సమైక్య సారథికి బ్రహ్మరథం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్య సారథికి బ్రహ్మరథం

సమైక్య సారథికి బ్రహ్మరథం

Written By news on Monday, February 10, 2014 | 2/10/2014

సమైక్య సారథికి బ్రహ్మరథం
సాక్షి ప్రతినిధి, విజయనగరం :సుమారు రెండేళ్ల  నిరీక్షణ ఫలించింది. ఆత్మీయ పలకరింపు మలయమారుతమై తాకింది.  సమైక్య శంఖారావం పూరించేందుకు వచ్చిన  ఆత్మీయ అతిథికి భోగాపురం ప్రజానీకం నీరాజనం పట్టింది. తరలివచ్చిన జనంతో వీధులన్నీ కిటకిటలాడాయి. రహదారులన్నీ జనదారులయ్యాయి.  అడుగడుగునా జై సమైక్యాంధ్ర, జై జగన్ నినాదాలు మిన్నంటాయి.  చెరగని దరహాసంతో, తరగని అభిమానంతో తమ చెంతకు వచ్చిన జననేతపై స్థానికులు ప్రేమాభిమానాన్ని కురిపించారు. శంఖారావం సభలో జగన్‌మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం చేసిన ప్రసంగం ఆద్యంతం ఉత్తేజాన్ని నిపింది. 
 
 పజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించింది.
 ‘ఇవాళ ఓట్ల కోసం, సీట్ల కోసం ఎన్ని అబద్ధాలు అయినా ఆడడానికి వెనుకాడడంలేదు.  కొందరు రాజకీయ నాయకులు   ఏ గడ్డైనా తినడానికి వెనుకాడని పరిస్థితులు చూస్తూనే ఉన్నాం.   ఒక వ్యక్తిపైన దొంగ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడడం లేదు. ఒక మనిషిని, ఒక పార్టీని తప్పించడానికీ వెనుకాడడం లేదు.   జైలుపాలు చేయడానికి కూడా మనస్సాక్షి అడ్డురావడం లేదు.    రాష్ట్రాన్ని అడ్డగోలుగా  విడదీయడానికి కూడా  వెనుకాడని పరిస్థితులు చూస్తూనే ఉన్నాం.’ అంటూ చేసిన ప్రసంగం ప్రజల్ని ఆలోచింప చేసింది.‘ సోనియా గాంధీ, కిరణ్‌కుమార్ రెడ్డి, చంద్రబాబు పోవాలి.   ఆ  ముగ్గురూ పోయే రోజులు త్వరలో వస్తాయి. వీరు చేస్తున్న అన్యాయాలు పై నుంచి దేవుడు చూస్తున్నాడు.
 
 ఎన్నికలు వచ్చినప్పుడు  ప్రతి పేదవాడి గుండె చప్పుడు ఒకటవుతుంది. దివంగత నేత, ప్రియతమ నాయకుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ప్రేమించే ప్రతి హృదయం ఒకటవుతుంది. ఒకటైనప్పుడు ఒక ఉప్పెన పుడుతుంది. ఆ ఉప్పెన నుంచి ఒక తుపాను వస్తుంది.  దానిలో అంతమందీ కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందని గట్టిగా చెబుతున్నాను.’ అని అనగానే ప్రజల కరతాళ ధ్వనులు మిన్నంటాయి.   ఢిల్లీ అహంకారానికి, తెలుగువాడి ఆత్మగౌరవానికి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయని అనగానే ఎంత త్వరగా ఎన్నికలు వస్తాయా, కాంగ్రెస్‌ను ఎప్పుడు గద్దె దించుతామా అన్న  ఊపు ప్రజల్లో కనిపించింది. ‘ నాలు గు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో  30 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుంటాం. ఆ తరువాత రాష్ట్రాన్ని విడగొట్టే దమ్మూ ధైర్యం ఎవరికి ఉందో చూద్దాం. రాష్ట్రాన్ని ఎవరైతే సమైక్యంగా ఉంచుతారో  వాళ్లనే ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెడదాం.’ అని ప్రకటించగానే ప్రజల్లో చైతన్య స్ఫూర్తి రగిలింది. 
 
  ‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి  దేశంలో ఎవరూ కూడా ఆలోచన చేయని విధంగా చేశారు. ఆరోగ్యం బాగోలేని ఏ పేదవాడు అయినా సరే ఆ పేదవాడు చేయాల్సిందల్లా 108 నంబరుకు ఫోన్ చేస్తే... కుయ్...కుయ్...కుయ్ అంటూ 20 నిమిషాల్లో పేదవాడు ఇంటికి అంబులెన్స్ రావాలి.. వచ్చి ఆ పేదవాడిని పెద్ద ఆస్పత్రికి తీసుకుని పోవాలి’ అని మ హా నేత చేసిన మేలును గుర్తు చేయగానే ప్రజలు చప్పట్లతో హర్షధ్వానాలు ప్రకటించారు. కుయ్...కుయ్...కుయ్..శబ్దాన్ని  విని  మహానేతను గుర్తు చేసుకున్నప్పుడు వారి కళ్లు చెమర్చాయి. ఇలా ఆద్యంతం ఆసక్తికర ప్రసంగం సాగింది. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసింది. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న  వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలు కార్యోన్మోఖులై కన్పించారు.   
Share this article :

0 comments: