వైఎస్ ఉంటే విభజన జరిగేదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ ఉంటే విభజన జరిగేదా?

వైఎస్ ఉంటే విభజన జరిగేదా?

Written By news on Friday, February 21, 2014 | 2/21/2014

 నెల్లూరు: బలమైన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి లేక పోవడం వల్లే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా చీలిపోయిందని జిల్లా జనం ఆవేదన చెందుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న ఐదున్నరేళ్లు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తెర మరుగైన విషయాన్ని జనం చర్చించుకుంటున్నారు. వైఎస్సార్ మరణానంతరం రాష్ట్రంలో బలమైన రాజకీయ నాయకత్వం లేక పోవడమే రాష్ట్ర చీలికకు కారణమైందని జిల్లా వాసులు గట్టిగా నమ్ముతున్నారు. జిల్లాలో ఎక్కడ నలుగురూ కలిసినా ఇదే చర్చ. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి అక్కడి ప్రజలు, రాజకీయ నేతలు విభజన వాదన వినిపించకుండా చేసిన విషయం జిల్లా వాసులు గుర్తు చేస్తున్నారు.
 
 వైఎస్సార్ మరణానంతరం సీఎంలుగా వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని, తెలంగాణ ప్రాంతంలో మళ్లీ తెర మీదకు వచ్చిన రాజకీయ ఉద్యమాలను కట్టడి చేయలేక పోవడం వల్లే  ఈ దుస్థితి వచ్చిందని ప్రజలు నమ్ముతున్నారు. పైకి దీన్ని అంగీకరించలేని ఇతర రాజకీయ పక్షాల నేతలు సైతం ఆఫ్‌ది రికార్డ్‌గా వైఎస్సార్ బతికి ఉండింటే రాష్ట్రం చీలిపోయేది కాదని అంగీకరిస్తున్నారు. వైఎస్సార్ ఉన్నన్నాళ్లూ తెలంగాణ నేతలు ప్రత్యేక ఉద్యమం గురించి నోరెత్తలేక పోయారని, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీ ఆర్ సైతం తెరమరుగైన విషయం మరచిపోలేనిదని గుర్తు చేస్తున్నారు.
 
 రాజశే ఖరరెడ్డి లాంటి ప్రజాబలం లేని నాయకుడు లేక పోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుందని జనం బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) తీర్మానం చేసిన రోజు నుంచే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాగా సమైక్యాంధ్ర వాదంతోనే రాజకీయం నడిపి ఉంటే కేంద్ర ప్రభుత్వం ధైర్యంగా ముందడుగు వేసి ఉండేది కాదనే బాధ జిల్లా వాసుల్లో వ్యక్తం అవుతోంది.
 
 సీఎం సహా ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు పైకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు నటించినా, లోలోపల విభజనకు అనుకూలంగా వ్యవహరించడం తమ కళ్ల ముందే కదలాడుతూ ఉందని రిటైర్డ్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. విభజన ప్రక్రియ సరిగా లేదని గట్టిగా  వాదిస్తూ వచ్చిన బీజేపీ కూడా చివరి దశలో కాంగ్రెస్‌కే జై కొట్టి లోక్‌సభ, రాజ్యసభల్లో విభజన బిల్లును ఆమోదించి సీమాంధ్రులకు ద్రోహం చేసిందని జిల్లా జనం మండిపడుతున్నారు.
 
 కాంగ్రెస్ పార్టీ లాగే చంద్రబాబునాయుడు కూడా అటు జై తెలంగాణ అని, ఇటు సమన్యాయం అనే నినాదాలు అందుకుని రాజకీయ నాటకం ఆడటం వల్లే విభజన జరిగిందని జనం మండిపడుతున్నారు. సీమాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా విభజించడం వల్ల ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, నీరు, విద్యుత్ పంపకాలు ఇతర సమస్యలపై గురువారం రాజ్యసభలో ప్రధాని, కేంద్ర మంత్రుల మాటల హామీలు ఇచ్చినా ప్రభుత్వం మారితే అవి ఏ మేరకు ఆచరణకు నోచుకుంటాయనే భయం జిల్లా ప్రజల్లో వ్యక్తం అవుతోంది. విభజన  నాటకాలు ఆడిన పార్టీలకు ప్రజలు ఎన్నికల్లో  తమ తీర్పు ద్వారా గుణపాఠం చెప్పక తప్పదని జనం బహిరంంగానే హెచ్చరిస్తున్నారు.
Share this article :

0 comments: