రేపు వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీ

రేపు వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీ

Written By news on Saturday, February 1, 2014 | 2/01/2014

రేపు వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీ
నేడు ఇడుపులపాయలో సీజీసీ భేటీ: ఉమ్మారెడ్డి 
 సాక్షి, హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో ప్లీనరీ (ప్రజాప్రస్థానం) ఫిబ్రవరి రెండో తేదీన నిర్వహించనున్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో జరగనున్న ఈ ప్లీనరీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నికతోపాటు ఇతర సంస్థాగత కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. నేడు (శనివారం) పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సమావేశమై, అధ్యక్ష ఎన్నికలకు కావాల్సిన షెడ్యూలును ప్రకటించి దానిపై రెండో తేదీన ఫలితాలు ప్రకటించడంతోపాటు ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్లీనరీ విస్తృతస్థాయి సమావేశం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుందని పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశంలో రెండేళ్లుగా పార్టీ చేసిన వివిధ కార్యక్రమాలతో పాటు సమైక్యాంధ్రప్రదేశ్ కోసం చేసిన కృషిపై ఒక నివేదిక ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ప్లీనరీ వివరాలు...
 
  ప్లీనరీలో మొదట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి, పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి మృతి చెందిన నేతలకు సంతాపం తెలియజేసిన తర్వాత పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రారంభోపన్యాసం చేస్తారు.
-     ఆ తర్వాత రైతు శ్రేయస్సుకోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని, ఆర్థిక తదితర అంశాలపై పలు తీర్మానాలను ప్రవేశపెడతారు.
 -    మరోప్రజాప్రస్థానం ద్వారా సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిల ప్రసంగం సమావేశం మధ్యలో ఉంటుంది.
-  ఆ తర్వాత జిల్లాల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఆమోదిస్తారు. ప్లీనరీ ముగింపు సందర్భంగా నూతనంగా ఎన్నికైన పార్టీ అధ్యక్షుడి సందేశం ఉంటుంది.

 ఎన్నిక క్రమమిదీ...
-     ఫిబ్రవరి 1న (శనివారం) మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల వరకు సీజీసీ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేస్తారు. 3 నుంచి 4 గంటల వరకు అధ్యక్ష పదవికి నామినేషన్లను స్వీకరిస్తారు. 4 నుంచి 4.30 వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 5గంటలకు ఆమోదిత నామినేషన్ల పేర్లను ప్రకటిస్తారు.
-     ఫిబ్రవరి 2న (ఆదివారం) ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. 11.30 నుంచి 12.30 వరకు ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నిక ఫలితాన్ని ప్రకటిస్తారు
Share this article :

0 comments: