మొబైల్‌లో వైఎస్సార్ సీపీ సభ్యత్వం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మొబైల్‌లో వైఎస్సార్ సీపీ సభ్యత్వం

మొబైల్‌లో వైఎస్సార్ సీపీ సభ్యత్వం

Written By news on Friday, February 7, 2014 | 2/07/2014

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుకుగాను పార్టీ ఐటీ విభాగం సరికొత్త ప్రక్రియ ప్రారంభించింది. పార్టీ అభిమానులెవరైనా సరే ఇక తమ మొబైల్ ఫోన్ నుంచి 88866 62266 నెంబర్‌కు ‘మిస్డ్ కాల్’ చేయడం ద్వారా లేదా ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా వైఎస్సార్ సీపీలో సభ్యత్వం పొందవచ్చని ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదనరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ నెంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే అవతలి నుంచి సభ్యత్వ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలన్నీ ఎస్‌ఎంఎస్ ద్వారా.. కాల్ వచ్చిన నెంబరుకు పంపుతారు. ఆ ఎస్‌ఎంఎస్ పొందిన వ్యక్తి ఆ తరువాత 88866 67711 నెంబరుకు మళ్లీ తన వివరాలను పంపితే సభ్యత్వ నెంబర్‌ను కేటాయించడమే కాక, దానిని ధృవీకరిస్తూ ఒక సందేశం పంపుతారు. మిస్డ్ కాల్‌తో నిమిత్తం లేకుండా నేరుగా తమ పేరు, ఊరు పిన్‌కోడ్ వివరాలను 88866 67711 నెంబరుకు ఎస్‌ఎంఎస్ పంపినా కూడా ఆ వ్యక్తి సభ్యత్వం నమోదవుతుంది.
Share this article :

0 comments: