నియంత అంటే హిట్లర్ కాదు సోనియా: ఈరోజు బ్లాక్ డే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నియంత అంటే హిట్లర్ కాదు సోనియా: ఈరోజు బ్లాక్ డే

నియంత అంటే హిట్లర్ కాదు సోనియా: ఈరోజు బ్లాక్ డే

Written By news on Tuesday, February 18, 2014 | 2/18/2014

నియంత అంటే హిట్లర్ కాదు సోనియా: ఈరోజు బ్లాక్ డేవీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ: నియంత అంటే మనందరికి హిట్లర్ గుర్తుకు వచ్చేవాడని, ఇక ఈ రోజు నుంచి నియంత అంటే సోనియా గాంధీ గుర్తుకు వస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. ఈ రోజు లోక్ సభలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) ఆమోదం పొందిన తీరును తప్పుపట్టారు.  పాకిస్తాన్ లో కూడా ఈ రకంగా ఎవరూ చేయరన్నారు. ఈరోజును బ్లాక్ డే ప్రకటించారు. పార్లమెంటులో జరిగిన తీరును చూసిన తరువాత నియంతగా సోనియా గుర్తుకు వస్తారని చెప్పారు. ఈ నియంత పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో రేపు బంద్ కు పిలుపు ఇచ్చారు.

ఒక బిల్లు ఆమోదం పొందడం కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం ఏ స్థాయికి దిగజారిపోతారో ఈ రోజు అర్ధమైందన్నారు. కనీవిని ఎరుగని విధంగా అసెంబ్లీ వ్యతిరేకంగా తీర్మానం చేసినా, లోక్ సభలో బిల్లు ప్రవేశ పెట్టారన్నారు. ఒక బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు సభ్యులు ఆమోదిస్తే చేతులు పైకెత్తండి లేకపోతే చేతులు కిందనే ఉంచండి అనే పార్లమెంటు సంప్రదానికి విరుద్దంగా  పదేపది సెకండ్లలో బిల్లును ఆమోదించారని ఆవేదన వ్యక్తం చేశారు. నియంతలా బిల్లును ఆమోదించారన్నారు.  మనం భారతదేశంలో ఉన్నామా? ఈ పోకడ సరైనదేనా? అని ప్రశ్నించారు.  తమని సభలోకి పోనివ్వలేదని చెప్పారు.

ఈ బిల్లు ఆమోదం పొందడానికి ప్రధాన కారణం సోనియా గాంధీ అయితే, రెండవ వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. టిడిపికి చెందినవారు బిల్లుకు అనుకూలంగా ఓటువేశారని తెలిపారు. బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్, బిజెపి, టిడిపి బాధ్యత వహించాలన్నారు.
Share this article :

0 comments: