రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

Written By news on Monday, February 24, 2014 | 2/24/2014

చంద్రబాబు వల్లే రాష్ట్ర విభజన
 శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వంత పాడడం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పట్టణంలోని పదో వార్డులోని కత్తెరవీధి వాసులు పలువురు పార్టీ సభ్యత్వాన్ని ఆదివారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరగకూడదని వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి చివరి వరకూ శక్తివంచన లేకుండా కృషిచేశారన్నారు. అయినా, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్ర విభజన చేపట్టారన్నారు. తమ వల్లే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని ఆ ప్రాంత టీడీపీ నాయకులు మాట్లాడడం వారి ధ్వంధ్వ నీతికి నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 
 
 మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రం ముక్కలైనా ఇంకా సమన్యాయం అంటూ చంద్రబాబు మాట్లాడడం అతని నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు.  ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడక్కరలేదన్నారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ చేతులమీదుగా పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని స్వీకరించారు. అనంతరం 10వ వార్డు కత్తెరవీధికి చెందిన సుమారు 200 మంది పార్టీలో చేరారు. వీరిలో దుప్పల వెంకట్రావు, గేదెల వాసుదేవరావు, పి.అప్పారావు, చందక కృష్ణ, పి.ప్రసాద్, దేవరశెట్టి సూర్యారావు, సరోజిని, శకుంతల తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు డాక్టర్ పైడి మహేశ్వరరావు, ఎం.వి.పద్మావతి, అంధవరపు వరహానరసింహం, హనుమంతు కృష్ణారావు, చల్లా అలివేలు మంగ తదితరులు పాల్గొన్నారు. 
 
 విభజన పార్టీలకు తగిన బుద్ది చెప్పండి 
 నరసన్నపేట రూరల్: రాష్ర్ట విభజనకు కారణమైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్టదాస్ పిలుపునిచ్చారు. మండలంలోని లకిమేర, చేనులవలసల పాఠశాలలకు నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ఆదివారం ప్రారంభించారు. జగన్ సీఎం అయితే  అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలందరికీ చదువు చెప్పేం దుకు కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చీపురు కృష్ట, సురంగి నర్శింగరావు, ఆరంగి మురళి, చింతు రామారావు, పొన్నాన దాలినాయుడు, బెహరా అప్పన్న, దుల్ల రమణ, కొయ్యాన చలపతిరావు, ఉంగటి రాజు, వాన లక్ష్మణ, సతివాడ రామి నాయుడు, ఎంఈఓ రత్నాలరాజు, ఉపాధ్యాయులు బమ్మిడి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: