వైఎస్‌ఆర్ సీపీకి పొరుగు రాష్ట్రాల్లోనూ ఆదరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్ సీపీకి పొరుగు రాష్ట్రాల్లోనూ ఆదరణ

వైఎస్‌ఆర్ సీపీకి పొరుగు రాష్ట్రాల్లోనూ ఆదరణ

Written By news on Friday, February 28, 2014 | 2/28/2014

బెంగళూరు, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన ఈ రెండేళ్లలో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల్లో విశేష ఆదరణ లభిస్తోందని పార్టీ చిత్తూరు జిల్లా నాయకుడు శివప్రకాశ్ రాజు తెలిపారు. గురువారం ఇక్కడి టౌన్ హాలులో డాక్టర్ వైఎస్‌ఆర్ కర్ణాటక యువ వేదిక ఏర్పాటు చేసిన ‘నగరంలోని వివిధ ప్రాంతాల్లో పదాధికారుల నియామకం, మిస్డ్ కాల్ ద్వారా వైఎస్‌ఆర్ సీపీ సభ్యత్వం నమోదు’ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తూ, కొద్ది రోజుల్లోనే వైఎస్‌ఆర్ సీపీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటలీకి చెందిన ఒక మహిళ మన దేశ నాయకులను తన గుప్పిట్లో పెట్టుకుని రాష్ట్రాలను వ ుుక్కలు చేస్తోందని ఆరోపించారు. కేవలం సోనియా తప్పుడు నిర్ణయం వల్లే నేడు అన్నదమ్ములుగా కలిసి ఉన్న మనం రెండు ప్రాంతాలుగా విడిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌తో పాటు టీడీపీ కూడా రాష్ట్ర విభజనకు యథాశక్తి కృషి చేసిందని విమర్శించారు. డాక్టర్ వైఎస్‌ఆర్ యువ వేదిక అధ్యక్షుడు ఎన్‌పీ. సురేష్ కుమార్ నేతృత్వంలో నాలుగేళ్లుగా పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారని ఆయన కొనియాడారు. వైఎస్‌ఆర్ సీపీ పులివెందుల నియోజవర్గం నాయకుడు సర్వోత్తమరెడ్డి మాట్లాడుతూ... బెంగళూరులో వైఎస్‌ఆర్ అభిమానులు లక్షల్లో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో అందరూ తమ నియోజక వర్గాలకు వెళ్లి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

సురేష్ కుమార్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం తమ వేదిక తరఫున ప్రచారం చేస్తామని తెలిపారు. ఎన్నికల షెడ్యూలు వెలువ డిన తర్వాత ప్రచార కార్యక్రమాలను ప్రకటిస్తామన్నారు. ఈ సందర్భంగా నగరంలో వైఎస్‌ఆర్ అభివ ూనులు బీటీఎం లేఔట్ నుంచి నాగేంద్ర బృందం, యలహంక నుంచి ఆర్‌ఎన్. ముని, మహాలక్ష్మి లేఔట్ నుంచి  కృష్ణప్ప, మల్లేశ్వరం నుంచి చిరంజీవి, జేజే నగర నుంచి కాంతరాజు, బాబు, జయమహల్ నుంచి (బెన్సన్‌పేట) నాగేంద్ర,  విద్యారణ్యపురం నుంచి త్యాగరాజు రెడ్డి, జయనగర నుంచి శ్రీనివాసులు, రామాంజనేయులు, బన్నేరుఘట్ట నుంచి ప్రవీణ్ రెడ్డి, వినోద్ బృందాలు వైఎస్‌ఆర్ యువ వేదికలో చేరాయి.

ఇదే సందర్భంలో క్యాలెండర్‌ను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా కొత్త చెరువు సర్పంచ్ మాణిక్యం బాబా, వైఎస్‌ఆర్ సీపీ ఐటీ వింగ్ సభ్యుడు వీరభద్రరావు, బెంగళూరు జల మండలి అధికారి ఎల్. పోతన్న శెట్టి, యువ వేదిక ప్రధాన కార్యదర్శి డాక్టర్ డీఎన్. రసూల్, పదాధికారులు ఓ.గంగన్న, ఆంజనప్ప, రామయ్య, కుమార్ ప్రభృతులు పాల్గొన్నారు.
 
Share this article :

0 comments: