రాజీనామా లేఖ సోనియా మీద విసిరేసి ఉంటే... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజీనామా లేఖ సోనియా మీద విసిరేసి ఉంటే...

రాజీనామా లేఖ సోనియా మీద విసిరేసి ఉంటే...

Written By news on Wednesday, February 5, 2014 | 2/05/2014

రాజీనామా లేఖ సోనియా మీద విసిరేసి ఉంటే...రాజ్‌దీప్ దేశాయ్‌ - వైఎస్ జగన్
ఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ  విభజన నిర్ణయం తీసుకున్నప్పుడే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  రాజీనామా చేసి ఆ లేఖను ఆమె  మీద విసిరేసి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేదే కాదని,  రాజకీయ సంక్షోభం వచ్చేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సిఎన్ ఎన్ -ఐబిఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని సిఎన్ ఎన్ -ఐబిఎన్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాజ్‌దీప్ దేశాయ్‌ అన్నారు. తాము నిర్వహించిన సర్వేలో ఆ పార్టీకి 20కి పైగా ఎంపి స్థానాలు వస్తాయని తేలిందని చెప్పారు. ఆ ఇంటర్వ్యూ ఈ దిగువ ఇస్తున్నాం.

రాజ్‌దీప్ :  జగన్‌ మీరూ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి‌, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అంతా ఢిల్లీకి వచ్చారు. అంతా ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసమే వచ్చామని అంటున్నారు. మీరే మంటారు ?

జగన్‌ : చంద్రబాబు నాయుడు ఎందుకు ఢిల్లీకి వచ్చారో మీకు తెలుసా? సమైక్యాంధ్ర కోసం వచ్చానని బాబు ఎక్కడా చెప్పడం లేదు.

రాజ్‌దీప్ దేశాయ్‌: అంటే చంద్రబాబు సమైక్యాంధ్రను కోరుకోవడం లేదని అంటారా ?

జగన్‌: సమైక్యాంధ్రకావాలని ఆయన  ఎక్కడా అనడం లేదు.  జై సమైక్యాంధ్ర అని చంద్రబాబుతో ఆనిపించండి చూద్దాం.

రాజ్‌దీప్‌: మరి సీఎం  కిరణ్‌  హైకమాండ్‌ను ఎదురిస్తూ ధర్నాకు దిగుతున్నారు. తెలంగాణ బిల్లును తిరస్కరించాలని  రాష్ట్రపతిని కూడా కలవబోతున్నారు.  మరి ఆయన కూడా సమైక్యాంధ్రకు కట్టుబడి లేరా?

జగన్‌ : ఎన్నికల షెడ్యూల్‌కు మూడు వారాల ముందు  అయినా సీఎంకు జ్ఞానం వచ్చినందుకు సంతోషిస్తున్నాను. జులై 30న సోనియా గాంధీ  విభజన నిర్ణయం తీసుకున్నప్పుడు  రాజీనామా చేసి ఆ లేఖను సోనియా మీద విసిరేసి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేదే కాదు.  రాజకీయ సంక్షోభం వచ్చేది.  కాని సీఎం అలా చేయకుండా ఢిల్లీ పెద్దల సూచనలతో ఏపీఎన్జీవోల సమ్మెకు తూట్లు పొడిచారు.  కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోంది.  మా రాష్ట్రానికి పట్టిన దుస్థితికి మానవ తప్పిదమే కారణం.  బంగారం లాంటి రాష్ట్రాన్ని నాశనం చేశారు.

రాజ్‌దీప్‌ : మా ఒపీనియన్ పోల్స్‌ ప్రకారం మీకు వచ్చే ఎన్నికల్లో 15 నుంచి 20  ఎంపీ సీట్లు రావచ్చు.  మరి మీ మద్ధతు ఎవరికి ?

జగన్‌ : సమైక్యమే మా ఎజెండా, ఇంకో మాట లేదు. మా రాష్ట్రం సమైక్యంగా ఉండాలి. ఎవరు సమైక్యానికి జై కొడితే మా మద్ధతు వారికే .


Share this article :

0 comments: