, అప్పుల నిష్పత్తి 130 ః 100 గా ఉండింది.
  •   కానీ ప్రస్తుత ప్రభుత్వం అన్నీ ఉండి కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ తక్కువగా తెచ్చుకుంది. ప్రణాళికా వ్యయాన్ని కూడా సరిగా ఖర్చు పెట్టలేకపోయింది. ఇద ంతా ప్రభుత్వ ైవె ఫల్యం. చేతగానితనమే.. ఇది చేతగాని ప్రభుత్వం, చేతగాని పాలన. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని కూడా పూర్తిగా చదవలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజు దగ్గరలో ఉంది.
 
 ప్రజా విద్రోహకం...
 
 అంపశయ్యపై ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజావిద్రోహక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అంకెల గారడీతో ప్రజలను మోసపుచ్చిందని దుయ్యబట్టింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ గురించి గొప్పలు చెప్పుకొన్నప్పటికీ అందులో తాజా గణాంకాలు లేనేలేవని పేర్కొంది. పార్టీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, బి.గుర్నాథరెడ్డి తదితరులు సోమవారం మీడియాతో మాట్లాడారు.
 
  రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎప్పుడెప్పుడు టీడీపీలో చేరాలనే ఆత్రుతతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కూడా పూర్తిగా చదవకుండా సాంప్రదాయానికి తూట్లు పొడిచారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు.
  కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తున్నట్టల్లా ఆడుతున్న సీఎం కిరణ్ బండారం త్వరలో బట్టబయలు కానుందని రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిన రోజే కిరణ్ రాజీనామా చేసుంటే విభజన జరిగేదే కాదన్నారు.
  రాష్ట్రాన్ని విభజించి తెలంగాణలో తన కుమారుడు లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడం కోసం చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారని ఆరోపించారు.
Share this article :

0 comments: