జగన్ సీఎం అయితేనే సమస్యలకు పరిష్కారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ సీఎం అయితేనే సమస్యలకు పరిష్కారం

జగన్ సీఎం అయితేనే సమస్యలకు పరిష్కారం

Written By news on Monday, February 17, 2014 | 2/17/2014

జగన్ సీఎం అయితేనే సమస్యలకు పరిష్కారం
జగన్ సీఎం అయితేనే సమస్యలకు పరిష్కారం
 గుడివాడ, :
 వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గుడివాడ పట్టణంలోని ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు.
స్థానిక 31, 34వవార్డుల్లో గడపగడపకు వైఎస్సార్ సీపీ ప్రచారం కొడాలి నాని ఆదివారం నిర్వహించారు. తొలుత 31వ వార్డుకు చెందిన పార్టీ నేత మద్దాల శ్రీనివాసరావు ఇంటి వద్ద నుంచి ప్రారంభించారు. మద్దాల కుటుంబ సభ్యులు కొడాలి నానికి హారతులు పట్టి, దీవెనలు అందించారు. ఈ సందర్బంగా కొడాలి నాని మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రూ.200 కోట్లు నిధులు తెచ్చి పట్టణంలోని మౌలిక సమస్యలు పరిష్కరిస్తానని ఆ వార్డు మహిళలకు హామీ ఇచ్చారు. పట్టణంలోని రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పని కుటుంబం వైఎస్సార్‌ది అని ప్రజలందరికీ తెలుసునన్నారు. వార్డులోని బావాజీ మఠం కాలనీ, చంద్రయ్య గట్టు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు హారతులు పట్టి స్వాగతం తెలిపారు. అనంతరం నాని పార్టీ నేత, పారిశ్రామికవేత్త రెల్లా శ్రీనివాసరావు ఇంటి వద్ద కొద్ది సేపు సేద తీరారు.  
 34వ వార్డులో విశేష ప్రజాదరణ
 స్థానిక 34వ వార్డులో గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. 34వ వార్డుకు చెందిన పార్టీ నేత నెరుసు శేషగిరిరావు ఇంటి వద్ద నుంచి ప్రచారం ప్రారంభించారు. నాని నెరుసు కుటుంబసభ్యులు హారతులు పట్టారు. ప్రతి ఇంటి నుంచి వచ్చి కొడాలి నానికి స్వాగతం పలికారు. అనంతరం స్థానిక పార్టీ నేత గొంగాడ హరిబాబు ఇంటి వద్ద ముగింపు కార్యక్రమం నిర్వహించారు.
పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు, ఎం.వి.నారాయణరెడ్డి, బాణావత్ ఇందిరారాణి, గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శొంఠి చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్లు మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి, గంధం రాజేంద్ర ప్రసాద్,  చింతల భాస్కరరావు, బొజ్జగాని కోటమ్మ, సూరపనేని అజయ్, గణపతి లక్ష్మణరావు, నెరుసు చింతయ్య, తోట ప్రసాద్, సిద్దాబత్తుల లక్ష్మీనీలవేణి, జమదగ్ని, సర్ధార్‌బేగ్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, మూడెడ్ల ఉమా, పార్టీ మహిళా, యువజన, గుడివాడ పట్టణ కన్వీనర్లు కాటాబత్తుల రత్నకుమారి, లోయ రాజేష్, యూత్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బట్రాజు బ్రదర్స్, వార్డుకు చెందిన నేతలు సిద్దాబత్తుల నరసింహారావు, బెరైడ్డి సాయిరెడ్డి, రమణారెడ్డి, సత్తిరెడ్డి, మద్దాల శ్రీనివాసరావు, దేవాది నాగేశ్వరావు, మద్దాల అయ్యప్ప, రెల్లా శ్రీనివాసరావు, సబ్బి శ్రీనివాసరావు, మెరుగుమాల వెంకటేశ్వరరావు, అడబాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: