ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. కిరణ్ ఆర్భాటాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. కిరణ్ ఆర్భాటాలు

ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. కిరణ్ ఆర్భాటాలు

Written By news on Sunday, February 2, 2014 | 2/02/2014

 కొన్నేళ్లుగా భూమి పంపిణీ చేయకుండా.. మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. కిరణ్ ఆర్భాటాలు చేస్తూ ఓట్ల కోసం తహతహలాడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. పులివెందుల తహశీల్దార్ కార్యాలయం వద్ద 7వ విడత భూ పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
 ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు పేద కుటుంబాల సంక్షేమం కోసం ఎప్పుడు ఆలోచన చేస్తుండేవారన్నారు. వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్న సమయంలో 7లక్షల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇందిర జలప్రభ ద్వారా 5వేల కోట్లు వెచ్చించి భూములలో సౌకర్యాలను కల్పించారన్నారు. కొన్నేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికల ముందు కళ్లుతెరిచి ఇప్పుడు కొంతమందికి మాత్రమే ఇస్తున్నారని చెప్పారు.అది కూడా ప్రజలకు అందుతుండటంతో తనకు సంతోషంగా ఉందన్నారు. ఇందిర జలప్రభ పథకం ద్వారా వైఎస్‌ఆర్ చాలా బోర్లు వేయించారని.. ప్రస్తుత కిరణ్ సర్కార్ లక్షల బోర్లు వేయిస్తామంటున్నా.. వేల సంఖ్యలో కూడా వేయించలేదన్నారు. ప్రజలకు ఏది అవసరమైనా తాము ముందుంటామని ఆమె హామీ ఇచ్చారు.  
 
 ఆర్డీవో రఘునాథరెడ్డి, రిటైర్డు తహశీల్దార్ మహమ్మద్ గౌస్ మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా యువజన విభాగపు నాయకుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, సింహాద్రిపురం మండల కన్వీనర్ పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పులివెందుల, వేముల మండల నాయకులు కొమ్మా శివప్రసాద్‌రెడ్డి, మూలి బలరామిరెడ్డి, నాగేళ్ల సాంబశివారెడ్డి, మరకా శివకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 7వ విడత భూ పంపిణీలో భాగంగా అసైన్‌మెంటు కమిటీలో ఆమోదం పొందిన 2300మంది లబ్ధిదారులకు 4వేల ఎకరాల భూములకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పంపిణీ చేశారు
Share this article :

0 comments: