లెక్కలతో మోసం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లెక్కలతో మోసం

లెక్కలతో మోసం

Written By news on Tuesday, February 18, 2014 | 2/18/2014

లెక్కలతో మోసం చేశారు... : డీఏ సోమయాజులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉందని, ఆయన తన లెక్కలతో పార్లమెంటును మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డీఏ సోమయాజులు విమర్శించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ 2013-14 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 4.8 అంచనా వేయగా అది 4.6 శాతానికి తగ్గించినట్లు గొప్పగా టీవీ చానళ్లన్నింటిలో చెప్పుకుంటున్నారని వాస్తవానికి ఈ లోటు తొలి 8 నెలల్లోనే (ఏప్రిల్ నుంచి నవంబర్-2013 వరకు) 5 శాతంగా ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక నివేదికలో వెల్లడించిన అధికార డాక్యుమెంటులోనే ఉందన్నారు. పదేళ్లపాటు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఈ విధంగా ప్రజలను ఎలా తప్పు పట్టించారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సవరించిన అంచనాల ప్రకారం 2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.105 లక్షల కోట్ల మేరకు జీడీపీ ఉంటే తొలి 8 నెలల్లోనే 59,557 కోట్ల మేరకు ద్రవ్యలోటు ఉందన్నారు.
 
 దీని ప్రకారమే 5 శాతం ద్రవ్యలోటు ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఇంకా మిగిలి ఉన్న నాలుగు నెలల ఆర్థిక సంవత్సరానికి కనీసం ఎంత లేదన్నా మరో రెండున్నర శాతం అదనంగా అంటే కనీసం 7 నుంచి 7.5 శాతం వరకూ ఉంటుందని వివరించారు. నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో జీడీపీ పెరిగే అవకాశం లేదని అందుకు కారణం యూపీఏ ప్రభుత్వ నిర్ణయ కార్యశూన్యతే కారణమని వ్యాఖ్యానించారు. నిర్ణయాలు తీసుకోకుంటే జీడీపీ పెరగదని, అది పెరగకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయన్నారు. ద్రవ్యలోటు రెవెన్యూలోటు కూడా పెరుగుతాయన్నారు.
 
గత ఏడాదితో పోలిస్తే పారిశ్రామికాభివద్ధి సూచీ మైనస్ ఒక్క శాతంగా ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో 1.5 నుంచి 2 శాతం మేరకు మాత్రమే వృద్ధిరేటు ఉందనేది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. 80 శాతం మంది ఆధారపడి ఉన్న పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లోనే వృద్ధిరేటు ఇంత అధ్వానంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎలాగూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపేస్తారన్నారు. సీబీఐ కేసులు పెడుతుందని, కాగ్ ప్రశ్నిస్తుందనే భయంతో గత మూడేళ్లుగా ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం అభివృద్ధికి పనికి వచ్చే ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు.
Share this article :

0 comments: