ఇద్దరూ ఇద్దరే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇద్దరూ ఇద్దరే..

ఇద్దరూ ఇద్దరే..

Written By news on Wednesday, February 19, 2014 | 2/19/2014

ఇద్దరూ ఇద్దరే..
 సాక్షి, తిరుపతి: జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత ఎన్.చంద్రబాబునాయుడు కీలక నేతలు. వీరిద్దరూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానభూమిక వహిస్తున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది రాష్ట్ర విభజనకు మార్గం సుగమమైంది. దీనిని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రోజు నుంచి కూడా ఆ ఇద్దరు నేతలు ప్రజలతో దాగుడుమూతలు ఆడారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు, చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.
 
 రెండు కళ్ల సిద్ధాంతంతో..
 తమ నాయకుడు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం రాష్ట్ర విభజనలో కీలకంగా మారిందని కుప్పం టీడీపీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రం ముక్కలు చేయడానికి చంద్రబాబు సహకరిస్తున్నారని జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్ సీపీలో చేరినా ఆయన పట్టించుకోకపోవడం దీనికి నిదర్శనమని అంటున్నారు. తాము ఎన్ని చెప్పినా ఈసారి ఎన్నికల్లో పార్టీ విజయంపై రాష్ట్ర విభజన ప్రభావం ఉంటుందని టీడీపీకి చెందిన ఓ నేత అన్నారు. కుప్పం నియోజకవర్గం కూడా అందుకు మినహాయింపు కాదన్నారు.
 
 పదవికి వేలాడుతూ..
 ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణం చెప్పి పదవిలో కొనసాగేందుకే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయం పీలేరు నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలోని తమ అనుచరులకు పదవులు కట్టబెట్టడంలో, పనులు పందారం చేయడం పైనే ఎక్కువ శ్రద్ధ చూపారనే విమర్శలు వస్తున్నాయి.
విభజనకు సంబంధించి గత ఏడాది జూన్‌లో సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న రోజునే సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసి ఉంటే ప్రస్తుత పరిస్థితి తలెత్తేది కాదనే అభిప్రాయం జిల్లా కాంగ్రెస్ నేతల్లో ఉంది. ఓ వైపు రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని విమర్శిస్తూనే సీఎం కుర్చీని కాపాడుకుంటూ వచ్చారని అంటున్నారు. పార్టీలు వేైరె నా ఈ ఇద్దరు నేతలు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించలేదనే నిందను మూటగట్టుకున్నారు.
Share this article :

0 comments: